రయ్‌రయ్
దేశవిదేశాలకు రొయ్యపిల్లల సరఫరా కేంద్రంగా విశాఖ
● విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు రవాణా ● విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కార్గో రవాణాలో ష్రింప్‌దే అగ్రస్థానం ● నెలకు సగటున లక్షన్నర కిలోల రొయ్య పిల్లల రవాణా ● గల్ఫ్, యూరప్ దేశాలకూ ఎగుమతులు
ఇతర కార్గోలో ఒడిదుడుకులు..
గతంలో 1000.. ఇప్పుడు లక్షన్నర
ఇక్కడి ష్రింప్ సీడ్ అంటే.. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ మంచి గిరాకీ ఉంది. ఇక్కడి రొయ్యపిల్లల్ని (ష్రింప్ సీడ్) ఆయా రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు భద్రంగా తీసుకెళ్లి, వాటిని పెంచి డిమాండ్ వచ్చిన తర్వాత అమ్మకాలు ప్రారంభిస్తుంటారు. ఒకప్పుడు విశాఖ విమానాశ్రయం నుంచి రోజుకు కేవలం 1000 నుంచి 1500 కిలోలు ష్రింప్ మాత్రమే రవాణా జరిగేది. కానీ ఇప్పుడు నెలకు లక్షన్నర నుంచి సీజన్ సమయంలో 2 నుంచి 3 లక్షల కిలోల వరకూ రొయ్య పిల్లలు ఎగుమతులు జరుగుతున్నాయి.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. దీన్ని సక్రమంగా రవాణా చేయగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చు. గతంలో ఇక్కడి నుంచి రొయ్యపిల్లలు (ష్రింప్ సీడ్) రవాణా చేసేందుకు చాలా ఇబ్బందులు ఉండేవి. ఇక్కడి నుంచి సూరత్‌కు తీసుకెళ్లాలంటే ముంబాయికి వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గాని తిరిగి విమానంలో గాని తరలించేవారు. దీనికి 18 నుంచి 24 గంటలు సమయం పట్టేది. దీని వల్ల రొయ్యలకు సరైన ఆక్సిజన్ అందకపోవడంతో చాలా వరకు మృత్యువాత పడి.. తీవ్ర నష్టం వాటిల్లేది. అదేవిధంగా విశాఖ విమానాశ్రయంలో లోడు చేసేందుకు వచ్చిన విమానాలకు పార్కింగ్ చేసే స్థలం లేకపోతే ఇక్కడే రోజుల తరబడి నిలిచిపోయేవి. దీని వల్ల కూడా రైతులు నష్టపోయేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. నేరుగా ప్రతి డొమెస్టిక్ విమానంలోనూ ప్రత్యేకంగా వీటి కోసం ఎరేంజ్‌మెంట్స్ చేసి పంపిస్తున్నారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మైరెన్ కృషి ఉడాన్’ పథకంతో పాటు వారికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్లుగా సరకు రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న ఆకాంక్ష నెరవేర్చుతూ వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి 2020 ఫిబ్రవరిలో వైజాగ్ నుంచి కార్గో సర్వీసు మొదలైంది. ఈ విమానాన్ని 90 శాతం శాసించింది మాత్రం ఇక్కడ పురుడు పోసుకున్న రొయ్యపిల్లలే కావడం విశేషం. అయితే ప్రస్తుతం కార్గో విమాన సర్వీసు నిలిచిపోయింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ష్రింప్ రావడం తగ్గిపోయింది. లేదంటే మరింతగా వైజాగ్ కార్గో దూసుకుపోయేది.
గత ప్రభుత్వ హయాంలో కార్గోకు స్పెషల్ ఫ్లైట్
గుజరాత్ నుంచి గల్ఫ్ దేశాలకు...
ఉత్తరాంధ్రలోని రొయ్య పిల్లలు ఏపుగా పెరుగుతాయి. వీటి రుచి కూడా అద్భుతంగా ఉండటంతో దేశంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ దేశాల ప్రజలకు ఇక్కడి రొయ్యలంటే మహా ఇష్టం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలు ప్రాంతాల నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్టుకు రొయ్య పిల్లలు వస్తుంటాయి. ఇక్కడి నుంచి చైన్నె, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీకి చెందిన వ్యాపారులు తరచూ ఇక్కడి రైతులతో సంప్రదింపులు చేసి కొనుగోళ్లు చేస్తుంటారు. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ పెంచి మంచి డిమాండ్ వచ్చినప్పుడు ముంబై, కోల్‌కతాలోని పోర్టులు, విమానాశ్రయాల ద్వారా పశ్చిమ దేశాలకు, గల్ఫ్, యూరప్ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment