రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
విశాఖ విద్య: రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘వరల్డ్ డే ఆఫ్ రిమెంబరన్స్–2024 ’ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ క్షణం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాల వలన ప్రజలు గాయాలకు గురికావడం లేదా మరణించడం జరుగుతుందన్నారు. నగరంలో సెప్టెంబర్ నుంచి రహదారి నిబంధనలు కఠినతరం చేశామని, దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. గతంలో హెల్మెట్ ధారణ 10 శాతంగా ఉండేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా 50 శాతం నగరంలోనే నమోదైందని, ఇది నూరు శాతం చేయ డం లక్ష్యమన్నారు. త్వరలో నగరంలో కొత్తగా ‘ఏ.ఐ డ్రివిన్ ప్రాజెక్టు’ ప్రారంభించనున్నట్టు చెప్పారు. సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబాలకు సాయం అందించేందుకు ‘రోడ్ ట్రాఫిక్ విక్టిమ్ అసిస్టెంట్ సెల్’ను త్వరలోనే విశాఖలో ప్రారంభిస్తామన్నారు.
కన్నీటి పర్యంతమైన బాధితులు
గత ఏడాది కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆ ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలో బంధించిన దృశ్యాలను అందరికీ చూపించారు. వీటిని చూసిన బాధిత కుటుంబ సభ్యులు ఒక్కొక్కొరుగా వేదికపైకి వచ్చి కన్నీటి పర్యంతమై, తమ వారిని పోగొట్టుకొని ఏ రీతిన ఇబ్బందులకు గురౌతున్నామనేది తెలిపారు. వారి కన్నీటి రోదనతో అందరి మనసులు చలించిపోయాయి.
బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం
వారికి సాయమందించేలా ‘ప్రత్యేక సెల్’
నగరంలో త్వరలోనే ఏఐ డ్రివిన్ ప్రాజెక్టు
నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి
Comments
Please login to add a commentAdd a comment