No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, May 9 2024 4:00 AM

-

న్‌, సివిల్‌ సర్జన్లు రోగులకు వైద్య సేవలు అందించే వారు . ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారిన తర్వాత ప్రొఫెసర్లు, అసోసియేసిట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో కార్పొరేట్‌ తరహాలో చికిత్స అందుతోంది. సూపర్‌ స్పెషాలిటీ సేవలు మినహా అన్ని సేవలు అందుతున్నాయి. అన్ని విభాగాల్లో నలుగురు నుంచి పది మంది వరకు వైద్యులు ఉండడంతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకపోయింది..

ఆస్పత్రిలో విభాగాలు..

ఆస్పత్రిలో ఈఎన్‌టీ, డెంటల్‌ , ఎన్‌సీడీ, ఏఆర్‌టీ, కంటి, చర్మవ్యాధులు, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషీయన్‌, పల్మనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఫోరిన్సిక్‌, బయోకెమిస్ట్రీ వంటి విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్‌ ఎక్సరే, ఈసీజీ, సిటిస్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ , 2డీ ఎకో సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే లేబరేటరీ ఉంది. ఇందులో క్యాన్సర్‌ నిర్ధారణ ఎఫ్‌ఎన్‌ఏసీ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

అత్యవసర కేసులకూ వైద్యం..

జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పడు ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు ఎక్కువుగా రిఫరల్స్‌ వెళ్లేవి. సర్వజన ఆస్పత్రి అయిన తర్వాత చాలా రిఫరల్స్‌ తగ్గాయి. ఇక్కడ సౌకర్యం లేని వాటిని మాత్రమే రిఫర్‌ చేస్తున్నారు. మిగతా అత్యవసర కేసులకు ఇక్కడే సేవలు అందిస్తున్నారు. గతంలో పాము కరిచినా, విషయం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నా కేజీహెచ్‌కు రిఫర్‌ చేసేవారు. ప్రస్తుతం వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ సౌకర్యం ఉండడంతో ఇప్పడు అటువంటి కేసులకు సర్వజన ఆస్పత్రిలోనే సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా పల్మనాలజీ, న్యూరో, నెఫ్రాలజీ వంటి సేవలు కూడా కళాశాల ఏర్పాటు వల్ల ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement