పట్టపగలే చోరీ | Sakshi
Sakshi News home page

పట్టపగలే చోరీ

Published Sat, May 25 2024 2:50 PM

పట్టపగలే చోరీ

ఆందోళనలో ప్రజలు

గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి ప్రాజెక్ట్‌ బోటు షికారు పరిసరాలలో కొంతమంది దుండగులు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. దళాయివలసకు చెందిన ఎస్‌.నారాయణరావు ఖడ్గవలస వైపు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి నారాయణరావు ద్విచక్ర వాహనం ఆపి ఆయన మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు దోచుకుని పారిపోయారు. వెంటనే నారాయణరావు గట్టిగా కేకలు వేసినా పరిసరాల్లో ఎవ్వరూ లేకపోవడంతో దొంగలు పరారయ్యారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా పలుమార్లు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

పోగొట్టుకున్న సెల్‌ అందజేత

విజయనగరం క్రైమ్‌: వయోజన విద్యాశాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న గెద్ద జయరామ్‌, అతని సోదరి హేమలత (ఉపాధ్యాయురాలు) శుక్రవారం ఉదయం పట్టణంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. సుమారు లక్ష రూపాయల విలువ చేసే ఐ ఫోన్‌ దొరికింది. ఇంతలో సెల్‌ఫోన్‌ పొగొట్టుకున్న బాధితుడు ధీరజ్‌కుమార్‌ టూటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫోన్‌ దొరికిన తర్వాత అందులో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేయగా.. బాధితుడు టూటౌన్‌లో ఉన్నట్లు తెలుసుకున్న జయరామ్‌, అతని సోదరి హేమలత స్టేషన్‌కు వెళ్లి పోలీసుల సమక్షంలో ఫోన్‌ అందజేవారు. కార్యక్రమంలో ఏఎస్సై పైడితల్లి, తదితరులున్నారు.

మద్యం సీసాలు ధ్వంసం

పార్వతీపురం టౌన్‌: పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ ఎకై ్‌స్‌జ్‌ కేసుల్లో సీజ్‌ చేసిన 576 మద్యం బాటిళ్లను శుక్రవారం ధ్వంసం చేశారు. పార్వతీపురం ఏఎస్పీ సునీల్‌ షరైన్‌ సమక్షంలో మద్యం ధ్వంసం చేశామని పట్టణ సీఐ కృష్ణారావు చెప్పారు. మద్యం అక్రమంగా తరలించినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement