విజయనగరం
గురువారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
బెల్టుకడదాం... జనంతో తాగిద్దాం!
●కాసులు కూడబెట్టడమే లక్ష్యం ● మద్యం దుకాణాల ఏర్పాటులో పలుచోట్ల నిబంధనలకు తూట్లు ●జనావాసాలు, రహదారుల పక్కనే మద్యం వ్యాపారం ●ప్రతి లైసెన్స్‌డ్ దుకాణానికి అనుబంధంగా బెల్ట్ షాపులు ●ఒక్కో బెల్ట్ షాపుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు ●టీడీపీ కూటమి నాయకుల కన్నుసన్నల్లో సిండికేట్ చక్రం ●ప్రజావ్యతిరేకతను పట్టించుకోకుండా కొనసాగుతున్న వ్యాపారం
‘అత్యవసర’ ఉద్యోగుల ఆందోళన
ఏఈఎంఎస్ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 108 ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక అవస్థలు పడుతున్నారు.
–8లో
2న సీఎం చంద్రబాబు
జిల్లాకు రాక
● కొత్తవలస మండలం దెందేరులో
పర్యటించనున్న సీఎం
కొత్తవలస: వచ్చేనెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతు పనులు జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కొత్తవలస మండలం కొత్తవలస–సబ్బవరం రోడ్డులో దెందేరు కూడలి సమీపంలో రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాన చేస్తారని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. సీఎం పర్యటించేందుకు అనువైన రోడ్డు, హెలిప్యాడ్ స్థలాలను ఎస్పీ వకుల్‌జిందాల్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి బుధవారం పరిశీలించారు. సంతపాలెం సమీపంలోని లేఅవుట్‌లో హెలిప్యాడ్ ఏర్పాటుకు నిర్ణయించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను త్వరితిగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించిన అనంతరం అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నేషనల్ హైవే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో సీఎం సమీక్షిస్తారని, అనంతరం మీడియాతో మాట్లాడుతారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.బాలాజీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, ఆర్డీఓ దాట్ల కీర్తి తదితరులు పాల్గొన్నారు.
వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు
● అటవీశాఖ అడిషనల్ పీసీసీఎఫ్
శాంతిప్రియపాండే
బొండపల్లి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న వన మిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అటవీశాఖ అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే తెలిపారు. బొండపల్లిలోని వన మిత్ర కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం వనమిత్ర కేంద్రాలను ఉపాధిహామీ నిధులతో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సకాలంలో నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె వెంట జిల్లా అటవీశాఖ అధికారిణి ప్రసున్న, పారెస్టు రేంజ్ అధికారులు జె.సింధు, బి.అప్పలరాజు ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
నూతన మద్యం పాలసీ అంటూ కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మద్యం వ్యాపారం సిండికేట్ బాబులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో నిర్ణీత సమయంలో మాత్రమే జరిగే ఈ వ్యాపారం ఇప్పుడు 24 గంటలూ ఏకధాటిగా నడుస్తోంది. టీడీపీ కూటమి నాయకుల అండతో చెలరేగిపోతున్న సిండికేట్ మాఫియా జిల్లావ్యాప్తంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం వ్యాపారాన్ని విస్తరిస్తోంది.
ప్రతి దుకాణానికీ బెల్ట్ షాపులు
లైసెన్సులు దక్కించుకున్న వారంతా ఈనెల 16వ తేదీ నుంచి మద్యం షాపులను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 153 మద్యం షాపులకు ఈనెల 14న లాటరీలో దుకాణాలను కేటాయించిన సంగతి తెలిసిందే. వాటిలో 80 శాతానికి పైగా దక్కించుకున్న వారంతా టీడీపీ కూటమినేతలు, వారి బినామీలు, అనుచరులే. ఇక దుకాణాల ఏర్పాటులో కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇక ఆ దుకాణాలకు అనుబంధంగా ఊరూవాడా తమ మద్యం వ్యాపారాన్ని విస్తరించేపనిలో ఉన్నారు. జనాభాను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకొని బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చేస్తున్నారు. ఎంతకు బరితెగించినా ఆటంకాలు వస్తే తమ కూటమి నాయకులు చూసుకుంటారన్న ధీమాతో ముందుకు పోతున్నారు. అందుకే భవిష్యత్తు లో మరిన్ని ఇబ్బందులకు ఈ షాపులు హేతువవుతాయనే భయంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నా పాలకులకు, ఎకై ్సజ్ శాఖ అధికారులకు పట్టడం లేదు.
గ్రామాభివృద్ధి ముసుగు...
గ్రామాభివృద్ధికి ఆ డబ్బు ఖర్చుచేస్తామనే భ్రమ కల్పించి గ్రామాల్లో బెల్ట్‌షాపులకు వేలం వేసి మరీ సిండికేట్ మాఫియా అప్పగిస్తోంది. చాలా గ్రామాల్లో రూ.2 లక్షల వరకూ వెళ్తున్నా కొన్నిచోట్ల రూ. 5 లక్షల వరకూ వేలంపాట వెళ్లిందనేది బహిరంగ రహస్యమే. దీంతో వారు నిర్భయంగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాదు మద్యం షాపు నిర్వాహకులకు ప్రతి క్వార్టర్ సీసాకు రూ.10 చొప్పున అదనంగా కూడా చెల్లిస్తున్నారు. తమ వద్ద మద్యం కొన్నవారికి మాత్రం అదే సీసాపై రూ.30 నుంచి రూ.50 వరకూ అదనంగా బాదుతున్నారు.
తాగునీరు అయినా దొరకకపోవచ్చు
కానీ తాగడానికి కావాల్సినంత
మద్యం ఇప్పుడు జిల్లాలో
ఏరులైపారుతోంది అని
చెప్పడానికి ఇలాంటి బెల్ట్
షాప్‌లే చక్కని నిదర్శనం. బొబ్బిలి
రైల్వేస్టేషన్ జంక్షన్‌లో వెలిసిన
అనధికార పర్మిట్‌రూం ఇది. ప్రభుత్వం
అనుమతించిన లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఇలాంటివి ఊరూవాడా
వెలుస్తున్నాయి.
షాపు మార్పు... ఆ చూద్దాం!
బొబ్బిలిలోనే కాన్వెంట్, చర్చి సమీపంలో జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని రోజూ నిరసనలు తెలుపుతున్నా, చివరకు ఆ భవన యజమాని సైతం ఇకపై మద్యం షాపు కోసమైతే అద్దెకు ఇవ్వబోమని చెప్పినా ఫలితం కనిపించలేదు. ఈ నెల 31 తర్వాత మార్చుతాంలే అని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.
●మద్యం షాపు వారికి ముద్దు...
బొబ్బిలిలో తాండ్ర పాపారాయుడి విగ్రహం వద్ద మంగళవారం బేబీనాయన తన అనుచరులతో కలిసి పర్యటించిన చిత్రం ఇది. ఆ విగ్రహం చుట్టూ ఉన్న మున్సిపల్ చెత్త డబ్బాలను వెంటనే తొలగించాలని, సుందరీకరణ పనులు చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. ఆ పక్కనే ఉన్న మద్యం దుకాణంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా సదరు బొబ్బిలి ఎమ్మెల్యే కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రజల క్షేమం కన్నా మద్యం షాపే వారికి ముద్దు అన్నట్లుగా ఉంది వ్యవహారమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
●‘మార్పు’ సందేహమే!
పూసపాటిరేగ మండల కేంద్రంలో జాతీయ రహదారికి సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపు నిర్వహిస్తున్నారు. గ్రామస్థుల అభ్యంతరాల దృష్ట్యా ఎకై ్సజ్‌శాఖ అధికారులు ఈ షాపును వేరేచోటకు మార్పు చేయిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో కనిపించట్లేదు. కుమిలి గ్రామంలో కూడా జనావాసాల మధ్య మద్యం షాపు పెట్టారు.
●ఎక్కడైనా వ్యాపారమే...
ఎస్.కోట పట్టణంలో ప్రకాశం మార్కెట్ దగ్గర మద్యం దుకాణం తెరవడంతో స్థానిక మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. అటు అంగన్‌వాడీ కేంద్రం, ఇటు మార్కండేయ స్వామి ఆలయం, చుట్టూ వందల సంఖ్యలో జనావాసాలు ఉన్నాయి. హరిజన వీధి, గౌరీశంకర్‌కాలనీ, యాతవీధి, కోటవీధి, వేమలి వీధి, సాలివీధి ప్రజలంతా మార్కెట్‌కి, ఆలయానికి, పంచాయతీ కార్యాలయానికి, సచివాలయానికి రాకపోకలు సాగించే కూడలిలోనే ఈ మద్యం విక్రయాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం స్థానిక తహశీల్దారు, పంచాయతీ ఈవో కార్యాలయాలకు వెళ్లి స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఎకై ్సజ్ అధికారుల్లో
స్పందన కరువు...
వంగర మండల పరిధిలోని మడ్డువలస గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని గత ఐదు రోజులుగా గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. కళాశాల, గురుకులం, పాఠశాలకు వెళ్లే దారిలో ఉన్న ఈ షాపు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయన్న వారి ఆందోళనపై ఎకై ్సజ్ అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదు.
●నిబంధనలూ బేఖాతరు...
బాడంగి మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కనే నడుస్తున్న మద్యం షాపును వేరేచోటకు తరలించాలని స్థానికులు అభ్యంతరం చెబుతున్నా వ్యాపారుల నుంచి కానీ, నిబంధనలు అమలుచేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు కానీ పెద్దగా స్పందించట్లేదు. ఒకటో తేదీ తర్వాత తరలిస్తామని షాపు నిర్వాహకులు చెబుతున్నారు కానీ ఎంతవరకూ జరుగుతుందోనని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment