అమరుల త్యాగ ఫలితమే ప్రశాంత జీవనం
పార్వతీపురం టౌన్: అమర వీరులు చేసిన త్యాగాల ఫలితమే ప్రస్తుత ప్రశాంత జీవనమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు చేసిన ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అమర వీరులు చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఇంత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామన్నారు. ఆర్టీసీ కూడలి వద్ద విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అశువులు భాసిన త్యాగమూర్తుల చిత్రపటాల వద్ద కొవ్వోత్తులను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డా.ఓ.దిలీప్‌కిరణ్, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎస్వీ వెంకట అప్పారావు, పార్వతీపురం టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణరావు, పార్వతీపురం రూరల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
సంస్మరణ వారోత్సవాల్లో కొవ్వొత్తుల ర్యాలీ
ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment