22న కబడ్డీ జట్లకు క్రీడాకారుల ఎంపిక
గంట్యాడ: విశాఖపట్నం జిల్లా అంకుపాలెంలో ఈనెల 25, 26, 27 తేదీలలో 71 వ అంతర జిల్లాల సీ్త్ర, పురుషల కబడ్డీ పోటీలు జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అవనాపు విజయ్, రంధి నాగేశ్వరావులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు గంట్యాడ హైస్కూల్‌లో ఈనెల 22 వతేదీ మధ్యాహ్నాం 2 గంటలకు కబడ్టీ జట్లను ఎంపిక చేయనున్నామని చెప్పారు. క్రీడాకారులు అధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు. పురుషలు బరువు 85 కేజీలు, సీ్త్రలు బరువు 75 కేజీల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారాలు ఫోన్ 9440888369,9010727069 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కదలని ఏనుగుల గుంపు
కొమరాడ: మండలాన్ని గజరాజుల బాధలు వీడడం లేదు. గత కొన్నాళ్లుగా జంఝావతి రబ్బర్ డ్యామ్, రాజ్యలక్ష్మీపురం, గంగరేగువలస తదితర గ్రామా పరిసరాల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. ఈ ప్రాంతంలో పుష్కలంగా కూరగాయల సాగు నీటి వనరులు ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఏనుగులు విడిచివెళ్లడం లేదు. అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాలో జొన్న, టమాటో లాంటి పంటలు సాగులో ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించే చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
పేకాట శిబిరంపై దాడి
గజపతినగరం: మండలంలోని పాతబగ్గాం గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఆడుతున్న పేకాట శిబిరంపై దాడి చేసి పేకాట రాయుళ్ల నుంచి రూ.7వేల510 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఏడుగురు కోడిపందెంరాయుళ్ల అరెస్టు
వేపాడ: మండలంలోని అరిగిపాలెం సమీపంలో ఏడుగురు కోడిపందాల రాయుళ్లు పట్టుబడినట్లు వల్లంపూడి ఎస్సై బి.దేవి తెలిపారు. సోమవారం సాయంత్రం వల్లంపూడి పోలీసులు నిర్వహించిన దాడుల్లో కోడిపందెం నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10,680లు ఏడు సెల్‌ఫోన్లు, ఎనిమిది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment