గంట్యాడ: ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ డీఎంహెచ్‌ఓ జీవనరాణి అన్నారు. పెదమజ్జిపాలేం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డెలవరీ క్యాలెండర్‌ను పరిశీలించారు. పీహెచ్‌సీలో సురక్షిత ప్రసవాలను చేస్తామనే నమ్మకాన్ని గర్భిణుల్లో కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. 24 గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కుష్ఠువ్యాధి సర్వే గురించి వాకబు చేసారు. హెల్త్ ఎడ్యుకేటర్ చంద్రశేఖరరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment