క్రీడా మైదానానికి శంకుస్థాపన
పూసపాటిరేగ : మండలంలోని కొవ్వాడ గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణానికి సర్పంచ్ కోట్ల రామునాయుడు ఆదివారం శంకుస్థాపన చేసారు. తమ సొంత నిధులు రూ.25 లక్షలతో మైదానానికి వివిధ రకాలు పనుల నిమిత్తం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 20 అడుగుల లోతులో వున్న గోతులను కప్పి మైదానం పనులు చేస్తున్నట్లు తెలిపారు. లోతును పూడ్చడానికి సుమారు 3 వేలు లోడులు మట్టితో నింపడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలియజేసారు. కొవ్వాడ గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణం గ్రామస్తులు కలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దేబార్కి అప్పారావు, ఉప సర్పంచ్ బండి నర్సయ్యతో వార్డు సభ్యులు, కల్యాణపు హరిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment