ఫోర్ లైన్స్ రహదారి ఏర్పాటుకు చర్యలు
రామభద్రపురం: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి వయా రాజాం, బాడంగి, రామభద్రపురం, పార్వతీపురం మీదుగా రాయఘడ వరకు ఫోర్ లైన్స్ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు నుంచి రాజాం వైపు రహదారిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల నుంచి రామతీర్ధం మీదుగా రణస్థలం వరకు విస్తరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రవాణా సౌకర్యం కల్పనే లక్ష్యంగా రహదారులు విస్తరణ చేయనుందని తెలిపారు. రహదారులు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ ఘట్కారీకి విన్నవించగా ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫీజుబిల్టీ కూడా ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో కొన్నింటిని అమలు చేస్తోందని, మిగిలిన పఽథకాల అమలుపై దృష్టి సారిస్తుందన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment