ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండొద్దు | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండొద్దు

Published Tue, May 7 2024 4:55 AM

ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండొద్దు

పాన్‌గల్‌: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని, సేకరణలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. 14 శాతం తేమ ఉన్నా.. కొనుగోలు చేయాలన్నారు.

జాప్యంపై రైతుల ఆగ్రహం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండలంలోని రేమద్దులలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు, హమాలీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్రాలకు వచ్చిన ధాన్యం తూకం చేయడంలో హమాలీలు పక్షపాతం చూపుతున్నారని అన్నారు. ముందు వచ్చిన ధాన్యం తూకం చేయకుండా, వెనుకాల వచ్చిన ధాన్యం తూకం చేయడంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలాంటి చర్యలతో 15 రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌,

పర్యాటక శాఖ మంత్రి

జూపల్లి కృష్ణారావు

 
Advertisement
 
Advertisement