కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి

Published Tue, May 7 2024 5:00 AM

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి

ఖిల్లాఘనపురం: అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులకు అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం అలవాటుగా మారిందన్నారు. సీమాంధ్ర నాయకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేసీఆర్‌ నిరంతరం కృషి చేశారన్నారు. ఆయన హయాంలోనే మన ప్రాంతంలో 11 నెలల సమయంలోనే కాల్వలు తవ్వి గ్రామాల్లోని చెరువులు, వాగుల వెంట సాగునీరు పారించారన్నారు. ఆడపడుచుల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ’లక్షా పదహార్లు అందించారన్నారు. రైతులకు ప్రతి పంటకు ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు అందిస్తే.. నేడు రైతుబంధు అడిగిన రైతులను చెప్పుతో కొట్టాలని కాంగ్రెస్‌ పెద్దలు అంటున్నారని తెలియజేశారు. రైతులు ఏ కారణంతో చనిపోయినా.. దినవారాల వరకు రూ.5 లక్షలు అందించిన ఘనత కేసీఆర్‌ దేనని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒకటికాదు, రెండు కాదు 420 హామీలు ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు అమలుకు దిక్కులేదన్నారు. ఒక్క ఉచిత బస్సు తప్పా.. ఏదీ అందడం లేదన్నారు. అలాంటి మోసగాళ్లకు ఇప్పుడు మళ్లీ ఓటు వేసి మోసపోవద్దన్నారు. ఎంపీపీ కృష్ణానాయక్‌, జెడ్పీటీసీ సభ్యులు సామ్యనాయక్‌, రాళ్లకృష్ణయ్య, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఖిల్లాఘనపురంలో

గిరిజన ఆత్మీయ సమ్మేళనం

 
Advertisement
 
Advertisement