టన్నుకు రూ.3,366 మద్దతు ధర..
సాగు విస్తీర్ణం పెంపునకు..
పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు గతంలో కంటే అదనంగా రాయితీలు కల్పిస్తుండటంతో దృష్టి సారిస్తున్నారని ఫ్యాక్టరి కేన్ హెడ్ వెల్లడించారు. ఎకరం సాగుకు రెండు టన్నుల విత్తనంతో పాటు ఎరువులను రాయితీపై అందిస్తున్నారు. అలాగే గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడం, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించడంపై దృష్టి సారించింది.
పొలాల వద్దే గుడారాలు వేసుకున్న కార్మికులు
ఫ్యాక్టరీ యాజమాన్యం ఈసారి టన్ను చెరుకుకు మద్దతు ధర రూ.3,366 చెల్లిస్తుంది. కోత, రవాణా ఛార్జీలను రైతుల నుంచే వసూలు చేస్తున్నామని ప్రకటించింది. రైతు సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు సకాలంలో డబ్బులు చెల్లించడంతో పాటు పంట కోతల కోసం అదనంగా కోత కార్మికులను రప్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment