బోనస్‌పై బోగస్ ప్రచారాన్ని నమ్మవద్దు
వీపనగండ్ల/చిన్నంబావి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ. 500 చొప్పున ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందని.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న బోగస్ ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల, గోపల్‌దిన్నె, చిన్నంబావి మండలంలోని బెక్కెం, అమ్మాయిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేస్తున్నట్లు చెప్పారు. కొందరు రైతులు సన్నరకం ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అలా చేస్తే నష్టపోతారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మరాదన్నారు. త్వరలోనే రైతుభరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి, సీఈఓలు నాగరాజు, భాస్కర్‌రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, గంగిరెడ్డి, కుర్మయ్య, సింగయ్యశెట్టి, రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి, ఈదన్న, రామస్వామి, కృష్ణ, ప్రభంజన్‌గౌడ్, విష్ణుగౌడ్ పాల్గొన్నారు.
వరికొయ్యలను కాల్చొద్దు
నాగర్‌కర్నూల్ రూరల్: రైతులు వరికోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా కుళ్లింపజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికొయ్యలను కుళ్లించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరికొయ్యల అవశేషాలపై ఎకరాకు 50 సూపర్ సల్ఫేట్, 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలని సూచించారు. నీటి తడి ద్వారా డీకంపోజింగ్ చేసుకోవచ్చని.. లేదా రోటవేటర్‌తో దమ్ము చేసుకోవాలని తెలిపారు. భూమిలో పోషకాలను కాపాడుకోవడం కోసం రైతులు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనాన్ని తగ్గించడంతో భూసారం పెంచుకోవడంతో పాటు వా యు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment