స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం ఉన్న వెనకబడిన ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి. ముస్లింలలో 50 వెనకబడిన కులాలు ఉండగా.. వీటిలో 30 దాకా సంచార తెగలు ఉన్నాయి. వీరిని ఎస్టీలుగా, మిగిలిన 20 కులాలను బీసీలుగా గుర్తించి వెనకబడిన ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు పెంచాలి.
– షేక్ ఫరూక్ హుస్సేన్, ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు
రజకులకు అన్యాయం
రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల జనాభా ఉన్న రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండాపోయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నామని, ఇంకా తమను అంటరానివాళ్లుగానే సమాజం చూస్తుంది. తమ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి.
– పురుషోత్తం, రజక సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment