ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
గోపాల్‌పేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. సోమవారం గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తి, చాకల్‌పల్లి, లక్ష్మీతండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలన్నారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ. 500 బోనస్ చెల్లిస్తుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, సత్యశీలారెడ్డి, సుధాకర్‌రావు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శాంతయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment