రిజర్వేషన్ కల్పించాలి..
సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో 129కి పైగా బీసీ తరగతులు ఉండగా.. ఇప్పటికీ అత్యధిక శాతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. సంచార జాతులు, ఎంబీసీ కులాలలో సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం విపరీతంగా ఉంది. వీరిపై దాడులు, దౌర్జన్యాలు, కులవివక్ష, మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. 11 బీసీ ఎంబీసీ కార్పొరేషన్ల ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలి.
– మోహన్,
వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment