జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బీసీ కమిషన్ శుక్రవారం కల్టెరేట్లోని మీటింగ్హాల్లో బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాజిక, విద్య, వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ విచారణ చేపట్టనున్నారు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మిలు రానున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు, సంచార జాతులు, ప్రజలు, బీసీ వర్గాలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అవసరమైన రిజర్వేషన్లు, దామాషాపై అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఉదయం 10 గంటల మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలు, ఉదయం 11 గంటలకు వనపర్తి జిల్లా, మధ్యాహ్నం 12 గంటలకు గద్వాల జిల్లా, మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట జిల్లా, మధ్యాహ్నం 3 గంటలకు ఆయా జిల్లాలకు చెందిన వారి అభిప్రాయాలు తెలియజేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment