రహదారి విస్తరణకు సహకరించాలి
పాన్‌గల్: రహదారి విస్తరణకు ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని కేతేపల్లిలో రూ.1.99 కోట్లతో చేపట్టే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. రోడ్డు ఇరుకుగా ఉండి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుండటంతో విస్తరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల రూ.6 వేల కోట్లు వడ్డీ చేస్తున్నామని.. ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి కొంత నష్టం వాటిల్లినా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సహకరిస్తే గ్రామం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విస్తరణ బాధితులకు మానవీయ కోణంలో ఆలోచించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో సహకరిస్తే పనులు వెంటనే ప్రారంభమవుతాయన్నారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఓబీసీ కో–ఆర్డినేటర్ డా. కేతూరి వెంకటేష్, డా. పగిడాల శ్రీనివాసులు, విండో డైరెక్టర్ ఉస్మాన్, మండల నాయకులు రవికుమార్, వెంకటేష్‌నాయుడు, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌యాదవ్, పుల్లారావు, బాలరాజుయాదవ్, విష్ణు, ఆర్‌అండ్‌బీ డీఈ సీతారామస్వామి, ఏఈ రాకేష్, కాంట్రాక్టర్ తిరుపతయ్యసాగర్, ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ రఘురాములు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
మండలంలోని దావాజిపల్లితండాకు చెందిన సుక్యానాయక్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని శనివారం మంత్రి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉంటామని భరోసా ఇచ్చారు. రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. మాజీ సర్పంచ్ వెంకటయ్యయాదవ్, లోక్యానాయక్ తదితరులు ఉన్నారు.
మంత్రి దృష్టికి గ్రామ సమస్యలు..
గ్రామంలో సామూహిక శ్మశానవాటిక నిర్మాణానికి స్థలం, బీసీ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేందుకు నీటివసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని స్థానిక సీపీఐ నాయకులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. శ్మశానవాటిక ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలోని ఎస్‌బీఐలో పంట రుణాలు ఇవ్వడం లేదని తెలుపగా సమస్యను పరిష్కరిస్తామన్నారు.
బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment