ఇవి ఓకే.. మరి మిగతావి? | - | Sakshi
Sakshi News home page

ఇవి ఓకే.. మరి మిగతావి?

Published Tue, Nov 19 2024 1:11 AM | Last Updated on Tue, Nov 19 2024 1:11 AM

ఇవి ఓ

ఇవి ఓకే.. మరి మిగతావి?

పెండింగ్‌లో ఉన్న

స్మార్ట్‌ సిటీ

రోడ్డు పనులు

ఐదు నెలల్లో

కీలక పథకాలకు నిధులు

భూగర్భ డ్రెయినేజీ,

మామునూరు ఎయిర్‌పోర్టుల్లో కదలిక

ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు నిధుల పెంపు.. మాస్టర్‌ప్లాన్‌–2041కు ఆమోదం

ఔటర్‌ రింగ్‌రోడ్డు, ‘స్మార్ట్‌’ సిటీ,

సూపర్‌ స్పెషాలిటీపై మౌనం

సెంట్రల్‌ జైలు ఊసే లేదు..

జీడబ్ల్యూఎంసీకి నిధుల కొరత

సీఎం మొదటి సమీక్ష తర్వాతే ఫలితాలు.. ప్రత్యేక దృష్టి పెట్టాలని

వేడుకోలు

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం

వీటి పరిష్కారంపై

దృష్టి పెట్టండి..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జూన్‌ 29న వరంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి... ‘గ్రేటర్‌’ అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్‌లో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, ఇతర కీలక కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రాత్రి వరకు నిర్వహించిన ఈ సమీక్షలో ప్రధానంగా 8 అంశాలు చర్చకు వచ్చాయి. ఈమేరకు హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ అభివృద్ధికి ఆ 8 అంశాలపై ప్రాథమిక అంచనాలు రూపొందించి ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారు. వరంగల్‌ వేదికగా ‘ప్రజాపాలన విజయోత్సవం’ నిర్వహిస్తున్న తరుణంలో నాలుగైదు రోజులుగా ప్రభుత్వం జీఓల జారీ, నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మామునూరు ఎయిర్‌పోర్టు, భూగర్భ డ్రెయినేజీలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి ప్రారంభిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు నిధులు వెచ్చించి, వరంగల్‌ నగరపాలక సంస్థ భవన నిర్మాణం కోసం నిధులు కేటా యించింది. మాస్టర్‌ప్లాన్‌–2041పై ఆమోద ముద్ర వేసింది. కానీ, ఔటర్‌ రింగ్‌రోడ్డు, స్మార్ట్‌ సిటీ కోసం నిధుల విడుదల పెండింగ్‌లోనే ఉంది. ప్రతిష్టాత్మక సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణం వేగం పుంజుకోవడం లేదు. నిధులు, సిబ్బంది కొరత గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను వేధిస్తోంది.

అభివృద్ధి పనులకు రూ.4,684.37 కోట్లు..

ముఖ్యమంత్రి కోసం జిల్లా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్టుగానే సమీక్ష జరిపిన 5 నెలల్లోనే కోట్ల రూపాయలు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అండర్‌ డ్రెయినేజీ వ్యవస్థకు, రూ.4,170 కోట్లు, మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.203 కోట్లు, పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ.28 కోట్లు, ఇంటర్నల్‌ రింగ్‌ రోడ్‌కు రూ.80కోట్లు, ఫ్లడ్‌ డ్రెయినేజీ సిస్టానికి రూ.160.3 కోట్లు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు భూనిర్వాసితులు 863 మందికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం రూ.43.15 కోట్లు.. ఇలా మొత్తం రూ.4,684.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లాయి. వివిధ కారణాలు వల్ల పనులు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం కోసం రూ.4170 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు సంబంధించి ఆయన మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కీలకమైన మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రూ.203 కోట్లు కేటాయించడం, మాస్టర్‌ప్లాన్‌–2041 ఆమోదం సాహసోపేతమైన నిర్ణయంగా భావిస్తున్నారు.

కొన్నింటిపై నిధుల వరద.. మరికొన్నింటిపై శీతకన్ను

స్మార్ట్‌సిటీ పథకం కింద వివిధ ప్రాజెక్టుల కోసం రూ.2,278కోట్లతో డీపీఆర్‌లు రూపొందించారు. ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కుకు నిర్మాణం కోసం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట శివారులో 22 అక్టోబర్‌ 2017న భూమి పూజ చేశారు. 1,350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్కు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు లభించేవి. ఏడేళ్లుగా టెక్స్‌ టైల్‌ పార్కు నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వంతో 22 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నా సగం కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించాయి. 18 మార్చి 2023న కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర కింద వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కును ఎంపిక చేసింది. కానీ పురోగతి కనిపించడం లేదు.

సుమారు రూ.1,100 కోట్లతో చేపట్టిన 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగం పుంజుకోవడం లేదు. కారణాలు చూపకుండా సమారు రూ.600 కోట్ల మేరకు అంచనాలు పెరగడంపై వేసిన విజిలెన్స్‌ కమిటీ విచారణ జరుపుతోంది.

నగరం చూట్టూ నాలుగు వైపులా 74 కిలోమీ టర్ల రింగ్‌ రోడ్డు ఉంటుంది. కరుణాపురం నుంచి ఐనవోలు క్రాస్‌ రోడ్డు సింగారం వరకు 17 కిలోమీటర్లు ఉంటుంది. అందుకోసం గత ప్రభుత్వంలో రూ.669.59కోట్ల అంచనా వ్య యంతో పనులకు శంకుస్థాపన చేశారు. భూ సేకరణ కోసం రూ. 157.95 కోట్లు కేటాయించగా, రహదారి నిర్మాణం కోసం 551.64 కోట్లను మంజూరు చేసింది. అయితే విడుదల చేయక పనులు కాలేదు.

రెండో ప్యాకేజీ కింద ఖమ్మం రోడ్డులోని(సింగారం) నుంచి ఆరేపల్లి క్రాస్‌ రోడ్డు వరకు 39 కిలోమీటర్లు ఎన్‌హెచ్‌ రూ. 776.54కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో 191.82 కోట్లు భూసేకరణ కోసం వ్యయం చేస్తుండగా, మిగిలిన రహదారి పనుల కోసం రూ. 584.72కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. కానీ ఆ పనులు పూర్తి కాలేదు.

బల్దియా, ‘కుడా’ను సిబ్బంది కొరత వేధిస్తోంది. ట్రైసిటీలో 2013 మార్చిలో 42 శివారు గ్రామాలు విలీనమాయ్యయి. నగరం 110 చదరపుకిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా రెట్టింపవుతోంది. గ్రేటర్‌ హోదా దక్కింది. 2016 లెక్కల ప్రకారం బల్దియాలో శాశ్వత అధికారులు,ఉద్యోగుల సంఖ్య 1,531 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 741 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. కీలకమైన ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ప్రజారోగ్యం, పన్నుల విభాగం, అర్బన్‌ మలేరియా విభాగాల్లో క్షేత్ర స్థాయి, వివిధ హోదాల్లో అధికారులు పూర్తి స్థాయిలో లేక ఉన్న వారిపై అదనపు భారంతో సతమతమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇవి ఓకే.. మరి మిగతావి?1
1/2

ఇవి ఓకే.. మరి మిగతావి?

ఇవి ఓకే.. మరి మిగతావి?2
2/2

ఇవి ఓకే.. మరి మిగతావి?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement