వరంగల్ క్రైం: సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా మంగళవారం వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, హుజూరాబాద్, ములుగు ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి బహిరంగ సభ ముగిసే వరకు కొనసాగుతాయని, ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున అవసరం ఉంటే తప్ప వాహనాల్ని బయటకు తీయొద్దని, భారీ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు.
మళ్లింపు ఇలా..
హుజురాబాద్ నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్‌ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం, ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మం వెళ్లాలి.
● పరకాల, ములుగు మార్గాల నుంచి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్‌ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుంది.
● వర్ధన్నపేట వైపు నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పరకాల, భూపాలపల్లి వెళ్లే వాహనాలు పున్నేలు క్రాస్ నుంచి డైవర్షన్ తీసుకుని ఐనవోలు, కరుణాపురం ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.
సభాస్థలికి వెళ్లేందుకు..
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఈ మార్గాల మీదుగా రావాల్సి ఉంటుంది.
● హుజూరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు చింతగట్టు వద్ద ఓఆర్‌ఆర్ పైకి ఎ క్కి ఉనికిచర్ల క్రాస్ రోడ్, వడ్డేపల్లి చర్చి, రిజిస్ట్రేషన్ కార్యాలయం, తెలంగాణ జంక్షన్ వడ్డేపల్లి రోడ్ నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజలను దింపి ఖాళీ వాహనాలను ఓల్డ్ బస్ డిపో వద్ద పార్క్ చేయాలి.
● హనుమకొండ, ములుగు, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ డైవర్షన్ నుంచి కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా గోపాలపూర్ జంక్షన్, తిరుమల జంక్షన్ ఎకై ్సజ్ కాలనీ ఐలాండ్ వద్ద దించి ఖాళీ వాహనాలను ఎకై ్సజ్ కాలనీ–1లో పార్కింగ్ చేయాలి.
● నర్సంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు చింతల్ బ్రిడ్జ్, హంటర్ రోడ్ మీదుగా నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దింపి వాహనాలను సూచించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.
● మామునూరు నుంచి వచ్చే వాహనాలు ఆర్టీఓ జంక్షన్, ఉర్సు గుట్ట మీదుగా హంటర్ రోడ్ నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దించి ఖాళీ వాహనాలను విష్ణుప్రియ గార్డెన్స్‌లో నిలపాలి.
● స్టేషన్‌ఘన్‌పూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉనికిచర్ల ఎక్స్ రోడ్, వడ్డేపల్లి చర్చి, ప్రశాంతినగర్ పార్క్ తెలంగాణ జంక్షన్ మీదుగా జనాలను దించి ఖాళీ వాహనాలను తెలంగాణ జంక్షన్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment