పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి
నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ను సోమవారం హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.
వివేకానందుడి మార్గం
అనుసరణీయం
చెన్నారావుపేట: స్వామి వివేకనందుడి మార్గం అనుసరణీయమని, యువత ఆయన చూపిన మార్గంలో ముందుకెళ్లాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని వివేకానందుడి విగ్రహాన్ని ఆయన సోమవారం సందర్శించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెన్నారావుపేట బస్టాండ్ సెంటర్‌లో ప్రభుత్వ భూ మిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాల ని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో భజరంగ్‌దళ్ జిల్లా క న్వీనర్ ఆదిత్య సాయి,జిల్లా సహాయ కార్యదర్శి మల్యాల రవి,చొల్లేటి జగదీఽశ్వర్, సురక్ష, ప్రముఖ్ చరణ్, అల్లాడి భాస్కర్‌లు పాల్గొన్నారు.
సూచిక బోర్డులు
ఏర్పాటు చేయాలి
చెన్నారావుపేట: మండలంలోని ప్రభుత్వ గ్రామ, మండల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం–2005 బోర్డులు ఏర్పాటు చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్లెపు ప్రణీత్ కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ ఫణికుమార్, ఎంపీడీవో శ్రీవాణిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 26 ప్రకారం గ్రామస్థాయి వరకు సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు గణేష్ పాల్గొన్నారు.
29న పారామెడికల్
కోర్సులకు అడ్మిషన్
నర్సంపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారం వివిధ పారా మెడికల్ కోర్సులకు ఈ నెల 29న అడ్మిషన్ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 29న ఉదయం 9గంటల నుంచి ఒంటిగంట వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, దరఖాస్తులు తీసుకుని నర్సంపేట మెడికల్ కళాశాలకు రావాలని సూచించారు. డీఈసీజీలో 27, డయాలసీస్‌లో 13 సీట్లు ఖాళీగా ఉన్నాయని, దరఖాస్తు ఫారం, పూర్తి వివరాల కోసం tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment