సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధం
నర్సంపేట రూరల్: వరంగల్ జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన మంగళవారం ఉదయం 10గంటలకు ప్రారంభవుతుందని వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలి పారు. ఈ సందర్భంగా వారు సోమవారం సైన్స్ ఫెయిర్ వివరాలను వెల్లడించారు. సైన్స్ ఫెయిర్ కోసం సర్వం సిద్ధం చేశామని, పర్యవేక్షణకు 17రకాల కమిటీలను నియమించామని తెలిపారు.
13మండలాల నుంచి ఎగ్జిబిట్లు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13మండలాల నుంచి విద్యార్థులు 500రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, ఎన్ సీఈపీఆర్టీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, సీనియర్ విభాగంలో 9నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని వివరించారు. వీటితో పాటుగా జిల్లాలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో బీఈడీ, డీఈడీ విద్యార్థులకు టీచర్స్ ట్రైనింగ్ కేటగిరిలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు టీచర్స్ కేటగిరిలో వినూత్నమైన బోధన అభ్యసన సామగ్రిని ప్రదర్శించవచ్చని తెలిపారు. సైన్స్ ఫెయిర్‌లో ఆవిష్కరణలు, ఎగ్జిబిట్లను ప్రదర్శించే విద్యార్థులు మంగళవారం ఉదయం ఎగ్జిబిట్లతో నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు శివాని పబ్లిక్ స్కూల్‌కు చేరుకుని తమ ఎగ్జిబిట్లను ప్రదర్శనకు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నేటి మధ్యాహ్నం నుంచి 28వ తేదీ మధ్యాహ్నం వరకు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ వీక్షకులకు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి వీక్షించడానికి వచ్చే పాఠశాలల విద్యార్థులు శాస్త్ర అభిమానులకు సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలను బాల శాస్త్రవేత్తలు వివరిస్తారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో కొల్లూరి ఫ్లోరెన్స్, నిర్వహణ కమిటీ సభ్యులు పట్టాభి, ఎంఈఓ కొర్ర సారయ్య, శివాని పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి 28వరకు శివాని
పబ్లిక్ స్కూల్‌లో జిల్లాస్థాయి
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన
13 మండలాల నుంచి
500 ఎగ్జిబిట్ల ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment