ఏలూరు రూరల్: సెప్టెంబర్ 1న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 14 బాలురు క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్య వర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించే ఈ పోటీలకు 01–09–2010 తర్వాత పుట్టిన వారే అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారు అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గలవారు ఒరిజినల్ పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లతో పాటు సొంత క్రికెట్ కిట్‌తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం 9491044848 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
హత్య కేసులో నిందితుల అరెస్టు
ద్వారకాతిరుమల: కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించిన తండ్రి, బంధువులను ఘటన జరిగిన 24 గంటల లోపే ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోడిగూడెంకు చెందిన దౌలూరి కాంతయ్యకు కుమారుడు ధర్మారావు, కుమార్తెలు దాసరి శ్యామల, బంటుమిల్లి సుజాతలు సంతానం. కాంతయ్యకు ఉన్న 4 ఎకరాల భూమి విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 24 ఉదయం 11.30 గంటల సమయంలో ధర్మారావుకు, అతని తండ్రి కాంతయ్యకు మధ్య గొడవ జరిగింది. దాంతో కొడుకుని చంపేయాలని నిర్ణయించుకున్న కాంతయ్య తన పెద్ద కుమార్తె, ఇద్దరు అల్లుళ్లు, ఇద్దరు మనుమళ్లను రప్పించి, కత్తులు, ఇనుప రాడ్లతో ధర్మారావుపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధర్మారావు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఎస్సై సుధీర్ ధర్మారావుపై హత్యాయత్నం చేసిన కాంతయ్య, అతని పెద్ద కుమార్తె శ్యామల, ఆమె భర్త దాసరి గంగరాజు, వీరి ఇద్దరి కుమారులు దాసరి వంశీ, దాసరి సుందర్, కాంతయ్య చిన్న అల్లుడు బంటుమిల్లి డేవిడ్‌ను ఆదివారం అరెస్టు చేశారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించగా, పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment