రెండు అభివృద్ధి అథారిటీలు
హెచ్‌ఎండీఏ, వైయూడీఏ పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా
అథారిటీల పరిధిలోని మండలాలు..
జిల్లాలలో ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం పది మండలాలు, రెండు మున్సిపాలిటీలతో యాదాద్రి భువనగిరి అర్బన్ అథారిటీ ఏర్పాటు చేసింది. అయితే తుర్కపల్లి, సంస్థాన్‌నారాయణపురం మండలాలను హెచ్‌ఎండీఏలో కలిపే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏలో భువనగిరి, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్ మండలాలు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక వైటీడీఏ కూడా ఉన్నప్పటికీ అక్కడి మండలాలను వైయూడీఏలో కలిపారు.
హెచ్‌ఎండీఏ పరిధి
ఫ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఐదు మండలాలు.. పరిశీలనలో మరో రెండు
ఫ తాజాగా యాదాద్రి భువనగిరి డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు
ఫ 144 గ్రామాలు, రెండు
మున్సిపాలిటీలు విలీనం
ఫ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
ెహెచ్‌ఎండీఏలో
విలీనానికి
పరిశీలన
సాక్షి, యాదాద్రి : జిల్లా అభివృద్ధిలో ఇకనుంచి యాదాద్రి భువనగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైయూడీఏ) కూడా కీలక పాత్ర పోషించనుంది. భవన నిర్మాణాలు, లే అవుట్‌ల ఏర్పాటు.. ఇలా అన్నింటికీ వైయుడీఏ స్థాయిలో అనుమతులు మంజూరుకానున్నాయి. జిల్లాలోని 10 మండలాలతో కలిపి ప్రభుత్వం వైయూడీఏను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఐదు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. మరో రెండు మండలాలను కూడా విలీనం చేసేందుకు పరిశీలిస్తున్నారు.
అభివృద్ధే లక్ష్యంగా..
జిల్లాలోని ప్రధాన పట్టణాల చుట్టూ మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రమైన, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యంగా యాదాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రం, పట్టణాలు, గ్రామాలకు రోడ్ నెట్‌వర్క్ విస్తరించడం, మంచినీటి సరఫరా, ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నారు. వీటితో పాటు శాటిలైట్ టౌన్‌న్ షిప్‌లు, సబర్బన్ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందించడం వైయూడీఏ ప్రధాన లక్షణం.
హెచ్‌ఏండీఏ తరహాలో..
హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న పట్టణీకరణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సాధించిన అభివృద్ధిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా యూడీఏలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భువనగిరిటౌన్, ఆలేరు, మోత్కూరు రెండు మున్సిపాలిటీలతో పాటు యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), మోత్కూరు, రాజాపేట, రామన్నపేట, వలిగొండ, మోటకొండూరు, గుండాల మండలాల్లోని 144 గ్రామాలను విలీనం చేశారు.
జిల్లా స్వరూపం ఇదీ..
మొత్తం మండలాలు 17
హెచ్‌ఎండీఏ పరిధిలో 05, రెండు మండలాల పరిశీలన
వైయూడీఏలోకి 10 మండలాలు, రెండు మున్సిపాలిటీలు
Comments
Please login to add a commentAdd a comment