దివిస్ పరిశ్రమను తరలించండి
చౌటుప్పల్ రూరల్ : దివిస్ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యంతో జీవించలేని పరిస్థితి దాపురించిందని, కంపెనీని తరలించాలంటూ చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం రైతులు పరిశ్రమ ధర్నా చేశారు. కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంతో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమై పంటలు పండడం లేదన్నారు. కలుషిత నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయని, ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని, అనేకమార్లు ఉన్నతాధికారులు, కాలుష్యనియంత్రణ మండలికి, ప్రజాపాలనలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. యాజమాన్యంతో మాట్లాడుతామని పోలీసులు, కంపెనీ సిబ్బంది సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బద్దం అంజయ్య, రైతులు సామ జనార్దన్‌రెడ్డి, గుండెబోయిన బాలకృష్ణ, అనంతుల రాములు, ఉయ్యాల రాములు, పిసాటి ముత్యంరెడ్డి, పిసాటి శంకర్‌రెడ్డి, శ్రీరాములు బక్కయ్య, గంగనబోయిన మల్లేష్, గండికోట సుందరయ్య, మేకల వెంకటేశ్వర్లు, బద్దం లింగస్వామి,సామ అంజిరెడ్డి, ఉయ్యాల ఆశోక్,జిల్లాల బుచ్చిరెడ్డి పాల్గోన్నారు.
ఫ కంపెనీ ఎదుట ఆరెగూడెం రైతుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment