ముద్దనూరు : పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్ర మాదం చోటు చేసుకుంది. మండలంలోని ఓబుళాపు రం గ్రామం వద్ద శనివారం కారును టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అత్త, అల్లుడు దుర్మరణం చెందగా, మరదలుకు గాయాలయ్యాయి. సీఐ నరేష్‌బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో టౌన్ ప్లానింగ్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవరెడ్డి (55), తాడిపత్రికి చెందిన తన అత్త లక్ష్మీదేవి (70), మరదలు అనూరాధతో కలిసి కడప నగరంలోని పెళ్లికి వెళ్లారు.
పెళ్లికి హాజరై తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చెన్నకేశరెడ్డితోపాటు అతని పక్క సీటులో కూర్చున్న అత్త లక్ష్మీదేవి తీవ్ర గాయాల పాలై కారులోనే దుర్మరణం చెందారు. కారు వెనుక సీటులో కూర్చున్న అనూరాధకు గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నకేశవరెడ్డికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment