జూనియర్ కళాశాలను తొలగించాలి
జూనియర్ కళాశాల సొంత భవనాల కోసం రెండుసార్లు నిధులు మంజూరయ్యాయి. లాభం లేకపోయింది. పీహెచ్‌సీకి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని జూనియర్ కళాశాల కోసం ఎంపిక చేశాం. దాన్ని అడ్డుకున్నారు. కళాశాలను ఎస్సీ హాస్టల్ భవనాల్లోకి మార్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ.. ఉద్దేశపూర్వకంగా ఽకొందరు అధ్యాపకులు వ్యతిరేకించారు.
–మేడా విజయభాస్కర్‌రెడ్డి,
ఎంపీపీ, నందలూరు
షిఫ్ట్ విధానం సరికాదు
ఐఏఎస్‌ల పాఠశాలగా దీనికి గుర్తింపు ఉంది. ఎందరో ఐఏఎస్‌లను అందించిన హైస్కూల్ నేడు విద్యాపరంగా దీనావస్థలో ఉంది. ఒకప్పుడు రెండుపూటలు జరిగేది. ఒక పూటకే పరిమితం కావడంతో విద్యార్థులకు బోధన కరువైంది. ఇంటర్ కళాశాలను వేరే ప్రాంతానికి తరలిస్తేనే హైస్కూల్ విద్య సక్రమంగా నడుస్తుంది. ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.
–సోమిశెట్టి సునీత, ఎంపీటీసీ, నందలూరు
ఏళ్ల తరబడి ఇదే దుస్థితి
నందలూరు హైస్కూల్‌లో ఏళ్ల తరబడి ఇంటర్ కళాశాలను కొనసాగింపును ఆపలేకపోతున్నారు. ఇంటర్ కళాశాలకు స్థలం, నిధులొచ్చినా ఉపయోగించలేకపోయారు. తరువాత నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్ భవనాల్లోకి తరలిస్తే కొంతమంది అధ్యాపకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకున్నారు.
–సుభాన్‌బాషా, ఎంపీటీసీ, నందలూరు
Comments
Please login to add a commentAdd a comment