సెంచరీలతో చెలరేగిన బ్యాట్స్‌మెన్
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జోనల్ అండర్–23 క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో మూడు సెంచరీలు నమోదయ్యా యి. కేఓఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో రెస్టాఫ్ సౌత్, రెస్టాఫ్ సెంట్రల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సౌత్‌జోన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. జట్టులోని పి.సుబ్రమణ్యం 130 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్‌లతో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈయనకు జతగా ధరణికుమార్‌నాయుడు 59 పరుగులు చేశాడు. సెంట్రల్‌జోన్ బౌలర్లు రాజు 2, సుబ్బారావు 2, దీపక్‌చంద్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ సెంట్రల్ జోన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. జట్టులోని స్వామినాయుడు 100 పరుగులు చేయ గా, వసంత్‌వర్ధన 30 పరుగులు చేశాడు. సౌత్‌జోన్ బౌలర్లు ధరణికుమార్‌నాయుడు 5 వికెట్లు, ఆదిల్‌హుస్సేన్ 2 వికెట్లు తీశారు. దీంతో రెస్టాఫ్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 117 పరుగుల తేడాతో విజయం సాధించింది.
4 వికెట్ల తేడాతో గెలుపు
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం, తూర్పుగోదావరి జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. జట్టులోని ప్రశాంత్ 64, మహేంద్రారెడ్డి 42 పరుగులు చేశాడు. తూర్పుగోదావరి బౌలర్లు శివసూర్య 2, వంశీనారాయణ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తూర్పుగోదావరి జట్టు 47.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని విజయ్ 53 పరుగులు చేశాడు. అనంత బౌలర్లు మల్లికార్జున 4, ప్రదీప్ 2 వికెట్లు తీశారు. కాగా తూర్పుగోదావరి జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారీ ఆధిక్యం
వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో రెస్టాఫ్ నార్త్‌జోన్ జట్టు, ప్రకాశం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నార్త్‌జోన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. జట్టులోని రోహిత్ 91 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్సర్‌లతో 119 పరుగులు చేశాడు. అభినవ్ 75 పరుగులు చేశాడు. నార్త్‌జోన్ బౌలర్లు అచ్యుత్ హేమంత్ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని హిమకర్ 64, రవికిరణ్ 65 పరుగులు చేశారు. ప్రకాశం బౌలర్లు సుమిత్ 4, పార్థసారధి 2, పవన్‌కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో ప్రకాశం జట్టు 79 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది.
తూర్పుగోదావరి, ప్రకాశం,
సౌత్‌జోన్ జట్లు విజయం
Comments
Please login to add a commentAdd a comment