వెళ్తున్న బస్సులో నుంచి దూకిన యువతి
పులివెందుల రూరల్/చక్రాయపేట : పులివెందుల పట్టణంలోని రోటరీపురానికి చెందిన మతిస్థిమితం సరిగా లేని శ్రీలఖ వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకింది. ఆమెను కాపాడేందుకు తల్లి సులోచన కూడా కిందికి దూకింది. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రోటరీపురానికి చెందిన సులోచన, రాముడుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె శ్రీలేఖతో కలిసి తల్లి సులోచన కార్తీకమాసం సోమవారం నాడు రాయచోటి సమీపంలోని శివాలయానికి వెళ్లింది. అనంతరం రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తిరిగి వస్తున్నారు. చక్రాయపేటలోని పెట్రోలు బంకు వద్దకు రాగానే మతిస్థిమితం సరిగా లేని శ్రీలేఖ బస్సులో నుంచి కిందికి దూకింది. ఆమెను కాపాడేందుకు తల్లి కూడా కిందికి దూకింది. దీంతో వారిద్దరికీ తీవ్ర గా యాలయ్యాయి. వారిని చికిత్స కోసం 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు.
కుమార్తెను కాపాడేందుకు
కిందికి దూకిన తల్లి
ఇద్దరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment