రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్‌ను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని దూబగుంట్ల గ్రామంలో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంతో పాటు పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాతనలో గృహాలకు రూ.20లకు రెండు ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెవెన్యూశాఖలో కొద్ది మంది ఉద్యోగుల వల్ల భూ వివాదాలు తలెత్తుతున్నాయని విమర్శించారు.
Published Thu, Jan 7 2016 7:44 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement