నిమ్స్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని విభజించడం అనివార్యం అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్టన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను వైద్యులు బలవంతంగా భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించిందని తెలిసి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో నిమ్స్కు తరలి వచ్చారు. ఆయన దీక్షను భగ్నం చేశారని తెలిసిన తరువాత జనం మరింతగా పెరిగిపోయారు. కార్యకర్తలు కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రి బయట జై జగన్ నినాదాలతో మారుమ్రోగిపోయింది. పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. పలువురు మహిళలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాలలో ఎక్కించుకొని తీసుకువెళ్లారు.
Published Sat, Aug 31 2013 3:43 PM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM
Advertisement
Advertisement
Advertisement