మనం కోరుకున్నది వేరే వాళ్లకు దక్కినా.. మనకు మాత్రమే సొంతం అనుకున్న వాళ్లు వేరే వాళ్లతో చొరవగా ఉన్నా అసూయపడటం సర్వసాధారణం. అసూయ అన్నది కేవలం మనషులకు మాత్రమే సొంతం కాదని ఓ చిలుక నిరూపించింది. తన యాజమాని వేరే పక్షితో చొరవగా ఉండటాన్ని సహించలేక పోయింది. వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన ఆంటారియో అనే వ్యక్తి షాడో అనే చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఓ రోజు షాడో తన దగ్గర ఉన్నపుడు ఓ బొమ్మపక్షికి ముద్దులు పెడతూ.. గట్టిగా శబ్ధాలు చేయటం ప్రారంభించాడు. ఇది గమనించిన షాడో! యాజమాని ముఖం దగ్గరకు పరుగులు తీసి, బొమ్మను ముక్కుతో పొడిచి ‘‘నీ ముద్దులు నాకే సొంతం’’ అన్నట్లుగా అతన్ని ముద్దుపెట్టుకోవటానికి ప్రయత్నించింది.
చిలుక అసూయ..
Published Sat, May 25 2019 3:58 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement