AB de Villiers
-
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
ఐపీఎల్-2025 (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ఊహించని రీతిలో ముందుకు సాగుతుంటే.. ఐదేసి సార్లు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ (RR)తో కలిసి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా సవాళ్లకు ఎదురీతుండగా.. గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేకేఆర్ ఇప్పటికి ఆరింట మూడు గెలిస్తే.. రైజర్స్ ఆరింట రెండే గెలిచి చివరన ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ కొనసాగుతోంది.గతేడాది బెంగళూరు జట్టుపై 287/3 స్కోరు నమోదు చేసింది. ఈ ఏడాది తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్.. ఈ రికార్డు స్కోరు కంటే ఒక్క పరుగు తక్కువ చేసి.. తమ రికార్డును తామే బద్దలుకొడుతుందా అనిపించింది. అయితే, ఇప్పటికి ఆ రికార్డు మాత్రం పదిలంగానే ఉండిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చెక్కు చెదరని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి గమనిద్దామా?!రికార్డుల రారాజుకే సాధ్యమైందిరన్మెషీన్ పేరొందిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఈ రికార్డుల రారాజు 2016 సీజన్లో నాలుగు శతకాల సాయంతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు.అత్యధిక వరుస విజయాలుఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. 2014, 2015 సీజన్లలో అరుదైన ఘనత సాధించింది.గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది కేకేఆర్. ఆ మరుసటి ఏడాది వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఇంత వరకు ఏ జట్టుకు ఇలాంటి వరుస విజయాల ఘనత సాధ్యం కాలేదు.పార్ట్నర్స్ఐపీఎల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి- ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. 2016లో ఆర్సీబీ తరఫున ఈ దిగ్గజ బ్యాటర్లు గుజరాత్ లయన్స్‌పై 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గతంలో ముంబై ఇండియన్స్‌పై తాము సాధించిన 215 (నాటౌట్) పరుగుల భాగస్వామ్య రికార్డును వారే బ్రేక్ చేశారు.హ్యాట్రిక్ వీరుడుఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్‌లు నమోదు చేసిన బౌలర్‌గా రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున దక్కన్ చార్జర్స్‌పై, 2011లో దక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2011లో పుణె వారియర్స్‌పై అమిత్ మిశ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు.అరంగేట్రంలోనే అదరగొట్టివెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ఏప్రిల్ 6, 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా 6/12 గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా డెబ్యూలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.డివిలియర్స్ పేరిటే..ఒక సీజన్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నాడు. 2016 సీజన్లో అతడు మొత్తంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), రియాన్ పరాగ్ (17) అతడికి చేరువగా వచ్చినా ఈ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు.. -
సీఎస్కే, ఢిల్లీ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే: డివిలియర్స్
ఐపీఎల్-2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.కాగా ఈ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండడంతో మాజీ క్రికెటర్లు ప్లే ఆఫ్స్ చేరే జట్లు, టైటిల్ విజేతగా నిలిచే జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేరాడు. ఈ ఏడాది సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను డివిలియర్స్ ప్రిడక్ట్ చేశాడు.గతంలో తను ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పాటు ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని ఏబీడీ జోస్యం చెప్పాడు."ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ఈసారి ముంబై ఇండియన్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ కూడా టాప్-4లో నిలుస్తోంది. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. ఆపై గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుందని భావిస్తున్నాను.ఈ మూడు జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కెకెఆర్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ లేకపోవడం అభిమానులు ఆశ్చర్యపరిచింది. కాగా గతేడాది సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే గ్రూపు స్టేజికే పరిమితమైంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ -
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్-2021 తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. తిరిగి సీఎస్ఎ లీగ్‌తో పునరాగమనం చేశాడు. ఈ లీగ్‌లో టైటాన్ లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఏబీడీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే బౌండరీల వర్షం కుర్పించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ కేవలం 28 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 15 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో బుల్స్ లెజెండ్స్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో టైటాన్ లెజెండ్స్‌ను విజేతగా ప్రకటించారు.డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మే 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరికి ఏబీడీ షాకిచ్చాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని డివిలియర్స్ భావించాడు. కానీ అతడి అభ్యర్థనను క్రికెట్ దక్షిణాఫ్రికా తిరస్కరించింది. డివిలియర్స్‌కు అంతర్జాతీయ క్రికెట్లో 20,014 పరుగులు ఉన్నాయి. అదేవిధంగా 47 ఇంటర్ననేషనల్ సెంచరీలు అతడి పేరిట ఉన్నాయి.డివిలియర్స్‌కు ఐపీఎల్లో కూడా మంచి రికార్డు ఉంది. 2011-2021 వరకు 11 ఏళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున ఆడాడు. అంతకుముందు కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ డెర్డేవిల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 39.71 సగటు, 151.69 స్ట్రైక్‌రేట్‌తో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి.చదవండి: #R Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్ -
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్‌కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్‌ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మ్యాచ్‌ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్‌కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్‌లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్‌కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్‌గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్‌మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతడు పెట్టింది పేరు’’అని రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
CT: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నీలో 2000 సంవత్సరంలో తొలిసారి ఫైనల్‌కు చేరింది టీమిండియా. అయితే, కెన్యాలో నాటి తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2002లోశ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. అనంతరం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) సారథ్యంలో 2013లో మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత జట్టు... ఈసారి ఆఖరి గండాన్ని అధిగమించింది.ఐదు పరుగుల తేడాతో గెలుపొందిసౌతాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను సోలోగా సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు ఫైనల్‌కు చేరినా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై(India vs Pakistan).. ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో మరోసారి ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచే అవకాశం ముంగిట నిలిచింది.నాడు ఆ ఆరుగురు2017 తర్వాత.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. 2017 నాటి జట్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనునున్నాడు.మరోవైపు.. ఆనాటి సారథి విరాట్ కోహ్లితో పాటు.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేఈసారి టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఎవరన్న అంశంపై అభిప్రాయాలు పంచుకుంటూ.. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. వీరికి బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై డివిలియర్స్ నమ్మకం ఉంచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. ‘‘ఈసారి భారత జట్టులో ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా కుల్దీప్ యాదవ్ మారబోతున్నాడని అనిపిస్తోంది.ఎందుకంటే.. టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుబోతోంది. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కుల్దీప్ ఈసారి ఇండియా తరఫున అందరికంటే మెరుగ్గా ఆడి.. ఫలితాలను ప్రభావితం చేయగలడు’’ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.గాయం కారణంగాకాగా కుల్దీప్ యాదవ్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఎడమ గజ్జలో నొప్పి కారణంగా సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ఈ స్పిన్ బౌలర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు సమాచారం. గాయం కారణంగానే అతడు ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) పునరాగమనానికి రంగం సిద్ధమైంది. మరోసారి అతడు ప్రొటిస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా ప్రకటించాడు. తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.కాగా సౌతాఫ్రికా(South Africa) తరఫున 2004లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో లెజెండ్‌గా ఎదిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గానూ పనిచేసిన అనుభం ఉంది. ఇక ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన ఇంటర్నేషనల్ కెరీర్లో 114 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8765 పరుగులు చేశాడు.అదే విధంగా 228 వన్డేల్లో కలిపి 9577 రన్స్ సాధించాడు. ఇక ప్రొటిస్ జట్టు తరఫున 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 1672 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో డివిలియర్స్ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు నమోదు చేశాడు.ఐపీఎల్‌లోనూ హవాఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చాలా ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడాడు ఏబీ డివిలియర్స్. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడి.. మూడు శతకాల సాయంతో 5162 పరుగులు చేశాడు.ఈ క్రమంలో నలభై ఏళ్ల ఏబీ డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్‌గానూ అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉంటున్న మిస్టర్ ‘360’.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉందంటూ ఇటీవలే రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడు.తాజాగా తన పునరాగమనాన్ని ఖరారు చేస్తూ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends- WCL) బరిలో దిగనున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ‘‘నాలుగేళ్ల క్రితం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను.ఇక నాలో క్రికెట్ ఆడే కోరిక మిగిలి లేదని భావించి నా నిర్ణయాన్ని వెల్లడించాను. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నా పిల్లలతో కలిసి ఆడిన ప్రతిసారి.. తిరిగి మైదానంలో దిగాలనే కోరిక బలపడింది. అందుకే జిమ్‌కు తరచుగా వెళ్లి వ్యాయామం చేయడంతో పాటు.. నెట్స్‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ టోర్నీకి నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని డివిలియర్స్ తెలిపాడు.ఆరు జట్లుకాగా డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్- కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. గతేడాది డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో పాల్గొనగా.. భారత్ మొట్టమొదటి చాంపియన్‌గా అవతరించింది. ‘సిక్సర్ల కింగ్’ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఈ లీగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనుండటం అదనపు ఆకర్షణ కానుంది. కాగా ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగష్టు 2 వరకు ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 టోర్నీ జరుగనుంది. సౌతాఫ్రికా తరఫున గత సీజన్లో జాక్వెస్ కలిస్, హర్షల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ తదితరులు బరిలోకి దిగారు.చదవండి: Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్ షెడ్యూల్ విడుదల -
‘అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇది విన్నింగ్ టీమ్’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు. అతడిని తప్పించి మంచి పనిచేశారుఅదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో పోటీపడుతుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలోఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలిఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇదొక విన్నింగ్ టీమ్ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్‌పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.ఎనిమిది జట్లుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్‌గా ఉంటే.. -
రీ ఎంట్రీ ఇస్తా.. క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB De Villiers) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, మరోసారి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లేదంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం ఆడలేనని స్పష్టం చేశాడు.లెజెండరీ బ్యాటర్గాకాగా 2004లో సౌతాఫ్రికా(South Africa) తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన డివిలియర్స్ లెజెండరీ బ్యాటర్‌గా ఎదిగాడు. ప్రొటిస్ జట్టు కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఇక వికెట్ కీపర్‌గానూ సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8765, 9577, 1672 పరుగులు చేశాడు.ఇక డివిలియర్స్ ఖాతాలో ఖాతాలో 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడి 5162 రన్స్ సాధించాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉండటం విశేషం.‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందికాగా 2021 నవంబరులో డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం తన సమయంలో ఎక్కువ భాగం కుటుంబానికి కేటాయించిన ఏబీడీ.. చారిటి, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందంటూ అతడు వ్యాఖ్యానించడం విశేషం.ఈ విషయం గురించి మెలిండా ఫారెల్‌కు చెందిన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుకీ నేను క్రికెట్ ఆడగలననే నమ్మకంతో ఉన్నాను. అయితే, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పిల్లలు మాత్రం నాపై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాలో మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరిక కలిగింది.ఏదో ఓ చోట కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నా. అయితే, నేను ఆర్సీబీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఐపీఎల్ లేదంటే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం పాల్గొనను. కేవలం నా పిల్లల కోసం, క్రికెట్ మీదున్న ప్రేమ కారణంగా మళ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నా.ఏదేమైనా మరోసారి ఒత్తిడిలోకి కూరుకుపోవాలని మాత్రం అనుకోవడం లేదు. కాస్త సరదాగా.. సంతృప్తికరంగా నా ఇన్నింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా’’ అని 40 ఏళ్ల ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ajinkya Rahane: రోహిత్ శర్మకు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు -
IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై..
భారత స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో తాను కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపర్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా 2021లో రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు సంజూ శాంసన్.కెప్టెన్‌గా హిట్ఆ మరుసటి ఏడాదే అంటే.. 2022లో రాజస్తాన్‌ను ఫైనల్ చేర్చి సత్తా చాటాడు. 2008 తర్వాత ఆ జట్టు మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించడం అదే తొలిసారి. అయితే, 2023లో మాత్రం ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినప్పటికీ ఐదో స్థానంలో నిలపగలిగాడు. ఇక తాజా ఎడిషన్‌లో మాత్రం రాజస్తాన్‌ను మరోమారు ఆఫ్స్‌లో నిలబెట్టాడు సంజూ.అతడి కోసం త్యాగం చేసేందుకు సిద్దంఇలా గత మూడేళ్లుగా రాజస్తాన్‌ను మెరుగైన స్థితిలో నిలపడంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్ కోసం వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంజూ తాజాగా వెల్లడించాడు.నాకు ఇదొక పెద్ద సవాలే.. అయినా‘‘ధ్రువ్ జురెల్ ప్రస్తుతం టెస్టుల్లో సెకండ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తే అతడి అంతర్జాతీయ కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి మేము చర్చలు జరుపుతున్నాం.జురెల్‌తో కలిసి కీపింగ్ బాధ్యతలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నిజానికి.. నేను కేవలం ఓ ఫీల్డర్‌గా ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. కాబట్టి నాకు ఇదొక పెద్ద సవాలే. అయితే.. ధ్రువ్ విధుల పట్ల మాత్రం స్పష్టతతో ఉన్నాను.నాయకుడిగా నా బాధ్యత.. అందుకే ఈ నిర్ణయంనేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ‘‘చూడు ధ్రువ్.. నాయకుడిగా నేను నీ గురించి తప్పక ఆలోచిస్తాను. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లలో కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు’’ అని చెప్పాను. ఏదేమైనా మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత ఎదుగుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాం’’ అని సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు తన ఆలోచినలు, నిర్ణయం గురించి వెల్లడించాడు.రూ. 18 కోట్లకుకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్.. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడితో పాటు యశస్వి జైస్వాల్(రూ. 18 కోట్లు ), రియాన్ పరాగ్(రూ. 14 కోట్లు)ధ్రువ్ జురెల్(రూ. 14 కోట్లు), హెట్‌మైర్(రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(రూ. 4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.ఐపీఎల్ వేలం-2025 తర్వాత రాజస్తాన్ జట్టుయశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, సందీప్‌శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు), వనిందు హసరంగ (రూ.5.25 కోట్లు),మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు), ఫజల్హక్ ఫారూకీ(రూ. 2 కోట్లు), క్వెనా మఫాక (రూ. 1.50 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు), కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు), కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు).చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్..!?
దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వ్యక్తిగత కారణాల రీత్యా డుమిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు డుమినీ తెలియజేశాడు.మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు. డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. కాగా అతడి రాజీనామా విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా సైతం ధ్రువీకరించింది.డుమిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. అదే విధంగా అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు వేట మొదలు పెట్టినట్లు సదరు క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీడీ..కాగా దక్షిణాఫ్రికా తదుపరి బ్యాటింగ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో సౌతాఫ్రికా క్రికెట్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఏబీడీ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్ -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. సారథులు వీరేనా?అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ అతడే!‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరుఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు. ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
IPL 2025: ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా బాగానే ఉందని.. అయితే వేలంపాటలో అనుసరించే వ్యూహాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి జట్టుతోనే ఉండటం సంతోషకరమన్న ఏబీడీ.. చహల్‌ను కూడా తిరిగి తీసుకువస్తే జట్టు మరింత బలోపేతమవుతుందన్నాడు.కాగా నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పాటిదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(రూ. 5 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రిటెన్షన్ పోగా.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ. 83 కోట్లు మిగిలి ఉన్నాయి.ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుందిఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ వేలంలో ఆర్సీబీ అనుసరించాల్సిన వ్యూహాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనైతే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తాను. యజువేంద్ర చహల్, కగిసో రబడ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్... ఈ నలుగురిని కొనుగోలు చేసిన తర్వాత పర్సులో ఎంత మిగిలిందన్న అంశం ఆధారంగా మిగతా ప్లేయర్లను ప్లాన్ చేసుకోవాలి.ఒకవేళ మీకు రబడను కొనేంత సొమ్ము లేకపోతే.. మహ్మద్ షమీని దక్కించుకోండి’’ అని డివిలియర్స్ ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. కాగా సుదీర్ఘకాలం పాటు తమతో కొనసాగిన భారత మణికట్టు స్పిన్నర్ చహల్‌ను 2022లో ఆర్సీబీ వదిలేసిన విషయం తెలిసిందే.లీడింగ్ వికెట్ టేకర్అయితే, అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ చహల్‌ను కొనుక్కోగా.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 160 మ్యాచ్‌లు ఆడి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(295) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు చహల్.ఈ నేపథ్యంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ తిరిగి జట్టులో చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు
ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు చేర్చింది. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్, భారత దిగ్గజ స్పిన్నర్ నీతూ డేవిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్లుగా ఎంపికయ్యారు.అలిస్టర్ కుక్ (2006-18) ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్లలో ఒకరు. కుక్ తన టెస్ట్ కెరీర్లో 161 టెస్ట్‌లు ఆడి 45.35 సగటున 12,472 పరుగులు చేశాడు. అలాగే 92 వన్డేల్లో 36.40 సగటున 3204 పరగులు చేశాడు. నాలుగు టీ20ల్లో 15.25 సగటున 61 పరుగులు చేశాడు.నీతూ డేవిడ్ (1995-2008).. భారత్ తరఫున ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్. 2023లో డయానా ఎడుల్జి భారత్ తరఫున హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్ భారత్ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ నీతూనే.ICC VIDEO FOR THE HALL OF FAMER - AB DE VILLIERS. 🐐pic.twitter.com/PzUh1MDPHR— Mufaddal Vohra (@mufaddal_vohra) October 16, 2024ఏబీ డివిలియర్స్ (2004-2018) విషయానికొస్తే.. ఏబీడీ సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 ఆడి 20014 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఏబీడీ సగటు 50కి పైగానే ఉంది. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల ఏబీడీకి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా పేరుంది.చదవండి: IND vs NZ 1st Test: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆట రద్దు -
సౌతాఫ్రికా టీ20 లీగ్ అంబాసిడర్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచపు అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్‌వే ఎస్ఏ20కు అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. లీగ్ క్రికెట్లో డీకేకు ఉన్న అనుభవం, భారత్‌లో కార్తీక్‌కు ఉన్న క్రేజ్ తమ లీగ్ వృద్ధికి తోడ్పడుతుందని స్మిత్ అన్నాడు. బెట్‌వే ఎస్ఏ20 లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై డీకే స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టనుండటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సహచర అంబాసిడర్ ఏడీ డివిలియర్స్‌తో కలిసి పని చేస్తాడు.ఎస్ఏ20 లీగ్ గత రెండు సీజన్లుగా విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లోనూ ఐపీఎల్ తరహాలో చాలామంది విదేశీ స్టార్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతుల్లో నడుస్తుంది. ఈ జట్టుకు సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలు ఎస్ఏ20 లీగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఓనర్ల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి.కార్తీక్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభ ఎడిషన్‌ను (2008) నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన డీకే.. ఐపీఎల్ 2024 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే రిటైర్మెంట్ ముందు వరకు ఆర్సీబీకి ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఆర్సీబీ డీకేను తమ మెంటార్‌గా నియమించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో కార్తీక్ 135.66 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు. -
రోహిత్, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్ అతడే: బాబర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కెరీర్ పరంగా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడి సారథ్యంలో పాక్ వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణంగా విఫలమైంది.భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన బాబర్ బృందం.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం సూపర్-8 కూడా చేరలేదు.కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంఫలితంగా బాబర్ మరోసారి కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో తమ ఆటగాళ్లు పూర్తిగా విఫలం కావడంతో పాక్ క్రికెట్ బోర్డు కాస్త కఠినంగానే వ్యవహరించనుందని వార్తలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఆటగాళ్లు ఇతర దేశాల టీ20 లీగ్‌లలో ఆడకుండా పాక్ బోర్డు అడ్డుకట్ట వేస్తోంది. గ్లోబల్ టీ20 కెనడా వంటి లీగ్‌లలో ఆడాలనుకున్న బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడమే ఇందుకు నిదర్శనం.ఫామ్‌లేమితో సతమతమైనపుడుఇదిలా ఉంటే.. తాను ఫామ్‌లేమితో సతమతమైనపుడు వీరి సలహాలే తీసుకుంటానంటూ బాబర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాలు ఉన్నాయని అనిపించినపుడు.. విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్లను సంప్రదిస్తానని బాబర్ ఆజం పేర్కొన్నాడు.సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడుతూ అతడు ఈ విషయం వెల్లడించాడు. అదే విధంగా.. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరు చెప్పాడు.రోహిత్, కోహ్లి కాదు!.. అత్యుత్తమ బ్యాటర్ అతడే: బాబర్ఇక ప్రత్యర్థి జట్టులో తాను చూసిన అత్యుత్తమ బ్యాటర్‌గా బాబర్ ఆజం డివిలియర్స్ పేరు చెప్పడం విశేషం. దీంతో షాకవ్వడం ఏబీడీ వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియో లింక్‌ను ఈ సౌతాఫ్రికా లెజెండ్ తాజాగా షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు తాను ఈ ఇంటర్వ్యూ చేసినట్లు వెల్లడించాడు.ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి పేరు చెబుతాడని భావించామని.. అయితే, బాబర్ ఏబీడీ పేరు చెప్పడం కూడా బాగుంది’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.I interviewed Pakistan's @babarazam258 before the T20 World Cup earlier this year, and l'd shared a bit of it back then. Don't miss out on this chat, and show my friend some love. 🫶🏻🏏Here's the full interview 👇🏻🔗: https://t.co/nTA05h4nZY#CricketTwitter pic.twitter.com/iy02SXZvn2— AB de Villiers (@ABdeVilliers17) July 20, 2024 -
ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: డివిలియర్స్
టీ20 వరల్డ్‌కప్-2024 ఈవెంట్‌కు ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టుపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి క్రికెట్ సౌతాఫ్రికా సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే ఇందులో బ్లాక్ ఆఫ్రికన్ ఆటగాడు కగిసో రబాడకు మాత్రమే సెలక్టర్లు చోటు ఇచ్చారు.క్రికెట్ దక్షిణాఫ్రికా పాలసీ ప్రకారం... దక్షిణాఫ్రికా ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ ప్లెయింగ్ ఎలెవన్‌లో కనీసం ఇద్దరూ నల్లజాతి ఆఫ్రికన్లు ఉండాలి. అదే విధంగా కలర్ ఆఫ్రికన్స్ కనీసం ఆరుగురుఉండాలి. అయితే సెలక్టర్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పాలసీకి విరుద్దంగా కేవలం ఒక్క బ్లాక్ ఆఫ్రికన్(రబాడ)ను మాత్రమే సెలక్ట్ చేశారు. మరో నల్లజాతి ఆటగాడు లుంగీ ఎంగిడీకి ప్రోటీస్ సెలక్టర్లు రిజర్వ్ జాబితాలో చోటిచ్చారు. కేవలం ఒకే బ్లాక్ ఆఫ్రికన్‌కు జట్టులో చోటు ఇవ్వడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. సెలక్టర్ల నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రీడా మంత్రి ఫికిలే మాబులా సైతం తప్పుబట్టాడు."టీ20 వరల్డ్‌కప్-2024కు ప్రోటీస్ టీమ్‌లో కేవలం ఒక్క బ్లాక్ ఆఫ్రికన్ ఆటగాడికి మాత్రమే చోటు దక్కింది. ఇది సరైన నిర్ణయం కాదు. ఇటువంటి నిర్ణయాలు జాతీయ క్రికెట్ జట్టులో చోటు ఆశిస్తున్న ఆటగాళ్లందరికి సరైన న్యాయం దక్కేలా చేయవు" అంటూ మాబులా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.తాజాగా ఇదే విషయంపై ప్రోటీస్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీకి ముందు ఇటువంటి వివాదాలు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బ తీస్తాయని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు."టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఇటువంటి చర్చలు నిజంగా సిగ్గు చేటు. ఇదేమి మనకు కొత్త కాదు. ఇది దేశానికే అవమానం. కానీ ఇటువంటి వివాదాలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తాయి. అదృష్టవశాత్తూ ఈ సారి అక్కడ జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ప్రస్తుతం కేవలం ప్రేక్షకుడిగానే ఉన్నా. గతంలో కూడా ప్రపంచకప్‌కు ముందు ఇటువంటి వివాదాలు తలెత్తాయి. ఇక వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అద్భుతంగా ఉంది. లుంగి ఎంగిడీ విషయంలో సెలక్టర్లు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతడు తన ఫామ్‌ను కోల్పోయాడు.అదే విధంగా గాయాలతో కూడా పోరాడుతున్నారు. అందుకే అతడికి ప్రధాన జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ ఎంగిడీ ప్రధాన జట్టులో ఉండి ఉంటే ఎటువంటి వివాదాలు తలెత్తేవి కావు. కొన్నిసార్లు జట్టు ఎంపికలో ఇలాంటివి జరుగుతాయి. టీమ్ కాంబనేషన్కు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడకూడదని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్ కోచ్‌గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే! -
IPL 2024: యూనివర్సల్ బాస్‌తో కన్నడ బ్యూటీ.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
ఆర్సీబీ వరుస వైఫల్యాలపై ఏబీడీ కామెంట్స్.. కోహ్లి గనుక
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాజా ఎడిషన్‌ను ఆర్సీబీ మరీ చెత్తగా ఏమీ ఆరంభించలేదని.. అలా అని అంతగొప్పగా ఏమీ రాణించడం లేదని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. చెపాక్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి సత్తా చాటింది. కానీ.. ఆ తదుపరి వరుసగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడి విమర్శల పాలైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి తప్ప ఇతర ప్రధాన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడం వల్ల వరుస ఓటములు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ ఆట తీరుపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఆర్సీబీ ప్రదర్శన మరీ చెత్తగానూ.. అంత గొప్పగానూ లేదు. కనీసం ఇంకో రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే వాళ్లు తిరిగి పుంజుకోగలరు. రేసులో ముందుకు వెళ్లగలరు. విరాట్‌కు ఈ సీజన్లో శుభారంభమే లభించింది. అతడు ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నాను. మిడిల్ ఓవర్లలో అతడి అవసరం ఆర్సీబీకి ఎంతగానో ఉంది. మొదటి ఆరు ఓవర్లలో అతడు దంచికొడుతుంటే చూడటం బాగుటుంది. ఫాఫ్ కూడా కాస్త రిస్క్ తీసుకోవాల్సిందే. ఏదేమైనా విరాట్ 6- 15 ఓవర్ల వరకు క్రీజులో ఉంటేనే ఆర్సీబీ అనుకున్న లక్ష్యాలను సాధించగలదు’’ అని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆర్సీబీ ‘స్టార్’ బ్యాటర్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్ ఇంత వరకు బ్యాట్ ఝులిపించలేకపోయారు. ఇక తదుపరి బెంగళూరు జట్టు శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్ వేదికగా ఏప్రిల్ 6న ఈ మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై 📸: 𝙃𝙤𝙡𝙙 𝙩𝙝𝙖𝙩 𝙥𝙤𝙨𝙚 👑 #RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/UW5tZft1lQ — JioCinema (@JioCinema) April 2, 2024 -
'సన్ ఆఫ్ ఢిల్లీ'.. అతడి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా: ఏబీడీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. రోడ్డు ప్రమాదం కారణంగా గత 14 నెలలకు ఆటకు దూరంగా ఉన్న రిషబ్.. తిరిగి ఐపీఎల్-2024తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్లో పాల్గోనేందుకు పంత్‌కు ఏన్సీఏ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. దీంతో అతడి రీ ఎంట్రీకి కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను 'సన్ ఆఫ్ డిల్లీ'గా ఏబీడీ అభివర్ణించాడు. "సన్ ఆఫ్ డిల్లీ(పంత్) పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. అతడు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. పంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. పంత్ జెర్సీ నెం 17. నా జెర్సీ నెంబర్ కూడా పదిహేడే. రిషబ్ ఆట అంటే నాకు ఏంతో ఇష్టం. అతడికి ఐపీఎల్లో సెంచరీ కూడా ఉంది. పంత్ రీ ఎంట్రీలో కూడా సత్తాచాటాలని కోరుకుంటున్నానని" తన యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ 360 పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో పంత్ నాయకత్వంలోనే ఢిల్లీ బరిలోకి దిగనుంది. గతేడాది అతడి గైర్హజరీలో ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
'వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం.. అయినా అతడికి ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఇంగ్లండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు నామమాత్రపు ఐదో టెస్టుకు సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు రజిత్ పాటిదార్‌పై వేటు వేయాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు కేవలం 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పాటిదార్‌ను పక్కన పెట్టాలని మెన్జ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాటిదార్‌కు మద్దతుగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిలిచాడు. పాటిదార్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరో అవకాశం ఇవ్వాలని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో రజిత్ పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. తనకు జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయాడు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా ఆడకున్నా ఫలితాలు జట్టుకు అనుకూలంగా వస్తున్నప్పుడు మనం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతడి అటిట్యూడ్ బాగా ఉండి, డ్రెస్సింగ్ రూమ్‌లో అందరికి నచ్చితే కెప్టెన్ రోహిత్ శర్మ మెనెజ్‌మెంట్‌తో మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే పాటిదార్ మాత్రం అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతానికి అతడు పరుగులేమీ చేయకున్నా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి చూడండి తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
కోహ్లీ ఆడక పోవడానికి అసలు కారణం ఇదే..!
-
తూచ్.. అంతా అబద్ధం: కోహ్లి విషయంలో డివిలియర్స్ యూటర్న్
AB de Villiers Apology For Spreading False Information: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట మార్చాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల గురించి తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానంటూ బాంబు పేల్చాడు. కోహ్లి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలు చూపుతూ తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి కుటుంబ సభ్యుల గురించి వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వదంతులు అతడి భార్య అనుష్క గర్భవతి అని.. అందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యానే అతడు ఆటకు దూరమయ్యాడని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, తమ తల్లి సరోజ్ ఆరోగ్యంగానే ఉందని కోహ్లి సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన యూట్యూబ్ చానెల్లో డివిలియర్స్ మాట్లాడుతున్న సందర్భంలో కోహ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘కోహ్లి బాగానే ఉన్నాడు. కోహ్లి దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’’ అని ఏబీడీ తెలిపాడు. దీంతో కోహ్లి- అనుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతా అబద్ధం.. నేనన్న మాటల్లో నిజం లేదు ఏబీ డివిలియర్స్ ఈ వార్తను ధ్రువీకరించాడంటూ పలు వార్తా సంస్థలు కూడా ప్రముఖంగా కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నిజానికి నా యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఆరోజు నేను ఓ పెద్ద తప్పు చేశాను. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా అతడు బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా. ఆట నుంచి తను ఎందుకు విరామం తీసుకున్నాడో తెలియదు. అయితే, మరింత రెట్టించిన ఉత్సాహంతో.. సరికొత్తగా కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టుకు కోహ్లి తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ మొదలుకానుంది. చదవండి: మహా క్రీడా సంబరం: విశాఖలో ఫైనల్ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు! ముగింపు వేడుకలు ఆరోజే -
Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం
ABD- Virat Kohli-Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి గల కారణం వెల్లడైంది. సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు. అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్‌మెషీన్‌కు లేదంటూ కింగ్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు ఏబీడీ. మా అమ్మ బాగానే ఉన్నారు కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ.. హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి కోహ్లి వైదొలిగినట్లు తెలిపింది. అయితే, ఇందుకు గల కారణం గురించి స్పష్టతనివ్వకపోవడంతో కోహ్లి కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చెందాయి. గర్భవతి అయిన భార్య కోసం సమయం వెచ్చించేందుకు కోహ్లి బ్రేక్ తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్యం వల్లే సెలవులో ఉన్నాడని ఇంకొందరు.. బీసీసీతో విభేదాల వల్లే ఇలా అని మరికొందరు నెట్టింట ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి.. తమ తల్లి సరోజ్ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఏబీ డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు. అవును.. మళ్లీ తండ్రికాబోతున్నాడు కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. ‘‘తను బాగున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని నేను అనుకుంటున్నా. కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు తను కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది విరాట్.. ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమో. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విరాట్ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దు’’ అని స్పష్టం చేశాడు. Ab De Villiers said - "Virat Kohli and Anushka Sharma expecting their second child, so Virat Kohli is spending his time with his family". (On ABD YT)#viratkohli #anushkasharma pic.twitter.com/XDqx76ZfeX — 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) February 3, 2024 వామికకు తోబుట్టువు రాబోతోంది కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను 2017లో పెళ్లాడాడు విరాట్ కోహ్లి. వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించగా.. రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని డివిలియర్స్ వ్యాఖ్యలతో తేలిపోయింది. దీంతో మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడేమో అన్న సందిగ్దానికి తెరపడినట్లయింది. చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్ -
ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు..!
-
అతడి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నా: డివిలియర్స్
వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఊవ్విళ్లరూతోంది. ఇక వైజాగ్ టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో రెండో టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అయితే జడ్డూ స్ధానంలో కుల్దీప్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం కాగా.. రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్, రజిత్ పాటిదార్ ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఛాన్స్ ఇవ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతమైనది. భారత జట్టు తరపున డెబ్యూ చేసేందుకు సర్ఫరాజ్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అతడు 66 ఇన్నింగ్స్‌లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు. అదే విధంగా 14 సెంచరీలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో సైతం అతడు సత్తచాటుతాడని ఆశిస్తున్నాను. మరోవైపు రజత్ పాటిదార్ కూడా డొమాస్టిక్ క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి ఎవరికి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలని" తన యూట్యూబ్ ఛానల్లో ఏబీడీ పేర్కొన్నాడు. -
విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. కాగా 2023లో కోహ్లి వింటేజ్ విరాట్ కోహ్లిని గుర్తుచేస్తూ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాట్ ఝులిపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్లో ఈ వన్‌డౌన్ బ్యాటర్ 11 ఇన్నింగ్స్‌లో కలిపి 765 పరుగులు సాధించాడు. తద్వారా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న వన్డే సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి 2023లోనే బద్దలు కొట్టాడు. ప్రపంచకప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన 50వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి.. వన్డే రారాజుగా అవతరించాడు. సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు కాగా విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మాజీ క్రికెటర్ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు. -
T20 WC: ఈసారి టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: డివిలియర్స్
AB de Villiers Comments on Virat Kohli and Rohit Sharma: అంతర్జాతీయ టీ20లలో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనంపై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్-2024కు ముందు వారిద్దరిని జట్టులోకి రప్పించి మంచి పని చేశారంటూ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఐసీసీ టోర్నీలలో ఇలాంటి సీనియర్ స్టార్లను ఆడించడం వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి రాకతో యువ క్రికెటర్లు మరి కొంతకాలం వేచి చూడక తప్పదని.. అయితే.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని పేర్కొన్నాడు. సెమీస్‌లో నిష్క్రమణ.. అనేక మార్పులు కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యంపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అనేక తర్జనభర్జనల అనంతరం మరోసారి చేతన్ శర్మకే చీఫ్ సెలక్టర్ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లపై అతడి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేటు వేసింది. చర్చోపర్చల అనంతరం భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచే రోహిత్, కోహ్లి దూరం సెలక్టర్ల సంగతి ఇలా ఉంటే.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఈ క్రమంలో 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచకప్-2024కు ముందు భారత్ ఆడనున్న చివరి సిరీస్ ఇదే కావడంతో వీరిద్దరి పునరాగమనం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా ఈవెంట్లో వీళ్లను ఆడించేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాహిత్ ద్వయం రాకను సౌరవ్ గంగూలీ, సునిల్ గావస్కర్ వంటి వారు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాజీలు మాత్రం విమర్శిస్తున్నారు. వీరిద్దరి కారణంగా రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు కరువవుతాయని పేర్కొంటున్నారు. అందుకే వాళ్లను విమర్శిస్తున్నారు ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ‘‘రోహిత్, కోహ్లి విషయంలో విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోగలను. ఏదేమైనా త్వరలోనే క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగబోతోంది. ఒకవేళ కోహ్లి ఆడేందుకు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా అతడిని ఆడించాలి. వయసుతో సంబంధం లేకుండా పాత కోహ్లిని గుర్తుచేస్తూ అతడు ముందుకు సాగుతున్నాడు. 20 ఏళ్ల కుర్ర ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 35 ఏళ్ల వయసులో నాకు ఇలాంటి సపోర్టు ఉంటే రోహిత్, విరాట్ ఉంటే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలుస్తుందని మేనేజ్మెంట్ భావిస్తే కచ్చితంగా వాళ్లను ఆడిస్తుంది. నిజానికి 35 ఏళ్ల వయసులో ఉన్నపుడు నాకు కూడా మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి మద్దతు ఉంటే ఎంతో బాగుండేది. ఈసారి ప్రపంచకప్ టీమిండియాదే ఏదేమైనా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు కోహ్లి, రోహిత్‌లను పిలిపించడం ద్వారా వాళ్లిద్దరు టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ భాగమవుతారని బీసీసీఐ తన ఉద్దేశాన్ని తెలియజేసింది. ఇది సరైన నిర్ణయం. అత్యుత్తమ ప్లేయర్లను ఆడించాలని భావించిన టీమిండియా ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది’’ అని డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జనవరి 11 నుంచి అఫ్గన్‌తో టీమిండియా సిరీస్ ఆరంభం కానుంది. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 4 నుంచి ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 రూపంలో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
నేను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు వీరే: ఆసీస్ స్టార్ స్పిన్నర్
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్‌గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు. కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్మెషీన్దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్‌లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్‌లో 96కు పైగా స్ట్రైక్‌రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు.. టెస్టుల్లో లియోన్‌పై డివిలియర్స్‌ది కూడా పైచేయే! అతడి బౌలింగ్‌లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, టెండుల్కర్‌కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్‌లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు. కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్‌తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్‌లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
వాళ్లిద్దరికి అంత మొత్తమా? ముంబై మాత్రం తెలివిగా రూ. 15 కోట్లకే: ఏబీడీ
ఐపీఎల్ వేలం-2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించాయని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఉన్న వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని ఊహించలేదన్నాడు. కాగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఆక్షన్‌లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయగా.. స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే వీరిద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఏబీ డివిలియర్స్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈసారి వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు స్మార్ట్‌గా వ్యవహరించాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగాలకు తావులేకుండా తెలివిగా కొనుగోళ్లు చేశాయి. నిజానికి కమిన్స్, స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే! అయితే, వాళ్ల కోసం అంత భారీ మొత్తం వెచ్చించాలా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న మాట నిజమే! అందుకే ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ముందుగా చెప్పినట్లు ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నువాన్ తుషార, దిల్షాన్ మధుషాంక అద్భుతమైన క్రికెటర్లు. ఇక మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ధరకే వాళ్లిద్దరు ముంబైకి లభించారు. ముఖ్యంగా.. కొయెట్జీ, మధుషాంక, తుషారలను కలిపి 15 కోట్ల రూపాయలకే సొంతం చేసుకోవడం నాకు నచ్చింది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా పేస్‌త్రయం గెరాల్డ్ కొయెట్జీని రూ. 5 కోట్లు, దిల్షాన్ మధుషాంకను రూ. 4.5 కోట్లు, నువాన్ తుషారను రూ. 4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక నబీ కోసం రూ. 1.5 కోట్లు, గోపాల్ కోసం రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు నామన్ ధిర్‌ను రూ. 20 లక్షలు, అన్షూల్ కాంబోజ్‌ను రూ. 20 లక్షలు, శైవిక్ శర్మను రూ. 20 లక్షలకు ఐపీఎల్-2024 వేలంలో ముంబై కొనుగోలు చేసింది. -
రోహిత్ శర్మను తప్పించడం సరైన నిర్ణయం: డివిలియర్స్
AB de Villiers backs MI's decision: కెప్టెన్ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్ సరైన నిర్ణయం తీసుకుందని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కానీ హార్దిక్ పాండ్యా నియామకం విషయంలో ఎంఐ అభిమానుల నుంచి ఇంతటి నెగిటివిటీని ఊహించలేదన్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఫ్రాంఛైజీ పట్ల విశ్వాసంగా ఉన్న మాట వాస్తమేనన్న డివిలియర్స్.. ఇప్పుడు హార్దిక్ తిరిగి వచ్చినందు వల్ల అతడికి పగ్గాలు అప్పజెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. రోహిత్ శర్మను తప్పిస్తూ ముంబై తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024కు ముందు తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తనకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కి మళ్లీ ఆడేందుకు సిద్ధమైన పాండ్యా ఈసారి కెప్టెన్‌గా అవతారమెత్తనున్నాడు. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు ఇదిలా ఉంటే.. ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని పాండ్యాను సారథి చేయడంతో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లెజెండ్ పట్ల మీరు చూపే గౌరవం ఇదేనా.. "RIP MUMBAI INDIANS" అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐ ఇన్‌స్టా, ఎక్స్ పేజీల ఫాలోవర్లు లక్షల్లో తగ్గిపోయారు. బ్యాటర్‌గా ఆటను ఆస్వాదించాలనే? ఈ విషయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించి ఏబీడీ.. ‘‘ఈ వార్త తెలిసిన తర్వాత కొంతమంది సంతోషపడితే.. మరికొంత మంది బాధపడుతున్నారు. అంతేకాదు కెప్టెన్ మార్పు ప్రకటన తర్వాత ఎంఐ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కోల్పోయిందని చదివాను. రోహిత్ స్థానాన్ని హార్దిక్ భర్తీ చేయడాన్ని చాలా మంది పర్సనల్‌గా తీసుకుని ఉంటారు. అయితే, ముంబై హార్దిక్‌ను కెప్టెన్ చేయడం చెత్త నిర్ణయమని నేను భావించను. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం తను టీమిండియా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి కనీసం ఫ్రాంఛైజీ క్రికెట్లో అయినా.. ఒత్తిడిని తగ్గించుకుని బ్యాటర్‌గా ఆటను ఆస్వాదించాలని భావించి ఉంటాడు. మరో మాట.. సూర్య, బుమ్రా ముంబై పట్ల విశ్వాసంగానే ఉన్నారు. అయితే, ఇప్పుడు హార్దిక్ తిరిగి వచ్చాడు. కాబట్టి తనను కెప్టెన్ చేయడంలో తప్పేముంది? ఈ నిర్ణయాన్ని ఎందుకింత ప్రతికూల దృష్టితో చూస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే.. ఈ ప్రతికూలత తగ్గే అవకాశం ఉందని ఈ సందర్బంగా ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. -
అందుకే సడన్‌గా రిటైర్మెంట్ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్
ఏబీ డివిలియర్స్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్.. వరల్డ్క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా భారత్‌లో అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుచుకుంటారు. అయితే 2004లో సౌతాఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్.. 2018లో సడన్‌గా ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటిలో అతడి నిర్ణయంతో యావత్తు క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అయితే తాజాగా తన అకస్మాక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్ వెల్లడించాడు. "నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాను. అయితే ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం రెండేళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృవశాత్తూ కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని" విజ్డెన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో ఏబీబీ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 20014 పరుగులు చేశాడు. -
'నిజంగా సిగ్గు చేటు'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో ప్రోటీస్‌తో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌ల కోసం ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను కూడా బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా టూర్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రం పరిమితం కావడమే తన నిరాశపరిచిందని డివిలియర్స్ తెలిపాడు. కాగా టీ20,వన్డే సిరీస్ అనంతరం దక్షిణాఫ్రికా-భారత్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక్కసారి టెస్టు సిరీస్ గెలవని టీమిండియా.. ఈసారి చరిత్రను తిరగరాయాలని పట్టుదలతో ఉంది. "భారత్-ప్రోటీస్ మధ్య కేవలం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ వుండడం ఒక సౌతాఫ్రికన్‌గా నన్ను తీవ్ర నిరాశపరిచింది. భారత్‌లో ఆడేటప్పుడు ఒక్కో సిరీస్‌కు 3 నుంచి 4 టెస్టు మ్యాచ్‌లు ఉంటాయి. ఆసీస్, ఇంగ్లండ్ కూడా భారత పర్యటనకు వెళ్లినప్పుడు 3 నుంచి 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్నాయి. టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా-భారత్‌కు గొప్ప పోటీ ఉంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సిరీస్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే పెట్టడం సిగ్గుచేటు. క్షిణాఫ్రికాకు రావడానికి భారత ఆటగాళ్లు ఇష్టపడుతున్నారు. ఈ వరల్డ్ గ్రేటేస్ట్ పోటీలో కేవలం రెండు మ్యాచ్‌లు పెట్టడం సరైన నిర్ణయం కాదు అని తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. -
IPL 2024: ధోని ఇంకో మూడేళ్లు ఐపీఎల్ ఆడతాడు!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని.. అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఏదేమైనా.. ఐపీఎల్- 2024 వేలం నేపథ్యంలో సీఎస్కే ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం తనకు సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు కాగా ఐపీఎల్-2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీజన్లో ఘోరంగా విఫలమైన చెన్నైని ధోని తన అద్భుత కెప్టెన్సీతో తదుపరి ఎడిషన్‌లో మరోసారి చాంపియన్‌గా నిలిపాడు. రికార్డు స్థాయిలో ఏకంగా ఐదోసారి ట్రోఫీ అందించాడు. అయితే.. 41 ఏళ్ల ధోని వయసు దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రిటెన్షన్ గడువు ముగిసే నేపథ్యంలో సీఎస్కే తమ రిటెన్షన్ లిస్టులో ధోనీ పేరును చేర్చడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ధోని మరో రెండు మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగే సత్తా ఉన్న ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. రిటెన్షన్‌లో అతడి పేరు చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. గత సీజన్ అతడికి చివరిది అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అతడు 2024 సీజన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. ధోని అంటే సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇంకో రెండు.. మూడు ఏళ్ల పాటు అతడు ఐపీఎల్లో కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే ఎడిషన్‌లో అతడు కనిపించనుండటం నాకు నిజంగా సంతోషాన్నిస్తోంది అని పేర్కొన్నారు. కాగా గత సీజన్లో మోకాలికి గాయమైనప్పటికీ ధోని ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు -
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2024కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఎబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ హార్దిక్ ముంబైలోకి వెళ్తే కచ్చితంగా రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. కాగా హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి 2021 సీజన్‌కు వరకు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2023 మేగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2022లో తమ జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి హార్దిక్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2023లో కూడా గుజరాత్‌ను రన్నరప్‌గా నిలిపాడు.హార్దిక్ తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. నిజంగా ముంబై ఇండియన్స్ ఇది పెద్ద వార్త. హార్దిక్ వరల్డ్ క్లాస్ క్రికెటర్. అతడు చాలా కాలంగా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. వాంఖడే స్టేడియంలో ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే రోహిత్ తన కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించేస్తాడని నేను అనుకుంటున్నాను. రోహిత్‌పై కెప్టెన్సీ పరంగా చాలా ఒత్తిడి కలిగి ఉన్నాడు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌గా కూడా అతడు కొనసాగుతున్నాడు. రోహిత్ వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా పాండ్యా తన కెరీర్లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడి 2309 పరుగులతో పాటు 53 వికెట్లు సాధించాడు. చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్ -
WC 2023: ఒకేరోజు కోహ్లి- రోహిత్ సరికొత్త చరిత్ర.. లారా, ఏబీడీ రికార్డులు బ్రేక్
ICC ODI WC 2023- Virat Kohli- Rohit Sharma: వన్డే ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగ్లా విధించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపునకు పునాది వేస్తే.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం(53)తో దానిని మరింత బలపరిచాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(34- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) రోహిత్ దూకుడు.. కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్ ఇలా పుణెలో బంగ్లాతో మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెడితే.. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని కోహ్లి విజయంగా మలిచి మరోసారి ఛేజింగ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో.. రన్‌మెషీన్ కోహ్లి పలు అరుదైన రికార్డులు సాధించగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సైతం కోహ్లితో కలిసి ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల లిస్టులో ‘విరాహిట్’ ద్వయం ఒకేరోజు(అక్టోబరు 19) టాప్-5లోకి చేరుకోవడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) లారా, ఏబీడీ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో కోహ్లి, రోహిత్.. వరుసగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను అధిగమించారు. ఈ జాబితాలో ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి.. భారత బ్యాటర్లలో సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►సచిన్ టెండుల్కర్(ఇండియా)- 2278 రన్స్- 44 ఇన్నింగ్స్‌లో ►రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 1743 రన్స్- 42 ఇన్నింగ్స్‌లో ►కుమార్ సంగక్కర- 1532 రన్స్- 35 ఇన్నింగ్స్‌లో ►విరాట్ కోహ్లి- 1286 రన్స్- 30 ఇన్నింగ్స్‌లో ►రోహిత్ శర్మ- 1243 రన్స్- 21 ఇన్నింగ్స్‌లో ►బ్రియన్ లారా- 1225 రన్స్- 33 ఇన్నింగ్స్‌లో ►ఏబీ డివిలియర్స్- 1207 రన్స్- 22 ఇన్నింగ్స్‌లో. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా
ICC Cricket World Cup 2023- India vs Australia, 5th Match: టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. బుమ్రాకు తొలి వికెట్ కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్.. ఆతిథ్య భారత జట్టుతో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆదివారం మొదలైన పోరులో టాస్ గెలిచిన కంగారూ టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మూడో ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. బూమ్ బూమ్ బౌలింగ్‌లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లి పట్టడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. సచిన్ రికార్డు బ్రేక్.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా (David Warner Record): ఈ దశలో స్టీవ్ స్మిత్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా కొనసాగుతున్న వార్నర్ ఏడో ఓవర్ రెండో బంతికి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ బాది వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) గతంలో సచిన్, డివిలియర్స్ పేరిట 19 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త అధ్యాయానికి తెరతీశాడు. గతంలో సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో ఈ మైల్స్టోన్కు చేరుకోగా.. విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ 21, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా, సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హర్షల్ గిబ్స్ 22 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు. చదవండి: CWC 2023 India vs Australia: అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. 21-year-old Jake Fraser-McGurk set a world record by scoring a 29-ball century in Australia's Marsh Cup, breaking Ab de Villiers' record of a 31-ball List A hundred! 🤯👏 pic.twitter.com/z53anVA89r — CricTracker (@Cricketracker) October 8, 2023 ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్ లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్‌లో ఫ్రేజర్ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు. టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్ మెక్‌స్వీనీ (47), జేక్ లీమన్ (25) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫ్రేజర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్ (51), డేనియల్ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోర్డన్ సిల్క్ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్ కాలెబ్ జువెల్ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. రైట్ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్ (48), వెబ్‌స్టర్ (42), వెథరాల్డ్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్-ఏ క్రికెట్లో రెండో సక్సెస్ఫుల్ రన్ చేజ్‌గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్-ఏ క్రికెట్లో సక్సెస్ఫుల్ రన్‌ఛేజ్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. -
అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ
AB de Villiers on Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు భువీ సొంతమని.. అతడు బంతిని స్వింగ్ చేసే తీరు బ్యాటర్లకు చెమటలు పట్టిస్తుందని పేర్కొన్నాడు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ స్వింగ్ సుల్తాన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా 2018లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో 1-2తో ఆతిథ్య జట్టుకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. అయితే, భారత జట్టుకు ఓటమి ఎదురైనా.. భువీ మాత్రం ఈ సిరీస్‌లో కొన్ని మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు. ఏబీడీ వికెట్ పడగొట్టాడు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా గెలిచిన మూడో మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ను 5 పరుగులకు పెవిలియన్‌కు పంపి సత్తా చాటాడు. తాజాగా ఈ విషయాలను గుర్తుచేసుకున్న ఏబీడీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భువీ అద్భుతమైన బౌలర్. అతడి నైపుణ్యాలు అమోఘం. బ్యాటర్‌ను మునివేళ్ల మీద నిలబెడతాడు. ఒకవేళ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న మన బలహీనతను క్యాష్ చేసుకుని పండుగ చేసుకుంటాడు. సెంచూరియన్‌లో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. భువీ అద్భుతం అవుట్స్వింగర్లతో నన్ను టీజ్ చేశాడు. ఎట్టకేలకు ఓ ఇన్‌స్వింగర్‌తో నా వికెట్ తీశాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే స్టంప్స్ ఎగిరిపోయాయి. భువీ పట్ల నాకెల్లప్పుడూ గౌరవభావం ఉంటుంది’’ అని డివిలియర్స్ భువనేశ్వర్ కుమార్‌ను కొనియాడాడు. టీమిండియాకు దూరం కాగా భువీకి టీమిండియాలో అవకాశాలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో అతడు ఆఖరిసారిగా ఆడాడు. వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో ప్రస్తుతం 33 ఏళ్ల భువీ లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. చదవండి: WC- Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ద్రవిడ్! ఇషాన్‌కు లక్కీ ఛాన్స్! -
ఈసారి వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్ టీమిండియా యువ బ్యాటర్: ఏబీడీ
ICC Cricket World Cup 2023 Top Scorer Prediction: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో 9 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆతిథ్య టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ టోర్నీలో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశంగా మారింది. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేసే సువర్ణావకాశం ముగింట నిలిచింది. అన్నీ మంచి శకునములే ఆసియా వన్డే కప్-2023 గెలవడంతో పాటు.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలతో పాటు గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడం.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ రాణించడం.. సూర్యకుమార్ యాదవ్ కూడా గాడిలో పడటం.. అన్నికంటే ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ వైఫల్యాలకు తెరపడటం మంచి బూస్ట్‌నిచ్చింది. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో గిల్ వరుసగా 74, 104 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈసారి టాప్ స్కోరర్ అతడే: ఏబీడీ ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని అంచనా వేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ ఈసారి వరల్డ్‌కప్‌లో శుబ్‌మన్ గిల్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. గొప్ప బ్యాటర్. అతడి టెక్నిక్ అద్భుతం. స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడబోతున్నాడు. కాబట్టి కొంతమేర ఒత్తిడి కూడా ఉంటుంది. అయినప్పటికీ నా ఎంపిక గిల్ మాత్రమే. ఎందుకంటే.. గిల్ ట్రెడిషినల్ షాట్స్‌కే ప్రాధాన్యం ఇస్తాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచగల టెక్నిక్స్ అతడి దగ్గర ఉన్నాయి. ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌గా.. అనతికాలంలోనే శుబ్‌మన్ మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతాడు. యువ ఆటగాడే అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ఆడుతున్నాడు’’ అని ఏబీ డివిలియర్స్ గిల్ ఆట తీరును విశ్లేషించాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. చదవండి: తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా.. -
'వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023కు సన్నద్దమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో రెండు వన్డేల దూరంగా ఉన్న కోహ్లి.. రాజ్‌కోట్ వేదికగా జరిగే ఆఖరి వన్డేకు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఆసియాకప్-2023లో పాకిస్తాన్‌పై అద్భుత శతకంతో చెలరేగిన కింగ్ కోహ్లి.. వరల్డ్‌కప్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకుంటే కోహ్లి వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెట్ ప్రకటించే ఛాన్స్ ఉందని ఏబీడీ బాంబు పేల్చాడు. వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడనికి కోహ్లికి ఇదే సరైన సమయమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "కోహ్లి సౌతాఫ్రికా (2027 వరల్డ్ కప్ కోసం)కు రావడానికి ఇష్టపడతాడని నాకు తెలుసు. కానీ అది చాలా కష్టం. ఎందుకంటే 2027 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ముందు 2023 ప్రపంచకప్‌పై దృష్టిపెడదాం. బహుశా విరాట్ కోహ్లి కూడా అదే చెప్పవచ్చు. ఇక భారత్ వరల్డ్‌కప్ గెలిస్తే.. కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది. అందరికి ధన్యవాదాలు. ఇక నుంచి నేను టెస్టు క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడతాను. నా కెరీర్ చివరి రోజులను ఎంజాయ్ చేస్తాను. కుటంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. మీ అందరికీ గుడ్ బై చెబుతాను అని కోహ్లి చెప్పొచ్చు. కానీ కోహ్లి ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడు ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మరి కొన్నాళ్లపాటు ఆడాలని కూడా కోహ్లి భావించవచ్చు" అని యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి గత కొంత కాలంగా భారత తరపున వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు! -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వన్డేల్లో హెన్రిచ్ క్లాసెన్ వరల్డ్ రికార్డు
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. రికార్డుల క్లాసెన్ తద్వారా క్లాసెన్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్ 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా అదే విధంగా.. వన్డే క్రికెట్ చరిత్రలో క్లాసెన్ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఒకే బౌలర్ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. గతంలో ఆడం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా మోర్గాన్ ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో క్లాసెన్ వరల్డ్ రికార్డు ఇవన్నీ ఒకెత్తైతే.. వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్ చరిత్ర సృష్టించడం వేరే లెవల్! అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(245.45 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు నాటౌట్), ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(231.41 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు, నాటౌట్) పేరిట ఉండేది. ఆడం జంపా చెత్త రికార్డు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు.. మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. దాంతో తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధికంగా ఏడుసార్లు 400 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. భారత్ ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. సిరీస్ సమం మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 పరుగులిచ్చాడు. వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా మిక్ లూయిస్ (10 ఓవర్లలో 113; ఆస్ట్రేలియా; 2006లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న చెత్త రికార్డును జంపా సమం చేశాడు. ఇక 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అలెక్స్ క్యారీ (77 బంతుల్లో 99; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 -
నాలాగే ఆడతాడు.. అతడి ఎంపిక సరైంది.. ఇక సంజూ: ఏబీ డివిలియర్స్
AB de Villiers Lauds Suryakumar Yadav: ‘‘ప్రపంచకప్ జట్టులో స్కై(SKY) పేరును చూడటం నాకెంతో ఊరటగా అనిపించింది. మీకు తెలుసా.. నేను అతడికి వీరాభిమానిని. టీ20 క్రికెట్ ఫార్మాట్లో అతడు అచ్చం నాలాగే ఆడతాడు’’ అంటూ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చిన టీమిండియా సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. టైటిల్ రేసులో పది జట్లు కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. స్వదేశంలో పన్నెండేళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న టీమిండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ టైటిల్ రేసులో నిలిచాయి. సంజూను కాదని సూర్యను ఎలా? ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5న భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వన్డేల్లో మెరుగైన రికార్డులేని.. టీ20 నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం క్రీడావర్గాల్లో చర్చకు దారితీసింది. సూర్యపై ఏబీ డివిలియర్స్ నమ్మకం.. ఒంటిచేత్తో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని... సూర్యను సెలక్ట్ చేయడం ఎందుకని కొందరు మాజీలు ప్రశ్నించారు. ఇక ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ.. తిలక్ వర్మ రూపంలో లెఫ్టాండర్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ అందుబాటులో ఉండగా సూర్య ఎంపిక ఎందుకో అర్థంకాలేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో ప్రొటిస్ లెజెండ్, మిస్టర్ 360 ప్లేయర్ డివిలియర్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సూర్య ఇప్పటి వరకు వన్డేల్లో రాణించకపోయినప్పటికీ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను తిప్పేయగల సత్తా కలిగిన వాడని కొనియాడాడు. కచ్చితంగా అతడు ఈసారి వరల్డ్‌కప్ ఆడతాడని.. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. AB de Villiers on Sanju Samson.. సంజూ అద్భుతం.. కానీ ఇక సంజూ శాంసన్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడు అన్ని రకాల షాట్లు ఆడగలడు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో సంజూ(45 బంతుల్లో 92 నాటౌట్) ఆట తీరును నాకింకా గుర్తుంది. మైదానం నలుమూలలా అద్భుత షాట్లతో అలరించాడు’’ అని డివిలియర్స్ 2018 నాటి ఇన్నింగ్స్ గుర్తు చేసుకున్నాడు. అయితే, . అయితే, వన్డే క్రికెట్ కాస్త భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. వన్డేల్లో సంజూ వర్సెస్ సూర్య అంతర్జాతీయ వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడి 24.33 సగటుతో 511 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్.. టీమిండియా తరఫున 13 వన్డేలు ఆడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు. చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!.. అస్సలు అనుకోలేదు: రోహిత్ శర్మ -
గంగూలీ కీలక వ్యాఖ్యలు.. కోహ్లినే కరెక్ట్ అన్న ఏబీడీ! ఇష్టం ఉన్నా లేకపోయినా..
Asia Cup 2023: మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో టీమిండియాలో అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే అంగీకరించాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ రిటరైన తర్వాత ఎవరూ కూడా అక్కడ నిలదొక్కుకోలేకపోయారని వ్యాఖ్యానించాడు. దీంతో చాలా కాలంగా నంబర్ 4 సమస్య భారత జట్టును వెంటాడుతోందని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు దూరంగా ఉన్న కారణంగా కాగా గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో రాణిస్తున్నప్పటికీ ఆరేడు నెలలుగా గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్‌దీ ఇలాంటి పరిస్థితే. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో మిడిలార్డర్ స్టార్లు ఇద్దరూ ఇలా ఆటకు దూరంగా ఉండటం మేనేజ్మెంట్కు కలవరపాటుకు గురిచేస్తోంది. గంగూలీ, రవిశాస్త్రి వ్యాఖ్యలకు మద్దతుగా ఏబీడీ! ప్రాక్టీస్‌లో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ అసలు సమయంలో ఎలా రాణిస్తారనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తూ.. టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సూచన చేశాడు. కోహ్లి కరెక్ట్.. ఇష్టం ఉన్నా లేకపోయినా ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానానికి విరాట్ కోహ్లి.. సరిగ్గా సరిపోతాడు. మిడిలార్డర్లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగల బాధ్యత తను తీసుకోగలడు. కోహ్లిని నంబర్ 4లో బ్యాటింగ్‌కు పంపాలన్న ఆలోచనను నేను నూటికి నూరు శాతం సమర్థిస్తా. కోహ్లికి ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు గానీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు తప్పక బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా జట్టు సమతూకంగా.. పటిష్టంగా ఉండటమే ముఖ్యం కదా’’ అని ఏబీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆసియా కప్-2023, ప్రపంచకప్-2023 టోర్నీల్లో వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో పంపాలన్న రవిశాస్త్రి, గంగూలీ వ్యాఖ్యలకు ఈ మేరకు వత్తాసు పలికాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న భారత్ పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నంబర్ 4లో కోహ్లి రికార్డు ఇలా.. వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 42 మ్యాచ్‌లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సగటున 55.21 పరుగులతో 1767 రన్స్ సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో నంబర్ 4లో స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ 20 మ్యాచ్‌లలో 805 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి. చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? -
తిలక్ హాఫ్ సెంచరీని అడ్డుకున్న హార్ధిక్.. కొట్టిపారేసిన హర్షా, ఏకీభవించిన ఏబీడీ
విండీస్‌తో మూడో టీ20లో టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయకుండా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అడ్డుకున్నాడని (తిలక్ హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు) సోషల్‌మీడియాలో పెద్ద రాద్దాంతం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హార్దిక్‌ను తప్పుబడుతూ చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు భారత మాజీలు సైతం ఈ విషయంలో అభిమానులతో ఏకీభవించారు. AB de Villiers concurs with Harsha Bhogle's perspective on Tilak Varma falling short of his half-century in the third T20I. pic.twitter.com/gGNuKR2DNI — CricTracker (@Cricketracker) August 10, 2023 తాజాగా ఇదే విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా స్పందించాడు. తిలక్ విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాన్ని అతను కొట్టిపారేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో సెంచరీ మినహా ఏదీ ల్యాండ్ మార్క్ కాదని తెలిపాడు. అసలు క్రికెట్ లాంటి టీమ్ గేమ్‌లో ల్యాండ్ మార్క్‌ల వ్యామోహం ఉండకూడదని అన్నాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీలు పరిగణలోకి తీసుకోవాలని అనుకోనని తెలిపాడు. ఈ ఫార్మాట్లో ఎంత వేగంగా పరుగులు చేశామనేది ముఖ్యమని పేర్కొన్నాడు. తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయిన విషయంలో హర్షా అభిప్రాయంతో దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఏకీభవించాడు. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ హర్షాను సమర్ధిస్తూ ట్వీట్ చేశాడు. -
'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీకి పదేళ్ల పాటు కలిసి ఆడారు. ఆర్సీబీ టైటిల్ కొట్టడంలో విఫలమైనప్పటికి ఈ జోడి మాత్రం తమ ఆటతో అభిమానులను అలరించారు. డివిలియర్స్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆర్సీబీని మాత్రం వదల్లేదు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక సందేశాన్ని విడుదల చేయడం మిస్టర్ 360కి అలవాటు. పదేళ్ల పాటు ఒకే జట్టుకు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్‌లు మంచి మిత్రులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో(కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్) సెంచరీతో మెరిసిన కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలనే కసి.. ప్రతిసారి స్కోర్ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని.. అవన్నీ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు. ''గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారు. వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్ అవ్వాలనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనది'' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. పదేళ్లు ఒకే జట్టుకు మిస్టర్ 360 క్రికెటర్‌గా డివిలియర్స్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. చదవండి: ICC T20 WC 2024: టి20 ప్రపంచకప్ 2024కు పపువా న్యూ గినియా అర్హత Kuldeep Yadav: సంచలన స్పెల్! కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ యాదవ్ కామెంట్స్ వైరల్ -
సూర్య, డివిలియర్స్నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు?
క్రికెట్లో వినూత్న షాట్లకు పెట్టింది పేరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్. గ్రౌండ్ నలువైపులా షాట్లు బాదే ఈ ఇద్దరు క్రికెటర్లు మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్స్‌గా పేరు పొందారు. స్విచ్ హిట్, స్కూప్ షాట్, స్క్వేర్‌కట్.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ పుస్తకాల్లో లేని షాట్లను కూడా వీళ్లు ఆడి అభిమానులను అలరించారు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఇద్దరు తమ వినూత్న ఆటతీరుతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్ మాత్రం సూర్య, ఏబీడీలను మించిపోయాడు. వీరిద్దరు వికెట్ల ముందు ఉండే వినూత్న షాట్లు ఆడడంలో నేర్పరులు అయితే.. ఇతను మాత్రం రూల్స్‌కు విరుద్దంగా వికెట్ల వెనకాలకు వెళ్లి మరీ స్కూప్ షాట్ ఆడాడు. బౌలర్ బంతి వేసేవరకు వెయిట్ చేసిన బ్యాటర్ ఆ తర్వాత ఒక్కసారిగా వికెట్ల వెనక్కి వెళ్లి వికెట్ కీపర్ తలపై నుంచి స్కూప్ షాట్ కొట్టి తన చర్యతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఎక్కడో కాదు మన దేశంలోనే ఒక లోకల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. వీడియో చూసిన అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ''మిస్టర్ 1080..''..''రూల్స్‌కు విరుద్దంగా క్రికెట్ ఆడి పరువు తీస్తున్నాడు.. దమ్ముంటే వికెట్ల ముందే ఉండి ఈ షాట్ ఆడి చూపించు'' అని సవాల్ చేశాడు. pic.twitter.com/WIV6zMoHZx — Out Of Context Cricket (@GemsOfCricket) June 28, 2023 I wish someone does this to me with tape ball or leather ball. — Usman Asghar (@uasghar18) June 28, 2023 Mr 1080 😵 Is that shot even legal? — ವಿಕ್ರಮ್ ಪ್ರಭು | Vikram Prabhu (@TheLostIndian18) June 29, 2023 చదవండి: అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్.. -
నయా రన్ మెషీన్ షాయ్ హోప్.. దిగ్గజాల సరసన చోటు
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అత్యంత అరుదైన జాబితాలో చేరాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్‌లో శతక్కొట్టం (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్వారా విరాట్ కోహ్లి, మైఖేల్ బెవాన్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, జో రూట్ లాంటి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా హోప్ మరోసారి వన్డేల్లో 50కిపైగా యావరేజ్ సాధించాడు. కనీసం 100 వన్డేలు ఆడి 50 అంతకంటే ఎక్కువ సగటు కలిగిన క్రికెటర్ల జాబితాలో పైన పేర్కొన్న దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. హోప్ 110 మ్యాచ్‌ల్లో 105 ఇన్నింగ్స్‌లు ఆడి 50.26 సగటున 4674 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ అందరికంటే ఎక్కువగా 274 వన్డేల్లో 57.3 సగటున 12898 పరుగులు చేశాడు. విరాట్ తర్వాత ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ మైఖేల్ బెవాన్ (232 వన్డేల్లో 53.6 సగటున 6912 పరుగులు) అత్యధిక సగటు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ (228 వన్డేల్లో 53.5 సగటున 9577 పరుగులు), ఎంఎస్ ధోని (350 మ్యాచ్‌ల్లో 50.6 సగటున 10773 పరుగులు), జో రూట్ (158 వన్డేల్లో 50 సగటున 6207 పరుగులు) ఉన్నారు. తాజాగా హోప్ వీరి సరసన చేరాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టడం ద్వారా హోప్ వన్డేల్లో తన 15వ శతకాన్ని నమోదు చేశాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు), హోప్ అత్యధిక సెంచరీలు (9), అత్యధిక హాఫ్ సెంచరీలు (18) చేసిన రెండో బ్యాటర్‌గా హోప్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవలికాలంలో హోప్ ప్రదర్శన చూసాక ఇతన్ని అందరూ నయా రన్ మెషీన్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే, నేపాల్‌తో మ్యాచ్‌లో హోప్‌తో పాటు నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో నేపాల్ తడబడుతుంది. 44 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
అతడు టీమిండియాకు దొరికిన అణిముత్యం.. మా నాన్న ఫేవరేట్ ప్లేయర్ కూడా: ఏబీడీ
ఐపీఎల్-2023లో భారత యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన సంచలన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-1లో అద్భుతమైన సెంచరీతో గిల్ చెలరేగాడు. గుజరాత్ వరుసగా రెండో సారి ఫైనల్ చేరడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది సీజన్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమానర్హం. ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో 129 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ.. 851 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఈ స్థాయికి చేరుకుంటాడని తన తండ్రి 3 ఏళ్ల క్రితమే ఊహించాడని డివిలియర్స్ తెలిపాడు. తన తండ్రికి శుభ్‌మన్ గిల్ అంటే ఎంతో ఇష్టం అని ఏబీడీ అన్నాడు. "గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు చాలా ఈజీగా భారీ సిక్స్‌లు కొట్టాడు. అది ఒక్క గిల్‌కే సాధ్యం అవుతుంది. అతడు ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక బౌలర్లకు చుక్కలు చూపించాడు. శుబ్‌మన్ గిల్ మా నాన్న ఫేవరేట్ ప్లేయర్. ఈ విషయాన్ని సీజన్ ఆరంభంలోనే నేను చెప్పాను. అదే విధంగా గిల్ఒక అద్భుతమైన ఆటగాడు అవుతాడని మా నాన్న 3 ఏళ్ల క్రితమే ఊహించారు. గిల్ భారత క్రికెట్ దొరికిన అణిముత్యం. అతడికి టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది. భవిష్యత్తులో మరింత రాణిస్తాడు. అయితే ఆర్సీబీపై అతడి ఆడిన ఇన్నింగ్స్‌కు నేను ఫిదా అయిపోయాను. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి తన జట్టును అద్భుమైన విజయాన్ని అందించాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి! -
వీడియో: ‘భారతీయన్స్’పై క్రికెటర్ ఏబీ.డివిలియర్స్ ప్రశంసలు
-
‘భారతీయన్స్’పై క్రికెటర్ ఏబీ.డివిలియర్స్ ప్రశంసలు
పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న దేశభక్తి చిత్రం ‘భారతీయన్స్’ టీజర్‌పై ప్రఖ్యాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. హీరో నీరోజ్ పుచ్చా ఉజ్వల భవిష్యత్తు ఉందని డివిలియర్స్ పేర్కొన్నారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆదరాభిమానాలు కలిగిన డివిలియర్స్ తన సినిమా టీజర్ ను మెచ్చుకోవడం, తనను అభినందించడం పట్ల నీరోజ్ పుచ్చా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జీవితాంతం డివిలియర్స్ ను గుర్తుంచుకుంటానని, ఆయన గర్వపడే స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తానని నీరోజ్ పేర్కొన్నారు. (చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
చెత్త ఫామ్...అయినా రికార్డులు సృష్టిస్తున్న హిట్ మ్యాన్
-
టీమిండియా కెప్టెన్ అతడే..ఏబీ డివిలియర్స్
-
''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా'
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ ఆడకపోయినప్పటికి ఆర్సీబీకి తన మద్దతు ఇస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్.. టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 ప్లేయర్ల జాబితాలో డివిలియర్స్ చోటు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 39.71 సగటుతో 5,162 పరుగులు చేశాడు. ఓవరాల్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 151.69 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జియో సినిమాకు డివిలియర్స్ ఇటీవలే ఇంటర్య్వూ ఇచ్చాడు. ఎన్నో విషయాలు పంచుకున్న డివిలియర్స్ కొన్ని షాకింగ్ విషయాలు కూడా చెప్పడం ఆసక్తి కలిగించింది. తాజాగా గ్లాడియేటర్ సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తానని చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. "నేను గ్లాడియేటర్ మూవీ చూసినప్పుడల్లా ఏడుస్తుంటాను. ఆ సినిమాలో ప్రతి సెకండ్‌కు ఎమోషనల్ అవుతాను. ఇటీవలే మా పిల్లలతో కలిసి ఆ సినిమాను 12వ సారి చూశాను. అందులో కాస్త హింసాత్మకా సన్నివేశం కనిపించగానే నేను వారి కళ్లు మూస్తూ చూపించాను. కానీ అప్పుడు కూడా సినిమా చూసి ఏడ్చాను." అని డివిలయర్స్ తెలిపాడు. డివిలియర్స్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే 2018లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున ఎన్నో అరుదైన మైలు రాళ్లు అందుకున్న ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఐపీఎల్లో కొనసాగాడు. 2021లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్.. ఈ టోర్నీలలో అత్యుత్తమ ఆఠగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 39.71 సగటుతో 5,162 పరుగులు చేశాడు. ఓవరాల్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 151.69 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. Thought Mr. & Mrs. De Villiers supported the same #TATAIPL team? 🤓 Well... think again 😅#HangoutWithUs to know more about @ABdeVilliers17 👉 LIVE NOW on #JioCinema - available across all telecom operators!#IPLonJioCinema #IPL2023 #KKRvRCB pic.twitter.com/6HPNZvNLYB — JioCinema (@JioCinema) April 6, 2023 -
గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు
ఐపీఎల్-2023లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన సంజూ.. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులతో రాణించాడు. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు భారత జట్టులో తగినన్ని అవకాశాలు ఇవ్వాలని మరోసారి పెద్దు ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో దుమ్ము రేపుతున్న శాంసన్.. తన బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్‌తో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్‌ను అకట్టుకున్నాడు. ఏదో ఒక రోజున భారత జట్టుకు సంజూ కచ్చితంగా నాయకత్వం వహిస్తాడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంజూ చాలా కూల్‌గా ఉంటాడని ఏబీడీ కొనియాడాడు. "సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడి కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. అతడు ఫీల్డ్‌లో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి కెప్టెన్లు చాలా అరుదుగా ఉంటారు. ఒక నాయకుడిగా వ్యుహాలు రచించడంలో కూడా అతడు ముందంజలో ఉంటాడు. జోస్ బట్లర్ వంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూంను షేర్ చేసుకోవడంతో సంజూ ఇంకా మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను. బట్లర్ వంటి కెప్టెన్, ఆటగాడు సంజూకు దొరకడం అతడి అదృష్టం. బట్లర్ నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుంటాడు. శాంసన్ రాబోయే రోజుల్లో కచ్చితంగా ఏదో ఒక ఫార్మాట్లో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు. అతడికి భారత జట్టును నడిపించడానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. సంజూకు రెగ్యూలర్‌గా ఛాన్స్‌లు ఇస్తే క్రికెట్ ప్రపంచాన్నే జయిస్తాడు" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా భారత జట్టులో శుబ్‌మన్ గిల్, పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి ఫ్యూచర్ స్టార్లు ఉన్నప్పటికీ.. శాంసన్ కెప్టెన్ అవుతాడని ఏబీడీ జోస్యం చెప్పడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో సంజూకు చోటు దక్కడమే చాలా కష్టంగా మారింది. అటువంటిది టీమిండియా కెప్టెన్ అంటే కష్టమనే చెప్పుకోవాలి. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే -
ఈసారి టైటిల్ విజేత ఆ జట్టే! కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే: డివిలియర్స్
IPL 2023- AB de Villiers- Virat Kohli: సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023 టైటిల్‌ను ఆర్సీబీ గెలవాలని తాను కోరుకుంటున్నానని.. అయితే ట్రోఫీ గెలిచే అవకాశాలు మాత్రం డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్.. ఎంట్రీలోనే అదరగొట్టింది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఇక పదహారో ఎడిషన్‌లో సీఎస్కేతో ఆరంభ మ్యాచ్‌లో గెలుపొందిన హార్దిక్ సేన.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఆర్సీబీ గెలవాలని ఉన్నా తాజా సీజన్లోనూ వరుసగా రెండు విజయాలు నమోదు చేసి జోరు మీదుంది గుజరాత్. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీతో ముచ్చటించిన డివిలియర్స్.. ఈసారి చాంపియన్ ఎవరనుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందించాడు. ‘‘విజేతను అంచనా వేయడం కష్టమే. అయితే, ఐపీఎల్ వేలం సమయంలోనే గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుతూ.. ఆ జట్టుకు చాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. అయితే, నా మనసులో మాత్రం ఆర్సీబీ ట్రోఫీ గెలవాలని ఉంది. గతేడాది బెంగళూరు అద్బుతంగా ఆడింది. ఈసారి కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కోహ్లిలో పెద్దగా మార్పులేదు.. తన సక్సెస్ మంత్ర అదే ఇక ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లిలో ఏమైనా మార్పులు గమనించారా అని ప్రశ్నించగా.. ‘‘కెప్టెన్సీ భారం నుంచి విముక్తి పొందాక తను చాలా రిలాక్సింగ్‌గా కనిపిస్తున్నాడు. నిజానికి తను అద్భుతమైన నాయకుడు. అంతర్జాతీయ స్థాయిలో.. ఐపీఎల్లో కెప్టెన్‌గా తనదైన ముద్రవేశాడు. సారథ్య బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల కుటుంబం, స్నేహితులతో కలిసి కాస్త సమయం గడపడమే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తను మునుపటి కంటే మరింత సంతోషంగా ఉన్నాడు. తన సక్సెస్ మంత్ర ఇదే అనుకుంటా’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. తన ఆట తీరులో పెద్దగా మార్పులు రాలేదని.. అయితే ఇప్పుడు కాస్త రిఫ్రెష్ అయి అద్భుత ఫామ్‌తో మునుపటి కోహ్లిని తలపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ కోహ్లి 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. చదవండి: కెప్టెన్‌గా చతేశ్వర్ పుజారా బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ -
డివిలియర్స్ కి పిల్లలంటే ఎంత ప్రేమో చూడండి
-
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ మరికొద్ది రోజుల్లో (మార్చి 31) ప్రారంభంకానున్న నేపథ్యంలో లీగ్‌లో ఇప్పటిదాకా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లి (ఆర్సీబీ తరఫున 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు) అత్యధిక వ్యక్తిగత స్కోర్: క్రిస్ గేల్ (ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 నాటౌట్) అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (6) అత్యధిక సగటు: కేఎల్ రాహుల్ (48.01) అత్యధిక స్ట్రయిక్ రేట్ (ఆండ్రీ రసెల్, 177.88) అత్యధిక హాఫ్ సెంచరీలు: డేవిడ్ వార్నర్ (55) ఫాస్టెస్ట్ ఫిఫ్టి (కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ (క్రిస్ గేల్, పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో) అత్యధిక ఫోర్లు (శిఖర్ ధవన్, 701) అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 357) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (పాల్ వాల్తాటి, ఏబీ డివిలియర్స్-19) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (క్రిస్ గేల్, 17) ఓ సీజన్లో అత్యధిక పరుగులు (విరాట్ కోహ్లి, 2016లో 973 పరుగులు) ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (క్రిస్ గేల్, రవీంద్ర జడేజా-36 పరుగులు) అత్యధిక డకౌట్లు (రోహిత్ శర్మ, మన్దీప్ సింగ్-14) అత్యధిక వికెట్లు (డ్వేన్ బ్రావో- 183) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (అల్జరీ జోసఫ్- 6/12) అత్యుత్తమ ఎకానమీ (రషీద్ ఖాన్- 6.37) అత్యధిక మెయిడిన్లు (ప్రవీణ్ కుమార్-14) అత్యధిక డాట్ బాల్స్ (భువనేశ్వర్ కుమార్-1406) అత్యధిక సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు (సునీల్ నరైన్-8 సార్లు) లీగ్ మొత్తంలో హ్యాట్రిక్‌లు: 21 అత్యధిక డిస్మిసల్స్ (వికెట్‌కీపర్‌గా): ధోని (170) అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్): ధోని (131) అత్యధిక స్టంపౌట్లు: ధోని (39) అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): సురేశ్ రైనా (109) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): నబీ (5) అత్యధిక మ్యాచ్‌లు: ధోని (234) కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: ధోని (210) కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: ధోని (123) అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు: ఏబీ డివిలియర్స్ (25) అత్యధిక టీమ్ స్కోర్: ఆర్సీబీ (263/3) అత్యల్ప టీమ్ స్కోర్: ఆర్సీబీ (49 ఆలౌట్) అత్యధిక టైటిల్స్: ముంబై ఇండియన్స్-5 -
కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే!
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులతో దుమ్మురేపిన కోహ్లి.. వన్డేల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడు. తొలి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన కోహ్లి రెండో వన్డేలో మాత్రం 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినసంగతి తెలిసిందే. ఇక చెన్నై వేదికగా బుధవారం ఇరుజట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నిర్వహిస్తున్న మిస్టర్ 360 షోకి అతిథిగా హజరయ్యాడు. ఈ షోలో విరాట్ కోహ్లికి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు నువ్వు చూసిన వారిలో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరిగెత్తే బెస్ట్ రన్నర్ ఎవరు.. అలాగే వరస్ట్ రన్నర్ ఎవరు అని అడిగాడు. ''నా దృష్టిలో ఎంఎస్ ధోని కంటే ఏబీ డివిలియర్స్ బెస్ట్ రన్నర్ అని చెబుతాను. వాస్తవానికి ధోనికి, నాకు చాలామంచి టెంపో ఉంటుంది. మాహీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే నేను సింగిల్ కోసం కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుడ్డిగా కళ్లు మూసుకుని పరిగెత్తొచ్చు. అయితే వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఏబీ డివిల్లియర్స్ తర్వాతే ఎవరైనా అని కచ్చితంగా చెప్పగలను.అతను నాకంటే వేగంగా వికెట్ల మధ్య పరిగెడతాడు. కొన్నిసార్లు నేను కూడా అతనితో పరుగులు తీయడానికి వేగాన్ని అందుకోలేక అవుట్ అయిపోతానేమోనని భయపడ్డాను. ఇక వికెట్ల మధ్య పరుగెత్తడంలో వరస్ట్ రన్నర్ అంటే చతేశ్వర్ పూజారా. అతన్ని నమ్మి పరుగెట్టాలంటే భయమేస్తుంది.పూజారాకి ఓపిక చాలా ఎక్కువ. క్విక్ సింగిల్స్ తీయాల్సిన అవసరం ఏముందని అతను నమ్ముతాడు. అందుకే పూజారాతో బ్యాటింగ్ చేస్తే అతను పిలిచే దాకా నాన్‌స్ట్రైయికింగ్‌లో పడుకోవచ్చు.. అంత టైమ్ ఉంటుంది. అందుకు నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది. 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించాం. సెంచురియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అనుకుంటా. నేను పెద్దగా పరుగులు చేయకుండానే డగౌట్‌కు చేరాను. నేను అలా వెళ్లి కూర్చొన్నాను లేదో సౌతాఫ్రికా శిబిరంలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మిడాన్ దిశగా ఆడిన పుజారా పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. ఎన్గిడి అనుకుంటా పుజారాను ఔట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పార్థివ్ పటేల్ గల్లీ దిశలో ఆడాడు. పుజారా పరుగుకు పిలవడంతో పటేల్ వెళ్లాడు. అయితే క్వినైన్ బంతిని అందుకొని పుజారా క్రీజులోకి రాకముందే బెయిల్స్ ఎగురగొట్టాడు. దీంతో పుజారా ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌కు వచ్చిన పుజారాకు చివాట్లు పెట్టాను.'' అంటూ గుర్తుచేసుకున్నాడు. Join me live on “the 360 show” 60min from now. Hit the link below or find it in my bio. We have a cool show lined up! https://t.co/P0fRiTAkiA pic.twitter.com/DhHsZ62ODT — AB de Villiers (@ABdeVilliers17) March 21, 2023 చదవండి: ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. మళ్లీ అదే ఆటతీరు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం? -
కోహ్లి కాదు, గేల్ కాదు.. ఏబీడీ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అతడే..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల తనకు ఎదురైన ఓ క్లిష్ట ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. పొట్టి క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అని ఏబీడీని ప్రశ్నించగా.. అతను తన ఆప్త మిత్రుడు విరాట్ కోహ్లి పేరు కానీ, ఆర్సీబీ మాజీ సహచరుడు, విధ్వంసకర ఆటగాడు, విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ పేరు కానీ చెప్పకుండా ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ పేరు చెప్పి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న రషీద్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రకటించడాన్ని సమర్ధించుకున్న ఏబీడీ.. రషీద్‌ను మ్యాచ్ విన్నర్‌గా పరిగణిస్తానని, మైదానంలో అతనో గర్జించే సింహమని కొనియాడాడు. రషీద్ ప్రతిసారి గెలవాలనుకుంటాడని, ఈ లక్షణమే అతన్ని ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టిందని అన్నాడు. టీ20ల్లో రషీద్‌కు మించిన బెస్ట్ ఆల్రౌండన్ను చూడలేదని చెప్పిన ఏబీడీ.. పొట్టి ఫార్మాట్లో అతను ప్రదర్శించే గట్స్‌కు సలామ్ కొట్టాడు. సూపర్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ తన మనసులో మాటను బయటపెట్టాడు. కాగా, రషీద్ ఖాన్.. 2017 ఐపీఎల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. 2017 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 5 ఎడిషన్లలో 93 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు వలస వెళ్లిన రషీద్.. ఈ సీజన్ మొత్తంలో 19 వికెట్లు పడగొట్టి, ఆ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 77 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టిన రషీద్.. 92 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 112 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రషీద్.. ఐపీఎల్‌తో పాటు ప్రపంచం నలుమూలల్లో జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొంటాడు. అతను పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ తరఫున, బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
కోహ్లి, సూర్య, బాబర్ కాదు.. అతడే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు
దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. భారత్‌లో ఏబీడికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ 360.. తన ఆటతీరుతో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా డివిలియర్స్ బాధ్యతలు చేపట్టునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రపంచక్రికెట్లో ఇప్పటివరకు తన అత్యుత్తమ టీ20 క్రికెటర్ ఎవరని ఏబీడిని అడగ్గా.. అందుకు అతడు ఏమీ ఆలోచించకుండా రషీద్ ఖాన్ అంటూ బదులు ఇచ్చాడు. "ప్రపంచ టీ20 క్రికెట్లో నా అల్ టైమ్ ఫేవరేట్ ప్లేయర్ రషీద్ ఖాన్. రషీద్ బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించగలడు. రెండు విభాగాల్లో తన జట్టుకు 100 శాతం ఎఫక్ట్ ఇవ్వగలడు. అతడు ఫీల్డ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ప్రపంచ క్రికెట్లో నెం1గా ఉండాల్సిన అర్హతలు అన్ని అతడికి ఉన్నాయి" అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత టీ20 క్రికెట్‌ను శాసిస్తున్న స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్‌ను గాని డివిలియర్స్ ఎంచుకోకపోవడం గమానార్హం. చదవండి: Faf du Plessis: దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్.. మూడేళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ! -
డివిలియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది అభిమానులను డివిలియర్స్ సంపాందించుకున్నాడు. తన విధ్వంసకర ఆట తీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేసేవాడు. ఫ్యాన్స్ అతడిని ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారు. అదే విధంగా తన సొంత దేశం దక్షిణాఫ్రికా తర్వాత ఇష్టమైనది ఇండియానే అని చాలా సందర్భాల్లో ఏబీడీ కూడా తెలిపాడు. అటువంటి డివిలియర్స్‌పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వివాదాస్పద వాఖ్యలు చేశాడు. డివిలియర్స్ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడాడని సంచలన కామెంట్స్ చేశాడు. "చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న మైదానంలో ఎబీ డివిలియర్స్ దాదాపు 8 నుంచి 10 ఏళ్ల పాటు ఆడాడు. అటువంటి ఏ ఆటగాడికైనా స్ట్రైక్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఐపీఎల్లో డివిలియర్స్ కంటే సురేష్ రైనా అద్భుతమైన ఆటగాడు. అతడు వ్యక్తిగత రికార్డులతో పాటు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉన్నాడు. కానీ డివిలియర్స్ మాత్రం కేవలం వ్యక్తిగత రికార్డులు మాత్రమే కలిగి ఉన్నాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. ఇక వివాదాస్పద వాఖ్యలు చేసిన గంభీర్‌పై ఏబీడీ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక తన ఐపీఎల్ కెరీర్లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 5162 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలతో పాటు 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: WPL 2023 MI VS GG: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన హర్మన్ -
ఉత్తమ కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి
తొట్ట తొలి ఐపీఎల్ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ.. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను అనౌన్స్ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో.. ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో సంయుక్త ప్రకటన చేశాయి. కెప్టెన్‌గా రోహిత్ 143 మ్యాచ్‌ల్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్‌తో 79 సార్లు ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్‌మ్యాన్‌నే అవార్డు వరించింది. ఉత్తమ బ్యాటర్ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నామినేట్ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్ రేట్‌తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరిలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్ రేట్‌తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్ కేటగిరిలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్‌ను వరించింది. ఉత్తమ బౌలర్ కేటగిరిలో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్ నరైన్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్ (2020), యుజ్వేంద్ర చహల్ (2022) నామినేట్ కాగా.. చహల్‌ను ఈ అవార్డు వరించింది. -
IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! అతడికి బదులు..
Former Players All Time IPL XI: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇండియన్ ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆటతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్.. 170 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అత్యధిక స్కోరు 133. ఇలా అద్భుత ప్రదర్శనతో తను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన ఏబీడీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఆల్‌టైం జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఐపీఎల్-2023 నేపథ్యంలో జియోసినిమా షో లెజెండ్స్ లాంజ్‌లో క్రిస్ గేల్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్ప, స్కాట్ స్టైరిస్ వంటి మాజీ క్రికెటర్లతో కలిపి పాల్గొన్నాడు అనిల్ కుంబ్లే. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను ఈ సందర్భంగా... చర్చలో భాగంగా తమ ఆల్‌టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను చెప్పాలని కోరగా.. కుంబ్లే.. డివిలియర్స్‌కు తన జట్టులో చోటు కష్టమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను. ఇక ఆరోస్థానంలో పొలార్డ్‌ను ఆడిస్తా’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సారథి ధోనికే తన ఓటు అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇతరుల్లో గేల్ ఓపెనర్‌గా తన పేరును తాను సూచించగా.. పార్థివ్ పటేల్ అతడికి జోడీగా విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. ఈ చర్చలో భాగంగా ఆఖర్లో పొలార్డ్‌ను కాదని డివిలియర్స్‌కే చోటిచ్చారు మిగతా మాజీలు. లెజెండ్స్ ఎంపిక చేసిన ఆల్‌టైం ఐపీఎల్ జట్టు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సునిల్ నరైన్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ -
డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
టీ20ల్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను సూర్యకుమార్ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో కొత్త యూనివర్స్ బాస్ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు. సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్, క్రిస్ గేల్‌తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్‌ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్ -
సచిన్, డివిలియర్స్ వంటి దిగ్గజాల సరసన రుతు.. రోహిత్‌తో పాటుగా
Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Prades: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాది చరిత్ర సృష్టించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో క్వార్టర్ ఫైనల్లో భాగంగా యూపీతో మ్యాచ్‌లో రుతురాజ్ ద్విశతకం సాధించాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 220 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సెమీస్‌కు చేర్చిన రుతు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దిగ్గజాలతో పాటుగా ఈ నేపథ్యంలో.. ద్విశతక వీరుడు రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్లో సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. వన్డే ఫార్మాట్లో డబుల్ సాధించిన పదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, శిఖర్ ధావన్, సమర్థ్ వ్యాస్, కరణ్ కౌశల్, పృథ్వీ షా ఈ ఘనత సాధించగా.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా మూడు సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. సిక్సర్ల వీరుడిగా.. రోహిత్ సరసన లిస్ట్- ఏ క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోకి రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు. లిస్ట్- ఏ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టింది వీరే! ►డి'ఆర్సీ షార్ట్ (2018)- ఆస్ట్రేలియా - 23 ►గెర్రీ స్నిమాన్ (2007)- నమీబియా - 17 ►ఇయాన్ మోర్గాన్ (2019)- ఇంగ్లండ్- 17 ►రోహిత్ శర్మ (2013) -ఇండియా- 16 ►ఏబీ డివిలియర్స్ (2015) సౌతాఫ్రికా - 16 ►క్రిస్ గేల్ (2015)- వెస్టిండీస్ - 16 ►సౌమ్య సర్కార్ (2019)- బంగ్లాదేశ్ - 16 ►జస్కరన్ మల్హోత్రా (2021)- అమెరికా - 16 ►రుతురాజ్ గైక్వాడ్ (2022) -ఇండియా- 16 చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
IPL 2023: ఆర్సీబీ ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే... వరుసగా 3- 4 టైటిళ్లు గెలుస్తుంది!
IPL 2023- Royal Challengers Bangalore: జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు.. విరాట్ కోహ్లి వంటి రికార్డుల ధీరులు.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు.. అయినా ఇంత వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా అపవాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఇది. కోట్లాది మంది అభిమాన గణం.. ‘‘ఈ సాలా కప్ నామ్దే(ఈసారి కప్ మాదే)’’ అంటూ గత పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్నా వారి కలలు నెరవేర్చలేకపోతోంది. గత మూడు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్నా కీలక సమయాల్లో చతికిలపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆర్సీబీ ట్రోఫీ గెలిచిందంటే వరుసగా టైటిళ్లు సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. ఇప్పటికి 15 సీజన్లు పూర్తయ్యాయనుకుంటా స్టార్ స్పోర్ట్స్ షోలో డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి 15 సీజన్లు పూర్తయ్యాయనుకుంటా.. వాళ్లు సవాళ్లను అధిగమించాలని పట్టుదలటా ఉన్నారు. ఆర్సీబీ ఒక్కసారి గెలిచిందంటే.. వాళ్లు రెండు, మూడు, నాలుగు గెలుస్తూనే ఉంటుంది. టీ20 క్రికెట్ అంటేనే అంచనాలు తలకిందులు చేసే ఫార్మాట్. పొట్టి క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల ఫలితాలు అంచనా వేయలేం. అయితే ఈసారి ఆర్సీబీ మారుతుందనే ఆశిస్తున్నా’’ అంటూ ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవాలని ఆకాంక్షించాడు. రీ ఎంట్రీ కాగా 2011లో బెంగళూరుకు ఆడటం మొదలుపెట్టిన మిస్టర్ 360 డివిలియర్స్.. 11 సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పిన ఈ ప్రొటిస్ దిగ్గజం ఈసారి ‘రీ ఎంట్రీ’ అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆటగాడినా లేదంటే మరే ఇతర పాత్రలోనైనా కనిపిస్తాడా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబరులో కొచ్చి వేదికగా జరుగనుంది. కాగా గత సీజనల్లో ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే It is no secret who @ABdeVilliers17 will be cheering for this year!#RCB fans, are you ready to chant Ee Sala Cup Namde with him?🤩 pic.twitter.com/sf5fCYJmju — Star Sports (@StarSportsIndia) November 17, 2022 -
WC 2022: ఫైనల్లో ఆ జట్లే తలపడాలి.. నా ఓటు కూడా వాళ్లకే: డివిలియర్స్
ICC Mens T20 World Cup 2022 - Final Prediction: భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన మేటి జట్లకు వరుణుడి అంతరాయం కారణంగా పరాభవం... సంచలనాలు సృష్టించిన చిన్న జట్లు.. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. కొంతమందికి ఖేదం.. మరికొంత మందికి మోదం.. ఇలా అనేకానేక భావోద్వేగాలకు కారణమైన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. విజేతగా నిలిచే క్రమంలో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు సిద్దమయ్యాయి. గ్రూప్-1 నుంచి కివీస్, ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి టీమిండియా, పాక్ సెమీ పోరులో నిలిచాయి. ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్ అభిమానులు ఫైనల్‌పై తమ అంచనాలు తెలియజేస్తూ.. ట్రోఫీ కోసం దాయాదులు మరోసారి తలపడితే చూడాలని ఉందంటున్నారు. నా ఓటు కూడా వాళ్లకే! దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఈ మేరకు.. ‘‘ఫైనల్లో పాకిస్తాన్/ఇండియా?’’ అవునా? కాదా అంటూ ట్వీట్ చేయగా.. దాదాపుగా 77 శాతం మంది అవునని ఓటు వేశారు. ఇందుకు స్పందించిన డివిలియర్స్.. ‘‘70 శాతానికి పైగా అవునని ఓటు వేశారు. అయితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా తక్కువేమీ కాదు. ఇరు జట్లు మంచి లైనప్ కలిగి ఉన్నాయి. ఫామ్‌లో ఉన్నాయి కూడా! కాబట్టి ఈ సెమీ ఫైనల్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా నా ఓటు కూడా ఫైనల్లో ఇండియా/పాకిస్తాన్ మ్యాచ్‌కే! ఉత్కంఠ రేపే మ్యాచ్ కదా’’ అంటూ తాను సైతం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థుల పోరును చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా నవంబరు 13న మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇక టీ20 వరల్డ్‌కప్ తొలి ఎడిషన్ ఫైనల్లో టీమిండియా- పాక్ తలపడగా ధోని సేన విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ అంచనాలు వేస్తూ మురిసిపోతున్నారు. అయితే, అంతకంటే ముందు ఇరు జట్లు సెమీస్‌లో గెలవాల్సి ఉంటుందని మర్చిపోవద్దు! చదవండి: IND VS ENG: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. Fantasy final indeed! So far 70% have voted Yes, but I’m sure NZ and ENG will have something to say about that. Both teams have amazing line-ups and are in good form. Gonna be two epic semi final clashes. My vote goes for an Ind/Pak final too, would be a mouth watering encounter — AB de Villiers (@ABdeVilliers17) November 7, 2022 -
ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం
క్రికెట్లో కొందరు కొడుతుంటే చూడాలనిపిస్తుంటుంది. తమ కళాత్మక ఆటతీరుతో ఆటకే అందం తెచ్చిన ఆటగాళ్లను చూశాం. ఈ తరంలో కోహ్లి, విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు ఇలాంటి కళాత్మక, సంప్రదాయ షాట్లతోనే రాణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం హిట్టింగ్‌నే మంత్రంగా జపిస్తూ ఆడుతుంటారు. వీళ్లందరిది ఒక శైలి అయితే మనకు తెలియని మూడో కోణం ఒకటి ఉంటుంది. బంతి పడితే చాలు కసితీరా బాదడమే.. అదీ మాములుగా కాదు.. క్రికెట్ గ్రౌండ్ సర్కిల్(360 డిగ్రీస్)లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి ఆటగాళ్లు కూడా అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకు చెందినవాడే టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ ఒక సంచలనం. చేసింది 25 బంతుల్లో 61 పరుగులే కావొచ్చు. కానీ అతను ఇన్నింగ్స్ ఆడిన విధానం హైలైట్ అని చెప్పొచ్చు. శరీరాన్ని విల్లులా వంచుతూ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతుంటే చూస్తున్న మనం వహ్వా అనుకుండా ఉండలేం. మాములుగా ఏ క్రికెటర్ అయినా తనకు సాధ్యమైనంత వరకు ఆడుతూ సిక్సర్లు, ఫోర్లు బాదడం చూస్తుంటాం. కానీ సూర్య ఇన్నింగ్స్ చూస్తే ఎటు పడితే అటు యధేచ్చగా షాట్లు కొట్టాడు. బ్యాక్వర్డ్, అప్పర్ కట్, లాంగాన్, లాంగాఫ్, మిడాన్, మిడాఫ్, స్క్వేర్‌లెగ్, కవర్ డ్రైవ్.. ఇలా క్రికెట్లో ఎన్ని షాట్లు ఉంటే అన్ని షాట్లను సూర్య ట్రై చేశాడు. సూర్యకుమార్ కొట్టుడు చూస్తుంటే.. ఏమా కొట్టుడు అనుకుంటూనే అతని శరీరంలో స్రింగులేమైనా ఉన్నాయా అన్న డౌట్ రాక మానదు. సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మిస్టర్ 360కి పెట్టింది పేరు. అతను బ్యాటింగ్ చేస్తుంటే గ్రౌండ్‌కు నలుమూలలా షాట్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతన్ని మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని అభివర్ణిస్తారు. కానీ సూర్యకుమార్ ఇవాళ ఏబీ డివిలియర్స్నే తలదన్నేలా కనిపిస్తున్నాడు. గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అనే పేరును సార్థకం చేసుకున్నట్లగానే అనిపిస్తుంది. అందరూ ఊహించినట్లే టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు తురుపుముక్క అయ్యాడు. అసలే కోహ్లి భీకరమైన ఫామ్‌లో ఉండడం సానుకూలాంశమనుకుంటే అగ్నికి వాయువు తోడైనట్లు సూర్యకుమార్ తన కెరీర్లోనే ఉన్నత ఫామ్‌ను కనబరుస్తూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈసారి సూర్యకుమార్ టీమిండియాకు టి20 ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. చదవండి: సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు ఇంగ్లండ్‌తో మ్యాచ్ సవాలే.. యువీలాగే సూర్య దంచికొడితే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రిషబ్ శెట్టిని కలిసిన లెజెండరీ క్రికెటర్.. సోషల్ మీడియాలో వైరల్
రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ సక్సెస్‌తో రిషబ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తాజాగా రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బెంగళూరులో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలవుతోంది. (చదవండి: కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!) రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. అందులో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, రిషబ్ కలిసి కాంతార అంటూ గట్టి అరుస్తూ కనిపించారు. రిషబ్ ఇన్‌స్టాలో రాస్తూ..' ఇది ఒక మ్యాచ్! ఈ రోజు నిజమైన 360ని కలుసుకున్నాను. మా బెంగళూరికి మళ్లీ తిరిగి వచ్చాడు..' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వీరిద్దరి సమావేశంపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ 'టూ స్టార్స్' అంటూ వ్యాఖ్యానించారు. మరో అభిమాని 'ఇద్దరు లెజెండ్స్ వావ్' అని రాసుకొచ్చారు. కాంతార చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
జెట్ లాగ్ వల్లేనేమో! ఏబీతో సూర్యను పోల్చడమేంటి?: పాక్ మాజీ కెప్టెన్
తాజాగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సూర్య ఆటతీరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను డివిలియర్స్‌తో పొల్చడాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తప్పు బట్టాడు. డివిలియర్స్‌కు ఉన్న ప్రతిభ ప్రపంచ క్రికెట్లో మరే ఏ ఇతర ఆటగాడికి లేదని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరగిన టీ20 సిరీస్‌లో సూర్య సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం సూర్య టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో డివిలియర్స్ లాంటి ఆటగాడే లేడు "ఏబీ డివిలియర్స్‌తో ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడం సరికాదు. అతడి ప్రతిభకు ఎవరూ సాటిరారు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి జట్టుకు వెన్నులో వణుకు పుడుతోంది. ఏబీడిని తొందరగా ఔటచేయలేకపోతే.. ఓటమి తప్పదని ప్రత్యర్ధిజట్టుకు ముందే తెలుసు. రూట్, విలియమ్సన్, కోహ్లితో పాటు ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా నిలిచిన డివిలియర్స్.. తన కెరీర్లో అద్భుతమైన సెంచరీలు కూడా సాధించాడు. బహుశా పాంటింగ్‌కు జెట్ లాగ్ వదిలినట్లు లేదు. అందుకే ఇలా అంటున్నాడేమో" అని సల్మాన్ బట్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. సూర్యని వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు "సూర్యకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అంత అనుభవం లేదు. అతడు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాడు. సూర్య కూడా అద్భుమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడిని డివిలియర్స్‌తో పొల్చి పాటింగ్ తొందరపడ్డాడు. ఎందుకంటే సూర్యకుమార్ ఇంకా ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఆడలేదు. ప్రస్తుతం క్రికెట్లో ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడు లేడన్నది వాస్తవం. సూర్యని ఎవరతోనైనా పోల్చాలి అనుకుంటే.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు" అని బట్ అన్నాడు. చదవండి: Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్ హుడా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా -
'టెస్టు క్రికెట్లో నేను చూసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే'
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్, జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 222 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 146 పరుగులు సాధించగా, జడేజా 104 పరుగులు చేశాడు. "నేను ఇంటి వద్ద లేకపోవడంతో అద్భుతమైన మ్యాచ్‌ను వీక్షించలేకపోయాను. కానీ హైలెట్స్‌ను మాత్రం మిస్ కాకుండా చూశాను. ఈ మ్యాచ్‌లో బౌలర్లపై ఎదురుదాడికి దిగి పంత్, జడేజా రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. నేను టెస్టు క్రికెట్లో చూసిన అత్యత్తుమ భాగస్వామ్యం" ఇదే అని ట్విటర్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(106 పరుగులు) తప్ప మిగితా బ్యాటర్ల అంతా విఫలమయ్యారు. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Haven’t been home and missed most of the Cricket action. Finished watching the highlights now. That counterattack partnership from @RishabhPant17 and @imjadeja is right up there with the best I’ve ever seen in Test Cricket! — AB de Villiers (@ABdeVilliers17) July 4, 2022 -
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ కన్ఫర్మ్
AB De Villiers To Reunite With RCB: తన ఐపీఎల్ రీ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై సౌతాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ (2023)కు తాను తప్పక అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన కోర్ జట్టైన ఆర్సీబీతో తన బంధం కొనసాగిస్తానని పక్కా చేశాడు. అయితే, క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తాడా లేక ఇతర పాత్రలో కనిపిస్తాడా అన్న అంశంపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. వయసు రిత్యా ఏబీడీ ఆటగాడిగా బరిలోకి దిగే అవకాశాలు లేవు కాబట్టి కోచ్‌గానో లేక మెంటార్‌గానో బాధ్యతలు చేపట్టవచ్చని ఆర్సీబీ అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏబీడీ ఆర్సీబీ తరఫున రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. ఏబీడీ రీ ఎంట్రీపై అతని సహచరుడు విరాట్ కోహ్లి కొద్ది రోజుల కిందటే క్లూని వదిలాడు. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్.. గతేడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. 2011 సీజన్లో ఆర్సీబీతో జతకట్టిన ఏబీడీ.. 11 సీజన్ల పాటు నిర్విరామంగా ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుకుందు అతను మూడు సీజన్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడాడు. ఆర్సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు 2 శతకాలు, 37 అర్ధ శతకాల సాయంతో 4491 పరుగులు చేశాడు. ఇటీవలే ఆర్సీబీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ ఏబీడీ చోటు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 5162 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 151.7గా ఉంది. చదవండి: వాటి మోజులో పడి దారుణంగా మోసపోయిన రిషబ్ పంత్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీ మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
ఆర్సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు ఇటీవలే ఒక కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్‌ను పరిచయం చేసింది. ఆర్సీబీ తరపున సేవలందించిన క్రికెటర్లకు ఇందులో స్థానం దక్కనుంది. అయితే ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో తొలుత చేరిన క్రికెటర్లు.. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కావడం విశేషం. కొన్నేళ్ల పాటు తమ సేవలను ఆర్సీబీకి అందించినందుకు కృతజ్ఞతగా వారిని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరుస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్లో ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హాల్ ఆఫ్ ఫేమ్‌లో జాయిన్ అయిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్, ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్లు అభినందిస్తూ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరికి ఆన్లైన్ వేదికగానే వారి పేర్లతో పాటు జెర్సీ నెంబర్ ఉన్న గోల్డ్ మెటల్ మొమొంటోతో సత్కరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో గేల్, డివిలియర్స్‌కు విడదీయరాని బంధం ఉంది. డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ 142 మ్యాచ్‌లాడి 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP — Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022 -
IPL 2022: ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ.. క్లూ ఇచ్చిన కోహ్లి
మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు, సౌతాఫ్రికన్ లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. తన మాజీ ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మళ్లీ జతకట్టనున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అతని సహచరుడు, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ క్లూని వదిలి ఆ ప్రచారం అబద్దం కాదన్న సంకేతాలు పంపాడు. మిస్టర్ నాగ్స్‌తో జరిగిన ఓ ఫన్నీ షోలో కోహ్లి మాట్లాడుతూ.. ఏబీడీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Interview of the year! Catch Virat Kohli in a relaxed, honest and fun avatar, even as Mr. Nags tries to annoy him just like he’s done over the years. 😎🤙 Tell us what the best moment from this interview was for you, in the comments section. 👨💻#PlayBold #IPL2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/vV6MyRDyRt — Royal Challengers Bangalore (@RCBTweets) May 11, 2022 రాబోయే సీజన్లో ఏబీడీ ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇవ్వవచ్చేమోనని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను వ్యక్తిగతంగా ఏబీడీని చాలా మిస్ అవుతున్నానని, అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతుంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏబీడీ అమెరికాలో గోల్ఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడని, ఎంత బిజీగా ఉన్నా ఆర్సీబీ మ్యాచ్‌లను తప్పక ఫాలో అవుతుంటాడని అన్నాడు. ఇదే సందర్భంగా నాగ్స్ కోహ్లిని ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశాడు. మీకు మూడు డక్స్ (బాతులను ఉద్దేశిస్తూ) ఉన్నాయట కదా అంటూ ఐపీఎల్ 2022లో కోహ్లి పేరిట ఉన్న మూడు గోల్డెన్ డకౌట్స్ గురించి పరోక్షంగా ప్రశ్నించాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ.. జీవితంలో అన్నీ చూడాలి కదా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఏబీడీ.. గతేడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ మే 13న పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు దాదాపుగా చేరుకున్నట్లే. చదవండి: IPL 2022: రవీంద్ర జడేజా ఔట్..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
IPL 2022: ధోని అరుదైన రికార్డు.. రైనా, పొలార్డ్‌ను వెనక్కి నెట్టి
IPL 2022 CSK Vs MI- MS Dhoni Rare Record: ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్, మిస్టర్ ఫినిషర్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా వంద పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్న సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, కీరన్ పొలార్డ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో వరుస షాట్లు బాది ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో మొత్తంగా ఉనాద్కట్ బౌలింగ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ధోని 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు సురేశ్ రైనా సందీప్ శర్మ బౌలింగ్‌లో 47 బంతుల్లో, ఏబీ డివిల్లియర్స్ కూడా సందీప్ శర్మ బౌలింగ్‌లోనే 47 బంతుల్లో, కీరన్ పొలార్డ్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 47 బంతుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక ముంబైతో మ్యాచ్‌లో మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న ధోని 28 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతికి మిస్టర్ కూల్ ఫోర్ బాదడంతో 3 వికెట్ల తేడాతో జడ్డూ సేనను విజయం వరించింది. ఐపీఎల్లో ఒక ఆటగాడి బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన బ్యాటర్లు: ఎంఎస్ ధోని- 42 బంతుల్లో- జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో సురేశ్ రైనా- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్- 47 బంతుల్లో- రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చదవండి: CSK Vs MI: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే! Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కోహ్లి ఓపెనర్‌గా వద్దు.. ఆస్ధానంలోనే బ్యాటింగ్‌కు రావాలి'
ఐపీఎల్-2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. గత ఏడాది సీజన్లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 405 పరుగులు మాత్రమే సాదించాడు. అయితే ఐపీఎల్ 2022లో కోహ్లి ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రావాలని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయ పడ్డాడు. ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోహ్లి మరింత బాధ్యత వహించాల్సిఉంటుంది అని అతడు తెలిపాడు. "గతేడాది సీజన్లో కోహ్లి ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పుడు.. మూడో స్దానం కోసం మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడారు. శ్రీకర్ భరత్ కొన్ని మ్యాచ్‌లకు మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రాగా.. కొన్ని మ్యాచ్‌ల్లో గ్లెన్ మాక్స్వెల్ వచ్చే వాడు. వారు గత సీజన్లో బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మార్పులు చేశారు. ఈ సీజన్లో కీలకమైన ఆటగాళ్లను ముందు బ్యాటింగ్‌కు పంపాలి. ఇక జట్టులో ఏబీ డివిలియర్స్ లేడు. అతడు జట్టులో ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే దినేష్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. కానీ అతడి స్ధానాన్ని కార్తీక్ భర్తీ చేయలేడు. ఫస్ట్ డౌన్లో ఒక స్ధిరమైన ఆటగాడు కావాలి. కాబట్టి కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తే జట్టుకు చాలా ఉపయోగపడుతుంది" అని చోప్రా పేర్కొన్నాడు. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్ -
IPL 2022: మళ్లీ ఆర్సీబీలోకి ఏబీడీ..?
AB De Villiers To Reunite With RCB: గతేడాది ఐపీఎల్ తర్వాత క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏబీడీ మరోసారి ఆర్సీబీతో జతకట్టనున్నాడని సమాచారం. అయితే ఈసారి క్రికెటర్‌గా కాకుండా జట్టు మెంటార్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకున్నాడని ఆర్సీబీ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆర్సీబీ తమ నూతన సారధి పేరును ఇప్పటివరకు ప్రకటించలేదు. కెప్టెన్ రేసులో డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి మాత్రం క్లారిటీ లేదు. మార్చి 12న ఓ సర్ప్రైజ్ ఉందటూ ఫ్రాంచైజీ యాజమాన్యం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ కెప్టెన్ అంశం కొలిక్కివచ్చేది లేనిది అనుమానమే. మరోవైపు జట్టుకు సంబంధించి జెర్సీని, లోగోను మార్చనున్నారని తెలుస్తోంది. చదవండి: IPL 2022 Auction Day 1: ఆ ఇద్దరి కోసం భారీగా ఖర్చు చేసిన ఆర్సీబీ...! -
సంచలన ఇన్నింగ్స్.. ధావన్ రికార్డు బద్దలు.. బేబీ ఏబీడీ సరికొత్త చరిత్ర
దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవాల్డ్ బ్రెవిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో బ్రెవిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 3న జరిగిన ప్లే ఆఫ్(ఏడో స్థానం) మ్యాచ్‌లో 130 బంతుల్లో 138 పరుగులు స్కోరు చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో మెగా టోర్నీలో ఇప్పటి వరకు మొత్తంగా 506 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2004లో భారత అండర్ 19 జట్టులో భాగమైన ధావన్ ఆ ఈవెంట్లో మొత్తంగా 505 పరుగులు చేయగా.. బ్రెవిస్ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. ఇక అండర్ 19 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెవిస్ ఒక్క పరుగు తేడాతో అగ్రస్థానానికి చేరుకోగా.. ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలను బ్రెట్ విలియమ్స్(ఆస్ట్రేలియా- 471 పరుగులు), కామెరూన్ వైట్(ఆస్ట్రేలియా- 423 పరుగులు), డెనోవాన్ పాగన్(వెస్టిండీస్- 421 పరుగులు) ఆక్రమించారు. కాగా ఈ టోర్నీలో బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 84.33 సగటుతో 506 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక బ్రెవిస్ ఆటతీరుకు ఫిదా అవుతున్న అభిమానులు అతడిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తున్నారు. బేబీ ఏబీడీ, ఏబీడీ 2.0 అంటూ ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు. కాగా ఈ ప్రొటిస్ యువ సంచలనం ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ప్రొటిస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: బంగ్లాదేశ్ అండర్- 19: 293/8 (50) దక్షిణాఫ్రికా అండర్- 19: 298/8 (48.5) చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! South Africa’s Dewald Brevis now holds the record for the most runs in a single edition of the #U19CWC 🙌 pic.twitter.com/O5UCelEIdn — ICC (@ICC) February 3, 2022 -
వాళ్లిద్దరంటే ఇష్టం.. ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం
ఐపీఎల్.. కాసులు కురిపించే లీగ్... ఒక్కసారి ఇందులో ప్రతిభ నిరూపించుకుంటే చాలు కావాల్సినంత డబ్బు... పాపులారిటీకి పాపులారిటి వస్తాయి. మరి ఇలాంటి క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనాలని ఆటగాళ్లు కోరుకోవడం సహజమే కదా! దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవాల్డ్ బ్రెవిస్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఐపీఎల్లో తనకు ఆడాలని ఉందని, అవకాశం వస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడతానని చెప్పుకొచ్చాడు. వెస్డిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో బ్రెవిస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆడిన 4 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు. లీగ్ స్టేజ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో బ్రెవిస్ ఆట తీరు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ను గుర్తు చేస్తోందంటూ.. అతడికి ఏబీడీ 2.0గా పేరు పెట్టారు ఫ్యాన్స్. అంతేగాక అతడు ఆర్సీబీ జెర్సీలో ఉన్న ఫొటో కంటపడటంతో ఐపీఎల్లో ఎంట్రీ ఇస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ... అన్ని ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. అదే విధంగా ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లి తన ఫేవరెట్ క్రికెటర్లు అన్న బ్రెవిస్... ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే... ఆర్సీబీకి ఆడతానని పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘ప్రొటిస్‌కు ఆడటం తన అతిపెద్ద కల. ఐపీఎల్‌కు నేను పెద్ద అభిమానిని. ఏబీడీ, కోహ్లి వంటి దిగ్గజాలు ఆడిన ఆర్సీబీకి ఆడటాన్ని నేను ఇష్టపడతా. ఆల్‌రౌండర్‌గా ఎదిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు... ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలోనూ ఆడాలని భావిస్తున్నా’’ అని బ్రెవిస్ తమ మనసులోని భావాలు పంచుకున్నాడు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా? India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Meet Dewald Brevis the mini AB playing for South Africa U-19 team. His last few scores in the U-19 W C 👇 97, 96, 104, 65, 50#ENGvSA #U19WorldCuppic.twitter.com/fdfGYleIR7 — Ahmer Najeeb Raja (@ahmersatti90) January 26, 2022 View this post on Instagram A post shared by Dewald Brevis (@dewald_brevis_17) -
'ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11వ సీజన్) చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సిడ్నీ సిక్సర్స్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ జట్టులోని ఆటగాళ్లు వరుసగా కోవిడ్ బారిన పడడంతో.. ఫైనల్ మ్యాచ్‌కు నిఖార్సైన 11 మంది ఆటగాళ్లు కరువయ్యారు. బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన ప్లేఆఫ్‌కు ఒక ఆటగాడు తక్కువ కావడంతో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జే లెంటెన్ను తుది జట్టులో ఆడించింది. అయితే మొయిసిస్ హెన్రిక్స్ సారధ్యంలోని సిడ్నీ సిక్సర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. పెర్త్ స్కార్చర్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. చదవండి: BBL 2021-22: మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?! ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు డేనియల్ క్రిస్టియన్ ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు.'' పెర్త్ స్కార్చర్స్‌తో శుక్రవారం బీబీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. మా జట్టులో కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌కు సరైన ఆటగాళ్లు లేరు.. మాకు కరోనా లేని ఆటగాళ్లు ఫైనల్ ఆడేందుకు కావాలి.. వస్తే వారికి ఫ్రీగా బీర్ కొనిపెడతా. మార్వెల్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు మా వార్మప్ ప్రారంభమవుతుంది. ఈలోపు వస్తే జట్టులో చోటుతో పాటు కప్ గెలిచిన తర్వాత ఫ్రీ బీర్ తాగొచ్చు. కానీ ఒక కండీషన్.. టెస్టు క్రికెటర్లకు మాత్రం చాన్స్ లేదు'' అంటూ ట్వీట్ చేశాడు. డేనియల్ క్రిస్టియన్ ఫన్నీ ట్వీట్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లు స్పందించారు. ''ఫైనల్ ఆడేందుకు నేను సిద్ధం.. కానీ బౌలింగ్‌లో 4 ఓవర్ల కోటా బౌలింగ్‌కు గ్యారంటీ ఇస్తానంటేనే..'' అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు. '' సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడేందుకు కూడా రెడీ.. కానీ మీకు ఆల్రేడీ ఉన్న సబ్‌స్టిట్యూట్‌లకు డబ్బులు చెల్లించాలేమో'' అంటూ ఆర్చర్ రీట్వీట్ చేశాడు. చదవండి: Racial Discrimination: ఆ క్లబ్లో నల్లజాతి క్రికెటర్లకు చోటు లేదా? ఇదేం వివక్ష ఇక డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగపెట్టింది. ఇప్పటికే మూడుసార్లు బీబీఎల్ టైటిల్(2011, 2020,2021) దక్కించుకున్న సిడ్నీ సిక్సర్స్.. తాజాగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. Shout out to anyone* in Melbourne that wants a game of cricket tomorrow night. My team is struggling to get 11 covid free, fit players on the park. Warm up starts at 6.30pm at Marvel Stadium. Free beer afterwards, potentially out of a large cup. DM if keen *no test cricketers — Dan Christian (@danchristian54) January 27, 2022 -
అచ్చం డివిలియర్స్‌ను తలపిస్తున్నాడు.. ఐపీఎల్ వేలానికి వస్తే!
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసానికి పెట్టింది పేరు. మిస్టర్ 360 డిగ్రీస్ పేరు కలిగిన ఏబీ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ క్షణాల్లో ఆట స్వరూపాన్నే మార్చేయగల సత్తా ఉన్నవాడు. అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను గెలిపించిన డివిలియర్స్.. ఐపీఎల్‌లోనూ అదే జోరు చూపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎక్కువకాలం ఆడిన ఏబీ తన విధ్వంసాన్ని భారత అభిమానులకు చూపెట్టాడు. చదవండి: పంత్ పాతుకుపోయాడుగా.. అదృష్టం అంటే ఇట్టానే ఉంటాదేమో! అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల ముందే గుడ్‌బై చెప్పిన డివిలియర్స్ ఇటీవలే అన్ని రకాల లీగ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఐపీఎల్లో ఇక అతని మెరుపులు కనిపించవని అభిమానులు తెగ బాధపడిపోయారు. అలా బాధపడుతున్న ఐపీఎల్ అభిమానులకు ఒక శుభవార్త. త్వరలోనే డివిలియర్స్ మెరుపులు మళ్లీ చూసే అవకాశం వచ్చింది. అదేంటి వీడ్కోలు చెప్పాడుగా.. మళ్లీ వస్తున్నాడా అని సందేహం వద్దు. చదవండి: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సన్‌రైజర్స్‌లోకి కిషన్! డెవాల్డ్ బ్రెవిస్ అనే కుర్రాడు ప్రస్తుతం అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఇరగదీస్తున్నాడు. 360 డిగ్రీస్‌లో షాట్లు కొడుతూ అచ్చం డివిలియర్స్‌ను గుర్తుచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే విధ్వంసకర షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 169 పరుగులు చేసిన బ్రెవిస్ ఖాతాలో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఉగాండాపై సెంచరీ చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. టీమిండియాపై 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌పై మరో అర్థసెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న బ్రెవిస్‌కు ఎదురులేకుండా పోయింది. ఇక టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా 65 పరుగులతో మెరిసిన డెవాల్డ్ బ్రెవిస్.. డివిలియర్స్‌ను గుర్తుచేస్తూ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తన సహచరులు డ్రెస్సింగ్ రూమ్‌లో ''బేబీ ఏబీ'' అంటూ ప్లకార్డులను పట్టుకొని ఎంకరేజ్ చేయడం వైరల్‌గా మారింది. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ వేలానికి వచ్చే అవకాశముందని పలువురు పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమై.. బ్రెవిస్‌ను కొనుగోలు చేస్తే మాత్రం డివిలియర్స్‌ను మరోసారి చూసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం.. సిక్సర్లతో వీరవిహారం 👏 Dewald Brevis caught the attention of many in the SA U19's opening #T20KO match. 🏏 How will he and the rest of the SA U19s go throughout the competition? 📲 Catch the full match highlights here https://t.co/zz5ZdsFGsZ pic.twitter.com/DYtMB79FB8 — Cricket South Africa (@OfficialCSA) October 9, 2021 Babay de-Villiers 😍 Dewald Brevis from SA U19. pic.twitter.com/xGlDtM1ruL — . (@federalite7) January 17, 2022 -
SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ
Racism In Cricket South Africa: ఆటగాళ్లుగా ఉన్న సమయంలో నల్ల జాతీయుల క్రీడాకారులపట్ల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్లపై సౌతాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారికంగా విచారణ ప్రారంభించనుంది. ప్రస్తుతం స్మిత్ సీఎస్ఏ డైరెక్టర్‌గా, బౌచర్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్లో జాతివివక్షకు సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (ఎస్‌జేఎన్) ఇటీవల ఇచ్చిన నివేదికలో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు. ఎస్‌జేఎన్ ఇచ్చిన నివేదికకు కొనసాగింపుగా ఈ అంశంపై సీఎస్ఏ మరింత సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. నివేదికలో పై ఇద్దరితో పాటు ఏబీ డివిలియర్స్ పేరు కూడా ఉంది. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ నిమిత్తం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఓవైపు సిరీస్ కొనసాగుతుండగానే.. మరోవైపు ప్రస్తుత హెడ్‌కోచ్, డైరెక్టర్‌పై సీఎస్ఏ అధికారిక విచారణకు ఆదేశించడం గమనార్హం. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! IND VS SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా.. క్రికెట్ అభిమానులకు నిరాశే.. కష్టమే ఇక! -
ఆర్సీబీ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!
AB De Villiers Could Return To RCB Batting Coach: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ.. ఫ్యాన్స్‌కు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే సీజన్‌కు గాను ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా డివిలియర్స్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్ 360తో ఆర్సీబీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంకేతాలను ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. న్యూజిలాండ్- భారత్ రెండో టెస్ట్‌లో కామెంటేటర్‌గా సంజయ్ బంగర్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు. ఏబీ డివిల్లియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్ పదవిని ఇస్తే మా జట్టు ఆటగాళ్లకి ఎంతో ఉపయోగకరమని అతడు తెలిపాడు. ‘ప్రధాన కోచ్‌గా నాకు ఎక్కువ సమయం ఉండదు. బ్యాటింగ్ కోచ్ ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆటగాళ్ల లోపాలపై దృష్టిసారిస్తాడు. అందువల్ల, ప్రతి జట్టుకు ప్రధాన కోచ్ కాకుండా బ్యాటింగ్ కోచ్ అవసరం. అందుకే ఏబీ డివిలియర్స్‌ను బ్యాటింగ్ కోచ్‌గా లేదా కన్సల్టెంట్ కోచ్‌గా నియమించడానికి ప్రయత్నిస్తున్నాం" అని బంగర్ తెలిపాడు. కాగా సంజయ్ బంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌నుంచి హెడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: అది నా డ్రీమ్ బాల్.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్ -
సగం దక్షిణాఫ్రికావాడినైతే, సగం భారతీయుడిని: ఏబీ డివిలియర్స్
మా ఇంటి వెనక అన్నయ్యలతో కలిసి క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన నాటినుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఎప్పుడూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఆటను ఆస్వాదించాను. అయితే ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి ప్రేరణ నాలో ఉండటం లేదు. దీనిని అంగీకరించాలి కాబట్టి బాధగా అనిపిస్తున్నా సరే, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. క్రికెట్ ప్రపంచం నాకు ఎన్నో గొప్ప అవకాశాలు అందించింది. అయితే ఆట నుంచి తప్పుకొని కుటుంబంతో గడిపేందుకు ఇది సరైన సమయంగా అనిపించింది. నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉన్న బెంగళూరు అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ ఫ్రాంచైజీ నా జీవితాన్ని మార్చేసింది. నేను జీవితకాలం ఆర్సీబీవాడినే. ఇన్నేళ్లుగా ఐపీఎల్ కారణంగా భారత్‌తో నా అనుబంధం మరింత పెరిగింది. ఇక్కడ గడిపిన ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. సరిగ్గా చెప్పాలంటే నేను సగం దక్షిణాఫ్రికావాడినైతే సగం భారతీయుడిని. కాగా, మిస్టర్ 360 డిగ్రీస్‌గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ సహా అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. -
'ఐ లవ్ యూ ఏబీ'.. నా గుండె ముక్కలయ్యింది
Virat Kohli Emotional Tweet After AB De Villiers.. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.. ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా శుక్రవారం ట్విటర్లో ప్రకటించాడు. డివిలియర్స్ నిర్ణయంపై ఆర్సీబీ సహచర ఆటగాడు.. చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. ''ఏబీ డివిలియర్స్.. నీ నిర్ణయం నా గుండెను ముక్కలు చేసింది. కానీ సరైన సమయంలోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇక మా కాలంలో నువ్వొక అత్యుత్తమ ఆటగాడివి. నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి. ఆర్సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. అంతేకాదు దానిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆటకు గుడ్‌బై చెప్పినప్పటికి మన బంధం బయట కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. చివరగా ఐ లవ్ యూ డివిలియర్స్.'' అంటూ ముగించాడు. కాగా కోహ్లి ట్వీట్‌పై స్పందించిన ఏబీ.. ''లవ్ యూ టూ బ్రదర్'' అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. 2011లో ఆర్సీబీలోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. కోహ్లితో కలిసి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇద్దరు కలిసి ఎన్నో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును గెలిపించారు. ఐపీఎల్లో 5వేలకు పైగా పరుగులు చేసిన డివిలియర్స్ విదేశీ ఆటగాళ్లలో అత్యంత సక్సెస్ అయిన ఆటగాడిగా నిలిచాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో ఇప్పటివరకు 184 మ్యాచ్‌లాడిన ఏబీ 5162 పరుగులు చేశాడు. This hurts my heart but I know you've made the best decision for yourself and your family like you've always done. 💔I love you 💔 @ABdeVilliers17 — Virat Kohli (@imVkohli) November 19, 2021 -
ఆర్సీబీకి బిగ్ షాకిచ్చిన ఏబీ డివిలియర్స్
AB de Villiers Announces His Retirement From All Cricket: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పుతున్నట్లు డివిలియర్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ లాంటి విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. తన వయస్సు పై బడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీడీ తెలిపాడు. ఐపీఎల్లో గత కొన్నాళ్ల నుంచి ఆర్సీబీ తరుపున ఆడుతున్న మిస్టర్ 360.. భారత అభిమానుల్లో ప్రత్యేకమైన స్ధానం సంపాందించుకున్నాడు. ఈ క్రమంలో ఏబీడీ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. చివరగా ఐపీఎల్-2021లో ఆడిన ఏబి డివిలియర్స్.. 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు డివిలియర్స్ ఆడాడు. "ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ ఆడినప్పటి నుంచి మెదలు పెడితే, నేను స్వచ్ఛమైన ఆనందంతో, హద్దులేని ఉత్సాహంతో క్రికెట్ ఆడాను. ఇప్పుడు నా వయస్సు 37 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఇదే సరైన నిర్ణయం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన అభిమానుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని డివిలియర్స్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా It has been an incredible journey, but I have decided to retire from all cricket. Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli — AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021 -
రైనా సహా 'ఆ ముగ్గురి' ఖేల్ ఖతమైనట్టే..!
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్న నలుగురు విధ్వంసకర ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా వచ్చేఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా ఆక్షన్ అమ్ముడుపోని సరుకులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే డాషింగ్ ప్లేయర్ సురేశ్ రైనా సహా ముగ్గురు విదేశీ విధ్వంసకర బ్యాటర్లు ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. విదేశీ బ్యాటర్ల లిస్ట్‌లో యూనివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందువరుసలో ఉంటాడని, అతని వెనకాలే కోల్‌కతా నైట్‌రైడర్స్ సారధి, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆతరువాత రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నలుగురితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన డానియల్ క్రిస్టియన్(ఆర్సీబీ-4.8 కోట్లు), రిలే మెరిడిత్(పంజాబ్ కింగ్స్-8 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(రాజస్థాన్ రాయల్స్-3 కోట్లు), టామ్ కర్రన్(ఢిల్లీ క్యాపిటల్స్-5.25 కోట్లు), జై రిచర్డ్సన్(పంజాబ్ కింగ్స్-14 కోట్లు)లు కచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చింది కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. చదవండి: మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ -
Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే
Sunil Narine Was Only 2nd Bowler Dismiss RCB Trio.. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ మ్యాచ్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసి గేమ్ చేంజర్‌గా నిలిచాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ త్రయం కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్ చేర్చిన నరైన్ ఒక కొత్త రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్‌లో ఈ త్రయాన్ని ఒక బౌలర్ వెనక్కి పంపడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్‌ప్రీత్ బార్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, ఏబీలను వెనక్కి పంపిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇక కేకేఆర్ అక్టోబర్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఇప్పటికే సీఎస్కే జట్టు ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్‌న్యూస్ ఐపీఎల్లో నరైన్ అందుకున్న కొన్ని రికార్డులు పరిశీలిస్తే.. ►ఐపీఎల్లో నరైన్ ప్లేఆఫ్స్‌లో రాణించిన రెండు సందర్భాల్లోనూ కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను గెలవడం విశేషం. ఇక మూడో టైటిల్ కోసం కేకేఆర్ వేట కొనసాగుతుంది. ►ఐపీఎల్ చరిత్రలో లీడింగ్ వికెట్ టేకర్ జాబితాలో నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. 132 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు పడగొట్టాడు. ► ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్లలో నరైన్ అగ్రభాగంలో ఉన్నాడు. చదవండి: IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు pic.twitter.com/ITc0bcd44c — Cricsphere (@Cricsphere) October 11, 2021 pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ
AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్ 2021లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత సెకండ్‌ఫేజ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్, కోహ్లి, మ్యాక్స్‌వెల్, కేఎస్ భరత్ కీలకపాత్ర పోషించారు. అయితే సీనియర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌కు మాత్రం యూఏఈ గడ్డ ఏమాత్రం కలిసిరాలేదు. ప్లేఆఫ్స్‌తో కలిపి డివిలియర్స్ 8 మ్యాచ్‌ల్లో 17.66 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 0,12,11,4, 23, 19, 26,11 ఇవి డివిలియర్స్ యూఏఈ గడ్డపై నమోదు చేసిన స్కోర్లు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్‌లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్‌లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
T20 World Cup: అతడొక విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. ఇక కోహ్లి: రషీద్ ఖాన్
మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ మొదలుకానుంది. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న పొట్టి ఫార్మాట్ మెగా టోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో.. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు యూఏఈకి పయనమయ్యారు. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రతీ వార్త ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 ఫార్మాట్లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. ఇందులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు, ఒక న్యూజిలాండ్, వెస్టిండీస్ క్రికెటర్, దక్షిణాఫ్రికా స్టార్‌కు చోటిచ్చాడు. వారు ఎవరంటే! విరాట్ కోహ్లి.. టీమిండియా కెప్టెన్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథిగా విరాట్ కోహ్లి పేరిట పలు రికార్డులు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో మొత్తంగా అతడు.. 10,136 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 3159 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్.. కోహ్లి గురించి మాట్లాడుతూ... ‘‘ఎలాంటి వికెట్‌పై అయినా ధీటుగా నిలబడి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరచగల ఆటగాడు’’అని అభివర్ణించాడు. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. టీ20 ఫార్మాట్లో 5429 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 125.08 స్ట్రైక్‌రేటుతో 1805 రన్స్ సాధించాడు. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ సహచర ఆటగాడైన రషీద్ ఖాన్... కివీస్ సారథి గురించి చెబుతూ తాను ప్రశాంతంగా ఉంటూ.. జట్టును కూడా కూల్‌గా ముందుకు నడిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఏబీ డివిల్లియర్స్(దక్షిణాఫ్రికా) సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిల్లియర్స్‌ను విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా రషీద్ ఖాన్ అభివర్ణించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎదురుగా ఎలాంటి బౌలర్ ఉన్నా విరుచుకుపడటమే తనకు అలవాటు అని ప్రశంసలు కురిపించాడు. తనలాంటి బ్యాటర్ జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడని కితాబిచ్చాడు. టీ20 ఫార్మాట్లో మొత్తంగా 9424 పరుగులు చేసిన ఏబీడీ... అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1672 రన్స్ చేశాడు. ఐపీఎల్లో ఏబీ... ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కీరన్ పొలార్డ్(వెస్టిండీస్) విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను తన ఫేవరెట్ ఆటగాళ్లలో ఒకడిగా రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్‌గా తనకు స్థానం కల్పిస్తానన్నాడు. కాగా టీ20 ఫార్మాట్లో మొత్తంగా... 11,236 పరుగులు చేసిన పొలార్డ్... అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1378 పరుగులు చేశాడు. అంతేగాకుండా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా 300 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. 2012లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విన్నర్‌గా నిలిపిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా(టీమిండియా) మరో ఆల్‌రౌండర్‌గా భారత ఆటగాడు హార్దిక్ పాండ్యాను ఎంచుకున్నాడు రషీద్ ఖాన్. పొలార్డ్, పాండ్యా వలె బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే వాళ్లు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. వారిద్దరు ఉన్నారంటే కెప్టెన్‌కు పని కాస్త సులువు అవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 2728 పరుగులు చేయగా... అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 484 రన్స్ సాధించాడు. చదవండి: T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా! -
IPL 2021: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా: విరాట్ కోహ్లి
Virat Kohli Reveals Why he Decided to Step Down as RCB Captain ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులను విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కెప్టెన్‌గా ఎందుకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడో కోహ్లి తాజాగా వెల్లడించాడు. నేడు( సోమవారం) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది. ఈ క్రమంలో అతడు, డివిలియర్స్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ వర్చువల్ ఇంటర్వూలో పాల్గొన్నాడు. తన నిర్ణయం వెనుక పనిభారం అతిపెద్ద కారణమని కోహ్లి పేర్కొన్నాడు. ఇక బాధ్యతల విషయంలో తాను నిజాయతీ లేకుండా వ్యవహరించలేని విరాట్ తెలిపాడు. 'కెప్టెన్‌గా తప్పుకోవడానకి పనిభారం ప్రధాన కారణం. నా బాధ్యత పట్ల నేను నిజాయితీ లేకుండా వ్యవహరించలేను. నేను దేనినైనా వందకు 120% ఇవ్వలేకపోతే, దానిని పట్టుకొని వేలాడే వ్యక్తిని కాను. ఈ విషయంలో నేను క్లియర్‌గా ఉంటాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతున్నప్పుడు కోహ్లి చెప్పాడు. కాగా 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోహ్లి ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. ఇక టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ ఇంతవరకు బెంగళూరు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్ Curious to know what prompted @imVkohli to step down from captaincy? 🤔 The #RCB skipper reveals the reason on #InsideRCB: Tomorrow, 8:30 AM & 12 PM | Star Sports 1/1HD/2/2HD pic.twitter.com/rqcIdonx5o — Star Sports (@StarSportsIndia) October 10, 2021 -
Michael Vaughan: ఆర్సీబీ ఓడిపోవడమే మంచిదైంది.. అసలు..
Michael Vaughan Lashes Out At RCB Management: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు తీసుకున్న నిర్ణయాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి వారికి ఒక విధంగా మంచే చేసిందన్నాడు. ఇప్పటికైనా... లోపాలు సరిదిద్దుకోవాలని సూచించాడు. కాగా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ, ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టు సన్‌రైజర్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విలియమ్సన్ సేన 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో... పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకుని పటిష్ట స్థితిలో ఉండాలనుకున్న కోహ్లి సేనకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ... ఆర్సీబీ తీరును తప్పుబట్టాడు. ముఖ్యంగా హిట్టర్ డివిల్లియర్స్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడమేంటని విమర్శించాడు. ఈ మేరకు... ‘‘ఓడిపోవడం ఆర్సీబీకి మంచిదైంది. ఇప్పటికైనా వారి బ్యాటింగ్ ఆర్డర్ మరీ అంత గొప్పగా ఏమీ లేదని తెలిసి వచ్చింది. డాన్ క్రిస్టియన్(డానియల్ క్రిస్టియన్)ను మూడో స్థానంలో అస్సలు బ్యాటింగ్‌కు పంపకూడదు. 35 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అది అస్సలు సరికాదు. 60 బంతుల్లో సెంచరీ చేయగల సమర్థుడు తను. తనను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపితే.. మ్యాచ్‌ను గెలిపించేవాడు. గ్లెన్ మాక్స్వెల్ మూడో స్థానంలో, డివిల్లియర్స్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు. స్కోర్లు: హైదరాబాద్: 141/7 (20) బెంగళూరు: 137/6 (20) చదవండి: Umran Malik: అతడు ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడు... -
తండ్రి ఔట్ కావడంతో కుర్చీని లాగి కొట్టిన ఏబీడీ కొడుకు.. వైరల్ వీడియో
AB de Villiers’ son expresses disappointment: ఐపీఎల్2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఆదివారం మంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే చెలరేగి ఆడతాడు అనుకున్న డివిలియర్స్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అతడి భార్య, పిల్లలను డివిలియర్స్ ఔట్ కావడం తీవ్ర నిరాశపరిచింది. ముఖ్యంగా డివిలియర్స్ కుమారుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో తన ముందు వరుసలో ఉన్న కుర్చీపై చేతితో బలంగా గుద్దాడు. అయితే, కొడుకు రియాక్షన్ చూసి పక్కన ఉన్న అతని తల్లి షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఏబీడీ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: బిగ్‌బాష్ టి20 లీగ్‌లో తొలిసారిగా ఆడనున్న భారత స్టార్ ఆల్‌రౌండర్.. Me after watching bhaubali #RCBvsMI pic.twitter.com/Oe0QJb6XgS — ANMOL KAUR (@anmol_banga) September 26, 2021 -
RCB vs CSK: వసీం భాయ్.. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం!
IPL 2021 RCB Vs CSK: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాన జట్ల మధ్య సిరీస్‌ల సందర్భంగా అతడు చేసే పోస్టులకు మంచి ఫాలోయింగ్ ఉంది. తుదిజట్టులోని ఆటగాళ్లు లేదంటే, ఆయా మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్, బౌలర్ల మధ్య జరిగే ఆసక్తికరపోరు అంటూ అతడు చేసే పజిల్ తరహా ట్వీట్లను చాలా మంది నెటిజన్లు ఇష్టపడతారు. ఇక ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య యూఏఈ వేదికగా మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో.. ‘‘నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి ఫైట్ మనం చూడబోతున్నాం’’ అన్న అర్థంలో వసీం జాఫర్ రెండు ఫొటోలు షేర్ చేశాడు. అందులో ఒకటి.. అమెరికన్ డాలర్ నోటు కాగా.. మరొకటి ప్రసిద్ధ సినిమా.. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’’లోనిది. ఇక ట్వీట్‌ను డీకోడ్ చేసిన నెటిజన్లు తమ ఆన్సర్లతో సిద్ధమైపోయారు. అయితే మెజారిటీ మంది.. నేటి మ్యాచ్(సెప్టెంబరు 24)లో ఏబీ డివిల్లియర్స్(ఆర్సీబీ), శార్దూల్ ఠాకూర్(సీఎస్కే) మధ్య ఫైట్ ఖాయం అని వసీం చెప్పినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. అమెరికా వ్యవస్థాపక మేధావులలో ముఖ్యుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే డాలర్ నోటుకు ప్రతిగా.. అబ్రహం బెంజమిన్ ఫ్రాంక్లిన్ డివిల్లియర్స్ పేరును సూచిస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను ‘లార్డ్’ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తిన నేపథ్యంలో.. సెకండ్ ఫొటోకు ప్రతిగా శార్దూల్ పేరును పేర్కొంటున్నారు. మరికొంత మంది డాలర్ నోటుకు హర్షల్ పటేల్ పేరును సూచిస్తున్నారు. మరికొందరేమో మీరు చెప్పిన ఈ ఇద్దరూ కచ్చితంగా తుదిజట్టులో ఉంటారో లేదో చూద్దాం అంటూ ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఠాకూర్ అత్యధిక వికెట్లు(8 వికెట్లు) తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం విదితమే. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా Watchout for these two tonight. #RCBvCSK #IPL2021 pic.twitter.com/sT5rDuPO3F — Wasim Jaffer (@WasimJaffer14) September 24, 2021 LORD SHARDUL SIR 🤯 he gets the three quick wickets of Bairstow, Morgan and Buttler! Wow wow wow. How quickly this game has changed! 🇮🇳🏴#INDvENG — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) March 23, 2021 -
అత్యధిక సిక్సర్లు అన్నావు.. ఏంటిది గంభీర్.. నీ అంచనా తప్పింది!
Gautam Gambhir Prediction Gone Wrong: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(5) సహా స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్(10), ఏబీ డివిల్లియర్స్(0) దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐపీఎల్-2021 రెండో అంచె తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం తప్పలేదు. 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా.. సిక్సర్ల వర్షం కురిపిస్తాడని భావించిన డివిల్లియర్స్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక తొలి దశలో ముఖాముఖి పోరులో ఆర్సీబీ 38 పరుగుల తేడాతో కేకేఆర్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌కు ముందు క్రీడా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు వేసిన అంచనాలు తప్పాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్.. ఆర్సీబీ- కోల్‌కతా మ్యాచ్‌లో డివిల్లియర్స్ అత్యధిక సిక్సర్లు కొడతాడని జోస్యం చెప్పాడు. అయితే, ఈ మ్యాచ్‌లో డివిల్లియర్స్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. Photo Courtesy: RCB Twitter ఇక ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అభిమానులు గంభీర్ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అయ్యో ఏంటిది గంభీర్.. నీ అంచనా తప్పింది. అత్యధిక సిక్స్‌లు అన్నావు. గోల్డెన్ డక్. ఏబీ నిన్ను మోసం చేశాడు’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘నీ వల్ల నేను సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని గంభీర్.. ఇదిగో ఏబీని ఇలా తిడతాడేమో’’ అంటూ సరదాగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. AB de villiers to Gautam Gambhir rn :#KKRvRCB pic.twitter.com/Ov7IIWbnq1 — Akshit Sharma🇮🇳 (@ShrmaGka_Ladka) September 20, 2021 Gambhir predicted Ab De Villiers will score the most Sixes in the match and he got out at golden duck. Unreal Consistency. — R A T N I S H (@LoyalSachinFan) September 20, 2021 View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) Game Day: KKR v RCB Dressing Room Talk Mike Hesson and Virat Kohli address the team after a forgettable outing, urge them to put this loss behind them & turn up better for the next game v CSK on 24th. All this & more on @myntra presents Game Day.#PlayBold #IPL2021 #KKRvRCB pic.twitter.com/6bB0LcfSe3 — Royal Challengers Bangalore (@RCBTweets) September 21, 2021 -
అతనొక్కడే.. ఇంతవరకు టైటిల్ గెలవలేదు కాబట్టి: గౌతం గంభీర్
Gautam Gambhir Comments On AB De Villiers: జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్ గెలవలేకపోయింది. 2016లో ఫైనల్ చేరినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు తలవంచిన కోహ్లి సేన.. ఈ తర్వాత సీజన్లలో కూడా ప్లేఆఫ్ చేరేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక గత సీజన్లో లీగ్ దశలో టాప్-4లో నిలిచిన ఆర్సీబీ.. నాకౌట్ దశలో నిష్క్రమించింది. అయితే, ఈసారి మాత్రం ఘనంగానే సీజన్‌ను ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో గెలుపొంది సత్తా చాటింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బెంగళూరు జట్టు ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న రెండో అంచెకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్- 2021 రెండో దశ హిందీ కామెంటేటర్ గౌతం గంభీర్ కోహ్లి సేన గెలుపు అవకాశాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: T20 World Cup 2021: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ! ‘‘విరాట్‌కు ఏబీ డివిల్లియర్స్, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఒకవేళ మాక్సీ అందుబాటులో లేకపోయినా.. డివిల్లియర్స్ అనే అతిపెద్ద బలం తనకు ఉండనే ఉంది. జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కోవడంతో ఏబీకి ఎవరూ సాటిరారు. తనలాగా యార్కర్ల కింగ్‌ను ఎదుర్కొన్న మరో బ్యాట్స్‌మెన్‌ను నేనింత వరకూ చూడలేదు. ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించాలని కోహ్లి రచించే వ్యూహాలు పక్కాగా అమలు కావాలంటే ముందుగా ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవని ఆర్సీబీ మీద ఏడాదికేడాది ఒత్తిడి పెరుగుతూనే ఉంటుందనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా కోహ్లి, ఏబీ మెరుగ్గా రాణిస్తేనే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. లేదంటే.. తదుపరి సీజన్లలోనూ ఆ ఒత్తిడి అలాగే కొనసాగుతుంది’’అని పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 20న అబుదాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ ఐపీఎల్ రెండో దశను ఆరంభించనుంది. చదవండి: IPL 2021: ప్లేఆఫ్ చేరాక ముంబై బుమ్రాకు రెస్ట్ ఇస్తుందా? -
ఇరగదీసిన డివిల్లియర్స్.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!
AB de Villiers Scores Century Intra Squad Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా కప్ కొట్టాలన్న ఆశయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో గట్టిగానే శ్రమిస్తున్నారు. రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లతో కావాల్సినంత ప్రాక్టీసు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో... ఆర్సీబీ ఏ కెప్టెన్ హర్షల్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో వికెట్ కోల్పోయిన ‘ఏ’ జట్టును స్టార్ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్, మహ్మద్ అజారుద్దీన్ ఆదుకున్నారు. ఏడో ఓవర్ ముగిసేసరికి డివిల్లియర్స్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే జోరులో శతకం(46 బంతుల్లో 104 పరుగులుఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఏ 212 పరుగులు చేయగలిగింది. అయితే లక్ష్యఛేదనలో భాగంగా దేవదత్ పడిక్కల్ సారథ్యంలోని ఆర్సీబీ బీ మెరుగైన ఆట కనబరిచింది. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. బౌండరీ బాది విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించి గెలుపొందింది. ఈ టీంలో కేఎస్ భరత్ 95 పరుగులు సాధించి సత్తా చాటగా.. ఆర్సీబీ ఏ జట్టులోని సెంచరీ చేసిన డివిల్లియర్స్ పోరాటం వృథాగా పోయింది. ఈ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. చదవండి: IPL 2021 Phase 2: నాలాంటి ‘ఓల్డ్ మ్యాన్’కు కష్టమే: డివిల్లియర్స్ Bold Diaries: RCB’s Practice Match AB de Villiers scores a century, KS Bharat scores 95 as batsmen make merry in the practice match between Devdutt’s 11 and Harshal’s 11.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/izMI4LCSG1 — Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021 -
నాలాంటి ముసలి వాడికి కాస్త కష్టమే: డివిల్లియర్స్
RCB AB de Villiers: క్రికెట్ ప్రేమికులకు పొట్టి ఫార్మాట్లోని అసలైన మజా అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రెండో దశ త్వరలోనే ఆరంభం కానుంది. ఆటగాళ్లు విజయవంతంగా క్వారంటైన్ పూర్తిచేసుకుని, కోవిడ్ భయాలేవీ లేకుండా అన్నీ సజావుగా సాగితే ఎంటరైన్‌మెంట్‌కు కొదవే ఉండదు. ఇక.. యూఏఈ వేదికగా జరుగనున్న మిగిలిన మ్యాచ్‌ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే యూఏఈకి చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ సైతం నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తూ.. చెమటోడుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఇక్కడ అంతా బాగానే ఉంది. వికెట్ కాస్త కఠినంగానే ఉంది. బౌలర్లు చాలా బాగా బౌల్ చేస్తున్నారు. అయితే.. ఇక్కడ హుమిడిటీ(ఆర్ద్రత) ఎక్కువ కదా. విపరీతంగా చెమట పట్టేస్తోంది. బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, నాలాంటి ముసలివాళ్లకు కాస్త కష్టమే కదా’’ అని 37 ఏళ్ల డివిల్లియర్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. చాలా గ్యాప్ తర్వాత సహచర ఆటగాళ్లను కలుసుకోవడం గురించి స్పందిస్తూ.. ‘‘ఈ సెషన్ చాలా బాగా సాగింది. క్రికెటర్లందరినీ ఒకే చోట చూడటం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు వాళ్లను చాలా మిస్సయ్యాను. ఇప్పుడు అంతా ఒక్కచోట చేరాం. రేపటి వార్మప్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని డివిల్లియర్స్ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్-2021 రెండో అంచె ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. Bold Diaries: AB starts net sessions The cameras were on Mr.360 as he resumed practice ahead of #IPL2021. AB spoke to us about his first hit, reuniting with RCB, & how he visualizes the match situations in his mind, on @myntra presents Bold Diaries.#PlayBold #WeAreChallengers pic.twitter.com/jhd23zv99q — Royal Challengers Bangalore (@RCBTweets) September 13, 2021 -
అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది జట్టులో యాష్‌కు స్థానం కల్పించకపోవడంపై జరుగుతున్న అనవసర రాద్దాంతం నేపథ్యంలో మిస్టర్ 360 ఆటగాడు ఈమేరకు స్పందించాడు. ఈ విషయమై టీమిండియా అభిమానులు ఆందోళన చెందకుండా, కోహ్లి సేన సాధించిన విజయాలను ఆస్వాదించాలని సూచించాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లి సూపర్ అని ఆకాశానికెత్తాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. నాలుగు టెస్ట్‌ల్లో యాష్‌కు నిరాశే ఎదురైంది. As “spectators” of Test Cricket, just stop worrying about team selection and other nonsense and start appreciating the competition, passion, skill and patriotism unfolding in front of your eyes. You’re missing a good game!— AB de Villiers (@ABdeVilliers17) September 6, 2021 ఓవల్ మైదానంలో అశ్విన్‌కు మంచి రికార్డు ఉండటంతో నాలుగో టెస్ట్‌లో అతనికి చోటు ఖాయమేనని అంతా భావించారు. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ మాత్రం అశ్విన్‌ను కాదని జడేజావైపే మొగ్గుచూపాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్ కోటాలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజు మ్యాచ్ భారత్‌వైపు మళ్లే వరకు విమర్శలు కొనసాగించారు. అశ్విన్ ఉంటే భారత్ విజయం సులువయ్యేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: టీమిండియా డాషింగ్ క్రికెటర్ నోట పవర్ స్టార్ పాపులర్ డైలగ్.. -
తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని బెదిరించారు..
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా ఆ దేశ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆ దేశ క్రికెట్లో సంచలనం రేపుతోంది. సఫారీ లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌లపై అదే దేశానికి చెందిన నల్లజాతి క్రికెటర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే జాత్యాంహంకార ఆరోపణలు చేశాడు. గతంలో (2011-2015) ఐదేళ్ల పాటు తాను నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సమయంలో నాటి కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఏబీడీలు తనకు సరైన అవకాశాలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకున్నారని, తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని కూడా బెదిరించారని సోలికెలే ఆరోపించాడు. ఆ ఇద్దరు తనను తొక్కేశారని, అందువల్లే బ్యాకప్ ప్లేయర్‌గా మిగిలిపోయానని పేర్కొన్నాడు. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనకు, కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కిందని వాపోయాడు. నాడు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్రేమ్ స్మిత్‌కు నేను జట్టులో ఉండటం అస్సలు ఇష్టం లేదని జాతీయ సెలక్షన్ కన్వీనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఆరోపణలు చేశాడు. 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో రెగ్యులర్ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడని, తనకు తుది జట్టులో చోటు ఖాయమని సెలక్టర్ హడ్సన్ చెప్పాడని పేర్కొన్నాడు. అయితే, అప్పటివరకు ఎన్నడూ వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు జట్టులో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెడీ అయ్యాడని ఆరోపించాడు. గ్రేమ్ స్మిత్, ఏబీడీలకు నల్ల జాతీయులతో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకోవడమన్నా, వారితో మాట్లాడటమన్నా అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించాడు. నేను తన జట్టులో ఉండడం గ్రేమ్ స్మిత్‌కు ఇష్టం లేదని స్వయానా సెలక్టర్లే తనతో చెప్పినట్లు తెలిపాడు. కాగా, తమీ సోలెకిలే తన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పలు విదేశీ టూర్లకు ఎంపికయ్యాడు. -
ఈ భూమ్మీద దాన్ని ‘వైడ్’ అంటారు కదా: హా.. ఇట్స్ షాకింగ్!
సెయింట్ జార్జెస్: వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ సందర్భంగా అంపైర్ వ్యవహరించిన తీరుపై ప్రొటీస్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విండీస్ బౌలర్ మెకాయ్ వేసిన బంతి వైడ్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా 2 టెస్టులు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జరిగిన చివరి టీ20లో గెలుపొంది 3–2తో పర్యాటక జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా... దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 19 ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్.. ముల్దర్‌కు షార్ట్ బాల్‌ను సంధించాడు. దానిని షాట్ ఆడేందుకు ముల్దర్ విఫలయత్నం చేశాడు. నిజానికి అది వైడ్‌బాల్. కానీ అంపైర్లు మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. డేల్ స్టెయిన్ ఈ అంశంపై ట్విటర్ వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కాడు. ‘‘ఈ భూమి మీద.. అది ఎలా వైడ్‌గా పరిగణించరో చెప్పగలరా’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు స్పందనగా... ‘‘షాకర్’’ అంటూ ఏబీ డివిలియర్స్ అతడిని సమర్థించాడు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ సైతం.. ‘‘ఇది నిజంగా చెత్త అంపైరింగ్’’ అని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. మార్క్రమ్ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. Worst umpiring ever 🤣🤣🤣 pic.twitter.com/4fd9DwRy74 — ribas (@ribas30704098) July 4, 2021 -
సిక్సర్ల రారాజు రీ ఎంట్రీ..?
ముంబై: యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడానికి సిద్దంమవుతున్నాడు. మెల్బోర్న్కు చెందిన ‘మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్’ తరుపున యువరాజ్ సింగ్ ఆడనున్నట్లు తెలుస్తోంది . యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసీస్ గడ్డపై బ్యాట్లు ఝుళిపించే అవకాశాలున్నాయి. వారితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే వీలుంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని మల్గ్రేవ్ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయెగమ్ పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్, సనత్ జయసూర్య, తరంగాలు మల్గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. దీంతో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయేగమ్ తెలిపారు. చదవండి: క్రికెట్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఫొటోలు -
నీ పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది: మ్యాక్స్‌వెల్
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వినూత్న రీతిలో కామెంట్ చేశాడు. ఏబీ తన నాన్న బర్త్‌డే సందర్భంగా పాడిన పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని ట్రోల్ చేశాడు. విషయంలోకి వెళితే.. మే 29న డివిలియర్స్ నాన్న 70వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన నాన్నకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని భావించిన ఏబీ తన భార్యతో కలిసి ఫెవరెట్ సాంగ్‌ను పాడాడు. పాప్ సింగర్ జాసన్ రాజ్ పాపులర్ సాంగ్ ' ఐ వోంట్ గివ్ అప్'ను నాన్నాకు అంకితం చేశాడు. ఈ సందర్భంగా ఏబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్టును షేర్ చేశాడు. ''మా నాన్న 70వ బర్త్‌డే వేడుకలను చాలా ఆనందంగా జరుపుకున్నాం. నా ఆల్‌టైమ్ ఫెవరెట్ సాంగ్ ఐ వోంట్ గివ్ అప్ను నా భార్యతో కలిసి పాడాను. ఈ పాటలో ఎంత అర్థం ఉంటుందంటే.. ఏం ప్రమాదం జరిగినా మనకు దేవుడు అండగా ఉంటాడని నమ్మకం. ఇన్నేళ్లలో నాకు రోల్ మోడల్‌గా నిలిచిన మా నాన్నకు ఈ పాటను అంకితం చేయడం సంతోషంగా ఉన్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఏబీ పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమై స్పందన లభించింది. అయితే ఇదే పాటను ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 14వ సీజన్లో ఆడుతున్నప్పుడు మే1వ తేదీన పాడాడు. డివిలియర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీలోనే మ్యాక్స్‌వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డివిలియర్స్ పాడిన పాటను మ్యాక్స్‌వెల్ ట్రోల్ చేశాడు. ''ఏబీ.. నీ పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.. గతంలో పాడిన దానికంటే అద్భుతంగా ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ తొలిసారి ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీ తరపున కలిసి ఆడారు. ఈ సీజన్లో ఈ ఇద్దరు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆర్సీబీ గెలిచిన మ్యాచ్‌ల్లో వీరి పాత్ర కీలకం అని చెప్పొచ్చు. 7 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్ 223 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్ 7 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేశాడు. కరోనా మహమ్మారి సెగతో బీసీసీఐ ఐపీఎల్ 14వ సీజన్‌ను మధ్యలోనే రద్దు చేసింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా తరపున ఏబీ డివిలియర్స్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఏబీ క్లారిటీ ఇస్తూ.. టీ20 ప్రపంచకప్ ఆడేది లేదని.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. చదవండి: Veda Krishnamurthy: వాళ్లతోనే నా సర్వస్వం కోల్పోయా.. బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్ చేసిన రషీద్ View this post on Instagram A post shared by AB de Villiers (@abdevilliers17) -
Ab De Villiers: వేరే లెవల్.. ధోని, కోహ్లి మాదిరిగానే!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్ ఫ్యాలోయింగ్ వేరే లెవల్లో ఉంటుంది. ఏబీడీ ఆటను ప్రాణపదంగా ప్రేమించే అభిమానులు ఇక్కడ చాలా మందే ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లకు ఉన్నంతటి క్రేజ్ అతడికి కూడా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. కెప్టెన్ కూల్ ధోని, టీమిండియా సారథి కోహ్లి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాదిరిగానే, ఏబీ డివిలియర్స్ మైదానంలో అడుగు పెడితే చాలు హర్షధ్వానాల మోతతో గ్రౌండ్ దద్దరిల్లిపోతుందంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘2015.. ధర్మశాల.. సాధారణంగా ధోని, కోహ్లి, రోహిత్ వస్తుంటే ప్రేక్షకులు కేకలు వేస్తారు. సంతోషంతో అరుస్తారు. అచ్చం అలాగే ఏబీ డివిలియర్స్ రాగానే.. అంతా లేచి నిలబడ్డారు. తనని కూడా వారిలో ఒకడి(భారత ఆటగాడు)గానే భావించారు. నేను ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను’’ అని పేర్కొన్నాడు. కాగా.. దక్షిణాఫ్రికా ఇండియా టూర్లో భాగంగా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఏబీ డివిలియర్స్ రెండు సెంచరీలు బాదాడు. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో శతకం(119) సాధించగానే మైదానమంతా.. ‘‘ఏబీడీ.. ఏబీడీ’’అన్న నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల తాను రిటైర్మెంట్పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఏబీ ప్రకటించడంతో.. భారత పౌరసత్వం తీసుకుని, టీమిండియాకు ఆడాలంటూ ట్విటర్ వేదికగా అతడికి ఇండియన్ ఫ్యాన్స్ అతడి పట్ల అభిమానం చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్ ద్వారా ఏబీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదవండి: ఇండియాకు వచ్చెయ్ ప్లీజ్ .. పంత్ స్థానంలో ఆడు నోరు మూసుకో అక్తర్.. కలలు కనటం మానేయ్: ఆసిఫ్ -
డివిలియర్స్ అందుకే ఒప్పుకోలేదు.. కానీ సరైన నిర్ణయం
జోహన్నెస్‌బర్గ్: విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. అతని మాజీ సహచరులు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను తోసి పుచ్చుతూ సీఎస్ఏ చేసిన ప్రకటనతో డివిలియర్స్ కెరీర్ ముగిసినట్లు స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ డివిలియర్స్ అంశంపై స్పందించాడు. ''ఏబీ విషయంలో ఇది నిజంగా దురదృష్టకరం. 2018లో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవించాం. కానీ తనకు మళ్లీ ఆడాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. జట్టులోకి అతని పునరాగమనం కోసం బోర్డు సభ్యులతో చాలాసార్లు చర్చించాం. కానీ అనూహ్యంగా కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాను ఇక జట్టులోకి రాకపోవచ్చు అనే సంకేతాలు డివిలియర్స్ బోర్డుకు పంపించడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయింది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. అతను ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ టీ20ల్లో బెస్ట్ ఫినిషర్‌గా నిలుస్తూ వచ్చాడు. అందుకు ఐపీఎల్ చక్కటి ఉదాహరణ. ఒక బోర్డులో సభ్యునిగా ఉత్తమంగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చే బాధ్యత నాపై ఉంది. ఏబీ డివిలియర్స్ విషయంలో కూడా అదే భావించాను. అతను జట్టులో ఉంటే ఆటగాళ్లకు మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ ఏబీ నిర్ణయాన్ని మేం గౌరవించాల్సిందే. ఇక ఈ విషయాన్ని మరిచిపోయి ముందుకు సాగుదాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఏబీ డివిలియర్స్ 2004లో టెస్టు మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ మిస్టర్ 360 అనే పేరును ఏబీ సార్థకం చేసుకున్నాడు.అంతేగాక దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఏబీ తన 15 ఏళ్ల కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9557, 78 టీ20ల్లో 1672 పరుగులు సాధించాడు. ఇందులో టెస్టుల్లో 22 సెంచరీలు.. వన్డేల్లో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ డివిలియర్స్ తన ప్రత్యేకతను చూపించాడు. ఆరంభంలో ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఏబీడీ ఆర్సీబీకి వెళ్లిన తర్వాత ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఐపీఎల్లో ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన డివిలియర్స్ ఇప్పటివరకు మొత్తంగా 176 మ్యాచ్‌లాడి 5056 పరుగులు చేశాడు. చదవండి: డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు ఇండియాకు వచ్చెయ్.. పంత్ స్థానంలో ఆడు! -
ఇండియాకు వచ్చెయ్ ప్లీజ్ .. పంత్ స్థానంలో ఆడు
న్యూఢిల్లీ: విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో భారత ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు మిస్టర్ 360. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏబీడీ.. ఐపీఎల్-2021లో తనదైన శైలిలో ఆడుతూ వినోదాన్ని పంచాడు. ఇక టోర్నీ వాయిదా పడటంతో అతడు స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. అయితే, 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. లీగ్ మ్యాచ్‌లలో అద్భుత ఫామ్ కొనసాగిస్తుండటంతో అతడు దక్షిణాఫ్రికా క్రికెట్లో పునరాగమనం చేస్తాడని అభిమానులు భావించారు. కానీ, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని డివిలియర్స్ సహా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) అధికారికంగా ప్రకటన వెలువరించడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇక ఏబీడీపై గుండెల నిండా అభిమానం నింపుకున్న ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం.. భారత పౌరసత్వం తీసుకుని, టీమిండియాకు ఆడాలంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. పంత్ స్థానంలో వచ్చెయ్.. ‘‘ రిషభ్ పంత్ స్థానంలో భారత జట్టులో వికెట్ కీపర్ పాత్రను నువ్వు పోషించాలి. టెస్టుల్లో పంత్ బెస్ట్ కానీ వన్డేలు, టీ20ల్లో అతడు అంతంత మాత్రమే. కాబట్టి నువ్వు ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వు ప్లీజ్’’ అని నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘హమ్మయ్య.. ఏబీడీ రిటైర్మెంట్పై నిర్ణయం మార్చుకోలేదు. సంతోషం. టీమిండియా వికెట్ కీపర్‌గా నీకు స్థానం దక్కుతుంది డివిలియర్స్’’ అంటూ మరొకరు చమత్కరించారు. ఇక మరికొంత మంది.. ‘‘ లెజెండ్స్‌కు ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు. నువ్వు.. మా ఆల్‌టైమ ఫేవరెట్ క్రికెటర్‌వి’’అంటూ అభిమానం చాటుకుంటున్నారు. ఇంకొంత మంది మాత్రం.. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఏబీతో టీమిండియాకు పొంచి ఉన్న గండం తప్పింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Kuldeep Yadav: క్రికెటర్ తీరుపై అధికారుల అసహనం @ABdeVilliers17 , You can play from India as Wicketkeeper in place of Rishabh Pant, as he hasn't done anything in ODI and T20, he is suitable for Test. #AbDeVilliers #RCB #Cricket #southafrica #cricbuzzlive #CricTracker #ipl2021live #IPL — Atul Singh Bisht (@bishtatul50) May 19, 2021 Take indian citizenship we love to see you play for india #AbDeVilliers — siri (@siri2005) May 18, 2021 Craze level in india🔥🥀#AbDeVilliers #lordofcricket #rcb #SouthAfrica pic.twitter.com/n5fMqS2Vx3 — ᴄʜɪᴋᴋᴜ_ᴋᴏʜʟɪ⚡18 (@chirag_parmar17) May 18, 2021 #AbDeVilliers isn't coming back From Retirement. Now team India will not face AB in upcoming T20 world cup Le Indian right now: pic.twitter.com/I6uYCj83LN — Urwashi_07 (@UGwalwanshi) May 18, 2021 -
డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు
జొహన్నెస్‌బర్గ్: విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం ఉందంటూ గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలకు తెర పడింది. అతను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) అధికారికంగా ప్రకటించింది. రిటైర్మెంట్ను వదిలి మళ్లీ బరిలోకి దిగే విషయంలో అతనితో ఇటీవల బోర్డు అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు సఫారీ జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఏబీ గురించి ప్రకటన వెలువడింది. ‘రిటైర్మెంట్పై తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని, దానికే కట్టుబడి ఉన్నట్లు డివిలియర్స్ చెప్పాడు’ అని సీఎస్ఏ స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. నిజానికి 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని అతను ఆశించినా... చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడంతో బోర్డు ఏబీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్లో డివిలియర్స్ చెలరేగుతుండటంతో జాతీయ జట్టు గురించి మళ్లీ ప్రస్తావన వచ్చింది. అతని మాజీ సహచరులు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. ఫామ్, ఫిట్నెస్ బాగుంటే వస్తానంటూ ఇటీవల ఐపీఎల్లో కూడా అతను తన ఉద్దేశాన్ని బయట పెట్టాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత పునరాగమనం విషయంలో బౌచర్‌తో చర్చించాల్సి ఉందని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు తాజా ప్రకటనతో అతని దక్షిణాఫ్రికా కెరీర్ ముగిసినట్లు స్పష్టమైపోయింది. -
రిటైర్మెంటే ఫైనల్: ఏబీ డివిలియర్స్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. రిటైర్మెంట్పై తన నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చి చెప్పాడు. భారత్ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఈ మిస్టర్ 360 ఆటగాడి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉండింది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ స్పష్టతనిచ్చాడు. 2018లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తరువాత చాలా సందర్భాల్లో ఏబీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇదే అంశంపై ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఏబీని సంప్రదించగా, ఐపీఎల్ ముగిసాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో అభిమానుల ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ.. తన రిటైర్మెంట్ నిర్ణయంపై తగ్గేదే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ఏబీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసి మరింతగా అలరిస్తాడని భావించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అర్ధంతరంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంప్రదించినప్పటికీ, తన నిర్ణయంలో ఏ మార్పు లేదని, ఉండదని తేల్చేశాడు. దీంతో అతనిపైనే గంపెడాశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో నైరాశ్యం ఆవహించింది. చదవండి: నేను రెడీగా ఉన్నా, కాల్ రావడమే ఆలస్యం: నితీష్ రాణా -
అతడొక జీనియస్, నా ఫేవరెట్ షాట్ అదే!
అహ్మదాబాద్: ‘‘అద్భుతమైన, అమోఘమైన ఇన్నింగ్స్. ఇతడి బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. తనదైన షాట్లతో మనకు ఆనందాన్ని పంచుతాడు. వహ్వా అనిపించే ప్రదర్శన చేస్తాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్, ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక జీనియస్ అని, ఓపెనర్‌గా పంపిస్తే ఇంకా బాగుంటుందని ఆర్సీబీకి సూచించాడు. కాగా అహ్మదాబాద్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 42 బంతుల్లో, 75 పరుగులు(3 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో 5 వేల పరుగుల మార్కును చేరుకున్న రెండో విదేశీ ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... ‘‘ ఏబీడీ సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి తను కొట్టిన ఓ సిక్సర్ హైలెట్. నాకైతే ఆ థర్డ్‌మాన్ మీదుగా కొట్టిన షాట్ ఫేవరెట్. ఏబీడీ ఒక జీనియస్. తను బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం అంతే. అతడిని ఓపెనర్‌గా ఎందుకు పంపించకూడదు. అలా అయితే తన విశ్వరూపం మరింతగా చూసే అవకాశం లభిస్తుంది కదా. ఏబీడీ 20 ఓవర్ల ఆట చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఒక బ్యాట్స్‌మెన్‌గా ఏబీడీ ఇలాంటి భీకరమైన ఫాంలో ఉన్నపుడు నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఏబీడీ అరుదైన ఘనత; నా ఐడల్ అన్న వార్నర్! -
5 వేల క్లబ్లో ఏబీ; తను నా ఐడల్: వార్నర్
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పరుగుల సునామీ సృష్టించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. ‘‘ఇది కేవలం సూపర్మేన్కే సాధ్యం.. మామూలు మనుషులు అయితే ఇలా ఆడలేరు’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మంగళవారం నాటి మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 (42 బంతులు, నాటౌట్) పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక ఏబీ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా, మెరుగైన స్కోరు నమోదు చేసిన కోహ్లి సేన, ఆఖరికి ఒకే ఒక్క పరుగుతో ఢిల్లీపై విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన ఏబీ డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 5 వేల పరుగుల మార్కును చేరుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు. 161 ఇన్నింగ్స్‌లో ఏబీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఏబీ కంటే ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘మిస్టర్ 360.. 5 వేల పరుగులు’’ అంటూ ఐపీఎల్ ట్విటర్ వేదికగా అతడిని అభినందించింది. ఇందుకు స్పందించిన వార్నర్.. ‘ ఏబీ డివిలియర్స్.. లెజెండ్, నా ఐడల్’’ అంటూ అతడిపై అభిమానం చాటుకున్నాడు. స్కోర్లు: ఆర్సీబీ: 171/5 (20) ఢిల్లీ క్యాపిటల్స్: 170/4 (20) Legend @ABdeVilliers17 my idol 👌👌 https://t.co/iPcsmFinGv — David Warner (@davidwarner31) April 27, 2021 చదవండి: IPL 2021 RCBvsDC: బెంగళూరు బతికిపోయింది ఏబీ.. నీకు హ్యాట్సాఫ్: కోహ్లి -
IPL 2021 RCBvsDC: బెంగళూరు బతికిపోయింది
ఐపీఎల్లో మరో ఉత్కంఠభరిత ముగింపు. చివర్లో ఒత్తిడిని అధిగమించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని అందుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో భారీ ఓటమి తర్వాత కోహ్లి సేన మళ్లీ గెలుపు బాట పట్టి అగ్రస్థానానికి చేరింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో పేలవంగా ఆడిన ఢిల్లీ పీకల మీదకు తెచ్చుకుంది. చివర్లో హెట్‌మైర్, పంత్ తీవ్రంగా ప్రయత్నించినా ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు టాపార్డర్ విఫలమైనా... మరోసారి తనను నమ్ముకున్న జట్టును నిలబెడుతూ డివిలియర్స్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఆర్సీబీ మెరుగైన స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాల్ విసరగలిగింది. అహ్మదాబాద్: హోరాహోరీ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్ పటిదార్ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్ పంత్ (48 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు), షిమ్రాన్ హెట్‌మైర్ (25 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. టాప్ తడబాటు... ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి (12; 2 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (17; 3 ఫోర్లు) మరోసారి చక్కటి ఆరంభం అందించినా దానిని కొనసాగించడంలో విఫలమయ్యారు. వరుస బంతుల్లో వీరిద్దరూ వెనుదిరిగారు. అవేశ్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోగా... ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పడిక్కల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వెనుదిరగ్గా... మరో ఎండ్‌లో పటిదార్ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. డివిలియర్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 54 పరుగులు (38 బంతుల్లో) జోడించిన అనంతరం అతను నిష్క్రమించాడు. పంత్, సిరాజ్, కోహ్లి ఏబీ జోరు... బెంగళూరును ఎప్పటిలాగే మరోసారి డివిలియర్స్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన అతను ఆ తర్వాత చెలరేగాడు. అక్షర్, రబడ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అతను, చివరి ఓవర్లో పండగ చేసుకున్నాడు. స్టొయినిస్ పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ఈ ఓవర్లో ఎక్స్ట్రా కవర్, షార్ట్ ఫైన్‌లెగ్, కవర్స్ దిశగా డివిలియర్స్ మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 35 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆఖరి ఓవర్లో మొత్తం 23 పరుగులు రావడంతో చాలెంజర్స్ మెరుగైన స్కోరు వద్ద ముగించగలిగింది. ఇసుక తుఫాను... ఐపీఎల్ మ్యాచ్ విరామం సమయంలో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఇసుక తుఫాన్ ముంచెత్తింది. వేగంగా గాలులు వీచడంతో పాటు దుమ్మూ ధూళి ఎగసిపడి చాలా సేపు ఇబ్బంది పెట్టాయి. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇది జరిగింది. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కాస్త ఆలస్యంగా మొదలైంది. హెట్‌మైర్ హెట్‌మైర్ మెరుపులు... ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (6)తో పాటు స్టీవ్ స్మిత్ (4)లను వెంటవెంటనే అవుట్ చేసి ఢిల్లీపై ఆర్సీబీ ఒత్తిడి పెంచింది. పృథ్వీ షా (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో పంత్, స్టొయినిస్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు) కలిసి క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో స్కోరు వేగంగా సాగలేదు. జోరు పెంచే ప్రయత్నంలో స్టొయినిస్ కూడా వెనుదిరిగాడు. విజయం కోసం 44 బంతుల్లో 80 పరుగులు చేయాల్సిన ఇలాంటి దశలో పంత్, హెట్‌మైర్ జత కలిశారు. పంత్ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లు ఆడటంలో తడబడగా... హెట్‌మైర్ చెలరేగిపోయాడు. సిరాజ్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన హెట్‌మైర్ జేమీసన్ ఓవర్లో చితక్కొట్టాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు బాదడం విశేషం. ఫలితంగా ఢిల్లీ లక్ష్యం 12 బంతుల్లో 25 పరుగులకు చేరింది. హర్షల్ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ 11 పరుగులు రాబట్టగలిగింది. రక్షించిన సిరాజ్... ఆఖరి ఓవర్లో క్యాపిటల్స్ విజయానికి 14 పరుగులు కావాలి. ఐపీఎల్లో లెక్కలేనన్ని సార్లు ఎందరో బ్యాట్స్‌మెన్ దీనిని చేసి చూపించారు కాబట్టి అసాధ్యమేమీ కాదు. తీవ్ర ఒత్తిడిలో ఈ ఓవర్ వేసిన సిరాజ్ చక్కటి బంతులతో ఇద్దరు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి జట్టును గెలిపించాడు. తొలి నాలుగు బంతుల్లో అతను 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆఖరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతిని పంత్ ఫోర్ బాదడంతో చివరి బంతికి సిక్స్ కొడితే గానీ ఢిల్లీ గెలవలేని స్థితి. ఆఫ్ స్టంప్‌కు దూరంగా సిరాజ్ వేసిన బంతిని వెంటాడి పంత్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టగలిగినా అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) అవేశ్ 12; పడిక్కల్ (బి) ఇషాంత్ 17; పటిదార్ (సి) స్మిత్ (బి) అక్షర్ 31; మ్యాక్స్‌వెల్ (సి) స్మిత్ (బి) మిశ్రా 25; డివిలియర్స్ (నాటౌట్) 75; సుందర్ (సి అండ్ బి) రబడ 6; స్యామ్స్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–60, 4–114, 5–139. బౌలింగ్: ఇషాంత్ 4–1–26–1, రబడ 4–0–38–1, అవేశ్ 4–0–24–1, మిశ్రా 3–0–27–1, అక్షర్ 4–0–33–1, స్టొయినిస్ 1–0–23–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 21; ధావన్ (సి) చహల్ (బి) జేమీసన్ 6; స్మిత్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 4; పంత్ (నాటౌట్) 58; స్టొయినిస్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 22; హెట్‌మైర్ (నాటౌట్) 53; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–23, 2–28, 3–47, 4–92. బౌలింగ్: స్యామ్స్ 2–0–15–0, సిరాజ్ 4–0–44–1, జేమీసన్ 4–0–32–1, సుందర్ 4–0–28–0, హర్షల్ 4–0–37–2, చహల్ 2–0–10–0. -
ఆ ఇద్దరికి కోచ్ అవసరం లేదు
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్‌ను ఆర్సీబీ ఘనంగానే ఆరంభించింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్న ఆర్సీబీ అంతే కసిగా ఆడుతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మినహా మిగతా అన్నింటిని గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న నేపథ్యంలో ఆర్సీబీ హెడ్‌కోచ్ సైమన్ కటిచ్ స్పోర్ట్స్కీడ్స్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. విరాట్ కోహ్లి, డివిలియర్స్‌తో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపించిందని కటిచ్‌ను అడగ్గా.. అతను ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ''కోహ్లి, డివిలియర్స్‌లకు కోచ్ అవసరం ఉండదు. వారికి సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఇవ్వరు.. ఎందుకంటే ఇప్పటికే గొప్ప క్రికెటర్లలో లిస్టులో స్థానం సంపాధించారు. వారిద్దరు చాలా క్రికెట్ ఆడేశారు.వారి అనుభవమే వారికి ఆటను నేర్పుతుంది.. అదే వారికి సలహాలను ఇస్తుంది. ఇక ఆటగాడు బ్యాటింగ్ విషయంలో తప్పు చేస్తున్నాడంటే కోచ్ ఏదైనా సలహాలు ఇవ్వగలడు. కానీ వారు బ్యాటింగ్‌లో లెజెండ్స్.. వారికి నా సలహాలు ఇవ్వలేను.. ఒక్కమాటలో చెప్పాలంటే వారిద్దరికి కోచ్ అవసరం లేదు. Courtesy : IPL Twitter ఇక ఫిట్నెస్ విషయంలో కోహ్లికున్న కచ్చితత్వం బహుశా వేరే వాళ్లకు ఉండదేమో. ఏ టైంలో ఏ ఆహారం తీసుకోవాలి.. ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలంటే ఏం కసరత్తులు చేయాలి.. ఒత్తిడి నుంచి బయటకు వచ్చేందుకు ఏం ఫాలో కావాలి అన్న విషయాల్లో కోహ్లి ది బెస్ట్ అని నేను చెబుతా. ముఖ్యంగా కోహ్లిలో ఉన్న నాయకత్వ లక్షణాలు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. గత కొన్నేళ్లుగా అతను ఆర్సీబీకీ నాయకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడు టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న విఫమవుతూ వస్తుంది. కోహ్లి నాయకత్వంపై నాకు నమ్మకముంది.. ఈసారి మాత్రం ఆర్సీబీదే టైటిల్.. అంటూ ముగించాడు. చదవండి: ఎన్నిరోజులైందో ఇలా కలిసి మాట్లాడుకొని.. IPL 2021: ఆర్సీబీకి భారీ షాక్.. వారిద్దరూ ఔట్! -
కమాన్ సౌతాఫ్రికా.. ఇంకెందుకు ఆలస్యం?
కింగ్స్టన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున పునరాగమనం చేసుకునే క్రమంలో ఏబీ డివిలియర్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన మార్గాన్ని మరింత సులభతరం చేసుకుంటున్నాడు. 2018 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ.. తిరిగి మళ్లీ ఆడటానికి యత్నించినా ఇప్పటివరకూ కుదరలేదు. 2019 వరల్డ్‌కప్ సమయంలో ఏబీ తాను ఆడతాననే సంకేతాలిచ్చినా అప్పటికే సమయం దాటి పోవడంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏబీకి దాదాపు లైన్ క్లియర్ అయ్యింది. దాంతో ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో తనలోని పదును ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్న ఏబీడీ.. వరల్డ్‌కప్ ఆడటం దాదాపు ఖాయమే. కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడైన ఏబీడీ 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ఆర్సీబీ రెండొందల స్కోరును అవలీలగా దాటింది. నిన్నటి మ్యాచ్‌లో ఏబీ ఇన్నింగ్స్‌ను చూసిన జమైకా స్ప్రింట్ లెజెండ్ యెహాన్ బ్లేక్.. కచ్చితంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అతన్ని తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశాడు. తన ట్వీటర్ అకౌంట్లో ఏబీ ఇన్నింగ్స్ కొనియాడుతూ పోస్ట్ పెట్టాడు. ‘వావ్ డివిలియర్స్. ఏబీ అంటేనే డిఫరెంట్ అని చూపించావ్.. కమాన్ సౌతాఫ్రికా.. ఇంకెందుక ఆలస్యం. అతని అవసరం మీకు ఎంతో ఉంది.. జట్టులో అవకాశం ఇవ్వండి’ అని ట్వీట్ చేశాడు. ఏబీకి స్థానంపై ఇప్పటికే కోచ్ బౌచర్ నుంచి హామీ లభించిన నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఆడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి Wow de Villiers is on a different level. South Africa 🇿🇦 come on you need this man. @ABdeVilliers17 @OfficialCSA — Yohan Blake (@YohanBlake) April 18, 2021 -
IPL 2021, RCB vs KKR: భళా... బెంగళూరు
చెన్నై: ఐపీఎల్లో ఆది నుంచి ఊరిస్తోన్న టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించింది. రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి జట్టు సమష్టి ఆటతీరుతో అదరగొట్టింది. తొలుత ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (49 బంతుల్లో 78; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (34 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించగా... అనంతరం బౌలర్లు కైల్ జేమీసన్ (3/41), హర్షల్ పటేల్ (2/17), యజువేంద్ర చహల్ (2/34) కోల్‌కతాను కట్టడి చేశారు. దాంతో విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని బెంగళూరు జట్టు 38 పరుగుల తేడాతో కోల్‌కతాపై ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి ఓడిపోయింది. ఆండ్రీ రసెల్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇయాన్ మోర్గాన్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు), షకీబుల్ హసన్ (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు విజయం కోసం విఫలయత్నం చేశారు. మొదట మ్యాక్సీ... చివర్లో డివిలియర్స్... బెంగళూరు సారథి కోహ్లి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేయడానికి వచ్చిన వరుణ్ చక్రవర్తి... కోహ్లి (5), రజత్ పటిదార్ (1)లను మూడు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చి కేకేఆర్‌కు డబుల్ బ్రేక్‌ను అందించాడు. అయితే కోల్‌కతా జట్టులో ఈ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (28 బంతుల్లో 25; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పవర్‌ప్లేలో ఆర్సీబీ 45/2గా నిలిచింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టిన మ్యాక్సీ... ఆ మరుసటి ఓవర్లో మరో ఫోర్ కొట్టి 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే పడిక్కల్‌ను ప్రసిధ్ కృష్ణ అవుట్ చేయడంతో... 86 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చి రావడంతోనే డివిలియర్స్ మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు. మ్యాక్స్‌వెల్ అవుటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోరు 148/4గా ఉంది. ఇక్కడి నుంచి డివిలియర్స్ మరింత చెలరేగిపోయాడు. రసెల్ వేసిన 18వ ఓవర్లో 6, 4, 2, 4, 0 కొట్టిన అతడు... 19వ ఓవర్లో మరో సిక్సర్ కొట్టి 27 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న జేమీసన్ కూడా ఫోరు, సిక్సర్ బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చివరి ఓవర్‌ను వేయడానికి మరోసారి బంతిని అందకున్న రసెల్‌ను డివిలియర్స్ ఈసారి చావబాదాడు. వరుసగా 4, 6, 2, వైడ్, 4, 0, 4లతో 21 పరుగులను పిండుకున్నాడు. డివిలియర్స్ దూకుడుతో చివరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ 70 పరుగులు సాధించింది. లక్ష్యానికి దూరంగా... భారీ లక్ష్యంతో ఛేదన ఆరంభించిన కోల్‌కతా ఆ దిశగా ఏ దశలోనూ సాగలేదు. శుబ్‌మన్ గిల్ (9 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (25), మోర్గాన్ క్రీజులో నిలదొక్కు కుంటున్న సమయంలో అవుటయ్యారు. సూపర్ ఫామ్‌లో ఉన్న నితీశ్ రాణా (18) కూడా అవుటవ్వడంతో కేకేఆర్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. చివర్లో రసెల్, షకీబ్ ప్రతిఘటించినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) త్రిపాఠి (బి) వరుణ్ 5; పడిక్కల్ (సి) త్రిపాఠి (బి) ప్రసిధ్ కృష్ణ 25; పటిదార్ (బి) వరుణ్ 1; మ్యాక్స్‌వెల్ (సి) హర్భజన్ సింగ్ (బి) కమిన్స్ 78; డివిలియర్స్ (నాటౌట్) 76; జేమీసన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–6, 2–9, 3–95, 4–148. బౌలింగ్: హర్భజన్ సింగ్ 4–0–38–0, వరుణ్ 4–0–39–2, షకీబుల్ హసన్ 2–0–24–0, కమిన్స్ 4–0–34–1, ప్రసిధ్ కృష్ణ 4–0–31–1, రసెల్ 2–0–38–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: నితీశ్ రాణా (సి) పడిక్కల్ (బి) చహల్ 18; గిల్ (సి) సబ్–క్రిస్టియాన్ (బి) జేమీసన్ 21; త్రిపాఠి (సి) సిరాజ్ (బి) సుందర్ 25; మోర్గాన్ (సి) కోహ్లి (బి) హర్షల్ పటేల్ 29; దినేశ్ కార్తిక్ (ఎల్బీ) (బి) చహల్ 2; షకీబుల్ హసన్ (బి) జేమీసన్ 26; రసెల్ (బి) హర్షల్ పటేల్ 31; కమిన్స్ (సి) డివిలియర్స్ (బి) జేమీసన్ 6; హర్భజన్ సింగ్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–23, 2–57, 3–66, 4–74, 5–114, 6–155, 7–161, 8–162. బౌలింగ్: సిరాజ్ 3–0–17–0, జేమీసన్ 3–0–41–3, చహల్ 4–0–34–2, సుందర్ 4–0–33–1, మ్యాక్స్‌వెల్ 2–0–24–0, హర్షల్ పటేల్ 4–0–17–2. -
ఇంత స్కోరా... నేను అంతే: ఏబీడీ
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏబీ డివిలియర్స్ తన ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో కాస్త ఆశ్చర్యానికి గురైనట్లు ఏబీ తెలిపాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ఏబీ మాట్లాడుతూ..‘ ఈ ఇన్నింగ్స్ నాలో సంతోషాన్ని తీసుకొచ్చింది. నా ముందు మ్యాక్స్‌వెల్ మంచి గేమ్ ఆడటంతో నేను ఫ్రీగా ఆడటానికి సహాయపడింది. ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటానికి జట్టులోని సభ్యులు నాపై నమ్మకం ఉంచడమే. ఈ స్లో వికెట్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. నేను నమ్మదగ్గలేని ఆటను ఆడాను. ఇది మంచి వికెట్.. కానీ ఇంత పెద్ద స్కోరు వచ్చే వికెట్ కాదు. 200 స్కోరు చేసే వికెట్ అయితే కాదు. నా బ్యాటింగ్ చూసి నేను ఆశ్చర్యపోయా. నాకు నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతా. మనం క్రీజ్‌లోకి వెళ్లాక అత్యుత్తమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్‌లో నా ఆటను నేను పూర్తిగా ఆస్వాదించడం అతి ముఖ్యం అనుకుంటా. నేను క్రికెట్ ఆడటాన్ని ఇష్టపడతా. ఆర్సీబీ తరఫున ఆడటం ఇంకా ఇష్టం. ఆర్సీబీ నా కుటుంబం లాంటిది. చాలా ఏళ్లుగా ఈ జట్టుతో నాకు సంబంధం కొనసాగుతూనే ఉంది. క్రికెట్‌ను ఎక్కువ ఎంజాయ్ చేయడానికి చాలా కారణాలున్నాయి’ అని ఏబీ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 205 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్ (78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో అలరించగా, ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్ (76 నాటౌట్; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును రెండొందల పరుగులు దాటించాడు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్ 31 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షకీబ్ 26, మోర్గాన్ 29 పరుగులు చేశారు. -
ప్లీజ్.. డివిలియర్స్ టీ20 వరల్డ్‌కప్ ఆడుతాడా చెప్పండి
చెన్నై: ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన హిట్టింగ్ పవర్ ఏంటో మరోసారి రుచి చూపించాడు. చెపాక్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ 34 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆర్సీబీ జట్టు స్కోరు 91/3 వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే మ్యాక్స్‌వెల్ ఉన్నంతవరకు తన బ్యాటింగ్ పవర్‌ని చూపించని ఏబీ ఆ తర్వాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ముఖ్యంగా లాంగాన్, డీప్‌స్క్వేర్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్లు పాత ఏబీని గుర్తుచేశాయి. కాగా ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అయితే అప్పటినుంచి ఐపీఎల్లో రెగ్యులర్‌గా ఆడుతూ వస్తున్న డివిలియర్స్ 2020లో తాను క్రికెట్లోకి మళ్లీ రావాలనుకుంటున్నానని.. 2021 టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా తరపున ఆడాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. తాజాగా డివిలియర్స్ మరోసారి సిక్సర్లతో రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్,ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. బ్యాడ్ పిచ్‌పై పరుగులు ఎలా రాబట్టాలో ఏబీ చూపించాడు.. ఈరోజు డివిలియర్స్ ఇన్నింగ్స్ చుశాకా.. నా గుండె మీద చేయి వేసుకొని హాయిగా ఉంటా.. ఈసారి కప్ ఆర్సీబీదే.. ఆర్సీబీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా .. డివిలియర్స్ నేనున్నాంటూ ముందుకొస్తాడు.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో డివిలియర్స్ ఆడుతున్నాడా .. ప్లీజ్ ఎవరైనా చెప్పండి అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 38 పరుగులతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మ్యాక్స్‌వెల్ 49 బంతుల్లో 78 పరుగులతో ఈ సీజన్లో రెండో అర్థ సెంచరీని సాధించాడు. చదవండి: పాపం బౌల్ట్.. బంతిని పట్టుకోలేక రోహిత్ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. ABD is showing some people how to bat on this so called bad Pitch 😂#ABdeVilliers pic.twitter.com/I03SA1HuZe — Ravi Desai 🇮🇳 Champion CSK 💛🏆 (@its_DRP) April 18, 2021 Whenever RCB in trouble:#ABdeVilliers : pic.twitter.com/Dic8AZZdGI — Gaurav Gupta (@g48660305) April 18, 2021 Can someone please talk to AB about playing in the World Cup? 🙏🙏🙏😬 #Genius #ABdeVilliers #IPL2021 — Isa Guha (@isaguha) April 18, 2021 -
చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్ మాత్రం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మంచి జోష్‌లో ఉంది. మొదట ముంబైని మట్టికరిపించిన ఆర్సీబీ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ను ఓడగొట్టి టాప్ ప్లేస్‌లో ఉంది. రేపు కేకేఆర్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ ఆర్సీబీ ఆటగాళ్లు సరదాగా సప్పర్ థియేటర్ గేమ్ ఆడారు. విరాట్ కోహ్లి, డివిలియర్స్, యజ్వేంద్ర చహల్ మూడు జట్లకు నాయకత్వం వహించగా.. ఇతర ఆటగాళ్లు ఫుల్‌గా ఎంటర్టైన్ అందించారు. ముందు కోహ్లి అగ్లీ డక్లింగ్‌తో చిన్నపిల్లాడిలా మారిపోయి తన యాక్టింగ్‌తో ఇరగదీయగా.. డివిలియర్స్ సిండ్రిల్లా గేమ్ ఆడాడు. ఇక చహల్ కోహ్లి, డివిలియర్స్‌ను అనుసరిస్తూ చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు వారి ఫ్యామిలీలు.. జట్టు మేనేజ్మెంట్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ తన బోల్డ్ డైరీస్‌లో పంచుకుంది. ''ఇది కేవలం ఫన్ కోసం మాత్రం కాదు. దాదాపు 50 రోజులకు పైగా జట్టుగా కలిసి క్రికెట్ ఆడాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి దూరమయ్యేందుకు ఇలా చిన్ననాటి ఆటలను మరోసారి ఆడిపించాం. వాళ్లు ఎంత సరదాగా ఆడారో.. అంత ఎంటర్టైన్ అందించారు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున దారుణంగా విఫలమైన ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున మాత్రం అదరగొడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన అతను రెండో మ్యాచ్‌లో 59 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: కోహ్లికి నాలుగే సూచనలు చేశా: ఏబీ Bold Diaries: Supper Theatre Team Bonding done right! We got our cricketers to perform famous plays from their childhood days. They were absolutely brilliant and hilarious too. 😁🤩 Watch it on @myntra presents Bold Diaries#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/UBqdBGLoBV — Royal Challengers Bangalore (@RCBTweets) April 17, 2021 -
కోహ్లికి నాలుగే సూచనలు చేశా: ఏబీ
చెన్నై: గత నెలలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డకౌటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో మాత్రం అజేయంగా 73 పరుగులు సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాను తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో స్నేహితుడు, ఆర్సీబీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సహకారం ఉందన్నాడు. తాను ఏబీ చేసిన సూచనలతోనే ఫామ్‌లోకి వచ్చినట్లు కోహ్లి తెలిపాడు. కాగా, ఆ విషయాలు ఏమిటనేది కోహ్లి అప్పుడు స్పష్టం చేయలేదు. తాజాగా కోహ్లీకి తాను ఏమి చెప్పాననే విషయాలను ఏబీ రివీల్ చేశాడు. ఆర్సీబీ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఏబీ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ‘నాకు కోహ్లీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో నాకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు. నేను ఏమీ చెప్పాలనుకోలేదు. అలా చెప్పడం కాస్త ఇబ్బందికరమే. గేమ్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ కొన్ని టెక్నికల్ విషయాలను కోహ్లీవద్ద ప్రస్తావించా. నేను కొన్ని నెలల నుంచి అతని గేమ్ ఆడిన విధానాన్ని పరిశీలించిన తర్వాత నాలుగు విషయాలు చెప్పాలనుకున్నా. అవి కూడా బేసిక్ విషయాలే. బంతిని చూడటం. హెడ్ పొజిషన్ కరెక్ట్‌గా చూసుకోవడం, బంతి నీ యొక్క స్పేస్‌లో ఉందా లేదా అనేది చూసుకోవడం, బాడీ లాంగ్వెజ్‌ను సరిచేసుకోవడం.. ఈ నాలుగు విషయాలపైనే విస్తృతంగా చర్చించాం’ అని ఏబీ తెలిపాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్లో ఆడుతున్నారు. ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. ఏబీకి మంచి మిత్రుడు. వీరిద్దరూ తరచు వ్యక్తిగత విషయాలను, క్రికెట్ పరమైన అంశాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై ఆర్సీబీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక్కడ చదవండి: ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్ -
'భయం నన్ను మరింత ఫోకస్‌గా ఉంచుతుంది'
చెన్నై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏబీ 48 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ తన ప్రాక్టీస్‌కు మరింత పదునుపెట్టాడు. తనకు ఎస్ఆర్హెచ్ అంటే చాలా ఇష్టమని.. ముఖ్యంగా వార్నర్‌ను ఎదుర్కోవడంలో మజా ఉంటుందని బోల్డ్ డైరీస్‌లో పేర్కొన్నాడు. అయితే ఏబీ డివిలియర్స్ గతేడాది ఐపీఎల్ సీజన్ తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు ఆడకపోవడం విశేషం. కానీ ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే ఒక మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఏబీ తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటనేది బోల్డ్ డైరీస్‌లో రివీల్ చేశాడు. ''గతేడాది ఐపీఎల్ తర్వాత మళ్లీ నేను ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఈ గ్యాప్‌లో నా ఫిట్నెస్ను కాపాడుకోవడానికి రెండు- మూడు నెలల పాటు జిమ్ సెషన్‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. అంతేగాక రోజు బ్యాట్ పట్టుకొని గోడకు బంతులను హార్డ్‌గా హిట్టింట్ చేసేవాడిని. దీంతో నా ఫోకస్ మొత్తం షాట్ల ఎంపికపైనే ఉంది. ఇక నేను మ్యాచ్‌లో ఫెయిల్ అవుతానేమోననే భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ అదే నన్ను గేమ్‌పై ఫోకస్ చేసేలా చేస్తుంది. మొదటి 20 బంతుల్లోనే దాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తా..'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రొటీస్ తరపున డివిలియర్స్ 114 టెస్టుల్లో 8765 పరుగులు, 228 వన్డేల్లో 9577 పరుగులు, 78 టీ20ల్లో 1672 పరుగులు, ఐపీఎల్లో 170 మ్యాచ్‌ల్లో 4897 పరుగులు సాధించాడు. అయితే కొన్ని రోజుల క్రితం మళ్లీ తనకు టీ20 ఆడాలని ఉందని.. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులోకి ఉంటానంటూ సీఎస్ఏ(క్రికెట్ సౌతాఫ్రికా)కు ఇప్పటికే పేర్కొన్నాడు. చదవండి: ఎస్ఆర్హెచ్లో అనుకున్నంత బలం లేదు: డివిలియర్స్ మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్ -
ఎస్ఆర్హెచ్లో అనుకున్నంత బలం లేదు: డివిలియర్స్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో నేడు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంలో ఏబీ డివిలియర్స్ కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో 48 పరుగులతో ఏబీ విజృంభించడంతో ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్తో తలపడనున్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ నాకు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటుంది. ఆ జట్టుతో మ్యాచ్ ఆడడం నాకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగం కంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వార్నర్ నాకు ఎప్పుడు ప్రత్యర్థిగా ఎదురుపడినా.. మా ఇద్దరి పోరు మజాను పంచుతుంది. అయితే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మరి అంత బలంగా ఏం కనిపించడం లేదు. మ్యాచ్ ఆరంభంలోనే వారిపై పట్టు సాధిస్తేనే వారు ఒత్తిడిక గురయ్యే అవకాశం ఉంటుంది. మా జట్టు నుంచి రెండు మంచి భాగస్వామ్యాలు ఏర్పడితే మాత్రం మేం ముందంజలో ఉంటాం. కానీ తమది అనుకున్న రోజు ఎస్ఆర్హెచ్ ప్రమాదకారి అన్న విషయం మాత్రం ఎన్నటికి గుర్తుపెట్టుకుంటాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మరోవైపు కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వచ్చిన ఎస్ఆర్హెచ్ చివర్లో తడబడి పరాజయం పాలైంది. బెయిర్ స్టో సూపర్ ఇన్నింగ్స్.. మనీష్ పాండే క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా ఓటమిని చవిచూసింది. చదవండి: మొన్న హర్షల్.. ఈరోజు రసెల్.. మళ్లీ అదే జట్టు SRH v RCB, Preview |Game Day AB de Villiers and the coaches speak about RCB’s preparedness heading into the SRH encounter. Opposition watch and much more on @myntra presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2021 #SRHvRCB #DareToDream pic.twitter.com/0JV4eqIwER — Royal Challengers Bangalore (@RCBTweets) April 14, 2021 -
వారెవ్వా చహల్.. ముగ్గురిని ఒక్కడే ఆడేసుకున్నాడు
చెన్నై: ఆర్సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తోటి క్రికెటర్లను ఆటపట్టించడంలో ఎప్పుడు ముందుంటాడు. మొన్న కైల్ జేమిసన్‌తో కలిసి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్‌టేకర్‌ను ఇమిటేట్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్సీబీ సహచరులైన ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, సుందర్‌లతో చెస్ ఆడిన చహల్ ముగ్గురికి ఒకేసారి చెక్ చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. దీనికి సంబంధించిన ఫోటోను చహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నా కింగ్ ఫామ్‌లో ఉన్నాడు.. అందుకు ముగ్గురికి ఒకేసారి చెక్ చెప్పా. అంటూ క్యాప్షన్ జతచేశాడు. అంతేగాక చిన్నప్పటి నుంచి చెస్ ఆడడం వల్ల ఇప్పుడు మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు ఓపిక ఎంత అవసరమనేది నేర్చుకున్నానంటూ తెలిపాడు. అయితే చహల్ క్రికెటర్ కాకముందు చెస్ క్రీడాకారుడిగా ఉన్నాడు. అండర్ 12 చెస్ విభాగంలో చహల్ పలుసార్లు చాంపియన్‌గా కూడా నిలిచాడు. అయితే కెరీర్లో ఒక స్టేజ్ దాటాకా తనకు ఇష్టమైన చెస్‌ను వదిలేసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అంతకముందు చహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన వీడియోనూ ఆర్సీబీ ఆటగాడు కెఎస్ భరత్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్‌పై విజయంతో ఈ సీజన్లో భోణీ కొట్టిన ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 14న చెన్నై వేదికగా ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. చదవండి: నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్, జడ్డూలను తీసుకుంటా.. జాన్సన్‌ను ఆడించి ముంబై తప్పు చేసింది: స్టైరిస్ View this post on Instagram A post shared by srikar bharat (@konasbharat) -
ఏబీని ఐదో స్థానంలో ఎందుకు పంపారో అర్థం కావడం లేదు!
చెన్నై: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్- 2021 ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో బోణీ కొట్టడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ అద్భుత బౌలింగ్‌కు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి(33), గ్లెన్ మ్యాక్స్‌వెల్(39), ఏబీ డివిలియర్స్(48) రాణించడంతో ముంబైపై పైచేయి సాధించగలిగింది. ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు డివిలియర్స్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘ఏబీ డివిలియర్స్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో అర్థం కావడం లేదు. టీ20 మ్యాచ్‌లో మీ జట్టులోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ నంబర్ 3 లేదా నంబర్ 4 స్థానంలో వస్తాడనుకున్నా. అయితే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’అని ట్వీట్ చేశాడు. కాగా ఇదే విషయం గురించి కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఏబీ వంటి విలక్షణ ఆటగాడు నెమ్మదైన పిచ్‌లపై ఎలా ఆడగలడో తెలుసు. ఒకవేళ మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేయాలనుకున్నపుడు కొన్నిసార్లు ప్రయోగాలు తప్పవు. ఛేజింగ్‌లో భాగంగా విలువైన వికెట్లను అట్టిపెట్టుకునే క్రమంలో ఏబీడీ ఐదో స్థానంలో వచ్చాడు. తను అవుట్ అయ్యేంత వరకు మ్యాచ్ ముగిసిపోదని ప్రత్యర్థి జట్టుకు కూడా ఓ అంచనా ఉంటుంది కదా. ఏబీడీ లోయర్ డౌన్ ఆర్డర్లో రావడం వల్ల వారిలో నర్వస్నెస్ క్రియేట్ చేయాలనుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఏప్రిల్ 14 ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: రనౌట్: ఏమో.. ఇదే నాకు చివరి మ్యాచ్ కావొచ్చు! మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్ ఇచ్చేవాళ్లం.. కౌంటర్ పడిందిగా! సీజన్ మొత్తం తననే కొనసాగించాలనుకుంటున్నాం: కోహ్లి Don’t understand @ABdeVilliers17 batting at no 5 !!? 🤷♂️your best batsmen after opening have to come at no 3 or no 4 in t20 just an opinion #MIvRCB #IPL2021 — Yuvraj Singh (@YUVSTRONG12) April 9, 2021 -
ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ కాబోతోందా?!
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ టోర్నీకి తెరలేవనుంది. కరోనా భయాల నేపథ్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు క్రికెటర్లు సిద్ధమైపోయారు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈసారి భారత్‌లోనే జరగనుండటంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. అయితే, కొన్ని ఊహాగానాలు మాత్రం స్టార్ ఆటగాళ్ల ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ఈ సీజన్ తర్వాత తమ ఆరాధ్య క్రికెటర్లు లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వారి మదిని మెలిపెడుతున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం. ఎంఎస్ ధోని(2008) టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ సింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. సీఎస్కేను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. అంతేకాదు ఐదుసార్లు రన్నరప్... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్లో టాప్–4లో స్థానం... ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టుగా సీఎస్కే రికార్డు సాధించడంలో ధోని పాత్ర మరువలేనిది. విజయవంతమైన కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న ధోని ఐపీఎల్లో ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడి 4632 పరుగులు చేశాడు. ఇక గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ఈ సీజన్ తర్వాత సీఎస్‌కు కెప్టెన్‌గా రిటైర్ అయి మెంటార్‌గా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ధోనిలో అత్యుత్తమ క్రికెట్ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హర్భజన్ సింగ్(2008) టీమిండియా వెటరన్ ప్లేయర్ చాలాకాలం పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా, సీఎస్కే తరఫున కూడా మైదానంలో దిగిన భజ్జీ.. ఇప్పటివరకు 160 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లు తీశాడు. అంతేకాదు, 829 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే అతడిని వదులుకోవడంతో మినీ వేలం-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ హర్భజన్‌ను కొనుగోలు చేసింది. ఇక 38 ఏళ్ల భజ్జీ, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు స్వస్తి పలుకనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిస్‌గేల్(2009) విధ్వంసకర విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పేరిట ఐపీఎల్లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక సిక్సర్లు (349), ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు(17), అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 నాటౌట్), అత్యధిక సెంచరీలు (6), ఫాస్టెస్ట్ సెంచరీ(30 బంతుల్లో) నమోదు చేసిన ఘనత అతడి సొంతం. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లలో 4772 పరుగులు చేసిన 42 ఏళ్ల క్రిస్‌గేల్, ఐపీఎల్-2021 తర్వాత క్యాష్ రిచ్‌లీగ్‌కు గుడ్ బై చెప్పనున్నాడనే ఊహాగానాలు విస్త్రృతమవుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ తరఫున గేల్ మైదానంలోకి దిగనున్నాడు. గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఏబీ డివిలియర్స్(2011) అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకునే దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్. ఐపీఎల్లో ఇప్పటివరకు 169 మ్యాచ్‌లు ఆడి, 4849 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్లో ఏబీడీ మెరుపు విన్యాసాలు చూసే అవకాశం ఉండదనే వార్తలు క్రీడా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. కనీసం ఈసారైనా కప్ గెలిస్తే.. ఏబీడీ సగర్వంగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమ్రాన్ తాహిర్(2014) 2014లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు సౌతాఫ్రికా ఆటగాడు ఇమ్రాన్ తాహిర్. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్ బౌలర్ 80 వికెట్లు తీశాడు. సీఎస్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 2018లో జట్టు టైటిల్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ సీజన్ తర్వాత 41 ఏళ్ల తాహిర్ ఐపీఎల్ నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! -
కోహ్లి, డివిలియర్స్.. మీరెప్పుడు నా వెనకే
చెన్నై: ఉసేన్ బోల్ట్.. ఈ పేరు తెలియని వారుండరు. స్ర్పింట్ విభాగంలో తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన బోల్ట్ రన్నింగ్ రారాజుగా అభివర్ణిస్తారు. అయితే కోహ్లి, డివిలియర్స్‌లనుద్దేశించి బోల్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు విషయంలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం పూమా క్రికెట్ ప్రమోషన్లో భాగంగా కోహ్లి, డివిలియర్స్‌లు ప్రాక్టీస్ సందర్భంగా రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఆ రేస్‌లో విరాట్ కోహ్లి, డివిలియర్స్ ను దాటి దేవదత్ పడిక్కల్ ముందుకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా ఈ వీడియోపై ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య ట్విటర్లో చర్చ నడిచింది. మరోసారి కోహ్లి, డివిలియర్స్ మధ్య రన్నింగ్ రేస్ పెట్టాలని.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే అతని ఫిట్నెస్ అంత మెరుగ్గా ఉన్నట్లని తెలిపారు. అయితే వీరి సంభాషణ మధ్యలో అనూహ్యంగా ఆర్సీబీ జెర్సీ వేసుకొని వచ్చిన బోల్ట్.. కోహ్లి, డివిలియర్స్ మధ్య రేస్ పెట్టినా.. ఎప్పుడు నా వెనకే ఉంటారు.. అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ' ఆర్సీబీ చాలెంజర్స్.. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తేవాడిని నేనే అనుకుంటా.. కోహ్లి, డివిలియర్స్ ఎప్పుడు నా వెనకే అంటూ కామెంట్ చేశాడు. కాగా ఆర్సీబీ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 9న ముంబై వేదికగా డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. చదవండి: కోహ్లి, డివిలియర్స్ రన్నింగ్... ఆఖర్లో ఊహించని ట్విస్ట్ -
ఆర్సీబీ నా మాట వినండి.. ఏబీని అలా చేయవద్దు!
చెన్నై: కనీసం ఈ ఐపీఎల్ సీజన్లోనైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చకుండా ఉంటే బాగుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఆరోస్థానంలో ఉన్న ఏబీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నాడు. అది ఏ పొజిషన్లో సెట్ అవుతాడో అదే ప్లేస్‌ను కంటిన్యూ చేయాలన్నాడు. తన యూట్యూబ్ చానెల్లో చోప్రా మాట్లాడుతూ.. ‘ ఏబీ చాలా అరుదైన ఆటగాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆటగాడు ఏబీడీ. ఆర్సీబీకి ఇదే నా విన్నపం. నా మాట వినండి. ఏబీని కాంబినేషన్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూ కూర్చోకండి. ప్రత్యేకంగా ఫలాన సమయంలో లెగ్ స్పిన్నర్ బౌలింగ్ వస్తాడు అనే మ్యాచప్ చేసి ఏబీని బ్యాటింగ్ పంపకుండా ఉండకండి. ఒక సరైన బ్యాటింగ్ పొజిషన్ ఏబీకి ఇవ్వండి. అతను సరైన స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే ఏ మ్యాచప్‌లు పనిచేయవు. అతని బ్యాటింగ్ ఆర్డర్లో తప్పులు చేస్తే ఏబీ మళ్లీ గాడిలో పడటానికి సమయం ఉండదు. ఈ ఐపీఎల్లో ఏబీ మెరుపుల్ని చూస్తామనే అనుకుంటున్నా’ అని చోప్రా పేర్కొన్నాడు. గత ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. శివం దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వగా, ఏబీని కింది స్థానంలో పంపారు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కాగా, బోర్డుపై సరైన టార్గెట్ లేకపోవడం వల్లే ఆర్సీబీ పరాజయం చెందిందని విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి కింగ్స్ పంజాబ్ గెలిచింది. చహల్ బౌలింగ్ పూరన్ సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు. ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఏప్రిల్ 9వ తేదీన చెన్నైలోని చెపాక్‌లో జరిగే ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్-14 సీజన్ ఆరంభం కానుంది. ఇక్కడ చదవండి: మెరుపులాంటి ఫీట్లు.. మతిపోయే క్యాచ్‌లు పంత్ ఒక ప్రత్యేకం.. అది నా వల్ల కానేకాదు: పుజారా -
IPL 2021: కెప్టెన్‌గా ధోని.. రైనాకు దక్కని చోటు
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట ఆర్సీబీ పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్‌ని ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన టీమ్‌కు కెప్టెన్‌గా.. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎన్నుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ స్థానంలో కేన్ విలియమ్స్‌న్, స్టీవ్ స్మిత్‌తో పాటు తన పేరును కూడా డివిలియర్స్ ప్రకటించడం విశేషం. ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. పేస్ బౌలింగ్ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడలకు అప్పగించగా.. స్పిన్ బాధ్యతల కోసం రషీద్ ఖాన్, జడేజాను పరిగణలోకి తీసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై వేదికగా సీజన్ తొలి మ్యచ్‌ను ఆడనుంది. కాగా డివిలియర్స్ తన బెస్ట్ ఐపీఎల్ ఎలెవెన్ టీమ్ కెప్టెన్‌గా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అత్యంత విజయవంతమన కెప్టెన్‌గా పేరు పొందిన రోహిత్ శర్మను కాదని ధోనికే ఓటు వేయడం ఇక్కడ విశేషం. అయితే ఐపీఎల్లో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా పేరున్న సురేశ్ రైనాకు మాత్రం ఏబీ టీమ్‌లో చోటు దక్కలేదు. ఆల్‌టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్‌స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్‌స్టోక్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ చదవండి: IPL 2021: కొత్త కెప్టెన్‌తో రాయల్స్‌కు కలిసొచ్చేనా! వైరల్: ప్రాక్టీస్‌లో ఇరగదీసిన ధోని, రైనా.. -
కోహ్లి, డివిలియర్స్ రన్నింగ్... ఆఖర్లో ఊహించని ట్విస్ట్
బెంగళూరు: ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆర్సీబీ కొత్త ఉత్సాహంతో సిద్దమవుతుంది. ప్రతీ సీజన్లోనూ పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ అసలు సమయంలో మాత్రం చతికిలపడుతుంది. కాగా గతేడాది సీజన్లో మాత్రం ఆర్సీబీ కాస్త మెరుగైన ప్రదర్శనతో ప్లేఆఫ్ వరకు వచ్చింది. అయితే కీలక సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేతిలో పరాజయం పాలై ఒట్టి చేతులతో వెనుదిరిగింది. ఈసారి ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్ రాకతో ఆర్సీబీ మరింత బలంగా కనిపిస్తుంది. తాజాగా కోహ్లి, డివిలియర్స్, దేవ్‌దూత పడిక్కల్ మధ్య ట్విటర్ వేదికగా జరిగిన వీడియో చాటింగ్ నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. మొదట కోహ్లి తన ఇంట్లోని ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీసున్న వీడియోను షేర్ చేశాడు. ఇది చూసిన డివిలియర్స్ వావ్ కోహ్లి.. నీ కసరత్తు పరుగులు తీస్తుంది.. ఇంట్లో నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నావు..నేను కూడా అన్ని ప్యాక్ చేశా.. ఐపీఎల్ ఆడేందుకు వస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. దీనిక బదులుగా కోహ్లి..'' ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా వికెట్ల మధ్య నువ్వు వేగంగా పరిగెత్తగలుగుతావు.. నేను నిన్ను అందుకోవాలి..'' అని తెలిపాడు. దీనికి డివిలియర్స్.. ''అయితే ఇప్పుడు మనిద్దరం సరదాగా రన్నింగ్ రేస్ పెట్టకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం'' అని తెలిపాడు. రన్నింగ్ రేస్‌లో కోహ్లి, డివిలియర్స్ పోటీ పడి పరిగెత్తారు.. ఒకదశలో కోహ్లిని డివిలియర్స్ దాటేశాడు. చదవండి: IPL 2021: ముంబై ఇండియన్స్ మళ్లీ మెరిసేనా ఇంతలో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కోహ్లి, డివిలియర్స్‌ను దాటుకుంటూ దేవదూత్ పడిక్కల్ వేగంగా పరిగెత్తుతూ చివరన ఉన్న లైన్‌ను టచ్ చేశాడు. ''మీకన్నా ముందు నేను ప్రాక్టీస్ ప్రారంభించా.. అందుకే ఇంత వేగంగా పరిగెత్తా .. అయినా సరే మీలాంటి సీనియర్ క్రికెటర్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'' అంటూ దేవదూత్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా పూమా క్రికెట్ ప్రమోషన్లో భాగంగా చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఏప్రిల్ 9న ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 14వ సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ సుయాజ్‌లో చిక్కుకున్నా! One of us wins, all of us win. Am I right? 😉 Hello, @RCBTweets's newest and fastest teammate @pumacricket pic.twitter.com/XHmKTiAgkc — Virat Kohli (@imVkohli) March 30, 2021 -
అతనితో చాట్ చేశా.. ఫామ్‌లోకి వచ్చా: కోహ్లి
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డకౌటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రెండో మ్యాచ్‌లో మాత్రం అజేయంగా 73 పరుగులు సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి.. తర్వాతి మ్యాచ్‌లో మెరవడంతో విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పినట్లయ్యింది. అయితే తాను తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో స్నేహితుడు, ఆర్సీబీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సహకారం ఉందన్నాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల ప్రెజంటేషన్ కార్యక్రమంలో కోహ్లి మాట్లాడుతూ.. తన ఫామ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏబీ డివిలియర్స్‌ను పేరును ప్రస్తావించాడు. ‘నేను తొలి టీ20లో విఫలమైన తర్వాత ఏబీతో చాట్చేశా. నాకు ఏబీ డివిలియర్స్ కొన్ని సూచనలు చేశాడు. ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి డివిలియర్స్‌తో చేసిన చాట్ కూడా ఉపయోగపడింది. ఇక్కడ చదవండి: చాలా మంది చేయలేనిది పంత్ చేసి చూపించాడు.. ఇక టీమ్ మేనేజ్మెంట్ సహకారం కూడా మరువలేనిది. నాకు వారు తగినంత స్పేస్ ఇవ్వడంతో మా ప్రణాళికలు కచ్చితంగా అమలు చేయగలిగాను. నా భార్య అనుష్క శర్మ సైతం నాకు అండగా నిలిచింది’ అని కోహ్లి తెలిపాడు. ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీకి, అరంగేట్రం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత అర్ధశతకం తోడవ్వడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్-10)లో భాగంగా బుధవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ ఆస్టన్ టర్నర్ కొట్టిన ఒక షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్త్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను జేక్ బాల్ వేశాడు. క్రీజులో మిచెల్ మార్ష్, ఆస్టన్ టర్నర్లు ఉన్నారు. బాల్ వేసిన మొదటి బంతిని ఆస్టన్ టర్నర్ ఫైన్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు.. కానీ అప్పటికే బంతి బ్యాట్‌కు సరైన దిశలో తగలడంతో వేగంగా బౌండరీ లైన్‌ను దాటేసింది. (చదవండి: సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!) ఇలాంటి షాట్లను దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎక్కువగా ఆడుతుంటాడు. ఆస్టన్ టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ 17.. అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ జెర్సీ నెంబర్ కూడా 17 కావడం ఇక్కడ యాదృశ్చికం. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ఆస్టన్ ఆడిన షాట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'పడితే పడ్డాడు కాని షాట్ మాత్రం సూపర్‌గా ఆడాడు.. ఏబీ డివిలియర్స్ జెర్సీని ధరించాడే కాబట్టే అలాంటి షాట్లు ఆడాడు.. టర్నర్‌కు డివిలియర్స్ గుర్తుచ్చాడేమో.. ఒక్కసారి టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ చూడండంటూ ' వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం') కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కొలిన్ మున్రో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 16.4 ఓవర్లలోనే 97 పరుగులకే ఆలౌటైంది. జాక్ ఎడ్వర్డ్స్ 44 పరుగులు మినహా ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో అండ్రూ టై 4 వికెట్లు తీయగా.. జై రిచర్డ్సన్ 3 వికెట్లు తీశాడు. How on earth did Ashton Turner do that!? #BBL10 pic.twitter.com/juU0uXH5MW — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
'ఏబీ ఎలా స్పందిస్తాడో చూడాలి'
సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకుతెస్తూ ఆడిన షాట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆండ్రూ టై బౌలింగ్‌లో వికెట్ నుంచి పక్కకు జరిగి అచ్చం ఏబీ తరహాలో ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టాడు. కోహ్లి షాట్ చూసి టీమిండియా సహచరులతో పాటు ఆసీస్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కోహ్లి తన శైలికి భిన్నంగా ఆడిన షాట్లో అతని నైపుణ్యత మరింత పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ.(చదవండి : వీరు విధ్వంసానికి తొమ్మిదేళ్లు) అయితే కోహ్లి తాను ఆడిన షాట్‌పై మ్యాచ్ అనంతరం స్పందించాడు. నేను ఆ షాట్ కొట్టిన సమయంలో హార్దిక్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. బహుశా ఆ షాట్ ఆడుతానని పాండ్యా కూడా ఊహించి ఉండడు. ఈ షాట్ విషయంపై ఏబీకి మెసేజ్ చేస్తాను. అచ్చం అతనిలా ఆడానా లేదా అనేది చెప్తాడేమో చూడాలి. అంతేగాక ఏబీ ఏ విధంగా రిప్లై ఇస్తాడో చూడాలనుందని ' నవ్వుతూ పేర్కొన్నాడు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు') Virat Kohli or AB de Villiers? 🤯 Ridiculous shot from the Indian skipper! #AUSvIND pic.twitter.com/6g8xY8ihIj — cricket.com.au (@cricketcomau) December 6, 2020 కాగా రెండో టీ 20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోహ్లి 24 బంతుల్లో 40తో నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడగా... చివర్లో హార్దిక్ 22 బంతుల్లో 44 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో టీ20 సిరీస్ భారత్ వశమైంది. నామమాత్రంగా మారిన మూడో టీ20ని ఎలాగైనా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. -
మూడోసారి తండ్రైన క్రికెటర్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్ మూడోసారి తండ్రయ్యాడు. అతడి భార్య డేనియల్ ఈనెల 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో భార్యాపిల్లలతో కలిసి ఉన్న ఫొటోను డివిల్లియర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాపకు యెంటేగా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు ‘‘11-11-2020న అందమైన పాపాయి యెంటే డివిల్లియర్స్కు స్వాగతం పలికాం. నీ రాకతో మన కుటుంబం పరిపూర్ణమైంది. నిన్ను ప్రసాదించినందుకు ఆ దేవుడికి మేం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా డివిల్లియర్స్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి: అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్ ) కాగా ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన అనంతరం 2013లో డివిల్లియర్స్- డేనియల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు అబ్రహం జూనియర్, జాన్ ఉన్నారు. ఇక ఇప్పుడు కూతురు జన్మించడంతో డివిల్లియర్స్ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున మైదానంలో దిగిన టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోవడంతో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోగా.. డివిల్లియర్స్ వారి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు చెబుతూనే, అదే సమయంలో అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణ కూడా కోరాడు. View this post on Instagram A post shared by AB de Villiers (@abdevilliers17) -
ఈ బెంగ తీరనిది..!
‘విలియమ్సన్ క్యాచ్‌ను పడిక్కల్ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో’... ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకు. బ్యాటింగ్‌లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో రైజర్స్ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్‌ను తీవ్రంగా ప్రయతి్నంచిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లి పరిణతిని ప్రశ్నిస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి ఐపీఎల్ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం ఈసారి ఐపీఎల్లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్ కలిపి వరుసగా ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది. 2019 ఐపీఎల్లో ఆర్సీబీ టోర్నీ తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. తర్వాత ఐదు మ్యాచ్‌లు గెలిచినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లి ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలవడంతో ఆర్సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచి్చంది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్‌రేట్ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా, ఎలిమినేటర్‌లోనే జట్టు ఆట ముగిసింది. ఏబీ మెరుపు ప్రదర్శన... బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 158.74 స్ట్రయిక్‌రేట్‌తో అతను 454 పరుగులు సాధించాడు. ఏబీ అర్ధసెంచరీ చేసిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు జట్టు గెలిచింది. డివిలియర్స్‌కు ఇతరుల నుంచి సహకారం లభించలేదు. తొలి ఐపీఎల్ ఆడిన యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టు తరఫున అత్యధికంగా 473 పరుగులు చేయడం మరో చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్‌లో 21 వికెట్లతో చహల్ సత్తా చాటగా, ఆరుకంటే తక్కువ ఎకానమీ నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ఆ్రస్టేలియా కెపె్టన్ ఫించ్ వైఫల్యం (268 పరుగులు–1 అర్ధ సెంచరీ) జట్టును బాగా దెబ్బ తీసింది. గాయంతో మోరిస్ 9 మ్యాచ్‌లకే పరిమితం కావడం కీలక సమయంలో సమస్యగా మారింది. సీనియర్ పేసర్లు స్టెయిన్ (11.40 ఎకానమీ), ఉమేశ్ యాదవ్ (11.85)లు ఘోరంగా విఫలమవ్వగా... కోల్‌కతాతో (3/8) ప్రదర్శన మినహా సిరాజ్ భారీగా పరుగులిచ్చాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడే ఒక్క బ్యాట్స్‌మన్ కూడా లేకపోవడం జట్టులో పెద్ద లోటుగా కనిపించింది. కోహ్లి అంతంతే... అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును ఇబ్బంది పెట్టింది. కెపె్టన్ మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రయిక్‌రేట్ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్‌గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్లకంటే (55) ఓడిన మ్యాచ్‌ల సంఖ్య (63) ఎక్కువ. ఈ నేపథ్యంలో కోహ్లి ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతాడా, ఫ్రాంచైజీ యాజమాన్యం మార్పు కోరుకుంటుందా అనేది చూడాలి. బ్యాటింగ్‌పరంగా తాను నెలకొలి్పన ప్రమాణాలను కోహ్లి అందుకోలేకపోయాడు. అతనివైఫల్యమే జట్టును ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇంత కాలం బౌలింగ్ బలహీనంగా ఉండి ఓడిన బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్ బలహీనతతో ఓడింది. –సునీల్ గావస్కర్ 100 శాతం కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనేదే నా అభిప్రాయం. ఈ పరాజయాలకు నేనే కారణమని అతనే చెప్పుకోవాలి. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇన్నేళ్లు ఒక్క ట్రోఫీ గెలవకుండా కూడా కెపె్టన్‌గా ఎవరైనా కొనసాగగలరా. కెప్టెన్సీ విషయంలో ధోని (3 టైటిల్స్), రోహిత్ (4 టైటిల్స్)లతో కోహ్లికి అసలు పోలికే లేదు. సరిగ్గా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అర్హతే లేదు. ఒక్క డివిలియర్స్ ప్రదర్శనతోనే వారు ముందుకొచ్చారు. – గంభీర్ -
ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన డివిలియర్స్
అబుదాబి: అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ తాజా సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్ నిన్నటి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆరోన్ ఫించ్ (30 బంతుల్లో 32, 3 ఫోర్లు, ఒక సిక్స్) సాయంతో డివిలియర్స్ (43 బంతుల్లో 56, ఐదు ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 131 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ల దెబ్బకు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో సహా మొయిన అలీ, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. పేసర్ మహ్మద్ సిరాట్ 10 పరుగులు చేశాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే తక్కువ పరుగులకే ఔటైనా.. కేన్ విలియమ్సన్ (44 బంతుల్లో 50 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (20 బంతుల్లో 24 పరులు, మూడు ఫోర్లు) బాధ్యాయుత ఆటతో విజయం సాధించింది. ఇక కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీ బోల్తా పడటంతో అటు ఆటగాళ్లు, ఇటలు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. (చదవండి: కన్ఫ్యూజ్ చేసిన డివిలియర్స్!) ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ కలగానే మిగిలిపోవడం పట్ల భారమైన హృదయంతో టోర్నీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో బాగా ఆడి అభిమానులను అలరించినప్పటికీ.. అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణలు కూడా కోరాడు. చిరస్మరణీయ పోటీ నుంచి నిరాశగా తప్పుకుంటున్నామని ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది. ఆటగాళ్ల ఫేర్వెల్ వీడియోను షేర్ చేసింది. ఇదిలాఉండగా.. తాజా సీజన్లో 454 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 15 మ్యాచ్‌లో మూడు అర్ధ సెంచరీలు చేసిన ఏబీ 158.7 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఘనత సాధించాడు. (చదవండి: ఆర్సీబీ ఔట్.. కోహ్లి ఎమోషనల్ ట్వీట్!) -
కన్ఫ్యూజ్ చేసిన డివిలియర్స్!
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 132 పరుగుల టార్గెట్‌నే నిర్దేశించగా, సన్‌రైజర్స్ దాన్ని ఇంకా రెండు బంతులు ఉండగా ఛేదించి క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఏబీ డివిలియర్స్(56;43 బంతుల్లో 5 ఫోర్లు)లు మాత్రమే రాణించారు. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు మొయిన్ అలీ ఫ్రీహిట్‌లో రనౌట్ కావడం ఆశ్చర్యపరిచింది. ఫ్రీహిట్ బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా షాట్ ఆడిన మొయిన్ అలీ.. పరుగు కోసం యత్నించాడు. అది రిస్క్ అని తెలిసినా తొందరపాటులో మొయిన్ తడబడ్డాడు. దానికి రనౌట్ కావడంతో డగౌట్లో ఉన్న కోహ్లి ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశాడు.(కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!) ఇదిలా ఉంచితే, అసలు బంతి వికెట్ కీపర్ వరకూ చేరకుండానే బెయిల్స్‌ను గిరాటేయడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి కీపర్‌గా ఉన్న ఏబీ డివిలియర్స్‌ను ముందుగానే పడేశాడు.ఆ బంతిని వార్నర్ కవర్స్‌లో ఆడగా, అంతకుముందే బెయిల్స్ పైకి లేచిపోయాయి. అయితే అక్కడ ఏమి జరిగిందనే దానిపై కాసేపు గందరగోళం నెలకొంది. వార్నర్ వికెట్లను హిట్ చేశాడా.. అనే సస్పెన్స్ చోటు చేసుకుంది. కానీ చివరి ఏబీడీ బెయిల్స్‌ను ముందుగానే పడేశాడని తేలడంతో ఆ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ బంతిని ఆడకుండా కీపర్ బెయిల్స్‌ను లేపేస్తే అది నో బాల్‌గా పరిగణిస్తారు. -
అదొక బోరింగ్ వికెట్.. బేసిక్స్ వికెట్: ఏబీ
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ ఆశలు కాస్త క్లిష్టంగా మారిపోయాయి. ముందుగానే ప్లేఆఫ్స్‌కు చేరుతుందని భావించినా కడవరకూ ఎదురుచూడాల్సి పరిస్థితి వచ్చింది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి నిరాశను కల్గించింది. అదొక భయంకరమైన అనుభూతి. ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ ఈ టోర్నమెంట్ తీరే అలా ఉంటుంది.ఇక్కడ ఏమైనా జరగొచ్చు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవచ్చు..వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవొచ్చు. ఏది ఏమైనా ముందంజ వేయడంపైనే మేము దృష్టి కేంద్రీకరించాం. షార్జా వికెట్ చాలా స్లోగా ఉంది. అవుట్ ఫీల్డ్ ఇంకా నెమ్మదిగా ఉంది. దాంతో బౌండరీలు సాధించడం కష్టంగా మారింది. కేవలం ఒకటి, రెండు పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మాపై ఒత్తిడి పెంచింది. షార్జా వికెట్ ఏదైతే ఉందో అది చాలా బోరింగ్ ఉంది. ఇదొక బేసిక్స్ నేర్చుకుని వికెట్’ అని అని అభిప్రాయపడ్డాడు. (సన్‌రైజర్స్ గెలిచి నిలిచింది..) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను ఆరెంజ్ ఆర్మీ 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో ప్లేఆఫ్ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. వృద్ధిమాన్ సాహా( 39; 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో పాటు మనీష్ పాండే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్(26 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో సన్‌రైజర్స్ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది. -
మొన్న ఏబీ.. ఈరోజు స్మిత్‌ను దించేశాడు
అబుదాబి : ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత చలాకీగా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సృష్టించిన కోహ్లి ఇతర ఆటగాళ్లను కూడా అప్పుడప్పుడు ఇమిటేట్ చేస్తుంటాడు. వారం క్రితం ఏబీ డివిలియర్స్ సూపర్ క్యాచ్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లి ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఇమిటేట్ చేశాడు. ప్రాక్టీస్ సందర్భంగా అచ్చం స్మిత్ బ్యాటింగ్ శైలిని అనుసరించాడు. స్మిత్ బ్యాటింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. బ్యాటింగ్ చేయడానికి ముందు స్మిత్ శరీరాన్ని మొత్తం కదిలిస్తుంటాడు. సరిగ్గా స్మిత్‌ను గుర్తుకుతెచ్చేలా కోహ్లి నిల్చున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి బ్యాట్ పట్టిన తీరు చూస్తే ఆడుతుంది స్మిత్ అనే అనుమానం కూడా కలుగుతుంది. (చదవండి : కోహ్లి రెండు పరుగులు.. వాటిని పరిగణిస్తారా?) కాగా ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతూ టైటిల్ ఫేవరెట్‌గా మారింది. విరాట్ కోహ్లి ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 365 పరుగులతో ఆ జట్టు తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోవడం.. ఆ తర్వాత సునాయాస విజయాన్ని దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే 10 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 7 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ సీఎస్కేతో అక్టోబర్ 25న తలపడనుంది. Imitating Smith 😂. pic.twitter.com/ctb4rX3VhA — Anikethan (@_shortarmjab_) October 21, 2020 -
అనుష్క, విరాట్ ఫోటో వైరల్..
ఇటు సినిమా.. ఇటు క్రికెట్ ప్రపచంలో అనుష్క-విరాట్ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరి కలిసి సరాదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క పండండి బిడ్డకు జన్మనివ్వనుంది. మొదటిసారి తల్లిదండ్రులు కాబోతుండటంతో ఆ ఆనందంలో ఉండే అనుభూతిని విరుష్క జంట ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020లో భాగంగా విరాట్ కోహ్లీ దుబాయ్‌లో ఉండగా ఆయన సతీమణి అనుష్క కూడా అక్కడే ఉన్నారు. చదవండి: రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ! ఇటు క్రికెట్ గ్రౌండ్లో పరుగులతో రెచ్చిపోతున్న విరాట్ మరోవైపు అర్ధాంగితో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇందులో విరుష్క జంట సూర్యాస్తమ సమయంలో భుజాల వరకు నీటిలో మునిగి ఒకరి కళ్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న ప్రకృతి వారిద్దరికి మరింత అందాన్ని తెచ్చింది. దీనికి సంద్యా సమయానా ప్రేమతో.. అన్న అర్థం వచ్చేలా రెడ్ లవ్, సూర్యాస్తమం సింబల్‌ను జత చేశారు. ఈ ఫొటోకు ఉన్న మరో విశేషం ఏమిటంటే.. క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ ఈ ఫొటోని తీయడం. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే క్యాప్షన్ రూపంలో తెలిపారు. కాగా ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విరుష్క కపూల్ చాలా అందంగా, చూడ ముచ్చటగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: విరాట్‌కు 'ఫ్లైయింగ్ కిస్' ఇచ్చిన అనుష్క View this post on Instagram ❤️🌅 pic credit - @abdevilliers17 😃 A post shared by Virat Kohli (@virat.kohli) on Oct 18, 2020 at 7:50am PDT View this post on Instagram "Acknowledging the good that you already have in your life is the foundation for all abundance" - Eckhart Tolle Gratitude to all those who showed me kindness and made me believe in goodness in this world , opening my heart enough to practice the same with the hope to pay it forward 💜 Because ... " After all , we are all just walking each other home " - Ram Dass #worldgratitudeday 💫 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Sep 21, 2020 at 4:09am PDT View this post on Instagram Nothing is more real & humbling than experiencing creation of life in you . When this is not in your control then really what is ? A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Sep 13, 2020 at 3:49am PDT .@AnushkaSharma cheering for @imVkohli post his half century against CSK and Virat dedicating his half century to Anushka today 💕 #Virushka pic.twitter.com/nhj8Y8ypyz — Anushka Sharma FC™ (@AnushkaSFanCIub) October 10, 2020 -
స్మిత్ ప్లాన్ మిస్ ఫైర్; అతను గ్రేట్
దుబాయ్: రాజస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన అనంతరం బెంగుళూరు జట్టు కోచ్ సైమన్ కటిచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం రాజస్తాన్‌నే వరించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు విజయవకాశాలన్నీ రాజస్తాన్ వైపే ఉన్నాయని పేర్కొన్నాడు. 12 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో ఏబీ డివిలియర్స్ రెచ్చిపోయి ఆడటంతో తమ జట్టు గెలుపు ముంగిట నిలిచిందని చెప్పాడు. ‘28 పరుగులు చేసేందుకు 16 బంతులెదుర్కొన్న ఏబీడీ మరో 6 బంతుల్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 19 ఓవర్లో వరసగా తొలి మూడు బంతులను ఏబీడీ మిడ్ వికెట్, లాంగాన్, స్క్వేర్ లెగ్‌లో సిక్సర్లుగా మలిచగా.. ఐదో బంతికి గురుకీరత్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. (చదవండి: హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్: ధనశ్రీ) అప్పటివరకు లెగ్‌సైడ్ బంతులతో తక్కువ పరుగులే ఇచ్చిన ఉనాద్కత్ని రంగంలోకి దించి ఫలితం రాబడుదామనుకున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 10 పరుగులే అవసరమవడంతో ఏబీడీ పని సులువైంది. చివరి ఓవర్ నాలుగో బంతికి మరో సిక్సర్ కొట్టిన డివిలియర్స్ ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. ఏబీడీ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్’ అని కటిచ్ ప్రశంసలు కురిపించాడు. ఇక కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జోఫ్రా 19 వ ఓవర్ వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. ‘అంతకు ముందు చక్కగా బౌలింగ్ చేసిన ఉనాద్కత్ ఆ ఓవర్ కూడా కాపాడుతాడని అనుకున్నా. అయితే, క్రీజులో ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ ఏబీడీ. అందుకే ఆ ఓవర్ మా అవకాశాలను మార్చేసింది. అతనిలాగా మరే ఆటగాడు బంతిని స్టేడియం అన్ని వైపులా పరుగులెత్తించలేడు. అంత ఒత్తిడిలోనూ మెరుగైన బ్యాటింగ్‌తో ఏబీడీ మ్యాచ్‌ని మానుంచి లాగేసుకున్నాడు’అని స్మిత్ పేర్కొన్నాడు. కాగా, శనివారం రాత్రి రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు 7 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏబీ డివిలియర్స్ (22 బంతుల్లో 55 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు)కి దక్కింది. (చదవండి: బాల్ కోసం వెయిట్ చేస్తూ ప్రాణాలతో చెలగాటం) -
ఏబీ... మళ్లీ
‘మిస్టర్ 360’ ప్లేయర్ డివిలియర్స్ సిక్సర్ల మోత... పేసర్ క్రిస్ మోరిస్ వికెట్ల విన్యాసాలు... కెప్టెన్ కోహ్లి కూల్ ఇన్నింగ్స్... వెరసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో సాధికారిక విజయాన్ని కైవసం చేసుకుంది. ఒకదశలో ఓటమి తప్పదా అనిపించే స్థితిలో ఉన్న బెంగళూరును డివిలియర్స్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో గట్టెక్కించాడు. మరోవైపు బ్యాట్స్‌మెన్ రాణించినా, బౌలర్లు విఫలం కావడంతో రాజస్తాన్ రాయల్స్ ఆరో ఓటమిని ఆహ్వానించింది. దుబాయ్: విజయ సమీకరణం ఎంత క్లిష్టంగా ఉన్నా... క్రీజులో డివిలియర్స్ ఉన్నాడంటే జట్టుకు విజయంపై ఎక్కడలేని భరోసా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్–13లో అబ్రహామ్ బెంజమిన్ (ఏబీ) డివిలియర్స్ మళ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ఓటమి బాటను వీడి విజయతీరాలను చేరుకుంది. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప (22 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచాడు. మోరిస్ 4 వికెట్లతో రాయల్స్‌ను కట్టడి చేయగా... చహల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (22 బంతుల్లో 55 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. దేవదత్ పడిక్కల్ (35; 2 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు), గురుకీరత్ సింగ్ (17 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్) ఆకట్టుకున్నారు. సిక్సర్ల హోరు... బెంగళూరు విజయ సమీకరణం చివరి 30 బంతుల్లో 64 పరుగులు. కార్తీక్ త్యాగి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మినహా మిగతా నాలుగు ఓవర్లలో కనీసం ఓ సిక్సర్ బాదిన డివిలియర్స్... 19వ ఓవర్లో ఉనాద్కట్‌పై రెచ్చిపోయాడు. తొలి మూడు బంతుల్లో వరుసగా మిడ్ వికెట్, లాంగాన్, స్క్వేర్ లెగ్‌లో సిక్సర్లతో విజృంభించాడు. ఐదో బంతికి గురుకీరత్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిపై గురుకీరత్ రెండు పరుగులు, రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతి ఎదుర్కొన్న డివిలియర్స్ రెండు పరుగులు తీశాడు. దాంతో బెంగళూరు విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. డివిలియర్స్ మరో అవకాశం ఇవ్వకుండా నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) ఫించ్ (బి) చహల్ 41; స్టోక్స్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 15; సామ్సన్ (సి) మోరిస్ (బి) చహల్ 9; స్మిత్ (సి) షాబాజ్ అహ్మద్ (బి) మోరిస్ 57; బట్లర్ (సి) సైనీ (బి) మోరిస్ 24; రాహుల్ తేవటియా (నాటౌట్) 19; ఆర్చర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మోరిస్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–50, 2–69, 3–69, 4–127, 5–173, 6–177. బౌలింగ్: సుందర్ 3–0–25–0, మోరిస్ 4–0–26–4, ఉదాన 3–0–43–0, సైనీ 4–0–30–0, చహల్ 4–0–34–2, షాబాజ్ అహ్మద్ 2–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవదత్ పడిక్కల్ (సి) స్టోక్స్ (బి) తేవటియా 35; ఫించ్ (సి) ఉతప్ప (బి) శ్రేయస్ గోపాల్ 14; కోహ్లి (సి) తేవటియా (బి) కార్తీక్ త్యాగి 43; డివిలియర్స్ (నాటౌట్) 55; గురుకీరత్ సింగ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–23, 2–102, 3–102. బౌలింగ్: ఆర్చర్ 3.4–0–38–0, గోపాల్ 4–0–32–1, కార్తీక్ త్యాగి 4–0–32–1, ఉనాద్కట్ 4–0–46–0, రాహుల్ తేవటియా 4–0–30–1. -
డివిలియర్స్ విధ్వంసం; ఆర్సీబీ మరో విజయం
దుబాయ్ : ఐపీఎల్13వ సీజన్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో ఆర్సీబీ మరో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఆర్సీబీ బ్యాట్స్మన్లలో డివిలియర్స్ 22 బంతుల్లోనే 55* పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఏబీ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. మిగిలినవారిలో దేవదూత్ పడిక్కల్ 35 పరుగులు, ఆరోన్ ఫించ్ 14 పరుగులు, విరాట్ కోహ్లి 43 పరుగులు, గురుకీరత్ 19* పరుగులు సాధించారు. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాటియాలు తలో వికెట్ తీశారు. కాగా ఇన్నింగ్స్ మధ్య ఓవర్ల వరకు బెంగళూరును కట్టడి చేస్తూ వచ్చిన రాజస్తాన్ బౌలర్లు డివిలియర్స్ విధ్వంసానికి చేతులెత్తేశారు. ముఖ్యంగా ఉనద్కత్ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు, మరో ఫోర్ బాది 25 పరుగులు రాబట్టిన తీరు ఏబీ విధ్వంసానికి మారుపేర.. ఇదే ఓవర్లోనూ మ్యాచ్ మలుపు తిరగడం విశేషం.ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో మూడో స్థానంలో.. ఆర్ఆర్ 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. (చదవండి : స్మిత్,ఊతప్పల జోరు.. ఆర్సీబీ లక్ష్యం 178) అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప (41: 22 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(57: 36 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) అర్థసెంచరీతో మెరవగా, జోస్ బట్లర్(24 25 బంతుల్లో ఫోర్, సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. కాగా రాజస్థాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో 100 పరుగులు దాటింది. స్మిత్, బట్లర్లు కలసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాహల్ వేసిన 18వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన స్మిత్ 17 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే 30 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే స్మిత్ అవుటయ్యాడు. కాగా 19వ ఓవర్లో రాహుల్ తెవాటియా ఫోర్, సిక్సర్‌తో15 పరుగులు సాధించడంతో ఆర్ఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్(2/34), క్రిస్ మోరీస్(4/26) రాజస్థాన్‌ను దెబ్బకొట్టారు. -
అందుకే ఆరో స్థానంలో ఆడించాం: కోహ్లి
దుబాయ్: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనను ఆఖరి బంతికి ఫినిష్ చేశారు పంజాబ్. ఐతే ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్ ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి కంటే ముందు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబెను ఆడించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి ఈ విషయంపై మాట్లాడాడు. 'లెఫ్ట అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలనే ఏబీని ఆరవ స్థానంలో ఆడించాల్సి వచ్చింది. పంజాబ్‌లో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వారిని టార్గెట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. 170 పరుగులు చేయడం సంతృప్తిగా ఉంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు చూసి 19వ ఓవర్లోనే మ్యాచ్ పూర్తి అవుతుందని అనుకున్నా. కానీ ఆఖరి బంతి వరకు బౌలర్లు పోరాడారు. ఆఖరి ఓవర్లో చాహల్‌తో ఎలాంటి చర్చ జరపలేదు' అని కోహ్లి పేర్కొన్నాడు. ఏబీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ 2 (5) పరుగులకే ఔటయ్యాడు. ఇప్పుడున్న ఫామ్‌కు ఏబీ తన స్థానంలో ఆడుంటే జట్టు స్కోర్ 200 పరుగులు దాటేదని విశ్లేకలు అంటున్నారు. కాగా పంబాబ్ జట్టు చివరి ఓవర్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా చాహల్ వేసిన మొదటి ఐదు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతికి గేల్ రన్ ఔట్ అయ్యాడు. చివరి బంతికి పూరన్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. -
కోహ్లి, ఏబీని బ్యాన్ చేయండి: రాహుల్
అబుదాబి: ఐపీఎల్ -2020 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో గెలుపొందిన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆర్సీబీ జట్టు గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు పూమా ఇండియా నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లి, ఏబీ డివిల్లియర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం వస్తే గనుక వీరిద్దరిపై నిషేధం విధించాలని ఐపీఎల్ నిర్వాహకులను కోరతానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. (చదవండి: కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్) ‘‘వచ్చే ఏడాది మీ ఇద్దరు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని నిర్వాహకులను అడుగుతాను. ఎందుకంటే, ఒకానొక సమయంలో, నిర్దిష్టమైన పరుగులు చేసిన తర్వాత ప్రేక్షకులే ఇక చాలు అంటారు. 5 వేల మార్కును చేరుకుంటే చాలు. ఆ తర్వాత వేరే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా’’ అంటూ కోహ్లితో జోక్ చేశాడు. ఇక ఈ సరదా సంభాషణతో పాటు మరికొన్ని సీరియస్ అంశాల మీద కూడా కోహ్లి, రాహుల్ చర్చించారు. ‘‘భారీ షాట్ ఆడి(100 మీటర్లకు పైగా) సిక్స్ కొట్టిన ఆటగాడికి ఆరు కంటే ఎక్కువ పరుగులు ఇచ్చే నిబంధన తీసుకువస్తే బాగుంటుంది. ఓ బ్యాట్స్‌మెన్‌గా ఇది నా అభిప్రాయం’’అని రాహుల్ వ్యాఖ్యానించగా, అయితే ఈ విషయం గురించి ముందుగా బౌలర్లతో మాట్లాడాలి అంటూ కోహ్లి ఆటపట్టించాడు. ఇందుకు స్పందించిన రాహుల్, ఓ బ్యాటర్‌గా మాత్రమే తన అభిప్రాయం చెప్పానంటూ మరోసారి స్పష్టం చేశాడు. ఇక ఒక్క పరుగు కూడా గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కోహ్లి, వైడ్ రివ్యూ గురించి చేసిన ప్రతిపాదనను రాహుల్ స్వాగతించాడు. ఇలాంటి ఓ నిబంధన ఉంటే క్లిష్ట సమయాల్లో జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్, ఒకదాంట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలై కోలుకున్న హిట్టర్ క్రిస్‌గేల్ రేపటి మ్యాచ్‌లో తప్పకుండా ఆడతాడని పంజాబ్ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా గేల్ మెరుపులు చూసే అవకాశం లభిస్తుందని, అతడి రాకతో టీం తలరాత మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్
దుబాయ్ : విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ ఐపీఎల్ 13వ సీజన్లో మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తాజాగా కోహ్లి వాడుతున్న బ్యాట్స్‌తో పాటు కొత్త కిట్‌కు సంబంధించి బోల్డ్ డైరీస్ పేరిట ఆర్సీబీ యూట్యూబ్ చానెల్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో విరాట్ కోహ్లి తన కిట్స్ గురించి క్లియర్ కట్‌గా వివరించాడు. (చదవండి : కనీసం కొట్టే అవకాశం కూడా ఇస్తలేవు) 'ఐపీఎల్ అనే కాదు.. ఏ టూర్‌కు సన్నద్దం కావాల్సి వచ్చినా బ్యాట్ దగ్గర్నుంచి ప్యాడ్స్ వరకు కొత్త కిట్‌ను కచ్చితంగా వాడుతుంటా. నా దృష్టిలో టెస్టు క్రికెట్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తా.. అందుకే టెస్టులకు వాడే కిట్‌ను వన్డే, టీ20ల్లో ఉపయోగించను. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో చాలా వేడి ఉండడంతో దానికి తగ్గట్టుగానే సిద్దమయ్యా. దుబాయ్లె వేడి అధికంగా ఉన్న కారణంతో 10 జతల గ్లోవ్స్ వాడాల్సి వస్తుంది. నా బ్యాట్ కిట్‌లో అన్ని వస్తువులకు సమప్రాధాన్యం ఇస్తుంటా. గ్లోవ్స్ వేసుకోవడానికి ముందు ఒక స్పెషల్ క్రీమ్ అప్లై చేస్తా.. దాని వల్ల నా చేతికి గ్రిప్ వచ్చి బ్యాటింగ్ ఇంకా బాగా చేయగలుగుతున్నా. అంతేగాక ప్రాక్టీస్ సమయంలో మూడు రకాల బ్యాట్లను వాడడంతో పాటు ఒకే కిట్‌లో మూడు పెట్టేంత ప్లేస్‌ను ఏర్పాటు చేసుకున్నా.' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లి సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఏబీ డివిలియర్స్ మధ్యలో కల్పించుకొని కోహ్లి తన బ్యాట్లను ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా దాస్తుంటాడని.. వాటిని ఎలాగైనా దొంగలించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. డివిలియర్స్ మాటలతో కోహ్లి చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. (చదవండి : ఏందిది.. ధోనికి అంపైర్ భయపడ్డాడా?) -
నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 82 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఏబీ డివిలియర్స్ కీలక పాత్ర పోషించింది. ఏబీడీ 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓవర్ ఓవర్‌కు స్కోరు బోర్డులో అంచనాను సైతం తారుమారు చేస్తూ చెలరేగిపోయాడు. నిన్నటి డివిలియర్స్‌పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అసలు ఈ ఇన్నింగ్స్ నమ్మశక్యంగా లేదని కొనియాడాడు. రాత్రి మ్యాచ్ చూసిన తర్వాత, ప్రొద్దుటే లేచిన తర్వాత కూడా ఏబీడీ ఇన్నింగ్స్ గుర్తుకొస్తోంది. ఆర్సీబీ గెలిచిన నిన్నటి మ్యాచ్ డివిలియర్స్ అంతర్జాతీయ రీఎంట్రీ అవసరం ఉందని తెలుపుతోంది. నువ్వు.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో. ఆట మంచిదే. నీ రీఎంట్రీకి ఇది చాలు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.(కోహ్లి.. ఇది ఓవరాక్షన్ కాదా?) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌లో ఛేదించే క్రమంలో కేకేఆర్ పూర్తిగా తేలిపోయింది. శుబ్‌మన్ గిల్(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ..అటు తర్వాత బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించింది. -
కొడితే బంతి బయటపడాల్సిందే !
షార్జా: కోల్‌కతాపై బెంగళూరు జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తిచేశాడు. 77(33) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు బాదాడు. రెండు సిక్సులు ఏకంగా స్టేడియం బయటకు వెళ్లాయి. ఐతే 16వ ఓవర్లో నగర్కోటి వేసిన నాలుగో బంతికి భారీ షాట్ ఆడగా, బంతి స్టేడియం బయటకు వెళ్లి ఒక కారుకు తగిలింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్టేడియం బయట రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినట్టు కనిపిస్తుంది. 'దటీజ్ ఏబీ' అంటూ నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏబీ సిక్సు కొట్టడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/oiaaQT30VB — Simran (@CowCorner9) October 12, 2020 కాగా బెంగళూరు నిర్దేశించిన 194 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా బెంగుళూరు జట్టు 84 పరుగుల భారీ విజయాన్ని నమోదుచేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. (ఇదీ చదండి: మురళీధరన్‌గా విజయ్ సేతుపతి)