Baby Movie
-
Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్
తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్ పడ్డాక ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్‌లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్‌లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది. -
నిర్మాత ఎస్కేఎన్తో ఇబ్బందేమి లేదు : ‘బేబీ’ హీరోయిన్
కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్లో బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) తెలుగమ్మాయిలపై చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం అవుతుందో బాగా తెలిసిందని..ఎస్కేఎన్ అనడం.. ఆ వాఖ్యలు తన చివరి సిసిమా ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేశారంటూ బాగా ట్రోల్ చేశారు. ఆ మరుసటి రోజే ఎస్కేఎన్ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్గా మార్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఈ వివాదంపై స్పందించారు.ఆమె హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘జాక్’(Jack). సిద్ధు జొన్నలగడ్డ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘కిస్’ (kiss Song) సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎస్కేఎన్ కామెంట్స్‌పై వైష్ణవికి ప్రశ్న ఎదురైంది. దీనిపై వైష్షవి స్పందిస్తూ.. ‘ఎన్‌కేఎన్ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చేసిన కామెంట్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదంపై ఆయన ఓ వీడియో కూడా చేసి పెట్టారు. నా పేరు మెన్షన్ చేయనప్పుడు నేనెందుకు స్పందిస్తాను’ అని బదులిచ్చింది. అలాగే ఎస్కేఎన్ బ్యానర్లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ.. ‘బేబీ టీమ్‌తో చేయాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరో చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ టీమ్‌తో కలిసి పని చేయడం నాకు మంచి అనుభవం’ అని చెప్పుకొచ్చింది. -
నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్
'బేబి' సినిమాతో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్‌పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో చాంతాడంత పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: యష్మి ఎలిమినేట్!)'మోస్ట్ అమేజింగ్ తమ్ముడికి హ్యాపీ బర్త్ డే. నాకు కోసం అన్ని చేస్తున్నందుకు థ్యాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. ప్రతిరోజూ నన్ను మోటివేట్ చేస్తున్నావ్. నీ ప్రేమ, కేరింగ్‌తో రోజుని పరిపూర్ణం చేస్తున్నావ్. నా జీవితంలోని అద్భుతానివి నువ్వు. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావ్. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తా. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యూ' అని వైష్ణవి చైతన్య రాసుకొచ్చింది.వైష్ణవి చైతన్య పోస్ట్ బట్టి చూస్తుంటే తమ్ముడిపై బోలెడంత ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్నంతా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
అనంత శ్రీరామ్‌కు ఐఫా అవార్డు
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్‌ను అభినందించారు. ‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్లో ‘బేబి’ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. -
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
69th Filmfare Awards 2024: ఐదు అవార్డ్స్‌తో సత్తా చాటిన ‘బేబి’
69వ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో ‘బేబి’ సినిమా సత్తా చాటింది. 8 నామినేషన్స్‌లో ఏకంగా 5 అవార్డులను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది జులైలో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. (చదవండి: Filmfare South 2024: ఆ మూడు సినిమాలకే దాదాపు అవార్డులన్నీ..)కేవలం కలెక్షన్స్ పరంగానే కాకుండా అవార్డుల పరంగానూ ‘బేబి’ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ల్లోనూ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు సొంతం చేసుకుంది.(చదవండి: ఒక్క సినిమాకు ఆరు అవార్డులు.. కోలీవుడ్‌లో ఎవరికి వచ్చాయంటే?)అలాగే తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి. -
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే?
69వ ఫిల్మ్ ఫేర్ -2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే తెలుగులో దసరా, బలగం, బేబి చిత్రాల్నే దాదాపు అవార్డులన్నీ వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికీ ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)69వ ఫిల్మ్ ఫేర్ తెలుగు-2024 అవార్డ్ విజేతల జాబితాఉత్తమ సినిమా - బలగంఉత్తమ నటుడు - నాని (దసరా)ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (దసరా)ఉత్తమ దర్శకుడు - వేణు (బలగం)ఉత్తమ పరిచయ దర్శకుడు - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సాయి రాజేశ్ (బేబి)ఉత్తమ నటి (క్రిటిక్స్) - వైష్ణవి చైతన్య (బేబి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - నవీని పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటుడు - రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటి - రూపలక్ష్మి (బలగం)ఉత్తమ గాయకుడు - శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబి)ఉత్తమ గాయని - శ్వేత మోహన్ (మాస్టారూ మాస్టారూ- సార్)ఉత్తమ సాహిత్య - అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)ఉత్తమ సంగీతం - విజయ్ బుల్గానిన్ (బేబి)ఉత్తమ సినిమాటోగ్రాఫీ - సత్యన్ సూరన్ (దసరా)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కొల్లా అవినాష్ (దసరా)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా- దసరా) -
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు సలార్: సీజ్ ఫైర్దసరాహాయ్ నాన్నమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిబేబీబలగంసామజవరగమనఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్లోచిరంజీవి (వాల్తేర్ వీరయ్య)బాలకృష్ణ (భగవంత్ కేసరి)ఆనంద్ దేవరకొండ (బేబీ)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ధనుష్ (సర్)నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్లుకీర్తిసురేశ్ (దసరా)సమంత (శాకుంతలం)అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)వైష్ణవీ చైతన్య (బేబీ)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న) ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్ ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)వేణు యెల్దండ (బలగం)శ్రీకాంత్ ఓదెల (దసరా)అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)శౌర్యువ్ (హాయ్ నాన్న)కార్తిక్ దండు (విరూపాక్ష)సాయి రాజేశ్ (బేబీ) -
'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!
'బేబి' సినిమా గతేడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేశ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. గతంలో పలు సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించినప్పటికీ.. 'బేబి'తోనే అందరికీ బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడికి తాజాగా వింత అనుభవం ఎదురైంది. భోజనానికి పిలిచి మరీ షాకిచ్చారు. దీని గురించి స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)'నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, 'నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు' అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, 'బేబీ సినిమా డైరెక్టర్' అని 30 ఫోటో లు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. 'మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫొటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో' అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. ఓ బేబీ' అని సాయి రాజేశ్ రాసుకొచ్చాడు.గతంలో సమంత ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' అనే సినిమా వచ్చింది. 'బేబి' పేరుతో సాయి రాజేశ్ ఓ మూవీ తీశాడు. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్ ఫ్రెండ్ సాయి రాజేశ్ పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించేస్తున్నాడు. ఏదేమైనా 'బేబి' పేరు ఎంత పనిచేసింది!(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందా? ఏమో మరి ఓ షోలో ఈమె సహ నటుడే ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అది ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పబోయే శుభవార్త ఏంటి? ఇంతకీ ఏం చెప్పాడు?షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీలో హీరోయిన్గా చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల ఈమెకు హీరోయిన్గా టాలీవుడ్లో మంచి ఛాన్సులు వస్తున్నాయి. రీసెంట్గా 'లవ్ మీ' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'సుమ అడ్డా' షోలో పాల్గొన్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ చోట హీరో అశిష్.. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు. వెంటనే అందుకున్న సుమ.. రీసెంట్గా పెళ్లి జరిగింది నీకు, చెబితే నువ్వు చెప్పాలి అని సెటైర్ వేసింది.మరి వైష్ణవి చైతన్య నుంచి గుడ్ న్యూస్ అంటే పెళ్లి ఏమైనా చేసుకోబోతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఏదైనా పెద్ద మూవీలో హీరోయిన్గా అవకాశమైనా వచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?) -
సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
బేబీ సినిమా కథ నాదేనంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్సైట్లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయింది. ఫిదా సినిమాతో పాపులర్ అయిన గాయత్రి.. ఐస్ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్ కూడా జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదల అయ్యాక చూసి నేను షాక్ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్. కానీ, సాయి రాజేష్ మాత్రం ఆ కథను తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్ నుంచి సాయి రాజేష్ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
సాయి రాజేశ్ మోసం చేశాడు.. అందుకే బేబీ లీక్స్ రాశా: టాలీవుడ్ డైరెక్టర్
నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ లీక్స్ పేరిట బుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాశంగా మారింది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ శిరీన్ శ్రీరామ్ ప్రస్తావించారు.శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు.ఈ సందర్భంగా శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నా. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేశ్‌తో ఏడాది ప్రయాణం చేశా. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ.. ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి.. ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా. అప్పుడు మాకేం గొడవ జరగలేదు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుకూ..'నాకు దర్శకత్వం అవకాశం ఇస్తానన్నవాడు.. నా కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేశ్‌ను కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చా. కానీ నన్నే మోసం చేశాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు ఫైల్ చేశా. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశా. ఇవాళ దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్యమంలో పీడీఎఫ్, వెబ్ సైట్ కూడా ఉంది.' అని అన్నారు. -
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో, దెయ్యం మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. -
అప్పుడు 'బేబీ'.. ఇప్పుడు 'బ్యూటీ'!
గతేడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బేబి' కచ్చితంగా ఉంటుంది. అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి ఒకడు. ఇప్పుడు ఈయన నుంచి మరో సినిమా వస్తోంది. దానికి 'బ్యూటీ' అని పేరు ఖరారు చేశారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 22న లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్‌ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపించారు. అయితే అందులో కల్ట్ పాయింట్ పట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా నచ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేనని సమాచారం. 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్) -
తెలుగుతనం ఉట్టిపడుతున్న ‘బేబీ’ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్‌కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్‌గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు
బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంగా 'బేబీ' సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. (ఇదీ చదవండి : వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: టాప్ హీరోయిన్) ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ సాయి రాజేశ్‌కు తాను చెప్పానంటూ శిరిన్ శ్రీరామ్ తాజాగా తెలుపుతున్నాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు ఆయన తెలుపుతున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం. ' 2015లో 'కన్నా ప్లీజ్' టైటిల్‌తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు 'ప్రేమించొద్దు' అని టైటిల్ పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 2023లో 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేశ్ డైరెక్టర్‌గా ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన 'ప్రేమించొద్దు' స్టోరీనే అని శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. -
కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్‌లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు.' అన్నారు. -
బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్కేఎన్ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్కేఎన్ తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్‌కెఎన్‌కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. -
బేబీ నిర్మాత 'ఎస్కేఎన్' ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గారు అయిన శ్రీ గాదె సూర్య ప్రకాశరావు గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగ ఆయన మరణించినట్లు తెలుస్తోంది.దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్కేఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నేడు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్‌నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఎస్కేఎన్ కుటుంబం తెలిపింది. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్కేఎన్ మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్‌గా ఆపై పీఆర్ఓగా ఇండస్ట్రీలో తన జర్నీ ప్రారంభించాడు. తర్వాత అల్లు అరవింద్ కుటుంబానితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అతన్ని నిర్మాతను చేసింది. దీంతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడు అయన డైరెక్టర్ సాయి రాజేష్‌తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. . -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!
'బేబి' సినిమాతో నిర్మాత ఎస్కేఎన్.. తెలుగు ఇండస్ట్రీకి క్రేజీ హిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరస మూవీస్ నిర్మిస్తున్నారు. 'బేబి' హీరోహీరోయిన్ కాంబోలో ఓ చిత్రం, రష్మిక మెయిన్ లీడ్‌గా 'గర్ల్‌ఫ్రెండ్' అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) మరోవైపు సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా తీస్తున్న నిర్మాత ఎస్కేఎన్.. తను నిర్మించే ఓ కొత్త మూవీ కోసం 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే 'బేబి' హిట్ కావడంతో అప్పుడు ప్రమోషన్స్ కోసం పోస్టర్స్‌పై కల్ట్ బొమ్మ అని వేశారు. ఇప్పుడు ఈ పదాన్ని ఏకంగా మూవీ టైటిల్ చేసేయడం డిఫరెంట్‌గా అనిపించింది. ఏమైనా బేబి ప్రమోషన్లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్‌తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్గా ఉంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు
సినిమా విజయానికి కంటెంట్ ప్రధాన కారణం.దీనికి రుజువుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు.కథ బలంతో వచ్చి..ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.తక్కువ బడ్జెట్లో నిర్మాణం జరుపుకుని లాభాల పంట పండిస్తున్నాయి. 2023 లో వచ్చిన స్మాల్ మూవీస్ ఇందుకు సాక్షంగా నిలిచాయి. ఒకటో రెండో కాదు..ఎన్నో సినిమాలు..విజయ ఢంకా మోగించాయి. ప్రేక్షకులను కనుల విందు చేసాయి. స్టార్స్ నటించకున్నా కూడా..మంచి కలెక్షన్లు రాబట్టి మేము కూడా ఫేమస్ అని నిరూపిస్తున్నాయి. ఆ మధ్య తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన కీడా కోలా మూవీ థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకు సూపర్ హిట్ స్టెటస్ కూడా దక్కింది. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే...తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు..ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్. తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్‌ను అట్రాక్ట్ చేసాడు. రీసెంట్గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తర్వాత వెంకటేశ్‌తో తరుణ్ మూవీ పట్టాలు ఎక్కాల్సింది. కాని ఈ మూవీ ప్రారంభం అవటం ఆలస్యం అవుతుండటంతో..ఈ లోపు కీడా కోలా మూవీకి మెగా ఫోన్ పట్టుకున్నాడు. మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో విడుదలయింది.మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆడియన్స్ ఈ థ్రిల్లర్ సబ్జెక్టు బ్రహ్మరథం పట్టారు.ఇటీవల మా ఊరి పొలిమేర మూవీకి సెకండ్ భాగం కూడా విడుదల అయింది.అయితే ఈ సారి థియేటర్లలోకి వచ్చింది.ఫస్ట్ భాగానికి వచ్చిన స్పందనతో...రెండో భాగానికి మంచి వసూళ్లు వచ్చాయి.సత్యం రాజేష్,బాలాదిత్యా లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. (చదవండి: వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు) ఈ ఇయర్ హిట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే..మ్యాడ్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి.అంతగా గుర్తింపు లేని యాక్టర్లు నటించిన ఈ కామెడీ డ్రామా..యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ..మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: ప్రభాస్ 'సలార్' షర్ట్ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?) మీడియం రేంజ్ హీరోలకే వందకోట్ల కలెక్షన్లు డ్రీమ్‌గా మారాయి. రేపో మాపో ఈ టార్గెట్ చేరుకోవాలి అనుకుంటున్నారు. అయితే బేబి లాంటి చిన్న సినిమా మాత్రం ..దాదాపుగా వందకోట్ల వసూళ్లుకు దగ్గరగా వెళ్లింది. ఆనంద్ దేవరకొండ కు ..బిగ్ హిట్ లేదు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేశ్‌కు కూడా..ఓ కమర్శియల్ విజయం లేదు. కాని..కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే భారీ విజయం సాధ్యం అయింది శ్రీవిష్ణుకి విజయం వచ్చి చాలా కాలామే అయింది. అయితే ఈ ఇయర్ మాత్రం..ఉహించని సక్సెస్ చూశాడు. సామజవరగమనతో..సూపర్ హిట్ అందుకున్నాడు.డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆడియనన్స్ను ఫ్రెష్ ఫీల్ కలుగజేసింది.సెంటిమెంట్,ప్రేమ,మెసెజ్ లాంటి అన్ని అంశాలతో కట్టి పడేసింది. ఈ సినిమాలో సంభాషణలు ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకున్నాయి. మినిమిం బజ్‌తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో తెరకెక్కింది బలగం. ఈ మూవీ మీద ఏమాత్రం అంచానాలు లేవు. కాని కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ..చిన్న సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చెప్పటానికి పెద్ద ఉదాహారణగా ఈ మూవీ నిలిచింది. చావు చుట్టు తిరిగే ఈ మూవీ స్టోరీ. బందాలు,అనుభందాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మరో విజయం దక్కలేదు.మార్కెట్ కూడా పాడు చేసుకున్నాడు.దాంతో విజయం కంపల్ సరిగా మారింది.ఈ సారి బెదురు లంక 2012 మూవీతో వచ్చాడు.ఈ ఇయర్ థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని..డీసెంట్ హిట్ కొట్టింది.కార్తికేయను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.నేహా శెట్టి ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఇక ఈ నెలలో విడుదలైన మంగళవారం, కోట బొమ్మాళి చిత్రాలు కూడా హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అయితే ఇందులో మంగళవారం చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక కోట బొమ్మాళి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఏడాది వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరులో జరిగే సబ్జెక్ట్‌తో రూపొందిన పరేషాన్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మిస్టర్ ఫ్రెంగ్నెంట్.. సుహాన్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాలు కూడా డీసెంట్ హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. -
సరికొత్త కథతో వస్తోన్న బేబీ నటుడు.. రిలీజ్ ఎప్పుడంటే?
బేబి చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. తాజాగా అతను హీరోగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయికగా నటిస్తోంది. అను ప్రసాద్ దర్శకత్వంలో శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత నిరీష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో అందర్ని ఆకట్టుకుంటుంది. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నామని అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు 'దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ సంగీతమందిస్తున్నారు. -
అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే బేబీ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు. మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు. -
కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత
పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) రియాక్ట్ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్‌లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు. దీంతో ఎస్కేఎన్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తన ఫ్రెండ్ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం. ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్కేఎన్కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు. Sad to know & it's very unfortunate to see their innocence keep money like that Can any one share their contact please Would like to help them — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023 -
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
'బేబి' డైరెక్టర్‌కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
బేబి.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ తీశారు. అద్భుతమైన టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి:'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) అలా ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది 'బేబి'. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్కేఎన్.. ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన ఎస్కేఎన్.. డైరెక్టర్‌కి ఓ కారు బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు బేబి సక్సెస్ అయిన సంతోషంలో బెంజ్ కారుని గిఫ్ట్‌గా అందించారు. దీని ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లో హిట్ అయిన బేబి.. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి రాజేశ్.. తన తర్వాతి సినిమా కూడా ఎస్కేఎన్తోనే చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) -
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్‌కి తగ్గట్టు ఫుల్‌గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్‌కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్‌బండ్‌కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్‌కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్‌తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్‌కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
భయం.. అత్యాశ.. కుట్ర
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ‘బేబీ’ తో ఆడియన్స్ ఎంత ఎమోషనల్ అయ్యారో, ‘గం..గం..గణేశా’ చిత్రంతో అంత ఎంటర్టైన్ అవుతారు. ఉదయ్ కథ, విజన్‌ను నమ్మి ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ కారుమంచి. ‘ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది’’ అన్నారు ఈ చిత్ర సహనిర్మాత అనురాగ్ పర్వతనేని. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది చెప్పలేం. అలా కొన్నాళ్ల ముందు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి, బీభత్సం సృష్టించిన మూవీ అంటే గుర్తొచ్చేది 'బేబి'నే. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లు తీసిన ఈ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ.. యువతకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లిపై కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఆ చిన్న సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. 'బేబి' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఈమె నటనకిగానూ అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చేసే బిజీలో ఉన్న ఈమె.. తాజాగా ఓ యూట్యబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్, సినిమా కష్టాలు అన్ని చెప్పింది. అయితే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. 'నాకు కాబోయే భర్త గురించి పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోవడం లేదు. ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా, అందంగా లేకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి మనసు ఉంటే చాలు' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. అయితే ఈ కాలంలో ఇలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయిలంటే చాలా వెతకాల్సి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటి నుంచి స్ట్రీమింగ్) -
'బేబి'లో వైష్ణవి పెళ్లి చేసుకున్న నటుడితడే! అమ్మాయి చేతిలో మోసపోయానంటూ..
బేబి సినిమా.. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన దృశ్యకావ్యం. చెప్పుడు మాటలు విని తప్పటడుగులు వేసే అమ్మాయి.. ప్రేమించిన అమ్మాయి చేసిన మోసాన్ని తట్టుకోలేక పిచ్చోడైన ప్రియుడు.. చనువిచ్చింది కదా అని అలుసు తీసుకునే కుర్రాడు.. ఇలా ఈ ముగ్గురి కథే బేబి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బేబి క్లైమాక్స్‌లో వైష్ణవి.. హీరోలిద్దరినీ కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లికొడుకు కొన్ని సెకన్లే కనిపించినప్పటికీ బాగా వైరలయిపోయాడు. డైరెక్టర్ కాబోయి యాక్టర్ తనపై బోలెడన్ని మీమ్స్ కూడా వచ్చాయి. ఆ అభాగ్యుడు ఎవరా? అని అప్పట్లో అంతా తలలు బాదుకున్నారు. ఫైనల్‌గా బేబిని పెళ్లి చేసుకుందెవరో తెలిసిపోయింది. అతడి పేరు కృష్ణ మల్లిడి. తనది తూర్పు గోదావరి. ఆయన సోదరుడు వశిష్ట ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తున్నాడు. డైరెక్టర్ అవుదామనుకుని యాక్టరైన కృష్ణ కలర్ ఫోటో సహా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. బేబి సినిమాలోలాగే నిజజీవితంలోనూ ఓ అమ్మాయి మోసం చేసిందంటున్నాడు కృష్ణ. ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లవుతోంది. ఓసారి కారులో వెళ్తుండగా సాయిరాజేశ్ ఈ కథ చెప్పాడు. హీరోయిన్‌తో పెళ్లితో షూటింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో నాపై చాలా మీమ్స్ వేశారు. మొదట్లో కంగారుపడ్డాను. కానీ, ఈ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా ఉంటాయని నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నాను. బేబి సినిమాలోలాగే ఓ అమ్మాయి నన్ను మోసం చేసింది. అప్పటినుంచి ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది. ఆమె నాతో పాటు మరో అబ్బాయిని ఒకేసారి డేటింగ్ చేసింది. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఆమెను వదిలేయాలనుకోలేదు. నాతో పాటు మరొకరితో డేటింగ్.. అందరినీ వదిలేసి నేను నీ ఒక్కదాని గురించే పిచ్చోడిలా ఆలోచించాను. నా మనసంతా నువ్వే నిండిపోయావు అని చెప్పాను. ఆమె మరో అబ్బాయిని వదిలేయడానికి రెడీగా లేకపోవడంతో ఇద్దరితో ఉండమన్నాను. మూడు నెలలపాటు ఆమె నాతో, మరొకరితో ఉంది. నరకం అనుభవించాను. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. భార్యగా ఊహించుకున్న అమ్మాయి నీతో పాటు మరొకరితో ఉంటుందంటే ఆ బాధ భరించలేము. నా వల్ల కాలేదు, ఒకరోజు ఆమెను తిట్టేసి బ్రేకప్ చెప్పేశాను. అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడు. ఇలా నాకు మూడు బ్రేకప్‌లు జరిగాయి' అని చెప్పుకొచ్చాడు కృష్ణ. చదవండి: రతిక గుండెలో ఇంత బాధ మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్.. -
బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథకు యూత్ బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. నా గుండె ఎందుకో అదురుతోంది డైలాగ్.. 'ఊహించని ముగింపుతో వచ్చిన అందమైన ప్రేమ కథ బేబి. ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్ ఓ చిన్న తప్పు చేసింది. ఈ తప్పును ప్రేమించినవాడికి చెప్పి ఉంటే సినిమా ముగింపు మరోలా ఉండేది. కానీ, ఆ తప్పును అతడితో చెప్పకుండా దాన్ని మర్చిపోయేందుకు మరో పెద్ద తప్పు చేసింది. ఏదో జరుగుతున్నట్లు నా గుండె ఎందుకో అదురుతోంది అన్న డైలాగ్‌తో ఏదో గండం రాబోతుందని డైరెక్టర్ ముందే హింటిచ్చాడు. సరిగ్గా అప్పుడే విరాజ్ ఎంట్రీ ఇవ్వడం.. హీరోయిన్ మేకప్ వేసుకోవడం.. తనలో మార్పులు రావడం చూపించారు. ఇంటర్వెల్లో విరాజ్‌కు ముద్దు.. కానీ సెకండాఫ్ ప్రారంభంలో.. హీరో ఆనంద్ ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్ వైష్ణవికి కొత్త ఫోన్ కొనిస్తాడు. కానీ ఎప్పుడైతే విరాజ్ ఐఫోన్ కొనిస్తాడో అప్పుడు ఆనంద్ ఇచ్చిన మొబైల్‌ను డబ్బా ఫోన్ అనేస్తుంది హీరోయిన్. దీంతో అతడు ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు. అతడిచ్చిన ఫోన్‌నే చులకన చేసింది మరి ఆటోవాడితో కలిసి జీవిస్తుందా? అన్న ప్రశ్నను మనలో రెకెత్తించారు. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్.. హీరోయిన్ విరాజ్‌కు కిస్ ఇస్తుంది. కానీ సెకండాఫ్ ప్రారంభంలో తన పెదాలు కడిగేసుకుంటుంది. అంటే తాగిన మత్తులో ఆ పని చేసిందే తప్ప తన ప్రేమ మాత్రం ఆనంద్ మీదే ఉందని అర్థమవుతుంది. హీరోయిన్‌కు చెడ్డ సలహా.. అయితే విరాజ్ తనను వదిలేయాలంటే అతడి దగ్గరకు ఒకసారి వెళ్లి వస్తే సరిపోతుందని హీరోయిన్‌కు ఆమె స్నేహితురాలు చెడ్డ సలహా ఇస్తుంది. కథను ఇలా రాసుకున్న సాయిరాజేశ్ గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఈ పాయింట్‌తో నా సినిమా ఏమైపోతుందోనని భయపడలేదు. ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు కూడా! శారీరకంగా ఒకరికి దగ్గరైన అమ్మాయి ఇంకొకరిని ధైర్యంగా పెళ్లి చేసుకోగలదా? కానీ హీరోయిన్ అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్లైమాక్స్‌తో సినిమా ఆడకూడదు. కానీ ఆడింది. హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది పెట్టుబడికి 7 రెట్ల డబ్బులు వసూలు చేసింది. సమాజం ఇలాగే ఉందని నమ్మారు కాబట్టే జనాలు బేబిని ఆదరించారు. హీరోయిన్ విరాజ్‌కు పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు కలిసిపోయేవారు అనిపించింది. టైటిల్‌కు తగ్గట్లుగా హీరోయిన్ బేబిలాగే ఆలోచించింది. రిస్కులు తీసుకుంటున్న స్క్రీన్‌ప్లేను కూడా జనాలు విజయవంతం చేస్తున్నారని బేబితో నిరూపితమైంది. ఏదేమైనా దర్శకుడు సాహసోపేతంగా తీశారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: పుష్పరాజ్ దెబ్బ.. సెకండ్ పార్ట్‌కు రూ.1000 కోట్ల డీల్..! -
బేబి సినిమాలో హీరోగా ట్రై చేశా.. కానీ డైరెక్టర్ ఆ మాటనడంతో బాధేసింది!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. సాయి రాజేశ్ మొదట ఈ సినిమా కథను ఓ హీరోకు చెప్పేందుకు ప్రయత్నించగా అతడు కథ వినడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదన్న సంగతి తెలిసిందే! దీంతో ఈ సినిమా కథ ఆనంద్ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. ఇకపోతే ఇందులో రెండో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ స్థానంలో తాను ఉండాల్సింది అంటున్నాడు నటుడు అర్జున్ కల్యాణ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు జరిగిన ఓ సంఘటన వల్లే నేను బిగ్‌బాస్‌కు వెళ్లాను. ఇటీవలి కాలంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఓ సినిమాలో(బేబి చిత్రాన్ని ఉద్దేశిస్తూ) రెండో హీరోగా ప్రయత్నించాను. హీరోయిన్ నా స్నేహితురాలు కావడంతో తను నన్ను రిఫర్ చేసింది. డైరెక్టర్ కూడా నా స్నేహితుడే! నేను నటించిన రెండు, మూడు సినిమాల ఫంక్షన్స్‌కు కూడా వచ్చాడు. అయితే అతడి సినిమాకు నేను ట్రై చేశాను. ఆయన మాత్రం.. అర్జున్.. నీకింకా మార్కెట్ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి కావాలనుకుంటున్నాం అని రిజెక్ట్ చేశాడు. ఇలా జరిగిందేంటని నిరాశపడ్డాను. అందుకే నేను బిగ్‌బాస్ షోకి వెళ్లాను. నాకంటూ మార్కెట్ సృష్టించుకోవాలనే షోలో పాల్గొన్నాను. సొంతంగా మార్కెట్ వచ్చేంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమాలు చేయకుండా మార్కెట్ ఎలా వస్తుంది? సినిమాలు చేస్తే కానీ మార్కెట్ రాదు, మార్కెట్ ఉంటే కానీ సినిమాలు రావు. మార్కెట్ లేకపోయినా సరే.. నా టాలెంట్ చూసి పెళ్లికూతురు పార్టీ, ప్లేబ్యాక్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నాడు అర్జున్ కల్యాణ్. చదవండి: జైలర్ సినిమాకు షాక్.. ఆన్లైన్లో HD ప్రింట్ లీక్.. కలెక్షన్స్‌కు దెబ్బ.. ఓటీటీలో.. -
ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు సినిమాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమావాళ్లకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ. చాలామంది ప్రత్యేకంగా ఈరోజే చిత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆరోజు రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్న సరే తమ సినిమాను వాయిదా వేసుకోవడానికో, ప్రీపోన్ చేసుకోవడానికో ఇష్టపడరు. కచ్చితంగా ఫ్రైడేనే విడుదల చేస్తామంటారు. అలా ఈ రోజు(ఆగస్టు 25న) గాండీవధారి అర్జున, బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్(డబ్బింగ్) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో గాండీవధారి అర్జునకు మిశ్రమ స్పందన లభిస్తుండగా బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్‌కు వెళ్లలేని వారి కోసం ఓటీటీలో కూడా కొత్త చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బింగ్ మూవీతో కలుపుకుని నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌ల బ్రో మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు స్లమ్‌డాగ్ హజ్బెండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. బేబి మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. పిజ్జా 3: ద మమ్మీ సైతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పిజ్జా 3 మూవీ థియేటర్లలో విడుదలై కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో వారం రోజులకే దీన్ని ఓటీటీలోకి తెచ్చేశారు. మీరు కూడా పైవాటిలో నచ్చిన మూవీని సెలక్ట్ చేసుకుని ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి.. చదవండి: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ టాక్.. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్.. ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే థియేటర్లలో మహా అయితే ఓ నాలుగైదు సినిమాలు మాత్రం ప్రతి వారం వస్తుండేవి. కానీ ఓటీటీ పుణ్యమా అని ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో కొత్త మూవీస్-వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈసారి కూడా అలానే ఏకంగా 21 సినిమాలు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) అయితే ఈ లిస్టులో తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటిలో బ్రో, బేబీ చిత్రాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అదే టైంలో పలు చిన్న సినిమాలు, వెబ్ సిరీసులు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే దిగువన లిస్టులో 'స్ట్రీమింగ్ అవుతున్నాయి' అని రాసున్నవి గురువారం విడుదలైనవి అని, మిగతావన్నీ శుక్రవారం (ఆగస్టు 25) ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ బ్రో - తెలుగు మూవీ కిల్లర్ బుక్ క్లబ్ - ఇంగ్లీష్ సినిమా యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా - ఇంగ్లీష్ మూవీ హూ ఈజ్ ఎరిన్ కార్టర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) రగ్నారోక్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ స్లమ్ డాగ్ హజ్బెండ్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ద రౌండప్: నో వే ఔట్ - కొరియన్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హాట్‌స్టార్ ఐరన్ హార్ట్ - ఇంగ్లీష్ సిరీస్ ఆఖరి సచ్ - హిందీ సిరీస్ ఆహా బేబీ - తెలుగు సినిమా జీ5 షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ - బెంగాలీ మూవీ బ్లాక్ అండ్ వైట్ - తమిళ సినిమా ఈ-విన్ పార్థుడు - తెలుగు డబ్బింగ్ సినిమా జియో సినిమా బజావో - హిందీ సిరీస్ సైనా ప్లే ఒన్నమ్ సాక్షి పరేతన్ - మలయాళ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ - ఇంగ్లీష్ సిరీస్ లయన్స్ గేట్ ప్లే ఎబౌట్ మై ఫాదర్ - ఇంగ్లీష్ సినిమా మనోరమ మ్యాక్స్ కురుక్కన్ - మలయాళ చిత్రం హోయ్ చోయ్ కుముదిని భవన్ - బెంగాలీ సినిమా ఎమ్ఎక్స్ ప్లేయర్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఇన్ సింగపూర్ - హిందీ సిరీస్ (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) -
ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అందరూ ఆఫీస్, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. వీళ్లతో పాటు సినిమా లవర్స్ ఈ వారం కొత్త సినిమాలు ఏం రాబోతున్నాయా అని వెతికేస్తున్నారు. థియేటర్లలో రిలీజయ్యే వాటిలో 'గాండీవధారి అర్జున' కాస్త ఆసక్తి కలిగిస్తోంది. దీంతో అందరి దృష్టి ఓటీటీ రిలీజులపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వారం 21 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఓ రెండు మూడు మాత్రమే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్-7' గ్రాండ్ లాంచ్‌కి డేట్ ఫిక్స్) ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాల లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22 బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24 రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24 బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25 కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23 ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25 ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25 ఆహా బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25 జీ5 షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ మూవీ) - ఆగస్టు 25 జియో సినిమా లఖన్ లీలా భార్గవ - హిందీ సిరీస్ - ఆగస్టు 21 బజావో (హిందీ సిరీస్) - ఆగస్టు 25 బుక్ మై షో సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇంగ్లీష్ సినిమా - ఆగస్టు 21 హెచ్ఆర్ ఓటీటీ మధుర మనోహర మోహం (మలయాళ చిత్రం) - ఆగస్టు 22 సైనా ప్లే పడచోనే ఇంగళు కాతోలే (మలయాళ మూవీ) - ఆగస్టు 22 ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25 ఆపిల్ ప్లస్ టీవీ ఇన్వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23 వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25 లయన్స్ గేట్ ప్లే ఎబౌట్ మై ఫాదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 మనోరమ మ్యాక్స్ కురుక్కన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25 (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
Baby Movie In OTT: ఓటీటీలోకి బేబి సినిమా.. ప్రకటించిన మేకర్స్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం 'బేబీ'. జులై 14న విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు సుమారు రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమచారం. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే ఆగష్టు 25 నుంచి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్రసారం కానుంది. ఓటీటీ కోసం ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారని తెలుస్తోంది. 10 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రెండురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను రీచ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్ కూడా భారీగా లాభాల్లోకి వచ్చారు. ఇక 25 నుంచి ఓటీటీలోకి వస్తున్న బేబీని చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. -
'బేబీ' బ్యూటీని ఎవరూ పట్టించుకోవట్లేదా.. లేదంటే?
తెలుగులో చిన్న సినిమాలు హిట్ అవ్వడం అరుదు. ఒకవేళ అయినా వసూళ్లు సాధించిన సందర్భాలు తక్కువని చెప్పొచ్చు. అలాంటిది ఈ రెండు విషయాల్లో 'బేబీ' మూవీ సెన్సేషన్ సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా కొన్నాళ్లు ముందు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈమెని తెగ పొగిడేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఈమెని పెద్దగా పట్టించుకోవట్లేదా అని డౌట్ వస్తుంది. (ఇదీ చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. ఆ తర్వాత యూట్యూబర్‌గా మారింది. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ మెల్లమెల్లగా క్రేజ్ పెంచుకుంది. ఈమె అయితే తన కథకు సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకుడు సాయి రాజేశ్.. 'బేబీ' హీరోయిన్గా ఈమెని ఎంపిక చేశాడు. బోల్డ్ స్టోరీకి తోడు ఈమె యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది. దీంతో బోలెడన్ని కొత్త ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ జరుగుతున్నది వేరు అనిపిస్తుంది. 'బేబీ' ప్రొడ్యూసర్ ఎస్కేన్ తీయబోయే రెండు కొత్త సినిమాల్లో వైష్ణవి హీరోయిన్ అనే టాక్ వినిపించింది. కానీ వీటికి ఇంకా చాలా టైముందని అంటున్నారు. అలానే రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్గా తీసుకున్నారని అన్నారు. దీనిపై క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు. 'బేబీ'లో తన క్యారెక్టర్ బోల్డ్ కావడం కూడా బడా నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రాకపోవడానికి కారణమేమో అని వైష్ణవిని కన్ఫ్యూజన్లో పడిపోయినట్లు తెలుస్తోంది. మరి వైష్ణవి నుంచి కొత్త సినిమా కబురు ఎప్పుడొస్తుందో ఏంటనేది చూడాలి. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) -
నా జీవితంలో మీ అందరినీ మరిచిపోను: బేబీ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ఆనంద్, దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించారు. జూలైన 14న థియేటర్లలోకి వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కల్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పేరు ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అంతలా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. (ఇది చదవండి: ఆడిషన్స్ కోసం చాలా కష్టపడ్డా.. 8 ఏళ్ల తర్వాత ‘బేబీ’ చాన్స్: వైష్ణవి చైతన్య) అయితే తాజాగా వైష్ణవి చైతన్య ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరిచిపోనని చెబుతోంది. తన కెరీర్ ప్రారంభం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను పనిచేసిన సంస్థ ఇనిఫినిటం సంస్థ కొత్త బ్యానర్ ఏర్పాటు చేయడంపై అభినందనలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..' నా జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫినిటం. యాక్టర్‌గా నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడే. అక్కడ పని చేసేటప్పుడు ఎప్పుడు అంటుండేవారు. తను ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అవుతుందని. తనకు ఆ సత్తా ఉంది అనేవారు. ఇందుకు నాకు సపోర్ట్‌గా నిలిచినవారికి థ్యాంక్స్. నా జీవితంలో ఇది మరిచిపోలేను. మరీ ముఖ్యంగా నేను ఎక్కడి నుంచి వచ్చానో జీవితాంతం గుర్తుంటుంది. నా జర్నీలో ఉన్న మనుషులు, సంఘటనలు ఎప్పటికీ మరిచిపోను. నా లైఫ్‌లో ఎంత ముందుకెళ్లినా నా మూలాలు మరిచిపోను. మంచి, చెడులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నన్ను బేబీ సినిమాలో చూసి ఇంతలా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.' అంటూ పోస్ట్ చేసింది. బేబీ హీరోయిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో! ) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
థూ.. నా బతుకు అంటూ బేబీ డైరెక్టర్ ట్వీట్, కాసేపటికే డిలీట్!
ఎక్కడ చూసినా బేబి ఫీవరే నడుస్తోంది. ఈ సినిమా వచ్చి 20 రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో వారం కూడా థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూలు చేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో బేబీ టీమ్ సక్సెస్ టూర్స్ చేస్తోంది. అందులో భాగంగా శనివారం నాడు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లింది. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసిన సాయి రాజేశ్ ప్రేక్షకుల స్పందన చూసి షాకైపోయాడట! ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 'బేబీ సినిమాలో ఆనంద్ బర్త్‌డే రోజు హర్ష వచ్చి అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్తాడు. అప్పుడు ప్రేక్షకులు ఫీలవ్వాలని.. పెద్దగా మ్యూజిక్ లేకుండా నిశ్శబ్ధ వాతావారణం ఉండేలా జాగ్రత్తపడ్డాం. హీరో బాధ అర్థం చేసుకుంటారనుకుని బీజీఎమ్ మ్యూట్ చేసేశా.. కానీ ఈరోజు శ్రీకాకుళంలోని ఓ థియేటర్లో వందకు పైగా ప్రేక్షకులు ఆ బాధను ఫీలవ్వాల్సింది పోయి హ్యాపీ బర్త్‌డే ఆనంద్ అని అరిచారు. థూ నా బతుకు' అంటూ ట్వీట్ చేశాడు. తానొకటి తలిస్తే ప్రేక్షకులు మాత్రం మరోలా రెస్పాండ్ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు డైరెక్టర్. ఈ ట్వీట్‌పై ఆనంద్ దేవరకొండ ఫన్నీ ఎమోజీలతో రియాక్ట్ అయ్యాడు. ఏమైందో ఏమో కానీ కాసేపటికే సాయి రాజేశ్ ఈ ట్వీట్ డిలీట్ చేశాడు. బేబి విషయానికి వస్తే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. చదవండి: పుట్టుకతోనే నా కూతురికి అంత పెద్ద కష్టం.. ఏడ్చేసిన హీరోయిన్ -
చిన్న సినిమా.. పెద్ద విజయం
శ్రీకాకుళం అర్బన్: బేబి చిత్ర యూనిట్ శనివారం సిక్కోలులో సందడి చేసింది. శ్రీకాకుళంలోని సరస్వ తి థియేటర్‌కు యూనిట్ రాగా థియేటర్ మేనేజర్ చిన్నరాజు సాదర స్వాగతం పలికారు. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, దర్శకుడు సాయి రాజేష్‌లు ప్రేక్షకులు, అభిమానులతో మా ట్లాడారు. సినిమాలోని డైలాగ్‌ను ఆనంద్ దేవరకొండ చెప్పడంతో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో హాల్‌ను హోరెత్తించారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా ప్రేక్షకులు పెద్ద హిట్ చేసి ఆదరించిన తీరు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ కథలో కంటెంట్ ఉంటే ఎంతటి చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారన్నారు. ముఖ్యంగా సిక్కోలు వాసులు తన చిత్రాలను ఆదరించడం ఎన్నటికీ మరచిపోలేనన్నారు. ఈ రోజు వరకూ బేబి చిత్రం రూ. 87 కోట్లు వసూలు చేసిందన్నారు. తన గత చిత్రాలను కూడా సిక్కోలు వాసులు ఆదరించా రని గుర్తు చేసుకున్నారు. తాను నిర్మాతగా, సుమన్ అనే వ్యక్తి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించనున్న ట్లు తెలిపారు. ఈ సినిమాకు ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచ యమైన హారికా అనే అమ్మాయిని హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నా రు. తన చిత్రాల ద్వారా సంపూర్ణేష్‌బాబు, సుహాన్ లు ఓ స్థాయిలో హీరోలుగా నిలదొక్కుకున్నారన్నా రు. శ్రీకాకుళం యాసతో ఈ జిల్లాలోనే పూర్తిస్థాయి లో షూటింగ్ జరుపుకొని సినిమాను నిర్మిస్తానని తెలిపారు. -
బేబి సినిమా నిర్మాతతో గొడవ.. ఆపై క్షమాపణ చెప్పడంతో..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా 'బేబీ'. సాయి రాజేశ్ దర్శకుడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలిరోజే రూ.7 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టింది. విడుదలై 20 రోజులు దాటిని ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సుమారు రూ.85 కోట్ల మేరకు ఇప్పటి వరకు రాబట్టి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొనసాగుతుంది. (ఇదీ చదవండి: ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్) తాజాగా ఈ సినిమా యూనిట్ విజయ యాత్రలో భాగంగా ఏపీలోని భీమవరం పర్యటించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారితో పాటు కొంతమంది స్థానిక మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారిగా గుంపుగా రావడంతో.. వారు మీడియా ప్రతినిధులు అని గమనించక బౌన్సర్లు తోసేశారు. అంతేకాకుండా వారి పట్ల కాస్త దురుసుగా కూడా ప్రవర్తించారు. దీంతో వారందరూ ఆందోళనకు దిగారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్కేఎన్ కారును వారందరూ అడ్డుకున్నారు. దీంతో కారు నుంచి దిగిన ఎస్కేఎన్తో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన కూడా కొంతమేరకు సీరియస్ అయ్యారు. అనంతరం వారికి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అక్కడున్న వారిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అతన్ని స్థానిక ఆస్పత్రికి ఎస్కేన్ సిబ్బంది తరలించారట. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ #BabyTheMovie #Baby pic.twitter.com/rflAImEYMU — Telugu Scribe (@TeluguScribe) August 4, 2023 -
ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్
చిన్న సినిమాగా విడుదలైన 'బేబి' బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్‌లు నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. అలాగే SKN ఈ మూవీకి నిర్మాత. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టించే దిశగా పయనం అయింది. ఎంతలా అంటే ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ సినిమా 'అర్జున్ రెడ్డి' ని కూడా బేబి బ్రేక్ చేసింది. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) ఈ సినిమా ఇప్పటికి విడుదలై 20 రోజులు దాటింది. త్వరలో ఓటీటీలో విడుదలకు రెడీగా ఉంది. ఇదే విషయంపై తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బేబి సినిమా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సుమారు 3గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. (ఇదీ చదవండి: కార్తీ 'జపాన్' సినిమాకు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే!) దీనిని నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాటితో పాటు ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. 4 గంటల నిడివితో సరికొత్తగా ఓటీటీలో వచ్చే బేబిని మళ్లీ చూసేయండి. -
గొప్ప మనసు చాటుకున్న బేబీ డైరెక్టర్..!
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల సెన్సేషన్ సృష్టించిన సినిమా ఏది అంటే అందరినోట వినిపించే పేరు 'బేబీ'. ఈ సూపర్ హిట్ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్ద స్టార్స్ లేకుండానే రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ మరోసారి రుజువు చేసింది. (ఇది చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) అయితే తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ తన గొప్పమనసును చాటుకున్నారు. ఓ కుటుంబానికి అండగా నిలిచారు. ఏడాది వయసున్న పిల్లవాడి వైద్యానికి తన వంతు సాయంగా రూ.50 వేల రూపాయలు సాయం చేశారు. ఏపీలోని అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న బాలుడు వేడి నూనెలో పడిపోవడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే స్పందించిన బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ యాభై వేల రూపాయల సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. (ఇది చదవండి: నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!) -
హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!
Baby Director Vishwak Sen Issue: తెలుగులో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా అంటే అందరూ 'బేబీ' పేరు చెబుతారు. అంచనాల్లేకుండా, పెద్ద స్టార్స్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెట్టుబడికి ఐదారు రెట్ల లాభాల మేర వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఓవైపు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ.. మరోవైపు 'బేబీ' డైరెక్టర్-హీరో విశ్వక్ సేన్ వివాదం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది. గొడవ ఏంటి? 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ విషయం బయటపడింది. ఓ హీరోకి ఈ కథ చెప్పాలని చూస్తే కనీసం వినను కూడా వినలేదని అన్నాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు విశ్వక్ సేన్ ఓ ట్వీట్ పెట్టాడు. దీన్ని ఉద్దేశిస్తూ బేబీ డైరెక్టర్ ఓ ట్వీట్ పెట్టాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ ఈవెంట్లో హీరో విశ్వక్ బరస్ట్ అయిపోయాడు. కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుందని అన్నాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై దర్శకుడు సాయి రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) అది నాకు నచ్చలేదు 'విశ్వక్ సేన్‌కు 'బేబీ' కథ వినిపించాలని అనుకున్నది నిజమే. కానీ అతడు వినలేదు. దీనికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. బహుశా అతడి ప్రయారిటీ డైరెక్టర్స్ లిస్టులో నేను లేకపోయి ఉండొచ్చు. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే విశ్వక్.. బేబీ మూవీకి నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. తను నో చెప్పిన సినిమా హిట్ అయింది. ఆ హిట్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ అనేసరికి చాలా బాధపడ్డా' అని సాయి రాజేశ్ చెప్పాడు. విశ్వక్పై కోపం లేదు 'అయితే బేబీ రిజెక్ట్ చేశాడని అన్నాను గానీ ఎక్కడ అతడి పేరు చెప్పలేదు. అయితే హీరోల రిజెక్షన్ రెస్పెక్టబుల్‌గా ఉండే బాగుటుందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో విశ్వక్పై నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే అతడి ఫస్ట్ మూవీ 'వెళ్లిపోమాకే' రిలీజ్ కావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్లకు చూపించి, అది రిలీజ్ చేయించాను' అని సాయి రాజేశ్ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుని మరీ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) -
బేబి ఫేమ్ 'వైష్ణవి చైతన్య' తమ్ముడు చేసినపనికి భారీ ట్రోలింగ్
ఇండస్ట్రీలో చాలామంది నటుల్లానే విజయ్ దేవరకొండ కూడా సొంత టాలెంట్‌తోనే ఎదిగాడు. సినిమా అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఎలాంటి పాత్ర వచ్చినా నటించాడు. అలా ఒక్కోమెట్టు ఎదుగుతూ నేటి యువతకు బ్రాండ్‌గా మారాడు. అలాంటి 'లైగర్' పక్కన బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య తమ్ముడు దిగిన ఫోటో ఒకటి ట్రోలింగ్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. (ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్) బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్‌లోకి వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక విజయ్ దేవరకొండతో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆపై వాటిని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలో వైష్ణవి తమ్ముడే హైలెట్ అవుతూ స్టిల్ ఇవ్వడంతో వారికి నచ్చలేదు. అంతేకాకుండా విజయ్‌పైన చెయి వేయడంతో ఈ ట్రోలింగ్‌కు మరింత దారి తీసింది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) వైష్ణవి తమ్ముడి పైనా విజయ్ ఫ్యాన్స్ ఇలా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఏమైనా సాధారణ వ్యక్తిలా ఫీలయ్యావా ఏంటి అంటూ వారు విరుచుకుపడుతున్నారు. 'నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా..? అలా విజయ్ పైనా చెయి వేసి ఫోజు కొడుతున్నావ్.. నీతో ఫోటో దిగేందుకు విజయ్, ఆనంద్‌లు మీ ఇంటికి వచ్చారా..? కొంచెం ఇలాంటి ఆటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది.' అని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరైతే వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అంటుంటే మరికొందరేమో వీడు చైల్డ్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో వార్ ఇంతటితో ఆపేయండని పలువురు అంటుంటే.. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు
బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచానికి తెలిపిన నిర్మాత శోభు యార్లగడ్డ. ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన తనకు నచ్చని విషయం ఏదైనా పరిశ్రమలో జరిగితే తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల మంచి సినిమాను వదులుకున్నాడని శోభు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ వెంటనే దానిని తొలగించాడు. దీంతో ఆ యంగ్ హీరో ఎవరు..? ఆ హిట్ సినిమా ఏమిటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. శోభు చేసిన ట్వీట్లో ఇలా పేర్కొన్నాడు. 'ఇటీవలే సక్సెస్‌లో ఉన్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల మంచి హిట్ సినిమాను వదులుకున్నాడు. మనకు విజయం వచ్చిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.. ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి ఆ హీరో వద్దకు వెళ్ళినప్పుడు తన ఆటిట్యూడ్‌తో కనీస గౌరవం చూపలేదు. ఈ వైఖరి అతని కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయంపై త్వరలో రిలైజ్ అవుతాడని ఆశిస్తున్నా. కొత్తగా వస్తున్న వారికి మినిమమ్ గౌరవం అయినా ఇవ్వాలి. అప్పుడే కెరీర్‌ను బిల్డ్ చేసుకోగలం. ఇలాంటి ఆటిట్యూడ్ తన కెరీర్‌కు ఉపయోగపడదు. ఇది ముందుగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆయన తెలుపలేదు. (ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్) ఇక సోషల్ మీడియాలో పలువురు ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ సినిమా కథను ముందుగా విశ్వక్ సేన్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పాడు. కనీసం అది వినకుండా విశ్వక్ రిజెక్ట్ చేశాడు. ఇదే విషయాన్ని పరోక్షంగా సాయి రాజేష్ చెప్పాడు. అందుకు సమాధానంగా స్క్రిప్ట్ విన్న తర్వాత నో చెప్పడం కంటే ముందే నో చెబితే బాగుంటుందని విశ్వక్ కూడా గతంలోనే కౌంటర్ ఇచ్చాడు. ఇదే గొడవపైన శోభు స్పందించాడంటూ నెటిజన్లు చెప్పుకొచ్చారు. దీంతో కొంత సమయం తర్వాత విశ్వక్ సేన్ గురించి కామెంట్ చేయలేదని శోభు క్లారిటీ ఇచ్చాడు. అంతటితో ఆ గొడవకు తెర పడింది. మరి శోభు చెప్పిన యంగ్ హీరో ఎవరు.. ? ఆ హిట్ సినిమా ఏంటి.. ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. -
Vaishnavi Chaitanya: బ్లాక్ చీరలో కొప్పున పూలెట్టుకుని మెరిసిపోతున్న బేబీ హీరోయిన్
-
బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ (ఫోటోలు)
-
వైష్ణవి చైతన్య మాటలకు దండం పెట్టిన చిరంజీవి..
-
వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి
‘‘సినిమా అభిమానులంటే ఒక రకమైన దురభిప్రాయం ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమను చూస్తున్నాను. ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవడం... ఈ క్రమంలో చదువులపై అశ్రద్ధ వహించి, జీవితంలో పైకి రావాలనే తపన లేకుండా ఉంటారని.. ఇలా సమాజంలో అభిమానుల గురించి దురభిప్రాయం ఉండేది. అలాంటివి నా చెవిన పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాకంటూ అభిమానులు ఏర్పడితే.. నా అభిమానులను చూసి, సమాజం గర్వపడేలా వారిని తీర్చిదిద్దాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి మంచి సామాజిక కార్యక్రమాలు చేశాను. నా పిలుపు మేరకు వచ్చిన నా అభిమానుల గురించి వారి తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా మాట్లాడటం చూస్తుంటే.. నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’’ అన్నారు చిరంజీవి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. మాస్మూవీ మేకర్స్ పతాకంపై సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘బేబీ’విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పాత తరంతోనే ఇండస్ట్రీ ఉంటే అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటుంది. రాజమౌళివంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి వెళ్తున్నాయి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్లను యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకుని కొత్త కంటెంట్‌తో రాగలిగితే అంతకుమించిన ప్రత్యుపకారం ఇండస్ట్రీకి మరొకటి ఉండదు. ఎస్కేఎన్ , సాయి రాజేష్, మారుతి.. ఇలా నా అభిమానులను చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతుంది. నా అభిమానులు చేసిన ‘బేబి’ ప్రయత్నం ప్రజాశీస్సులు పొంది, ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ ఆనందంలో భాగం కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ‘బేబి’ ఎడ్యుకేషనల్ ఫిల్మ్‌లా అనిపించింది. చాలామంది యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయి, సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు. యువతే కాదు..వారి తల్లిదండ్రులు కూడా ఈ మూవీని చూసి, ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాకు, ఆయన మా సినిమా సక్సెస్మీట్కు రావడం సంతోషంగా ఉంది’’ అని ‘బేబి’ చిత్రయూనిట్ పేర్కొంది. -
బేబీ టీంని అభినందించిన చిరంజీవి
-
'బేబీ'పై చిరు ప్రశంసలు.. డైరెక్టర్ తెగ ఎమోషనల్
తెలుగులో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'బేబీ'. విడుదలై మూడు వారాలు అవుతున్నా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడిపోతున్నాయి. అల్లు అర్జున్‌తోపాటు చాలామంది యంగ్ హీరోస్ ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. రీసెంట్గా 'బేబీ' చూసిన ఆయన.. దర్శకనిర్మాతల్ని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) దర్శకుడి భావోద్వేగం 'కల నిజమైన వేళ. నా దేవుడితో(చిరంజీవి) రెండు గంటలు ఉన్నాను. ఆయనకు 'బేబీ' నచ్చింది. ప్రతి విభాగాన్ని మెచ్చుకున్నారు. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. రెండు గంటలు బాబాయ్ రెండు గంటలు. బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి' అని 'బేబీ' దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చిరు కోసం స్పెషల్‌గా అయితే 'బేబీ' చూసి దర్శకనిర్మాతలని చిరు అభినందించారు. అయితే విషయం ఇక్కడితే అయిపోలేదు. మొన్న అల్లు అర్జున్ కోసం పెట్టినట్లు.. ఇప్పుడు చిరంజీవి కోసం స్పెషల్ గా మరో ఈవెంట్ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. బహుశా అది ఈ సినిమాని ప్రశంసించడంతో పాటు అటు 'భోళా శంకర్' ప్రమోషన్‌కి కూడా వర్కౌట్ కావొచ్చు అనిపిస్తుంది. ఇదిలా ఉండగా 'బేబీ'కి 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
‘బేబి ప్రభావతమ్మా’ అంటుంటే ఆనందంగా ఉంది
ఇరవై రెండేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. ఎన్నో పాత్రలు పోషించాను. కానీ ‘బేబీ’సినిమాకు వచ్చినన్ని కాల్స్, ప్రశంసలు ఇంతవరకు రాలేదని అంటున్నారు నటి ప్రభావతి. ఆనందర్ దేవరకొండ, వైష్షవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. చిన్న సినిమాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో ఆనంద్ దేవరకొండ తల్లిగా ప్రభావతి నటించారు. ఈ చిత్రంలో ఆమెది మూగ పాత్ర. హావభావాలతోనే అద్భుత నటన కనబరిచింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అభినందించడం చూసినవాళ్ళల్లో ఆమెను ఎరుగనివారు "ఎవరీ ప్రభావతి?" అని ఆరాలు తీస్తున్నారు. "జైసింహా, మహానటి, మిడిల్ క్లాస్ మెలోడీస్, గోరింటాకు, సాహసం, అమరావతి, అనసూయ, ఏక్ మినీ ప్రేమ్ కథ, గరుడ వేగ, సీటీమార్, లవ్ యు రామ్" వంటి చిత్రాలతోనూ తన నటనకు మంచి మార్కులు సంపాదించుకున్న ప్రభావతి... ఇప్పుడు అందరూ తనను "బేబి ప్రభావతమ్మా" అని పిలుస్తుంటే కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు అంటున్నారు. "బేబి" సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజులు చేస్తూ.. 'అమ్మ'గా వాళ్ళ గుండెల్లో చోటు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. -
Vishwak Sen On Baby Controversy: బేబీ కాంట్రవర్సీపై స్పందించిన విశ్వక్ సేన్
-
రికార్డులు కొల్లగొడుతోన్న 'బేబీ'.. స్టార్ హీరో మూవీ రికార్డ్ బ్రేక్!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం బేబీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించి ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా.. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మౌత్‌టాక్‌తో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.70 కోట్ల మార్కును దాటేసిన బేబీ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్) ఈసారి ఏకంగా కన్నడ స్టార్ యశ్ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్-2 రికార్డ్‌ను బద్దలుకొట్టింది. గతంలో కేజీఎఫ్-2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు రూ.కోటి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం వరుసగా 13 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లను రాబట్టి కేజీఎఫ్‌ను వెనక్కి నెట్టింది. ఈ చిత్రం రిలీజై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లపరంగా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం అర్జున్ రెడ్డి కలెక్షన్లను దాటేసిన బేబీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్) -
'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?
'బేబీ' సినిమా జోరు తగ్గట్లలేదు. ఓ గొడవ ఇంకా చల్లారట్లేదు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ.. 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ చిత్రం విషయంలో ఓ వివాదం ప్రస్తుతం మరింతగా ముదురుతోంది. మొన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు పరోక్షంగా హీరో విశ్వక్సేన్ వాటికి కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!) ఏం జరిగింది? 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' తదితర చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న సాయి రాజేశ్.. 'కలర్ ఫొటో' సినిమాని నిర్మించాడు. అలా కొంతలో కొంత పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 'బేబీ' స్టోరీని రెడీ చేసి హీరో విశ్వక్ సేన్‌ని అప్రోచ్ అయ్యాడట. ఆ దర్శకుడు అయితే కనీసం స్టోరీ కూడా విననని సదరు హీరో అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్.. 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్ లో చెప్పుకొచ్చాడు. కాకపోతే ఓ హీరో అని అన్నాడు తప్పితే అది విశ్వక్సేన్ అని బయటపెట్టలేదు. ట్వీట్ వార్ దీని తర్వాత విశ్వక్ సేన్.. బేబీ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ఓ ట్వీట్ పెట్టాడు. 'నో అంటే నో. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉండండి, అరిచి గోల చేయొద్దు. జస్ట్ రిలాక్స్' అని అందులో రాసుకొచ్చాడు. దీనిపై దర్శకుడు సాయి రాజేశ్ పరోక్షంగా మరో ట్వీట్ తో స్పందించాడు. ఇదలా ఉండగానే ఇప్పుడు ఓ మూవీ ఈవెంట్లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అసలు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. "No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️ — VishwakSen (@VishwakSenActor) July 20, 2023 (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) విశ్వక్ ఏం చెప్పాడు? 'ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. అలా 'కలవలేం, కథ వినలేం' అని చెబుతుంటాం. దానికి కొందరు ఫీలవుతుంటారు. ఈ విషయంలో నేనేం చేయలేను. అందరినీ సంతోషపెట్టడానికి నేను బిర్యానీని కాదు. సినిమా సక్సెస్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ కించపరచొద్దు. అదొక్కటే బాధగా ఉంది' 'చిన్న సినిమా ఇలా హిట్ కావడం ఆనందించే విషయం. వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పాను. మూవీ బాగుందని డైరెక్టర్స్ గ్రూప్ లో ముందు నేనే మెసేజ్ చేశాను. అయినా డైరెక్టర్ని కలవలేదని మీమ్స్ వచ్చాయి. గంటసేపు చర్చించి చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అని నో చెప్పాను' అని విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని మాట్లాడుకుని తేల్చుకోవాల్సింది పోయి, ఇలా బయటపెట్టుకుని ఇద్దరు పొరపాటు చేశారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) -
కలెక్షన్స్‌లో బేబీ ఆల్‌టైమ్ రికార్డ్.. అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్
-
ఆ సీన్ వైష్ణవి నాన్నకు చెప్పాకే తీశా.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం 'బేబీ'. కేవలం మౌత్ టాక్‌తో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా వైష్ణవి చైతన్య పాత్రకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఆమె సంబంధించిన డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాయి. (ఇది చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యుకు హాజరైన డైరెక్టర్ సాయి రాజేశ్ హీరోయిన్‌పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కథ చెప్పగానే తాను మొదట అంగీకరించలేదని.. తాను మరింత క్లారిటీ ఇచ్చాకే ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బెడ్ రూమ్ సీన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ షాట్ గురించి వైష్ణవి వాళ్ల నాన్నకు పూర్తిగా వివరించానని పేర్కొన్నారు. వాళ్లకు చెప్పిన తర్వాత ఆ షాట్ తీశానని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడే ఆపేస్తానని చెప్పానన్నారు. అంతే కాకుండా నీ కెరీర్‌కు ఏదైనా ఇబ్బంది వస్తే మూడు సినిమాల్లో నేను అవకాశమిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాతో మరో సాయి పల్లవి దొరికిందంటూ ప్రశంసలు వస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని సాయి రాజేశ్ అన్నారు. వైష్ణవి గురించి మాట్లాడుతూ..'వైష్ణవిలో ఓ విధమైన హంగర్ ఉంటుంది. ఏదైనా షాట్ రాకపోతే మళ్లీ తనే ఫోన్ చేసి ఈ ఆ షాట్ చేద్దామని చెప్పేదని సాయి రాజేశ్ అన్నారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే? ) -
బేబీ మూవీ ఆల్ టైం రికార్డ్
-
విజయవాడలో సందడి చేసిన ‘బేబీ’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!
విడుదలైన 10 రోజులు అవుతున్నా 'బేబీ' దూకుడు తగ్గట్లేదు. ఇందులో హీరోహీరోయిన్లు వైష్ణవి, ఆనంద్, విరాజ్తోపాటు సహాయ పాత్రల్లో నటించిన వాళ్లు తమ యాక్టింగ్‌తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన కిరాక్ సీత ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనని కొందరు లైంగిక వేధించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని బయటపెట్టింది. 'ఓ ఈవెంట్‌కి నేను వెళ్లొస్తున్న టైంలో కొందరు కుర్రాళ్లు వెంటబడ్డారు. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెబితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ నేను అలా చేయలేదు. కొందరైతే నన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని బెదిరించారు. మరికొందరు నా అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ వీటన్నింటినీ నేను లైట్ తీసుకున్నాను' (ఇదీ చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) 'నన్ను అంతలా బెదిరించినా సరే వాటిని నేను లైట్ తీసుకోవడానికి ఒక్కటే కారణం. నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి, వాళ్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. కానీ నా రియల్ లైఫ్ వేరే అని వాళ్లకు తెలీదు. అందుకే వాటిని పట్టించుకోలేదు. 'బేబీ'లో పాత్ర వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని డైరెక్టర్ నాకు ముందే చెప్పారు' అని కిరాక్ సీత చెప్పుకొచ్చింది. గతంలో యూట్యూబర్ సరయూతో కలిసి వర్క్ చేసిన ఈమె.. ఆ తర్వాత ఏదో సమస్య కావడంతో ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చేసింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో బోల్డ్ తరహా పాత్రల్లో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె, తనని కొందరు బెదిరించారని చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బేబీ మూవీ టీం
-
కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి కొన్ని సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. కంటెంట్ బాగుండి, టైమ్ కలిసొచ్చి బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధిస్తుంటాయి. అలా ఈ మధ్య కాలంలో జనాలకు 'బేబీ' తెగ నచ్చేసింది. ఎంతలా అంటే థియేటర్లలోకి ఈ మూవీ వచ్చి 10 రోజులు అవుతున్నాసరే ఇంకా చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) పెద్దగా ఫేమ్ లేని యువ నటీనటులతో తీసిన 'బేబీ'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వారంపాటు థియేటర్లలో ఆడటమే గగనమైపోయింది. అలాంటిది 'బేబీ' రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్ వసూలైంది. పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే 'బేబీ' చిత్రానికి ఈ ఆదివారం రూ.3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', 'శ్రీమంతుడు', 'భరత్ అను నేను' చిత్రాలతో పాటు అల్లు అర్జున్ 'సరైనోడు' కలెక్షన్స్‌ని అధిగమించిందని స్వయంగా దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అయిపోయింది. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) -
'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'బేబీ' సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 9 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే మూడు-నాలుగు రెట్ల లాభాలతో దూసుకెళ్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ 'బేబీ' ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. అనుకున్న సమయం కంటే ఓటీటీలోకి ఆలస్యంగా రానుందట. (ఇదీ చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమాను ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తీశారు. ముగ్గురికి ముగ్గురు కూడా అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అయితే మూవీని మరో లెవల్ కి తీసుకెళ్లింది. దర్శకుడు ప్రతిభని కూడా కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలా అన్ని అంశాలు 'బేబీ'కి కలిసొచ్చాయి. రిలీజ్‌కి ముందే 'బేబీ' డిజిటల్ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. 4-5 వారాల విరామం తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే థియేటర్లలో వస్తున్న స్పందన చూసి, ఆ నిర్ణయంలో మార్పు జరిగిందని టాక్. కాస్త ఆలస్యంగా అంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరులో తొలివారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!) -
బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!
చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలకు ఆదరణ తగ్గదని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. సినీ ప్రముఖులు కూడా బేబి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రతి పాత్ర అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!) ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. హృదయ కాలేయం సినిమాతో హిట్ కొట్టిన సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి రాజేశ్.. ఈ చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి తీసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎందుకంటే వైష్ణవి పాత్ర డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకు వైష్ణవి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలనుకున్నా. అంతే కాదు తెలంగాణ భాష, యాసపై పట్టున్న అమ్మాయి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని భావించా. అలా అనుకున్న సమయంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటోను నాకు చూపించారు. దీంతో నేను ఆలస్యం చేయకుండా వైష్ణవి సంప్రదించా. ఫస్ట్ తను ఈ కథ చెప్పగానే అంగీకరించలేదు. ఆ తర్వాత నేను ప్రతి సీన్ గురించి తనకు వివరించి చెప్పా. ఆ తర్వాతే తను అంగీకరించింది. నేను చెప్పిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేసింది.' అని అన్నారు. (ఇది చదవండి: కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?) -
కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. 'కలర్‌ఫోటో'తో అలరించిన సాయి రాజేష్‌నే ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్కేఎన్ ఈ మూవీకి నిర్మాత. జులై 14న చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రాన్ని కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మొదటి ఐదురోజులు చాలా థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన బేబి సినిమా కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి. 'మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అనే కొటేషన్‌తో వచ్చిన ఈ సినిమాను చూసిన వారందరూ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో వైష్ణవి పాత్రని కూడా తిట్టుకుంటున్నారు. అంతలా కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే రూ. 60.3 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఒక రకంగా చిన్న సినిమాల పరంగా చూస్తే తక్కువ రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన మూవీగా బేబీ రికార్డు క్రియేట్ చేసింది. (ఇదీ చదవండి: డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్) ఈ సినిమా నిర్మించేందుకు సుమారు రూ. 10 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాక్. సినిమాకు హిట్ టాక్ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే పెట్టుబడి మొత్తం వచ్చేసినట్లే. తర్వాత ఈ మూవీ మంచి లాభాల్లో కొనసాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా అన్ని చోట్ల కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించేసింది. తాజాగా రెండో వారంలో అడుగు పెట్టింది. వీకెండ్ కాబట్టి సినిమా కలెక్షన్స్ మళ్లీ పెరిగాయి. కాబట్టి మరికొన్ని రోజులపాటు బేబీ ఫాలోయింగ్ కొనసాగడం గ్యారెంటీ. Alaa aravai kotla mark ki….9 rojullo#BabyTheMovie pic.twitter.com/uR5FT1JH3m — Sai Rajesh (@sairazesh) July 23, 2023 -
50 కోట్ల 'బేబీ' యాక్టర్స్ కి అంత తక్కువ రెమ్యునరేషనా...?
-
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగానే మొదట్లో ప్రారంభించినా ప్రభాస్ రేంజ్ పెరగడంతో బడ్జెట్ కూడా రూ. 200 కోట్లకు చేరిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న డార్లింగ్.. మారుతి సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది కూడా. (ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్) ఇది ఇలా ఉంటే తాజాగా కల్కి టైటిల్ గ్లింప్స్‌ను వైజయంతి మేకర్స్ రిలీజ్ చేశారు. దానిని చూసిన వారంతా హాలీవుడ్ రేంజ్లో ఉందని ప్రశంసలు కూడా డార్లింగ్ అందుకున్నాడు. ఇప్పటికి కూడా అది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో వాళ్లు మారుతిపై ఇలా ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) 'బేబీ సినిమా గురించి బన్నీ మాట్లాడిన మాటలు ట్విటర్లో షేర్ చేశావ్ అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ నీకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రభాస్ గురించి ఒక్క ట్వీట్ అయినా చేశావా.. ? కల్కి మూవీకి సంబంధించిన గ్లింప్స్‌పై ఒక్క ట్వీట్ అయినా చేశావా..? ఎటువంటి సంబంధం లేకపోయినా నీతో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను మా ప్రభాస్ చేస్తున్నారు. అంకిత భావం, కృతజ్ఞత భావం లాంటివి నీకులేవు' అంటూ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో షూటింగ్లో బిజీ కారణంగా ట్వీట్ పెట్టలేకపోవచ్చు కానీ.. ప్రభాస్‌పై మారుతికి ఎనలేని ప్రేమ, కృతజ్ఞత ఉందని అంటున్నారు. ఇకపోతే రాజా డీలక్స్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రభాస్,మారుతి షూటింటిగ్ స్పాట్ ఫోటోలు కొన్ని ఇప్పటికే బయటకు వచ్చాయి. Every word from our Icon Star and pillar of support @alluarjun garu about our film #BabyTheMovie Appreciation Meet moved our entire team to tears.❤️🔥 Thanks for this Iconic Appreciation sir, it's a big boost. We are overwhelmed with your unconditional love on #Baby… — Director Maruthi (@DirectorMaruthi) July 21, 2023 -
ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!) కాగా.. ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌పై డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు. కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది. ఆ డైలాగ్‌కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్‌లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్‌ను తిడుతుంటే.. విజిల్స్ పడాల్సిన చోట పిన్‌డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్‌కి తెలిస్తే వయోలెన్స్‌లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్‌తో అమ్మాయిని కార్నర్ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్‌ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు. (ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) -
బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన వైష్ణవి
-
బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఆమె నటనకు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమా చూసిన వారు సినిమాలోని ఆమె పాత్రను అంత దారుణంగా తిడుతుంటే. ఆనంద్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా విరాజ్ అశ్విన్ కూడా మెప్పించాడు. ఇంతలా ఆకట్టుకున్న వీరందరికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..? అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‌తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఇందులో లీడ్ రోల్ చేసిన ఆనంద్ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. యూత్ గుండెలపై బలంగా తన మార్క్‌ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్‌గా ఇచ్చారని టాక్. విరాజ్ అశ్విన్‌కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ముఖ్యంగా ఇందులో వైష్ణవి ఫైనాన్సియల్‌గా కూడా చాలా ఇబ్బందులు పడిందని డైరెక్టర్ సాయి రాజేష్ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో చెప్పాడు. దీంతో సినిమా బజ్ తగ్గాక మరికొంత రెమ్యునరేషన్‌గా వైష్ణవికి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కాస్త పక్కనపెడితే తను ఇదే సంస్థతో మరో రెండు సినిమాలు చేయనున్నది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు కూడా. మరోవైపు గీతా ఆర్ట్స్‌లో కూడా ఓ సినిమా ఛాన్స్ రానున్నదని టాక్. -
నన్ను చెల్లెలు అంటే జనాలు చంపేస్తారు
-
ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పటికే పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న పుష్ప-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రిలీజవ్వగా భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) అయితే తాజాగా బేబీ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన బన్నీ క్రేజీ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సినిమాలోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. బేబీ సక్సెస్ మీట్లో డైలాగ్ చెప్పి బన్నీ ఫ్యాన్స్‌లో ఊత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ ఈవెంట్లో మాట్లాడుతూ.. ' సినిమా పేరు పుష్ప: ది రూల్. ఒకటే ముక్క ఉంటది. ఈ డైలాగ్ ఇక్కడ చెబుతానని నేను అనుకోలేదు. కానీ చెప్తున్నా. 'ఇడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్.' అంటూ వేదికపై నవ్వులు పూయించాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరై బేబీ మూవీ టీంను అభినందించారు. కాగా.. పుష్ప-2లో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించనుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the stage. | #Pushpa2 | #PushpaTheRule | pic.twitter.com/QXbEaSnR7S — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023 -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (ఫొటోలు)
-
బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్‌కు రెడీ అయిపోయింది. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్స్ ఎవరన్నా దానిపై ప్రత్యేక చర్చ మొదలైంది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల సైతం బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. (ఇది చదవండి: చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!) కానీ ఆ లోపే కొంతమంది సెలబ్రిటీల పేర్లను నెటిజన్స్ ముందుగానే చెప్పేస్తున్నారు. ఈ సీజన్లో ముఖ్యంగా అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. బుల్లితెర నటి శోభా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. వారితో పాటు సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యాంకర్ దీపికా పిల్లి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పేరు తెరమీదకొచ్చింది. ఇప్పుడిపప్పుడే మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టనుందని ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఎవరినోటా విన్నా బేబీ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా బేబీ హీరోయిన్ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బేబీ సినిమా వైష్ణవి చైతన్య కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు. (ఇది చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి) -
తెలుగు అమ్మాయిలకు.. ఇదేనా రిక్వెస్ట్..!
-
కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే: అల్లు అర్జున్
గత వారం రోజుల నుంచి థియేటర్స్‌ను బేబి రఫ్ఫాడిస్తోంది. సినీ ప్రియుల మాటేమిటో కానీ యూత్ మాత్రం బేబి పేరును తెగ కలవరిస్తున్నారు. ఫలితంగా కలెక్షన్ల వరద పారుతోంది. చిన్న సినిమా అయినా విశేష స్పందన రావడంతో బేబి చిత్రయూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. నేటితో ఈ సినిమా రూ.50 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బేబి అప్రిషియేషన్ మీట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'బేబి సినిమా నాకు చాలా నచ్చింది. సినిమా చూస్తూ లేచి నిలబడి చప్పట్లు కొట్టేస్తున్నా.. అంత బాగా నచ్చింది. నిర్మాత ఎస్కేఎన్, నేను.. కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానులమే! అది మారదు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి సైట్లో ఓ డ్యాన్స్ ఫ్లోర్లో నేను డ్యాన్స్ చేసేవాడిని. అక్కడున్న చిన్న గదిలో ఎస్కేఎన్ ఎన్నో ఏళ్లు ఉన్నాడు. అది వాచ్మెన్ గది కంటే కూడా చిన్నగా ఉండేది. తర్వాత జర్నలిస్టుగా, పీఆర్వోగా, నిర్మాతగా మారి సక్సెస్ అయ్యాడు' అని చెప్పుకొచ్చాడు బన్నీ. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్‌కు అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు. బేబీ విషయానికి వస్తే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా ఎస్కేఎన్ నిర్మించారు. జూలై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో బేబీ సినిమాను తీశారు. అందుకే ఈ సినిమా యువతరానికి బాగా కనెక్ట్ అయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సినీ నటిపై అత్యాచారం.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కి -
స్టేజ్ పై పుష్ప 2 డైలాగ్‌తో దుమ్ము దులిపిన బన్నీ..
-
‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
సినిమా బాగుంటే ఎందుకు చూడరు
‘‘7/జి బృందావన కాలనీ, అర్జున్ రెడ్డి’ సినిమాలు ప్రేమలోని బాధను చూపిస్తాయి. అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. అదే కోవలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘బేబి’ సినిమాని అద్భుతంగా తీశారు సాయిరాజేష్’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బేబి అప్రిషియేషన్ మీట్’కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను చూడరు అంటుంటారు. కానీ అది అబద్ధం.. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సాయి రాజేష్‌గారు చాలా బాగా తీశారు. ఆయన రాసిన కథ విధానం ఇంకా బాగా నచ్చింది’’ అన్నారు. -
వాళ్లకు సారీ చెప్పిన 'బేబీ' డైరెక్టర్!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఆరు రోజుల్లో రూ.43.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. నాలుగైదు రెట్ల లాభాలతో దూసుకెళ్తోంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ యాక్టింగ్.. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి రాజేశ్ డైరెక్షన్‌కి అందరూ ఫిదా అవుతున్నారు, వాళ్లని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో బూతులు, కొన్ని సీన్లపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి స్వయంగా దర్శకుడే స్పందించాడు. ప్రేక్షకులకు సారీ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) 'హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీ బలంగా ఉన్నట్లు సినిమా మొదట్లో చూపించాను. హీరో తన మాటలతో నొప్పిస్తేనే హీరోయిన్ మనసు మరోవైపు చూస్తుంది. ఆ సన్నివేశానికి తగ్గట్లు ఇంటర్వెల్లో కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు..' అనే డైలాగ్‌ని పెట్టుండాల్సింది కాదు. ఆ మాటలు రాయకుండా ఉండాల్సింది. ఈ విషయంలో ప్రేక్షకులు క్షమాపణలు. మిగతావి మాత్రం సినిమాకు కచ్చితంగా కావాల్సినవే' 'బేబీ సినిమా నిడివి విషయంలో తొలుత విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తున్న ఎవరూ కూడా దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే క్లైమాక్స్ కోసం సినిమా మొదట్లో 16 నిమిషాల సీన్ పెట్టాను. దాన్ని ఎంతో కష్టపడి ఎడిట్ చేసి 7 నిమిషాలకు తీసుకువచ్చాను' అని దర్శకుడు సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
'బేబీ' చూసి సురేఖావాణి కూతురు కన్నీళ్లు!
ఈ మధ్య కాలంలో అందరూ ఓ మూవీ గురించి తెగ మాట్లాడుకున్నారు. స్టిల్ ఇప్పటికీ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. అదే 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లలో జోరు చూపిస్తోంది. అలానే చాలామందిని ఎమోషనల్ చేస్తోంది. ఇప్పుడు సురేఖావాణి కూతురిది కూడా అదే పరిస్థితి. 'బేబీ' కథ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితుల స్పూర్తితో తీసిన 'బేబీ'. కథ విషయానికొస్తే.. బస్తీలో ఉండే ఓ అమ్మాయి స్కూల్ చదువుతూ ఎదురింట్లో ఉండే కుర్రాడిని లవ్ చేస్తుంది. పదో క్లాస్ పాస్ అయి, ఈమె కాలేజీకి వెళ్తుంది. మనోడు ఫెయిలై, ఆటో డ్రైవర్ అవుతాడు. ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన ఆ అమ్మాయి.. అక్కడ మరో అబ్బాయితో రిలేషన్లోకి వెళ్తుంది. ఇది ఆటో డ్రైవర్ కుర్రాడికి తెలుస్తుంది. చివరకు ఏమైందనేది 'బేబీ' స్టోరీ. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?) అంతలా ఏడ్చాను ఈ సినిమా చూసిన వాళ్లలో యూత్ చాలామంది 'బేబీ'కి కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖా వాణి కూతురు సుప్రీత మూవీ చూసింది. తన అభిప్రాయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. 'ఏమైన్నా సినిమానా ఇది. ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సీన్‌కి కనెక్ట్ అవుతారు. కచ్చితంగా ఇది చెప్పగలను. ఒట్టేసి చెబుతున్నా. వైష్ణవి చైతన్య అదరగొట్టేసింది. ఆమెని చూస్తే గర్వంగా ఉంది. ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఈ మధ్య నేను ఇంతలా ఏడ్చిన సినిమా మరొకటి లేదు' అని సుప్రీత రాసుకొచ్చింది. 'బేబీ' కలెక్షన్స్ సింపుల్ బడ్జెట్‌తో తీసిన 'బేబీ' అనుహ్యంగా కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈచిత్రం.. ఆరో రోజు కూడా అదే టెంపో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.43.8 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవైపు వర్షాలు దంచికొడుతున్నా.. వసూళ్లు ఒకేలా వస్తుండటం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్ చేసిన బేబీ
-
ఆ డైరెక్టరా? అంటూ ఓ హీరో 'బేబీ' కథే వినలేదు: సాయి రాజేష్
‘‘బేబి’కి నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకం ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో? అనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా సంగీతం, కెమెరా, నటీనటులు.. ఇలా అందరికీ పేరు వస్తుంది.. కానీ నా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా రిస్క్ చేసి ‘బేబి’ చేశాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. బేబీ’కి ఆనంద్ కంటే ముందు ముగ్గురు హీరోలను అనుకున్నామని ఆయన చెప్పారు. అందులో ఓ హీరోని కలిశాక హ్యాండిల్ చేయలేనేమో అని భయపడి వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. దీంతో మరో హీరోకి కథ చెప్పడం కోసం నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకత్వం అయితే చేయనని ఓపెన్‌గానే అన్నట్లు పేర్కొన్నాడు. ‘హృదయం కాలేయం’ సినిమాతో తనపై పడిన ముద్ర అలాంటిదని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే ‘బేబి’ జాతకం మారిపోయింది. ఆ రోజంతా చాలా బాధపడ్డానని, ఆరోజు నిద్రకూడా పట్టలేదని తెలిపాడు. నిజానికి ‘బేబి’తో పోలిస్తే 'హృదయ కాలేయం'లాంటి సినిమా చేయడమే కష్టమని సాయిరాజేశ్ చెప్పాడు. -
అమీర్‌పేట్‌లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది: సుకుమార్ ప్రశంసలు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ బేబీ. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గేట్లేదు. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వ వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంర్ల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం అభినందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!) సుకుమార్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'చాలా కాలం తర్వాత ఓ అసాధారణమైన రచనను చూశా. కచ్చితంగా ఈ సినిమా కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది. సినిమాలోని పాత్రల తరహాలో సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. మంచి కథను అందించిన సాయి రాజేశ్‌కు నా వందనాలు. ఇలాంటి సంప్రదాయేతర సినిమాని సాధికారత కల్పించినందుకు ఎస్కెఎన్, మారుతీలను అభినందిస్తున్నా. వైష్ణవి ఇప్పటివరకు చేసిన ఐకానిక్ పాత్రలలో ఇది ఒకటి. వైష్ణవి చైతన్య తన పాత్రకు ఊపిరి పోసింది. ఆనంద్ చాలా తెలివైనవాడు. అతను తన పాత్రలో లీనమైపోయాడు. విరాజ్ తన మార్కు చూపించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్. బేబీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనల.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బేబీ.. బాక్సాఫీస్ బద్దలు
-
'బేబీ' హిట్ అవడానికి అదే కారణం: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'బేబీ' సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ యాక్టింగ్‌కి, నిర్మాతగా ఎస్కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబు తదితరులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే ఈవెంట్లో 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'విజయ్ యాక్టింగ్‌కు నేను అభిమానిని. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ల వల్లే ఇవాళ ఈ వేదిక మీదున్నా. ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తాను. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు. కానీ ప్రయత్నిస్తే నాకు బేబీ సినిమా అవకాశం వచ్చినట్లే మీకు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే ఇన్నేళ్ల నుంచి దీని కోసమే కదా కష్టపడింది అనిపిస్తోంది. మా సినిమాకు రియల్ హీరోస్ మా టెక్నీషియన్స్' అని చెప్పింది. (ఇదీ చదవండి: నాలుగో రోజు కూడా 'బేబీ'కి ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!) విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'థియేటర్లో కూర్చున్న వెంటనే 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట వచ్చింది. అప్పుడే ఒక మంచి లవ్ స్టోరీ చూపిస్తున్నారనే ఫీల్‌లోకి వెళ్లిపోయా. ఇప్పుడు ఈ సినిమా గురించి డిబేట్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లుంటారు. నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు. వారి గుడ్ ఫ్రెండ్షిప్ తెలుసు. వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు' 'దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్‌గా అటెంప్ట్ చేశాడు. అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను. అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి ఈ టీమ్... ఒకరి సపోర్ట్‌తో మరొకరు ఇలా వస్తున్నాం. మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి మంచి పేరొచ్చింది. 'బేబీ' మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా' అని విజయ్ దేవరకొండ అన్నారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!) -
నాలుగో రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!
Baby Movie Collection: కొన్నిసార్లు మనం అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటినే అద్భుతాలు అంటారు. సినిమాల విషయంలోనూ అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 'బేబీ' సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఇప్పుడు అదే మాట గుర్తొస్తుంది. ఎందుకంటే 'ఆదిపురుష్' లాంటి సినిమాలో నాలుగో రోజుకి డీలా పడిపోయాయి. 'బేబీ' మాత్రం గుర్రంలా దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!) నాలుగో రోజు కూడా అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైన 'బేబీ' సినిమా యూత్‌కి తెగ కనెక్ట్ అయిపోయింది. సింగిల్, రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లు.. ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. వైష్ణవి పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'బేబీ' నాలుగురోజైనా వర్కింగ్ కూడా హౌస్‌ఫుల్స్‌తో కళకళలాడిపోయింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజే రూ.7.5 కోట్ల గ్రాస్ వసూలైంది. కళ్లుచెదిరే లాభాల్లో మొత్తంగా చూసుకుంటే కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. రెండో రోజుకే పెట్టుబడి తిరిగి తెచ్చేసుకున్న 'బేబీ'.. మూడోరోజుకి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రస్తుతం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభాల్లో ఉన్నారు. ఈ శుక్రవారంలోపు రూ.50 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుందని అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో? 🙏🏻 em cheppaali …1st day kante working day roju ekkuva 🙏🏻 Dear telugu audience 🙏🏻 pic.twitter.com/GjkGjO9199 — Sai Rajesh (@sairazesh) July 18, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా?) -
హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో 'బేబీ' సినిమా మానియా ఏ మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సినిమా బాగుంటేనే వీకెండ్లో థియేటర్లు ఫుల్ అవడం అంతంతమాత్రమే.. అలాంటిది ఈ కల్ట్ లవ్ స్టోరీ సినిమా దెబ్బ యూత్ గుండెలపైన డైరెక్ట్‌గా కొట్టడంతో సోమవారం కూడా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా విజయంతో చాలా మంది లైమ్‌లైట్‌లోకి వచ్చారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్,మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్‌లకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్‌లకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఇలా వీరందరికీ బేబీ సినిమా ఊహించలనేంత పేరును తీసుకొచ్చింది. కానీ అందరూ ఆ బేబీ (వైష్ణవి) గురించే కాకుండా హీరోయిన్ పక్కన నటించిన మరో అమ్మాయి గురించి కూడా ఇంటర్నెట్లో నెటిజన్లు వెతుకుతున్నారు. ఇంతకు ఆమె పేరే 'కుసుమ డేగలమర్రి'. తనకు ఇదే మొదటి సినిమా కానీ.. ఇప్పటికే యూట్యూబ్ కోసం పలు షార్ట్ ఫిలిమ్స్‌లో కుసుమ నటించింది. అందులో ఆర్య-3 ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. మొదట సోషల్ మీడియా ద్వారానే వారి టాలెంట్ చూపించుకుని తర్వాత సినిమాల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు కుసుమ కూడా అదే బాటలో పయనిస్తుంది. తనకు అందంతో పాటు టాలెంట్‌లో కూడా ఏ మాత్రం తీసిపోని కుసుమ సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. బేబీ సినిమాలో పల్లెటూరి పిల్లాల నటించిన కుసుమ ట్రెండీ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బేబీ సినిమా తెచ్చిన ఫేమ్‌తో తనకు మరిన్ని సినిమా అవకాశాలు రానున్నాయని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kusuma Degalamari (@kusuma_degalamari) (ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..) -
వైష్ణవి చైతన్య ఇకనుంచి నీ టైం స్టార్ట్ అయ్యింది.. జాగ్రత్త..
-
వైష్ణవిని గట్టిగ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను..
-
అమ్మ నాన్న మీకు కచ్చితంగా చెడ్డ పేరు తీసుకురాను..
-
వైష్ణవి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది
-
డైరక్టర్ మాటలకు ఏడ్చేసిన వైష్ణవి చైతన్య
-
బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
SKN స్పీచ్ తో దద్దరిల్లిన స్టేజ్
-
సెల్ఫీ కోసం విజయ్ ఫ్యాన్ ఎం చేసాడో చూడండి
-
'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?
Baby Movie Director Details: ప్రస్తుతం ఎవరిని కదిపినా డిస్కషన్ అంతా 'బేబీ' గురించే. ఎందుకంటే రియలస్టిక్ లవ్‌స్టోరీతో తీసిన ఓ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా కాలమైపోయింది. సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకున్న 'బేబీ'.. యూత్‌కి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఇది దర్శకుడి రియల్ లైఫ్ ప్రేమకథేనా అని సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశలన్నింటిపై స్వయంగా ఆ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు. తెలిసిన కథే 'బేబీ' సినిమాలోని కథ కొత్తదేం కాదు. బస్తీలో పెరిగిన ఓ అమ్మాయి, తన ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయిని స్కూల్లో ఉన్నప్పుడు లవ్ చేస్తుంది. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత మరో అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్తుంది. ఏకంగా ఆ విషయంలో అడ్వాన్స్ అవుతుంది. ఇది మొదటి బాయ్ ఫ్రెండ్‌కి తెలిసిపోతుంది. దీంతో గొడవ జరుగుతుంది. చివరకు ఏమైందనేది అసలు స్టోరీ. రోజూ పేపర్, న్యూస్‌లో చదివే వార్తలానే ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు చాలామందికి అనిపించింది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) అదే కారణం 'బేబీ' సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించగా అందులో దర్శకుడు సాయి రాజేశ్‌కు.. అసలు ఈ సినిమాకు ప్రేరణ ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. '20 ఏళ్ల క్రితం నేను లవ్ చేశాను. ఓ 8 నెలలపాటు చాలా బాధ, కఠినమైన పరిస్థితులు అనుభవించాను. ఇది జరిగి చాలా కాలమైపోయినప్పటికీ ఆ బాధ అలానే ఉండిపోయింది. దాన్ని స్క్రీన్‌పై చూపిద్దామనే ఆలోచనతోనే ఈ స్టోరీ రాసుకున్నాను' అని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ నాది కాదు 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ పాత్ర మీదేనా అనే ప్రశ్నకు డైరెక్టర్ సాయి రాజేశ్ సమాధానమిచ్చారు. 'ఆనంద్ పాత్ర నేను కాదు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. నా ఫస్ట్ లవ్ నా భార్యనే. కాకపోతే లవ్‌లో ఉన్నప్పుడు 8 నెలలు బాధ అనుభవించాను. ఆమెని ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడుందో తెలియకపోయేసరికి తెగ ఇబ్బంది పడ్డాను. ప్రేమలో నేను సక్సెస్ అయినా.. నా పిల్లలు ఎక్కడ లవ్ చేస్తారో అనే భయముంది. వాళ్లు నాలా బాధపడకూడదనే ఫీలింగ్ లోలోపల ఉంటుంది. ఇదంతా నేను స్క్రీన్‌పై చూపించాను' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) -
'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!
Baby Movie Collection: 'బేబీ' అస్సలు తగ్గట్లేదు. బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. సాధారణంగా తక్కువ బడ్జెట్ సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా సరే పెట్టుబడి రిట్నర్ అయి, బ్రేక్ ఈవెన్ కావడానికి తక్కువలో తక్కువ వారమైనా పడుతుంది. కానీ ఈ మూవీ మాత్రం జస్ట్ మూడు రోజుల్లోనే ఫ్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో తీసిన 'బేబీ'లో మెయిన్ హైలెట్ పాటలు. కథ ఇప్పటి జనరేషన్ కి రిలేట్ అయినప్పటికీ.. అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. దీనికి తోడు లీడ్ రోల్స్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అయింది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అవేవి కలెక్షన్లని అడ్డుకోలేకపోతున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ 'బేబీ' హవా నడుస్తోంది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ రూ.23.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించారు. దీనిబట్టి చూస్తే.. ఇకపై వచ్చే వసూళ్లంతా కూడా లాభాల కింద లెక్క. 'బేబీ' మూవీని రూ.7 కోట్లు పెట్టి తీశారనే సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే లాంగ్ రన్ లో రూ.40-50 కోట్ల వరకు గ్రాస్ వసూలయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిర్మాతలకు పెట్టుబడి మీద 2-3 రెట్లు లాభాలు రావడం గ్యారంటీ. బేబీ మూడు రోజుల కలెక్షన్స్ నైజాం 8,56,50,706 వైజాగ్ 2,82,56,239 ఈస్ట్ 1,38,06,945 వెస్ట్ 83,00,334 కృష్ణా 1,33,22,572 గుంటూరు 1,08,04,046 నెల్లూరు 69,56,210 సీడెడ్ 2,09,11,880 కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 77,93,808 ఓవర్సీస్ 3,94,00,000 మొత్తం 23,52,02,740 CULT BLOCKSBUSTER #BabyTheMovie proves it yet again that content is the king 👑 Breakeven in all areas with 23.5 Crores and racing into profit zone in just 3 days 💥 Experience the #CultBlockbusterBaby https://t.co/W41DguZjiF pic.twitter.com/IuY5kImUnN — Ramesh Bala (@rameshlaus) July 17, 2023 (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) -
లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్
ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా జులై 14న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. మొదట్లో టిక్‌టాక్, యూట్యూబ్ వీడియోలతో జర్ని ప్రారంభంచి వెండితెరపైన మెరిసింది. ఈ సినిమా వల్ల హీరోయిన్ వైష్ణవికి మంచి గుర్తింపు దక్కింది. తను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) ఎక్కడో ఓ బస్తీ నుంచి టిక్‌టాక్ వీడియోలు చేసుకొంటూ ఇంత దూరం వచ్చానని వైష్ణవి చెప్పింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబడగలననే ధైర్యం నాగతం నాకు ఇచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రయాణానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీంతో ఎన్నో ఇబ్బందులు కూడా చూశానని చెప్పింది. నిజానికి హీరోయిన్ అవ్వాలనో, ఏదేదో చేసేయాలనో తనకు లేదని, సినిమాల్లోకి రావాలి, స్థిరపడాలి.. అంతే తన ఆశ అంటూ పేర్కొంది. కానీ బేబీ అంతకు మించి గుర్తింపు ఇచ్చిందని తెలిపింది. బోల్డ్ సీన్స్ గురించి 'ఒక సినిమాలో రొమాన్స్, లిప్‌లాక్ సీన్లలో నటించడం చాలా కష్టం. కానీ నా అదృష్టం ఏమిటంటే బేబీ టీమ్ నన్ను కంఫర్ట్‌గా చూసుకున్నారు. ఆ సీన్ చేసే రోజు సెట్లో చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ రోజు విరాజ్ అశ్విన్ కూడా ఇలా అన్నాడు 'సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో అన్నాడు. అంతేకాకుండా ఇదీ జస్ట్.. మనం నటిస్తున్నామంతే' అంటూ ధైర్యాన్ని నింపాడు. ఆ సమయంలో నేనూ కూడా సన్నివేశంలో భాగంగానే చూశాను. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారు. కానీ సినిమాను పూర్తిగా చూసిన తర్వాత ఆ లిప్‌లాక్, బోల్డ్ సీన్స్ గుర్తుండవు. ఇందులో అంతకు మించిన భావోద్వేగాలు చాలా ఉన్నాయి. 'అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం') -
Baby Movie Memes: 'బేబీ'కి ఫిదా అయిన యూత్.. ఈ మీమ్స్ చూస్తే ఏం క్రియేటివిటీరా అంటారు
'మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అని 'బేబీ' సినిమా దర్శకుడు సాయి రాజేష్ ముందే చెప్పాడు. అలాగే ఈ కథను కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు జులై 14న విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే బేబీ కథ యూత్ గుండెల్ని బలంగా తాకింది. ఇందులో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకుపోయారని చెప్పవచ్చు. 'బేబీ' కథలో మాధుర్యంతో పాటు విషాదం కూడా ఉంది. హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్‌లో ఫీల్ గుడ్, ఎమోషనల్ టచ్ ఉందని నిరూపించిన సినిమా ఇది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సినిమా చూస్తూ కథకు కనెక్ట్ అయిన యూత్ వైష్ణవి పాత్రను దారుణంగా తిట్టుకుంటున్నారు. అంతలా ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. చివరకు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ కూడా వైష్ణవిని తిట్టకండి అని, ఇదీ కథలో భాగమే అంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ సినిమాపై పలు ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఉపేంద్ర హీరోగా నటించిన ఓ సినిమాలోని సీన్ అందరినీ నవిస్తోంది. ఈ మీమ్స్ మీరు కూడా చూసేయండి. Just Imagine Upendra As Hero In #BabyTheMovie 😆😂 pic.twitter.com/Ovf9lIiajP — PawanKalyan Devote (@SidduOfficial) July 15, 2023 My committed friend after watching Baby Movie 🚶🏻♂️ #BabyTheMovie pic.twitter.com/iizZdj6vpz — crusher 🙂💦 (@crusherrrrrrrr) July 15, 2023 Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/9wPFOKQ5v2 — SalaarMania™ (@Salaarmania28) July 15, 2023 #BabyTheMovie Singles while watching movie :🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣🤣 pic.twitter.com/Y4li8x1kcU — VenkyCHARAN (@RC_diehard_fan) July 16, 2023 #BabyTheMovie Thank uuu anna @sairazesh pic.twitter.com/jcCHJU9lTc — PESSIMIST 🥀🏃 (@ArjunPalwai_) July 14, 2023 Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/5tvt5qam4K — 🔸సిద్ధార్థ _రాయ్ 💫 #OG (@Siddu4PSPK) July 14, 2023 #BabyTheMovie Girls while watching baby movie 🌚🌝 pic.twitter.com/og2BlK11SB — Rajinikanth (@NameisNaniiiii) July 15, 2023 #BabyTheMovie in 30 seconds: pic.twitter.com/LzlDpxi5cW — చాండ్లర్😳 (@chandler999999) July 15, 2023 After watching #BabyTheMovie Singles be like : 👇#BabyMovie pic.twitter.com/R1YNzn0VU5 — ʇɹǝʌoɹʇuI (@the_introwert) July 15, 2023 Babyyyyyyyyy 🏃🏃♀️#BabyTheMovie #BabyMovie #AnandDeverakonda #VaishnaviChaitanya pic.twitter.com/Db3HpRjvhQ — Addicted To Memes (@Addictedtomemez) July 15, 2023 #BabyTheMovie Plot pic.twitter.com/IrPFHY8t18 — .......🕊️ (@SK_Tarock) July 14, 2023 -
'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Baby Heroine Remuneration:'బేబీ' సినిమా హిట్ అయింది. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. అయితేనేం రెండో రోజే లాభాల్లోకి వెళ్లిపోయింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఆమె నటనకి కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నారు. మరి వైష్ణవి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. టాలీవుడ్ లో ప్రస్తుతం 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాలోని పాత్రలో జీవించేసింది. లిప్ లాక్, బోల్డ్ సీన్స్ ఇలా ఏ విషయం తీసుకున్నా సరే ఎఫర్ట్ మొత్తం పెట్టింది. దీంతో ఈమెని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అప్పుడెప్పుడో డబ్ స్మాష్ నుంచి టిక్ టాక్ ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో ఒక్కో స్టెప్ ఎదుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు) యూట్యూబ్ సిరీస్ 'సాఫ్ట్వేర్ డెవలపర్'తో బోలెడంత ఫేమ్ తెచ్చకున్న వైష్ణవి చైతన్య.. 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించింది. అయితే తను తొలిసారి అందుకున్న పారితోషికం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయానా వైష్ణవినే బయటపెట్టింది. కేవలం రూ.700 మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చింది. 'ఓ ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. రోజంతా కష్టపడి డ్యాన్స్ చేస్తే జస్ట్ రూ.700 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఎంత సంపాదించినా సరే నాకు మాత్రం ఆ ఏడొందలు చాలా స్పెషల్' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. ఇకపోతే 'బేబీ' సినిమాకు ఎంత రెమ్యునరేషనే తీసుకుందనేది మాత్రం తెలియట్లేదు. బహుశా రూ.10 లక్షల లోపే ఇచ్చి ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. #baby #massdance🔥✨💥💃😍#babymovie #ananddevarakonda #vaishnavichaitanya #devafilmstudio pic.twitter.com/71IWLH77rc — #devafilmstudio (@Devavinayaka) July 16, 2023 (ఇదీ చదవండి: రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) -
లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తాజాగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేబీ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమా సక్సెస్ తర్వాత తొలి బోనం మహంకాళి అమ్మవారికి తీసుకుని వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బేబీ రిలీజవడానికి ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బోనమెత్తాను. దర్శనం కూడా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. గతానికి, ఇప్పటికి తేడా ఏంటన్న ప్రశ్నకు.. ఎప్పుడూ లైన్లో వస్తుండె.. ఇప్పుడు జర స్పెషల్ ఎంట్రీతో వచ్చిన అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. అలాగే పలు షార్ట్ ఫిలింస్ ద్వారా కూడా పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేసే వైష్ణవి బేబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. యూట్యూబర్ హీరోయినేంటి? అన్న చాలామంది ప్రశ్నలకు తన నటనతో నోరు మూయించింది. ఇక బేబీ సినిమాను సాయి రాజేశ్ డైరెక్ట్ చేయగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత ఎస్కేఎన్ నిర్మించాడు. జూలై 14న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టడం విశేషం. చదవండి: బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ -
'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు
Baby Day 2 Collection: బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సెన్సేషన్ సృష్టిస్తోంది. సాధారణంగా చిన్న సినిమాలపై అంచనాలు ఉన్నాసరే కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కామెంట్స్ ని 'బేబీ' బద్దలు కొట్టింది. మూవీలో పేరున్న యాక్టర్స్ ఎవరూ లేనప్పటికీ.. రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బూతులు ఉన్నాసరే టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సరైన లవ్ స్టోరీలు రాలేదు. సరిగ్గా దీన్ని ట్రాయంగిల్ ప్రేమకథతో తీసిన 'బేబీ' క్యాష్ చేసుకుంది. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట చాలారోజుల క్రితమే వచ్చింది. అప్పటినుంచి ఈ మూవీపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ అంచనాల్ని 'బేబీ' అందుకుంది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువయ్యాయని కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ కలెక్షన్లకు అవి ఎలాంటి అడ్డంకి కావట్లేదు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ హీరోయిన్) రెండోరోజే లాభాల్లోకి తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'బేబీ'.. రెండో రోజు కూడా అంతకంటే కాస్త ఎక్కువనే సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.14.3 కోట్ల గ్రాస్ వచ్చిందని స్వయానా నిర్మాత ఎస్కేఎన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే సినిమాకు రూ.7 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అయింది. దీనిబట్టి చూస్తే రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది. 'బ్రో' వచ్చే వరకు ఇకపోతే తర్వాత వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవు కాబట్టి జూలై చివరివారంలో 'బ్రో' వచ్చే వరకు 'బేబీ' హవానే ఉండొచ్చు అనిపిస్తోంది. అలానే లాంగ్ రన్ లో 'బేబీ' రూ.35-40 కోట్ల వరకు గ్రాస్ సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అలానే బేబీ ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. బహుశా ఆరు వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండొచ్చు. బేబీ రెండు రోజుల వసూళ్లు నైజాం-5.8 కోట్లు వైజాగ్-1.73 కోట్లు ఈస్ట్- 83 లక్షలు వెస్ట్-46 లక్షలు కృష్ణా-74 లక్షలు గుంటూరు-61 లక్షలు నెల్లూరు-37 లక్షలు సీడెడ్-1.18 కోట్లు కర్ణాటక-రెస్టాఫ్ ఇండియా- 43 లక్షలు ఓవర్సీస్-2.84 కోట్లు Thank you Thank you Thank you For all the love affection and compliments ❤️ No words And on the 3rd day (Sunday) Bookings are Sensational, never imagine we'll get such a warm reception Love u all 🙏❤️#BabyTheMovie @sairazesh@ananddeverkonda @viraj_ashwin@iamvaishnavi04… pic.twitter.com/PvA5qLSXgv — SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 16, 2023 (ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) -
అందరూ వైష్ణవినే తిడుతున్నారు: నిర్మాత
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి తన యాక్టింగ్‌తో కుర్రాళ్ల గుండెలపై బలంగానే కొట్టింది. ఓ రకంగా యూత్ మదిలో వైష్ణవిగా ఎప్పటికీ చెరగిన ముద్ర వేసిందని చెప్పవచ్చు. తాజాగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవం డి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) బేబీ సినిమా చూసిన ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తే.. ఈ సినిమా తీసుకున్న బయ్యర్లంతా నవ్వుతూ వచ్చారని ఆయన అన్నారు. సినిమా నిడివి ఎక్కువుగా ఉందని మొదట్లో భావించినా ఆడియన్స్ మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి కథలో బలాన్ని చూశారని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. కథలోని పాత్రల భావోద్వేగాలు అర్థం అయ్యేలా చెప్పాలనే నిడివి విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ ఆ నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. బేబి యూనిట్‌ను నమ్మి ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు ఈ సినిమాకు కమిట్ అయ్యారు. వారు ఈ సినిమా పూర్తి అయ్యే వరకు మరో చిత్రాన్ని చేయకుండా ఉండిపోయారని ఆయన తెలిపారు. సినిమా చూసిన వారు వైష్ణవిని తిడుతున్నారు. నిజానికి వైష్ణవి చాలా మంచి అమ్మాయి. ఈ సినిమాలో అది క్యారెక్టర్ మాత్రమేనని గ్రహించాలని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం తను రెండేళ్లు కష్టపడింది. తనకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే అయినా సినిమాపై ప్యాషన్‌తో పనిచేసిందని నిర్మాత ఎస్కేఎన్ పేర్కొన్నారు. కథ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది కాబట్టే వైష్ణవి అనే పాత్రను మాత్రమే తిడుతున్నారని అలాంటివి పట్టించుకోకూడదని ఆయన వైష్ణవితో చెప్పారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) -
దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బేబీ మూవీ రివ్యూ) ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం -రూ. 2.3 కోట్లు ►సీడెడ్- రూ.54.7 లక్షలు ►ఈస్ట్: రూ.40.5 లక్షలు ►వెస్ట్: 21.6 లక్షలు ►వైజాగ్: రూ.80.08లక్షలు ►కృష్ణా: రూ.34.6లక్షలు ►గుంటూరు: రూ.29.3లక్షలు ►నెల్లూరు: రూ.17.83లక్షలు ►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు ►ఓవర్సీస్: 1.74 కోట్లు ►మొత్తం : 7.1 కోట్లు Audience Love for CULT BLOCKBUSTER #BabyTheMovie has grossed a whopping 7.1CR Worldwide on DAY 1 💥 Book your tickets today 👇 🎟️ https://t.co/IUpZAiAOvH#CultBlockbusterBaby pic.twitter.com/YCU7ygrT32 — GSK Media (@GskMedia_PR) July 15, 2023 -
మీరు ఇడియట్స్.. బేబీ టీమ్‌పై దర్శకుడి ట్వీట్
కొన్ని సినిమాలకు ఎంత ప్రమోషన్ చేసినా కంటెంట్ లేకపోతే ఫలితముండు. అదే కొన్ని చిత్రాలు మాత్రం ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ షోకే జనాలకు కనెక్ట్ అయిపోతుంది. ఈ మధ్య అయితే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డీలా పడుతుంటే చిన్న చిత్రాలు మెరుపు విజయాలు అందుకుంటున్నాయి. తాజాగా రిలీజైన బేబీ కూడా ఈ జాబితాలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొంత నెగెటివిటీ కనిపిస్తున్నప్పటికీ బయట మాత్రం పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా బేబీ స్టోరీకి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారట! తాజాగా ఈ సినిమాపై దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'మీరు ఇడియట్సా? దురదృష్టవంతులా నాకు అర్థం కావడం లేదు. బేబీని వేసవికాలంలో రిలీజ్ చేయాల్సింది. దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్.. మీరే గనక బేబీని సమ్మర్లో విడుదల చేసుంటేనా ఇండస్ట్రీ హిట్ కొట్టేవాళ్లు' అని ట్వీట్ చేశాడు. మరొక ట్వీట్లో హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్, నటుడు విరాజ్ అశ్విన్ సహా బేబీ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు బీవీఎస్ రవి. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. Congratulations @sairazesh always believed in your writing. Big hugs @SKNonline 🤗 @ananddeverkonda always had the potential and now found #Baby as a platform to perform. @VijaiBulganin hv arrived. Congratulations 💝🤗 @iamvaishnavi04 @viraj_ashwin made the movie COMPLETE… — BVS Ravi (@BvsRavi) July 14, 2023 I don’t know whether you’re idiots or unlucky for not releasing #Baby for this summer. @SKNonline @sairazesh had you done that, it would hv been an industry hit 😀 — BVS Ravi (@BvsRavi) July 14, 2023 చదవండి: బేబీ మూవీ రివ్యూ 4సార్లు జైలుకు.. 400 మందికి నాలుగే బాత్రూమ్స్.. నరకం చూశానన్న విలన్ -
'బేబి' మూవీ చూసి రష్మిక ఎమోషనల్!
Baby Movie Rashmika Emotional: తెలుగు సినీ లవర్స్ చాలారోజుల నుంచి ఓ సినిమా కోసం ఎదురుచూశారు. అదే 'బేబి'. గత కొన్నాళ్లుగా మెలోడీ సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. చూసినవాళ్లందరూ బాగుందని అంటున్నారు. అయితే ఇదే సినిమా ప్రీమియర్ షోకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) రష్మిక ఎమోషనల్! 'బేబి' సినిమాలో ఆనంద్ దేవరకొండ ఓ హీరోగా నటించాడు. అతడి అన్న విజయ్ దేవరకొండతో పాటు రష్మిక కూడా.. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ లో నిన్న రాత్రి వేసిన ప్రీమియర్ షోకి వచ్చారు. ఇక సినిమా చూసిన తర్వాత రష్మిక కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించింది. థియేటర్ నుంచి బయటకొస్తూ పెద్దగా ఏం మాట్లాడుకుండానే వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బేబి కథేంటి? వైష్ణవి(వైష్ణవి చైతన్య) బస్తీ అమ్మాయి. ఎదురింట్లో ఉండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ)తో లవ్‌లో పడుతుంది. స్కూల్లోనే వీళ్ల ప్రేమ ముదిరిపోతుంది. అయితే పది పాస్ అయిన వైష్ణవి ఇంజినీరింగ్ వరకు వెళ్తుంది. ఆనంద్ మాత్రం ఫెయిలై ఆటో డ్రైవర్‌గా మారతాడు. ఇక కాలేజీకి వెళ్లి వైషూ లైఫ్‌లోకి విరాజ్(విరాజ్ అశ్విన్) వస్తాడు. మరి చివరకు ఏమైంది? ఆనంద్-వైషూ ఒక్కటయ్యారా లేదా అనేది మెయిన్ స్టోరీ. Cutiee #RashmikaMandanna got emotional post watching #BabyMovie in Hyderabad@iamRashmika pic.twitter.com/xKTS6OXzOj — ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 13, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?) -
'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
Baby Movie OTT Details: సాధారణంగా చిన్న సినిమాలకు బజ్ తక్కువ. థియేటర్లలోకి వచ్చినాసరే జనాలు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది అసలు స్టార్ నటీనటులు, డైరెక్టర్, నిర్మాత లేని ఓ సినిమా కోసం కొన్నాళ్ల నుంచి అందరూ తెగ వెయిట్ చేశారు. అదే 'బేబి'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. అలానే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ని కూడా ఫిక్స్ చేసుకుంది. ఒక్క పాట వల్ల గత కొన్ని నెలల నుంచి ఓ పాట తెలుగు మ్యూజిక్ లవర్స్ పదే పదే వింటున్నారు. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా..' అనే ఒక్క సాంగ్.. 'బేబి' సినిమాపై అంచనాలని పెంచేసింది. ఇప్పుడు దానికి తగ్గట్లే సినిమా ఉందని చూసిన ప్రతిఒక్కరూ చెబుతున్నారు. తెలిసిన ప్రేమకథలానే ఉన్నప్పటికీ, దాన్ని డీల్ చేసిన విధానం, టేకింగ్, డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు. (ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) ఆ ఓటీటీలో ఇకపోతే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావొచ్చని సమాచారం. కొన్నాళ్లు ఆగితే ఈ విషయమై క్లారిటీ వస్తుంది. 'బేబి' కథేంటి? వైష్ణవి(వైష్ణవి చైతన్య) బస్తీ అమ్మాయి. ఎదురింట్లో ఉండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ)తో లవ్‌లో పడుతుంది. స్కూల్లోనే వీళ్ల ప్రేమ ముదిరిపోతుంది. అయితే పది పాస్ అయిన వైష్ణవి ఇంజినీరింగ్ వరకు వెళ్తుంది. ఆనంద్ మాత్రం ఫెయిలై ఆటో డ్రైవర్‌గా మారతాడు. ఇక కాలేజీకి వెళ్లి వైషూ లైఫ్‌లోకి విరాజ్(విరాజ్ అశ్విన్) వస్తాడు. మరి చివరకు ఏమైంది? ఆనంద్-వైషూ ఒక్కటయ్యారా లేదా అనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?) -
Vaishnavi Chaitanya Latest HD Photos: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యూట్ ఫోటోలు
-
Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ
టైటిల్: బేబీ నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి లిరీష తదితరులు నిర్మాణ సంస్థ: మాస్ మూవీ మేకర్స్ నిర్మాత: ఎస్కేఎన్ దర్శకత్వం: సాయి రాజేశ్ సంగీతం: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్ రెడ్డి విడుదల తేది: జులై 14, 2023 బేబీ కథేంటంటే.. ఆనంద్(ఆనంద్ దేవరకొండ) ఓ బస్తీ యువకుడు. అతని ఎదురింటిలో ఉండే అమ్మాయి వైష్ణవి(వైష్ణవి చైతన్య) అతన్ని ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైష్ణవిని ఇష్టపడుతుంది. వీరి ప్రేమ స్కూల్ డేస్‌లో మొదలవుతుంది. అయితే పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి బీటెక్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ వైష్ణవికి ఓ ధనవంతుడి కొడుకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. మొదట్లో ఫ్రెండ్స్‌గా దగ్గరవుతారు. ఆ తర్వాత పబ్బులో రొమాన్స్ చేస్తారు. ఓ కారణంగా 31 రోజుల పాటు డేటింగ్ కూడా చేస్తారు. ఈ విషయం ఆనంద్‌కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇద్దరిలో వైష్ణవి ప్రేమించిదెవరిని? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవికి పబ్ కల్చర్ ఎలా అలవాటు పడింది? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది? వైష్ణవి, ఆనంద్, విరాజ్‌ల ట్రైయాంగిల్ లవ్‌స్టోరికి ఎలాంటి ముగింపు పడింది? అనేది తెలియాలంటే బేబీ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమ ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్లో ఉంటూ చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా బేబీ. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్. పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ? తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు ఎక్కడికి దారితీస్తున్నాయి? మన చుట్టూ ఉండే స్నేహితులు, పరిస్థితుల ప్రభావం తెలియకుండానే మనపై ఎలా పడతాయి? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో పాటు ప్రతి వ్యక్తి తొలి ప్రేమను మర్చిపోలేరనే విషయాన్ని అంతర్లీనంగా చూపించారు. బేబీ కథ కొత్తది అని చెప్పలేం. నిత్యం మనం వార్తల్లో చూస్తున్న, వింటున్న సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి. ఈ తరహా ట్రైయాంగిల్ లవ్‌స్టోరీలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు కానీ కాస్త భిన్నంగా కథనం సాగుతుంది. ఆనంద్ విషాదకరమైన జీవితానికి సంబంధించిన సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత స్కూల్‌డేస్ లవ్‌స్టోరీ చాలా సహజంగా హృదయాలను హత్తుకునేలా సాగుతుంది. ఆనంద్ పదో తరగతి ఫెయిల్ అవ్వడం.. వైష్ణవి పై చదువుల కోసం ఓ పెద్ద కాలేజీలో చేరడంతో కథ మలుపు తీసుకుంటుంది. బస్తీ నుంచి వచ్చిన వైష్ణవి సిటీ కల్చర్‌కి అలవాటు పడడం, తోటి స్నేహితులను చూసి తన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం.. అది ఆనంద్‌కు నచ్చకపోవడం..ఇద్దరి మధ్య గొడవ.. ప్రతి సీన్ చాలా సహజంగా సాగుతుంది. విరాజ్ పరిచయంతో ఈ ప్రేమకథ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా మారుతుంది. ఇంటర్వెల్ ముందు మద్యం మత్తులో ఆనంద్కి వైష్ణవి కాల్ చేసి అమ్మాయిల గురించి చెప్పే సంభాషణలు అదిరిపోతాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ భావోధ్వేగభరితంగా ఉంటుంది. ఓ బూతు పదాన్ని హీరోయిన్ చేత పదే పదే అనిపించడం, విరాజ్‌తో బెడ్రూమ్ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ ఈ తరం యూత్‌కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ చాలా కొత్తగా కనిపించాడు. భగ్న ప్రేమికుడు, ఆటో డ్రైవర్ ఆనంద్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్‌తో ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన విరాజ్ పాత్రకి విరాజ్ అశ్విన్ న్యాయం చేశాడు. వైష్ణవి చైతన్యకు బెస్ట్ మూవీ ఇది. తొలి సినిమాతోనే నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గాళ్‌గా లుక్స్‌లోనే కాదు నటనలోనే వేరియేషన్ చూపించి ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఈమె పాత్ర చుట్టే నడుస్తుంది. ఇకవైపు అందాలను ఒలకబోస్తూనే, కావాల్సిన చోట, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి నటనను కనబరిచింది. హీరోయిన్ తండ్రిగా నాగబాబు, హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ బుల్గానిన్ సంగీతం. మంచి పాటలతో పాటు అదిరిపోయే బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. సాయి రాజేశ్ సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకుంది: అల్లు అరవింద్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల వీళ్ల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కొన్నేళ్లు ఈ జంట ప్రేమలో ఉన్నా.. ఎక్కడా బయటపడలేదు. మీడియాలో వార్తలు వచ్చినా స్పందించలేదు. దీంతో ఇది పుకారు మాత్రమేనని అంతా అనుకున్నారు. కానీ సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు. వీరి ఎంగేజ్మెంట్ తర్వాత అల్లు అరవింద్ గతంలో ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ‘చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. 'ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. అల్లు అర్జున్ కూడూ ఈ వీడియోని షేర్ చేసి మరీ ‘మా నాన్న విజనరీ, ఆయన చెప్పిందే జరిగింది’ అని ట్వీట్ చేశాడు. ఇదంతా అనుకోకుండా జరిగిందని, తాజాగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ‘బేబీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అరవింద్ గెస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి యాంకర్ ఆయనకు గుర్తు చేసింది. దీనిపై అరవింద్ స్పందిస్తూ.. ‘ఏదో సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకొని మా వాడినే పెళ్లి చేసుకోబోతుంది’ అని ఫన్నీగా అన్నారు. అంతేకాదు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి ఆలోచన చేసుకోవాలని అన్నారు. ఇక బేబి విషయానికొస్తే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రమిది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 14న విడుదల కాబోతుంది. -
చాలా అవమానాలు పడ్డాను..స్టేజ్ పై ఏడ్చేసిన వైష్ణవి చైతన్య
-
Baby Movie Actors Photos: ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. అయితే ఈ వేడుకకు హాజరైన బేబీ హీరోయిన్ వైష్ణవి ఎమోషనల్ అయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ నటిగా తనకు పునర్జన్మనిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఆమె హీరోయిన్గా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. (ఇది చదవండి: అందుకే సింగిల్‌గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్) వైష్ణవి మాట్లాడుతూ..'యూట్యూబ్ వీడియోలు చేసుకునే నాకు ‘బేబీ’ సినిమాలో అవకాశమిచ్చారు. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్. మెయిన్ లీడ్‌గా చేయాలనేదే నా లక్ష్యం. కానీ మధ్యలో సహాయ నటిగా చేశా. సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారా. ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమాలో మెయిన్ లీడ్ చేయలేదని చాలామంది అన్నారు. కానీ బేబీలో ఛాన్స్ రాగానే లీడ్ రోల్ చేయగలనా అని భయపడ్డా. కానీ డైరెక్టర్ రాజేశ్ నాకు ధైర్యాన్నిచ్చారు. ఈ విషయంలో నాకు మరో జన్మనిచ్చారు. అందువల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. నిర్మాత ఎస్కేఎన్ కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు.'కంటతడి పెట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (ఇది చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్ దేవరకొండ
పదో తరగతి వరకు నా చదువంతా బాయ్స్ బోర్డింగ్ స్కూల్లోనే జరిగింది. అమ్మాయిలతో పరిచయం ఉండేది కాదు. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమేసేది. వారితో మాట్లాడేందుకు నాకు రెండేళ్లు పట్టింది. అందరిలాగే నాకు కూడా తొలి ప్రేమ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రేమ అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే బేబీ సినిమాలో చక్కగా చూపించాం. ► ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ మొదటి సారి ఓ వైడ్ రేంజ్ ఆడియెన్స్‌ను పలకరించే సినిమాతో వస్తున్నాం.. ప్రీమియర్ షోలు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. నా కెరీర్లో బేబీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ► ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్లో చూపించిన ఎమోషన్ కంటే.. సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ► ప్రేమ అనంతమైంది. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ అన్న తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్ కొత్తగా ఉంటుంది. ఆయన కోణంలోంచి ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు ప్రేమలో ఉన్నా, విడిపోతోన్నారని అన్నా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ ముఖ్యం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు. ► ప్రేమ దేశం సినిమాకు బేబీ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్ వైజ్ చూస్తే మాత్రం ప్రేమిస్తే, 7/జీ బృంధావన కాలనీ స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలోకి ముందుగా నేను వచ్చాను. ఆ తరువాత వైష్ణవి, విరాజ్‌లు వచ్చారు. ► అర్జున్ రెడ్డి అనేది అందరూ రిఫర్ చేసే పాప్ కల్చర్‌లా మారింది. బేబీ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మేం దాన్ని చూసి బేబీ అని పెట్టలేదు. బేబీ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఓ సీన్లో వివరిస్తాం. అందరికీ ఈజీగా, క్యాచీగా ఉంటుందని బేబీ అని పెట్టాం. ► కథ చెప్పినప్పుడే కొన్ని సవాళ్లుంటాయని సాయి రాజేష్ అన్న చెప్పారు. నెరేషన్ ఇచ్చి, ట్రాక్స్ పంపించి.. కథ గురించి బాగా ఫీడింగ్ చేశారు. ప్రతీ సీన్, ప్రతీ ఎక్స్ప్రెషన్స్ గురించి వివరించి చెబుతుంటారు. బాల్ రెడ్డి, విజయ్ బుల్గానిన్ నుంచి కూడా అందుకే బెస్ట్ వర్క్ వచ్చింది. ► స్కూల్ పిల్లాడిలా కనిపించేందుకు కష్టపడలేదు. కానీ డబ్బింగ్ చెప్పే టైంలోనే కష్టపడాల్సి వచ్చింది. పిల్లాడిలా అనిపించేందుకు వాయిస్ తగ్గించి మాట్లాడాల్సి వచ్చింది. గొంతులో ఆ అమాయకత్వాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ► వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించింది. తెలుగులో మంచి నటిగా ఎదుగుతుంది. సీన్లు ఎలా చేయాలో మేం ఇద్దరం చర్చించుకునేవాళ్లం. ఆమెతో నటించడాన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆమెతో నటించడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంత చిన్న వయసులో, ఇంత మంచి పాత్రను, ఇంత బాగా నటించడం అంటే మామూలు విషయం కాదు. ► ఈ జానర్లో సినిమా చేస్తున్నా.. ఆ దర్శకుడితో చేస్తున్నాను.. అని అన్నకి చెబుతాను. కొన్ని సార్లు సినాప్సిస్ పంపిస్తాను. కానీ ఫైనల్ కాల్ మాత్రం నాదే. అది చేయమని, ఇది వద్దు అని అన్న, నాన్న ఎప్పుడూ చెప్పరు. విజయ్ దారి వేరు. నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు. ► నాకు ఇంత వరకు థియేట్రికల్ హిట్ లేదు. మా సినిమా బజ్ చూసి, ట్రైలర్ రియాక్షన్ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్‌తో ప్రీమియర్స్ పెట్టాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ కంటే ముందే ఈ కథను విన్నాను. ► బేబీ సినిమాకు యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతారు. మాస్ జనాలకు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మాస్కు కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర కోసం ఆటో నడపడం నేర్చుకున్నాను. ► కొత్త సినిమా విషయాలకొస్తే.. గం గం గణేశా అనే సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. క్రైమ్ జానర్లో ఉంటుంది. అందులో ఫైట్లు చేశాను. స్టెప్పులు కూడా వేశాను. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. -
ఆడిషన్స్ కోసం చాలా కష్టపడ్డా.. 8 ఏళ్ల తర్వాత ‘బేబీ’ చాన్స్: వైష్ణవి చైతన్య
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు చాన్స్‌లు ఇవ్వరనే ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అలా ఏం ఉండదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. ఆడిషన్స్ ఇవ్వడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. దాదాపు ఏనిమిదేళ్లు తర్వాత నాకు సినిమా చాన్స్ వచ్చింది. ‘బేబీ’మూవీ తర్వాత వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను’అని హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ , వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప అవకాశం. ► ప్రతీ యాక్టర్ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు. ► బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు. ► సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర. ► బస్తీ నుంచి కాలేజ్‌కి వచ్చిన అమ్మాయి ఎలా మారిపోయిందని చెప్పేందుకు ఈ కలర్‌ను ఓ మీటర్లా తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ అనే మీటర్లో చూపించలేదు. ఆ అమ్మాయి మీద ఏ విషయాలు ప్రభావితం చూపించాయి.ఎలా మారిపోయింది? అనే కోణంలోనే చూపించాం. ► షూటింగ్ కోసం సెట్లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్‌లో ఉన్న సీన్లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. ► ఇప్పటి వరకు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. నా ఫోకస్ మొత్తం బేబీ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక రెస్పాన్స్ చూడాలి. నేను ఏం చేయగలనో కూడా అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను. -
అన్నతో గొడవ? తమ్ముడి సినిమాకి మాత్రం విషెస్!
తెలుగు యాంకర్స్‌లో అనసూయ సమ్‌థింగ్ డిఫరెంట్. ఎందుకంటే టీవీ స్క్రీన్ పై సక్సెస్ అయినోళ్లు సినిమా స్క్రీన్ పై సక్సెస్ అయింది చాలా తక్కువ. కానీ ఈ కామెంట్ ని బ్రేక్ చేసిన వాళ్లలో అనసూయ ఉంటుంది. కామెడీ షో యాంకర్‌గా పేరు తెచ్చుకుని.. ఇప్పుడు సినిమాల్లో లీడ్, విలన్ తరహా రోల్స్ చేస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటుంది. సినిమాలతో బిజీ న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది. పెద్దగా పేరు రాలేదు. దీంతో మళ్లీ టీవీల్లోకి వచ్చేసింది. 'జబర్దస్త్' కామెడీ షోలో గ్లామర్ చూపించి, చాలా క్రేజ్ సంపాదించింది. అలా 'రంగస్థలం', 'పుష్ప', 'క్షణం' సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి, అద్భుతంగా నటించింది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బిజీగా ఉంది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) విజయ్‌తో గొడవ? యాక్టింగ్, గ్లామర్ పరంగా అనసూయని వంక పెట్టడానికి ఏముండదు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అప్పుడప్పుడు న్యూస్ అవుతూ ఉంటుంది. గతంలో 'అర్జున్ రెడ్డి' విడుదల సమయంలో ఈమె పలు కామెంట్స్ చేసింది. అప్పటినుంచి హీరో విజయ్ దేవరకొండపై ఏదో ఓ సందర్భంలో టీజ్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అది పరోక్షంగానే ఉంటుంది. ఆనంద్కి విషెస్ విజయ్ దేవరకొండ గతంలో డబ్బులిచ్చి మరీ తనని ట్రోల్ చేయించాడని అనసూయ.. కొన్నాళ్ల ముందు చెప్పుకొచ్చింది. ఇలా రౌడీహీరోతో ఈమె వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'బేబి' సినిమాకి మాత్రం అనసూయ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇది తనకు తెలిసిన వాళ్ల కథలా ఉందని ట్వీట్ చేసింది. దీంతో అనసూయ పోస్ట్ కాస్త వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) So late to the party.. but its better late than never.. love love luuuuurrrrvv the hard hitting lines and the originality to this trailer.. naaku telisina vaalla katha laage anipistundi.. can’t wait for it.. always proud of you @sairazesh garu!! ❤️🧿 https://t.co/sYIlezCN4v — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 9, 2023 -
'బేబీ' సినిమా.. హీరో విరాజ్ ఫుల్ కాన్ఫిడెన్స్!
'అనగనగా ఓ ప్రేమ కథ'తో యంగ్ హీరో విరాజ్ అశ్విన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలి సినిమాలోనే నటనతో మెప్పించిన ఇతడు.. 'థ్యాంక్యూ బ్రదర్'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆదరణ దక్కించుకుంది. విరాజ్ తన షార్ట్ ఫిల్మ్ 'మనసనమహ'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్(513 అవార్డులు)గా ఇది గిన్నీస్ రికార్డ్ సాధించింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. తాజాగా 'బేబీ' మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'.. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని విరాజ్ అశ్విన్ భావిస్తున్నాడు. ట్రైలర్లో లవర్ బాయ్ తరహా పాత్రలో మెప్పించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. పాటల్లోనూ అద్భుతంగా నటించాడు. ట్రైలర్ లాంచ్‌లో "చాక్లెట్ బాయ్ లుక్స్" అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసించారు. బేబీ ట్రైలర్‌ను చూస్తుంటే.. విరాజ్ అశ్విన్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే మరిన్నీ క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యే 'మాయపేటిక' సినిమాతో వచ్చాడు. త్వరలో 'బేబీ'తో రాబోతున్నాడు. మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విరాజ్ అశ్విన్ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. (ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు చేరిన లవ్.. దర్శకుడిని పెళ్లాడిన సీరియల్ నటి) -
Baby Movie Promotions Photos: 'బేబీ' కోసం ఆటోలతో రెడీ అయిన యూనిట్ (ఫోటోలు)
-
బేబీ మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
చాలాసార్లు లవ్‌లో ఫెయిలయ్యా, అందుకే లైఫ్‌లో సక్సెసయ్యా: నిర్మాత
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఎంటర్టైనర్ బేబీ. రచయిత, దర్శకుడు సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జూలై 7న బేబీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌ఎకేఎన్ తన జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి మాట్లాడాడు. 'మన బ్రేకప్స్ లెక్కపెట్టుకుంటే ఇక్కడున్నవాళ్ల మేకప్‌లు ఆరిపోతాయి. లవ్‌లో ఫెయిలైనవాడే లైఫ్‌లో సక్సెస్ అవుతాడని నమ్ముతాను. చాలాసార్లు లవ్‌లో ఫెయిలయ్యాను, అందుకే జీవితంలో సక్సెస్ అయ్యాను. జీవితంలో తొలిసారి బ్రేకప్ అయినప్పుడు ఇంకో అమ్మాయిని ప్రయత్నించాను. అది కూడా ఎవర్నో కాదు, అక్కతో బ్రేకప్ అయితే ఆమె ఇగో దెబ్బతినాలని తన చెల్లినే ట్రై చేశాను. తర్వాత ఏమైందనే వివరాలు ఇక్కడ చెప్తే బాగోదు' అన్నాడు ఎస్‌ఎకేఎన్. చదవండి: మరో నటితో దొరికాడు.. బ్రేకప్ చెప్పిన విషయం తెలిసి నాన్నకు గుండెపోటు: నటి -
ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అర్జున్‌రెడ్డి' సినిమాకు ముందే విజయ్ను నమ్మాను: నిర్మాత
'ఇండస్ట్రీలో జర్నలిస్ట్‌గా మొదలై, పీఆర్వో అయ్యాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను. కెరీర్ చాలా సంతృప్తిగా ఉంది' అన్నారు ఎస్కేఎన్. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎన్‌కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నేడు (శుక్రవారం) ఎస్కేఎన్ బర్త్ డే. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ– 'ఆనంద్, విరాజ్, వైష్ణవిల మధ్య సాగే ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘బేబీ’. కథ, కథనం, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ఇంట్రవెల్‌కు ముందు పెద్ద షాక్ ఉంటుంది. మ్యూజిక్ పరంగా ఈ మధ్య వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ‘బేబీ’ ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతం అందించాడు. ఇక సోలో నిర్మాతగా నేను తొలిసారి విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ నిర్మించాను. అప్పుడు సాయి రాజేష్ నాకు ‘బేబీ’ కథ చెప్పాడు. కథ విన్నాక నిర్మాతగా నా తర్వాతి చిత్రం ఇదే చేయాలనుకున్నాను. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. ఆ పోస్టర్‌ను అలాగే ఉంచితే మూవీకి ప్రమోషన్ వస్తుందని కొందరు అన్నారు. కానీ కంటెంట్ బాగుంటే పబ్లిసిటీ అదే వస్తుంది.. కాంట్రవర్సీల నుంచి కాదని నమ్మే వ్యక్తిని. ఇక మార్కెట్ అంటే.. ‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్ కాకముందే విజయ్ స్టార్ అవుతాడని నమ్మి ‘టాక్సీవాలా’ తీశా. అలా ‘బేబీ’ ఆనంద్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఏడాదికి రెండు సినిమాలు, వెబ్ ఫిల్మ్ నిర్మించాలనుకుంటున్నాను. సందీప్ రాజ్, సాయి రాజేష్, రాహుల్ సంకృత్యాన్, వీఐ ఆనంద్‌లతో సినిమాలు ఉన్నాయి' అన్నారు. -
హద్దులు దాటె చూడు!
‘ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూ.. ఎదసడే హద్దులు దాటె చూడు చూడు చూడు...’ అంటూ మొదలవుతుంది ‘బేబీ’ చిత్రంలోని ‘రిబపప్పా రిబపప్పాప..’ సాంగ్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘బేబీ’. సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రిబపప్పా రిబపప్పాప..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను సాయి కృష్ణ పాడారు. ఈ సినిమాకు సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
బేబీ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. Most Anticipated Film of the Season #BabyTheMovie Post-Production works on full swing as the film is gearing for release in July 2nd Week 🥁 Visuals from the Re-recording 🎹🎶@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 @sairazesh @SKNonline @VijaiBulganin @MassMovieMakers pic.twitter.com/CF9MROzr5B — GSK Media (@GskMedia_PR) June 13, 2023 చదవండి: ఆ స్థానంలో ప్రభాస్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతీ సనన్ -
హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం.. వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
బేబీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన స్టార్స్ (ఫొటోలు)
-
వైష్ణవిని హీరోయిన్గా తీసుకోవద్దంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి: డైరెక్టర్
సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది నటి వైష్ణవి చైతన్య. తొలుత షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు పొందిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా అవకాశాలు అందుకుంది. అల వైకుంఠపురములో, వలిమై వంటి సినమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన వైష్ణవి ఇప్పుడు ఏకంగా బేబీ సినిమాతో హీరోయిన్గా మారింది. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేశ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో రీసెంట్గా టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. చదవండి: అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు ఈ మూవీ టీజర్ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ వైష్ణవి చైతన్యపై ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైష్ణవిని హీరోయిన్గా పెట్టినప్పటి నుంచి బయటి నుంచి తనకు విపరీతమైన ప్రెజర్ వచ్చిందని, ఫుల్ నెగిటివిటి వచ్చిందన్నాడు. సినిమాకు వైష్ణవిని హీరోయిన్గా తీసుకోవద్దంటూ తనకు చాలా ఫోన్ కాల్స్, మెసేజ్ వచ్చాయంటూ షాకింగ్ విషయం చెప్పాడు. ‘వైష్ణవిని నా సినిమాలో హీరోయిన్గా తీసుకున్నప్పటి నుంచి ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టావ్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఆమెను చాలా మంది చూశారు. చదవండి: బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? తనని ఎందుకు పెడుతున్నావ్? ఇంకెవరూ దొరకలేదా?” అని అనేవారని రాజేశ్ చెప్పుకొచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా చేయడం చూసేశాం, షార్ట్ ఫిలింస్, ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చూశాం. కానీ లోపల ఏదో ఉంటుంది కదా. కథ అనుకున్నప్పుడే తను హీరోయిన్గా సెట్ అవుతుందని నాకు అనిపించింది. రేపు సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు” అంటూ సాయి రాజేష్ వైష్ణవిపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
వాస్తవ సంఘటనల ఆధారంగా వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రం
‘‘ప్రేక్షకులందరికి నచ్చే కథ ‘బేబీ’. మన ప్రేక్షకులకు ఎలా చూపిస్తే బాగుంటుందో అలా తెరకెక్కించారు సాయి రాజే‹Ù. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఎస్కేఎన్, దర్శకుడు మారుతి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తితో తీసిన చిత్రమిది. ఇప్పటిదాకా నన్ను సాయి రాజేష్ అన్నారు. ఈ సినిమా రిలీజయ్యాక ‘బేబీ’ దర్శకుడు అని పిలుస్తారు’’ అన్నారు. ‘‘మారుతి, నేను కలిసి ఈ మాస్ మూవీ మేకర్స్ సంస్థను స్థాపించాం. మా దృష్టిలో సినిమా అంటే అమ్మకం కాదు.. నమ్మకం. అలాంటి నమ్మకంతోనే ‘బేబీ’ నిర్మించాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘నా కెరీర్లో సవాలు విసిరిన, సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘బేబీ’ విజయం సాధించాలని దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, వెంకటేష్ మహా, వశిష్ట అన్నారు. -
ట్రోలింగ్.. దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన తాప్సీ
సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోవడంతో భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ తమకు నచ్చని వ్యక్తులను కించపరచడం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేసే సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు సెలబ్రిటీలు వీటిని పట్టించుకోరు. కానీ తాప్సీ వంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైనమెట్స్ మాత్రం దిమ్మ తిరిగే సమాధానాలతో ట్రోలర్స్ నోరు మూయిస్తున్నారు. దక్షిణాది సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. బేబీ, నామ్ షబానా, పింక్ వంటి సినిమాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. తాప్సీ అంటే నచ్చని ఓ వ్యక్తి మాత్రం... ‘తాప్సీ అసలు ఏమాత్రం అందంగా ఉండదు. ఆమె ముఖం చాలా చెత్తగా ఉంటుంది. నాకు తెలిసి మరో రెండు సినిమాల్లో మాత్రమే చూడగలం. ఆ తర్వాత బాలీవుడ్ తెరపై నుంచి కనుమరుగైపోతుందంటూ’ అక్కసు వెళ్లగక్కాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన తాప్సీ... ‘అయ్యె ఆల్రెడీ ముల్క్, మన్మర్జియాన్, బద్లా సినిమాల్లో నటించేశానే. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను. మిమ్మల్ని చాలా నిరుత్సాహ పరిచాననుకుంటా. కానీ ఏం చేద్దాం మీరు ఇంకొంచెం బాధను దిగమింగాల్సిందే. ఓ నటిగా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాను. కేవలం ముఖాలు చూసే మీరు ఇకపై నటనను కూడా చూస్తే బాగుంటుంది. జై శ్రీరాం’ అంటూ వరుస ట్వీట్లతో అతడి నోరు మూయించారు. తాప్సీ సమాధానంతో సంతోష పడిన ఆమె అభిమానులు.. మేడమ్ మీరు ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా ఉండాలి. మంచి సమాధానమిచ్చారంటూ ఆమెకు అండగా నిలిచారు. But 3 toh already ho gayi.... #Mulk #Manmarziyaan and then #Badla and sorry to disappoint u but main already do aur sign kar chuki hu..... thoda toh aur jhelna padega 🤷🏻♀️ https://t.co/4KDAkqMHyb — taapsee pannu (@taapsee) July 27, 2018 Matlab Entertainment toh provide kar rahi hu main aapko. Matlab actress ka kaam toh ho gaya 😁 P.S- please apna taste behtar keejiye toh picturein bhi dekh payenge. Jai ShreeRam 🙏🏼 https://t.co/83wHBK84Mo — taapsee pannu (@taapsee) July 27, 2018 -
నా వద్ద తోక జాడించడం కుదరదు
నా వద్ద తోక జాడించడం ఎవరి వల్లా కాదంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీలో దైర్యం మాత్రమే కాదు ఇంకేదో ఉంది. అదేమిటో చూద్దాం. తాప్సీకి కోలీవుడ్‌లో తొలి చిత్రం ఆడుగళం విజయవంతమైన చిత్రంగా అమరింది. అయినా ఆమె కెరీర్ ఇక్కడ హీట్ ఎక్కలేదు. అవకాశాలు అడపాదడపానే రావడం గమనార్హం. ఆ మధ్య లారెన్స్ సరసన నటించిన కాంచన-2 చిత్రం విజయం సాధించడంతోపాటు తాప్సీకి నటనలో మంచి మార్కులు పడ్డాయి. దీంతో తనకు కోలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది అనుకున్న వారు లేకపోలేదు. ఊహించినట్లు గానే ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో వైరాజావై చిత్రంతో పాటు సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు సరసన ఖాన్ చిత్రంలో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే వైరాజావై చిత్రం విడుదలైనా తాప్సీకి ఏమంత పేరు రాలేదు. ఇక ఖాన్ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది తాప్సీని చాలా నిరాశ పరచిందనే చెప్పాలి. నటిగా తాప్సీ పరిస్థితి అలా ఉంటే వ్యక్తిగతంగా తాను చాలా బలమైన వ్యక్తినంటోందామె. ఆ మధ్య హిందీలో అక్షయ్‌కుమార్ సరసన బేబి అనే చిత్రంలో నటించింది. అందులో పోరాట సన్నివేశాల్లో కూడా నటించింది. అందుకు తగిన శిక్షణ తీసుకుందట. అయితే ఆ చిత్రం తరువాత కూడా తను ఆ శిక్షణను కొనసాగిస్తోందట. అంతే కాదు అదనంగా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందిందట. అందువల్లే తాప్సీ ఎక్కడికైనా ఒంటరిగానే వెళుతుంది.చాలా మంది హీరోయిన్లు తమకు రక్షణగా కొందర్ని వెంట తెచ్చుకుంటుంటారు. ఈ విషయాన్ని తాప్సీ వద్ద ప్రస్తావిస్తే ‘నేనెక్కడికైనా ఒంటరిగానే వెళ్తాను. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనే సత్తా నాకుంది. నా ముందు ఎవరూ తోక జాడించలేరు’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. -
తొలి రోజే రూ. 9.3 కోట్లు!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బేబీ' సినిమా తొలిరోజే బాక్సాఫీసును కొల్లగొట్టింది. విడుదల అయ్యిందో.. లేదో, మొదటిరోజే ఏకంగా రూ. 9.3 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాలో పాకిస్థాన్‌ను నేరుగా విమర్శించినట్లు కథనాలు వచ్చాయి. అయినా.. వసూళ్లలో మాత్రం ఈ సినిమా ఏమీ వెనకడుగు వేయలేదు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చేసే అండర్ కవర్ ఆపరేషన్ ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సెలవలు కాకపోయినా.. పెద్దగా ప్రచారం లేకపోయినా కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గతంలో ఎ వెడ్నస్ డే లాంటి చిత్రాలు తీసిన నీరజ్ పాండే పేరు దీనికి బాగా ఉపయోగపడింది. ఈ సినిమాలో టాలీవుడ్ నటులు దగ్గుబాటి రాణా, తాప్సీలతో పాటు.. సీనియర్ విలన్ డేనీ డెంజోంగ్పా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
బాబీ పేరు ఎందుకు పెట్టారో?
ముంబై: యాక్షన్ థిల్లర్ సినిమాకు 'బాబీ' పేరు పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాకు బాబీ పేరు ఎందుకు పెట్టారో మొదట్లో తనకు అర్థం కాలేదని, తర్వాత మెల్లగా అర్థమైందన్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రత్యేక అధికారి పాత్రలో నటించారు. 'మొదట ఈ కథ వినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. తర్వాత బాబీ పేరు ప్రాధాన్యం అర్థమైంది. ఇందులో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ అధికారిగా నటిస్తున్నా' అని అక్షయ కుమార్ తెలిపారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'బాబీ'లో అనుమప్ ఖేర్, దగ్గుబాటి రానా, తాప్సీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది జనవరి 23న ఈ సినిమా విడుదలకానుంది.