Dhaka
-
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మంటల్లో షేక్ హసీనా తండ్రి ఇల్లు దగ్ధం
ఢాకా: బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢాకాలో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో, హింస్మాతక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళన కారులు ముట్టడించి నిప్పటించారు. దీంతో, భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో నిరసనకారులు మరోసారి ఆందోళనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. ఈ క్రమంలో ఢాకాలో ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం, ఆయన ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇంటిని తగులబెట్టినట్టు కూడా స్థానికి మీడియాలో కథనాలు వెల్లడించింది.ఇదే సమయంలో మాజీ ప్రధాని హసీనాపై నమోదైన కేసులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా అవామీ లీగ్ పార్టీ (Awami League) గురువారం నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే హింస నెలకొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రెహమాన్‌కు చెందిన ధన్మొండి 32 నివాసంపై గతంలోనూ దాడి జరిగింది. గతేడాది ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత కూడా ఇంటిపై దాడి చేసి అందులోని కొంత సామగ్రిని ధ్వంసం చేశారు.అయితే, షేక్ హసీనా బంగ్లాదేశీయులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం చేస్తున్న సమయంలోనే నిరసనకారులు రెచ్చిపోయారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ.. ముహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బుల్డోజర్తో లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను బలిగొని మనం సంపాదించిన జాతీయ జెండా, రాజ్యాంగం మరియు స్వాతంత్ర్యాన్ని నాశనం చేసే శక్తి వారికి ఇంకా లేదు. వారు ఒక భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదు. చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా వారు గుర్తుంచుకోవాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bangladesh | A mob vandalised and set on fire Sheikh Mujibur Rahman’s memorial and residence at Dhanmondi 32 in Dhaka, demanding a ban on the Awami League. pic.twitter.com/azMcQCqngM— ANI (@ANI) February 5, 2025ఇదిలా ఉండగా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని దేశ హోం శాఖ సలహాదారు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎండీ జహంగీర్ ఆలం చౌదరి బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని వీడి.. గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ, సివిల్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ఐసీటీలో విచారణలో ఉన్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని చౌదరి తెలిపినట్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీఎస్ఎస్ వార్తా సంస్థ ప్రకటించింది. ‘దేశంలో ఉంటున్న వారిని అరెస్టు చేస్తున్నాం. హసీనా దేశంలో లేరు.. విదేశాల్లో ఉన్న వారిని ఎలా అరెస్టు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. Feb 5, 2025: Ousted #Bangladesh PM Sheikh Hasina today addressed her supporters via social media.But just before her speech, a mob attacked the historic #Dhamnondi residence of the country’s founding father Bangabandhu Sheikh Mujibur Rahman in #DhakaThis is the second time… https://t.co/f3rv7aimYj pic.twitter.com/GXxf5Mh6mx— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) February 5, 2025 -
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బంగ్లాదేశ్‌లో దారుణం.. భారత ఏజెంట్ అంటూ మహిళ జర్నలిస్ట్‌పై దాడి!
ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులు, హిందువులు, మైనార్టీలే టార్గెట్‌గా కొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టును మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. ఆమెను భారత ఏజెంట్ అంటూ దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారంటూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను కొందరు టార్గెట్ చేశారు. గుంపుగా వచ్చిన కొంతమంది.. ఢాకాలో ఆమెను చుట్టుముట్టారు. సాహా ఒక భారతీయ ఏజెంట్ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని వారు ఆరోపించింది. ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు.. ఆమెను రక్షించారు. అనంతరం, ఆమెను తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, మున్నీ సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బంగ్లా ప్రభుత్వ వైఖరిని భారత్ ప్రభుత్వం సైతం తప్పుపడుతోంది. Bangladeshi TV journalist Munni Saha's car was intercepted by radical in Dhaka.The Radical mob accused her of being an Indian agent and a supporter of the former Hasina govt.Later on she was arrested by Dhaka police based on the allegations levelled by Radical .… pic.twitter.com/icHcUIuZZt— MÃHĘŠH ŸĐV (@MkYdv97) December 1, 2024 -
ఢాకాలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత దేశానికి,హిందువులకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవలే అక్కడ హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.తాజాగా బంగ్లాదేశ్‌లో మున్నీ షా అనే మహిళా జర్నలిస్టును రాజధాని ఢాకాలోని కార్వాన్‌బజార్‌లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి.చుట్టుముట్టడమే కాకుండా ఆమెను కొంత సేపు వేధించారు. అయితే పోలీసులు ఆ మహిళా జర్నలిస్టును అల్లరి మూక భారీ నుంచి కాపాడారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. ను అల్లరి మూక నుంచి కాపాడారు.భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. -
‘‘సెక్యులర్‌ను రాజ్యాంగం నుంచి తొలగించాల్సిందే’’
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు. న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్‌ను ‘జాతి పిత’గా పేర్కొనడంతోపాటు అనేక రాజ్యాంగ సవరణలు జాతీయ విభజనకు దోహదపడతాయని , వాక్ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తాయి. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే.. సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు. మరోవైపు.. తాత్కాలిక ప్రభుత్వం దాడులు, వేధింపుల నుంచి తమను రక్షించాలని, హిందూ నాయకులపై దేశద్రోహ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెలలో పదివేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30,000 మంది నిరసనకారులు చటోగ్రామ్‌లో తమ హక్కులను డిమాండ్ చేశారు. విపక్ష విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల నడుమ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయిన అనంతరం.. హిందూవులు టార్గెట్‌గా దాడులు జరిగిన పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల జనాభాలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్న హిందువులపై ఆగష్టు 4 నుంచి సుమారు 2,000 కంటే ఎక్కువ దాడులను జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్‌లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్‌లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్‌లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
బంగ్లాలో నిరసనలు.. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసన జ్వాలలు రగులుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్’ను చుట్టుముట్టారు. షేక్ హసీనాను ప్రధాన మంత్రిగా తొలగించాలనే డిమాండ్‌లో నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ వద్ద ర్యాలీ నిర్వహించింది. అధ్యక్షుడి రాజీనామాతో సహా తమ డిమాండ్లను ప్రకటించారు.🚨🇧🇩BANGLADESH: CALLS FOR PRESIDENT SHAHABUDDIN’S REMOVAL GROWProtests intensify against President Shahabuddin, accusing him of backing "fascism" and demanding his resignation.Source: Times of India pic.twitter.com/bzD4amPq7w— Info Room (@InfoR00M) October 22, 2024 ఇక.. ఆందోళనకారులు రాత్రి ‘బంగా భబన్’ మార్చ్‌గా వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం బారికేడ్లతో నిరసనకారులను ఎదుర్కొవడానికి ప్రయత్నించారు. అధ్యక్ష పదవికి మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ బంగా భవన్ బయట ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు.అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి మిత్రుడు.ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఓ నిరసనకారుడు మీడియాతో మాట్లాడారు. 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని విద్యార్థి సంఘం నేతలు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంస్థ ‘బంగ్లాదేశ్ చత్రా లీగ్’ను నిషేధించాలి. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.Violence has erupted once again in Bangladesh, this time with students and protesters demanding the resignation of the President. #Bangladesh Violent protests continue at Bangabhaban in Dhaka. Scuffles between police and security personnel. Protesters blocked Gulistan Road… pic.twitter.com/QISEV9BNnN— Ashoke Raj (@Ashoke_Raj) October 22, 2024షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు. విద్యార్థులు జూలై-ఆగస్టు చేసిన తిరుగుబాటు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.చుప్పు అని కూడా పిలువబడే మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్‌కు 16వ అధ్యక్షుడు. అవామీ లీగ్ పార్టీ.. నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికలలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది.ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులు విసిరిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.బంగ్లాదేశ్‌లోని హిందువులను అవమానించే ఘటనలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లోని దుర్గా పూజ మండపంలోకి ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్‌లోని జేఎం సేన్ హాల్లో ఒక బృందం దుర్గాపాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే అవి వేరే వర్గానికి చెందిన పాటలని, స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Bomb Blast in Tatibazara Puja Mandap, Dhaka.#DurgaPujaAttack2024 pic.twitter.com/BQqHj5SURo— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) October 11, 2024ఇది కూడా చదవండి: దుర్గాపూజ మండపంలో కలకలం -
బంగ్లాలో దాడులు మతపరమైనవి కావు: మహమ్మద్ యూనస్
ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్‌తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు. -
హసీనాను బంగ్లాకు అప్పగించండి.. భారత్‌కు విజ్ఞప్తి
ఢాకా: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత్‌ను కోరింది. ఆమెను బంగ్లాకు అప్పగించాలని బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మంగళవారం భారత్‌కు కోరారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది. ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బీఎన్పీ వ్యవస్థాపకుడు జియా-ఉర్ రెహమాన్ సమాధి వద్ద మీర్జా ఫఖ్రుల్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నాం. ఈ దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె కచ్చితంగా విచారణను ఎదుర్కొవల్సిందే. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించటం వల్ల భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను నిలుపుకోవడం లేదు. షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనలేక దేశం విడిచి పారిపోయారు. పొరుగు దేశం (భారత్) హసీనాకు ఆశ్రయం కల్పించటం దురదృష్టకరం’ అని అన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. -
Bangladesh: షేక్ హసీనాపై హత్య కేసు!
ఢాకా: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాజాగా ఆమెపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొటోంది. రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో చెలరెగిన అల్లర్లలో ఓ కిరాణా షాప్ యజమాని హత్య చేయబడ్డారు. ఈ హత్య కేసులో షేక్ హసీనాతో సహా ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసును.. అల్లర్లలో హత్య చేయబడ్డ కిరాణా ఓనర్ అబూ సయ్యద్ సన్నిహితుడు నమోదు చేశారు. జూలై 19న మొహమ్మద్‌పూర్‌లో విద్యార్థుల నిరసనలో పోలీసు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లోనే అబూ సయ్యద్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్‌పై నిందితులుగా చేర్చారు. బంగ్లాలో చోటుచేసుకున్న నిరసనకారులు అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 560 మంది మృతి చెందారు. -
Bangladesh: రోడ్లపై నిరసనలకు దిగిన హిందువులు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజధాని ఢాకాలో హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. వీరికి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తున్నది. మరోవైపు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాజాగా బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఢాకాలో నిరసన తెలిపాయి. హిందూ దేవాలయాల ధ్వంసంపై పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘హిందువులకు జీవించే హక్కు ఉంది’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని పలువురు హిందువులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందువులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ వారు చేశారు. ఇదేవిధంగా లండన్, ఫిన్లాండ్తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో నిరసనలు కొనసాగాయి. కాగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్ ఇవ్వనుందా?
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్‌కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్‌లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్‌ను వదిలి బ్రిటన్‌కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.మరోవైపు.. గత నెలలో బ్రిటన్‌లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు. -
బంగ్లా సంక్షోభం: పార్లమెంట్ రద్దు
ఢాకా: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్ యూనస్‌ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిరసన విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది. -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
బంగ్లాదేశ్ ఉద్రిక్తతలతో అలర్ట్ అయిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌కు నడిపించే విమాన సర్వీసులను తక్షణం రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది. “బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితుల దృష్ట్యా, ఢాకాకు నడిచే మా విమానాలను తక్షణమే రద్దు చేశాం. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కన్ఫర్మ్ బుకింగ్ ఉన్న ప్రయాణికులకు రీషెడ్యూల్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై వన్-టైమ్ మినహాయింపు ఇస్తున్నాం'' అని పేర్కొంది.IMPORTANT UPDATEIn view of the emerging situation in Bangladesh, we have cancelled the scheduled operation of our flights to and from Dhaka with immediate effect. We are continuously monitoring the situation and are extending support to our passengers with confirmed bookings…— Air India (@airindia) August 5, 2024 మరోవైపు.. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్.. తాజా పరిస్థితుల్ని వివరించినట్లు సమాచారం. ఇక సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు, చొరబాట్లు జరిగే అవకాశాలు ఉండడంతో సైన్యం అప్రమత్తమైంది. అలాగే బంగ్లాలో ఉన్న భారతీయుల కోసం అడ్వైజరీ విడుదల చేసింది. అయితే.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. -
భారత్‌లో షేక్ హసీనా.. అజిత్ దోవల్‌తో భేటీ!
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. నేటి రాత్రి లోపు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే బంగ్లాదేష్ ప్రధాని పదవి నుంచి 76 ఏళ్ల షేక్ హసీనా దిగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు.. క్రమంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద దేశం విడిచి వెళ్లినట్లు వినికిడి.భారత్‌లో షేక్ హసీనా..అయితే షేక్ హసీనా భారత్‌కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఇది యూపీలోని ఘజియాబాద్‌లో ఉంది. అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. అనంతరం ఆమె లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీఇ వివరించారు. అయితే మోదీ హసీనాను కలుస్తారో లేదన్న విషయంపై స్పష్టత లేదు.బీఎస్ఎఫ్ అలెర్ట్..బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్‌తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. -
బంగ్లాదేశ్: 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం ఆదివారం హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 100కు చేరింది. ఇందులో 14 మంది పోలీసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఆందోళనల నేపథ్యం ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యు విధించి, ఇంటర్నెట్ సేవలను తెలిపివేశారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్ల చెలరేగటంతో అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాయం కోసం ఢాకాలోని భారత హైకమిషన్ సంప్రదించాని పేర్కొంది. .. ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మాకంగా మారాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. దీంతో నిరసన మరింత పెరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందస్తుగా.. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.Dozens injured in Bangladesh clashes as students protest against job quotas for government jobs and a pro-government student body — in pictures https://t.co/CXkzG9mx6b pic.twitter.com/G0ETouUPvs— Al Jazeera English (@AJEnglish) July 16, 2024 బంగ్లాదేశ్‌లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి. అయితే వాటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటా ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు చేపట్టిన తీవ్రతరం కావటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.Dhaka University now at 12am..#Bangladesh#StepDownHasina pic.twitter.com/PQMX2e8nJQ— Sayed Rouf 🇵🇸 (@SayedRouf4) July 16, 2024 ఈ నిరసనల్లో సుమారు 400వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే తాము హింసను రెచ్చగొట్టడానికి నిరసన చేయటం లేదని ఓ విద్యార్థి నిరసనకారుడు మీడియాకు తెలిపారు. ‘ మేకు కేవలం మా హక్కులుకోసం పోరాటం చేస్తున్నాం. కానీ అధికార పార్టీ గూండాలు శాంతంగా నిరసన తెలుపుతున్నవిద్యార్థులపై దాడులు చేస్తున్నారు’ అని తెలిపారు. ఇక.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ హక్కుల కోసం శాంతియుతంగా నిసనలు హింసాత్మకంగా మారాటంపై అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులకు భద్రత కల్పించాలంది. యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ఈ నిరసన హింసాత్మకంగా మారటాన్ని తీవ్రంగా ఖండించింది.দেশের বুকে আঠারো এসেছে নেমে।❤️#Bangladesh #কোটা_সংস্কার_চাই #কোটাবাতিলচাই #QuotaMovement #QuotaReform pic.twitter.com/Wkalog4iKi— toffee 🇵🇸 (@clowngrizzly) July 16, 2024 -
ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
Dhaka: ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో ఏడంతస్తుల భవనంలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. శ్వాససంబంధ సమస్యల కారణంగా గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సమంతాలాల్ తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తొలుత భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో చెలరేగిన మంటలు తర్వాత పై అంతస్తులోని మరిన్ని రెస్టారెంట్లకు వ్యాపించాయి. పై అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు దుస్తుల దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించి అక్కడి నుంచి తరలించారు. అయితే వీరిలో 42 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనలో కొందరు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ప్రమాదం జరిగిన భవనంలో ప్రతి అంతస్తులో రెస్టారెంట్లుండటంతో గ్యాస్ సిలిండర్లు ఎక్కువయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. గాజాలో ఘోరం ఇజ్రాయెల్ కీలక ప్రకటన -
అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్‌పోర్ట్ లేకుండానే ఢాకాకి
వాతావారణ పరిస్థితులు విమాన ప్రయాణాలకు చాలా కీలకం. దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడతారు. తాజాగా ఇండిగో విమానం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొంది. దీంతో ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ప్రయాణీకులు అనూహ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ అయ్యారు. ఇండిగో ఎయిల్‌లైన్స్‌కు చెందిన 6ఈ 5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. కానీ అక్కడి వాతావరణం, పొగమంచు కారణంగా గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్ కష్టంగా మారింది. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లిచి ఢాకాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది. STORY | Guwahati-bound IndiGo flight from Mumbai diverted to Dhaka due to bad weather READ: https://t.co/nQPVWCfi2s VIDEO: (Source: Third Party) pic.twitter.com/NFuVYIxKPb — Press Trust of India (@PTI_News) January 13, 2024 అయితే ఈవిషయంపై ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. విమానంలో ఉన్న తామంతా పాస్‌పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటాం అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఢాకాలో ల్యాండ్ అయ్యామని తెలిపారు. 178 మంది ప్రయాణికులతో 9 గంటలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌహతి తిరిగి వెళ్లడానికి మరొక సిబ్బంది కోసం నాలుగు గంటలకు పైగా వేచి ఉన్నాం, దయచేసి వేగంగా స్పందించండి మరో ప్రయాణికుడు ట్విటర్ ద్వారా వేడుకున్నారు. I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn't land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️ — Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024 దీంతో దీనిపై అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఇండిగో స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని మళ్లించామని, ప్రయాణీకులకు వీలైనంత మేర సాయం చేస్తున్నాం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం, ఇండిగో విమానం శుక్రవారం రాత్రి 8.20 గంటలకు ముంబై నుండి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు గౌహతిలో దిగాల్సి ఉంది. -
Ban vs NZ: న్యూజిలాండ్‌కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్‌కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్‌గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్‌లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
5 వికెట్లతో చెలరేగిన తైజుల్.. ఐర్లాండ్ 214 ఆలౌట్
Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌ను బంగ్లాదేశ్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/53), మీడియం పేసర్ ఇబాదత్ హుస్సేన్ (2/54), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (2/43) దెబ్బ కొట్టారు. ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్), లొర్కాన్ టకెర్ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అడేర్ ఒకటి, ఆండీ మెక్‌బ్రిన్ ఒక వికెట్ తీశారు. ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్ ఐర్లాండ్ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్ ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి కూడా -
విషాదం: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఢాకా: మన పక్కదేశమైన బంగ్లాదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఎమద్ పరిబహన్ సంస్థకు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా అదుపుతప్పి నీళ్లు లేని ఓ కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తున్న బస్సు మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతిచెందారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఘటనపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఏడంతస్తుల భవనంలో పేలుడు..14 మంది మృతి..100 మందికి గాయాలు
ఢాకా: బంగ్లాదేశ్ ఢాకాలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఢాకా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గలిస్తాన్ ప్రాంతంలో అత్యంత రద్దిగా ఉండే సిద్దిఖీ బజార్లో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఏడు అంతస్తులున్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో పలు ఆఫీస్‌లు, స్టోర్లు ఉన్నాయి. పేలుడు అనంతరం 11 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో శానిటైజేషన్ మెటీరియల్స్ విక్రయించే ఓ స్టోర్‌లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం -
Ind Vs Ban: ఏడేళ్ల క్రితం ధోని సేనకు భంగపాటు! రెండో వన్డేలో గెలిస్తేనే..
India tour of Bangladesh, 2022 - Bangladesh vs India, 2nd ODI- మిర్పూర్: ఏడేళ్ల క్రితం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు 1–2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ధోని నాయకత్వంలో నాడు తొలి రెండు వన్డేల్లోనే ఓడిన తర్వాత చివరి మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి మన జట్ట దాదాపు అలాంటి స్థితినే ఎదుర్కొంటోంది. ఆదివారం అనూహ్యంగా మొదటి మ్యాచ్‌లో ఓడిన రోహిత్ శర్మ బృందం సిరీస్ చేజారకుండా ఉండాలంటే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో వన్డేలో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కూడా గత వన్డే జరిగిన వేదికపైనే జరగనుంది. పిచ్ అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు కూడా అనుకూలిస్తూ సమతూకంగా ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే! ►ఉదయం గం.11.30 గంటలకు ఆరంభం ►సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం తుది జట్లు అంచనా భారత్ ఫిట్నెస్ సమస్యల కారణంగా అక్షర్ పటేల్ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నట్లయితే.. బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేసే క్రమంలో అక్షర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. యువ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అతడు వచ్చే ఛాన్స్ ఉంది. జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్. బంగ్లాదేశ్: ఎటువంటి మార్పులు లేకుండా మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే బంగ్లా బరిలోకి దిగే అవకాశం ఉంది. జట్టు: లిటన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఇబాదత్ హుస్సేన్. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ -
బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్దమైంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గురువారం బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్ శుక్రవారం భారత జట్టులో చేరనున్నారు. కాగా శుక్రవారం ఢాకా వేదికగా భారత జట్టు తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి బంగ్లాతో సిరీస్‌కు జట్టులో చేరారు. Little Kids welcoming Rohit Sharma and Virat Kohli in Bangladesh - Beautiful pictures. pic.twitter.com/yLMFCZ69id — CricketMAN2 (@ImTanujSingh) December 1, 2022 View this post on Instagram A post shared by Voompla (@voompla) బంగ్లాదేశ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్. బంగ్లాదేశ్ టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ,మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్. చదవండి: BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..! -
అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా
డిసెంబర్లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌లో భాగంగా షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్‌లు బంగ్లా రాజధాని ఢాకాలోనే జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డే వేదికను మాత్రం ఢాకా నుంచి చిట్టగాంగ్‌కు మార్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) బుధవారం పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) డిసెంబర్ 10న వేలాది మందితో ఢాకా వీదుల్లో ర్యాలీతో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే అదే రోజు డాకాలో మూడో వన్డే జరగాల్సి ఉంది. దీంతో అల్లర్లకు ఆస్కారం ఉండడంతో వన్డే వేదికను మార్చాలని బీసీబీ నిర్ణయించుకుంది. అందుకే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డేను డాకాలో కాకుండా చిట్టగాంగ్ వేదికగా జరుగుతుందని తెలిపింది. ఇక గత నెలలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎన్పీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అవినీతి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీఎన్పీ కోరుతుంది. ఇక మొదటగా అనుకున్న ప్రకారం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు డాకా, చిట్టగాంగ్‌లు వేదికలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని బీసీబీ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యునస్ తెలిపారు. డిసెంబర్ 4,7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా.. డిసెంబర్ 14-18 వరకు చిట్టగాంగ్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 22-26 వరకు డాకా వేదికగా రెండో టెస్టు జరగనుంది. చదవండి: అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా! బంగ్లాతో టెస్టు సిరీస్.. జడేజా దూరమయ్యే అవకాశం! జట్టులోకి సూర్య? -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్‌లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
Ban Vs SL: బంగ్లా టూర్‌కు శ్రీలంక.. 18 సభ్యులతో కూడిన జట్టు ఇదే!
Sri Lanka tour of Bangladesh- 2022: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి 18 సభ్యుల పేర్లు వెల్లడించింది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా శ్రీలంక రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో దిముత్ కరుణరత్నే సారథ్యంలోని లంక జట్టు మే 8న పర్యాటక దేశానికి చేరుకోనుంది. మే 11 ప్రాక్టీసు మ్యాచ్‌తో ఆటను ఆరంభించనుంది. కాగా ఈ సిరీస్‌తో ఒషాడా ఫెర్నాండో తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దేశవాళీ టోర్నీ నేషనల్ సూపర్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడంతో సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు. శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటన-2022: 18 సభ్యులతో కూడిన జట్టు ఇదే దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కమిల్ మిషారా, ఒషాడో ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్విల్లా, దినేశ్ చండిమాల్, సుమిందా లఖణ్, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డనియా, రమేశ్ మెండిస్, చమిక కరుణరత్న. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక షెడ్యూల్: మే 11, 12: ప్రాక్టీసు మ్యాచ్- ఛట్టోగ్రామ్లో మే 15- 19: మొదటి టెస్టు- ఛట్టోగ్రామ్లో మే 23- 27: రెండో టెస్టు- ఢాకాలో -
మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్‌గా మారిన హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ ) -
నేరుగా నగరానికే...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాం డ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యానికి తక్కువ ఖర్చు.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కా ర్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బా గ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయి లో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బు లు, కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రుల కు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది.. వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొ దలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరి యా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగు లు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. -
బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది మూకుమ్మడి దాడి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడి చేసి కూల్చి వేశారు. వివరాల ప్రకారం.. ఢాకాలోని లాల్మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత ఆలయాన్ని సుమారు 200 మందితో కూడిన గుంపు గురువారం ధ్వంసం చేసి దోచుకుంది. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు గాయపడ్డారు. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనను ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తీవ్రంగా ఖండించారు. ఆయన ట్విటర్లో.. "డోల్ యాత్ర & హోలీ వేడుకల సందర్భంగా ఇది చాలా దురదృష్టకర సంఘటనని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో ఢాకాలోని టిప్పుసుల్తాన్ రోడ్లో, చిట్టగాంగ్‌లోని కొత్వాలీలో కూడా జరిగాయి. It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations.....1/3 https://t.co/aMci2GdQdv — Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022 -
బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం
ఢాకా: బంగ్లాదేశ్ స్వతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు బుధవారం ఘనస్వాగతం లభించింది. మూడురోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్‌తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో పాటు ఆయన సతీమణి, కూతురు, ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు. కోవింద్‌కు 21 తుపాకుల సెల్యూట్‌తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్‌కు ఆహా్వనం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. చదవండి: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ముజిబుర్ రహ్మన్ మ్యూజియంను దర్శించారు. కోవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్రపతి జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. డిసెంబర్ 16న కోవింద్ గౌరవార్ధం నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని హసీనాతో రాష్ట్రపతి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. -
తాలిబన్ల పాలనలో అఫ్గన్ తొలి క్రికెట్ సిరీస్ ఇదే!
ఢాకా: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ముస్లిం షరియత్ చట్టాల ప్రకారం పాలన కూడా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అఫ్గన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోమంటూ తాలిబన్లు ఇటీవల స్పష్టమైన హామీనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్గన్ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక తొలిసారిగా ఆ దేశ అండర్ -19 జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ అండర్ -19 జట్టుతో ఐదు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ ఆడనునుంది. మొదటి విడతగా ఎనిమిది మంది ఆటగాళ్ల బృందం ఢాకా కు చేరుకుంది. మిగిలిన ఆటగాళ్లు మరో రెండు విడతలుగా అక్కడకు చేరుకుంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రబీద్ ఇమామ్ తాజాగా వెల్లడించారు. అఫ్ఘన్ ఆటగాళ్లు ఢాకా వచ్చిన వెంటనే సిల్హెట్‌కు వెళ్లిపోయారని ఇమామ్ చెప్పారు. 2020, ఫిబ్రవరిలో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బంగ్లా అండర్ 19 టీమ్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. చదవండి: South africa vs Sri lanka: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు..
ఢాకా: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు టి20 ఫార్మాట్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఢాకాలో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ (2/10), ముస్తఫిజుర్ (3/13), నాసుమ్ అహ్మద్ (2/5), సైఫుద్దీన్ (2/7) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. టి20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. కాగా ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. చదవండి: Shaheen Afridi: కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు What a start for Bangladesh! New Zealand are 18/4 after the Powerplay 👀 Who will help them rebuild?#BANvNZ | https://t.co/4Bvg9arZLr pic.twitter.com/tMPt3JnFY8 — ICC (@ICC) September 1, 2021 Bangladesh registered their first T20I victory over New Zealand after defeating the visitors by seven wickets in the opening match.#BANvNZ report 👇 — ICC (@ICC) September 1, 2021 -
వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్
ఢాకా: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ కరోనా బారిన పడ్డాడు. ఇది సాధారణ విషయమే!.. విచిత్రమేమింటంటే ఫిన్ అలెన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ఢాకా వచ్చిన అతనికి జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కరోన పరీక్ష చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతన్ని బస చేసిన హోటల్లోనే క్వారంటైన్ చేసినట్లు కివీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిన్ అలెన్ న్యూజిలాండ్ తరపున 3 టీ20 మ్యాచ్‌లాడి 88 పరుగులు చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. చదవండి: WI Vs PAK: 10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్ ఆఫ్రిది; పాకిస్తాన్ ఘన విజయం -
చిత్తుగా ఓడిన ఆసీస్; రెండో టీ20లోనూ బంగ్లాదేశ్ గెలుపు
ఢాకా: ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ మరోసారి షాక్ ఇచ్చింది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే ఆసీస్‌ను వరుసగా రెండో టీ20 లో ఓడించి బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లా ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బంగ్లా బౌలర్ల దాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిక్స్ 30 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్(9), సౌమ్యా సర్కార్లు(0)లు తొందరగా ఔటైనా.. షకీబ్ 26, మెహదీ హసన్ 23 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. చివర్లో అఫిఫ్ హొస్సేన్ 37 నాటౌట్, వికెట్ కీపర్ నూరుల్ హసన్ 22 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు. -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ఢాకా: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్... మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. షకీబ్ (36; 3 ఫోర్లు), నయీమ్ (30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. హాజల్‌వుడ్ 3, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఆసీస్ 20 ఓవర్లలో 108 పరుగుల వద్ద ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (45; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా మిగతా వారంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ రహ్మాన్, ఇస్లామ్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు ఇదే వేదికపై రెండో టి20 జరుగుతుంది. -
బంగ్లాదేశ్ పర్యటనకు ఆస్ట్రేలియా.. జట్టు ఇదే!
ఢాకా: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆసీస్ 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించారు. ఇక 2017 తర్వాత మెదటిసారిగా ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ప్రస్తుతం వెస్ట్ఇండీస్ పర్యటనలో ఉన్న ఆసీస్ నేరుగా బంగ్లాదేశ్ చేరుకోనుంది. ఢాకాలో కఠిన నిబంధనల మధ్య 3 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునుంది. మరోవైపు జింబావ్వే పర్యటనలో ఉన్న బంగ్లా జట్టు ఈ నెల 29న స్వదేశానికి చేరుకోనుంది. ఈ సీరిస్ లో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఢాకా వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆడుతున్న జట్టును కొనసాగించనుంది. ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, వెస్ అగర్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అలెక్స్ కారీ, డాన్ క్రిస్టియన్, జోష్ హాజిల్‌వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ టర్నర్, ఆండ్రూ టై , మాథ్యూ వేడ్ (వైస్ కెప్టెన్), ఆడమ్ జాంపా. -
డ్రీమర్లకు యూఎస్ కోర్టు షాక్!
హూస్టన్: దాదాపు 6 లక్షల మంది వలసదారులను స్వదేశాలకు తరలించకుండా రక్షణ కల్పిస్తున్న డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) చట్టం చెల్లదని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బరాక్ ఒబామా హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంతో ఇప్పటివరకు పలువురు భారతీయ యువతకు రక్షణ లభిస్తూ వచ్చింది. డ్రీమర్స్‌గా పిలిచే ఈ యువతకు శరాఘాతం కలిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో డ్రీమర్స్‌ను రక్షించాలన్న బైడెన్ ప్రభుత్వ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్లయింది. ఈ చట్టం రూపొందించడంలో ఒబామా ప్రభుత్వం పరిధి దాటిందని న్యాయమూర్తి ఆండ్రూ హనెన్ అభిప్రాయపడ్డారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ఈ చట్టాన్ని రూపొందించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా ఈ చట్టం అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం అనైతికమని, అందువల్ల ఇకపై డాకా అప్లికేషన్ల ఆమోదాన్ని నిలిపివేయాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటికే స్వీకరించిన అప్లికేషన్లపై తీర్పు ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. టెక్సాస్ సహా పలు రిపబ్లికన్ రాష్ట్రాలు డాకాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి. ఈ చట్టం కారణంగా తాము అదనపు వ్యయాలు భరించాల్సివస్తోందని ఈ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. తాజాగా డాకాపై తీర్పునిచ్చిన న్యాయమూర్తిని గతంలో బుష్ ప్రభుత్వం నియమించింది. -
విషాదం: భారీ అగ్నిప్రమాదం.. 52 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఓ కారాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఢాకా శివారులోని రూప్ గంజ్‌లోని కర్మాగారంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అగ్నిమాపక అధికారులు వివరాల ప్రకారం.. రుప్‌గంజ్‌లోని షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. కర్మాగారంలో రసాయనాలు, ప్లాస్టిక్ సీసాలు ఎక్కువగా ఉండడంతో భవనం మొత్తం మంటలు త్వరగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతి చెందారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 18 అగ్నిమాపక విభాగాలు కష్టపడుతున్నాయని, సహాయక చర్యులను ముమ్మరం చేశామని అన్నారు. తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాడానికి జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. -
బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఓ 22 ఏళ్ల మహిళపై కదిలే బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సావర్ ప్రాంతంలో అశులియా పశువుల మార్కెట్ దగ్గరలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అశులియా పోలీస్ ఇన్స్పెక్టర్ జియాల్ ఇస్లాం వివరాల ప్రకారం..బాధితురాలు మణిక్‌గంజ్‌లోని తన సోదరి ఇంటి నుంచి నారాయణగంజ్‌లో ఉన్న ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి 8 గంటలకు మరో బస్సు కోసం నబినగర్ బస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆ మహిళకు ఇంతకుముందు పరిచయం ఉన్న నజ్ముల్ అనే వ్యక్తి కలిసాడు. ఇద్దరు కలిసి బస్సు కోసం ఎదురు చూస్తుండగా..అక్కడకి వచ్చిన బస్సులో ఎక్కారు. అయితే నిందితులు బస్సులో ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలు రాకముందే దించేశారు. అదే సమయంలో నజ్ముల్, బాధితురాలని అడ్డుకుని తిరిగి నబినగర్ తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు దుండగులు బస్సులో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో నజ్ముల్ అరుపులు విని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చి వాహనాన్ని ఆపి వారిని రక్షించారు. బస్సును అదుపులోకి తీసుకుని నిందుతులను అరెస్ట్ చేశారు. కోర్టు వారిని ప్రశ్నించడానికి నాలుగు రోజుల రిమాండ్ విధించింది. కాగా ఆరుగురు నిందితులను ఆర్యన్(18), షాజు(20), సుమోన్ మియా(24), మోనోవర్(24), షోహాగ్(25), సైఫుల్ ఇస్లాం(40) గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. వీరంతా తురాగ్ ప్రాంతంలోని కమర్‌పారా నివాసితులుగా పేర్కొన్నారు. (చదవండి: పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్) -
బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టు విడుదల
ఢాకా: దాదాపు వారం క్రితం అరెస్టయిన బంగ్లాదేశ్ సీనియర్ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లామ్ ఆదివారం విడుదలయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అనుమతి లేకుండా ఫోటోలు తీశారన్న ఆరోపణలపై వలసవాద కాలానికి చెందిన ఓ చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుపై బంగ్లాదేశ్‌లోని మీడియా సహా ఐక్యరాజ్యసమితి వరకూ పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 5వేల టాకాలను పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్‌పోర్టును సమర్పించాలని కోర్టు ఆమెను కోరింది. అనంతరం కాశీంపుర్ మహిళా సెంట్రల్ జైలు నుంచి ఆదివారం రోజినా విడుదలయ్యారు. జూలై 15వరకూ బెయిల్ కొనసాగనుంది. వ్యాక్సిన్లను కొనే వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆమె ఫొటోలు తీశారంటూ ఆరోగ్య శాఖ ఆమెపై కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇకపై కూడా జర్నలిస్టుగా మరింత బాధ్యతతో పని చేస్తానని చెప్పారు. (చదవండి: UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది) -
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 26 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళుతున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళుతున్న బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. బుధవారం వరకూ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి: భారత్‌కు ఈయూ చేయూత -
మోదీ బంగ్లా పర్యటన: శశి థరూర్ క్షమాపణలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నందుకు కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ క్షమాపణలు చెప్పారు. శశి థరూర్ తన తప్పును తెలుసుకున్నానని, ఇది కేవలం ప్రముఖ న్యూస్ఛానల్లో వచ్చిన హెడ్‌లైన్స్‌ను సరిగ్గా చదవక పోవడంతో తప్పు దొర్లిందని, క్షమించండి అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేయడంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను ప్రధాని మోదీ అంగీకరింలేదంటూ శశి థరూర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు కూడా ప్రధాని మోదీ భారతీయుల ఫేక్ న్యూస్ రుచి చూపిస్తూన్నారని థరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛను ఎవరు ప్రసాదించారో అందరికీ తెలుసు అంటూ ఆయన ట్విటర్లో చెప్పుకొచ్చారు. ఇక థరూర్ ట్వీట్ నేపథ్యంలో ప్రధాని మోదీపై కొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శనాస్త్రాలు కూడా ఎక్కుపెట్టారు. అయితే, బంగ్లాకు స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఇందిరా కృషిని ప్రధాని మోదీ గుర్తు చేయగా.. థరూర్ దానిని తప్పుగా అర్థం చేసుకుని ట్వీట్ చేసినట్టు వెల్లడైంది. తర్వాత పొరపాటు గ్రహించిన థరూర్ తాజాగా తను చేసిన ట్వీట్‌ను తొలగించారు. దాంతో పాటు క్షమాణలు కూడా చెప్పారు. ‘పొరపాటు చేసినప్పుడు అంగీకరించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’అని ఆయన ట్విటర్లో చెప్పుకొచ్చారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసినాతో పలు ద్వైపాక్షిక అంశాలపై ఆయన నేడు చర్చించనున్నారు. I don't mind admitting when I'm wrong. Yesterday, on the basis of a quick reading of headlines &tweets, I tweeted "everyone knows who liberated Bangladesh," implying that @narendramodi had omitted to acknowledge IndiraGandhi. It turns out he did: https://t.co/YE5DMRzSB0 Sorry! — Shashi Tharoor (@ShashiTharoor) March 27, 2021 చదవండి: ప్రధాని మోదీకి నిరసన సెగ: నలుగురి మృతి -
నా టీనేజ్‌లో బంగ్లాదేశ్ కోసం కొట్లాడాను
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటున్నారు. ఈక్రమంలో తాను మొట్టమొదటిసారి పోరాటం చేసింది బంగ్లాదేశం కోసమేనని.. అది కూడా టీనేజ్‌లో ఉన్నప్పుడు అని మోదీ గుర్తు చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలిన అనంతరం తొలిసారి మోదీ విదేశీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ నెమరువేసుకున్నారు. బంగ్లా పర్యటనలో శుక్రవారం ప్రధాని బిజీబిజీగా గడిపారు. బంగ్లాదేశ్ 50 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢాకాలోని జాతీయ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ప్రయాణం ప్రారంభమయ్యిందే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం. నా మిత్రులతో కలిసి నేను 20 ఏళ్ల వయసులో భారత్‌లో సత్యాగ్రహ దీక్ష చేశా. ఆ పోరాటం సందర్భంగా నేను జైలుకు కూడా వెళ్లా’ అని మోదీ తన రాజకీయ జీవిత అరంగేట్రాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప దేశం ఆవిర్భవించడానికి ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరువలేనివని మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సైనికుల గొప్పదనం.. మమకారం సరిహద్దులో ఉండే భారతీయులు ఎప్పుడు మరువలేరని తెలిపారు. ‘ఇవి నా జీవితంలో మరచిపోలేని రోజులని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని నరేంద్ర మోదీ చెప్పారు. అంతకుముందు బంగ్లాదేశ్‌లోని భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో ముచ్చటించి వారితో ఫొటోలు దిగారు. రేపు కూడా బంగ్లా పర్యటనలో మోదీ బిజీబిజీగా ఉండనున్నారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
-
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్ గ్యాస్‌పైప్‌లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్‌లైన్ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
ముష్ఫికర్‌కు ‘నో’ చెప్పిన బీసీబీ
ఢాకా: కరోనాతో విరామం తర్వాత తిరిగి ప్రాక్టీస్‌ను ప్రారంభించాలనుకున్న బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్‌కు మొండి చేయి ఎదురైంది. అతనితో పాటు మరికొంత మంది క్రికెటర్లు మిర్పూర్లోని షేర్–ఎ–బంగ్లా స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొంటామని విజ్ఞప్తి చేయగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో ఈ సమయంలో బహిరంగ శిక్షణ మంచిది కాదంటూ వారి ప్రతిపాదనను తిరస్కరించింది. ‘ప్రాక్టీస్ చేసేందుకు ఇది తగిన సమయం కాదని మేం ముష్ఫికర్‌ను వారించాం. ట్రెయినింగ్ ముఖ్యమే కానీ ఆటగాళ్ల ఆరోగ్య భద్రత అన్నింటికన్నా ప్రధానం. మిర్పూర్లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాం. పూర్తి స్థాయిలో మైదాన పరిసరాలు సురక్షితం కాలేదు’ అని బీసీబీ స్పష్టం చేసింది. -
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ బౌలింగా?
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) బుధవారం ఆరంభం కాగా ఓ బౌలింగ్ వేసిన తీరు నవ్వులు తెప్పించడమే కాదు.. అనేక అనుమానాలకు తావిచ్చింది. వెస్టిండీస్‌కు చెందిన 34 ఏళ్ల ఎడమ చేతి మీడియం పేసర్ క్రిష్‌మర్ సంతోకి బీపీఎల్‌లో సిలెట్ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టాగ్రామ్ చాలెంజర్స్‌తో జరిగిన ప్రారంభపు మ్యాచ్‌లో సంతోకి వేసిన బంతులు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అతడు ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ.. లెగ్‌సైడ్‌కు అత్యంత దూరంగా ఫుల్‌టాస్ వేయడం గమనార్హం. ఆ బంతి వికెట్‌కు ఎంత దూరంగా వెళ్లిదంటే టెస్ట్‌ల్లోనూ ఆ బంతిని నిస్సందేహంగా వైడ్‌గా ప్రకటించేంతగా. ఆ బంతిని అందుకొనేందుకు కీపర్ ఎడమవైపుకు బాగా డైవ్ కొట్టి మరీ ఆపాడు. ఇక.. క్రిష్‌మర్ వేసిన నోబ్ను చూసి‘ ‘క్రికెట్లో ఇలాంటి నోబాల్ కూడా వేస్తారా?’ అనిపించింది. అతడి కుడికాలు క్రీజ్‌కు చాలా దూరంగా పడింది. దాంతో సంతోకి బౌలింగ్‌పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తంజేశారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్‌పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరామని సిలెట్ థండర్ డైరెక్టర్ తంజిల్ చౌధురి పేర్కొన్నారు. ‘ నో బాల్-వైడ్‌పై విచారణకు ఆదేశించాం. ఓవరాల్‌గా మాకు బరిలోకి దిగే ఎలెవన్ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్మెంట్, కోచ్ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. ఇక ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్ చేసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డడా అనే అనుమానం కూడా ఉంది. సంతోకి ఇలా చేయడానికి ఎవరి ప్రమేయం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తాం’ అని తంజిల్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 34 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో సిలెట్ థండర్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిలెట్ థండర్ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను చట్టాగ్రామ్ చాలెంజర్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టీ20 మ్యాచ్‌లో సంతోకి ఒక నోబాల్‌తో పాటు 4 వైడ్లు వేశాడు. దాంతోనే అతని బౌలింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. A no-ball bowled by Krishmar Santokie in the opening match of the Bangladesh Premier league #BPL2019 today. pic.twitter.com/Lvzut5d0Gz — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 -
నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా..
ఢాకా: ఇటీవల బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ షకిబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండేళ్లు నిషేధం విధించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ జట్టును ఇప్పటివరకూ షకిబుల్ సమర్ధవంతంగా నడిపించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ప్రయోగాలు చేస్తోంది. టీ20 ఫార్మాట్‌కు మహ్మదుల్లాను కెప్టెన్‌గా నియమించిన బీసీబీ.. టెస్టులకు మాత్రం మోమినల్ హక్‌ను సారథిగా నియమించింది. దీనిపై మోమినల్ హక్ మాట్లాడుతూ.. ఇదొక ఊహించని పరిణామంగా పేర్కొన్నాడు. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ‘నేను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆలోచించలేదు. కెప్టెన్సీ చేయాలనే ఆలోచన కూడా లేదు. అసలు బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా చేస్తారని ఏ రోజూ ఊహించలేదు. నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. కాస్త బలవంతంగానే ఆ పాత్రను నాకు కట్టబెట్టారు. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం జట్టును సమర్ధవంతంగా నడిపించడమే. అల్లా దయవల్ల నేను కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. కెప్టెన్సీ కారణంగా అదనపు ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. నేను గతంలో ఏ రకంగా స్వేచ్ఛగా ఆడానో, అదే తరహా ప్రదర్శనను ఇవ్వడానికి యత్నిస్తా’ అని మోమినల్ హక్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా చేయడం ఒక గొప్ప అవకాశం అయితే, భారత్‌తో డే అండ్ నైట్ టెస్టులో ఆడటం ఇంకా గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
‘ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం చేశారు’
ఢాకా: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదర్సాలు కొన్ని వికృత కార్యాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. పసిమొగ్గలపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ అరాచాకాల గురించి నోరు విప్పితే.. ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. గతకొద్దికాలంగా బంగ్లాదేశ్‌లో ఈ అరాచాకాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ చిన్నారి మదర్సాలోని ఓ ఉపాధ్యాయుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ చిట్లితల్లిని అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాక మదర్సాలో పిల్లలు ఎదుర్కొంటున్న భయంకర పరిస్థితుల గురించి ప్రపంచానికి వెల్లడించింది. బాలిక మృతితో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మదర్సా సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢాకా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న హోజైఫా అల్ మమ్దుహ్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు. ఆ వివరాలు.. ‘విద్యాభ్యాసం నిమిత్తం నేను ఢాకాలోని మూడు మదర్సాల్లో ఉన్నాను. ప్రతి చోట ఇలాంటి అకృత్యాలు చాలా సహజం. మదర్సాలో పని చేసే సిబ్బంది మాతో పాటు హస్టల్లోనే ఉండేవారు. సిబ్బందే కాక సీనియర్ విద్యార్థులు కూడా దారుణాలకు పాల్పడేవారు. పగలంతా ఏదో విధంగా గడిపిన విద్యార్థులు రాత్రి అవుతుందంటేనే భయంతో బిగుసుకుపోయేవారు. ఆ రాత్రి ఎవరికి కాళరాత్రిగా మారనుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. దాదాపు మదర్సాలో ఉన్న ప్రతి విద్యార్థిపై ఈ అకృత్యాలు జరిగేవి. మేమంతా స్వయంగా బాధితులమే కాక ప్రత్యక్షంగా సాక్షులం కూడా. నేను కూడా ఈ నరకాన్ని అనుభవించాను. అది కూడా చాలా చిన్న వయసులో. ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది. నా సీనియర్లే నాతో ఇలా ప్రవర్తించారు. ఆ తర్వాత ఇలాంటి మరికొన్ని దారుణాల మధ్యే నా విద్యాభ్యాసం ముగిసింది. నాకు తెలిసిన చాలా మంది మదర్సా టీచర్లు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని పాపంగా భావిస్తారు. కానీ పిల్లలతో లైంగిక సంబంధం కొనసాగించడం వారి దృష్టిలో పెద్ద నేరం కాదు. బాధితులు, నేరస్తులు ఒకే చోట ఉండటం మూలానా ఇలాంటి దారుణాలు బయటకు రావు. పైగా విద్యార్థులంతా పేదవారు కావడంతో మౌనంగా ఈ నరకాన్ని భరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. హోజైఫా పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ జర్నలిస్టు స్ఫూర్తితో మరి కొంత మంది ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు మదర్సా నిర్వహకులు హోజైఫా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అతడు యూదు మతానికి లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వాడని.. అందుకనే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మదర్సాలో చదవడం ఇష్టం లేని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తారని మండి పడుతున్నారు. మదర్సాల ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
51 ఏళ్ల తర్వాత బయటపడింది
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను తాజాగా గుర్తించారు. ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న గల్లంతైంది. అప్పటి నుంచి దీని ఆచూకీ లభ్యం కాలేదు. ఐఏఎఫ్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీనిలో ఉన్న సిబ్బంది గురించి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు విమానంలో ప్రయాణించిన సిపాయ్ బేలీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. దాంతో వాయుసేన మరోసారి గాలింపు చర్యలను ఉధృతం చేయగా 2007లో మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. అయితే 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు. అయితే గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, ఎయిర్‌బ్రేక్ అసెంబ్లీ, కాక్‌పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో దీన్ని ఒకటిగా చెబుతారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి చండీగఢ్‌కు మళ్లించారు. అయితే మార్గమధ్యంలో రోహ్తంగ్ పాస్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం దక్కలేదు. -
భారీ అగ్నిప్రమాదం; 19 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఓ శ్రీలంక జాతీయుడు సహా 19 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. బనానీ ప్రాంతంలో ఉన్న 22 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవంతిలో వస్త్ర దుకాణాలు, ఇంటర్నెట్ సేవలందించే ఆఫీస్‌లు ఉన్నాయి. 8వ అంతస్తులో మొదలైన మంటలు పైకి ఎగబాకి 11వ అంతస్తు వరకు చేరి, పక్కనున్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. శ్రీలంకకు చెందిన నిరాస్ చంద్ర అనే వ్యక్తి సహా మొత్తం ఆరుగురు మంటల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి కిందకు దూకడంతో చనిపోయారని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. 21 మంది అగ్నిమాపకదళ సిబ్బందితోపాటు, వైమానిక, నౌకా దళాలు కూడా ఐదు హెలికాప్టర్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశాయి. కాగా, బంగ్లాదేశ్‌లో 10 ఏళ్ల కాలంలో 16 వేల అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయని 1590 మంది మృతి చెందారని సుప్రీంకోర్టు న్యాయవాది సయిద్ రిజ్వానా హుస్సేన్ వెల్లడించారు. -
ఢాకాలో అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఓ శ్రీలంక జాతీయుడు సహా 19 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. బనానీ ప్రాంతంలో ఉన్న 22 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవంతిలో వస్త్ర దుకాణాలు, ఇంటర్నెట్ సేవలందించే ఆఫీస్‌లు ఉన్నాయి. 8వ అంతస్తులో మొదలైన మంటలు పైకి ఎగబాకి 11వ అంతస్తు వరకు చేరి, పక్కనున్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. శ్రీలంకకు చెందిన నిరాస్ చంద్ర అనే వ్యక్తి సహా మొత్తం ఆరుగురు మంటల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి కిందకు దూకడంతో చనిపోయారని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. 21 మంది అగ్నిమాపకదళ సిబ్బందితోపాటు, వైమానిక, నౌకా దళాలు కూడా ఐదు హెలికాప్టర్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశాయి. -
70 ప్రాణాలు బుగ్గిపాలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవంతి కింది అంతస్తులో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు భవనాలకు అగ్నికీలలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 70 మంది సజీవదహనం కాగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓల్డ్ ఢాకాలోని చాక్‌బజార్‌లో ఉన్న నాలుగంతస్తుల ‘హాజీ వహెద్ భవంతి’లో బుధవారం రాత్రి 10.40 గంటలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సందర్భంగా భవంతిలో నిల్వ ఉంచిన రసాయనాలు, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్కూ ఈ మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. పక్కనే ఉన్న మిగతా భవంతులకు అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. 200 మంది అగ్నిమాపక సిబ్బంది దాదాపు 14 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందనీ, మరో 25 మంది స్థానికుల జాడ తెలియరావడం లేదని అధికారులు అన్నారు. నివాసాల్లోనే రసాయనాల నిల్వ ఈ విషయమై దక్షిణ ఢాకా మేయర్ సయీద్ ఖొకోన్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం ప్రారంభమైన భవంతి కింది అంతస్తును రసాయనాలు నిల్వచేసే గోదాముగా మార్చారని తెలిపారు. ఇదే భవనంలోని పైఅంతస్తుల్లో ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. ప్రమాదస్థలికి సమీపంలో ఓ వివాహ వేడుక జరగడం, రెస్టారెంట్లలో జనసందోహం ఉండటంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయనీ, వీటికి డీఎన్ఏ పరీక్షలు అవసరమవుతాయని వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారన్నారు. రాత్రి కావడంతో ఓ భవంతి ప్రధాన ద్వారానికి తాళం వేశారనీ, దీంతో మంటల నుంచి తప్పించుకోలేక పలువురు స్థానికులు చనిపోయారని పేర్కొన్నారు. లక్ష టాకాల పరిహారం ఈ ప్రమాదంపై బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు లక్ష టాకాలు(రూ.84,576), తీవ్రంగా గాయపడ్డవారికి 50,000 టాకాలు (రూ.42,288) పరిహారంగా అందిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఢాకా అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు బంగ్లాదేశ్ హోం, పరిశ్రమల శాఖలు వేర్వేరుగా విచారణ కమిటీలను ఏర్పాటు చేశాయి. -
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..
-
ఘోర అగ్ని ప్రమాదం.. 70 మంది మృతి
ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 70 మంది సజీవ దహనం కాగా... మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు... ఢాకాలోని చాక్‌బజార్‌లోని ఓ అపార్టుమెంటులో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే అదే అపార్టుమెంటులో ఓ కెమికల్ వేర్‌హౌజ్ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో సుమారు 70 మంది మరణించారని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఢాకాలో ఇలాంటి ఘెర అగ్ని ప్రమాదం సంభవించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సుమారు 120 మంది మృతి చెందారు. -
భర్త ప్రవర్తనతో విసిగిపోయి..
ఢాకా : పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నానే ఆవేదన ఓ వైపు.. ఎంత ప్రయత్నించినా భర్త ప్రవర్తనలో మార్పు రావడంలేదనే ఆవేశం మరోవైపు.. ఈ రెండు భావనల మధ్య నలిగిపోయిన ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడుస్తున్న రెండు నెలల పసికందు నోట్లో ఉప్పు పోసి బిడ్డ చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మహ్మద్ బచ్చు, సాతీలు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మహ్మద్ దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల పాప, రెండు నెలల బాబు సంతానం. కాగా గత కొన్ని రోజులుగా మహ్మద్ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం.... తాను దాచుకున్న డబ్బులతో కొడుకు కోసం పాల ప్యాకెట్ తీసుకురమ్మని సాతీ భర్తతో చెప్పింది. కానీ మహ్మద్ ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకుని వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చర్యతో విసిగెత్తి పోయిన సాతీ.. కొడుకు గుక్క పట్టి ఏడుస్తుండటంతో సహించలేకపోయింది. పేదరికంలో బతికే కంటే చావడమే నయమంటూ ఆవేశంలో చిన్నారి నోట్లో ఉప్పు పోసింది. ‘ఇదే నీకు ఆహారం’ అంటూ పిచ్చిదానిలా ప్రవర్తించింది. కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన సాతీ.. కొడుకును తీసుకుని ఆస్పత్రికి బయల్దేరింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తన భార్య కావాలనే కొడుకును పొట్టనబెట్టుందని మహ్మద్ ఫిర్యాదు చేయడంతో సాతీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆ విద్యార్థుల ఉద్యమం ‘ఫేస్బుక్’ పుణ్యమా!
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ప్రజ్వరిల్లిన విద్యార్థి ఉద్యమం సహాయ నిరాకరణోద్యమంగా మారి దేశంలోని ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరిస్తుండడంతో బెంబేలెత్తిన ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అన్యాయంగా అణచివేత చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీలతో విన్యాసం చేస్తూ భాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగిస్తూ, రబ్బర్ బుల్లెట్లను పేలుస్తూ వీర విహారం చేయడం మొదలు పెట్టారు. మరోపక్క మొబైల్ నెట్ సర్వీసులను స్తంభింప చేసిన అధికార యంత్రాంగం ‘ఫేస్బుక్’ను ఆడిపోసుకుంటోంది. విద్యార్థులను ఫేస్బుక్ చెడకొడుతుందని ప్రధాని స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పాలకపక్షానికి చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగి విద్యార్థులపై దాడులు చేస్తూ ఉడతా భక్తిగా ప్రభుత్వానికి తాము ఉన్నామని చాటుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చేతగాని దద్దమ్మల్లా తాము ఎలా కూర్చుంటామంటూ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ సంకీర్ణ కూటమి కార్యకర్తలు కూడా విద్యార్థుల గెటప్‌లో రంగంలోకి దిగి ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలోని పలు నగరాలు, ముఖ్యంగా ఢాకా నగరం రాజకీయ రణ రంగంగా మారిపోయింది. ఫేస్బుక్ కారణంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్న అసహనంతోనో, మరే కారణమోగానీ ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్ట్’లోని అత్యంత కఠినమైన 57వ సెక్షన్ కింద ఆందోళనాకారులపై బంగ్లా పోలీసులు దేశ ద్రోహం కేసులను బనాయిస్తున్నారు. ఈ సెక్షన్ కింద విద్యార్థుల ఉద్యమానికి ప్రాచుర్యం కల్పించిన జర్నలిస్టులను, మద్దతిచ్చిన సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో హైలెట్ చేసిన సామాజిక ఔత్సాహిక జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ సెక్షన్ కింద విద్యార్థులు కూడా అరెస్ట్ అయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గ్రహించిన సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పిలుపు మేరకు విద్యార్థులు తమ ఉద్యమాన్ని విరమించి ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి పాఠశాలలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వారి పేరుతో రోడ్డెక్కిన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య రణరంగం కొనసాగుతోంది. అరెస్టయిన వారిలో అంతర్జాతీయంగా పలు పురస్కారాలు అందుకున్న ప్రముఖ బంగ్లాదేశ్ ఫొటోగ్రాఫర్, సామాజిక కార్యకర్త షాహిదుల్ ఆలమ్ కూడా ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆయన్ని నిర్బంధించి తీసుకెళ్లడం గమనార్హం. ఈ చట్టం ఎంత భయంకరమైనదంటే భారత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని 66 ఏ సెక్షన్ అంత. ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, అస్పష్టంగా ఉండడంతో అమాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్న కారణంగా 2015లో భారత సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. బంగ్లాలో మాత్రం 2006లో అప్పటి నేషనలిస్ట్ పార్టీ తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజల అణచివేతకు బాగా ఉపయోగపడుతోంది. జూలై 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో రోడ్డు భద్రతా సూత్రాలను పాటించాలని ఇటు ప్రజలకు, మరింత పటిష్టం చేయాలని అటు అధికారులకు పిలుపునిస్తూ విద్యార్థుల నుంచి వినూత్న ఉద్యమం పుట్టించుకొచ్చిన విషయం తెల్సిందే. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా విద్యార్థులు ఎంతో సహనంతో ప్రశాంతంగా ఉద్యమం నిర్వహించడం ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించింది. ఉద్యమం కాస్త పౌర సహాయ నిరాకరణ ఉద్యమంగా మారుతుండడంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాలకపక్ష అణచివేతకు దిగింది. అదే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష కూటమి కూడా రంగంలోకి దిగింది. దీంతో పౌర ఆందోళన కాస్త రాజకీయ రణ క్షేత్రంగా మారిపోయింది. 2019, జనవరిలోగా బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2001 సంవత్సరం నుంచి వివిధ పౌర అంశాలపై బంగ్లాలో యువకులు, విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, వాటిని అణచివేయడం బంగ్లా ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అణచివేత ధోరణినే అనుసరించింది. ప్రజాస్వామ్యం పేరిట నిరంకుశంగానే వ్యవహరించింది. గత అయిదేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్న భారత ప్రభుత్వం ప్రస్తుత అణచివేత పర్వంపై మౌనమే పాటిస్తోంది. ‘నాయకులనే వారు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. ప్రజలెవరికీ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉండకూడదనే. కిరాయి గూండాలతో ప్రజల డిమాండ్లను అణచివేయవచ్చని అనుకుంటారు. అలాంటి చర్యలు ఎప్పటికీ విజయవంతం కావు’ అని బంగ్లాదేశ్ జాతిపిత, అవామీ లీగ్ మూలపురుషుడు షేక్ ముజిబూర్ రహమాన్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల విశ్వాసం ఉంటే ఆయన కూతురైన షేక్ హసీనా ఈ అణచివేత చర్యలకు దిగేవారు కాదమో! చదవండి: విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’ -
విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’
సాక్షి, న్యూఢిల్లీ : ‘చట్టం అందరికి ఒక్కటే’ పేరిట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విద్యార్థులు చిత్రమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఆదివారం నాడు జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు దీనికి శ్రీకారం చుట్టారు. పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించక పోవడం వల్ల, అనుభవం లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు బస్సులు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారు రోడ్డెక్కారు. వ్యవస్థను తామే మార్చాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల విధులను వేరే చేపట్టారు. ఎదురుపడిన ప్రతి వాహనాన్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్‌లు తనిఖీ చేస్తున్నారు. టూ వీలర్లపై, కార్లలో వచ్చిన పోలీసులను కూడా ఆపుతున్నారు. వారిలో చాలా మంది వద్ద డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ‘మీరే చట్టాన్ని పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు?’ అంటూ వారిని విద్యార్థులు నిలదీస్తున్నారు. వారు క్షమాపణలు చెప్పినప్పటికీ ససేమిరా అంటూ వెనక్కి పంపిస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన ఓ మంత్రి కారునే ఆపి చాలా మర్యాదగా మాట్లాడుతూ వెనక్కి పంపించారు. బాలలు, బాలికలు తేడా లేకుండా స్కూల్ విద్యార్థులంతా యూనిఫారమ్‌లు ధరించి ఉద్యమంలో పాల్గొనడం ఓ విశేషమయితే. ఎక్కడా దౌర్జన్యానికి పాల్పడకుండా వీలైనంత వరకు మర్యాదగా వారు ఉద్యమాన్ని నడిపించడం విశేషం. షాజహాన్ ఖాన్ అనే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల ఉద్యమానికి ఆజ్యం పోశాయి. గత ఆదివారం నాడే భారత్‌లోని మహారాష్ట్రలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారని, అక్కడ ఎలాంటి ఉద్యమం లేదు, ఇక్కడ ఎందుకు ఉద్యమం నడిపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో సదరు మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించడం విద్యార్థులకు కోపం తెప్పించింది. విద్యార్థుల ఉద్యమానికి ‘ఫేస్బుక్’ ఎంతో తోడ్పడుతోంది. విద్యార్థులు తాము చేస్తున్న ఉద్యమాన్ని ఎక్కడిక్కడ వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎక్కడికక్కడ విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చారు. పోలీసులు ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎప్పటివో పాత ఫొటోలను కూడా షేర్ చేయడం కాస్త విచారకరం.ఢాకాలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలోని పలు నగరాలకు విస్తరించింది. విద్యార్థులకు భయపడి పోలీసులు, అధికారులు, ఉద్యోగులు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా బండ్లు తీయడం లేదు. సిగ్నల్ వ్యవస్థను కూడా బుద్ధిగా పాటిస్తున్నారు. తాము కూడా ఉద్యమాన్ని ఇంతకు మించి ముందుకు తీసుకపోలేమని, విద్యార్థులుగా చదువుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉందన్నారు. విద్యార్థుల్లో ఉద్యమం పట్ల ఇంత స్ఫూర్తి రావడానికి మరో కారణం ఉంది. గత ఏప్రిల్ నెలల్లోనే కోటా అంటే రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించారు. భారత్‌లో లాగా అక్కడ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన బంగ్లా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులే కాకుండా బంగ్లాదేశ్ యువత కూడా ఉద్యమాల్లో ముందే ఉంటుంది. 1971 విముక్తి యుద్ధానికి ద్రోహం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని, దేశంలోనే అతిపెద్ద మత పార్టీ అయిన ‘జమాత్–ఏ–ఇస్లామ్’ పార్టీని నిషేధించాలంటూ ఉద్యమాలు నడిపి యువత విజయం సాధించింది. -
విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’
-
విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్..
-
విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్..
ఢాకా, బంగ్లాదేశ్ : ఒక్క ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను కుదిపేసింది. ఒక్కచోట ఏకమైన వేలాది మంది విద్యార్థులు శాంతి భద్రతలను ఎలా కాపాడాలో పోలీసులకు నేర్పించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత నెల 30న ఢాకా నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనతో ఢాకాలోని విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నెల 2వ తేదీన(గురువారం) వేలాదిగా ఏకమై శాంతిభద్రతలను తమ చేతిలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఉంచి, వాహనాల పేపర్లను తనిఖీ చేస్తూ, ప్రభుత్వ అధికారులు విధుల నిర్వహణ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. చట్టం అందరికీ వర్తిస్తుంది.. ఢాకాలోని ఓ వీధిలో బైక్‌పై వస్తున్న ట్రాఫిక్ పోలీసు బైక్‌ను పలువురు విద్యార్థులు అడ్డగించారు. అనంతరం అతన్ని బైక్ పేపర్స్, లైసెన్స్ చూపించాలని కోరారు. సదరు పోలీసు నీళ్లునమలడంతో చట్టం అందరికీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తాను పేపర్లు తీసుకురాలేదని, దయచేసి క్షమించాలని ఆయన విద్యార్థులను కోరారు. మరో సంఘటనలో పోలీసు వ్యాన్‌ను అడ్డగించిన ఓ విద్యార్థి బృందం వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేసింది. రాంగ్ రూట్లో వస్తున్న ఓ మంత్రిని సైతం విద్యార్థులు అడ్డగించారు. పోలీసులకు లంచాలు ఇచ్చి, నాయకులు ఎలా పబ్బం గడుపుకుంటున్నారన్న విషయంపై విద్యార్థులు మంత్రికి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చట్టం అందరికీ సమానమే అన్న సంగతి గుర్తుంచుకోండంటూ మంత్రికి విద్యార్థులు హితవుపలికారు. ఫేస్బుక్లో వైరల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్లో వైరల్‌గా మారాయి. అయితే, దురదృష్టవశాత్తు ఈ ఘటనతో సంబంధం లేని ఫొటోలు(నకిలీవి) కూడా ఎక్కువ షేర్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో ‘కోటా సంస్కరణలు’కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 1971లో స్వతంత్రం అనంతరం దేశం కోసం నిలబడిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటాను ప్రకటించింది. 47 ఏళ్లుగా కోటా వ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు రోడ్లెక్కారు. దీంతో దిగొచ్చిన హసీనా సర్కారు కోటాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
‘ముత్యం లాంటి ముద్దు’పై వివాదమా!
సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం. అది ఢాకా యూనివర్శిటీ ప్రాంతం. అప్పుడే పెద్ద వర్షం కాస్త తుంపరగా మారింది. నేలంతా తడి తడిగా ఉంది. వెనకాల ఓ వినియోగదారుడు నెత్తున గొడుగు పట్టుకొని సెల్ఫోన్లో ఏదో వెతుక్కుంటున్నాడు. టీ కాసి పోసే వారిరువురు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోడ్డు మీద బాటసారులు ఇవేమి పట్టకుండా తమ మానాన తాము పోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ కొంత ఎత్తైన అరుగులు మీద కూర్చున్న ఇద్దరు ప్రేమికులు తమకీ ప్రపంచం పట్టనట్టు ఒకరికొకరు అత్యంత సహజంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్ అహ్మద్ తీశారు. ‘వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్ అహ్మద్ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. లౌకిక బెంగాలీ జాతీయ వాదం, ఇస్లాం ఛాందసవాదం మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే బంగ్లాలో ఈ ఫొటోపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫొటోలో కనిపిస్తున్న కళాత్మక దృశ్యాన్ని మెచ్చుకుంటున్న వాళ్లు, బరితెగించిన ప్రేమగా అభివర్ణిస్తున్న వాళ్లు ఎక్కువే ఉన్నారు. ‘ఇదే నిజమైన బంగ్లాదేశ్. ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది. నా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి. తరచుగా ముద్దు పెట్టుకోవాలి. ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు. స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. బరితెగించిన ప్రేమగా పరిగణించిన యువకులు మాత్రం జిబాన్ అహ్మద్‌ను వెతికి పట్టుకొని రోడ్డుపైనే కర్రలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. వారిలో తోటి ఫొటోగ్రాఫర్లు కూడా ఉండడం మరీ విచారకరం. జిబాన్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం కూడా పోయింది. ఆయన పనిచేస్తున్న వెబ్సైట్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఇస్లాం ఛాందసవాదులతో పెట్టుకోవడం జిబాన్ అహ్మద్‌కు ఇది మొదటిసారి కాదు. 2015లో బంగ్లాదేశ్–అమెరికన్ హేతువాద బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు. రక్తం వోడుతూ ప్రాణాపాయా స్థితిలో కాపాడంటూ రాయ్ భార్య వేడుకుంటుంటే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో జిబాన్ అహ్మద్‌ను ఆస్పత్రికి చేర్చారు. అందుకు ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లో తన్నులు తిన్నారు. -
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్..
ఢాకా : ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ వీసా సెంటర్‌ను బంగ్లాదేశ్ ఢాకాలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్ ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్‌లో దాదాపు 18, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బంగ్లాదేశ్ హోం మినిస్టర్ అసదుజామాన్ ఖాన్ కమల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ‘అన్ని ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ వల్ల, వీసా కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గునుంద’ని తెలిపారు. ఈ విషయం గురించి ఇండియన్ హై కమిషనర్ హర్ష వర్ధన్ శ్రింగ్లా ‘జమునా పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ ప్రంపంచలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 12 భారతీయ వీసా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో మోతీఝీల్, ఉత్తర, ఢాకా, గుల్షన్‌లో ఉన్ననాలుగు వీసా సెంటర్లను ఆగస్టు 31 నాటికి ఇక్కడికే మారుస్తాం అని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు భారత్‌కు వస్తూంటారు. గతేడాది భారత ప్రభుత్వం 14 లక్షల మంది బంగ్లాదేశీయులకు వీసాలు జారీ చేసింది. -
వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!
ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్ అయిపోయింది. ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్ సేన్ చెబుతున్నారు. కానీ, బజందర్ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం -
బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ అనుమానిత ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. నగరంలోని కిల్‌గావ్ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్(ఆర్ఏబీ) యూనిట్ వద్దకు శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై దూసుకొచ్చాడు. చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్నటువంటి బ్యాగులో పేలుడు పదార్ధాలు గుర్తించామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్(డీఎమ్పీ) అధికారులు వెల్లడించారు. బాంబు డిస్పోజల్ యూనిట్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఢాకాలోని ఓ ఆర్ఏబీ స్థావరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో భద్రతను కట్టదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
ల్యాండింగ్‌లో రన్‌వేను ఢీకొన్న విమానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ బి737-800 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో తోకభాగం రన్‌వేను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఉన్న 8 సిబ్బందితో సహా మొత్తం 168 మంది క్షేమంగా బయటపడ్డారు. కాగా విమానం దెబ్బతింది. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్లు ఈ విమాన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే బోయింగ్ కంపెనీకి చెందిన ఓ బృందం కూడా ఢాకాకు వెళ్తుందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ పౌరవిమాయన సంస్థ అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తారని భావిస్తున్నట్టు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయరాదని వారు నిర్ణయిస్తే ఏఏఐబీ విచారణ చేపట్టవచ్చని తెలిపారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తామని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. విమాన ప్రమాదానికి బాధ్యులుగా ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది. -
'లొంగిపోనన్నాడు.. అందుకే చంపాం'
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఢాకా కేఫ్ మారణ హోమానికి కారణమైన కీలక సూత్రదారి లొంగిపోయేందుకు నిరాకరించడమే కాకుండా దాడులకు దిగడం వల్లే ప్రతిదాడులు చేసి హతమార్చామని ఢాకా బలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై గత నెలలో ఉగ్రవాదులు దాడి చేసి ఒక భారతీయురాలు, 16మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. దీని సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)గా బంగ్లా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇతడు బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. దీంతో అప్పటి నుంచి బలగాలు అతడికోసం గాలిస్తున్నాయి. ఢాకా శివార్లలోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను కార్నర్ చేసినప్పటికీ వారు లొగిపోకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు గంటపాటు జరిగిన కాల్పుల్లో ఎట్టకేలకు తమీమ్ చనిపోయాడు. -
ఢాకా దాడి సూత్రధారి హతం
మరో ఇద్దరు ఉగ్రవాదులనుమట్టుబెట్టిన బంగ్లా పోలీసులు ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై గత నెలలో జరిగిన ఉగ్ర దాడి సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)ని బంగ్లా భద్రతా బలగాలు శనివారం హతమార్చాయి. అతడితో పాటు ఇద్దరు అనుచరులు చనిపోయారు. జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తమీమ్. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. భద్రతా బలగాల అదుపులో ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన ఓ ఉగ్రవాది ఢాకా శివార్లలోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం ఇవ్వడంతో ఆపరేషన్ చేపట్టినట్టు కౌంటర్ టైజమ్ యూనిట్ చీఫ్ మోనీరుల్ ఇస్లాం చెప్పారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురూ చనిపోయారు. ఈ ఆపరేషన్ సుమారు గంట పాటు సాగిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి కొన్ని గ్రెనేడ్లు, ఓ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, తమీమ్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి బంగ్లా పోలీసులు 20లక్షల బంగ్లా టాకాల రివార్డును ప్రకటించారు. -
రంజాన్ మాసం.. రక్తసిక్తం
ముస్లింలు నిష్టగా దీక్షలు, భక్తితో ప్రార్థనలు, హృదయంతో దానాలు చేసే పవిత్ర రంజాన్ మాసం రక్తసిక్తంగా మారింది. ఖలీఫా(మతరాజ్యం) స్థాపన పేరుతో హింసోన్మాదాన్ని నానాటికీ విస్తరింపజేస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్.. ఈ ఏడాది రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా 800 మందిని అతి దారుణంగా చంపేసింది. భూగోళంలోని దాదాపు అన్ని దేశాల్లో ఐసిస్ నరమేధం కొనసాగుతోంది. ఐసిస్ మూలాలున్న ఆసియా నుంచి ఐరోపా వరకు.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకునే రంజాన్ మాసంలో బీభత్సం సృష్టించడం ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు కొత్తకాకపోయినా ఈ ఏడాది మారణహోమంలో బలైన అమాయకుల సంఖ్య భారీగా ఉండటం విషాదం. ముస్లింలోనే సున్నీ వర్గానికి చెందిన సాయుధులు ఏర్పాటుచేసిన ఐసిస్.. తమ మత భావనలను వ్యతిరేకించే షియాలపై ఎడతెగని దాడులు చేస్తోంది. ఒక్క షియాలేకాక ముస్లింలలోని ఇతర వర్గాలు, ఇతర మతస్తులను సైతం కర్కషంగా చంపేస్తోంది. దాడులకు మిగతా సమయంలో కంటే రంజాన్ మాసమే అనువైనదని ఐసిస్ భావిస్తోంది. ఎందుకంటే సాధారణ దినాల్లోకంటే పవిత్రమాసంలో ప్రతి ముస్లిం విధిగా మసీదుకు వెళతాడు. అలా గుంపుగా చేసిన జనాన్ని చంపడం ద్వారా ఐసిస్ తన లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకుంటుంది. రంజాన్ మాసంలోని నాలుగు వారాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన ఐఎస్.. అమెరికా, ఫిలిప్పీన్స్, యెమెన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ, టర్కీలతో పాటు ఇన్నాళ్లూ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాపై సైతం దాడులు చేసి మొత్తం 800 మందిని అమాయకులను పొట్టనపెట్టుకుంది. రంజాన్ పండుగకు మరో 48 గంటలు సమయం ఉండటంతో ఈ లోపు ఐసిస్ మరింత బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ ను గుర్తించి, భారీ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు.. రంజాన్ పర్వదిన వేడుకలు ముగిసేంతవరకు అప్రమత్తతను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొత్త తరహా దాడులతో ఐసిస్ రెచ్చిపోతూనేఉంది. ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న ప్రారంభమైంది. అదేరోజు ఇరాక్ లోని మౌసూల్ పట్టణంలోగల ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 65 మంది షియాలను పొట్టనపెట్టుకున్నారు. వారం తర్వాత, అంటే జూన్ 14న అమెరికాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో ఐసిస్ ఉగ్రవాది మతీన్ 50 మందిని దారుణంగా కాల్చిచంపాడు. జులై 1న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక భారతీయురాలు సహా 20 మందిని చంపేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బాగ్ధాద్ నగరంలోని షాపింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న పేలుళ్లలో 200 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి వ్యతిరేకంగా జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి జులై 4న ముస్లింల రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రం మదీనాలో ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి దాడి కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగిందికాబట్టి ప్రాణనష్టం తక్కువైంది. అదే జనసమ్మర్థ ప్రదేశంలో జరిగి ఉండేదుంటే ఘోరం ఊహించని విధంగా ఉండేది. ఇవి కాక ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచమంతా ఒక్కటై ఐసిస్ ను నిరోధించకుంటే భవిష్యత్ లో 'రంజాన్ మాసపు సామూహిక ప్రార్థనలు' అని చదువుకోవాల్సి వస్తుందేమో! -
'ప్రాణాలతో రానేమో.. అందరినీ చంపేస్తున్నారు'
ఆగ్రా/ఫిరోజాబాద్: ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలుకోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19) ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కుందో ఆఖరి ఘడియల్లో తన తండ్రికి వివరించింది. తన ఇద్దరు స్నేహితులతోపాటు రెస్టారెంటులోని వాష్ రూమ్ లో దాక్కున్న ఆమె తండ్రికి ఫోన్ చేసి ఉగ్రవాదులు ఇక్కడ రెస్టారెంటులోకి చొరబడ్డారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ప్రాణాలతో భయటకు వస్తానో లేదో కచ్చితంగా మాత్రం చెప్పలేను. ఇక్కడ అందరినీ వాళ్లు చంపేస్తున్నారు. నేను నా స్నేహితులతో కలిసి టాయిలెట్ లో దాచుకున్నాను. మేము కూడా ఒకరి తర్వాత ఒకరం హత్యకు గురవుతామనిపిస్తుంది' అని ఆమె తండ్రి సంజీవ్ జైన్ మీడియాతో చెప్పారు. అదే ఆమె నుంచి చివరి మాటలని వివరించాడు. తన కూతురు నుంచి ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి తెల్లవార్లు గుర్షాన్ కేఫ్ వద్ద ఎంతో కంగారుగా ఎదురుచూశాడు. తెల్లవారు జామున ఆమె ఫోన్ డెడ్ అయినా బలగాలు సైనిక చర్యలు జరుపుతున్నారని, బంధీలకు విముక్తి లభిస్తుందని చెప్తుండగా ఆశగా ఎదురుచూశాడు. 13మంది బందీలకు విముక్తి అని చెప్పాక అందులో తమ కూతురు ఉండకపోతుందా అని భావించాడు. కానీ ఉగ్రవాదులు కర్కశంగా గొంతు కోసిన 20మందిలో తమ కూతురు కూడా ఉందని తెలిసి నిశ్ఛేష్టుడయ్యాడు. కాగా, తమ సోదరిని ఒక హిందువుగా భావించి దారుణంగా చేసిన ఆ ప్రాంతంలో మేం అంత్యక్రియలు నిర్వహించబోమని, ఇండియాకు తీసుకొచ్చుకుంటామని ఆమె సోదరుడు చెప్పాడు. -
ఇది భారత్‌కు హెచ్చరిక
* భారత్-బంగ్లా సరిహద్దులో భద్రత అంతంతే! * అక్రమ చొరబాటుదారులకు రాజకీయ అండ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం నాటి ఉగ్రవాద ఘటన.. ఆ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత్‌కు ఘాటైన హెచ్చరిక లాంటిదే. బంగ్లా సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల కట్టడిపై భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచంలో సరైన భద్రతలేని సరిహద్దు ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇటీవల ఇక్కడ భారత్ కాస్త నిఘా పెంచినా బంగ్లా నుంచి చొరబాట్లు సాగుతూనే ఉన్నాయి. భారత-బంగ్లా సరిహద్దు వెంబడే ఎక్కువగా ఉగ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదరికంతోపాటు వివిధ కారణాలతో భారత్‌లోకి వస్తున్న ప్రజలతో ఉగ్రవాదులూ కలిసిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 1971 నుంచి 10 లక్షలకు పైగా బంగ్లాదేశీయులు భారత్‌లోకి ప్రవేశించారు. దీని ప్రభావం ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడుతోంది. ఆయా రాష్ట్రాల్లో స్థానికుల ఆందోళనకు ఇదే ప్రధాన కారణం. రాజధాని ఢిల్లీతోసహా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులతో వెలసిన కాలనీలున్నాయి. ఇలా వలస వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో పేలుళ్లకు పాల్పడటం తెలిసిందే. బంగ్లాలో శిక్షణ పొంది భారత్‌లో ప్రవేశించి భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారు. అక్రమ వలసలకు, వాటికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలకు అడ్డుకట్ట వేయకపోతే భారత్‌లో భారీ విధ్వంసం తప్పద’ని అంతర్జాతీయ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు కూడా బంగ్లాలో పేదరికాన్ని ఆసరా చేసుకుని వారిలో విషబీజాలు నాటి భారత్‌పైకి ఉసిగొల్పుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఆగ్నేయాషియా దేశాల్లో నిఘా పెరగటంతో అక్కడి ఉగ్రవాద సంస్థలూ బంగ్లాను స్థావరంగా చేసుకుంటున్నాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. -
ఉగ్ర పైశాచికం
♦ ఢాకా రెస్టారెంట్లో ముష్కరుల మారణకాండ ♦ 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ఆష్ఫాక్ చౌదురి తెలిపారు. వీదేశీ బందీలను.. మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు. ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పది గంటల తర్వాత సైనిక చర్య... శుక్రవారం రాత్రి రెస్టారెంట్‌ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు. ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్లైన్లో ఉంచింది. బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి... బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి. దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు. ఖురాన్ చెప్పలేదని హింస బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్‌ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి సంజీవ్జైన్తో మాట్లాడానన్నారు. ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది. -
ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్లి.. బందీగా చిక్కి!
ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్): ఢాకాలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన తరుషి జైన్ (19) ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని తెలుస్తోంది. బీఏ ఎకనామిక్స్ స్టూడెంట్ అయిన ఆమె కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బెకర్లీ కాలేజీలో చదువుతున్నట్టు సమాచారం. 2016లో ఈస్ట్రర్న్ బ్యాంకు లిమిటెడ్ (ఈబీఎల్) ఇంటర్న్‌షిప్ పథకానికి ఎంపికైన ఆమె తన ప్రాజెక్టులో భాగంగా ‘బంగ్లాదేశ్‌లో ఈబీఎల్ కామర్స్ వృద్ధి అవకాశాలు’ అంశంపై అధ్యయనం నిర్వహిస్తున్నది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ ఓ వస్త్రాల వ్యాపారి.. ఆయన ఢాకాలో నివాసముంటున్నారని తెలిసింది. శుక్రవారం స్నేహితులతో కలిసి తరుషి రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లిందని, ఆ రెస్టారెంట్లో ఉగ్రవాదులు ప్రవేశించడంతో ఆమె బందీగా చిక్కిందని ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో ఉంటున్న ఆమె బంధవులు తెలిపారు. తరుషి మృతి గురించి మధ్యాహ్నం 3 గంటలకు తమకు సమాచారం అందిందని, ఆమె మృతి వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని బంధువులు చెప్పారు. కుటుంబసభ్యులంతా ఢాకా వెళ్లాలనుకుంటున్నామని, ఇందుకు విదేశాంగ శాఖ లాంఛనాలు పూర్తి చేస్తున్నదని తరుషి జైన్ కజిన్ సోదరుడు శిరిష్ తెలిపారు. -
బందీగా చిక్కిన తరుషిని చంపేశారు!
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో ఓ భారతీయ అమ్మాయి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఢాకాలో ఉగ్రవాదాలు తమ ఆధీనంలోకి తీసుకున్న హోలీ ఆర్టిసన్ బేకరీలో భారతీయ అమ్మాయి అయిన తరుషి జైన్ (19) చిక్కుకుపోయింది. ఆమెను బందీగా చేసుకున్న ఉగ్రవాదులు కిరాతకంగా హతమార్చారు. తరుషి జైన్ సహా తమకు బందీలుగా చిక్కిన మొత్తం 20మందిని ఉగ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. వీరందరూ విదేశీయులే. శుక్రవారం రాత్రి ఢాకాలోని ఆర్టిసన్ బేకరీలోకి చొరబడిన సాయుధ ఉగ్రవాదులు.. అందులోని వారిని బందీలుగా తీసుకొని నరమేధానికి దిగిన సంగతి తెలిసిందే. మృతుల్లో భారతీయ బాలిక తరుషి కూడా ఉందని, ఆమె మృతి బాధ కలిగిస్తున్నదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. తరుషి తండ్రి సంజీవ్ జైన్‌తో మాట్లాడి.. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి యావత్ దేశం అండగా ఉందని పేర్కొన్నారు. కాగా, 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు ఉగ్రవాదులను బంగ్లా భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 13మందిని సురక్షితంగా రక్షించాయి. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కి సురక్షితంగా బయటపడిన 13మందిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అందులో ఒకరు జపనీస్ కాగా, మరో ఇద్దరు శ్రీలంక వాసులు. -
ఢాకా దాడిని ఖండించిన మోదీ..
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం ఢాకాలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐసిస్ ముష్కరులు జరిపిన దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోదీ... గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఢాకాదాడులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై తెలుసుకున్న ఆయన.. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన పలు ట్వీట్లు చేశారు. ఢాకా దాడులు ఎంతో బాధను కలిగించాయని, ప్రధాని షేక్ హసీనాతోనూ, ఇతర అధికారులతోనూ మాట్లాడినట్లు తన ట్వీట్స్ లో తెలిపిన మోదీ.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లాంటి బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధృఢంగా ఉండాలని మోదీ సూచించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కేఫ్ లో బంధించి, ఇస్టామిక్ స్టేట్ తీవ్ర వాదులు దారుణంగా చంపేసిన 20 మందిలో భారతదేశానికి చెందిన బాలిక తరుషి జైన్ కూడ ఉన్నట్లు విదేంశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
భారత సరిహద్దుల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దులనుంచి ఎవ్వరూ భారత్ లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించింది. అంతర్జాతీయ సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించే మార్గాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు దేశాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్తోం, మేఘాలయ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి, ఆయామార్గాలనుంచి ఎవ్వరూ దేశంలోకి చొరబడకుండా చూడాలని అధికారులకు, భద్రతా బలగాలకు సూచించింది. ఢాకా దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ బంగ్లాదేశ్ దౌత్య అధికారులతోనూ, సెక్యూరిటీ ఏజెన్సీలతోనూ చర్చిస్తున్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అక్కడి భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ వెల్లడించింది. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు సైనికులు 11 గంటలపాటు శ్రమించారు. భద్రతా దళాలు, ఉగ్రమూకలకు మధ్య జరిగిన పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. ఘటనలో మొత్తం 20 దాకా చనిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. సెన్సేషన్లు సృష్టించడం టెర్రరిజం అంతానికి సహకరించదని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో మీడియా ఇతోధికంగా సహకరించాలని ప్రభుత్వం మీడియాకు సూచించింది. బంగ్లాదేశ్ ను స్నేహపూర్వక దేశంగా ఇప్పటికే గుర్తించామని, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది సైతం టెర్రరిజాన్ని అణచివేసేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలిపింది. -
బందీలుగా చిక్కిన వారిని కిరాతకంగా నరికేశారు
20 మందిని హతమార్చిన ముష్కరులు మృతులంతా విదేశీయులే 10 గంటల అనంతరం ముగిసిన ఢాకా ఆపరేషన్ ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 20మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఢాకాలోని ఓ రెస్టారెంట్లో చొరబడిన ముష్కరులు అందులోని వారిని బందీలుగా తీసుకున్న సంగతి తెలిసిందే. 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు ఉగ్రవాదులను బంగ్లా భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 13మందిని సురక్షితంగా రక్షించాయి. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. ఆపరేషన్ ముగించి.. రెస్టారెంట్లోకి ప్రవేశించిన భద్రతా దళాలకు 20 మంది మృతదేహాలు లభించాయి. వారిని అత్యంత కిరాతకంగా ఉగ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారని ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ అష్షాక్ చౌదరి తెలిపారు. ఉగ్రవాదులు చంపిన వారంతా విదేశీయులేనని తెలుస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కి సురక్షితంగా బయటపడిన 13మందిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అందులో ఒకరు జపనీస్ కాగా, మరో ఇద్దరు శ్రీలంక వాసులు. ఐఎస్ఐఎస్ అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బంగ్లాదేశ్ పోలీసులు భావిస్తున్నారు. -
సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
ఢాకా: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద జియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు చెందిన స్వచ్ఛంద సంస్థ జియా చారిటబుల్ ట్రస్ట్ నిధుల విషయంలో లంఛాలకు పాల్పడినట్లు చేస్తున్న కేసుపై స్టే విధించాలంటూ ఆమె రెండు పిటిషన్లు వేశారు. అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆమె ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరగనుంది. కోట్లలో ఆమె అవినీతికి పాల్పడినట్లు యాంటి కరప్షన్ కమిషన్(ఏసీసీ) 2010లో కేసు నమోదుచేసింది. -
ఆగని హేతువాదుల హత్యలు
ఢాకా: ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్తున్న ఓ ఇంగ్లిష్ ప్రొఫెసర్‌ను ఐస్ఐస్ మిలిటెంట్లు శనివారం దారుణంగా చంపిన ఘటన బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి పట్టణంలో చోటుచేసుకుంది. ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో వరుసగా లౌకికవాదులు, హేతువాదులైన బ్లాగర్లు, మేధావుల మీద దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రాజ్‌షాహీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏఎఫ్ఎమ్ రెజవుల్ కరీమ్ సిద్దిఖీ(58)ను చంపారు. యూనివర్సిటీకి వెళ్లడానికి ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చిన సిద్దిఖీని బైక్‌లపై వచ్చిన మిలిటెంట్లు పదునైన ఆయుధాలతో గొంతు కోసి, చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. సిద్దిఖీ దేహం రక్తపు మడుగులో పడిపోగానే.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని ఆ దేశ మీడియా ప్రచురించింది. ప్రొఫెసర్ హత్యతో ఆగ్రహించిన విద్యార్ధులు నేరం చేసినవాళ్ల శిక్షించాలని యూనివర్సిటీ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. కాగా, ఈ హత్యను తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుందని యూఎస్‌కు చెందిన ఇంటిలిజెన్స్ గ్రూప్ తెలిపింది. -
పాకిస్థాన్ పై బాగా ఆడతాం: కోహ్లి
ఢాకా: ఏ జట్టుతో ఆడిన తన ఆటతీరు మారదని టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అన్నాడు. పాకిస్థాన్ ఆడినప్పుడు కూడా సహజమైన శైలిలోనే ఆడతానని, ఎటువంటి భేదం చూపబోనని చెప్పాడు. ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా బుధవారం జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి మంగళవారం ఢాకాలో విలేకరులతో మాట్లాడాడు. అన్ని జట్లను ఒకేలా చూస్తామని, ప్రతి జట్టుపైనా బాగా ఆడాలని కోరుకుంటామని చెప్పాడు. ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచడం చాలా కీలకమని పేర్కొన్నాడు. మైదానంలోకి దిగాక ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించేందుకు బాగా ఆడాలని అనుకుంటామని, పాకిస్థాన్ టీమ్ తో ఆడినప్పుడు కూడా అదేవిధమైన పట్టుదల ప్రదర్శిస్తామని తెలిపాడు. పాకిస్థాన్ బలమైన జట్టు అని పేర్కొన్నాడు. ఈనెల 27న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. -
కాళ్లుచేతులకు చెట్టు వేర్లు, బెరడ్లు మొలిస్తే..!
ఢాకా: సాధారణంగా మనకు ఒంటిపై చిన్న కురుపులాంటిది వస్తేనే పొద్దస్తమానం అది ఎలా పోతుందా అని అద్దం ముందుపెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటాం. దాన్ని నయం చేసుకునేందుకు నానా మార్గాలు అనుసరిస్తుంటాం.. చివరికి అది మానిపోయి ఓ మచ్చ ఉన్నా తెగ ఫీలయిపోతుంటాం. అలాంటిది, ఓ చెట్టు బెరడు, వేళ్లు ఆకారంలో పెద్దపెద్ద ఆకృతలతో చేతులకు పొడుచుకొని వస్తే.. అవికూడా పొగాకుచుట్టకాడల గుత్తుల్లా ఏళ్లతరబడి అలాగే ఉండిపోతే.. ఊహించుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా.. బంగ్లాదేశ్‌లోని అబుల్ బజందర్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఇతడిని అక్కడ ట్రీ మ్యాన్ (వృక్ష మనిషి) అని కూడా పిలుస్తుంటారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ ఆస్పత్రికి అతడు చికిత్స కోసం వచ్చాడు. ఈ సందర్బంగా చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీడియా చూపించారు. అతడి చేతికి, కాళ్లకు అలా రావడానికి కారణం ఓ చర్మ వ్యాధి అని వైద్యులు తెలిపారు. దానిని 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అని అంటారని తెలిపారు. దాదాపు పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ యువకుడికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమస్య ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తుందని చెప్పారు. గతంలో శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించినట్లు కూడా వివరించారు. -
వేర్వేరు ప్రమాదాలు : 20 మంది మృతి
ఢాకా : బంగ్లాదేశ్‌లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 20 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. సిరాజ్గంజ్ జిల్లాలో జమునా నది బ్రిడ్జ్‌పై శనివారం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే శుక్రవారం రాత్రి భారీ వర్షాల కారణంగా చిట్టిగాంగ్లో మట్టి చరియలు పడి మూడు కుటుంబాలకు చెందిన మొత్తం ఆరుగురు మరణించారని పోలీసులు వెల్లడించారు. -
'ఇక రెండో ఛాన్స్ లేదు'
ఢాకా: ఒక టెస్టు మ్యాచ్ , మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తమ ప్రణాళిలను పక్కాగా అమలు చేయాలని ఆస్ట్రేలియా బౌలింగ్ లెజెండ్ మెక్ గ్రాత్ స్పష్టం చేశాడు. ప్రధానంగా ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే బంగ్లాదేశ్ తో ఆడుతున్నందున టీమిండియా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కోలుకోవడానికి మరో అవకాశం లేదన్నాడు. 'టీమిండియా ప్రణాళికల్లో కచ్చితత్వం ఉండాలి. వారితో ఆడేది ఒక టెస్ట్ మాత్రమే అనే సంగతి గుర్తించుకోవాలి. టెస్ట్ సిరీస్ అయితే తరువాత మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. అక్కడ టీమిండియాకు రెండో ఛాన్స్ లేదు' బంగ్లాతో జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయం అని మెక్ గ్రాత్ తెలిపాడు. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకోకుడూదని హెచ్చరించాడు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది. ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు కోహ్లిసేన పడిపోయే అవకాశం ఉంది. -
కొత్త ఇన్నింగ్స్ మొదలు
ఐపీఎల్ సందడి ముగిసింది. కొద్దిపాటి విశ్రాంతి కూడా పూర్తయింది. ఇక కొత్త సీజన్ కోసం భారత జట్టు సిద్ధమైంది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు ఢాకా వెళ్లింది. మామూలుగా అయితే ఈ పర్యటన గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కానీ ఈ సీజన్లో భారత్‌కు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ ఆటతీరు మెరుగవుతుందా? కెప్టెన్‌గా కోహ్లి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? సాక్షి క్రీడావిభాగం ఇక నుంచి నేర్చుకోవడానికి కాదు... గెలవడానికి ఆడాలి... బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరే ముందు టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య ఇది. సారథిగా తన దృక్పథం ఎలా ఉండబోతోందో ఈ ప్రకటనతోనే చెప్పేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ సమయంలోనే కోహ్లి తన దూకుడును చూపించాడు. చాలామంది కెప్టెన్లు డ్రా కోసం ఆడే పరిస్థితులున్న మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయాడు. ‘ఓ మ్యాచ్‌లో గెలవడానికి ప్రయత్నించి ఓడిపోయినా నేను బాధపడను’ అనే కోహ్లి మాట భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తాడనడానికి సూచన. వన్డేలు, టి20ల సంగతి ఎలా ఉన్నా టెస్టుల్లో భారత్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనిని మార్చాలనే పట్టుదలతో కొత్త సీజన్‌కు కోహ్లిసేన సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు సీజన్‌కు వార్మప్ లాంటిది మాత్రమే. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉంది. అందులో మన జట్టు సత్తా ఏంటో బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు ఆత్మవిశ్వాసంతోనే ఉంది. అనుభవం పెద్దగా లేకపోయినా నైపుణ్యానికి కొదవలేని క్రికెటర్లతో కొత్త సీజన్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే కొత్త కెప్టెన్ దూకుడు దృక్పథాన్ని ఏమేరకు ఆటగాళ్లు అందిపుచ్చుకుంటారో చూడాలి. యువ జట్టు హర్భజన్, మురళీ విజయ్ మినహా ప్రస్తుత టెస్టు జట్టులో అందరూ 30 ఏళ్ల లోపు వాళ్లే. గాయంతో ఈ టెస్టుకు దూరమైన ఓపెనర్ లోకేశ్ రాహుల్ వయసు 23 ఏళ్లే. కాబట్టి ఓపెనర్ స్థానానికి భవిష్యత్‌లో సమ స్య లేదు. పుజారా, రహానే, రోహిత్ 28 ఏళ్ల లోపు వారే. స్పిన్నర్ అశ్విన్‌కు 28 ఏళ్లే. విదేశాల్లో సిరీస్‌లు గెలవాలంటే పేస్ బౌలర్లు కీలకం. భా రత పేస్ బృందం ఉమేశ్, ఇషాం త్, భువనేశ్వర్, ఆరోన్ అందరూ 28 ఏళ్ల లోపు వారే. వీరిలో ఇషాంత్‌కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. తక్కువ వయసు క్రికెటర్లు జట్టులో ఉండటం భవిష్యత్‌లో మేలు చేసే అంశం. ప్రణాళికల్లో మార్పు కెప్టెన్‌గా ధోని రికార్డు అద్భుతం. గతంలో ఎవరికీ సాధ్యంకాని విజయాలు చాలా సాధించాడు. కానీ టెస్టుల్లో ధోని కెప్టెన్సీ వ్యూహాలపై చాలా విమర్శలు ఉన్నాయి. రక్షణాత్మక ధోరణితో ఆడిస్తాడనే ముద్ర ఉంది. దీనిని మార్చడం కోహ్లి ప్రథమ లక్ష్యం. ప్రస్తుతం కోహ్లి వయసు 26 సంవత్సరాలు. నిస్సందేహంగా తనే జట్టులో ఉత్తమ బ్యాట్స్‌మన్. కాబట్టి తనకు కెప్టెన్‌గానూ భవిష్యత్ చాలా ఉంటుంది. కావలసినంత సమయం ఉంది కాబట్టి... తొలుత తనకు ఏం కావాలనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదో ఒక్క సిరీస్‌కో పరిమితం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఓడితే ఏడో ర్యాంక్‌కు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది. ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు కోహ్లిసేన పడిపోతుంది. రాగానే ప్రాక్టీస్... మిర్పూర్: బంగ్లా గడ్డపై అడుగు పెట్టగానే భారత జట్టు సాధనపై దృష్టి పెట్టింది. సోమవారం ఉదయం ఢాకా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు పైగా ప్రాక్టీస్ చేశారు. ఏకైక టెస్టు జరగనున్న ఫతుల్లాలో బంగ్లాదేశ్ టీమ్ ప్రాక్టీస్ కొనసాగుతున్నందున ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో కోహ్లి బృందం సాధన చేసింది. ‘జట్టులోని 14 మంది సభ్యులు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. కోల్‌కతాలో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన సాహా కూడా పూర్తిగా కోలుకున్నాడు. అతను కూడా జట్టుతో పాటు సాధన చేశాడు. మంగళవారం ఫతుల్లాలో శిక్షణ కొనసాగుతుంది’ అని టీమ్ మేనేజర్ బిశ్వరూప్ డే తెలిపారు. ► భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్‌లు జరిగాయి. అన్నీ భారత్ గెలిచింది. సిరీస్‌లన్నీ బంగ్లాదేశ్‌లోనే జరిగాయి. ► మొత్తం రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన ఏడు టెస్టుల్లో ఆరు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఉగ్రవాదంపై పాక్ న్యూసెన్స్
టైజానికి ఊతమిస్తూ భారత్‌కు సమస్యలు సృష్టిస్తోంది ♦ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ ♦ ఉగ్రవాదంపై కలసి పోరాడుదామని బంగ్లాదేశ్‌కు పిలుపు ♦ తీస్తా నదీ జాలల పంపిణీ సమస్యకు మానవీయ పరిష్కారం ఢాకా: బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ‘న్యూసెన్స్’ చేస్తోందని మండిపడ్డారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. భారత్, బంగ్లాదేశ్‌లు కలసికట్టుగా ఈ ప్రాంతంలోని ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో 90 వేల మంది పాకిస్తానీలు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మాది కూడా రాక్షస ప్రవృత్తే అయితే, వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకునేవారమో!’ అని అన్నారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు. గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్నవారు ఏం సాధించారు?ప్రపంచానికి ఏమిచ్చారు? ఉగ్రవాదానికి విలువలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. దాని లక్ష్యం ఒకటే. అదే మానవత్వంతో శత్రుత్వం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని లేశమాత్రం సహించబోమన్న బంగ్లా ప్రధాని హసీనా ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఢాకా వర్సిటీలోని బంగబంధు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో బంగ్లాదేశ్‌లోని ప్రవాస భారతీయులనుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించడంతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. బంగ్లాదేశ్‌కు మళ్లీ వస్తానంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు. ♦ నా పర్యటనకు ఈ రోజే ముగింపు. కానీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఆసియా దేశాలే కాదు ప్రపంచమంతా ఈ పర్యటనపై పోస్ట్‌మార్టం ప్రారంభిస్తుంది. ♦ భూ సరిహద్దు ఒప్పందం రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే అగ్రిమెంట్.. ♦ ప్రపంచంలోని ప్రతీ ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మొదటి ప్రపంచ యుద్ధంలో 75 వేలమందిని, రెండో ప్రపంచ యుద్ధంలో 90 వేల మందిని భారత్ కోల్పోయింది. ఏ దేశంపైనా ఆక్రమణకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో భారత్‌ది కీలక పాత్ర. అయినా.. భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ♦ బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం భారతీయుల గుండెల్ని ఉప్పొంగేలా చేస్తుంది. ♦ శిశు మరణాల నిరోధంలో భారత్ బంగ్లాదేశ్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ♦ మహిళా సాధికారత విషయంలో బంగ్లాదేశ్ స్ఫూర్తినిస్తుంది. ప్రధాని సహా ముఖ్య నేతలంతా మహిళలే. ♦ మానవీయ విలువల ఆధారంగానే తీస్తా నదీజలాల సమస్యను పరిష్కరిస్తాం. ♦ భారత్, బంగ్లాల అభివృద్ధికి సంబంధించి నాకు ఒకే రకమైన కలలున్నాయి. ♦ త్వరితగతిన ఎల్బీఏ అమలు: చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని (ఎల్బీఏ) క్షేత్ర స్థాయిలో అత్యంత శీఘ్రంగా అమలు చేయాలని భారత్, బంగ్లాలు నిర్ణయించాయి. పౌర అణు విద్యుత్తు, పెట్రోలియం, ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ‘నవతరం.. కొత్త దిశ’ పేరుతో ఒక ప్రకటనను మోదీ, హసీనా ఆదివారం సంయుక్తంగా విడుదల చేశారు. అందులో అంశాలు.. ♦ సరిహద్దు ఒప్పందం ఫలితంగా దేశాలు మారిన ప్రజలకు పూర్తి సహకారం ♦ అణు విద్యుత్‌లో సాంకేతిక సహకారం. ఇంధన రంగంలో సహకారంపై కార్యదర్శుల స్థాయి చర్చలు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య మరో మైత్రి ఎక్స్‌ప్రెస్ ♦ ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరులో పరస్పర సహకారం. మరో దేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు, ఉగ్రవాద శక్తులకు తమ దేశాల్లో తావు లేదని స్పష్టీకరణ ♦ అసాంఘిక శక్తులు సరిహద్దులు దాటకుండా ‘సరిహద్దు సమన్వయ నిర్వహణ ప్రణాళిక’ను అమలు చేయడం.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో జోక్యం! బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ దేశ విపక్ష నేత ఖలీదా జియా మోదీని కోరారు. ఆయనతో అరగంట భేటీ అయిన ఆమె బంగ్లాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. బంగ్లా అధ్యక్షుడు హమీద్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. కాగా, మోదీ బంగ్లా పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. వాజ్‌పేయి తరఫున అవార్డ్ స్వీకరణ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారా’న్ని వాజ్‌పేయి తరఫున భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మోదీకి అందించారు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం బంగ్లాభవన్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సహచరులు, పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. ఢాకేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు భారత ప్రధాని నరేంద్రమోదీ ఢాకాలో ఆదివారం ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయాన్ని, రామకృష్ట మఠాన్ని సందర్శించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులకు పవిత్రమైన దేవాలయాల్లో క్రీ.శ. 12వ శతాబ్దంలో బల్లాల సేనుడు నిర్మించిన ఢాకేశ్వరి ఆలయం ఒకటి. ఈ ప్రాంత ప్రధాన శక్తిపీఠాల్లో ఈ ఆలయాన్ని ఒకటిగా భావిస్తారు. ఈ దేవత పేరుమీదుగానే ఈ నగరానికి ఢాకా అని పేరు వచ్చిందని ప్రతీతి. ఆలయంలో దాదాపు పావుగంట పాటు గడిపిన మోదీ.. ఢాకేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు జరిపారు. రామకృష్ణ మఠ్‌లో అక్కడి స్వాములతో కలిసి మోదీ ప్రార్ధనలు చేశారు. రామకృష్ణ మిషన్‌తో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. -
ఢాకా చేరుకున్న మోదీ
-
దావూద్ ఇబ్రహీం అనుచరుడి అరెస్ట్
ఢాకా: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో అబ్దుల్ రవూఫ్ అలియాస్ డౌద్ మర్చెంట్‌కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానంపై అరెస్ట్ చేశారు. 2009లో చట్టవ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించినందుకు డౌద్ అయిదు సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. అతను జైలు నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే బంగ్లాదేశ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో సంబంధాల విషయమై బంగ్లాదేశ్ పోలీసులు డౌద్ని విచారిస్తున్నారు. ** -
బంగ్లాదేశ్ మీడియా దిగ్గజం ఖాసిం అలీకి ఉరిశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మీడియా దిగ్గజం, జమాతే ఇస్లామీ పార్టీ అగ్రనేత మీర్ ఖాసిం అలీ(62)కి ఢాకాలోని యుద్ధ నేరాల ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ప్రకటించింది. 1971లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అమానుషాలకు పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరించింది. -
పడవ ప్రమాదంలో 137 మంది ఆచూకీ గల్లంతు!
ఢాకా:బంగ్లాదేశ్ లో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 23 కు చేరింది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 137 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. సోమవారం మధ్య బంగ్లాదేశ్ లోని పద్మానదిలో 250 మంది ప్రయాణికులతో బయల్దేరిని పడవ ఆకస్మికంగా మునిగిపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఆ పడవకు 85 మంది ప్రయాణికులను తీసుకుళ్లే సామర్ధ్యం ఉన్నా.. భారీ సంఖ్యలో పడవలో ఎక్కించడంతో ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రికి రక్షణ విభాగం చేపట్టిన సహాయక చర్యల్లో 23 మృతదేహాల ఆచూకీ మాత్రమే లభించింది. వీరిలో 11 మంది మృతదేహాలను బంధువులకు అందజేసినట్లు ముసిగంజ్ జిల్లా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికీ రెస్క్యూ టీం తమ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో నౌకాయాన మంత్రి షాజహాన్ ఖాన్ కు చెందిన ముగ్గురు బంధువులు ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ లో జరిగిన బోటు ప్రమాదంలో 250 మంది గల్లంతయ్యారు. సోమవారం ఉదయం పద్మా నదిలో బోటు వెక్కిన అనంతరం పినాక్-6 అనే బోటు ముంపుకు గురవ్వడంతో అందులోని ప్రయాణికులు నీట మునిగిపోయారు. మదరిపూరాస్ నుంచి మున్ షిన్ గంజ్ కు వెళుతున్న వీరు ప్రమాదం బారిన పడ్డారు. దీంతో రక్షణ దళాలు, పోలీసులు నౌకలు, స్పీడ్ బోట్ల సాయంతో సహాయక చర్యలను తీవ్రతరం చేశారు. -
బోటు ప్రమాదంలో 200 మంది గల్లంతు
ఢాకా: బంగ్లాదేశ్ లో జరిగిన బోటు ప్రమాదంలో 200 మంది గల్లంతయ్యారు. సోమవారం ఉదయం పద్మా నదిలో బోటు వెక్కిన అనంతరం పినాక్-6 అనే బోటు ముంపుకు గురవ్వడంతో అందులోని ప్రయాణికులు నీట మునిగిపోయారు. మదరిపూరాస్ నుంచి మున్ షిన్ గంజ్ కు వెళుతున్న వీరు ప్రమాదం బారిన పడ్డారు. దీంతో రక్షణ దళాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, వేటకు వెళ్లిన 640 మంది చెన్నై జాలర్లు బంగాళాఖాతంలో అదృశ్యమైయ్యారు. 40 పడవల్లో సముద్రంలోకి వేటకు వెళ్లిన ఆ జాలర్ల ఆచూకీ నిన్నరాత్రి నుంచి కనిపించకుండా పోయింది. -
4.4 కేజీల విలువైన 36 బంగారు కడ్డీలు స్వాధీనం
ఢాకా: బంగారాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4.4 కేజీల విలువైన 36 బంగారు కడ్డీలను మలద్వారంలో ఉంచి తరలిస్తుండగా ఆదివారం వీరిని భారత సరిహద్దుల్లోని జెస్సోర్ జిల్లాలో పట్టుకున్నట్టు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ చంద్ర, రుహిత్ అశోక్, కోమల్ ఒతారర్, రాజ్‌కుమార్, అహ్మదాబాద్‌కు చెందిన రాకేష్ ఉన్నారు. వీరు జూన్ 19న దుబాయ్ నుంచి ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారని, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను ముగించుకుని ఆదివారం భారత్‌కు పయనమయ్యారని బంగ్లదేశ్ బోర్డు గార్డ్ అధికారి రహమాన్ తెలిపారు. అయితే సరిహద్దును దాటే క్రమంలో వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వారి బస్సును వెంటాడి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. -
ఐసీసీయే ఫిక్సింగ్‌కు అవకాశమిచ్చింది
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆరోపణ ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో గత ఏడాది చోటుచేసుకున్న ఫిక్సింగ్‌కు ఐసీసీ అధికారులనే బాధ్యుల్ని చేస్తోంది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఫిక్సింగ్ జరగబోతోందని ఐసీసీ అవి నీతి నిరోధక, భద్రత యూనిట్ (ఏసీఎస్‌యూ)కు ముందుగానే సమాచారం అందినా.. మ్యాచ్ నిర్వహణకు అనుమతించారని బీసీబీ ఆరోపిస్తోంది. బీపీఎల్‌లో భాగంగా 2013 ఫిబ్రవరి 2న ఢాకా గ్లాడియేటర్స్-చిట్టగాంగ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్లు ఐసీసీ నిర్ధారించడం తెలిసిందే. దీనికి సంబంధించి పలువురు ఆటగాళ్లు నిషేధానికి కూడా గురయ్యారు. అయితే ఈ విషయంపై బీసీబీ ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపిం చింది. ఐసీసీ ఏసీఎస్‌యూ అధికారులు ఫిక్సింగ్‌ను నిరోధించే అవకాశమున్నా పట్టించుకోకుండా సాక్ష్యాలు సేకరించేందుకే పరిమితమైనట్లుగా తేలిందని ట్రిబ్యునల్ నివేదికలో పేర్కొంది. చిట్టగాంగ్ కింగ్స్‌తో మ్యాచ్‌ను ఫిక్స్ చేయాల్సిందిగా జట్టు యజమానుల్లో ఒకరు తనను సంప్రదించినట్లు ఢాకా గ్లాడియేటర్ కోచ్ స్వయంగా ఏసీఎస్‌యూ అధికారులకు సమాచారమిచ్చాడని ట్రిబ్యునల్ వివరించింది. అయినా ఆయా జట్ల యాజమాన్యాలను ఏసీఎస్‌యూ అధికారులు అప్రమత్తం చేయకుండా మ్యాచ్‌కు అనుమతినిచ్చారని తెలిపింది. అయితే బీసీబీ ట్రిబ్యునల్ నివేదికపై ఈ దశలో ఏమీ స్పందించలేమని ఐసీసీ చెబుతుండగా, ఏసీఎస్‌యూ చైర్మన్ రొనాల్డ్ ఫ్లానగన్ మాత్రం తమ వైఫల్యం పట్ల వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. -
ఒక్క చెడ్డ రోజు...!
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి,వెనకటికి ఎవడో సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడ్డాడని సామెత. ప్రతి టోర్నీలోనూ ఎన్ని విజయాలు సాధించిన జట్టుకైనా ఏదో ఒక దశలో ఒక చెడు రోజు ఉంటుంది. దురదృష్టం ఏంటంటే భారత్‌కు అది ఫైనల్ అయింది. టి20 ప్రపంచకప్ మొదటి నుంచి అన్ని లీగ్ మ్యాచ్‌లు, సెమీస్‌లో చెలరేగి ఆడిన భారత్... కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రెండో ఓవర్లోనే రహానే వికెట్ కోల్పోవడంతో టి20లకు అవసరమైన మెరుపు ఆరంభం దొరకలేదు. దీనికితోడు రోహిత్, కోహ్లి ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. చేతిలో వికెట్లు ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. గతంలో ఈ వ్యూహం భారత్‌కు బాగా పనికొచ్చింది. కానీ ఫైనల్లో యువరాజ్ పుణ్యమాని తేలిపోయాం. ఇక బౌలర్లను పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. లక్ష్యం చిన్నదే కావడంతో వాళ్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ముఖ్యంగా అశ్విన్ మీద బాగా ఒత్తిడి పెంచారు. అలాగే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ధోని తొలిసారి విఫలమయ్యాడు. శభాష్ విరాట్... భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి తన క్లాస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. చక్కగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధం చేశాడు. ఒక దశలో కోహ్లి సెంచరీ కూడా చేయొచ్చనిపించింది. కానీ యువీ, ధోని కలిసి కోహ్లికి కనీసం సరిగా స్ట్రయికింగ్ కూడా ఇవ్వలేకపోయారు. ఓవరాల్‌గా టోర్నీలో భారత ప్రదర్శన పేలవంగా ఏమీ లేదు. ఒక్క ఫైనల్‌ను మినహాయిస్తే చాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ధోని... ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరడం ద్వారా కాస్త గౌరవంగానే స్వదేశానికి బయల్దేరుతోంది. -
సింహం నవ్వింది
టి20 ప్రపంచకప్ విజేత శ్రీలంక 18 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం ఫైనల్లో భారత్ ఆల్‌రౌండ్ వైఫల్యం తన చివరి మ్యాచ్‌లో చెలరేగిన సంగక్కర శ్రీలంక కరువు తీరింది. దిగ్గజాలకు ఘనమైన వీడ్కోలు లభించింది. 18 సంవత్సరాల తర్వాత సింహళ సింహాలు ఓ ఐసీసీ ఈవెంట్లో టైటిల్ గెలిచారు. 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత నాలుగు వరల్డ్ కప్‌లలో ఫైనల్‌కు చేరినా నిరాశకు గురైన లంక క్రికెటర్లు... ఈసారి ఏ మాత్రం పొరపాటుకు తావివ్వకుండా విజయం సాధించారు. దీంతో ఇద్దరు దిగ్గజాలు సంగక్కర, జయవర్ధనే తమ టి20 అంతర్జాతీయ కెరీర్నుఘనంగా ముగించారు. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి టి20 ప్రపంచకప్‌లో మొదటి నుంచి అద్భుతంగా ఆడి ఓటమి ఎరుగని ధోనిసేన కీలకమైన ఫైనల్లో చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో పూర్తి వైఫల్యంతో శ్రీలంకకు టైటిల్ అప్పజెప్పింది. ఒక్క కోహ్లి మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలం కావడం భారత్ కొంప ముంచింది. ముఖ్యంగా యువరాజ్ సింగ్ పేలవ ఫామ్‌కు భారత్ ఏకంగా ప్రపంచకప్‌నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి తొలిసారి ఈ ఫార్మాట్లో ప్రపంచ టైటిల్ గెలిచింది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. రహానే (3) విఫలం కాగా... రోహిత్ శర్మ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు) మంచి ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. విరాట్ కోహ్లి (58 బంతుల్లో 77; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి అర్ధసెంచరీ చేశాడు. అయితే చివరి ఓవర్లలో అతను క్రీజులో ఉన్నా ఎక్కువ స్ట్రయిక్ రాలేదు. యువరాజ్ (21 బంతుల్లో 11) టి20ల్లో తన కెరీర్లోనే అతి చెత్త ఇన్నింగ్స్ ఆడాడు. ధోని (7 బంతుల్లో 4 నాటౌట్) కూడా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, మాథ్యూస్, హెరాత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. శ్రీలంక జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. లక్ష్యం చిన్నదే కావడంతో లంక ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడారు. ఓపెనర్ దిల్షాన్ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు), జయవర్ధనే (24 బంతుల్లో 24; 4 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఇక సంగక్కర (35 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) తన చివరి మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. తిషార పెరీరా (14 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో చకచకా పరుగులు చేసి విజయాన్ని తొందరగా పూర్తి చేశాడు. భారత బౌలర్లలో మోహిత్, అశ్విన్, మిశ్రా, రైనా ఒక్కో వికెట్ తీసుకున్నారు. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. కొంప ముంచిన ద్వితీయార్ధం వర్షం కారణంగా మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మాథ్యూస్ బౌలింగ్‌లో రహానే బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లి, రోహిత్ జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. తర్వాత నాలుగు ఓవర్లు కూడా రోహిత్, విరాట్ జాగ్రత్తగానే ఆడారు. కోహ్లి 11 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మలింగ వదిలేశాడు. 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇక హిట్టింగ్‌కు రంగం సిద్ధమైందనుకున్న తరుణంలో రోహిత్ అవుటయ్యాడు. అయితే రెండో ఎండ్‌లో కోహ్లి మాత్రం జోరు పెంచాడు. హెరాత్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. 43 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. 15 ఓవర్లలో 95 పరుగులు చేసింది. కులశేఖర వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కోహ్లి సిక్సర్, రెండు ఫోర్లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. కానీ 17, 18 ఓవర్లలో యువీ బంతులు వృథా చేయడంతో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. తర్వాత రెండు ఓవర్లలోనూ కోహ్లికి పెద్దగా స్ట్రయిక్ రాలేదు. మలింగ అద్భుతంగా యార్కర్లు బౌల్ చేయడంతో ధోని కూడా పరుగులు చేయలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరి ఏడు బంతుల్లో ఒక్క ఫోర్ కూడా రాలేదు. చివరి బంతికి కోహ్లి రనౌటయ్యాడు. మొత్తం మీద భారత్ చివరి పది ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసింది. చివరి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు వచ్చాయి. తడబడ్డా నిలదొక్కుకుని... లంక ఓపెనర్ కుశాల్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే నాలుగో ఓవర్లో మోహిత్ ఏకంగా 15 పరుగులు ఇచ్చాడు. ఐదో ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్‌లోనూ 10 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి వెళ్లి దిల్షాన్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లలో శ్రీలంక 2 వికెట్లకు 41 పరుగులు చేసింది. సంగక్కర, జయవర్ధనే సమయోచితంగా బ్యాటింగ్ చేసి క్రమంగా జోరు పెంచారు. పదో ఓవర్లో రైనా బౌలింగ్‌లో జయవర్ధనే అవుటయ్యాడు. పది ఓవర్లకు లంక 3 వికెట్లకు 69 పరుగులు చేసింది.13వ ఓవర్లో మిశ్రా బౌలింగ్‌లో తిరిమన్నె క్యాచ్‌ను ధోని చక్కగా అందుకున్నాడు. ఈ దశలో భారత శిబిరంలో కొంచెం ఆశలు కలిగాయి. అయితే సంగక్కర అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సంగక్కరతో పాటు పెరీరా కూడా మిశ్రా బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగి భారత్‌పై ఒత్తిడి పెంచాడు.పెరీరా చకచకా పరుగులు చేయడంతో శ్రీలంక మరో 13 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. టర్నింగ్ పాయింట్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంమే భారత్ ఓటమికి ప్రధాన కారణం. ఒక ఎండ్‌లో కోహ్లి అద్భుతంగా ఆడినా... రెండో ఎండ్‌లో అతనికి మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా యువరాజ్... 21 బంతులు ఆడి కేవలం 11 పరుగులు చేశాడు. అందులో 10 డాట్ బాల్స్ ఉన్నాయి. కనీసం 160 కావలసిన స్కోరు 130 దగ్గరే ఆగిపోయింది. దీనికి తోడు మలింగ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రైజ్‌మనీ విజేత శ్రీలంక 11 లక్షల డాలర్లు (రూ. 6.6 కోట్లు) రన్నరప్ భారత్ 5.5 లక్షల డాలర్లు (రూ. 3.3 కోట్లు) ఘనమైన వీడ్కోలు... శ్రీలంక జట్టు సంగక్కర, జయవర్ధనేల కోసం టైటిల్ గెలవాలని కోరుకుంటోందని మలింగ ముందురోజు అన్నాడు. బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను లంక బౌలర్లు బాగా కట్టడి చేశారు. అయితే జయవర్ధనే, సంగక్కర తమకు తామే ఘనమైన వీడ్కోలు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా జయవర్ధనే ఇన్నింగ్స్‌ను స్థిరపరిస్తే... సంగక్కర అమోఘమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2007 నుంచి శ్రీలంక జట్టు రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరింది. ఈ నాలుగు సందర్భాల్లోనూ ఆడిన సంగక్కర, జయవర్ధనేలకు తమ ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేదనే లోటు ఇన్నాళ్లూ ఉంది. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో వీళ్లిద్దరూ టైటిల్ సాధించారు. ఈ ఫార్మాట్ నుంచి వైదులుగుతున్నామని ముందే ప్రకటించిన ఈ ఇద్దరికీ ఇది అద్భుతమైన కానుక. ఒక క్రికెటర్‌కు ఇంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది! విజయం కోసం ఐదు ఫైనల్స్ పాటు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ గెలుపు లంకకు ఎంతో అవసరం. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. అయితే మా బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఎక్కడో ఒక చోట పరుగు ఆపక తప్పదు. నా సమయం ముగిసింది. - కుమార సంగక్కర, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మంచి ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాం. మరో 10-15 పరుగులు చేయాల్సింది. కానీ క్రికెట్ అంటే అదే. చివరి 4 ఓవర్లలో లంక మమ్మల్ని కట్టడి చేయడమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది. - ధోని, భారత కెప్టెన్ గత మూడు మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించడం నిజంగా నా అదృష్టం. మా దిగ్గజాలకు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని పట్టుదలగా అనుకున్నాం. చివర్లో మా బౌలింగే మ్యాచ్‌లో కీలకమైంది. మహేల, సంగలాంటి ఆటగాళ్లతో ఆడటం మా అదృష్టం. కుర్రాళ్లు వీరినుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. - మలింగ, శ్రీలంక కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సేనానాయకే (బి) హెరాత్ 29; రహానే (బి) మాథ్యూస్ 3; కోహ్లి రనౌట్ 77; యువరాజ్ (సి) తిషార పెరీరా (బి) కులశేఖర 11; ధోని నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు (బైస్ 2, లెగ్‌బైస్ 2, వైడ్లు 2) 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 130 వికెట్ల పతనం: 1-4; 2-64; 3-119; 4-130 బౌలింగ్: కులశేఖర 4-0-29-1; మాథ్యూస్ 4-0-25-1; సేనానాయకే 4-0-22-0; మలింగ 4-0-27-0; హెరాత్ 4-0-23-1. శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) జడేజా (బి) మోహిత్ 5; దిల్షాన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 18; జయవర్ధనే (సి) అశ్విన్ (బి) రైనా 24; సంగక్కర నాటౌట్ 52; తిరిమన్నె (సి) ధోని (బి) మిశ్రా 7; తిషార పెరీరా నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 134 వికెట్ల పతనం: 1-5; 2-41; 3-65; 4-78. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-18-0; మోహిత్ శర్మ 2-0-18-1; అశ్విన్ 3.5-0-29-1; మిశ్రా 4-0-32-1; రైనా 4-0-24-1; జడేజా 1-0-11-0. -
‘హ్యాట్రిక్’పై ఆసీస్ గురి
మధ్యాహ్నం. గం. 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం ఇంగ్లండ్‌తో ఫైనల్ నేడు మహిళల టి20 ప్రపంచకప్ సాక్షి, ఢాకా: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ జరిగిన మూడు టోర్నీల్లో... ఒకసారి ఇంగ్లండ్ గెలిస్తే... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచింది. మహిళల విభాగంలో ఈ రెండు జట్లదే ఆధిపత్యం. మరోసారి కూడా ఈ రెండు జట్లే తమ సత్తాను నిరూపించుకుంటూ ఫైనల్‌కు చేరాయి. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా... 2009 విజేత ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈసారి కూడా గెలిస్తే ఆస్ట్రేలియా హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. -
సఫారీలపై సగర్వంగా...
టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లతో విజయం అశ్విన్ సూపర్ బౌలింగ్ కోహ్లి సంచలన బ్యాటింగ్ శ్రీలంకతో ఫైనల్ ఆదివారం వారెవ్వా... ఏం బ్యాటింగ్..! ఒక శిల్పి ఓపికగా ఓ శిల్పాన్ని చెక్కినట్లు... ఓ కళాకారుడు అలుపులేకుండా సౌధాన్ని నిర్మించినట్లు..! భారత క్రికెటర్లు కూడా అద్భుతం చేశారు. టి20 క్రికెట్లో పరుగులు చేయడం ఇంత సులభమా..! అని ప్రపంచం ఆశ్చర్యపోయేలా 173 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్లు తాగినంత సులభంగా ‘ఊదిపారేశారు’. ఓ పద్ధతి ప్రకారం ఆడి చక్కటి భాగస్వామ్యాలతో సఫారీలను చిత్తు చేసి... భారత్ సగర్వంగా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి పాపం... చోకర్స్ అనే ముద్ర తొలగించుకోవడానికి దక్షిణాఫ్రికా క్రికెటర్లు విశ్వప్రయత్నాలు చేశారు. బాగా బ్యాటింగ్ చేశారు... కళ్లుచెదిరే క్యాచ్‌లు పట్టుకున్నారు... కుదురుగా బౌలింగ్ చేశారు. కానీ వేటగాళ్లను మాత్రం ఆపలేకపోయారు. టోర్నీలో తొలిసారి భారత బౌలర్లు విఫలమైనా... బ్యాట్స్‌మెన్ చెలరేగి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... పరుగుల వేటగాడు విరాట్ కోిహ్ల (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. యువరాజ్ (17 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... సురేశ్ రైనా (10 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఒత్తిడిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆమ్లా (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) మంచి ఆరంభాన్నివ్వగా... దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ (41 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. డుమిని (40 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. డు ప్లెసిస్, డుమిని మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. చివర్లో మిల్లర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడాడు. డుమిని, మిల్లర్ చివరి 4.3 ఓవర్లలో అజేయంగా 43 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, భువనేశ్వర్ ఒక్క వికెట్ తీశారు. అశ్విన్, జడేజా మినహా భారత బౌలర్లు ఈసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్ జట్టు శ్రీలంకతో తలపడుతుంది. భాగస్వామ్యాలే కీలకం: ఏ ఫార్మాట్లో అయినా భాగస్వామ్యాలు కీలకమనేది ధోని పదేపదే చెప్పే మాట. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో భారీ లక్ష్యం కళ్లముందున్నా భారత్ గెలవడానికి కారణం చిన్న చిన్న భాగస్వామ్యాలే. 39, 38, 56, 34... ఇవీ భారత ఇన్నింగ్స్‌లో భాగస్వామ్యాలు. ఇందులో మొదటి దానిలో తప్ప మిగిలిన మూడింటిలో కోహ్లి భాగస్వామి. ముఖ్యంగా యువరాజ్ నెమ్మదిగా ఆడినట్లు కనిపించినా... కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు నెలకొల్పిన 56 పరుగుల భాగస్వామ్యం (39 బంతుల్లో) మ్యాచ్‌కు కీలకం. 6 2000 నుంచి భారత్ తాను ఆడిన ఆరు ఐసీసీ సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించగా...దక్షిణాఫ్రికా తాను ఆడిన ఆరు ఓడింది. 3 2010లో మినహా ప్రతీ టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఆసియా జట్టు అర్హత సాధించింది. 2007, 2009 తర్వాత మరో సారి రెండు ఆసియా జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. 1 తొలిసారి బ్యాటింగ్‌కు దిగి 170 పైచిలుకు పరుగులు చేశాక దక్షిణాఫ్రికా ఓడిపోవడం ఇదే తొలిసారి ద్వితీయార్ధంలో జోరు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నాలుగో బంతికే భువనేశ్వర్ తన స్వింగ్‌తో డికాక్‌ను పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు మంచి ఆరంభం వచ్చింది. కానీ ఆమ్లా ఎదురుదాడికి దిగడంతో మోహిత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. పరుగుల వేగం పెరుగుతున్న సమయంలో ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్... ఆమ్లాను బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లే ఆరు ఓవర్లలో దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 44 పరుగులు చేసింది. ఆరు నుంచి పదో ఓవర్‌వరకు డు ప్లెసిస్, డుమిని క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చెలరేగిపోయారు. 11 నుంచి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 61 పరుగులు చేసింది. అశ్విన్ తన రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. కానీ భారీ హిట్టర్లు ఉన్న దక్షిణాఫ్రికా తగ్గలేదు. చివరి ఐదు ఓవర్లలో 42 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు వస్తే ఆఖరి 10 ఓవర్లలో 106 పరుగులు వచ్చాయి. మిశ్రా బౌలింగ్‌ను బాగా చదివిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టారు. అలవోకగా... ఓ పద్ధతి ప్రకారం... రోహిత్ శర్మ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. స్టెయిన్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అదే ఊపులో హెండ్రిక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి వెళ్లి అవుటయ్యాడు. మరో ఎండ్‌లో రహానే సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే... పార్నెల్ బౌలింగ్‌లో కళ్లుచెదిరే సిక్సర్ బాదాడు. మొత్తానికి పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.వేగం పెంచే ప్రయత్నంలో రహానే అవుటయ్యాడు. ఆ లోపు కోహ్లి క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. యువరాజ్ కుదురుకోవడానికి సమయం తీసుకుంటే... ఆ సమయంలో కోహ్లి హిట్టింగ్ మొదలుపెట్టాడు. తాహిర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో కోహ్లి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లితో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత యువరాజ్ భారీషాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. విజయానికి 4 ఓవర్లలో 40 పరుగులు అవసరమైన దశలో... రైనా వచ్చి సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. రైనా జోరుతో పార్నెల్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడలేదు. సెమీస్‌లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు సంతోషంగా ఉంది. మంచి ఫామ్‌లో ఉన్నా. చివరి వరకూ ఒకరు క్రీజులో ఉంటే మ్యాచ్ గెలవచ్చని తెలుసు. విన్నింగ్ రన్ కొట్టడంలో ఆనందం ఉంటుంది. అందుకే నేను విన్నింగ్న్ ్రకొట్టాలని అనుకుని ధోని సింగిల్ తీయకుండా నాకు అవకాశం ఇచ్చాడు. 173 పెద్ద లక్ష్యం అని తెలుసు. కానీ టెన్షన్ పడలేదు. మానసికంగా బలంగా ఉంటే ఛేజింగ్ చేయడం సులభం. రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే గెలుస్తామని తెలుసు. అందుకే అందరం కూల్‌గా ఉన్నాం. బౌలర్ల వల్లే సెమీస్‌కు వచ్చాం. - విరాట్ కోహ్లి స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 6; ఆమ్లా (బి) అశ్విన్ 22; ప్లెసిస్ (బి) అశ్విన్ 58; డుమిని నాటౌట్ 45; డివిలియర్స్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 10; మిల్లర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 172 వికెట్ల పతనం: 1-9; 2-44; 3-115; 4-129; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-1; మోహిత్ శర్మ 3-0-34-0; అశ్విన్ 4-0-22-3; జడేజా 2-0-8-0; రైనా 4-0-35-0; మిశ్రా 3-0-36-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డు ప్లెసిస్ (బి) హెండ్రిక్స్ 24; రహానే (సి) డివిలియర్స్ (బి) పార్నెల్ 32; కోహ్లి నాటౌట్ 72; యువరాజ్ (సి) డివి లియర్స్ (బి) తాహిర్ 18; రైనా (సి) డు ప్లెసిస్ (బి) హెండ్రిక్స్ 21; ధోని నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 176 వికెట్ల పతనం: 1-39; 2-77; 3-133; 4-167. బౌలింగ్: డుమిని 3-0-29-0; మోర్కెల్ 2-0-17-0; స్టెయిన్ 3.1-0-36-0; హెండ్రిక్స్ 4-0-31-2; పార్నెల్ 3-0-33-1; తాహిర్ 4-0-30-1. -
షూ లేకుండా...
సాక్షి, ఢాకా: ఒకరోజు విరామం తర్వాత భారత జట్టు మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం ఢాకాలోని బీసీబీ అకాడమీలో భారత క్రికెటర్లు సుమారు గంటన్నరసేపు ఫుట్‌బాల్ ఆడారు. అయితే కాళ్లకు షూ లేకుండా, ఒట్టి కాళ్లతోనే ఆడారు. మరి గాయాలైతే..? దెబ్బ తగలకుండా ఉండే ప్లాస్టిక్ తరహా బంతితో ఆడారు. ఎందుకిలా..? ‘ట్రైనర్ సూచన మేరకు ఒక రోజు ఇలా సరదాగా ఆడుతున్నారు’ అని జట్టు ప్రతినిధి చెప్పాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ ధోని వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘పైసే ఖతమ్ హో గయే’ (మా వద్ద డబ్బులు అయిపోయాయి) అంటూ తనదైన శైలిలో సరదాగా సమాధానం ఇచ్చాడు. యువరాజ్ ఎడమ చీలమండకు బ్యాండేజి ఉండటంతో అతనికి గాయమైందా అని భారత జట్టు ఫిజికల్ ట్రైనర్ నితిన్ పటేల్‌ను అడిగితే... ‘నన్ను ఎందుకు అడుగుతున్నారు. మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేను’ అంటూ వెళ్లిపోయారు. -
ఆసీస్‌కు ఊరట
బంగ్లాదేశ్‌పై విజయం ఆతిథ్య జట్టుకు పూర్తి నిరాశ రాణించిన ఫించ్, వార్నర్ సాక్షి, ఢాకా: స్థాయికి తగ్గ ఆటతీరును క నబరచలేక అన్ని పెద్ద జట్ల చేతిలో ఓడి సెమీస్‌కు దూరమైన ఆస్ట్రేలియా జట్టు... బలహీనమైన ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో ఊరట పొందింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహిస్తున్న బంగ్లాదేశ్... ఆట పరంగా మాత్రం పూర్తి నిరాశతోనే టోర్నీని ముగించింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు సాధించింది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్ రెండు, స్టార్క్, బొలింజర్, వాట్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు 17.3 ఓవర్లలో మూడు వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఫించ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... వైట్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), బెయిలీ (7 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్‌కు రెండు, తస్కిన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
ఆత్మవిశ్వాసంతో ఉన్నాం
టి20ల్లో ఫలితాన్ని ఊహించలేం మళ్లీ దక్షిణాఫ్రికాకు ఆడతానని అనుకోలేదు ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ ఆల్బీ మోర్కెల్. ఇప్పటికే 259 మ్యాచ్‌లు ఆడాడు. భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం, నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల నైపుణ్యంతో ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు ప్రపంచ వ్యాప్తంగా టి20ల్లో భారీ డిమాండ్ ఉంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఆరేళ్లు ధోనితో పాటు ఆల్బీనీ కొనసాగించింది. ఈసారి మాత్రం కొనసాగించలేదు. ఐపీఎల్-7 కోసం జరిగిన వేలంలో బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. అయితే రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్బీ మోర్కెల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చోటు పోయింది. కొత్త వాళ్లు, యువకుల కోసం 32 ఏళ్ల మోర్కెల్‌ను పక్కనబెట్టారు. అయితే టి20 ప్రపంచకప్‌కు అతని అనుభ వం ఎంత అవసరమో దక్షిణాఫ్రికా బోర్డు ఆలస్యంగానైనా మళ్లీ గుర్తించింది. దీంతో ఈసారి బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నడూ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని లోటును సఫారీ జట్టు తీర్చుకోవాలని భావిస్తోంది. టోర్నీ గెలవగలమనే ఆత్మవిశ్వాసం తమలో ఉందంటున్న ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మీ ప్రదర్శన సంతృప్తినిచ్చిందా? వరుసగా మూడు విజయాలు సాధించాం. అయితే అందులో రెండు మ్యాచ్‌లు ఆఖరి వరకూ పోరాడి గెలిచాం. సాధారణంగా అలాంటి మ్యాచ్‌లు గెలిచినప్పుడు ఊరట వస్తుంది. దానితో పాటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మాత్రం నా ప్రదర్శన ఇంకా మెరుగుపడాలి. సెమీస్‌లో భారత్‌లాంటి పటిష్టమైన జట్టుతో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌పై కామెంట్? ఈ టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి మేం మా పూర్తి సామర్థ్యంతో పోరాడాల్సి ఉంటుంది. ఫైనల్‌కు చేరతామన్న నమ్మకం ఉందా? ఏ జట్టుకైనా నమ్మకం కచ్చితంగా ఉంటుంది. టి20ల్లో ఫలితాన్ని అంచనా వేయలేం. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ స్వరూపం, ఫలితం కూడా మారిపోతుంది. ఏ జట్టుతో ఆడినా పూర్తి సామర్థ్యంతో ఆడటం ఒక్కటే ముఖ్యం. దక్షిణాఫ్రికా జట్టు ఏ పెద్ద టోర్నీలోనూ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఆ లోటు బాధిస్తుందా? చాలా టోర్నీల్లో మేం మంచి క్రికెట్ ఆడాం. టోర్నీ అంతటా బాగా ఆడినా ఒక్కరోజు వైఫల్యం వల్ల మ్యాచ్‌లు పోయాయి. ఈసారి గెలవగలమనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. సాధారణంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తరచూ విఫలమవుతుంటుంది. దీనికి ఒత్తిడే కారణమా? నాకౌట్ అనే కాదు... ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడి ఉంటుంది. దీనిని ప్రొఫెషనల్ క్రికెటర్లు కచ్చితంగా అధిగమించాలి. ఈసారి మ్యాచ్‌లు ఒత్తిడిలోనే గెలిచామన్న విషయం గుర్తుంచుకోవాలి. టి20 స్పెషలిస్ట్ అనే ముద్ర వల్ల కెరీర్లో పెద్దగా టెస్టులు ఆడలేదు. దీని గురించి ఎప్పుడైనా బాధపడ్డారా? చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం సమస్య కాదా? ప్రతి క్రికెటర్ తన సామర్థ్యం ఏమిటనేది తెలుసుకోగలగాలి. అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. నా బలం టి20 అయినప్పుడు నేను టెస్టుల గురించి ఆలోచించడం అనవసరం. ఇక చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎక్కువసార్లు విఫలమవుతాం. ఇది మానసికంగా బాధిస్తుంది. దీనిని అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. తిరిగి దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తానని ఊహించారా? నిజాయితీగా చెప్పాలంటే లేదు. నా అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని నేను ఫిక్సయ్యాను. కానీ ఈసారి దేశవాళీ క్రికెట్లో బాగా ఆడటం వల్ల ఈ పిలుపు వచ్చింది. నిజానికి నేను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యానని తెలియగానే ఆశ్చర్యపోయాను. అయితే నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత. -
షెహ్జాద్ సెంచరీ
పాకిస్థాన్ అర్ధ సెంచరీ బంగ్లాదేశ్‌పై అలవోక విజయం ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్ వైఫల్యం ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇప్పటి వరకూ టి20ల్లో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు (81) ఆడిన జట్టు పాకిస్థాన్. కానీ ఇన్నాళ్లూ ఆ జట్టుకు ఉన్న లోటు... ఒక్క పాక్ క్రికెటర్ కూడా సెంచరీ కొట్టలేదు. ఎట్టకేలకు అహ్మద్ షెహ్జాద్ ఆ లోటు ఆదివారం తీర్చాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై షెహ్జాద్ (62 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. దీంతో పాకిస్థాన్ 50 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ గెలుపుతో అంతర్జాతీయ టి20ల్లో 50 విజయాలు సాధించిన తొలి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 11వ క్రికెటర్‌గా షెహజాద్ నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు), ఆఫ్రిది (9 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రజాక్ రెండు వికెట్లు తీశాడు. అమిన్, షకీబ్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ పడగొట్టారు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. షకీబ్ (32 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. దాంతో టోర్నీలో బంగ్లాదేశ్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. పాక్ బౌలర్లలో గుల్ మూడు, అజ్మల్ రెండు వికెట్లు తీసుకోగా... బాబర్, ఆఫ్రిదిలకు ఒక్కో వికెట్ దక్కింది. షెహ్జాద్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టి20 ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి న్యూజిలాండ్ x శ్రీలంక రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
‘పరీక్ష’ గెలిచారు
గ్రూప్ ‘2’ టాపర్‌గా నాకౌట్‌కు భారత్ ఆస్ట్రేలియాపై 73 పరుగులతో విజయం యువరాజ్ అర్ధసెంచరీ సమష్టిగా రాణించిన బౌలర్లు ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లు రాణించడంతో... సెమీస్ బెర్త్ ఖరారైనా, ఇప్పటిదాకా బ్యాట్స్‌మెన్ సత్తాకు ముఖ్యంగా మిడిలార్డర్‌కు పరీక్ష ఎదురుకాలేదు. దీంతో ఆస్ట్రేలియాతో ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయాలని ధోని నిర్ణయించుకున్నాడు. టాస్ ఓడిపోయినా... ధోని కోరుకున్నట్లే తొలుత బ్యాటింగ్ చేశారు. అసలు సిసలు పరీక్షగా భావించిన మ్యాచ్‌లో... పరిస్థితులకు తగ్గట్లుగా ఆడి పాసయ్యారు. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరి గిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో భారత్ 73 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (43 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చాలాకాలం తర్వాత నిలకడగా ఆడి అర్ధసెంచరీ చేశాడు. కోహ్లి (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్), రహానే (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. యువరాజ్, ధోని ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 84 పరుగులు జోడించడం ఇన్నింగ్స్‌కు హైలైట్. ఆస్ట్రేలియా బౌలర్లంతా తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు 16.2 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు) సహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా భారత బౌలర్లకు ఎదురు నిలువలేదు. ఏదో భారత ఫీల్డర్లకు క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయిస్తున్నట్లు అందరూ వరుసపెట్టి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌లు ఇచ్చారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా... మిశ్రా రెండు వికెట్లు సాధించాడు. భువనేశ్వర్, మోహిత్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నిలబెట్టిన భాగస్వామ్యం ఫామ్‌లో ఉన్న రోహిత్ తొలి ఓవర్లోనే వైదొలిగాడు. అయితే రహానే, కోహ్లి నిలకడగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్ తడబడటంతో పరుగులు మందగించడంతో పాటు వికెట్లు పడ్డాయి. 12వ ఓవర్‌కల్లా భారత్ రహానే, కోహ్లి, రైనాల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధోని వచ్చే సమయానికే క్రీజులో కుదురుకున్న యువీ... కెప్టెన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టాడు. స్కోరు చకచకా కదులుతున్న సమయంలో ధోని, యువీ వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో 159 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చకచకా వికెట్లు మంచి ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు... ఈ మ్యాచ్‌లోనూ కుదురుగా బౌలింగ్ చేశారు. ఆరంభంలోనే చకచకా వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 27 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా స్టార్ మ్యాక్స్‌వెల్ సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. కానీ అశ్విన్ క్యారమ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. వార్నర్, బెయిలీ కూడా భారీ షాట్లకు వెళ్లి అవుటయ్యారు. దీంతో ఆసీస్ 63 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ముర్హెడ్ (బి) హాడ్జ్ 5; రహానే (సి) హాడిన్ (బి) బొలింజర్ 19; కోహ్లి (సి) వైట్ (బి) ముర్హెడ్ 23; యువరాజ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వాట్సన్ 60; రైనా (సి) ఫించ్ (బి) మ్యాక్స్‌వెల్ 6; ధోని (బి) స్టార్క్ 24; జడేజా రనౌ ట్ 3; అశ్విన్ నాటౌట్ 2; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎ క్స్ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159 వికెట్ల పతనం: 1-6; 2-46; 3-53; 4-66; 5-150; 6-152; 7-158. బౌలింగ్: హాడ్జ్ 2-0-13-1; మ్యాక్స్‌వెల్ 4-0-20-1; స్టార్క్ 4-0-36-1; వాట్సన్ 4-0-36-1; బొలింజర్ 4-0-24-1; ముర్హెడ్ 2-0-24-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 6; వార్నర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 19; వైట్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 0; వాట్సన్ (బి) మోహిత్ 1; మ్యాక్స్‌వెల్ (బి) అశ్విన్ 23; బెయిలీ (సి) కోహ్లి (బి) జడేజా 8; హాడ్జ్ (సి) జడేజా (బి) మిశ్రా 13; హాడిన్ (సి) రహానే (బి) మిశ్రా 6; స్టార్క్ రనౌట్ 2; ముర్హెడ్ (సి) ధోని (బి) అశ్విన్ 3; బొలింజర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 86 వికెట్ల పతనం: 1-13; 2-19; 3-21; 4-44; 5-55; 6-63; 7-75; 8-79; 9-83; 10-86. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-7-1; మోహిత్ 2-0-11-1; అశ్విన్ 3.2-0-11-4; రైనా 1-0-16-0; జడేజా 4-0-25-1; అమిత్ మిశ్రా 3-0-13-2. -
జోరు కొనసాగాలి!
ఆస్ట్రేలియాతో నేడు భారత్ ఢీ యువరాజ్ ఒక్కడే సమస్య కంగారూలపై ఆయుధం స్పిన్ రా. గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం టి20ల్లో వరుసగా మ్యాచ్‌లు గెలిచి జోరు కొనసాగించడం చాలా ముఖ్యం. వరుసగా విజయాలు వస్తుంటే ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కనపడవు. కానీ ఒక్కసారి బ్రేక్ పడిందంటే... కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి సెమీస్‌కు చేరామన్న అలసత్వం దరిచేరనీయకుండా ఆస్ట్రేలియాపైనా భారత్ గెలిస్తే.... సెమీఫైనల్లో మరింత ధీమాగా ఆడొచ్చు. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిసారి టి20 మ్యాచ్ 2013 అక్టోబరు 10న రాజ్‌కోట్‌లో జరిగింది. తొలుత ఆస్ట్రేలియా ఏకంగా 201 పరుగుల భారీస్కోరు చేస్తే... భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి నెగ్గింది. ఈ మ్యాచ్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.... యువరాజ్ కోసం. ఆ మ్యాచ్‌లో యువరాజ్ కేవలం 35 బంతుల్లో అజేయంగా 77 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడిన ఆఖరి అంతర్జాతీయ టి20 అదే. వన్డే జట్టులో స్థానం లేకపోయినా యువరాజ్ టి20ల్లో కొనసాగడానికి కారణం ఆ మ్యాచే. టి20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం జట్టుకు కనిపిస్తున్న ఒకే ఒక సమస్య యువరాజ్. పేరుకు ఆల్‌రౌండర్ అయినా బౌలర్‌గా ఉపయోగపడటం లేదు. ఇక బ్యాటింగ్‌లోనూ గాడిలో పడలేదు. కనీసం ఆస్ట్రేలియాతో ఆడిన చివరి మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే యువీ ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు. ఇక యువీని పక్కన పెడితే... ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో భారత జట్టు సూపర్-10 దశలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై స్పిన్ ఆయుధాన్నే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. స్పిన్ ఆడే విషయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బలహీనతను ధోనిసేన సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అటు ఆస్ట్రేలియా వరుసగా రెండు హై స్కోరింగ్ మ్యాచ్‌లలో చివర్లో బోల్తాపడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌పై గెలిస్తే తప్ప ఆస్ట్రేలియాకు సెమీస్ అవకాశాలు లేవు. ఒకవేళ అలాంటి సంచలనం జరిగినా... ఆసీస్ రేస్‌లో ఉండాలంటే భారత్‌పై భారీగా గెలవాలి. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఇది అసాధ్యమే అనుకోవాలి. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మిశ్రా. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), వార్నర్, ఫించ్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హాడ్జ్, హాడిన్, ఫాల్క్‌నర్, ముర్హెడ్, స్టార్క్, బొలింజర్. టోర్నీకి మేం ఫేవరెట్స్‌గా రాలేదు. కానీ నిలకడగా ఆడి సెమీస్‌కు చేరాం. ఏ జట్టైనా తమ బలానికి తగ్గ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. పరిస్థితులను సరిగా ఉపయోగించుకోవడం టి20ల్లో కీలకం. టాస్ గెలిస్తే మళ్లీ బౌలింగ్ చేస్తాం. మంచు ప్రభావం ఉంటున్నా... టి20ల్లో దాని గురించి వన్డేల స్థాయిలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం జట్టు మంచి ఉత్సాహంతో ఉంది. - అశ్విన్ 4 భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇప్పటివరకూ ఎనిమిది టి20లు జరిగాయి. ఇరు జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు గెలిచాయి. 1 టి20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా భారత్ ఒకటి గెలిచింది. ఆసీస్ రెండింట నెగ్గింది. ప్రయోగాలు లేనట్లే (నా)! భారత జట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కూడా రిజర్వ్ బెంచ్‌లో ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆ రోజు మ్యాచ్ కోసం అందుబాటులో ఉన్న ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతామని, ప్రత్యేకంగా రిజర్వ్‌ల కోసం మార్పులు ఉండవని అశ్విన్ చెప్పాడు. అంటే ధోనిసేన వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన కాంబినేషన్‌తోనే ఈ మ్యాచ్ కూడా ఆడనుంది. శనివారం ధోనిసేన సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసింది. రొటీన్‌కు భిన్నంగా ఈసారి నెట్స్‌లో ప్రాక్టీస్ తర్వాత ఫుట్‌బాల్ ఆడారు. మ్యాక్స్‌వెల్‌పై ఆశలు వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్‌పై ఆస్ట్రేలియా మరోసారి ఆశలు పెట్టుకుంది. నిజానికి వార్నర్, ఫించ్, బెయిలీ, హాడ్జ్, వాట్సన్... ఇలా ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. ఈ టోర్నీలో ఇంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఏ జట్టుకూ లేదు. కానీ సమష్టిగా రాణించడంలో విఫలమై నిరాశనే మిగుల్చుకున్నారు. ఇక బౌలింగ్ విభాగమే ఈ జట్టుకు సమస్య. పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో ఈ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు. అందుకే మరోసారి పేసర్లపైనే భారం వేసింది. ‘టాప్’ లక్ష్యం ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ గ్రూప్ ‘2’లో అగ్రస్థానంలో నిలుస్తుంది. తద్వారా గ్రూప్ ‘1’లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడొచ్చు. ప్రస్తుత సమీకరణాలను బట్టి గ్రూప్-1లో శ్రీలంక అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్‌లో భారత్ జట్టు 5 పరుగులతో లంక చేతిలో ఓడింది. ప్రస్తుత బంగ్లాదేశ్ పర్యటనలో భారత్‌కు ఎదురైన ఒకే ఒక్క ఓటమి. కాబట్టి ఆస్ట్రేలియాపై గెలిచి అగ్రస్థానంలో నిలిస్తే... గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడొచ్చు. అప్పుడు ఫైనల్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పాక్‌కు చావోరేవో గ్రూప్ ‘2’లో భారత్ సెమీస్‌కు చేరినందున... ఇక ఒక్క జట్టుకే నాకౌట్ అవకాశం ఉంది. వెస్టిండీస్ రెండు గెలిచి ముందంజలో ఉంది. కాబట్టి పాక్ కచ్చితంగా రెండు మ్యాచ్‌ల్లోనూ (ఒకటి వెస్టిండీస్‌తో) గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు చావోరేవో లాంటిది. ఈ నేపథ్యంలో ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో హఫీజ్ సేన తలపడుతుంది. మరోవైపు స్వదేశంలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని బంగ్లాదేశ్ తాపత్రయపడుతోంది. మ. గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో లైవ్ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
టి20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల విజయం కొనసాగిన బౌలర్ల నిలకడ రోహిత్, కోహ్లి అర్ధసెంచరీలు వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమై తీవ్రంగా నిరాశపరిచిన భారత జట్టు ఈసారి అందరికంటే ముందుగా సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై గెలుపుతో గ్రూప్‌లో వరుసగా మూడు విజయాలతో... ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ బెర్త్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఖరారు చేసుకుంది. 2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత.. మళ్లీ ఇంతకాలానికి ధోనిసేన సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి స్వదేశంలోజరుగుతున్న క్రికెట్ బోర్డు వ్యవహారాల ప్రభావం తమపై ఏ మాత్రం లేదని భారత క్రికెటర్లు నిరూపించారు. అటు, బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయం సాధించారు. స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అశ్విన్ కలిసి 8 ఓవర్లలో 5 వికెట్లు తీయడం... రోహిత్, కోహ్లిల అద్భుత భాగస్వామ్యంతో... షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకోగా....బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనాముల్ హక్ (43 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్ (21 బంతుల్లో 24; 4 ఫోర్లు) రాణించారు. చివర్లో మహ్మదుల్లా (23 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఎదురుదాడికి దిగి వేగంగా ఆడటంతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. అమిత్ మిశ్రా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, షమీ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత జట్టు 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (1) విఫలమైనా... రోహిత్ శర్మ (44 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి (50 బంతుల్లో 57 నాటౌట్;3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ఫామ్‌ని కొనసాగించాడు. రోహిత్, విరాట్ రెండో వికెట్‌కు 75 బంతుల్లో 100 పరుగులు జోడించారు. చివర్లో ధోని (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేసి విజయాన్ని తొందరగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో మొర్తజా, అల్ అమీన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆరంభంలోనే పట్టు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే అశ్విన్ రెండు వికెట్లు వరుస బంతుల్లో తీయడం, ఆ తర్వాతి ఓవ ర్లో భువనేశ్వర్ బౌలింగ్‌లో షకీబ్ అవుట్ కావడంతో... పవర్ ప్లే ఆరు ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు వికెట్లకు 27 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు పట్టు దొరికింది.ఓపెనర్ అనాముల్, కెప్టెన్ ముష్ఫికర్ ఎదురుదాడికి దిగినా... భారత బౌలర్లు రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరినీ అవుట్ చేశారు. మహ్మదుల్లా, నాసిర్ హొస్సేన్ (15) కలిసి పోరాడటంతో బంగ్లాదేశ్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చివరి ఓవర్లో అమిత్ మిశ్రా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడం విశేషం. ఆడుతూ పాడుతూ... ఆరంభంలోనే ధావన్ అవుటైనా... ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ముఖ్యంగా రోహిత్ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ఝళిపించారు. రోహిత్ 39 బంతుల్లో, కోహ్లి 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. వంద పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యం తర్వాత రోహిత్ అవుటయ్యాడు. అనూహ్యంగా యువరాజ్ రాకుండా ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. తన ఫామ్‌తో పాటు బ్యాట్లను కూడా పరీక్షించుకున్న కెప్టెన్ ధోని... కోహ్లితో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) రైనా (బి) అశ్విన్ 6; అనాముల్ (బి) అమిత్ మిశ్రా 44; షంషుర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; షకీబ్ (బి) భువనేశ్వర్ 1; ముష్ఫికర్ (సి) కోహ్లి (బి) షమీ 24; నాసిర్ (స్టం) ధోని (బి) అమిత్ మిశ్రా 16; మహ్మదుల్లా నాటౌట్ 33; జియావుర్ (సి) జడేజా (బి) అమిత్ మిశ్రా 0; మొర్తజా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-20; 2-20; 3-21; 4-67; 5-82; 6-131; 7-131. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-21-1; అశ్విన్ 4-0-15-2; షమీ 3-0-29-1; జడేజా 4-0-30-0; రైనా 2-0-11-0; అమిత్ మిశ్రా 4-0-26-3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నాసిర్ (బి) మొర్తజా 56; ధావన్ (బి) అల్ అమిన్ 1; కోహ్లి నాటౌట్ 57; ధోని నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో రెండు వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-13; 2-113. బౌలింగ్: మొర్తజా 4-0-23-1; సోహాబ్ 3-0-21-0; అల్ అమిన్ 4-0-38-1; షకీబ్ 4-0-26-0; జియావుర్ 2.3-0-26-0; మహ్మదుల్లా 1-0-7-0. ప్రస్తుతం భారత్ ఖాతాలో మూడు విజయాలతో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఆరు పాయింట్లు సాధించగలిగే అవకాశం ఈ గ్రూప్‌లో ఇక వెస్టిండీస్, పాకిస్థాన్లలో ఏదో ఒక జట్టుకు మాత్రమే ఉంది. కాబట్టి వేరే సమీకరణాలతో సబంధం లేకుండా భారత్ సెమీస్‌కు చేరినట్లే. వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఈలోగా పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌తో ఒక మ్యాచ్ ఆడాలి. ఒకవేళ బంగ్లాదేశ్ గనక పాకిస్థాన్‌ను ఓడిస్తే... ఆస్ట్రేలియాకు కూడా అవకాశం ఉంటుంది. లేదంటే పాక్, వెస్టిండీస్‌లలో ఒక జట్టు భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుతుంది. నంబర్‌వన్‌గా భారత్ బంగ్లాదేశ్‌పై విజయంతో ప్రపంచకప్ సెమీస్‌లోకి అడుగు పెట్టిన భారత్‌కు మరో బోనస్ కూడా లభించింది. ఈ మ్యాచ్ అనంతరం ఐసీసీ తాజా టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ధోని నాయకత్వంలోని భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. మొత్తం 129 రేటింగ్ పాయింట్లతో టీమిండియా నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న శ్రీలంక (128 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానానికి దిగజారింది. పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా మా ప్రదర్శన బాగుంది. కానీ ఇంకా మెరుగుపడటానికి కూడా స్కోప్ ఉంది. నాకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చాను. జడేజా, అశ్విన్ తప్ప అందరికీ ప్రాక్టీస్ దొరికింది. సెమీస్‌కు చేరాలనే లక్ష్యం ఏమీ లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ బాగా ఆడాలనే వచ్చాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉంది. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తారు. భారత జట్టుకు ఆడేటప్పుడు శక్తిమేరా రాణించడం క్రికెటర్ బాధ్యత. అందుకే బయట ఏం జరిగినా ఆ ప్రభావం మా ఆటపై ఉండదు’ - ధోని -
ఢాకాలో హైడ్రామా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి అటు భారత్‌లో సుప్రీం కోర్టు ప్రతిపాద నలు బయటకు రాగానే ఇక్కడ ఢాకాలో భారత జట్టు ఉలిక్కిపడింది. మీడియా అప్రమత్తమైంది. దీంతో రోజంతా హైడ్రామా నడిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఐదుగురు ఆటగాళ్లు (ధోని, రైనా, జడేజా, అశ్విన్, మోహిత్) ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఢాకాలో ఉన్నారు. అలాగే రాజస్థాన్ జట్టుకు చెందిన ఇద్దరు (రహానే, స్టువర్ట్ బిన్నీ) కూడా జట్టులో ఉన్నారు. మొత్తం 15 మంది భారత క్రికెటర్లలో ఏడుగురు ఈ రెండు జట్లకు చెందిన వాళ్లే కావడంతో వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యంగా ధోని పాత్ర గురించి చాలా ఎక్కువగా చర్చ జరిగింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రావలసిన ధోని... మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలను తప్పించుకోవాలని భావించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎవరో ఒక ఆటగాడు కచ్చితంగా మీడియా ముందుకు రావాలి. దీంతో రోహిత్ శర్మను పంపించారు. ‘భారత్‌లో ఏం జరుగుతుందనే అంశం మీద రోహిత్ మాట్లాడడు. కేవలం టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన అంశాలను మాత్రమే అడగాలి’ అని మీడియా సమావేశానికి ముందే భారత జట్టు మీడియా మేనేజర్ బాబా ప్రకటించారు. దీంతో మీడియాకు, ఆయనకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. మొత్తం మీద రోహిత్ ఈ ప్రశ్నల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అసలు గొడవ మొదలైంది. బాబాతో మీడియా ప్రతినిధులు కొందరు వాగ్వాదానికి దిగారు. ‘బీసీసీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. కానీ నేను ఐపీఎల్‌కు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలను అనుమతించను’ అని బాబా కుండబద్దలు కొట్టారు. ఈసారీ కసి పెరుగుతుందా? బోర్డుకు సంబంధించిన గొడవలు, వివాదాల మధ్య క్రికెట్ ఆడటం భారత్‌కు కొత్తేమీ కాదు. గత ఏడాది ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం బయటకు రాగానే భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది. ఆ టోర్నీలో అంచనాలకు మించి రాణించి చాంపియన్‌గా అవతరించింది. సాధారణంగా వివాదాలతో పాటే ఎప్పుడూ ప్రయాణించే భారత జట్టు ఈసారి బంగ్లాదేశ్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా పది రోజులు గడిపింది. ఈ లోగా సుప్రీం కోర్టు ప్రతిపాదనలతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ దుమారం నుంచి అభిమానుల గాలి మళ్లాలంటే భారత్ ఈసారి కూడా కప్ గెలవాలి. ఇదే కసితో ఆటగాళ్లు ఆడతారేమో..! -
మ్యాచ్‌పైనే మా దృష్టి!
భారత్‌లో ఏం జరుగుతోందో మాకు అనవసరం స్పష్టం చేసిన భారత క్రికెటర్లు నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ( ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఓ వైపు స్వదేశంలో బోర్డుకు గట్టి షాక్... మరోవైపు ఐపీఎల్లో తమ భవితవ్యం ఏమిటో తెలియని అయోమయంలో సగం మంది క్రికెటర్లు... అయితే పైకి మాత్రం అందరూ ధీమాగానే ఉన్నారు. భారత్‌లో ఏం జరుగుతోందో తమకు అనవసరమని, జట్టు దృష్టంతా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే ఉందని ధోనిసేన స్పష్టం చేసింది. మరేదైనా బలమైన జట్టుతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆడటం కాస్త ఇబ్బందేమో గానీ... బంగ్లాతో మ్యాచ్ కాబట్టి భారత్ హ్యాట్రిక్ విజయాన్ని ఆశించవచ్చు. శుక్రవారం జరిగే సూపర్-10 గ్రూప్-2 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ జట్టు దాదాపుగా సెమీస్‌కు చేరువైనట్లే. ఆ తర్వాతి మ్యాచ్‌లలో ఏవైనా అనూహ్య సమీకరణాలు ఏర్పడితే తప్ప మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. మార్పులు లేకుండానే... భారత జట్టు ఈసారి కూడా మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. యువరాజ్ ఒక్కడి ఫామ్ మినహా అందరూ బాగానే ఆడుతున్నారు. గురువారం రోజు ప్రాక్టీస్‌కు అందరూ వచ్చారు. ఎప్పటిలాగే ఫుట్‌బాల్ ఆడి నెట్స్‌కు వెళ్లారు. ధావన్, యువరాజ్ మరోసారి ఎక్కువగా నెట్స్‌లో గడిపారు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీషాట్లు ప్రాక్టీస్ చేశారు. బంగ్లా జట్టులో షకీబ్‌ను ఆడాలనే ఉద్దేశంతోనో ఏమో.. ప్రాక్టీస్‌లో భారత ప్రధాన ఆటగాళ్లంతా జడేజాతో బౌలింగ్ చేయించుకుని ఆడారు. 25 వేల మందితో హోరు... ప్రస్తుత ఫామ్, జట్టు బలం దృష్ట్యా భారత్‌కు బంగ్లాదేశ్ పోటీ ఇచ్చినా గొప్పే అనుకోవాలి. అయితే శుక్రవారం ఇక్కడ సెలవు కావడంతో.... స్టేడియం సామర్థ్యం 25 వేలు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ బ్లాక్‌లో 10వేల టాకాలకు (రూ.8500) అమ్ముతున్నారంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. భారత బ్యాట్స్‌మన్ అవుట్ కోసం బంగ్లా బౌలర్ ఎవరైనా అప్పీల్ చేస్తే... 25 వేల గొంతులు జతకలుస్తాయి. బౌలింగ్‌లో షకీబ్, మొర్తజా, అమిన్, బ్యాటింగ్‌లో తమీమ్ ఇక్బాల్, కెప్టెన్ ముష్ఫికర్ కీలకం. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ. మిశ్రా. బంగ్లాదేశ్: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, అనాముల్, మోమినుల్, షకీబ్, షబ్బీర్, మహ్మదుల్లా, జియావుర్, సోహాబ్, మొర్తజా, అమిన్. -
మాకు పోయేదేం లేదు
ఈ దృక్పథంతోనే ఆడతాం స్వదేశంలో ప్రపంచకప్‌లో ఒత్తిడి సహజం కొన్ని ఓటములు బాధిస్తాయి షకీబ్ అల్ హసన్ ఇంటర్వ్యూ బంగ్లాదేశ్ క్రికెట్లో అతి పెద్ద స్టార్ షకీబ్ అల్ హసన్. టి20 క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడు. నిజానికి భారత్ లాంటి పెద్ద జట్టులో అయినా స్థానం సంపాదించుకోగల నైపుణ్యం తన సొంతం. అందుకే షకీబ్ పేరు వింటే బంగ్లాదేశ్ ఊగిపోతుంది. ఇక స్వదేశంలో తనమీద ఎన్నో అంచనాలు. అయితే భారత క్రికెటర్ల తరహాలో ఇవన్నీ అలవాటయ్యాయంటున్నాడు షకీబ్. ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ అతిశయోక్తిలా అనిపిస్తుందేమో గానీ... భారత్‌లో సచిన్‌కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో, బంగ్లాదేశ్‌లో షకీబ్కూ అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. అతని పేరు వినిపిస్తేనే ఊగిపోతున్నారు. అతను ఆడుతుంటే బిజీగా ఉండే ఢాకా రోడ్లు ఖాళీ అయిపోతున్నాయి. అంత స్టార్డమ్ ఉన్నా షకీబ్ నేల మీదే ఉన్నాడు. అందరినీ మర్యాదగా పలకరిస్తాడు. ఓ గొప్ప క్రికెటర్‌తో పాటు మంచి మనిషిగా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ సర్కిల్లో పేరు తెచ్చుకున్న షకీబ్ వివిధ అంశాలపై చెప్పిన విశేషాలు... బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్... మా అందరికీ గొప్ప అవకాశం. ఇలాంటి టోర్నీలు బాగా నిర్వహించడం వల్ల క్రికెట్‌కు ఇంకా క్రేజ్ పెరుగుతుంది. 2011 వన్డే ప్రపంచకప్ నిర్వహణ ద్వారా బంగ్లాదేశ్ స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ ప్రపంచకప్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఏ రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగినా అభిమానులు బాగా వస్తున్న సంగతి గమనించే ఉంటారు. నాణ్యమైన క్రికెట్‌ను బంగ్లా అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇలాంటి టోర్నీలో ఒత్తిడి... దేశం తరఫున ఏ మ్యాచ్‌లో ఆడినా ఏ క్రికెటర్‌కైనా ఒత్తిడి ఉండటం సహజం. ముఖ్యంగా ఉపఖండంలో అన్ని జట్లదీ ఇదే పరిస్థితి. భారత్ క్రికెటర్ల తరహాలోనే మాకు కూడా అంచనాలు, ఒత్తిడీ అలవాటయ్యాయి. క్లిష్టమైన గ్రూప్‌లో ఆడటం నిజాయతీగా చెప్పాలంటే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో, ఈ దశలో (సూపర్-10) అన్నీ పెద్ద జట్లే ఉంటాయి. నాలుగు ప్రపంచ చాంపియన్ జట్లతో ఆడటం కచ్చితంగా క్లిష్టమైన ప్రక్రియే. అయితే ఏ మ్యాచ్‌లో అయినా మా పూర్తి సామర్థ్యంతో ఆడటం ముఖ్యం. ఈ జట్ల చేతిలో ఓడినా మాకు పోయేదేం లేదు. స్వదేశంలో ప్రపంచకప్ మ్యాచ్ ఆడటం మరింత ఒత్తిడితో కూడుకున్న అంశం. స్పిన్ బలం టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మా జట్టు బలంగా ఉందనే అనుకోవాలి. మా జట్టులో కనీసం నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్ విషయంలో మాత్రం మేం బాగా మెరుగుపడాలి. హాంకాంగ్ చేతిలో ఓటమి కొన్నిసార్లు కొన్ని ఓటములను జీర్ణించుకోలేం. బాగా బాధ కలిగిస్తాయి. హాంకాంగ్ చేతిలో ఓటమి కూడా అలాంటిదే. మా చేతిలో పాకిస్థాన్ లేదా భారత్ లాంటి జట్టు ఓడిపోయినప్పుడు ఆ జట్టు క్రికెటర్లు కూడా ఇలాగే అనుకుంటారేమో. ఇటీవల కాలంలో అభిమానులకు ఇచ్చిన సందేశం మేం గెలిస్తే ఆకాశానికి ఎత్తుతారు. ఓడిపోయినప్పుడు తిడతారు. ఇది మా దగ్గర సహజం. మా దగ్గర నుంచి మంచి ఆటను ఆశిస్తారు. ఇలాంటి పెద్ద టోర్నీలో టైటిల్ గెలవాలనే అంచనా కరెక్ట్ కాదు. అభిమానులకు ఇదే చెప్పాను. ఎలాంటి అంచనాలు లేకుండా ఆటను ఆస్వాదించాలని కోరాను. -
‘కంగారు’ పడ్డారు
ఆసీస్‌పై పాకిస్థాన్ విజయం ఉమర్ అక్మల్ సూపర్ ఇన్నింగ్స్ మ్యాక్స్‌వెల్ మెరుపులు వృథా లక్ష్యం 192 పరుగులు... ఆస్ట్రేలియా స్కోరు 126/2... ఇక 51 బంతుల్లో 66 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా తడబడింది. మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్‌తో విజయానికి కావలసిన వేదికను సిద్ధం చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలో చేతులెత్తేశారు. దాంతో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి సెమీస్ అవకాశాలను కాపాడుకోవడానికి కచ్చితంగా గెలిచి తీరాల్సిన స్థితిలో పాకిస్థాన్ స్ఫూర్తిదాయకంగా ఆడింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సంచలన బ్యాటింగ్‌తో భయపెట్టినా... ఒత్తిడిని ఎదుర్కొని పాక్ గట్టెక్కింది. ఆదివారం జరి గిన సూపర్-10 గ్రూప్ ‘2’ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 16 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా... పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉమర్ అక్మల్ (54 బంతుల్లో 94; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కొద్దిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఉమర్ అన్నయ్య కమ్రాన్ అక్మల్ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 96 పరుగులు జోడించడం విశేషం. చివర్లో ఆఫ్రిది (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడాడు. ఆసీస్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ ఫించ్ (54 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్, మ్యాక్స్‌వెల్ కేవలం 64 బంతుల్లో 118 పరుగులు జోడించారు. అయితే ఆఫ్రిది బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా లక్ష్యఛేదనలో తడబడింది. పాక్ బౌలర్లలో గుల్, బాబర్, ఆఫ్రిది, భట్టి రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఉమర్ అక్మల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు పాకిస్థాన్ ఇన్నింగ్స్: షెహ్జాద్ (సి అండ్ బి) బొలింజర్ 5; కమ్రాన్ అక్మల్ (సి) వార్నర్ (బి) నైల్ 31; హఫీజ్ (బి) వాట్సన్ 13; ఉమర్ అక్మల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 94; మక్సూద్ (బి) నైల్ 5; ఆఫ్రిది నాటౌట్ 20; మాలిక్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 191 వికెట్ల పతనం: 1-7; 2-25; 3-121; 4-147; 5-180 బౌలింగ్: స్టార్క్ 4-0-35-1; బొలింజర్ 4-0-28-1; వాట్సన్ 4-0-38-1; నైల్ 4-0-36-2; హాగ్ 3-0-29-0; ఫించ్ 1-0-18-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) బాబర్ 4; ఫించ్ (బి) అజ్మల్ 65; వాట్సన్ (సి) కమ్రాన్ (బి) బాబర్ 4; మ్యాక్స్‌వెల్ (సి) షెహ్జాద్ (బి) ఆఫ్రిది 74; బెయిలీ (బి) ఆఫ్రిది 4; హాడ్జ్ (సి) అజ్మల్ (బి) గుల్ 2; హాడిన్ (సి) మాలిక్ (బి) భట్టి 8; కౌల్టర్ నైల్ (బి) గుల్ 0; స్టార్క్ రనౌట్ 3; హాగ్ (బి) భట్టి 3; బొలింజర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 175 వికెట్ల పతనం: 1-4; 2-8; 3-126; 4-146; 5-155; 6-162; 7-163; 8-172; 9-173; 10-175. బౌలింగ్: బాబర్ 4-0-26-2; హఫీజ్ 2-0-18-0; గుల్ 4-0-29-2; అజ్మల్ 4-0-33-1; ఆఫ్రిది 4-0-30-2; భట్టి 2-0-36-2. -
భారత్ పెత్తనం ఆటకు మంచిదే
ఐసీసీ సీఈఓ రిచర్డ్సన్ వ్యాఖ్య సాక్షి, ఢాకా: ఇటీవల ఐసీసీలో జరిగిన మార్పులపై రకరకాల చర్చలు జరిగినా... మొత్తం మీద బీసీసీఐ పెత్తనం ఆటకు మంచిదేనని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. ‘ఇంతకాలం బీసీసీఐ బయటి నుంచి ఆర్థికంగా మద్దతు ఇస్తూ ఇతర దేశాలకు బాధ్యత అప్పజెప్పింది. ఇకపై ఐసీసీ బాధ్యత బీసీసీఐ తీసుకోవడం ఆటకు మంచే చేస్తుంది’ అని రిచర్డ్సన్ అన్నారు. డీఆర్ఎస్ విషయంలో భారత్‌ను ఒప్పిస్తామని చెప్పారు. ‘ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ కుంబ్లే ఆధ్వర్యంలో డీఆర్ఎస్ను సమీక్షిస్తోంది. తొలుత కుంబ్లే డీఆర్ఎస్కు అంగీకరిస్తే, తర్వాత బీసీసీఐని ఒప్పించే అవకాశం ఉంటుంది’ అని రిచర్డ్సన్ చెప్పారు. 2015 వన్డే ప్రపంచ కప్ వరకు నాన్ పవర్‌ప్లేలో సర్కిల్‌కు ఆవల నలుగురు ఫీల్డర్ల నిబంధనను మార్చే ఆలోచనేదీ తమకు లేదన్నారు. మనసులో మాట వేరే! ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ పైకి ఏం చెప్పినా... లోపల మాత్రం బీసీసీఐ పెత్తనాన్ని ఇష్టపడటం లేదు. మీడియా సమావేశం ముగిశాక తనకు సన్నిహితంగా ఉన్న కొందరు విలేకరులతో మాట్లాడుతూ... భారత్ ప్రపంచకప్ నుంచి వైదొలుగుతానని బెదిరించడం వల్లే ఐసీసీలో మార్పులు జరిగాయని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. -
బంగ్లా ‘ఊగిపోతోంది’
ఢాకా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మామూలుగానే బంగ్లాదేశ్‌లో భారత్‌ను మించిన క్రికెట్ పిచ్చి. అలాంటిచోట టి20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్ జరిగితే కావలసినంత సందడి, ఉత్సాహం. ఢాకా మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. నగరం అంతా రోడ్లను రంగు లైట్లతో అలంకరించారు. ప్రధాన రోడ్లన్నింటిపై ‘బంగ్లాదేశ్‌కు స్వాగతం’ అంటూ షకీబ్ బొమ్మతో ఉన్న కటౌట్లు పెట్టారు. రిక్షా వాలా నుంచి ప్రధాన మంత్రి దాకా అందరి ధ్యాసా ప్రస్తుతం ప్రపంచకప్ మీదే ఉంది. రోడ్లపై భారీ స్క్రీన్లు... కార్లలో, ఆటోల్లో రేడియో కామెంటరీ... మొత్తానికి భారత్‌లో కూడా ఇలాంటి సందడి ఉండదేమో! ఇంగ్లిష్ క్రికెటర్... అరబిక్ టాటూ మిర్పూర్: ఇంగ్లిష్ క్రికెటర్ అరబిక్ అక్షరమాలతో టాటూ ముద్రించుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ తన టాటూ ముచ్చటను పరభాషతో తీర్చుకున్నాడు. తన కుడి మణికట్టుపై చక్కగా కనిపించేలా ముద్రించుకున్న భాష ఏంటో అందరికీ అర్థం కాదు సుమా! ఎందుకంటే అతను అరబిక్ భాషలో వేసుకున్నాడు. దాని అర్థం ‘ధైర్యం’ (కరేజ్) అని ముచ్చటగా చెప్పుకొచ్చాడు హేల్స్. పెద్ద పెద్ద టాటూలు వేసుకోవడంలో భారత క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. చేతుల నిండా శిఖర్ ధావన్, కోహ్లిలు ముద్రించుకున్న టాటూలు ఎప్పటి నుంచో ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. -
‘విశ్వాసం’ పెరిగింది
వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం 20 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి మెరిసిన కోహ్లి, రైనా ఢాకా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి కోహ్లి, రైనా, ధోని... ఒక టి20 మ్యాచ్‌లో భారత్ గెలవడానికి ఈ ముగ్గురూ ఆడితే చాలు. బుధవారం ఢాకాలో అదే జరిగింది. ధోనికి మ్యాచ్ ప్రాక్టీస్, కోహ్లికి ఫామ్, రైనాకు ఆత్మవిశ్వాసం... ఈ మూడూ ఒకే మ్యాచ్‌లో వచ్చాయి. దీంతో లో స్కోరింగ్‌గా సాగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారిగా భారీ స్కోరుతో ఉత్సాహం పెంచింది. దీనికి తోడు బౌలర్లూ సమయోచితంగా స్పందించడంతో ప్రపంచకప్‌కు ముందు భారత్ ఖాతాలో ఓ వార్మప్ విజయం చేరింది. షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 20 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఓపెనర్లు, యువరాజ్ విఫలం కావడం, పేసర్లు గాడిలో పడకపోవడం, క్యాచ్‌లు వదిలేయడం.. ఈ మూడు అంశాలూ కాస్త ఇబ్బందిపెట్టినా మొత్తం మీద భారత్‌కు ఇది ఊరట. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డాడు. రైనా (31 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ చేశాడు. కోహ్లి, రైనా నాలుగో వికెట్‌కు 8.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. కెప్టెన్ ధోని (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా ఆడి కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు 5.1 ఓవర్లలో 58 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్ లంబ్ (25 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొయిన్ అలీ (38 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్), బట్లర్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. అయితే భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. కాపాడిన కోహ్లి, రైనా ఇంగ్లండ్ జట్టు స్పిన్నర్ అలీతో బౌలింగ్ ప్రారంభించింది. 7 బంతులు ఆడిన రోహిత్ షార్ట్ బంతిని పుల్ ఆడబోయి హేల్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ధావన్ రెండు బౌండరీలతో ధీమాగా కనిపించినా... ట్రెడ్‌వెల్ అద్భుతమైన క్యాచ్‌కి అవుటయ్యాడు. యువీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. దీంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో కోహ్లి, రైనా వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. జోర్డాన్ బౌలింగ్‌లో రైనా రెండు వరుస బౌండరీలతో గాడిలో పడ్డాడు. మరో ఎండ్‌లో కోహ్లి ప్యారీ బౌలింగ్‌లో 2 వరుస బౌండరీలు బాదితే... ఇదే బౌలర్ బంతిని రైనా మిడ్ వికెట్‌లోకి సిక్సర్ కొట్టాడు. 14వ ఓవర్లో భారత్ 100 మార్కును చేరుకుంది. 15వ ఓవర్లో రైనా ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. బొపారా వేసిన ఈ ఓవర్లో రైనా 4, 4, 6తో 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికీ ఓ ఫోర్ కొట్టి, ఆ తర్వాతి బంతికి డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయని కెప్టెన్ ధోని ఈసారి బ్యాటింగ్‌కు వచ్చాడు. దాదాపు నెలరోజులు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా మహీ టచ్‌లోనే కనిపించాడు. డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లోనే కవర్స్‌లోకి బౌండరీ కొట్టిన కోహ్లి 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధోని, కోహ్లి కలిసి భారత్‌కు భారీస్కోరు అందించారు. ఆరంభం బాగున్నా... భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు హేల్స్, లంబ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. 5 ఓవర్లలోనే ఈ జోడీ 43 పరుగులు జోడించింది. ఐదో ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్... హేల్స్‌ను బౌల్డ్ చేశాడు. మరో మూడు ఓవర్ల తర్వాత రైనా బౌలింగ్‌లో లంబ్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వేగం తగ్గింది. చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 51 పరుగులు అవసరం కాగా... ఆరోన్ వేసిన 18వ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో షమీ... బొపారాను బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో బట్లర్ భారీ సిక్సర్ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 25 పరుగులు అవసరం కాగా... జడేజా వేసిన ఈ ఓవర్లో బట్లర్ అవుటయ్యాడు. దీంతో భారత్ అలవోకగా గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హేల్స్ (బి) డె ర్న్బ్యాచ్ 5; ధావన్ (సి) ట్రెడ్‌వెల్ (బి) బ్రెస్నన్ 14; కోహ్లి నాటౌట్ 74; యువరాజ్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 1; రైనా (సి) జోర్డాన్ (బి) బొపారా 54; ధోని నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-15; 2-30; 3-39; 4-120. బౌలింగ్: మొయిన్ అలీ 1-0-4-0; డెర్న్‌బ్యాచ్ 3-0-27-1; బ్రెస్నన్ 3-0-31-1; జోర్డాన్ 4-0-37-1; బొపారా 2-0-25-1; బ్రాడ్ 2-0-14-0; ట్రెడ్‌వెల్ 4-0-20-0; ప్యారీ 1-0-17-0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: లంబ్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 36; హేల్స్ (బి) భువనేశ్వర్ 16; మొయిన్ అలీ (సి) రహానే (బి) జడేజా 46; మోర్గాన్ (సి) యువరాజ్ (బి) అశ్విన్ 16; బట్లర్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 30; బొపారా (బి) షమీ 6; బ్రెస్నన్ నాటౌట్ 3; జోర్డాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-43; 2-58; 3-87; 4-128; 5-145; 6-157. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-27-1; షమీ 3-0-29-1; అశ్విన్ 4-0-20-1; రైనా 4-0-23-1; జడేజా 3-0-23-2; మిశ్రా 2-0-21-0; ఆరోన్ 1-0-13-0. -
‘నిక్ నేమ్’లోనేముంది!
ఢాకా: బిజోయ్, శుభో, మిటు, మొయినా, బాతుల్, పేట్లా, మాష్, కౌశిక్, లల్లా, శిప్లు, షౌరోభ్...ఈ జాబితా ఏమిటి అనుకుంటున్నారా. వీరంతా బంగ్లాదేశ్ టి20 క్రికెట్ జట్టు సభ్యులు. అదేంటీ పేర్లన్నీ కొత్తగా, ఇంకా చెప్పాలంటే వింతగా ఉన్నాయంటారా! అవును... ఇవన్నీ బంగ్లా క్రికెటర్ల ముద్దు పేర్లు! ఆ దేశ జాతీయ జట్టులో దాదాపు ప్రతీ ఆటగాడికి ఏదో ఒక నిక్‌నేమ్ ఉంది. కొందరికి ఆట వల్లో, శరీరాన్ని బట్టో పేర్లు పెడితే, మరి కొందరికి ఎందుకు అది పెట్టారో తెలీకుండానే వారి నిక్‌నేమ్ స్థిర పడిపోయింది. మైదానంలో ఆట సాగినంత సేపు వారు ఆ పేర్లతోనే సహచరులను పిలుచుకుంటారు. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మొయినా అని ముద్దు పేరు. ఇది మైనా పక్షిని దృష్టిలో ఉంచుకొని పెట్టిన పేరు. బంగ్లా జాతీయ అకాడమీలో షకీబ్ చురుకుదనం చూసి సీనియర్ నయీమ్ ఈ పేరు ఇచ్చాడు. ‘మా జట్టులో దాదాపు అందరికీ నిక్‌నేమ్‌లు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి ఎవరో అనడం, అదే పిలవడం అలవాటైంది. కొంతమందికి ఆ నిక్‌నేమ్‌లు ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలీదు’ అని షకీబ్ చెప్పాడు. బిజో (అనాముల్ హక్), శుభో (షంసుర్ రహమాన్), శిప్లు (రోబియుల్ ఇస్లామ్) ఇలాంటివే! అదే విధంగా తమీమ్ ఇక్బాల్ భారీ కాయం కారణంగా పోట్లా, ముష్ఫికర్ రహీమ్ పొట్టి సైజు కారణంగా బాతుల్ అని పేర్లు పెట్టారు. కెప్టెన్ రహీమ్‌కు ముద్దుగా ‘మిటు’ అనే పేరు కూడా ఉంది. పేసర్ మష్రాఫ్ మొర్తజా (మాష్, కౌశిక్), రజాక్ (ఆఫ్రిది అభిమానిగా లల్లా)లకు కూడా నిక్నేమ్లున్నాయి. ఇక గంగూలీ శైలిలో ఆడే మోమినుల్ హక్‌ను షౌరోభ్ అని పిలుచుకుంటారు! -
పరీక్షకు సిద్ధం భారత కెప్టెన్ కోహ్లి
ఢాకా: భారత జట్టుకు సారథిగా వ్యవహరించడం పెద్ద పరీక్ష అని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసియాకప్‌లో జట్టు కెప్టెన్ కోహ్లి చెప్పాడు. పూర్తిస్థాయి బాధ్యతలకు, తాత్కాలిక బాధ్యతలకు తేడా ఉంటుందన్నాడు. ‘నేను కేవలం ఒక టోర్నీకి మాత్రమే సారథిని. తాత్కాలిక బాధ్యతలు, పూర్తిస్థాయి బాధ్యతలకు చాలా తేడా ఉంది. గతంలో నాకప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాను. కాబట్టే మళ్లీ నాకు అవకాశం వచ్చింది. గెలిస్తే అంతా పొగుడుతారు, లేదంటే విమర్శిస్తారు. ఈ రెండింటికి సిద్ధమై ఉండాలి’ అని కోహ్లి అన్నాడు. తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్నాడు. పాక్‌తో మ్యాచ్ గురించి ప్రత్యేక ఆలోచన లేదన్నాడు. ‘ఆడిన ప్రతీ మ్యాచ్‌లో గెలవడమే మా లక్ష్యం. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దాయాదితో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుంది’ అన్నాడు. ఆసియాకప్ ఆడేందుకు కోహ్లి బృందం ఆదివారం ఢాకా చేరింది. ఒక్కటి గెలిస్తే ‘రెండు’ ఆసియాకప్‌లో భారత్ కనీసం ఒక్క లీగ్ మ్యాచ్ గెలిచినా ఈ ఏడాది ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌ను నిలబెట్టు కుంటుంది. -
అల్ఫా అగ్రనేత బారువాకు మరణశిక్ష
స్మగ్లింగ్ కేసులో బంగ్లాదేశ్ కోర్టు తీర్పు ఢాకా: పది ట్రక్కుల్లో ఆయుధాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో యునెటైడ్ లిబరేషన్ ఆఫ్ అస్సాం (అల్ఫా) అగ్రనేత, భారత్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ పరేశ్ బారువాకు బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. పదేళ్ల కిందటి ఈ కేసులో మరో 13 మందికీ మరణదండన వేసింది. వీరిలో జమాతే ఇస్లామీ చీఫ్, బంగ్లా మాజీ మంత్రు లు మతీర్ రెహ్మాన్ నిజామీ, లుత్ఫోజమాన్ బాబర్, మాజీ సైనిక జనరళ్లు అబ్దుల్ రహీం, రజాకుల్ చౌధురి తదితరులున్నారు. అక్రమాయుధాలు, స్మగ్లిం గ్ చట్టాల కింద రెండు కేసుల్లో వీరిపై విచారణ జరి గింది. హైకోర్టు డివిజన్ అనుమతితో శిక్షలు విధిం చినట్లు చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మొదటి ప్రత్యేక ట్రిబ్యునల్ జడ్జి ప్రకటించారు. పరారీలో ఉన్న బారు వా గైర్హాజరీలో కోర్టు ఆయనకు శిక్ష వేసింది. -
బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 66 ఏళ్ల షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు. సైనిక పాలన ముగిసి ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన తర్వాత ఈ రెండు దశాబ్దాల్లో హసీనా ప్రధాని పీఠాన్ని అధిష్టించడం ఇది మూడోసారి. అధ్యక్షుడి నివాస సౌధం బంగభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానిగా హసీనాతో పాటు 48 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులతో పాటు భారత్ హై కమిషనర్ పంకజ్ శరణ్ సహా పలువురు దౌత్యాధికారులు హాజరయ్యారు. హసీనాకు భారత ప్రధాని మన్మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. -
నేడు బంగ్లా ఎన్నికలు
ఢాకా: ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం సహా విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నా, కొత్త పార్లమెంటును ఎన్నుకొనేందుకు బంగ్లాదేశ్ ఆదివారం ఎన్నికలకు సిద్ధపడుతోంది. పార్టీలకు అతీతంగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అధికార అవామీ లీగ్ తోసిపుచ్చడంతో బీఎన్పీ నేతృత్వంలోని 18 పార్టీల కూటమి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో బంగ్లా ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. బీఎన్పీ మద్దతుదారులు శనివారం 48 గంటల సమ్మెను ప్రారంభించారు. బీఎన్పీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మరణించారు. ఎన్నికలను అడ్డుకునే లక్ష్యంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బీఎన్పీ కార్యకర్తలు పలు పోలింగ్ కేంద్రాలకు, ఒక రైలుకు నిప్పుపెట్టారు. విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నా, సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బంగ్లా పార్లమెంటులో 300 స్థానాలు ఉండగా, ఆదివారం 147 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయని, బీఎన్పీ, దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. -
బంగ్లాలో టి20 ప్రపంచకప్ అనుమానమే!
ఢాకా: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్ నిర్వహణ సందేహంలో పడింది. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో ఆటగాళ్ల భద్రతపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ వచ్చే నెలలో అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నాయి. గత అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే ఎలాంటి పెద్ద టోర్నీ జరపాలన్నా, పాల్గొనే జట్ల భద్రత సందేహంగా మారుతుంది. డిసెంబర్, జనవరిలోగా ఈ ఆందోళనలు తగ్గుముఖం పట్టాలి. టి20 టోర్నీ వేదికలైన ఢాకా, చిట్టగాంగ్, సిల్హెట్తోపాటు ప్రతీ నగరానికి ఈ హింస పాకింది’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. ఐసీసీ తనిఖీ బృందం గత వారం ఇక్కడ పర్యటించి భద్రత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని తెలిపింది. -
ఢాకా కబడ్డీ పోటీల్లో గోల్డ్‌మెడల్
గణపవరం, న్యూస్‌లైన్ : జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి సలుమూరి క్రాంతి అంతర్జాతీయ స్థాయిలో రాణించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత నెలలో జరిగిన కబడ్డీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర మహిళా జట్టు తరుపున ఆడి గోల్డ్‌మెడల్ సాధిం చింది. ఆమెకు శిక్షణ ఇస్తున్న కానిస్టేబుల్ నాగు గురువారం గణపవరంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గతంలో గణపవరం డిగ్రీ కళాశాలలో జిల్లా జట్టులో ఎంపిక కోసం శిక్షణ పొందిన క్రాంతి ప్రస్తుతం గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. 2009లో జమ్మూకాశ్మీర్‌లో జరిగిన సబ్ జూని యర్ జాతీయ స్థాయి పోటీల్లో, 2012లో ఆంధ్రాయూనివర్సిటీ తరుపున తమిళనాడులో జరిగిన పోటీలో గోల్డ్‌మెడల్ సాధించిందన్నారు. ఇప్పటివరకు ఇత ర దేశాలలో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కబడ్డీ క్రీడాకారిణి జిల్లాలో సలుమూరి క్రాంతి ఒక్కరేనని పేర్కొన్నారు. మాది నిరుపేద కుటుంబం అనంతరం క్రీడాకారిణి క్రాంతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తమది నిరుపేద కుటుంబమని, తండ్రి చిన్నతనంలోనే చనిపోయారన్నారు. తాము ముగ్గురు ఆడపిల్లలమని, తల్లి వ్యవసాయ కూలీ అని, తాను రెండవ కుమార్తెనని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున పోటీలకు ఇతర దేశాలు, రాష్ట్రాలు వెళ్లాలంటే వ్యయంతో కూడుకున్నదన్నారు. దాతల సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. తనకు ఆర్థిక సహాయం అందించిన దాతలు కాకర్ల శ్రీనుకు, పీవీ ప్రసాదరాజు, నంద్యాల శేఖర్‌రాజు, చేబ్రోలు మాజీ సర్పంచ్ రామభద్రిరాజులకు, క్రీడారంగంలో ప్రోత్సహించిన జిల్లా కబడ్డీ జట్టు అధ్యక్షుడు ఎం.రంగారావు, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ సంఘ కార్యదర్శి వి.వీర్ల అంకయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.