jac
-
నిరవధిక సమ్మెకు కార్మికుల ప్రణాళికలు!
-
ఆత్మాభిమానం కోసం మా పోరాటం
-
ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ
-
మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు. అధ్యయనంలో ఏం తేల్చారు..ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. -
ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం
-
బాబుపై రాయలసీమ యువజన విద్యార్థి JAC నేతల ఆగ్రహం
-
కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో వీరంతా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్‌ను కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు పలువురు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. గత పాలకులు ఎగతాళి చేశారు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచమంటే మీకిదే ఎక్కువని గత పాలకులు గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న మా బాధలు చూసి స్వయంగా మా ధర్నా శిబిరాలకు వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కలకాలం ఆయనకు రుణపడి ఉంటాం. – కల్లూరి శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ కో–చైర్మన్ 10 వేలకు పైగా కుటుంబాల్లో వెలుగులు రెండు దశాబ్దాలకు పైగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ, జగన్ పాదయాత్రలో మా సమస్యను విని సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పరిష్కరించారు. ఈ నిర్ణయంతో 10,117 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ఆయనకు అండగా ఉంటాయి. – డి. ఉమాదేవి, కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి సీఎం మేలు మరువలేం.. సీఎం జగనన్న మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. పది కాలాలపాటు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మహిళా ఉద్యోగులందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకు దైవకృçప, ప్రజల ఆశీçస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.– ఆర్. దీప, కాంట్రాక్ట్ లెక్చరర్ (కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి) ఐదేళ్ల నిబంధన తొలగింపు చరిత్రాత్మకం.. సీఎం జగనన్న తీసుకున్న రెగ్యులరైజేషన్ నిర్ణయం 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఐదేళ్ల నిబంధన తొలగింపు నిర్ణయం చరిత్రాత్మకం. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకుకృషిచేస్తాం.– కుమ్మరకుంట సురేష్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో పరిపాలన భవనం ముందు ఓవరాక్షన్
సాక్షి, తిరుపతి: హిందూ జేఏసీ పేరుతో టీటీడీ పరిపాలన భవనం ముందు నేతలు ఓవరాక్షన్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. కాగా ఇటీవల చిరుత బారినపడి చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నడక మార్గంలో భక్తులకు రక్షణగా ఊతకర్రలు ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులను అనుమతించకపోవడం, భక్తులను గుంపులుగా పంపాలని, 500 కెమెరాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకుంది. అయితే నడకదారి భక్తులపై టీటీడీ ఆంక్షల పట్ల హిందూ జేఏసీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. టీటీడీ పరిపాలన భవనం ముందు బుధవారం హిందూ జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. భక్తుల కోసం టీటీడీ కష్టపడుతుంటే జేఏసీ నేతలు రాజకీయం చేస్తున్నారు. నడక మార్గంలో ఆంక్షలు వద్దంటూ వాదిస్తున్నారు. హిందూ ధర్మ పేరిట శ్రీనివాసానంద సరస్వతి ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చి తిరుపతిలో డ్రామాలు చేస్తున్నారు. చదవండి: తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట -
సచివాలయంలో సీఎం కేసీఆర్ తో వీఆర్ఏల జేఏసీ భేటీ
-
సీఎంకు నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రూప్–1, గ్రూప్–2లో 1,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల్లో చేపట్టినట్టే భారీ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇటీవల పరీక్షలు రాసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని దోషాలను అధిగమించేలా గ్రేస్ మార్కులు ఇవ్వాలని అభ్యర్థించారు. (చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...) -
అమరావతి జేఏసీవై ఏపీ రెవిన్యూ ఉద్యోగ సంఘాల ఫైర్
-
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్ ప్లాంట్ వద్ద, 17న వరంగల్‌లో, 21న శంషాబాద్‌లో నిరసన సభలు, 24న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ పాల్గొన్నారు. -
అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంలో సమగ్ర విచారణ అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తప్ప మరే కమిటీ వేసినా వృథా ప్రయాసేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై సుప్రీం కోర్టు దగ్గర ప్రతిపాదనలు చేస్తే , ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై నిపుణులతో కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 13న జరిపిన విచారణలో అభిప్రాయపడిందని, దీనిపై కేంద్రం 17లోగా స్పందించాల్సి ఉందని జైరామ్ రమేష్ గుర్తు చేశారు. జేపీసీ మినహాయించి ఎలాంటి చట్టబద్ధ కమిటీలు వేసినా ఈ విషయంలో ఉపయోగం ఉండదని అన్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్.. -
కామారెడ్డిలో కొనసాగుతున్న రైతు జేఏసీ నిరసనలు
-
అవసరమైతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం : రైతు జేఏసీ
-
కామారెడ్డిలో నేడు రైతు జేఏసీ అత్యవసర సమావేశం
-
రాయలసీమలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు : విద్యార్ధి జేఏసీ
-
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ జేఏసీ ఆగ్రహం
నాంపల్లి: ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్ నేతృత్వంలో నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం నుంచి ఏ–వన్ సిగ్నల్ వరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి టీఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ర్యాలీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు గండూరి వెంకటేశ్వర్లు, కస్తూరి వెంకటేశ్వర్లు, రామినేని శ్రీనివాసరావు, ఎస్.ఎం.హుస్సేన్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ తీరుపై ఉత్తరాంధ్ర జేఏసీ ఆందోళన
-
విశాఖ రాజధాని కాకపోతే పాతికేళ్లలో.. మరో విభజన యుద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన అవకాశాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరుగార్చారు. దేవుడిలా.. ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల విశాఖ కేంద్రంగా (రాజధానిగా) ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మళ్లీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరో 25 ఏళ్లలో ఇంకో విభజన యుద్ధం తప్పదు..’ అని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ పేర్కొన్నారు. విశాఖలో శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు సంబంధించిన జెండాను శుక్రవారం విశాఖపట్నంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేఏసీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రీకరణ వల్ల ఇప్పటికే నష్టపోయాం. వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష.. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమతో పాటు మధ్యాంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు..’ అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాజధాని కోసం శనివారం విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. విశాఖ వాసులు.. ఉత్తరాంధ్ర వాసులు ఈ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం జరుగుతున్న ఉద్యమం. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనంపై ఎన్నో కమిటీలు చెప్పాయి. కేంద్రం కూడా గుర్తించింది. అటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖ పరిపాలన రాజధానిగా, రాయలసీమ వాసుల కోసం కర్నూలు న్యాయ రాజధానిగా, మధ్యాంధ్రప్రదేశ్లో అమరావతి శాసన రాజధానిగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం..’ అని చెప్పారు. ఇది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి బాటపడతాయని తెలిపారు. 1956 ఏప్రిల్ ఒకటినే.. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 1953లో ఆంధ్రరాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సిలో ఉండేదని, ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశంపంతులు ఉన్నప్పుడు తొలి అసెంబ్లీ సమావేశం విశాఖ ఏయూ టీఎల్ఎన్ సభా హాల్లో జరిగిందని చెప్పారు. కర్నూలు రాజధానిగా అప్పుడే ఒక తీర్మానం చేశారని గుర్తుచేశారు. తర్వాత పరిణామాల్లో 1956 ఏప్రిల్ ఒకటిన విశాఖ రాజధానిగా శాసనసభ్యులందరూ అప్పుడే తీర్మానం చేసినప్పటికీ, ఇక్కడి రాజకీయ నాయకులు చొరవ చూపకపోవడంతో రాజధాని హైదరాబాద్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం నిలబెట్టుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విశాఖ రాజధానికి సహకరించాలని అభ్యర్థించారు. -
విశాఖకు జై!.. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన
సాక్షి, విశాఖపట్నం: తరతరాల వెనుకబాటు తనంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 1956లోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదని, ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వారికి బుద్ది చెప్పేలా శాంతియుతంగా గర్జనను నిర్వహిచేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ నినదిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జనకు మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం పూర్తి మద్దతు తెలిపింది. విశాఖ గర్జన విజయవంతానికి వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు మాత్రం గర్జనకు దూరంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో ఘోరంగా ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా తన వాణిని కాస్త జనవాణిగా వినిపించేందుకు జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖకు శనివారమే వస్తుండడం గమనార్హం. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్ముతున్నారు. తమ హయాంలో జరిగిన భూకబ్జాలను కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా.. భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నేతలే వాటి గురించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా ఇదే రోజు ఉత్తరాంధ్ర నేతలందరూ ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యేందుకు సిద్ధమవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతిరాయ్, మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ర్యాలీ జరిగే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ జెండాను, పాటను ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీ రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా వెళ్లేలా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు సహాయ పడతారు. సాగర తీరాన మూడున్నర కిలోమీటర్ల మేర సుమారుగా లక్ష మందితో గర్జన జరగనుంది. ర్యాలీ సాగేదిలా.. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుండటంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ గర్జన నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘బీసీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం-బీసీలకు అందిస్తున్న పథకాలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. చదవండి: ‘మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం’ ‘‘వైసీపీ బీసీ డిక్లరేషన్ పెట్టినపుడు ఎన్నికల జిమ్మిక్కులంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఓట్ల రాజకీయం అని ఆరోపించాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైఎస్సార్ నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లో నేనున్నాంటూ పేదలకు ఆపన్నహస్తం అందించిన నేత వైఎస్సార్. ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకుంటున్నారు. తమకు కావాల్సిన హక్కుల సాధనకు పోరాడగలుగుతున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీల సాధికారతకు ఆనాడు వైఎస్సార్ హయాంలో తొలి అడుగు పడింది. నేడు వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు. ఈ రోజు మా పార్టీ సభలు జరిగితే సగానికి పైగా వేదికపై బీసీ నేతలే ఉంటున్నారు. రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద పరీక్ష. అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందని’’ సజ్జల అన్నారు. -
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న విశాఖ గర్జన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా 15న నిర్వహించనున్న విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు గర్జనకు వైఎస్సార్సీపీ మద్దతు పలుకుతోందన్నారు. విశాఖ డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. సోమవారం విశాఖ మద్దిలపాలెంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చంద్రబాబు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు సొంత ప్రాంతం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ‘మీ వ్యాపారాలకు, నివాసానికి, పిల్లల చదువుల కోసం విశాఖ కావాలా? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదా?’ అని నిలదీశారు. ► టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఆ పార్టీ నాయకుల్లో కనబడుతోంది. ► 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర, విశాఖను అభివృద్ధి చేసింది దివంగత వైఎస్సార్ ఒక్కరే. విశాఖలో హెల్త్‌సిటీ, ఐటీ పార్క్, ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతి, బీఆర్టీఎస్, విమ్స్, బీహెచ్ఈఎల్, ఫార్మా పరిశ్రమలను తెచ్చి ముందుచూపుతో నేటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి బొత్స హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే నినాదంతో జేఏసీ ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహానేత వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు ప్రాంతీయ విభేదాలు తేవాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దోపిడీకి అడ్డుపడుతున్నారనే బాధ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎందుకు వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. అచ్చెన్నాయుడు పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ వాళ్ళు సహనం కోల్పోతున్నారని.. ఎల్లో మీడియాతో కలిసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పేదలకు పెట్టిన ఒక మంచి పథకమైన అచ్చెన్నాయుడు చెప్పాలని, కనీసం అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు అయిన కట్టించారా అని ప్రశ్నించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభించింది వైఎస్సార్. హెల్త్ సిటీని తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి. బ్రాండేక్స్ కంపెనీ తీసుకువచ్చింది మహనేతనే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఏపీలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన వారు టీడీపీ నేతలు. మన సీఎంకు అటువంటి మాయలు తెలియవు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్టీఆర్ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని -
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
ఉత్తరాంధ్ర అభివృద్ధితోనే వలసలు ఆగిపోతాయి : మేధావులు
-
వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధం.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్‌కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు -
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‌లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ ఏర్పాటు, వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్ జేఏసీ కన్వినర్‌గా నియమితులయ్యారు. జేఏసీలో సభ్యులుగా ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అక్టోబర్ 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. -
సమ్మె విరమించండి.. మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు. పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రెగ్యులర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, కొందరు కాంట్రాక్ట్ సిబ్బంది సైతం సేవలు అందిస్తున్నారని వివరించారు. అవసరమైన యూఎల్బీల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. యూఎల్బీల్లో సేవలకు వాహనాలు అవసరమైన చోట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, మార్కెట్ల వద్ద చెత్త ఉండిపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రులు ఆదిమూలపు, బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. సమ్మెను ఉధృతం చేస్తాం: కార్మిక జేఏసీ మునిసిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీ, సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి మునిసిపల్ ఒప్పంద కార్మికులు విద్యుత్ నిర్వహణ సేవలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ నెల 17 నుంచి అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న మునిసిపల్ కార్మికులు విధుల్లో పాల్గొనరాదని కోరారు. గురువారం అన్ని పట్టణాల్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారని, శుక్రవారం మునిసిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. -
Telangana: మే 19న ఆటో, లారీ, క్యాబ్‌లు బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 19న బంద్‌రోజు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్నెస్ రెన్యూవల్ రోజుకు 50 పెనాల్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: (మోదీని కించపరిస్తే తాటతీసి తరిమికొడతాం) -
రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాయలసీమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం
-
పది రోజులు ఆగలేకపోయారా?
సాక్షి, అమరావతి/అనంతపురం శ్రీకంఠం సర్కిల్/నెల్లూరు(పొగతోట): ఏపీ జేఏసీవి అవకాశవాద ఉద్యమాలని.. ఇంతకాలం ఆగినవాళ్లు పది రోజులు ఆగలేకపోయారా అని రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు మండిపడ్డారు. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏపీ జేఏసీ నాయకులపై ఉద్యోగులు నమ్మకం కోల్పోయారన్నారు. సీఎం జగన్ హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలెందుకని ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఇది జేఏసీ విజయమని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ మీద నమ్మకంతో జేఏసీ ఆందోళనల్లో గ్రంథాలయ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు «శివశంకరప్రసాద్, నరసింగరావు, శివారెడ్డి, కమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం వద్దు.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేయొద్దని, ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించవద్దని ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంజనాయక్, ఎన్ఆర్కే రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడు సకాలంలో జీతాలు చెల్లించలేదని చెప్పారు. నిరసనలకు మేము దూరం.. పీఆర్సీ గురించి సీఎం జగన్ ఇచ్చిన హామీపై తమకు పూర్తిస్థాయిలో నమ్మకముందని ఏపీ రెవెన్యూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొలతాటి గిరీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారికి సీఎం మాటపై గౌరవం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమయమివ్వకుండా అనాలోచిత ఆందోళనలేమిటని నిలదీశారు. రెండు జేఏసీల నిరసనల్లో తమ అసోసియేషన్ ఉద్యోగులెవరూ పాల్గొనరని స్పష్టం చేశారు. -
అమరావతి జేఏసీ వెబినార్ అట్టర్ ఫ్లాప్
తాడికొండ: అమరావతి రాజధాని పేరిట జేఏసీ చేస్తున్న బినామీ దీక్షల వెబినార్ అట్టర్‌ఫ్లాప్ అయిందని, దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా.. 200 మంది కూడా హాజరు కాలేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 213వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 500 రోజుల ఉత్సవాలు జరిగాయని, 29 గ్రామాల్లో ప్రజల మద్దతు ఉందంటూ వెబినార్‌లో ఉత్సవాలు నిర్వహించి ఎల్లో మీడియాలో ప్రజలను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి జేఏసీ పేరిట కుల విభజన చేసి దళితులకు ఓ జేఏసీ, తన కులస్తులకు మరో జేఏసీ పెట్టి మరోసారి మోసం చేశాడన్నారు. బహుజనులంతా ఏకమై 213 రోజులుగా ఉద్యమం చేస్తుంటే.. దానిని నిర్వీర్యం చేసేందుకు కోర్టులు, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలాడడం సిగ్గుచేటన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల -
చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు..
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం అమరావతి జేఏసీ నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. వెంటనే నివేదికలు తెప్పించాలని సీఎం అధికారులను ఆదేశించారని బొప్పరాజు తెలిపారు. ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలను చావ చచ్చారా అని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. -
ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెబుతాం
-
‘స్వప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయం’
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు. -
ఈ నెల 19న తెలంగాణ బంద్
-
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. వరుసగా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు తావులేకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు.. సమ్మెపై ఎక్కడా తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరింత వాడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావించిన జేఏసీ.. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జేఏసీ నేతలు.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారని, ఈ మేరకు పీసీసీ తరఫున పిలుపునిస్తామని చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని పలువురు ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిశారు. లక్ష్మణ్ స్పందిస్తూ ఆర్టీసీ సమ్మెను తమ భుజాలపై ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్సు డిపోల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిని పంపుతామని లక్ష్మణ్ తెలిపారు. నేడు మౌనదీక్షలు.. ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్ర తరం చేయనున్నారు. ప్రతిరోజు ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. శనివారం గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టనున్నారు. తాలూకా కేంద్రాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు సమర్పించనుంది. శుక్రవారం కరీంనగర్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలసిన పలువురు వినతులు ఇచ్చే క్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీల జోరు.. నినాదాల హోరు! ఆర్టీసీ కార్మికుల 7వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, జిల్లా కేంద్రా ల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. జేఏసీ నేతలు తమ డిమాండ్లను పేర్కొంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాచోట్ల రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మెజార్టీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రయాణికుల తాకిడికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నా అనుభవజ్ఞులైన డ్రైవర్లు దొరకట్లేదు. -
ఆర్టీసీ సమ్మె రేపు ఆఖిలపక్ష సమావేశం
-
ఆర్టీసీ సమ్మె: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చంచేందుకు ఆర్టీసీ జేఏసీ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సమావేశంలో తమ భవిషత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని జేఏసీ తెలిపింది. సమ్మెని విరమించి విధుల్లో చేరాలని ఓ వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాత్కలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు వాహానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి కార్యాచరణ రంగం సిద్ధం చేశారు. మరోవైపు డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేదే లేదని కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే జేఏసీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. -
గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఆర్టీసీకి నష్టాలు
-
అగ్రిగోల్డ్ ఆస్తులు.. అధికారపార్టీ నేతలే కాజేశారు
విజయవాడ: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధిత ఉద్యమ సంఘాలు బుధవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా బాధితుల సమస్యలపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అధికార టీడీపీ నేతలే కాజేశారని ఉద్యమ నేతలు మండిపడ్డారు.చంద్రబాబు వల్ల తమనకు ఎటువంటి న్యాయం జరగదని బాధితులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ బాధితులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ పట్ల ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు చెల్లింపులు మొదలు పెడతామన్న హామీపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామని జేఏసీ తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నేతలు పర్యటించి వైఎస్సార్సీపీకి అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల మద్ధతు కూడ గట్టాలని నిర్ణయం తీసుకుంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
-
బీసీని సీఎంగా ప్రకటించే పార్టీకే మద్దతు
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు అన్యాయం చేశాయని భావించిన బీసీ నాయకులు రానున్న ఎన్నికల్లో తమ ఓటు తామే వేసుకోవాలన్న పిలుపుతో ప్రజా జేఏసీగా ఏర్పడ్డారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడలో జరిగిన సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రజా జేఏసీ ఏర్పడింది. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించే పార్టీకే మద్దతివ్వాలని బీసీ నాయకులు తీర్మానించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడినందుకే చట్టసభల్లో సముచిత స్థానం పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలకు విలువలు లేకపోవడం దీనికి నిదర్శనమన్నారు. ఒకరిని మరొకరు దూషించుకోవడం వల్ల పారదర్శకత లోపిం చిందన్నారు. దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం కొరతతో అభివృద్ధి కుంటుపడిందని, కాబట్టి విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 36 స్థానాల్లోనే బీసీ అభ్యర్థులు పోటీపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. మన ఓటు మన బీసీలకు వేసి గెలిపించుకుని చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించుకోవడం వల్ల మన సంక్షేమానికి పునాదులు వేసుకున్న వారమవుతామని ఈశ్వరయ్య అన్నారు. గతం ప్రభుత్వాలు కులవృత్తులు, చేతివృత్తుల వారి అభివృద్ధిని నీరుగార్చాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు అగ్రకులాల నాయకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడికి గురవుతున్న ఏౖకైక వర్గం బీసీలేనన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా విలువలతో కూడిన నాయకులను గెలిపించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కస్తూరి జయప్రసాద్, ప్రొఫెసర్ మురళీమనోహర్, జేబీ రాజు, పీఎస్‌ఎన్‌వీ మూర్తి, టీవీ రామ నర్సయ్య, నర్సింహ పాల్గొన్నారు. -
వికారాబాద్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్
ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. టీఆర్ఎస్ అధిష్టానం వికారాబాద్ టీఆర్ఎస్ టికెట్‌ను డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది. ఈమేరకు బుధవారం ప్రకటించింది. జిల్లాలోని మరో మూడు టికెట్లను కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ నిరాకరించింది. టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం భారీ కసరత్తు చేసింది. పలుమార్లు మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఇతర నేతలతో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఎట్టకేలకు టికెట్ ప్రకటించడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అనంతగిరి: టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. ఈమేరకు వికారాబాద్ నియోజకవర్గం స్థానాన్ని డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటయించింది. రెండు నెలలుగా ఈ టికెట్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మొదటి జాబితాలో వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు పేరు లేకపోవడంతో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు, పలువురు డాక్టర్లు యత్నించారు. ఎట్టకేలకు అధిష్టా నం డాక్టర్ మెతుకు ఆనంద్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ బరిలో దిగారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెతుకు ఆనంద్‌కు టికెట్ రావడంతో ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో కీలక భూమిక డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేశారు. 2013–14లో వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2014లో ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. మెతుకు ఆనంద్ వికారాబాద్‌లో సబితాఆనంద్ పేరుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ఆర్జిత సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు. -
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విడదీసి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ధరావత్, గిరిజన నేతలు శంకర్ నాయక్, ఆంగోత్ గణేశ్ నాయక్‌ల ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు. ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో గత నాలుగేళ్లుగా గిరిజనులకు హక్కుగా దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోండు, కోయ, కోలాం, లంబాడీ తెగల మధ్య విభేదాలు సృష్టిస్తూ గిరిజనుల నిజమైన సమస్యలను పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు. గిరిజన జనాభా 99 శాతం ఉన్న గిరిజన తాండాలు, గూడాల అభివృద్ధికి జిల్లా పరిషత్తుల ద్వారా వివిధ పద్దుల కింద నాలుగేళ్లుగా విడుదల కావాల్సిన రూ.20 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ
-
ఉక్కు ఉద్యమంపై లాఠిన్యం
కడప సెవెన్‌రోడ్స్: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగురోజులుగా జిల్లాలో పాదయాత్రలు నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎన్ఎస్యూఐ సంఘీభావంగా పాల్గొన్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై విరుచుకుపడి లాఠీలు ఝళిపించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఆర్ నాయక్ స్పృహ కోల్పోయారు. విద్యార్థులు ఆయనను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో మళ్లీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడమంటే కాలయాపన కోసమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంటుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని ఓ వైపు చెబు తూనే టాస్క్ ఫోర్స్‌కు శ్రీకారం చుట్ట డం దేనికని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. అధికా రంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మోసగించిన నేరంలో ప్రధాని మోదీ ప్రథమ ముద్దాయి కాగా, చంద్రబాబు రెండవ ముద్దాయని చెప్పారు. విశాఖలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అప్పట్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో విద్యార్థి, యువకులే ప్రధానంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా మాట నిలుపుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెబు తారని హెచ్చరిం చారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ది లేని టీడీపీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ రాయలసీమలోని నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు, బి. నారాయణ, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, వైఎస్సార్ యువజన విభాగం నాయకులు చల్లా రాజశేఖర్, విద్యార్థి నాయకుడు ఖాజా రహమతుల్లా, జనసేన విద్యార్థి విభాగం నాయకుడు గంగిరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి తిరుమలేశ్, పీడీఎస్‌యూ నాయకులు అంకన్న, సీపీఎం నాయకులు రామ్మోహన్‌రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
కడప విద్యార్థి JAC కలెక్టరేట్ మట్టడిలో అపశృతి
-
గర్జించిన యువ సైన్యం!
కడప వైఎస్ఆర్ సర్కిల్: విభజన చట్టంలో పేర్కొ న్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థులు గళం విప్పారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ మానవహారం చేపట్టారు. బుధవారం నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో విద్యార్థి ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు కోటిమందితో మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విశాఖ రైల్వేజోన్ దుగ్గరాజపట్నం ఓడరేవు వంటి ఏర్పాటు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పొందు పరిచిందన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సింది పోయి ఏ మా త్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధా ని మోదీ 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఫీజుబిలిటీ లేదని సుప్రీం కోర్టులో అపిఢవిట్ దాఖలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రజలను మభ్య పెట్టేందుకు దొంగ పోరాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ మాట్లాడుతూ విభజన హామీల కోసం విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ముఖ్య మంత్రి చంద్రబాబు పోలీసులు చేత అక్రమ అరెస్ట్‌లు చేయించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యువభేరి నిర్వహిస్తే విద్యార్థులను భయబ్రాం తులకు గురి చేయడం దారుణమన్నారు. వైఎస్ ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా మాట్లాడుతూ విభజన హామీల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రజలతోపాటు, సినిమా హీరోలు మద్దతు తెలపాలన్నారు. అనుమతి తీసుకొని 20 వేల మంది విద్యార్థులతో కలిసి మానవహారం చేస్తుంటే కనీసం 10 నిమిషాలు సమయం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. అపుస్మా జిల్లా అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కరువుతో అల్లాడుతున్న జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి ఆదుకోవాల్సింది పో యి జిల్లాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. విభజన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు 5 మంది తమ పదవులకు రాజీనామా చేసి రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తుంటే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో డ్రామాలాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలి పారు. ఉక్కు సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయిందో నేడు బీజేపీకి కూడా అదే గతి పడుతుందన్నారు. విద్యార్థి ఐక్య వేదిక జేఏసీ నాయకుల ప్రసంగాలను పోలీసులు అడ్డుకొని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యను, మద్దిలేటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జోగిరామిరెడ్డి, విద్యార్థి ఐక్య వేదిక జేఏసీ యూనియన్ నాయకులు వెంకట శివ, నరసింహ, సగిలి రాజేంద్ర ప్రసాద్, గంగిరెడ్డి, బి. మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ, బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేశాయి
పత్తికొండ టౌన్: టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఈనెల 25న రాష్ట్రంలో కోటి మందితో మానవహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యార్థి యువజన సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, కోకన్వీనర్ కారుమంచి తెలిపారు. మానవహారం జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీపు జాతా గురువారం పత్తికొండకు చేరుకుంది. స్థానిక నాలుగుస్తంభాల మంటపం వద్ద వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీ కలసి విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు చైతన్యమై, ఏకతాటిపై వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ, జిల్లా నాయకులు విజయేంద్ర, రాజు, ప్రతాప్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రవితేజ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమేశ్, స్థానిక నాయకులు ఉపేంద్ర, రాజు, ప్రభాకర్, సురేంద్ర, సీపీఐ మండల కార్యదర్శి కడవల సుధాకర్, పట్టణ కార్యదర్శి సురేంద్ర, రైతుసంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద వీరన్న, రాజాసాహెబ్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
కోవెలకుంట్ల (కర్నూలు): ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవరాజు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గురువారం నిరుద్యోగ జేఏసీ, వీహచ్పీఎస్, మాలమహానాడు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైభవ్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ, ధర్నా చేపట్టారు. స్థానిక గాంధీసెంటర్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాయకులు కోగిల ప్రసాద్, సునీల్, సుధాకర్, చినబాబు, సురేష్, బద్రి, అశోక్, శేఖర్ పాల్గొన్నారు. -
రైల్వే జోన్ సాధన కోసం నిరసన రాత్రి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్‌తో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమం చేపట్టారు. జ్ఞానాపురం వైపు ఉన్న రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ అంశం దాదాపు 30 ఏళ్లుగా నడుస్తోందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, బోర్డు చైర్మన్ కూడా ఇది పొలిటికల్ విషయమని తెలియజేశారని గుర్తు చేశారు. వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రహమాన్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాడినప్పుడు జోన్ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల సభలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దానిని బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్, కె.ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ రక్షణ వేదిక కన్వీనర్ ఎస్.ఎస్.శివశంకర్, వీజేఎఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు, ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి జి.ఎ.నారాయణరావు పాల్గొన్నారు. వేదికపై కూచిపూడి నాట్యం, మిమిక్రీ, మేజిక్‌షో, పేరడీ సాంగ్స్ తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మారేష్, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు జేఏసీ మద్దతు
ముషీరాబాద్ : ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణ తదితర సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ, యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా అధికార టిఎంయు ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడాన్ని ఆర్టీసీలోని 8సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్వాగతించింది. మంగళవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టీఎంయు ఇచ్చిన ఆందోళన కార్యక్రమాన్ని బలపరుస్తూ 7న కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 8, 9, 10తేదీల్లో జేఏసీ నాయకులు రాష్ట్రంలోని అన్ని డిపోల్లో పర్యటించి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేస్తారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని సమ్మెను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడు ప్రధాన డిమాండ్లపై రాజీలేని పోరాటం చేయాలని టీఎంయును కోరారు. సంస్థ పరిరక్షణలో భాగంగా పన్నుల మినహాయింపులతో పాటు డీజిల్‌పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వం భరించే విధంగా ఒప్పించాలని, రూ.24వేలు కనీస వేతనం ఉండేలా మాస్టర్ స్కేల్ అమలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకోవాలని, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతపై, టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుల పైనే ఉండేలా రెగ్యులేషన్స్ సవరించాలనే డిమాండ్లను సాధించుకునే విధంగా సమ్మె సాగాలని కోరారు. సమావేశంలో రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ ముదిరాజ్ (టిజేఎంయు), విఎస్ రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్), రమేష్ (కెఎస్), అబ్రహం (ఎస్డబ్ల్యూయు), యాదగిరి (కెపి) పాల్గొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు... సమ్మె తేదీ ప్రకటించక ముందే ఆర్టీసీ జేఏసీలోని ముగ్గురు ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించి మిగిలిన ప్రతినిధులను పిలవకపోవడాన్ని జేఏసీ తప్పుపట్టింది. చర్చల్లో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికపై చర్చించకుండా జేఏసీని సంప్రదించకుండా ఏకపక్షంగా సమ్మె తేదీని నిర్ణయించడం దారుణమన్నారు. టిఎంయు వైఖరి కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడింది. గుర్తింపు సంఘంగా అన్ని యూనియన్లను ఒకతాటి పైకి తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. నిరవధిక సమ్మెలోకి వెళ్తే కార్మికులకునష్టం జరగకూడదనే విశాల దృక్పథంతో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. -
అగ్రకులాల్లో పేదలు పాలకులకు కనిపించరా?
-
మా కులమే అనర్హతా?
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఉన్నత కులంలో పుట్టడమే మా తప్పా.. మా కులమే మాకు అనర్హతా... అగ్రకులాల్లో పేదలు కనిపించడం లేదా..’’అని రెడ్డి జేఏసీ నాయకులు పాలకులను ప్రశ్నించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్‌తో రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే విదార్థులకు రూ.20 లక్షల సహాయం అందించాలని, గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రెడ్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించగా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వాటిని తిప్పికొట్టారు. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: నాయిని అగ్ర కులాల్లో చాలామంది పేదలు ఉన్నారని, సీఎంను ఒప్పించి ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోంమంత్రి నాయిని చెప్పారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అగ్ర కులాల పేదలకు కూడా అందాల్సిన అవసరం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమస్యలు పరిష్కాం కావన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ద్వారా రేవంత్‌రెడ్డి నాయకుడు కాగలడేమోగానీ సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. దొరల పెత్తనాన్ని అడ్డుకోవాలి: రేవంత్‌రెడ్డి తెలంగాణ పోరాటంలో రెడ్ల పాత్ర కీలకమని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే యత్నం జరిగిందని, రెడ్డి అనే కారణంగా కోదండరాంను పక్కన పెట్టారని విమర్శించారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలవకుంటే మన ఉనికికే ప్రమాదమని అన్నారు. వారిని ఓడించే శక్తి రెడ్లకు ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఎమ్మెల్యేలు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటి జయప్రద, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అసోసియేట్ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి, కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన వైద్య సిబ్బంది నిరసన
జనగామ అర్బన్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు జిల్లాలోని వైద్య సిబ్బంది చేస్తున్న పెన్‌డౌన్, టూల్ డౌన్ కార్యక్రమం బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈమేరకు ఏరియా ఆస్పత్రి, చంపక్ హిల్స్‌లోని ఎంసీహెచ్‌ల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు ఇచ్చి వేతనం చెల్లించాలని కోరారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పించి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే, ఎస్టీఓ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మయ్య, కార్యదర్శి కె.రాజేష్, సిబ్బంది సంతప్, సహదేవ్, శ్రీరాములు, మధుకర్, రంజిత్, శశిధర్, అభిలాష్, చంద్రారెడ్డి, శ్రీధర్, రమేష్, రమ్య, ఉమాదేవి, శోభ, నాగమణి, వెంకమ్మ, సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
కోదండరాం పార్టీకి మద్దతు ఇవ్వాలి
భువనగిరి : జేఏసీ చై ర్మన్ కోదండరాం ఏ ర్పాటు చేయనున్న పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఉస్మానియ యూనివర్సిటీ జేఏసీ ఆధ్యక్షుడు మాలిగ లింగస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా టీజేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాలకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పే శక్తి కోదండరాంకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అ«ధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ బల్లి దయాకర్, పట్టణ కన్వినర్ డి. రఘువీర్, మండల కన్వినర్ కె. శ్రీశైలం, నరేష్, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్‌కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో మూతపడిన సినిమా థియేటర్లు
-
థియేటర్లు బోసిపోయాయి
సాక్షి, హైదరాబాద్: ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో కళకళలాడే థియేటర్లు బోసిపోయాయి. సినిమా థియేటర్ల యజమానులు బంద్ పాటించడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సినిమా ఆగిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారంగా మారిన డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్ కారణంగా.. నగరంలోని సుమారు 200 సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు నిలిపేశారు. వీపీఎఫ్ క్రమంగా ఎత్తేయాలని, విరామ సమయంలో ప్రదర్శించే రెండు ప్రకటనలను సినిమా పరిశ్రమకు ఇవ్వాలనే డిమాండ్‌తో పంపిణీదారులు, ప్రదర్శనకారులు, నిర్మాతలు నిరవధిక బంద్‌కు దిగారు. దక్షిణ భారత సినీ పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు థియేటర్లు సంపూర్ణ మద్దతునివ్వడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కొత్తపేట్, సరూర్‌నగర్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూతపడ్డాయి. నిత్యం సందర్శకులు, ప్రేక్షకులతో కళకళలాడే నెక్లెస్ రోడ్ ఐమాక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపేయడంతో బోసిపోయాయి. పలు థియేటర్ల వద్ద ప్రదర్శనలు నిలిపేస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. శుక్రవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో మధ్యాహ్నం వరకు రంగుల్లో మునిగితేలిన యువత.. సాయంత్రం సినిమాకు వెళ్లే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యింది. థియేటర్లకు సమీపంలోని హోటళ్లు, చాట్ భండార్లు, టీ, జ్యూస్ సెంటర్లు, పాన్‌డబ్బాలు బోసిపోయి కన్పించాయి. జేఏసీ నిర్ణయం మేరకే.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జేఏసీ నిర్ణయం మేరకే థియేటర్లను మూసివేశాం. వారం పాటు థియేటర్లు మూసేసినా మేము సిబ్బందికి వేతనాలు ఇవ్వాల్సిందే. సర్వీస్ ప్రొవైడర్లు రేట్లు తగ్గిస్తే జేఏసీ నిర్ణయం మేరకు థియేటర్లను మళ్లీ తెరిచేందుకు అవకాశం ఉంటుంది. – రామారావు, సంధ్య 70 ఎంఎం థియేటర్ మేనేజర్ వీకెండ్లో వినోదం కోల్పోయాం.. శుక్రవారం హోలీ, శని, ఆదివారాల్లో సెలవు రావడంతో కుటుంబా లు, స్నేహితులతో కల సి థియేటర్లలో సినిమా కు వెళదామనుకున్నాం. కానీ మాలాంటి వారికి బంద్ వల్ల నిరాశే ఎదురైంది. వీకెండ్లో వినోదం కోల్పోయాం. – కె.వంశీకృష్ణ, ప్రేక్షకుడు -
కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్: జేపీ
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం తనను కలిసిన పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. జేపీ ఇంకా ఏమన్నారంటే.. ‘ప్రజలకు కావలసినవి రావాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. ఒకసారి చట్టంలో పెట్టాక ఆశలు ఆకాంక్షలు అమలు చేయకపోవడం ఏరు దాటాక తెప్ప తగలేయడం లాగా ఉంది కేంద్రం పని. తెలంగాణకు కూడా కొన్ని హామీలు నెరవేర్చాలి. ఆర్థికంగా జరగవలసిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రత్యేక హోదా అనేది నష్టపోయిన ప్రాంతానికి ఆదుకోవడం కోసం మాత్రమే. బుందేల్‌ఖండ్‌కు కేంద్రం నుంచి 4 వేల కోట్లు అందాయి. పదివేల కోట్లు అందాయని కేంద్రం చెబుతుంది. మీ రాజకీయాల కోసం ప్రజలను బలి చేయొద్దు’ పవన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. హామీల సాధనకు జేఏసీని ఏర్పాటు చేస్తామని, మీరు కూడా ఉండాలని జేపీని కోరాం. జేఏసీలో రెండు రాష్ట్రాల నాయకులను భాగస్వామ్యం చేస్తాం. ఒక సమూహంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష భేటీ తరువాత ప్రధానమంత్రిని కలిసి అన్నీ వివరిస్తా’ -
పవన్ ఆలోచనల్లో ఎదుగదల, కానీ..: కత్తి
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో ఎదుగుదల కనిపిస్తోందని, అయితే అది ఆచరణలోకి రావాలని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి పవన్ కోరినట్లు ప్రత్యేకంగా జేఏసీ అవసరం లేదని, పోరాడుతున్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిస్తే సరిపోతుందని అన్నారు. గురువారం ఉదయం కత్తి మహేష్ విజయవాడ లెనిన్ సెంటర్ లో విపక్షాలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. (కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని పవన్‌కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామని నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.) మరోవైపు ప్రత్యేక హోదాను స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టిన చంద్రబాబు సర్కార్ కు బుద్ది చెబుతామని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర బంద్ లో భాగంగా విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మట్టి, నీరుతో రాష్ట్రంను నిలువునా కేంద్రం దగా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రాజకీయాల్లోకి జేఏసీ
హైదరాబాద్: రాజకీయాల్లో జేఏసీ జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఈ నెల 4 తర్వాత దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా బొంగ్లూర్‌లో బుధవారం జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని కాపాడుకోవడానికి జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పాత పది జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఈ నెల 4న తుర్కయంజాల్‌లో సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలు సమాజాభివృద్ధికి దోహదపడటం లేదని, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులు అధికారంలో ఉన్నారని విమర్శించారు. ఈ సదస్సుకు జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ వెదిరె చల్మారెడ్డితో పాటు జిల్లా నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, కొత్త రవి తదితరులు హాజరయ్యారు. -
బంద్ సక్సెస్
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కొందరు అక్రమంగా దున్నడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ, అఖిలపక్ష, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి బంద్ జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ లు, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించాయి. తప్పుడు పత్రాలను సృష్టించి కళాశాల మైదానాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. కళాశాల ఆస్తులను కాపాడుకోవడం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆక్రమిస్తే సహించబోం: విప్ గోవర్ధన్ కళాశాల ఆస్తులను ఆక్రమిస్తే సహించబోమని ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్ వ్యక్తులు దున్నిన కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో వాలీబాల్ ఆడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కళాశాల ఆస్తులు వెళ్లకుండా చూసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రజా కోర్టు నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు. కళాశాల భూములను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ జగన్నాథం, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరిసుష్మ, ఎంపీపీ మంగమ్మ, బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు, టీఆర్ఎస్ నేత నిట్టువేణుగోపాల్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, కాంగ్రెస్ నేతలు నల్లవెల్లి అశోక్, నిమ్మ మోహన్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, బీజేపీ నాయకులు వి.మురళీధర్‌గౌడ్, చిన్నరాజులు, ప్రభాకర్‌యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం, విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్, అగ్గి రవీందర్, అరుణ్‌కుమార్, భానుప్రసాద్, సురేశ్ పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఫిబ్రవరి 3వ తేదీ లేదా 4వ తేదీన విస్తృతస్థాయి సమా వేశం నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. రైతు అధ్యయన యాత్రలపై సమీక్షించడానికి శనివారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను కోదండరాం మీడియాకు వెల్లడించారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో రైతు అధ్యయన యాత్రలు పూర్తయ్యాయని, ఇంకా మిగిలిఉన్న ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేస్తామన్నారు. 22వ తేదీ నుంచి 30వ తేదీ దాకా జిల్లాల వారీగా జరిగిన అధ్యయన యాత్రల్లో వచ్చిన అంశాలపై సమీక్షా సమావేశాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు. జిల్లా స్థాయి సదస్సులు పూర్తయిన తరువాత విçస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఏసీ నేత గోపాలశర్మ అరెస్టుపైనా సమీక్షించినట్టుగా కోదండరాం వెల్లడించారు. -
కోదండరాంది పదవుల తండ్లాట:బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కొలువుల కొట్లాట సభ నిర్వహించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కోదండరాం నిర్వహించింది కొలువుల కొట్లాట సభ కాదు.. తనకు పదవి కోసం జరిపిన తండ్లాట సభ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, ఆ పార్టీతో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో కోదండరాం.. నేరుగా టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని కోదండరాం విమర్శించారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
నెల్లూరు(పొగతోట): గూడూరు రూరల్ మండలంలోని ఉపాధిహామీ ఏపీఓ సుబ్బరాయుడిపై దాడి చేసిన అధికారపార్టీ నాయకుడి తనయుడు నాగరాజు, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమాఖ్య(జేఏసీ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బద్దిపూడి మధు, వల్లూరు దయానంద్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఓపై అధికారపార్టీకి చెందిన వ్యక్తులు 20 మంది చుట్టుముట్టి మేము చెప్పిన పనులు చేయవా అంటూ పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ళతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఓ ప్రాణభయంతో పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉపా«ధి సిబ్బంది అభద్రతతో పనులు చేయలేమని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. జ్ఞానప్రకాష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలి రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు.. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి చిత్రపటాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి అల్లూరు చెరువు భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు న్యాయం చేయాలని యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చెరువు భూముల్లో 140 యానాది కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మర్‌స్టోరేజ్ కోసం ఆ భూముల్లో ఐదెకరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుందన్నారు. గతంలో పంటలు సాగు చేసుకున్న యానాదులు భూముల్లోకి వెళితే ఎస్సీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. భూస్వాముల నుంచి రక్షణ కల్పించండి.. పేద రైతులకు భూ స్వాముల నుంచి రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ సినియర్ నాయకులు పి.దశరథరామయ్య, వి. రామరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. నెల్లూరు రూరల్ మండలం కందమూరులో 150 ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే నెల్లూరుకు చెందిన వ్యాపారులు సాగు చేయనివ్వకుండా రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారని తెలిపారు. అప్పటి కలెక్టర్ భూములను పరిశీలించి వ్యాపారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయమని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం దొంగ పట్టాలు సృష్టించి రైతులను భూముల్లోకి దిగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. భూములు సాగు చేస్తున్నా వారికి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి బ్రాహ్మణక్రాక ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1975లో జలదంకి మండలం బ్రాహ్మణక్రాక సోసైటీ రిజిస్టర్ అయిందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్యవర్గ సభ్యుల గడువు పూర్తి అయినందున సోసైటీకి ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతు జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. -
‘కమిషనరేట్ అక్కడ నిర్మించొద్దు’
సాక్షి, హైదరాబాద్: కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోం స్థలంలోని పదెకరాలను రాచకొండ కమిషనరేట్‌కు కేటాయించారు. జారీ చేసిన జీవోను రద్దు చేయాలని విక్టోరియా హోం భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జేఏసీ చైర్మన్ కొదండరాం సదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వి.ఎం. హోం స్థలాన్ని అనాథ విద్యార్థుల కోసం విద్యా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూములను రాకొండ కమిషనరేట్‌కు కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కమిషనరేట్‌కు తాము వ్యతిరేకం కాదని ఓటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ప్రభుత్వ భూములు కావాల్సినంత ఉన్నాయన్నారు. అక్కడ నిర్మిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీనిపై ప్రభుత్వ జీవోలను రద్దు చేసే వరకు తాము పోరాడుతామని, పోరాడే వారికి మద్దతు ఇస్తామని కోదండదాం తెలిపారు. -
కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ టీచర్ల ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసే విధంగా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మూడేళ్లుగా ప్రవర్తిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల జేఎసీ నాయకులు విమర్శించారు. కలెక్టర్ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయడంపై ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల్లో బయోమెట్రిక్ యంత్రం పనిచేయని పక్షంలో సమీప ప్రాంతంలోని ఇతర కార్యాలయాల్లో హాజరు నమోదుచేయాలని ఆదేశించడం గర్హనీయమన్నారు. ఈ ఆదేశాలను అమలు చేసే క్రమంలో పెరవలిలో ఉపాధ్యాయురాలు బి.రత్నకుమారి ప్రమాదానికి గురై మృతిచెందిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కలెక్టర్ అదే విధానాలను అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు పెంచాలని, ఎస్ఎంసీ, పీటీఏ సమావేశాలను, టాయిలెట్ నిర్వహణ వాటి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, ప్రతి మూడు నెలలకోసారి పాఠశాలలను మూసివేసి మండలస్థాయిలో టీఎల్ఎం మేళాలను ప్రదర్శించాలని ఆదేశించడం కలెక్టర్ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న విద్యాశాఖ సమీక్ష సమావేశాల్లో ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాలను, విద్యాశాఖాధికారులను అవమానించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో మానసిక భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి ఏలూరు మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్, డీఈఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ జేఏసీ నాయకులు పి.జయకర్, పీఎన్వీ ప్రసాదరావు, బీఎ సాల్మన్‌రాజు, పువ్వుల ఆంజనేయులు, గుగ్గులోతు కృష్ణ, గెడ్డం సుధీర్, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్
ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ కరివేపాకులా వాడుకుంటోందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఆయన వీలైనంత త్వరగా గుర్తించాలని హితవు పలికారు. మంగళవారం వేణుగోపాలాచారి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. టీజేఏసీ ముసుగులో కోదండరాం, కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై 32 కేసులు, ఇతర ప్రాజెక్టులపై 192 కేసులు దాఖలు చేసి అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని అన్నారు. దీనికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నంద్యాల ఉపఎన్నిక మాదిరిగానే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. -
కోదండరామ్‌కు ఆ విషయం తెలియదా?
జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఢిల్లీలో అబద్దాల చిట్టాతో సంచరిస్తున్నారని, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కోదండరామ్ అబద్దాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లక్షా నలభై అయిదు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని పేర్కొన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసలు ఎలాంటి తెలంగాణ కావాలో కోదండరామ్ స్పష్టం చేయాలన్నారు. -
పోరాట ఉధృతితోనే ఫలితం
–ముద్రగడ పాదయాత్ర మొదలుపెడితే ప్రభుత్వానికి శ్మశాన యాత్రే –ఉద్యమం చివర స్థాయిలో ఉంది కాపులంతా రెట్టింపు ఉత్సహంతో పనిచేయాలి –పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ చలో కిర్లంపూడి తరలిరావాలి –13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి: ఉద్యమాన్ని ఎంత తీవ్రతరం చేస్తే ఫలితాలు అంత తొందరగా వస్తాయని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు అభిప్రాయ పడ్డారు. గురువారం కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో ముద్రగడ ఆధ్వర్యంలో 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు, జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన కాపు జేఏసీ నాయకులు ముద్రగడ పాదయాత్ర భవిష్యత్తు కార్యచరణపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యమం శివరి దశలో ఉందని రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తే తొందరలోనే ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి కాపుల అభివృద్ధికి పాటుపడతానని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్తు అందిస్తానని చెప్పి ఇంత వరకూ ఆ హామీలు అమలు చేయకపోవడంతో జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం నిరవధిక పాదయాత్ర చేపడితే వేలాది మంది పోలీసుల ఆసరాతో పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు చలో కిర్లంపూడి నినాదంతో 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కాపులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నో పార్టీల జెండాలు మోసి అలసిపోయాం ... ఇప్పటికైనా జండాలు పక్కనపెట్టి ఒకే ఎజెండాతో ముందుకు సాగుదాం అని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపులంతా కొదమ సింహాలు ... వారంతా ముద్రగడ వెంటే ఉన్నారు.... చంద్రబాబు వెనుక ఉన్నది పిల్లి పిల్లలు, వ్యక్తిగత స్వప్రయోజలన కోసం చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారని మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులను ఉద్ధేశించి పలువురు జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ రోజు కాపు కార్పోరేషన్ పెట్టినా, కాపు రుణాలు ఇచ్చినా ముద్రగడ పోరాటమేనని అన్నారు. జాతి మనుగడ కోసం, జాతి మనుగడ కోసం ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు యావత్తు కాపు జాతి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదు
- ముద్రగడ చేపట్టిన పాదయాత్ర జరిగి తీరుతుంది - కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి (జగ్గంపేట): లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదని తమనాయకుడు ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర జరిగి తీరుతుందని జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, గౌతు స్వామి తదితరులు స్పష్టం చేశారు. శనివారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో కొందరు మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుతోపాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు ముద్రగడ ఉద్యమాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారు. కాపు కులాన్ని వేరు చేసి ఓట్లు అడిగింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అధికారం వచ్చిన వెంటనే ఆరు నెలల్లోపు కాపు, తెలగ, బలిజ వంటి కులాలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది చంద్రబాబు కాదా అన్నారు. కాపు ఓట్లు ద్వారా లబ్ధి పొంది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా ఇంత వరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోవడం చంద్రబాబు విధానం తేటతెల్లమవుతుందన్నారు.ముద్రగడ వెంట ఎవరూ లేరనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోను ఇన్ని వేల మంది పోలీసులతో పోలీస్ పికెట్లు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. ముద్రగడను పాదయాత్రకు పంపించండి...అప్పుడు ముద్రగడ వెంట ఎంత మంది ఉన్నారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ నిరంతరం 144, సెక్షన్ 30 అమలులో పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వాలని కోరారు. ఈ సమావేశంలో తనిశెట్టి వెంకటేశ్వరావు, కొత్తెం బాలకృష్ణ, అడబాల శ్రీను, ఓరుగంటి చక్రం, వాసా రాఘవరావు, ఎస్సీ నాయకుడు మూరా సహదేవుడు, బీసీ నాయకుడు ఎల్లపు తాతారావు, ఓసీ నాయకులు మండపాక చలపతి, గౌతు వెంకటేశ్వరరావు, దాడి నారాయణమూర్తి, ఒన్నెం శ్రీను, సూరత్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ జేఏసీ తీవ్ర అభ్యతరం
-
ముద్రగడ వెంటే మేమంతా
అరచేతిని అడ్డుపెట్టి ఉద్యమాన్ని ఆపలేరు పాదయాత్ర జరిగి తీరుతుంది కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి (జగ్గంపేట) : అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఏ విధంగా ఆపలేరో పోలీసులను అడ్డుపెట్టి ముద్రగడ పాదయాత్రను ఆపలేరని, ఆరు నూరైనా పాదయాత్ర జరిగి తీరుతుందని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్ తదితరులు మాట్లాడుతూ ముద్రగడ వెంట ఎవరూ లేరని కొందరు తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారని ముద్రగడ వెంట ఎవరూ లేకపోతే పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో పోలీసు పికెట్లు ఎందుకు పెట్టారని, కిర్లంపూడిలో వేలమంది పోలీసు బలగాలను ఎందుకు మొహరింపజేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల అమలు గుర్తు చేయడం కోసం తమ నాయకుడు రోడ్డెక్కి పాదయాత్ర నిర్వహించ తలపెడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం 30 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆ తరువాత కృష్ణా పుష్కరాలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. తుని రైల్వే సంఘటన కాపులకు సంబంధం లేదని 2016 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పత్రికా ముఖంగా తెలిపారని, అప్పటి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కిర్లంపూడి వచ్చి ఆరు నెలల్లో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారన్నారు. ఇచ్చిన గడువు పూర్తయ్యింది, మరో ఏడాది కావస్తుంది ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం పాదయాత్ర చేస్తుంటే తమ జాతిని అణగ దొక్కేందుకు బైండోవర్ కేసులు బలవంతపు సంతకాలు తీసుకుని భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్టు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని మాట్లాడుతున్నారు. కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందా, ప్రభుత్వాన్ని కమిషన్ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో కమీషన్లు ఏర్పాటు చేశారు ఐదారు నెలల కాలంలో రిపోర్టులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కాపుల కోసం వేసిన కమీషన్ 18 నెలలు దాటినా అతీగతీ లేదన్నారు. సహనం పాటించాల్సిన ప్రభుత్వం 26న పాదయాత్రకు పిలిపిస్తే వారం రోజుల ముందుగానే బైండోవర్ కేసులు, అరెస్టులకు పాల్పడుతుందన్నారు. కాపు జాతి ఏం పాపం చేసుకుంది, మేమేమన్నా దొంగలమా, ఉగ్రవాదులమా అన్నారు. జీఓ నంబర్ 30ని అమలు చేయమని అడుగుతుంటే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సెక్షన్ 30, 144లు అమలు చేసి వేలాది మంది కాపుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 1994లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో తమపై పెట్టిన కేసులు అన్యాయమని ఖండించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు కొట్టివేశారన్నారు. పదేళ్ల అధికారంలో కాపులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అడుగుతుంటే కేసులు పెట్టి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తుని ఐక్యగర్జనకు హాజరై ఆ నాడు మద్దతు తెలిపిన నాయకులు పార్టీ మారిన తరువాత వారి తీరు మారిందని విమర్శించారు. ప్రభుత్వం, పోలీసులు ఏకమై అత్యుత్యాహం ప్రదర్శించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. దమ్ముంటే ముద్రగడను విమర్శించే మంత్రులు, ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని చంద్రబాబును డిమాండ్ చేయాలని హితవు పలికారు. జేఏసీ నాయకులు తోట రాజీవ్, నడిశెట్టి సోమేశ్వరరావు, గౌతు స్వామి, చల్లా సత్యన్నారాయణ, తోట బాబు, మండపాక చలపతి, రాపేటి పెద్ద, ఇంటి రాజా, కురుమళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
మేమేమైనా ఉగ్రవాదులమా ?
పోలీసుల తీరుపై కాపు జేఏసీ నేతల ఆగ్రహం ఉక్కుపాదంతో అణచివేతకు పోలీసుల కుట్ర కిర్లంపూడి(జగ్గంపేట) : రాష్ట్రంలో కాపుజాతిని అణచి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి, పసుపులేటి ఉషాకిరణ్, నల్లకట్ల పవన్‌కుమార్‌లు అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు కాపులను బీసీల్లో కలుపుతానని, ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి కాపుల అభివృద్ధికి కట్టుబడతానని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి అధికారం చేపట్టి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హామీల అమలుకు ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమం చేపట్టి రెండేళ్లు దాటినా కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తు చేయడం కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర నిర్వహించ తలపెట్టారన్నారు. 26 కు ముందే వేలాది మంది పోలీసులను మోహరింపజేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ముద్రగడ పాదయాత్రపై విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరు చూస్తుంటే మేమేమన్నా నక్సలైట్లమా, తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు రిజర్వేషన్లు, స్పష్టమైన వైఖరిని ప్రకటించండాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో విషయాలపై కమిషన్లు వేశారు, మూడు, నాలుగు నెలల్లో కమిషన్ రిపోర్టులు ఆయా ప్రభుత్వాలు తెప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రెండేళ్లు దాటినా కమిషన్ రిపోర్టు తెప్పించుకోకుండా కాలయాపన చేయడం కాపులను మోసం చేయడమేనన్నారు. ఇచ్చిన హామీలను అడుగుతుంటే నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందన్నారు. ఇదే ధోరణి అవలంబిస్తే భవిష్యత్తులో జాతి తిరగబడటానికి సిద్ధంగా ఉందన్నారు. 1994లో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపుల మీద జరిగిన దౌర్జన్యానికి నిసనగా సొంత పార్టీ మీదే తిరుగుబాటు చేసి జాతి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జీఓ నంబర్ 30ని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముద్రగడను విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే ముద్రగడ సారథ్యంలో కిర్లంపూడి నుండి అమరావతి వరకు పాదయాత్ర చేసి తీరుతామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు బిఎన్ మూర్తి, పసుపులేటి మురళి, దోమాల బాబు, ఏసురెడ్డి పాపారావు, ఎస్సీ నాయకులు పల్లె హరిశ్చంద్రప్రసాద్, ఎస్కే ఇబ్రహీం, చల్లా సత్యనారాయణ, అన్నెం సత్తిబాబు, అడబాల శ్రీను, మండపాక చలపతి తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పాదయాత్రకు వెళితే కేసులా తునిలో 100 మందికి నోటీసులు తుని : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కేసులను తెరపైకి తీసుకువచ్చి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 26న ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనవద్దని పోలీసులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తుని నియోజకవర్గం పరిధిలో ఆదివారం నాటికి 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, 70 మందికి నోటీసులు ఇచ్చారు. కాపు జేఏసీ మాత్రం నోటీసులకు భయపడేది లేదని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుందని కాపులు విమర్శిస్తున్నారు. ఎంతమందిని జైలులో పెట్టినా పాదయాత్రకు కాపులు తరలి వెళతారని జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంత అతి ? పోలీసుల ఓవరాక్షన్‌పై వైఎస్సార్ సీపీ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ మండిపాటు జగ్గంపేట : చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీని అమలు చేయమని ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టదలచడంతో ఆయనను నిలువరించేందుకు ప్రభుత్వం పోలీసులతో అవసరానికి మించి ఓవరాక్షన్ చేయిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. ముద్రగడను కలిసి మద్దతు తెలిపేందుకు ఆదివారం ఆమె కిర్లంపూడి వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడకు కలవడానికి వస్తే నక్సలైట్, మావోయిస్టు, సంఘ విద్రోహ శక్తులను చూసేందుకు వస్తున్నట్టు దారిలో నాలుగు చోట్ల వాహనం ఆపి కిందకు దించి ఫొటోలు తీసుకున్నారని ఇది ఎంతవరకు సమంజసం మన్నారు. ఇన్ని అడ్డంకులు దేనికని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా గట్టి బందోబస్తుతో ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెతో పాటు పసుపులేటి మురళీకృష్ణ, మనోజ్ తదితరులు ఉన్నారు. -
పాలన గాడి తప్పింది: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన గాడి తప్పిందని, ప్రభుత్వమే ప్రజల మధ్య కొట్లాటలను పెట్టి హింసను ప్రోత్సహిస్తున్నదని టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి, మాజీమంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ రెండు వర్గాలకు ఒకేసారి ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ధర్నాచౌక్ తరలింపుపై ప్రజాందోళనలకు భయపడిన ప్రభుత్వం, టీఆర్ఎస్ కొత్త కుట్రలకు తెరలేపాయన్నారు. ఇందిరాపార్కు ప్రాంతంతో సంబంధంలేని ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల టీఆర్ఎస్ నాయకులు ధర్నా పేరిట ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు తెగబడ్డారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ధర్నాచౌక్ వద్ద ప్రతిపక్షాలు, జేఏసీ ఆందోళన చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు దాడులు చేశారని మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ విమర్శించారు. -
టీఆర్ఎస్పై కోపం.. కుర్చీలపై ప్రతాపం!
- ధర్నాచౌక్‌లో ‘విధ్వంసం’పై హోంమంత్రి ఫైర్ - జేఏసీ, విపక్షాలపై నాయిని మండిపాటు హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్‌ను తరలించే విషయమై స్థానికులు, జేఏసీ నేతృత్వంలోని విపక్షాలకు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే జేఏసీ, విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని, ధర్నా చౌక్ పేరుతో రాజకీయాలకు దిగాయని మండిపడ్డారు. ధర్నా చౌక్ తరలించాలని స్థానికులు, ‘ఆక్యుపై ధర్నా చౌక్’ పేరుతో జేఏసీ సోమవారం ఒకేసారి ఆందోళనకు దిగడం, స్థానికులపై వామపక్ష కార్యకర్తల దాడి, అనంతరం విపక్షాలపై పోలీసుల లాఠిచార్జ్ తదితర పరిణామాలతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపై హోం మంత్రి నాయిని సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘ఇవ్వాళ ఎవరినీ అరెస్ట్ చేయబోమని పోలీస్ కమిషనర్ ముందే ప్రకటించారు. ధర్నా కోసం జేఏసీ అడిగినట్లే స్ధానికులు కూడా పర్మిషన్ అడిగారు. ఇద్దరికీ అనుమతి లభించింది. అయితే శాంతియుతంగా ధర్నా చేస్తోన్న స్థానికులపై కమ్యూనిస్టు కార్యకర్తలు దాడి చేయడం దారుణం. ధర్నా చేసేవాళ్లు ప్రజలను కొట్టడం ఏమిటి? ధర్నా చౌక్ కావాలని అడిగే హక్కు మీకున్నట్లే.. వద్దని నినదించే హక్కు వాళ్లకూ ఉంది’ అని మంత్రి నాయిని అన్నారు. టీఆర్ఎస్ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాల్లో దడ పుట్టించాయని, అభివృద్ధి జరిగితే ఇక మమ్మల్ని పట్టించుకోరనే దుగ్ధతోనే కుటిల రాజకీయాలకు కాల్పడుతున్నాయని విమర్శించారు. ఇందిరా పార్క్ ప్రాంతంలో ధర్నా చౌక్ ఏర్పాటుచేసేనాటికి అక్కడ నివాస సముదాయాలు తక్కువగా ఉండేవన్న నాయిని.. ప్రస్తుతం అక్కడ ఇళ్లు, కాలనీలు పెరిగాయని, ధర్నాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారని చెప్పుకొచ్చారు. నేడు ధర్నా చౌక్‌లో కుర్చీలు విరగొట్టడం ద్వారా కోదండరాం, కమ్యూనిస్ట్, టీడీపీ, కాంగ్రెస్‌లు టీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని తీర్చుకున్నారని నాయిని వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్పై కోపం.. కుర్చీలపై ప్రతాపం!
-
సీపీఎస్ రద్దే లక్ష్యంగా ఉద్యమం
విజయనగరంఅర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (జెఏసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కమిటీ స్థానిక ఎన్జీవో భవనం సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి 2004లో కాంగ్రెస్ పాలకులు ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని, దాన్ని రద్దు చేయకుండా బీజేపీ కొనసాగించడం అన్యాయమన్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత బతుకు భరోసా లేకుండా సీపీఎస్ విధానం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యంలో వచ్చినది కాబట్టి అదే రాజకీయ విధానంతోనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు ఎస్.మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర సహాధ్యక్షురాలు కె.విజయగౌరి, కార్యదర్శి డి.రాము, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి, జిల్లా నాయకుడు ఎ.సత్యశ్రీనివాస్, జి.నిర్మల, పి.శ్రీనివాసరావు, ఈశ్వరరావు, వెంకటరావు, నాగరాజు, వివిధ మండలాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తాడో పేడో తేల్చుకుంటాం
కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తాం 7న కాకినాడలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ కాకినాడ రూరల్ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంపై ప్రభుత్వంతో తాడో డో తేల్చుకుంటామని జిల్లా కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గురువారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ వీవై దాసు మాటట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు అడుగుతున్న తమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు దాడి చేయిస్తున్నారన్నారు. మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ప్రోద్బలంతో ఉద్యమంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఏడాదికి కాపులకు రూ.1,000 కోట్లు రుణాలు ఇస్తామని చెప్పి, మూడేళ్ల పదవీ కాలంలో కేవలం రూ. 320 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలో 3.30 లక్షల మంది కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. కాపులు సామాజిక, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను 1.10 లక్షల మంది సంతకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్‌తో మంజునాథ కమిటీకి అందజేశామన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు దాటకూడదని ప్రభుత్వం చెబుతోందని, ఇది ఎంతమాత్రం నిజం కాదని జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ తెలిపారు. దేశంలోని కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 65 నుంచి 70 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 80 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. జిల్లాకు చెందిన దేశంలో ఎన్నడు లేని రీతిలో జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అత్యవసర పరిస్థితిని పోలీసులతో విధించారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ నుంచి నేటి దాకా సెక్షన్ 30 అమలు చేసిన ఘనత హోం మంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలు పరిష్కారం ముఖ్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎంకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. గ్రామాల్లోకి ఏముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారో అప్పుడే కాపుజాతి ప్రజా ప్రతినిధులను నిలదీస్తారన్నారు. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ నెల 7న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి జేఏసీ సర్వసభ్యుల సమావేశాన్ని కాకినాడ పద్మనాభ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశానికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కె.తాతాజీ, బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ అధ్యాపకుల చర్చలు సఫలం
– నేటీ నుంచి స్పాట్‌కు హాజరుకానున్న అధ్యాపకులు కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షల స్పాట్‌కు రెమ్యూనరేషన్ పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా స్పాట్ అధ్యాపకులు బహిష్కరించారు. శుక్రవారం ఆర్యూ అ«ధికారులు డిగ్రీ కాలేజీ అధ్యాపకుల అసోసియేషన్ జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు సఫలమైనట్లు జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. రెమ్యూనరేషన్ నాన్ లోకల్ అధ్యాపకులకు రూ. 640 నుంచి 710 రూపాయలకు, లోకల్ వారికి రూ. 550 నుంచి 640కు పెంచేందుకు ఆర్యూ అధికారులు అంగీకరించారు. ఇతర డిమాండ్‌పై కూడా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి స్పాట్‌కు హాజరుకానున్నట్లు వారు పేర్కొన్నారు. -
‘గొంతెత్తే హక్కు కోల్పోయేలా కనిపిస్తోంది’
హైదరాబాద్: ‘సమస్యలను చెప్పుకోవడం, సర్కారుపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రజల హక్కులను నిర్భందించే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎన్నో పోరాటల ఫలితంగా ఇందిరాపార్క్ వద్ద నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం దక్కింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తేస్తాం.. అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు. ఈనెల 23న ఇందిరాపార్క్ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరు కావాలి. సగటుపౌరుడి బలమేంటో ప్రభుత్వానికి తెలియజేయాలి.’ అని తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నాచౌక్ పరిరక్షణపై బుధవారం మక్ధూంభవన్లో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ‘జేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కోసం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. నిర్వాసితుల దీక్ష అంటే అందుకూ అనుమతి ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. అనుమతి కోసం పోలీసులను సంప్రదిస్తే పొద్దంతా వేచి చూడాల్సిన పరిస్థితి. తీరా అంతసేపు ఎదురుచూస్తే రాత్రికి వచ్చి అనుమతి ఇవ్వడం లేదు అని తాపీగా చెప్తారు. తెల్లారి కార్యక్రమం చేసుకోనీయకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన అణిచివేతలా కనిపిస్తోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుడు గొంతెత్తే హక్కును సైతం కోల్పోయేలా కనిపిస్తోందని, ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసుకోవద్దనడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈనెల 23న చేపట్టే కార్యక్రమానికి అన్ని వర్గాలు హాజరు కావాలన్నారు. అక్కడే వంటా-వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా-పాటా, ధూంధాం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వాళ్లంతా జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రతీకలైన చిహ్నాలను వెంట తెచ్చుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
సామాజిక న్యాయం కోసం జేఏసీ
- జస్టిస్ చంద్రకుమార్ - కొత్త పార్టీ కూడా పెడతామని వెల్లడి హైదరాబాద్: కుల వివక్ష లేని సమాజం, ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందేలా చూసేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ ప్రకటించారు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కొత్త పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉమ్మడి నాయకత్వంతో పార్టీ కొనసాగు తుం దని వెల్లడించా రు. తెలంగాణ లో రాజకీయ పత్యామ్నాయంగా జేఏసీ ఉండ బోతోందని చెప్పారు. జేఏసీ మొదటి సమావేశాన్ని 16న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమాజంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోందని, దళితులు, ఆదివాసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జేఏసీలో భాగస్వామ్యం అయ్యేం దుకు కుల, వృత్తి సంఘాల వారు, అగ్రకులాలలోని పేదవారు, నిజాయితీగా పనిచేసేవారు 9394345252, 9505932030 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రొఫెసర్ ఐ.తిరుమలి మాట్లాడుతూ.. ‘ఆంధ్రాపాలన పోతే మనకు రాజకీయం దగ్గరవుతుంది, మన సమస్యలు వినేవారు వస్తారు అనుకున్నాం, రాష్ట్రం మారింది కాని పాలకుల తీరు మారలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రం
రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ కొత్తపేట : కాపుల సహనాన్ని పరీక్షిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గురువారం సాయంత్రం రామకృష్ణ కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాపులను బీసీలలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే కాపులను ఉగ్రదవాదుల్లా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా అది శాంతియుత కార్యక్రమమేనని స్పష్టం చేశారు. సత్యాగ్రహ దీక్షకు పిలుపు ఇస్తే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరగనీయమంటున్నారు. ఎలా జరగనీయరో చూస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలు కోసం రాజప్ప లాంటి కాపు మంత్రులు, కొందరు కాపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాపు ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. -
ఇంత అరాచకమా: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీని భగ్నం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని, ఇది సిగ్గుచేటని కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో నియంతృత్వ, అరాచక పాలన సాగుతోం దని బుధవారం విమర్శించింది. తెలంగాణ ఉద్యమానికి మూలమైన ఉద్యోగాల భర్తీ కోసం డిమాండ్ చేస్తున్నవారిని అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేయడానికి అర్ధరాత్రి పూట జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి తలుపులను బద్దలుకొట్టి, అరెస్టు చేయడం హేయమని విమర్శించారు. కోదండరాంను అరెస్టు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. ర్యాలీపై సర్కారు వైఖరి నిరంకుశంగా, బ్రిటిష్ పాలనను తలపించేలా ఉందని మండిపడ్డారు. కోదండరాంను అరెస్టు చేయడం కేసీఆర్ ఫ్యూడల్ భావాలకు నిదర్శనమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే రజాకార్లు గుర్తుకొస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. -
రేపు గుంటూరులో జేఏసీ సమావేశం
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 19న రాష్ట్ర ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) సమావేశం గుంటూరలో జరుగుతుందని జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగల్రెడ్డి, జవహార్‌లాల్ తెలిపారు. సభ్యత్వం ఉన్న 105 సంఘాలకు సమావేశానికి హాజరు కావాలని సమాచారం పంపామన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యెలర్ చేయడం, వారి జీతాలను పెంచడం, పీఆర్సీ అరియర్స్ ఇవ్వడంపై సమావేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. -
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతాం...
సుల్తాన్‌బజార్: నిరుద్యోగులకు జరిగే అన్యాయాలపై శాసనమండలిలో తమ గళం విప్పేందుకు ఎపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతామని ఏపీ నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి తాను, పశ్చిమ రాయలసీమ నుంచి జేఏసీ ప్రధాన కార్యదర్శి తగ్గుపర్తి రామన్న పోటీకి దిగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చనందునే పోటీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో తగ్గుపర్తి రమణ, రెడ్డి వరప్రసాద్, అరిగాల రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ నిరసన.. జేఏసీది కాదు
పంజగుట్ట: నిరుద్యోగ నిరసన ర్యాలీ కేవలం జేఏసీ కార్యక్రమం కాదని, అన్ని సంఘాల వారు తమ జెండాలతో పాల్గొని విజయవంతం చేయాలని టీ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘నిరుద్యోగుల నిరసన ర్యాలీ’ పోస్టర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఉపాధికల్పన, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన ఉండాలని సూచించారు. నోటీఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వమే సభా వేదికగా చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్లు లేవనడం సబబు కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్దగా అవకాశంలేని ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుకున్న వారి కోసం ప్రైవేట్ సంస్థల్లో, ప్యాక్టరీల్లో సూపర్వేజర్ క్యాడర్ పోస్టుల్లో 80 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. -
రాష్ట్ర జేఏసీ చైర్మన్‌గా బొప్పరాజు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర జేఏసీ చైర్మన్‌గా బొప్పరాజు వెంకటేశ్వర్లును అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లుగా వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మినిస్టీరియల్ అధ్యక్షుడు ఎం.రమేష్, కర్నూలు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంబన్న తదితరులు ఈ విషయాన్ని శనివారం విలేకరులకు వెల్లడించారు. ఫిబ్రవరి 5వ తేదీన తిరుపతిలోని రెవెన్యూ భవన్లో బొప్పరాజు వెంకటేశ్వర్లును నూతన జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు వారు వివరించారు. -
అది తప్పుకాదు: కోదండరామ్
హైదరాబాద్: విపక్ష పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కుమ్మక్కైందన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు ప్రొఫెసర్ కోదండరామ్ గట్టిగా బదులిచ్చారు. ప్రజా కూటమిగా జేఏసీ.. పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడంలో ఏమాత్రం తప్పులేదని, నిత్యం ఏదో ఒక అంశంపై పార్టీలను కలవక తప్పదని ఆయన అన్నారు. బాధితుల పక్షాన, వారి గొంతుక వినిపించేందుకు జేఏసీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలకు నష్టం జరుగుతుందనన్న కోదండరామ్.. అలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకించడంతోపాటు విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జనవరి 7 నుంచి 'విద్యా పరిరక్షణ యాత్ర'ను నిర్వహించనున్నట్లు తెలిపారు. (భూ దోపిడీకి చట్టబద్ధతా? ఒప్పుకోం: కోదండరామ్) -
తెలంగాణ జేఏసీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆదివారం సమావేశమైంది. రాష్ట్రంలో రైతు సమస్యలు, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, భూ నిర్వాసితుల సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన జేఏసీ సభ్యులు.. అసెంబ్లీ జరగుతున్న సమయంలోనే సమస్యలపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
బీసీ రిజర్వేషన్లకు భంగం లేకుండా కాపుల పోరాటం
-
బీసీ రిజర్వేషన్లకు భంగం లేకుండా కాపుల పోరాటం
అమలాపురంలో బీసీ నేత చిట్టబ్బాయిని కలిసిన కాపు జేఏసీ బృందం అమలాపురం రూరల్ : ప్రస్తుతం బీసీలకు ఉన్న రిజర్వేషన్ల వాటాకు ఏ మాత్రం భంగం కలగకుండా కాపులు తమకు గతంలో అమలైన రిజర్వేషన్లు పునరుద్ధరించమని మాత్రమే పోరాటం చేస్తున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ విషయంలో బీసీలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ముద్రగడతో కూడిన కాపు జేఏసీ బృందం అమలాపురంలోని బీసీ నేత, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఇంటికి శుక్రవారం వెళ్లి చర్చించింది. ఈ సందర్భంగా చిట్టబ్బాయితో ముద్రగడతో పాటు కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, ఆర్వీ నాయుడు మాట్లాడుతూ బ్రిటిషు కాలం, నిజాం కాలం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అమలైన కాపుల రిజర్వేషన్లను పునరుద్ధరించాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు. బీసీలకు ప్రస్తుతం అమలవుతున్న వాటాలో మేము రిజర్వేషన్లు ఆశించటం లేదని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బీసీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాజులపూడి భీముడు, మట్టపర్తి నాగేంద్ర, కొరశిఖ సుబ్రహ్మణ్యం, ముప్పిడి శ్రీనివాస్, సంసాని నాని, వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి తాతాజీ, కుడుపూడి జిజ్జి ముద్రగడతో చర్చించారు. రాజకీయ రిజర్వేషన్లలో తమకు నష్టం జరుగుతోందన్నారు. ఏబీసీడీ నిష్పత్తితో తమ వాటా అడుగుతున్నామని కాపు నేతలు వివరణ ఇచ్చారు. తమ సామాజిక వర్గాల్లో నిరుపేదలు ఉన్నారని వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఉద్యమిస్తామని కాపు నేతలు వివరించారు. అనంతరం రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి స్వగృహానికి వెళ్లిన ముద్రగడకు రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా పవన్, కాపునాయకులు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు సుంకర సుధ, జక్కంపూడి వాసు, పట్టణ పార్టీ యువజన అధ్యక్షుడు నల్లా శివాజీ, రూరల్ మండల పార్టీ కార్యదర్శి సూదా గణపతి, జిల్లా పార్టీ నాయకుడు బండారు కాశి, జిల్లా బీజేపీ కార్యదర్శి పాలూరి సత్యానందం, కోనసీమ కాపు సంఘం నాయకులు కురస ఆంజనేయులు, పత్తి దత్తుడు, శిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. -
జేఏసీని ముక్కలు చేసింది కోదండరామే
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ప్రొఫెసర్ కోదండరాం చేసిందేమీ లేదని, జేఏసీని ముక్కలు చేసి 99 జేఏసీలు చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. విద్యార్థుల వల్లే తెలం గాణ రాష్ట్రం సిద్ధించిందని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తన పక్కన ఉన్నవారికి, అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న కోదండరాం, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్లు ఇప్పిస్తానని విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోదండరాంతో ఉన్న వాళ్లంతా టీడీపీ, బీజేపీకి చెందిన విద్యార్థులేనన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి కూడా ఆంధ్రా నేతల పక్షాన చేరలేదా అని రవి ప్రశ్నించారు. ఏపీ నాయకుల మోచేతి నీళ్లు తాగి కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నారన్నారు. -
ఆందోళన బాటన ‘ఆదర్శ’ టీచర్లు
– ఈ నెల 28, 29న పెన్ డౌన్ – 30 న కలెక్టరేట్ ముట్టడి కర్నూలు సిటీ: సమస్యల పరిష్కారం కోసం.. ఈ నెల28 నుంచి ఆందోళన బాట పట్టనున్నట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ పీఎన్ జాస్మిన్ మాట్లాడుతూ.. పీఆర్సీ సాధన, సర్వీస్ రూల్స్, హాస్టళ్ల అదనపు బాధ్యతలకు నిరసనగా ఆందోళనలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28, 29తేదీలలో పెన్‌డౌన్, 30వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, వచ్చే నెల7వ తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. డీఈఓకు వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు ఆశాజ్యోతి, నాగయల్లప్ప, టీవీ మార్కండేయులు, వెంకటేశ్వర్లుల తదితరులు ఉన్నారు. -
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గం
జేఏసీ ,తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ,నల్లగొండ నిబద్ధతతో నిలబడతాం.. నిజాయితీతో పనిచేస్తాం: కోదండరాం సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశలో జేఏసీగా భవిష్యత్‌లో మరింత క్రియాశీలకం అవుతామని, ఈ క్రమంలో ఎన్ని ఒత్తిడులు, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలను నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళతామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా జేఏసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం నల్లగొండకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జేఏసీగా ఇప్పటికే పలు కొత్త జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని, త్వరలోనే అన్ని జిల్లాల కమిటీలను పూర్తి చేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళతామని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రైతు జేఏసీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరెన్ని మాటలు అన్నా వెనక్కు తగ్గేది లేదని.. సద్విమర్శలను స్వీకరిస్తామని, నిబద్ధతతో నిలబడి నిజాయితీగా పనిచేస్తామని కోదండరాం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలతోనే అంతా అరుుపోదని, అది కేవలం ఒక అంశం మాత్రమేనని, పౌరపాత్రను ఎన్నికల వరకే కుదించడానికి వీల్లేదని అంబేడ్కర్ పదే పదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా, క్రియాశీలకంగా పనిచేస్తామన్నారు. -
ఆమనగల్లు బంద్ విజయవంతం
ఆమనగల్లు: ఆర్డీఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వర్తక, వ్యాపార, వృత్తిదారుల సంఘాల జేఏసీ ఆధ్యర్యంలో సోమవారం చేపట్టిన ఆమనగల్లు పట్టణ బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, పెట్రోలు బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేశారు. తహసీల్దార్ అనితకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పత్యానాయక్, సింగంపల్లి శ్రీను, వర్తక సంఘ అధ్యక్షుడు కండె పాండురంగయ్య, సభ్యులు కోట తిరుపతయ్య, వీరబొమ్మ రామ్మోహన్, రాజు, వస్త్ర వ్యాపారుల సంఘ సభ్యులు వెంకటేశ్, ఎల్వీఆర్ రాము, శివప్ప, జగదీశ్వర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కేంద్రం జోక్యం తగదు
తాడితోట (రాజమహేంద్రవరం) : ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదని ముస్లిం జేఏసీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్‌లో ముస్లిం జేఏసీ నాయకుడు ఎండీ హబీబుల్లాఖా¯ŒS ఆధ్వర్యంలో నగరంలోని ముస్లిం మహిళలు, పెద్దలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల నియమాలుప్రవక్త మహ్మద్ కాలం నుంచి అమల్లో ఉన్నాయన్నారు. మూడుసార్లు తలాక్ అన్నంత మాత్రాన విడాకులు అయిపోయినట్టు కాదన్నారు. అయితే ఇస్లాంలో భార్యాభర్తలు విడిపోవడానికి సమాన హక్కు ఇచ్చిందని, పురుషుడు విడిపోతే తలాక్ అంటారని, అదే స్తీ్ర వివాహబంధాల నుంచి తప్పుకుంటే ఖులా అంటారన్నారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్రం జోక్యం చేసుకోరాదన్నారు. హబీబుల్లా ఖాన్, ముస్తాఫా షరీఫ్ పాల్గొన్నారు. -
తుంగతుర్తి అభివృద్ధికి కృషి
తుంగతుర్తి తుంగతుర్తి పేరుకే నియోజకవర్గం కాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తుంగతుర్తిలో శుక్రవారం నిర్వహించిన మాదిగ చైతన్య మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుంగతుర్తి నేషనల్ హైవేకి, వరంగల్ మహా పట్టణాలకు దగ్గర ఉన్నప్పటికి అభివృద్ది చెందకపోవడం విచారకరమన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తుంగతుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీబావం మూడు రోజులుగా పసునూర్ మాజీ ఎంపీటీసీ తొడ్సు లింగయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు నరాల వీరయ్యలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూర్ గ్రామాన్ని తుంగతుర్తిలో ఉంచే విధంగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేస్తానని హామీ ఇచ్చారు. పాలన సౌలభ్యం కోసం మండలాలను ఏర్పాటు చేయడం మంచిదే కాని ప్రజల అభీష్టం మేరకే చేయాలన్నారు. మాదిగ చైతన్య మహోత్సవ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తయారు చేసుకొని భారీ ర్యాలీగా వీధుల గుండా ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి ఆటపాటలతో అందరిని ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రభాకర్ రెడ్డి, ఏపూరి సోమన్న, ఎంపీడీఓ వెంకటాచారి, సాయిబాబా, పాల్వాయి నగేష్, హరిక్రిష్ణ, లక్ష్మణ్, యాదగిరి, శ్యాంసుందర్, సుందర్ రావు, పురుషోత్తం, మల్లెపాక సుధాకర్, అంజయ్య, నాగయ్య, ఎడవెళ్లి ఈశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ పేరునే కొనసాగించాలి
కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాకు అదే పేరును కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు రిలే దీక్షలు చేపడుతున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం శంషాబాద్ జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. -
ప్రభుత్వం మెడలు వంచుదాం
– ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందాం – 27న మహా ధర్నా – జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు ఆదోని టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి న్యాయమైన డిమాండ్లను సాధించుకుందామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ద్వారాక ఫంక్షన్ హాల్లో ఎన్జీవోస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్ రెడ్డి, యాసిన్‌బాషా ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ నెల 27న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మహా ధర్నాలో ఉద్యోగులు, కార్మికుల సత్తా ప్రభుత్వానికి చాటాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం మొదటి పోరాటంతోనే పీఆర్సీ 43 శాతం సాధించుకున్నామన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ పాత విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని విమర్శించారు. 10 డిమాండ్లతో ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో జేఏసీ జిల్లా చైర్మన్ వెంగళరెడ్డి, ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామశేషయ్య, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి జవహర్లాల్, ఎన్జీఓలు నాగరాజు, కిరణ్‌కుమార్, ఉషారాణి, గోపాల్, నాగరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా పోరాటం
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు మరింతగా ఉధృతంగా పోరాటం చేస్తామని పలువురు అఖిలపక్ష నాయకులు తెలిపారు. శనివారం స్థానిక ఇందిరా సెంటర్లో నియోజకవర్గ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ విద్యార్థి జేఏసీ కన్వీనర్ కుక్కడపు మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్నగౌడ్, పాలకూరి బాబు, జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథరెడ్డి, మేకల నాగేశ్వరరావు, పీవీ.దుర్గాప్రసాద్, అట్లూరి హరిబాబు, వట్టికూటి జంగమయ్య, ములకలపల్లి సీతయ్య, జక్కుల మల్లయ్య, శివరాం యాదవ్, ఎస్కే.సైదా, విజయ్, యరగాని గురవయ్య, కోల మట్టయ్య, చిలకరాజు లింగయ్య, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, సుతారి వేణు, బాచిమంచి గిరిబాబు, పండ్ల హుస్సేన్‌గౌడ్ పాల్గొన్నారు. -
వర్ధన్నపేటను జిల్లా కేంద్రం చేయాలి
వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల యాకయ్య, వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి అన్నారు. వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఆరోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలను పునర్విభజనలో ఎవరూ కోరని హన్మకొండ జిల్లా ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకొని, వరంగల్ అర్బన్, రూరల్ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాగా చేయాలనుకుంటే , దాని స్థానంలో వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో 42 ఎకరాల ప్రభుత్వ భూమి, తాత్కాలిక కార్యాలయాలకు ఆర్అండ్బీ అతిథిగృహం, 16 ఎకరాల విస్తీర్ణంలో ఎంపీడీఓ కార్యాలయం, సువిశాలమైన పోలీస్‌స్టేన్ ఉన్నాయని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మామునూరు ఎయిర్‌పోర్టు, వెటర్నరీ యూనివర్సిటీ, ఏనుమాముల మార్కెట్ ఉన్నాయని, 20 కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ఉందని, తాజాగా టెక్స్టైల్ పార్క్ మంజూరైందన్నారు. వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారి జాతీయ రహదారిగా మారి త్వరలో ఫోర్‌లైన్‌గా అభివృద్ధి చెందనుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీక్షలో అఖిలపక్ష నాయకులు మార్త సారంగపాణి, తూళ్ల కుమారస్వామి, రామగిరి అనిల్, కొండేటి సత్యం, నాంపెల్లి యాకయ్య, నరుకుడు వెంకటయ్య, సిలువేరు కుమారస్వామి, నాగెల్లి సురేష్, కొండేటి శ్రీనివాస్, ఐత యాకాంతం కొండేటి మహేందర్, కంజర్ల మహేష్, ఎలికట్టె ముత్తయ్య పాల్గొన్నారు. -
జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో?:కోదండరాం
ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్దం కాని పరిస్థితి అని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతిపదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక జిల్లాల ఏర్పాటుతో వారికి సంబంధించిన అటవీ హక్కుల చట్టం, పంచారుుతీరాజ్ చట్టాలు సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపుతుందని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆదివాసీలు బలహీనంగా ఉన్నారనే వారిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. ప్రత్యేక నాగరికత, అలవాట్లు ఉన్న గిరిజనులు వారి పంచారుుతీల్లో కోర్ట్‌ల కంటే భిన్నంగా చైతన్యవంతమైన తీర్పులిస్తారని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాల్లో ఆదివాసీ జిల్లాల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ర్టంలో 12శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని దీన్ని విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌కు యాదాద్రి సెంటిమెంట్ తప్ప మరోకటి లేదని ఎందుకంటే అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టిడిపి రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకులు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకులు పోటు రంగారావు, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీవోడబ్ల్యూ అధ్యక్షులు ఝాన్సీ, కె. సూర్యం, ఎం.హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మెయినాబాద్‌ను 'శంషాబాద్' లో కలిపితే ఊరుకోం
- రాస్తారోకో, మంత్రి దిష్టిబొమ్మ దహనం వికారాబాద్ రూరల్ : వెనుకబడిన ప్రాంతాలతో కూడిన వికారాబాద్ జిల్లాలో అంతా ఇంతో మెయినాబాద్ ఉందని సంతృప్తి చెందుతుంటే ఆ మెయినాబాద్‌ను కూడా శంషాబాద్ జిల్లాలో కలిపితే మరోసారి వికారాబాద్ ఉద్యమ సెగ చూపిస్తామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. శనివారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున వికారాబాద్ హైదరాబాద్ ప్రధాన బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.అడిగినోళ్లకు అడిగినట్లు ఇచ్చుకుంటూ పోతుంటే అసలు జిల్లాల ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటుందని నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ జొన్నల రవిశంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పేరుతో నాలుగు నియోజకవర్గాలను వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేసి ఇప్పుడు జిల్లాలో నుంచి మొయినాబాద్‌ను శంషాబాద్‌లో కలపడం ఏమిటని ప్రశ్నించారు. నేడు మొయినాబాద్ వాళ్లు అడిగారని శంషాబాద్‌లో కలిపారూ రేపు శంకర్పల్లి, షాబాద్ వాళ్లు కూడా అడుగుతున్నారూ వాళ్లను తీసుకెళ్తారా అని ధ్వజమెత్తారు. వికారాబాద్‌కు జిల్లాకు వికారాబాద్ పేరు లేదా అనంతగిరి పేరును పెట్టాలని లేని పక్షంలో మంత్రి మహేందర్‌రెడ్డి మరోసారి వికారాబాద్ ఉద్యమ సెగ చూపిస్తామని హెచ్చరించారు. వెనుక బడిన ఈ జిల్లాకు అంతో ఇంతో మొయినాబాద్ ఉంది అనుకుంటే దాన్ని కూడా ఇందులో నుంచి తీసి జిల్లాను రెవెన్యూ పరంగా మరింత వెనక్కి పంపిస్తున్నారన్నారు. -
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రామగిరి : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినందున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ప్రీపేర్ కావాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో గ్రూప్ స్థాయి ఉద్యోగాల ప్రకటన ఎన్నడూ వెలుబడలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు తాగు, సాగునీటిలపై, ఉద్యోగాలపై చేస్తున్న విమర్శలు అసత్యాలను పేర్కొన్నారు. త్వరలో 5వేల గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వెలుబడనుందని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, మేడబోయిన వెంకన్న, బాషబోయిన లింగస్వామి, పెరిక దివాకర్, కొంపెల్లి సత్యనారాయణ, వెంకన్న, కుమార్‌నాయక్ తదితరులున్నారు. -
72 గంటల బంద్ పరిపూర్ణం
– స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ప్రజలు – మూడో రోజు తెరచుకోని దుకాణాలు – గద్వాలలో స్తంభించిన జనజీవనం గద్వాల : గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేపట్టిన 72 గంటల నిరవధిక బంద్ పరిపూర్ణంగా విజయవంతమైంది. బంద్‌లో భాగంగా మూడోరోజు ఆదివారం సైతం తెల్లవారుజాము నుంచే జేఏసీ నాయకులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ బంద్‌ను పాటించారు. దుకాణదారులు, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛంద బంద్ పాటించాయి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నేరుగా బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు మాత్రం యథావిధిగా నడిచాయి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై గద్వాల నినాదాలతో హోరెత్తించారు. మూడు రోజుల నిరవధిక బంద్‌తో.. జేఏసీ బంద్‌తో గద్వాలలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మూడు రోజుల పాటు వరుసగా బంద్ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం గద్వాల జిల్లా కోసం వరుసగా మూడు రోజులు బంద్ చేశారు. దీంతో అన్ని వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంద బంద్ పాటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్న టీకొట్టు నుంచి పెద్ద దుకాణం వరకు మూతబడ్డాయి. మూడు రోజుల పాటు పెట్రోలు బంకులు తెరచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గద్వాల నియోజకవర్గం మొత్తం పెట్రోలు, డీజిల్ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. గద్వాల జిల్లా సాధించే వరకు తమ ఉద్యమాన్ని ఉధతం చేస్తామని జేఏసీ నాయకులు వెంకట్రాములు, మధుసూదన్‌బాబు అన్నారు. బంద్‌లో భాగంగా వారు మాట్లాడుతూ ఆంక్షలు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరభద్రప్ప, వెంకట్రాజారెడ్డి, అంపయ్య, కష్ణారెడ్డి, శంకర్, భీంసేన్రావు, రాజశేఖర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ రాస్తారోకో
మంత్రి కేటీఆర్ కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కోసం రోజురోజుకూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రగుడు బ్రిడ్జి వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ మౌనం వీడాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో కరీంనగర్–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను సముదాయించారు. కార్యక్రమంలో నాయకులు కత్తెర దేవదాస్, సంగీతం శ్రీనివాస్, రాగుల రాములు, బుస్సా వేణు, జక్కుల యాదగిరి, చొక్కాల రాము, శ్రీనివాస్‌రావు, పంతం రవి, ఎండీ సత్తార్, రొడ్డ రామచంద్రం, కంసాల మల్లేశం, మనోజ్, రమేశ్, దశరథం తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌పై బీజేవైఎం ఫిర్యాదు సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు కనిపించడం లేదని బీజేవైఎం ఆధ్వర్యంలో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. నాయకులు అన్నల్దాస్ వేణు, గౌడ వాసు, నరేశ్, శ్రీధర్, పవన్, శ్యామ్, సురేశ్ సిరిసిల్ల టౌన్ ఎస్సై బి.శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు అందించారు. స్కూల్ బోర్డుపై సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివనగర్‌లోని కుసుమ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బోర్డుపై ఆందోళనకారులు సిరిసిల్ల జిల్లా అని రాసిన కాగితాలను అతికించారు. కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల్లో జె.శ్రీనివాసరావు, దాసరి శ్రీధర్, కోడి లక్ష్మణ్, డి.జనార్థన్‌రెడ్డి, కేసరి శ్రీనివాస్, మునిగె యాదగిరి, ఇల్లందుల రమేశ్ పాల్గొన్నారు. ఆవునూరి రమాకాంత్‌రావు, శాంతిప్రకాశ్‌శుక్లా, ప్రకాశం, సంఘీభావం తెలిపారు. -
పేదల భూములు లాక్కోవడం హేయం
మా పొట్టకొట్టకుండ్రి సారూ.. పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ శంకర్పల్లి: నిరుపేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కొవడం హేయమైన చర్య అని పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం మోకిల గ్రామంలోని సర్వే నెంబర్ 96, 197లో పేదలకు కేటాయించిన లావణి పట్టా భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటోందని మోకిల గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌కు ఫిర్యాదు చేశారు. కోదండరామ్ ఆదేశాల మేరకు పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ బృందం గురువారం మోకిల గ్రామాన్ని సందర్శించింది వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని మూడు నెలల క్రితం ఎకరం రూ.2 కోట్ల చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుందని, ఒక్కరూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. తమకు 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 96, సర్వే నెంబర్ 197లో సుమారు 700 ఎకరాలు లావణి భూమి కేటాయించి సర్టిఫికెట్లు కూడా జారీ చేసిందన్నారు. నాటి నుంచి నేటివరకు తామే ఆ భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడు ప్రభుత్వం అందులోని 27 ఎకరాలు వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మిందని రైతులు వాపోయారు. మరికొంత భూమి అమ్మెందుకు ప్రణాళిక తయారు చేస్తోందని విడతల వారిగా కొంతమందికి నోటీసులు జారీచేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని, తమ పొట్టకొట్టవద్దని రైతులు వేడుకుంటున్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పీఓటీ కింద ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఎన్నో సంవత్సరాలుగా కబ్జాలో, ఖారీజు ఖాతలో ఉన్నట్లు కంప్యూటర్ రికార్డులో నమోదు ఉందని, ఉన్నట్లుండి ప్రస్తుతం కంప్యూటర్లో వారి పేర్లు తీసేసి లావణి పట్టా, ఖారీజ్ ఖాత నిల్‌గా చూపిస్తోందని అన్నారు. అక్కడి నుంచి నేరుగా పంటపొలాలను జేఏసీ నాయకులు పరిశీలించి చైర్మన్ కోదండరామ్‌కు ఫోన్లో సమాచారం అందించారు. రైతులకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. త్వరలో తాను గ్రామానికి వస్తానని రైతులకు అన్యాయం జరగకుండా వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ జేఏసీ చైర్మన్ కె.నర్సింలు, కన్వీనర్ రామరావుజోషి, మోకిల సర్పంచ్ అనందం, వైస్‌ఎంపీపీ శశిధర్‌రెడ్డి, నాయకులు మారుతి వై.దాసు, అడివయ్య, ఖాదర్‌పాష, సిహెచ్.యాదయ్య, రాజునాయక్, పాపాయ్య, గోపాల్, నర్సింలు, చోక్లనాయక్, యేషయ్య, ఎండీ.జానీ, పాండు, శ్రీశైలం, సదానందం, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు ఆశీర్వాదం ఉన్నారు. -
చేర్యాల, మద్దూరు ప్రజలు కలిసిరావాలి
∙జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి జనగామ : శతాబ్ద కాలంగా కలిసే ఉంటున్న చేర్యాల, మద్దూ రు ప్రజలు జనగామ జిల్లా అయ్యే తరుణాన ఉద్యమంలో కలిసిరావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ పూలే అధ్యయన కేంద్రం లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా ఏర్పాౖటెతే చేర్యాల మున్సిపాలిటీగా, రెవె న్యూ డివిజన్‌తో పాటు నియోజక వర్గ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నా రు. తద్వారా అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఉద్యమంలో కలిసిరావాలని కో రారు. కాగా, జనగామను జిల్లా ఏర్పాటుచేయాలన్న ఉద్యమంలో కలిసిరావాలని కోరేందుకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుసుకునేం దుకు బుధవారం హైదరాబాద్ వెళ్తున్నట్లు దశమంతరెడ్డి వివరించారు. అలాగే, తమకు సహకరిస్తున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, డాక్టర్ లక్షీ్మనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
‘జనగామ’ బంద్ విజయవంతం
పోలీసుల పహారా.. కొనసాగుతున్న 144 సెక్షన్ స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు జనగామ : జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన 48 గంటల డివిజన్ బం ద్ ఆదివారం విజయవంతం గా ముగిసింది. బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టా రు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో రోడ్లపైకి వచ్చేందుకు కొందరు వెనుకాడారు. అయితే వ్యాపా ర, వాణిజ్య సంస్థలతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలు, చిన్న వ్యాపారులు బంద్‌కు మద్దతుగా ముందుకొచ్చారు. దీంతో నెహ్రూ పార్కు, రైల్వేస్టేçÙన్, హెడ్ పోస్టాఫీసు, కోర్టు ఏరి యా, హన్మకొండ, హైదరాబాద్ జాతీయ రహదారి, సిద్దిపేట రోడ్డు నిర్మానుష్యంగా మారా యి. స్థానిక ఆర్టీసీ చౌరస్తాతో పాటు రైల్వేస్టేçÙన్ ఆవరణలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసి జేఏసీ నాయకుల కదలికలపై నిఘా వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వజ్రా వాహనాన్ని సిద్ధంగా ఉంచడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. నేడు జాతీయ జెండాతో పాటు జనగామ జెండా పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని జిల్లా రిలే దీక్ష శిబిరం వద్ద జాతీయ జెండాతో పాటు జనగామ జెండాను ఎగుర వేస్తామని జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
జనగామ బంద్ సంపూర్ణం
144 సెక్షన్ అమలుతో నిశ్శబ్ద విప్లవం జేఏసీ నాయకులపై పోలీసుల నిఘా జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్ మొదటి రోజు విజయవంతమైంది. జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి నాయకత్వంలో శనివారం మొదటి రోజు బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జిల్లా కావాలనే బలమైన సంకేతాన్ని మరోసారి చూపించారు. పట్టణంతో పాటు డివిజన్లోని పలు మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా సాగుతోంది. పెట్రోలు బంక్‌లు, సినిమాహాళ్లు, జ్వువెల్లర్స్, కిరాణ, వస్త్ర దుకాణాలు మూసివేయడంతో జనగామ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ని మారిపోయాయి. 144 సెక్షన్ అమలులో ఉండడంతో నిశ్శబ్ధ విప్లవం సృషించారు. రహదారులపై గ్రూపులుగా తిరగరాదంటూ పోలీసులు ప్రచారం చేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో ప్రజాప్రతిని ధులు, అధికారులతో చర్చ సాగనున్న నేపథ్యంలో బంద్ ప్రభావం ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి. గతం లో ఎన్నడూ లేని విధంగా బంద్‌కు మంచి స్పదన రావడంతో జేఏసీ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు
– రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు కర్నూలు(అర్బన్): రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు హెచ్చరించారు. సోమవారం ఉదయం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలకు కార్పొరేషన్లు, బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బీసీ కులాలపై చిన్న చూపు చూస్తోందన్నారు. అగ్రకులాలకు చెందిన కార్పొరేషన్లకు వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్న ప్రభుత్వం బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లతో సరిపెడుతోందన్నారు. కాపుల సంక్షేమం పట్ల పూర్తి స్థాయిలో స్పందిస్తున్న ప్రభుత్వానికి రజకుల సంక్షేమం పట్టడం లేదన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ఆలస్యం జరిగితే.. కనీసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కూడా కల్పించాలన్నారు. నవంబర్ 27న రజక ఆత్మ గౌరవ సభ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకుపోయేందుకు నవంబర్ 27న విజయవాడలో ఐదు లక్షల మంది రజకులతో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు అంజిబాబు తెలిపారు. సభకు ముఖ్యమంత్రితో పాటు అందరు ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. హాజరు కాని నాయకులకు భవిష్యత్తులో రజకులు ఓట్లు వేయబోరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రజకులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, తమను గుర్తించిన పార్టీలకే మద్దతు ఇస్తామన్నారు. 10న రజక జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక ఈ నెల 10న స్థానిక బీసీ భవన్లో ఉదయం 10 గంటలకు రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రజకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆదోనిలో ధోబీఘాట్లకు కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షుడు సీపీ వెంకటేష్, వాడాల నాగరాజు, అఖిల భారత ధోబీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా నాయకులు చంద్రశేఖర్, వి.శ్రీనివాసులు, గణేష్, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతతో రిజర్వేషన్లు సాధించుకోవాలి
హాలియా : మాదిగలు ఐక్యంగా ఉండి 12 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలని రాష్ట్ర మాదిగ యూత్ జేఏసీ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ కోరారు. శనివారం హాలియాలో ఢిల్లీపై మాదిగల దండయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల దామాషా ప్రకారం 12శాతం రిజర్వేషన్లు సాధించుకోవడం మాదిగల హక్కు అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 8న మహాధర్నా, 9న మహార్యాలీ, 10న మాదిగల సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఢిల్లీకి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ చైర్మన్ దండెం కాశయ్య, మండల అధ్యక్షుడు తుడుం ముత్తయ్య, టీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు దోరెపల్లి వెంకటేశ్వర్లు, పగిడిమర్రి రవి, యడవల్లి రాములు, గురజాల సైదులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మాకు జనగామ జిల్లా కావాలి
లక్ష సంతకాల సేకరణకు కదిలిన సకల జనులు కిలోమీటరు పొడవు బ్యానర్‌పై సంతకాలు చేసిన జనం ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతారెడ్డి జనగామ : సీఎం కేసీఆర్ గారు.. మాకు జనగామ జిల్లా కావాలి.. ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత మీపై ఉంది.. జిల్లా చేస్తానని మీరిచ్చిన మాటనే నిలబెట్టు కోవాలి... మా జనగామలో జిల్లాకు కావల్సిన వనరులన్నీ ఉన్నాయంటూ తమ అభిప్రాయాలను బ్యానర్‌పై రాసి ఆకాంక్షను తెలిపారు. జనగామ జిల్లా కోసం జేఏసీ తలపెట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ప్రారంభించారు. జాతీయ రహదారి అంబేద్కర్ విగ్రహం నుంచి నెహ్రూ పార్క్ వరకు కిలోమీటరు పొడవున ఏర్పాటు చేసిన తెల్లని బ్యానర్‌పై సకల జనులు సంతకాలు చేశారు. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు, లింగాలఘణపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, జర్నలిస్టులు, కార్మికులతో పాటు పలు పార్టీల నాయకులు సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉండగానే జేఏసీ సంతకాల సేకరణకు పిలునివ్వడంతో ఉత్కంఠ నెలకొంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్వచ్ఛందంగా వచ్చి బ్యానర్‌పై తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. శాంతియుతంగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు సంతకాల సేకరణ కొనసాగింది. శాంతియుత ఉద్యమాలతో జిల్లా సాధించుకుంటాం శాంతియుత ఉద్యమాలతో జనగామ జిల్లా సాధించుకుంటామని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. ఆర్టీసీ చౌరస్తాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అరెస్టులు చేసినా జిల్లా సాధించుకునే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీహెచ్.రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, ఓయూ జేఏసీ కన్వీనర్ బాలలక్ష్మి, జేఏసీ నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, పోకల లింగయ్య, ఆకుల వేణుగోపాల్‌రావు, ఆకుల సతీష్, మేడ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు బాల్నె మహేందర్, మంగళ్లపల్లి రాజు, ఆలేటి సిద్దిరాములు, ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఎండీ అన్వర్, పిట్టల సత్యం పాల్గొన్నారు. -
144 సెక్షన్ ఎవరి ప్రయోజనాల కోసం?
విద్యార్థి నాయకులపై అక్రమ కేసులా? జనగామ జిల్లా కోసం మూడు రోజలు పాటు ప్రత్యేక కార్యచరణ నేటి ఎమ్మెల్యే హరితహారం కార్యక్రమాన్ని బహిష్కరించాలి కిలోమీటరు బ్యానర్‌పై సంతకాల సేకరణ ప్రతి ఇంటిపై జనగామ జెండా ఎగురు వేయాలి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా కోసం ప్రజలు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే, ఎవరి ప్రయోజనాల కోసం 144 సెక్షన్ విధించి నిర్భందం విధించారని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, పాలకుర్తి జేఏసీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మినారాయణ, స్టేషన్ ఘనపూర్ కన్వీనర్ మేడ శ్రీనివాస్, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళ్లపల్లి రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్ ప్రశ్నించారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బస్సు దహనం అవుతుండగా, ఫైర్ ఇంజిన్‌ను అడ్డుకున్న అధికార పార్టీ నాయకులపై లేని కేసులు ఉద్యమకారులపై బనాయించడం ప్రభుత్వ నిరంకుశ విధానాలను స్పష్టం చేస్తోందన్నారు. విద్యార్థి నాయకులపై అన్యాయంగా కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెచ్చార్సీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనగామ డివిజన్లోని పలు మండల కేంద్రాలతో పాటు గ్రామ గ్రామాన 144 సెక్షన్ విధించడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత పైకి ఎగిసి పడుతుందన్నారు. 144 సెక్షన్‌కు నిరసనగా సోమవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. ఈ నెల 21న కిలోమీటరు పొడవైన తెల్లనిగుడ్డపై లక్ష సంతకాల సేకరణ చేసి, సీఎంకు పంపించనున్నట్లు చెప్పారు. 24వ తేదీన డివిజన్లోని ప్రతి ఇంటిపై జనగామ జెండాను ఎగుర వేసి తమ ఆకాంక్షను తెలుపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీద్, పిట్టల సత్యం, బెడిదె మైసయ్య, దుబ్బాక వీరస్వామి, గండి నాగరాజు ఉన్నారు. -
నేడు ఆర్టీసీ జేఏసీ ఒకరోజు సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మె యథావిధిగా జరిగే అవకాశమే కనిపిస్తోంది. ఆర్టీసీవైపు నుంచి చర్చలకు సరైన పద్ధతిలో పిలుపు రాలేదన్న ఉద్దేశంతో ఒకరోజు సమ్మెను నిర్వహించాలని నిర్ణయించినట్టు జేఏసీ ప్రకటించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ టీ-జేఏసీ చైర్మన్ చేసిన మధ్యవర్తిత్వం విఫలమైంది. బుధవారం సాయంత్రం కోదండరాం తదితరులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల బకాయిల చెల్లింపు డిమాండ్‌తో ఒకరోజు సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించాలని సత్యనారాయణకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న అనంతరం కోదండరాంచైర్మన్తో భేటీ అయ్యారు. శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని, కార్మికుల డిమాండ్లను విని సానుకూలంగా స్పందించాలని కోరారు. చర్చలకు తానేమీ వ్యతిరేకం కాదని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు వస్తే చర్చించేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించామని, కానీ దాని బకాయిల చెల్లింపులో కాస్త ఆలస్యమైతే ఏకంగా సమ్మె చేస్తామనటం ఎంతవరకు సమంజసమని సత్యనారాయణ ప్రశ్నించారు. అయితే జేఏసీగా ఉన్న నేపథ్యంలో అన్ని సంఘాల ప్రతినిథులతో కూడిన బృందాన్ని చర్చలకు పిలవాలని, ఒకే సంఘాన్ని ఆహ్వానించటం సరికాదని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్టీసీ నుంచి సానుకూల స్పందన రానందున గురువారం తెల్లవారుజామున తొలి సర్వీసును ఆపేయటం ద్వారా సమ్మె మొదలుపెడతామని పేర్కొన్నారు. -
శంషాబాద్‌ను జిల్లాగా ప్రకటించకుంటే..
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎయిర్పోర్ట్ దారిలో బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. శంషాబాద్‌ను జిల్లాగా ప్రకటించకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకులు హెచ్చరించారు. -
తప్పులు ఎత్తిచూపితే భరించలేరా?
పాలనను గాడిలో పెట్టేందుకే రంగంలోకి దిగిన జేఏసీ టీటీడీపీ నేతలు ఎల్.రమణ, నామా నాగేశ్వర్రావు వరంగల్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం మేధావులు, ఉద్యమకారుల తో కమిటీలు వేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ విషయూన్ని మరిచిపోవడమే కాకుం డా.. తప్పులు ఎత్తిచూపిన వారిపై భజనపరులతో ఆరోపణలు చేయించడం గర్హనీయమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణఉద్యమ సమయంలో ఏకాకిగా ఉన్న కేసీఆర్.. రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి చైర్మ న్గా కోదండరాంను నియమించినప్పుడు 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటిం చామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలన పై కోదండరాం ప్రశ్నిస్తే ఉలిక్కిపడడం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన కొండా మురళి వంటి వారిని కౌగి లించుకుంటున్న కేసీఆర్.. ప్రొఫెసర్ కోదండరాంను బొంతపురుగులా చూడటాన్ని ప్రజ లు జీర్ణించుకోలేరన్నారు. కేసీఆర్ తన పాలన ఫాంహౌస్ నుంచే సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి తెలంగాణ బిల్లుతోనే భూసేకరణ చట్టం బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని, ఆ చట్ట ప్రకారమే సేకరించిన భూములకు నష్ట పరిహా రం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు నామా నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం భూములకు నష్ట పరిహారం చెల్లించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరు అశోక్‌కుమార్, ఆక రాధాకృష్ణ, మార్గం సారంగం ఉన్నారు. -
100 జేఏసీలు పుట్టుకొస్తాయి
తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ హైదరాబాద్: ఉద్యమకారుల గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమంలో మాదిరిగా 100 జేఏసీలు పుట్టుకొస్తాయని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం కేసీఆర్ కుటుంబం, మంత్రివర్గ సభ్యులు తిట్లదండకం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా తెలంగాణ ప్రజల కోసం గొంతు విప్పడానికి ప్రయత్నిస్తే కేసీఆర్ అనుచరగణం ఒంటికాలిపై లేస్తున్నదని విమర్శించారు. ఉద్యమకారులను సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కొత్త బిచ్చగాడు అని అంటున్నారని, ఇదెక్కడి సంస్కారమని ప్రశ్నించారు. తలసాని కూడా కోదండరాంను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం వచ్చిందని, ఇప్పటికైనా కోదండరాం దానిని తయారు చేయాలని సుధాకర్ సూచించారు. తెలంగాణ కోసం పోరాడిన కవులు, క ళాకారులు, ఉద్యమకారులు, మేధావివర్గం అందరూ ఐక్యంకావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులంతా బజారుకెక్కి ఉద్యమకారులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
సర్కారు ఉక్కిరిబిక్కిరి
♦ కోదండరాం వ్యాఖ్యలతో ఉలికిపాటు ♦ ఏకంగా 12 మంది మంత్రులు విరుచుకుపడటంపై విమర్శలు ♦ కోదండరాంకు దన్నుగా విపక్షాలు, జేఏసీలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైందా..? టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతోందా..? కోదండరాంపై కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేయడం చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో అలర్ట్ అయిన ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడి ప్రారంభించారని, ఏకంగా 12 మంది మంత్రులు కోదండరాం విమర్శలను తిప్పికొడుతూ ప్రతి విమర్శలకు దిగారని అంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వ విధానాలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించుకునే ప్రయత్నం చేస్తూనే జేఏసీ ఉనికిని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. మరోవైపు కోదండరాంకు విపక్షాలు, వివిధ జేఏసీలు మద్దతుగా నిలిచి ప్రభుత్వ తీరును తూర్పారపట్టడంతో అధికార పార్టీ వ్యూహం బూమరాంగ్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా అంశాల వారీగా అధ్యయనం.. రెండేళ్లుగా వివిధ రంగాల వారీగా, అంశాల వారీగా అధ్యయనం చేసిన తెలంగాణ జేఏసీ ప్రకటనలకే పరిమితం అయ్యింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, విద్యుత్, సాగునీటి రంగాలతోపాటు సింగరేణిపై జేఏసీ సబ్-కమిటీలు అధ్యయనం చేశాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై టీజేఏసీ చైర్మన్ హోదాలో కోదండరాం జిల్లాల్లో పర్యటించారు. అనంతరం జేఏసీ తరపున నివేదికను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి అందజేశారు. రైతు ఆత్మహత్యలపై కోర్టు మెట్లు కూడా ఎక్కారు. రైతుల ఆత్మహత్యల నివారణకు జేఏసీ కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఉద్యమ సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతాల్లోనూ జేఏసీ పర్యటించింది. కరువుపై కలెక్టర్ల సదస్సుకు ముందు వివిధ రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం జరిపి ప్రభుత్వానికి సూచనలు చేసింది. మొత్తంగా ఈ రెండేళ్ల పాటు అధ్యయనానికి, ప్రభుత్వానికి సూచనలు చేయడానికే పరిమితమైన జేఏసీ రెండేళ్ల సంబురాలు జరుగుతున్న సమయంలో విమర్శలకు దిగింది. భూసేకరణ విధానంపై తీవ్రంగా విరుచుకుపడిన కోదండరాం.. ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని కుండ బద్దలు కొట్టారు. గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే ఈ ప్రభుత్వం నడుస్తోందం టూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పుట్టించాయి. జేఏసీ @ ప్రభుత్వం కోదండరాం వ్యాఖ్యలపై మంత్రులంతా విరుచుకుపడటంపై చర్చ సాగుతోంది. వాస్తవానికి గడిచిన ఏడాది కాలంగా తెలంగాణ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పెద్ద పాత్రనే పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో జేఏసీ బయటకు వెళ్లిపోవడం వెనుక సదరు పెద్దల ఆదేశాలు, ఒత్తిడి ఉన్నాయన్న ప్రచారం జరిగింది. గతంలో జేఏసీలో కీలకంగా వ్యవహరించిన వారికి కొన్ని పదవులు దక్కడం వంటి పరిణామాలు ఈ ప్రచారానికి ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో తన మనుగడను కాపాడుకుంటూనే ప్రజల పక్షాన జేఏసీ ప్రభుత్వాన్ని నిలదీసిందంటున్నారు. విమర్శలను స్వీకరించకుండా.. అమాత్యులంతా కోదండరాంపై ఒంటికాలిపై లేవడంతో పెద్ద దుమారమే చెలరేగింది. గతంలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జేఏసీ చైర్మన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల మంత్రుల దిష్టిబొమ్మలు, ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కోదండరాం లేవనెత్తిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా.. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వివరించడానికే మంత్రులు పరిమితమయ్యారు. -
జిల్లా కోసం ‘ముత్తిరెడ్డి’ రాజీనామా చేయాలి
ప్లకార్డులతో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జనగామకు అన్యాయం చేస్తే సత్తా చాటుతామని హెచ్చరిక అంబేద్కర్ విగ్రహం ఎదుట చెవిలో పువ్వులుపెట్టుకుని నిరసన జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ చౌరస్తాకు చేరుకున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వ్రిగహం ఎదుట ప్లకార్డులతో చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. జిల్లా చేయకుండా అన్యాయం చేస్తే తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐకాస నాయకులు మంగళ్లపల్లి రాజు, ఆరుట్ల దశమంతరెడ్డి, ఆకుల వేణుగోపాల్‌రావు, ఆకుల సతీష్, న్యాయవాది సాధిక్‌అలీ, మహంకాళి హరిచ్ఛంద్రగుప్త, తిప్పారపు విజయ్, సౌడ రమేష్, జి.క్రిష్ణ మా ట్లాడారు. జనగామ జిల్లా ఏర్పాటుపై వస్తున్న అనుమానాల తొలగించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. జనగామ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చి న హామీని మరచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా సీఎంను కలవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్‌చేసి జిల్లా ఇస్తున్నట్లు ప్రకటించుకున్న ఎమ్మెల్యే ఆ మాటను నిజం చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమంలో కలిసి పోరాటం చేయాలన్నారు.మంగళ్లపల్లి రాజు, దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ, రాజమౌళి, వేణుగోపాల్‌రావు, సతీష్, శ్రీను, ధర్మపురి శ్రీనివాస్, సాధిక్ అలీ మహంకాళి హరిచ్చంద్రగుప్త, జక్కుల వేణుమాధవ్, మాశెట్టి వెంకన్న, తిప్పారపు విజయ్, రమేష్, చంద్రశేఖర్, సిద్ధూగౌడ్, జి,క్రిష్ణ, కుమార్, రత్నాకర్‌రెడ్డి, సత్యం, జగదీష్, మైసయ్య, మణి, మాజీద్, సురేష్ పాల్గొన్నారు. -
ఏం జరుగుతుందో చూద్దాం!
తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెల్ల మెల్లగా రాజకీయచర్చల వేడి ఊపందుకుంటోంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అనేక శక్తులు, వ్యక్తులు, సంస్థలు, భిన్న భావజాలాలు, సిద్ధాంతాలు కలిగిన వారు ఐక్యంగా కలసి పోరాడిన విషయం తెలిసిందే. రెండేళ్లలో జరిగిన వివిధ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీలతో విజయకేతనం ఎగురవేయడంతో ఆయా రాజకీయపార్టీల్లో స్తబ్ధత ఏర్పడడంపై కూడా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయశక్తుల పునరేకీకరణకు అవకాశముందా ? లేక ప్రెషర్‌గ్రూప్ పాలిటిక్స్‌కు శ్రీకారం చుడతారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అందరినీ కలుపుకుని పోయి ఏ పార్టీ ముద్రపడకుండా కీలకపాత్రను పోషించిన జేఏసీ భవిష్యత్‌లో ఏదైనా కీలకభూమికను నిర్వహిస్తుందా అన్న దానిపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి అసలు ప్రయత్నాలు అయినా మొదలయ్యాయో లేదో అంతలోనే దీనిపై పరోక్షంగా విమర్శలు, ఆరోపణల పర్వం కూడా మొదలైపోయిందట. ఈ చర్చలను, పరిణామాలను గమనిస్తున్న ముఖ్యులు గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రను పోషించిన వారు మాత్రం.. అసలు ఏమి జరుగుతుందో చూడాలి అంటూ సంకేతాలు ఇచ్చేస్తున్నారట. ఆధిపత్య ధోరణులు, రాచరిక పోకడలను, భూస్వామ్య భావజాలాన్ని అస్సలు సహించని, ఎంతో రాజకీయచైతన్యం కలిగిన ఈ తెలంగాణ గడ్డ గర్భం నుంచి ఏమి ఉద్భవిస్తుందో చూడాల్సిందేనంటూ... ముక్తాయింపునివ్వడం కూడా రాజకీయవర్గాల్లో కలకలాన్ని రేపుతోందట...! -
రాజకీయ శక్తిగా ఎదగాలంటున్నారు
జేఏసీ భేటీలో కోదండరాం వ్యాఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో జేఏసీ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని పలువురు కోరుకుంటున్నారని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించా రు. గురువారం హైదరాబాద్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన జేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం సందర్భంగా 22 రోజుల పాటు జరిగిన విదేశీ పర్యటనలో జరిగిన భేటీలు, వాటిలో వచ్చిన సూచనలను కోదండరాం వివరించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ సంఘాలు నిర్వహించిన సమావేశాలకు విశేష ఆదరణ దక్కిందన్నా రు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆవిర్భవించిన జేఏసీ రాజకీయాలకు అతీ తంగానే, ప్రజల పక్షాన పోరాటం చేయాలని కొందరు సూచించగా మరికొందరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజ లకు చెప్పిన మాటలను నిజం చేయడానికి అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని కోరినట్టుగా కోదండరాం వెల్లడించారు. రాజకీయాలకతీతంగా, ఒక రాజకీయ లక్ష్యం కోసం దీర్ఘకాలికంగా పనిచేసి విజయం సాధించడంతోపాటు నిలదొక్కుకున్న సామాజిక సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని పలు వర్సిటీల ప్రొఫెసర్లు విశ్లేషించినట్టు కోదండరాం చెప్పారు. ప్రపంచీకరణ విధానాలకు భిన్నం గా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రాష్ట్ర సాధన ఉద్యమం ప్రతిపాదించిందని, కానీ ఇక్కడి పాలకులు భూమిని కేంద్రంగా చేసుకుని ఆలోచనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాద్, డి.పి.రెడ్డి, పురుషోత్తం, రమేశ్, ఖాజా మోహినుద్దీన్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘కరువు’పై మౌన దీక్ష: కోదండరాం
జేఏసీలు, రైతు సంఘాలతో కలసి చేస్తాం * ప్రభుత్వాన్ని కదిలించేందుకే... మండల కేంద్రాల్లో పోరాటాలు * రాష్ట్రమంతటినీ కరువు ప్రాంతంగా ప్రకటించాలి * తెలంగాణ జేఏసీ రౌండ్‌టేబుల్ భేటీ తీర్మానం * ఇంతటి విపత్తుపై ఇప్పటిదాకా సమీక్షైనా చేయరా? * ఈ ప్రభుత్వం సలహాలు తీసుకునే స్థితిలో లేదు: హరగోపాల్ * వాస్తవాలను ఒప్పుకోని పాలక వర్గం ప్రజల దౌర్భాగ్యం * విపక్షాలు బలహీనపడితే ప్రజలే విపక్షమవుతారని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ‘‘స్వాతంత్య్రానంతరం అతి పెద్ద కరువును ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. మునుపెన్నడూ లేని రీతిలో చివరకు తాగునీటికి కూడా కష్టాలు పడుతున్నాం. ఉపాధికి దిక్కు లేని స్థితిలో పల్లె వలస వెళ్లిపోతున్నది’’ అని తెలంగాణ జేఏసీ కరువు సమాలోచన సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటినీ కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ఒక్క సమీక్ష కూడా జరపలేదంటూ తప్పుబట్టింది. కనీసం శుక్రవారం జరగనున్న కలెక్టర్ల సమావేశంలోనైనా కరువుపై సమగ్రంగా చర్చించి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలని కోరింది. కరువు తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని జేఏసీలు, రైతు సంఘాల ప్రముఖులతో కలిసి త్వరలో ఒక రోజు మౌన దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని పక్షాలతో చ ర్చించాక దీక్ష తేదీని ప్రకటిస్తామన్నారు. దానికి ముందు గవర్నర్‌ను కలిసి, రాష్ట్రంలో కరువుపై నివేదికను అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో చేపట్టాల్సిన పోరాట రూపాలపై మే 9వ తేదీన చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు సంఘాల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, జేఏసీల నాయకులు పాల్గొన్నారు. ‘‘తక్షణం తాగునీరు సరఫరా చేయాలి. నీటి నిల్వలను పరిరక్షించాలి. పశువులకూ తాగునీరు, మేత అందించేందుకు సంరక్షణ కేంద్రాలు, గ్రామాల్లో నీటి తొట్టెల ఏర్పాటు చేయాలి. గ్రామీణ ఉపాధి కూలీలకు వెంటనే ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. వృద్ధులు, వికలాంగులకూ మధ్యాహ్న భోజనం అందించాలి. ఆరోగ్య సేవలందించేందుకు మొబైల్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. వడగాడ్పులతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి’’ అంటూ పలు తీర్మానాలు చేశారు. వ్యవసాయ కమిషన్‌పై స్పందనేదీ? వాస్తవాలను అంగీకరించని పాలక వర్గం రావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ‘‘వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సీఎం కాకముందే కోరా. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఏ సలహాలూ తీసుకునే స్థితిలో లేదు. కరువు ప్రకృతి వైఫల్యం కాదని, మానవ వైఫల్యమని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చెప్పిన మాటలను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు’’ అని చెప్పారు. పోరాడిన గ్రామాలు యాచిస్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన గ్రామాలు ప్రస్తుతం యాచిస్తున్నాయని చుక్కా రామయ్య ఆవేదన వెలిబుచ్చారు. కరువు వల్ల పల్లెల నుంచి 60 శాతం మంది ప్రజలు వలస పోయారన్నారు. ‘‘నీళ్ల కోసం చెరువులు తవ్విస్తున్నారు గానీ, పూడికలు తీసిన కాంట్రాక్టర్లే బాగుపడ్డారు. తెలంగాణలో వ్యవసాయం ప్రకృతిపై ఆధార పడి ఉంది. తెలంగాణకు కొత్త కరువు మాన్యువల్ అవసరం. తెలంగాణ గడ్డ రాజకీయంగా నీరసపడింది. గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైంది’’ అని అన్నారు. భేటీలో ఇతర నేతల అభిప్రాయాలివీ.. ప్రస్తుత కరువుకు రాష్ట్ర ప్రభుత్వమే సగం కారణం. కరువును ఎదుర్కోవడానికి జల విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి’’ - సారంపల్లి మల్లారెడ్డి, రైతు నేత కరువుపై ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు పట్టింపే లేదని, గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు కావాలని ప్రజలు కోరే దుస్థితి నెలకొంది - పశ్య పద్మ రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రజా ఉద్యమంగా ముందుకెళ్తేనే ప్రభుత్వం దిగొస్తుంది - ఏఐకేఎస్ నేత అచ్యుత రామారావు నీరున్న బోర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామీణులకు తాగునీరివ్వాలి. హైదరాబాద్‌కు తాగునీటి తరలింపును నిలిపేసి తాగునీటి ఎమర్జెన్సీ ప్రకటించాలి - నర్సింహారెడ్డి, చేతన సొసైటీ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన పెద్దలంతా కనీసం 2 గంటలు మౌనదీక్ష చేపట్టాలి - రఘు, విద్యుత్ జేఏసీ కరువు ఉరుముతున్నా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు రెండేళ్లుగా పట్టించుకోవడమే లేదు - జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ -
మరో ఉద్యమం చేపడుతాం..
హన్మకొండ : సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి కన్వీనర్ బి.సామ్యానాయక్ హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దని, వారిని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి పంపాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సామ్యానాయక్ మాట్లాడుతూ సీమాధ్ర ఉద్యోగులు ఇక్కడ విధుల్లో చేరితే ఎలా అడ్డుకోవాలో తెలుసునన్నారు. ధర్నాలో ఎన్పీడీసీఎల్ సీఈలు సదర్లాల్, వేణుగోపాలచారి, మోహన్‌రావు, రామకృష్ణ, అశోక్‌కుమార్, ఎస్ఈలు మధుసూదన్, రాజేష్‌చౌహాన్, నారాయణ, ఇంజనీర్ల జేఏసీ నా యకులు సుభ్రమణ్యేశ్వర్‌రావు, తిరుమల్‌రావు, మల్లయ్య, రణధీర్‌రెడ్డి, బి. కిశోర్, సురేష్, ప్రభావతి, జమున, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి తెలంగాణ స్ఫూర్తి యాత్ర
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ కోసం, గ్రామ స్థాయి నుంచి జేఏసీని తెలంగాణ ఉద్యమ జేఏసీగా మలిచేందుకు గాను అంబేడ్కర్ జయంతి రోజైన గురువారం నుంచి ‘తెలంగాణ స్ఫూర్తి యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ వెల్లడించారు. ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపేందుకు సామాజిక శక్తులను ఐక్యం చేయడం యాత్ర ఉద్దేశమన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి యాత్ర ప్రారంభమై భువనగిరి చేరుకుంటుందని, అక్కడ నుండి ఈ నెల 29 వరకు తెలంగాణలోని 10 జిల్లాలు తిరిగి, తిరిగి హైదరాబాద్ చేరుకుని 30న ఓయూలో మహనీయుల జయంతి ఉత్సవాలు, సభ నిర్విహ ంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగ్ ప్రహ్లాద్ పాల్గొన్నారు. -
6న ‘చలో హెచ్‌సీయూ’కి జేఏసీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సామాజిక న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఏప్రిల్ 6న ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చింది. రోహిత్ వేముల మృతికి, అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్ఏ) నాయకుడు ప్రశాంత్ సహా నలుగురు విద్యార్థుల రస్టికేషన్‌కు కారణమైన వైస్ చాన్స్‌లర్ అప్పారావును పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన చేపడతున్నామని విద్యార్థి నేతలు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, జుహైల్ ‘సాక్షి’కి తెలిపారు. వీసీ పునరాగమనం వెనుక దాగి ఉన్న కుట్రను బట్టబయలు చేసేందుకే ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చినట్టు చెప్పా రు. అరెస్టులు, లాఠీచార్జీలు, జైలు గోడలను ఛేదించుకొని ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. ‘చలో హెచ్‌సీయూ’కు వేలాదిగా తరలి రావాలని కోరారు. -
హామీల అమలుకు జేఏసీ అవసరం
చైర్మన్ కోదండరాం స్పష్టీకరణ రాష్ట్ర ఏర్పాటుతోనే బాధ్యత తీరిపోలేదని వ్యాఖ్య గద్వాల: తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం జేఏసీ కొనసాగాల్సిన అవసరం ఉందని చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు జేఏసీ ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జేఏసీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు జరిపితేనే ఏదైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. జేఏసీలో అభిప్రాయ భేదాలు తలెత్తాయా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటివేవీ లేవని కొట్టిపడేశారు. రాష్ట్ర ఏర్పాటుతోనే బాధ్యత తీరిపోదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. తెలంగాణ ప్రాంత వనరులు అందరికీ దక్కే విధంగా కృషి చేస్తామని కోదండరాం చెప్పారు. 19 నుంచి కరువుపై అధ్యయనం తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న కరువుపై జేఏసీ అధ్యయనం చేస్తుందని కోదండరాం తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో, ఆ తర్వాత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై తమవంతు సూచనలు కూడా అందిస్తామన్నారు. -
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా
-
'దళితుడే కాదని కులరాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్: పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది సేపటికే ర్యాలిగా వచ్చిన విద్యార్థులు ఆమె దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దళిత ఉద్యమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నాయని హెచ్‌సీయూ జేఏసీ విద్యార్థులు మండిపడ్డారు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్మృతి ఇరానీ రాజీనామా చేసేంతవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. 'స్మృతి ఇరానీ ఏబీవీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కమిటీ రిపోర్ట్‌ను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. రోహిత్ దళితుడు కాదని కుల రాజకీయం చేస్తున్నారు. రోహిత్ దళితుడు కాకుంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ విభాగం ఎస్సీ సర్టిఫికెట్ ఎలా మంజూరు చేసింది. కులాన్ని బట్టి మనిషికి విలువ కడతారా?. కేంద్రం వేసిన నిజ నిర్థారణ కమిటీ నివేదిక ఇవ్వకముందే ఆ అంశంపై స్మృతి ఇరానీ ఎలా మాట్లాడతారు. లేఖతో దత్తాత్రేయకు సంబంధం లేదని కిషన్ రెడ్డి అంటున్నారు. మరి దత్తాత్రేయ లేఖ పంపించారని స్మృతి ఇరానీ అంటున్నారు. బీజేపీ నేతల్లోనే క్లారిటీ లేదు.మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాం. కులాన్ని బట్టి మనిషి విలువను లెక్కగడతారా?.' అని హెచ్‌సీయూ విద్యార్థుల జేఏసీ పేర్కొంది. -
త్యాగాలు ఎవరి కోసం..?
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు: ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారమవుతాయనుకున్నారు. పాలకులు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేస్తారని ఆశించి అనేక వర్గాల ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రస్తుత తెలంగాణ పాలకులు గత టీడీపీ, కాంగ్రెస్ అవలంబించిన అభివృద్ధి నమూనానే అమలు చేయాలనుకుంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నట్టు? ఎందుకు ఆత్మత్యాగాలు చేసినట్లు?’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ నిలదీశారు. ప్రత్యేక అవసరాలు గల చెవిటి, మూగ, మానసిక వైకల్యం, దృష్టిలోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం విద్యా హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన హరగోపాల్ మాట్లాడుతూ అహంకారంతో కాకుండా బాధలను పంచుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలను పాలకులు నిరాశకు గురి చేశారన్నారు. చెవిటి, మూగవారికి సైగలతో కూడిన విద్య కోసం ప్రత్యేక బడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రాధాన్యమివ్వాలి... జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులు మానసికంగా కుంగిపోకుండా సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. వికలాంగులకు, అనాథలకు విద్య, ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ శారీరక వైకల్యానికి ప్రభుత్వాలదే బాధ్యత అని అన్నారు. న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది వైకల్యమున్న పిల్లలకు ఏడు స్కూళ్లు మాత్రమే ఉన్నాయంటే వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. 2015-16 బడ్జెట్లో వికలాంగులకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నవనిర్మాణ వేదిక గౌరవాధ్యక్షులు మురళీధర్‌గుప్తా, అధ్యక్షులు నల్లగంటి రామకృష్ణ, ప్రధానకార్యదర్శి సిలివేరి వెంకటేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. -
ఓట్లు మావే.. సీట్లూ మావే
* ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎంపీటీసీల ఫోరం * మొత్తం 12 సీట్లలో ఎంపీటీసీ అభ్యర్థులను నిలుపుతాం * ఎంపీటీసీలకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తాం * జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో జేఏసీగా ఏర్పడతామని ప్రకటన సాక్షి, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉవ్విళ్లూరుతోంది. ప్రభుత్వం గత 17 నెలలుగా ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు అప్పగించకపోవడంపై ఉన్న వ్యతిరేకతను చూపేందుకు సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 సీట్లకు ఫోరం తరపున ఎంపీటీసీలనే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలపాలని నిర్ణయించింది. ఏవైనా రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ టికెట్లను ఎంపీటీసీలకు కేటాయించిన పక్షంలో, ఆ అభ్యర్థులకు మాత్రం మద్దతు ఇవ్వాలని ఫోరం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓట్లున్న ఎంపీటీసీలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలిపితే ఓడించి తీరతామని స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రతినిధులు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఈ మేరకు ప్రతినబూనారు. ఈ దఫా ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తమవేనని నినదించారు. గత ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని, ఈ నేపథ్యంలో ఎంపీటీసీలనే ఎమ్మెల్సీలుగా చట్టసభలకు పంపాల్సిన అవసరం ఏర్పడిందని వారు అంటున్నారు. ఎంపీటీసీల సమస్యలివే.. గ్రామ సర్పంచులతో సమానమైన అధికారాలు కల్పిస్తామంటూ గత ఆగస్టులో కరీంనగర్లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా... అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటిదాకా వెలువడలేదని ఎంపీటీసీల ఫోరం ఆరోపిస్తోంది. ఎంపీటీసీల ద్వారా ఖర్చు చేయాల్సిన బీఆర్జీఎఫ్ నిధులను ఈ ఏడాది కేంద్రం నిలిపివేసిందని, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తుండడంతో తమ పరిస్థితి ఉత్సవ విగ్రహాల మాదిరి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలోనైనా తమకు సముచిత స్థానం కల్పించడం లేదని అంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గ్రాడ్యుయేట్లను అభ్యర్థులుగా నిలుపుతున్నపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకు ఎందుకు అవకాశమివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. 80 శాతం ఓట్లు మావే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓట్లలో 80 శాతం ఓట్లు ఎంపీటీసీలవేనని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ చెప్పారు. ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలకు ఎలాంటి అధికారాలు, నిధులు, విధులనూ ప్రభుత్వం అప్పగించలేదన్నారు. ఎంపీటీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడమే సరైన మార్గంగా భావిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎంపీటీసీలకు టికెట్లిస్తే ఫోరం తరపున మద్దతు ఇస్తామని వెల్లడించారు. తమలాగే ఎలాంటి అధికారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సెలర్లను కూడా కలుపుకొని స్థానిక ప్రజాప్రతినిధుల జేఏసీగా ఏర్పడాలని యోచన చేస్తున్నామన్నారు. నెలాఖరులోగా రాష్ట్ర స్థాయిలో భారీ సమావేశం నిర్వహించి తమ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య, ఉపాధ్యక్షుడు పెండ్యాల గోవర్ధన్, కార్య నిర్వాహక కార్యదర్శి మనోహర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
బాక్సైట్ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఐక్య కార్యచారణ కమిటీ ఏర్పాటైంది. ఆదివారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ప్రాంతంలోని గిరిజన భవన్లో వివిధ ఆదివాసీ సంఘాలు, గిరిజన మేథావులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కెడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పి.రాజన్నదొర, రాజేశ్వరి, కళావతి తదితరులు సమావేశమయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్మానించారు. తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
రంగారెడ్డిని రెండు జిల్లాలుగా చేయాలి: కోదండరామ్
రంగారెడ్డి జిల్లాను తూర్పు, పశ్చిమగా రెండు జిల్లాలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కోదండరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శేఖర్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. -
'ఏపీలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి'
తాడితోట (రాజమండ్రి): హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. అలాగే, రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. రాజమండ్రి బార్ అసోసియేషన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, ఏపీ లాయర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు తదితరులు మాట్లాడారు. ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లోనే కొనసాగించాలనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరిస్తారని తెలిపారు. -
దూకుడు పెంచిన కోదండరామ్
-
తెలంగాణలో మరో జేఏసీ
-
తెలంగాణ రైతు సంఘాల జేఏసీ ఏర్పాటు
- 18న చైర్మన్, క న్వీనర్ల ఎంపిక - రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్న ప్రొ.కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దాదాపు 20 రైతు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాలు సమావేశమయ్యాయి. వీటిల్లో పలు రాజకీయ పార్టీల రైతు విభాగాలతోపాటు స్వచ్ఛంద సంఘాలు కూడా ఉన్నాయి. ఈ నెల 18న మరోసారి సమావేశమై జేఏసీ చైర్మన్, కన్వీనర్లను ఎన్నుకోవాలని రైతు నేతలు తీర్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో నిలుచునే పరిస్థితి రాకూడదన్నారు. అప్పులు, నష్టాలతో కుంగుబాటుకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగటం చాలబాదాకరమని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో చర్చించి నివారణ చర్యలు తీసుకునేలా కృషి చేయాలన్నారు. తెలంగాణ తొలి బడ్జెట్లో వ్యవసాయానికి నిధులు పెంచకపోగా ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో కంటే తక్కువ నిధుల కేటాయించడంతోనే రైతులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. రైతు సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేయాలని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సూచించారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, ఇంద్రకుమార్, సదానంద్, ప్రభాకర్‌రెడ్డి, జంగారెడ్డి, రంగయ్య, ఉపేందర్‌రెడ్డి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్సీపై కదలిక.. 6న జీవోల జారీ
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ ‘పీఆర్సీపై కదలిక ఏది?’ శీర్షికన సాక్షి వార్త ప్రచురించిన నేపథ్యంలో.. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాల జేఏసీలో కదలిక వచ్చింది. గురువారం మధ్యాహ్నం జేఏసీ నేతలు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడును కలిశారు. పీఆర్సీ జీవోలు ఇవ్వడం కంటే మంచి ‘నష్ట నివారణ మార్గం’ వేరొకటి లేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండా జీవోలిచ్చే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ముందు జీవోలు జారీ చేసి, తర్వాత మంత్రివర్గ ఆమోదముద్ర వేయించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకనుగుణంగా.. ఈనెల 6న జీవోలు వెలువరించడానికి ఏర్పాట్లు చేయాలని ఆర్థికమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అనంతరం.. 6న జీవోలు ఇస్తామని జేఏసీ నేతలకు ఆర్థిక మంత్రి యనమల చెప్పారు. రాజధానికి రూ.200 కోట్ల విరాళం... ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఏపీఎన్జీవో హోంలో జరిగిన జేఏసీ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. 6న పీఆర్సీ జీవోలు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పినట్టు ప్రకటించారు. కాగా 15 రోజుల పీఆర్సీ బకాయిలను రాజధానికి విరాళంగా ఇవ్వాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలపై సమావేశంలో చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ అనంతరం.. 15 రోజుల బకాయిలను విరాళంగా ఇవ్వడానికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. 15 రోజుల పీఆర్సీ బకాయిల విలువ రూ.200 కోట్లు ఉంటుందని, జేఏసీ విరాళం ఇచ్చిన విషయం శాశ్వతంగా గుర్తుండేలా.. ఉద్యోగుల విరాళంతో రాజధానిలో ఒక బ్లాక్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని పలు సంఘాలు సూచించాయి. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షత వహించారు. -
కోల్డ్‌వార్
సాంబమూర్తినగర్ (కాకినాడ) :ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు పర్యవేక్షకులుగా తహశీల్దార్లు, ఎంపీడీఓలను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఉత్తర్వులను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. రవిచంద్ర కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కొంతమంది వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారని, నీతూ ప్రసాద్ ఏ శాఖలోనూ అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని వైద్య శాఖలోనే అమలు చేశారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎవరు కలెక్టర్‌గా పనిచేసినా వైద్య ఉద్యోగులను దొంగలుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పవర్ మొత్తాన్ని ఐటీడీఏ పీఓకు బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా వారు తప్పుబడుతున్నారు. ఒక పక్క సొంత శాఖ లోని అధికారుల ఒత్తిడి, మరో పక్క ఇతర శాఖల అధికారుల పెత్తనం వల్ల తాము మానసిక వేదనకు గురవుతున్నామని పేర్కొంటున్నారు. అయితే రెవెన్యూ శాఖ వాదన మరోలా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయని, అయితే వైద్య, ఆరోగ్య శాఖ మరో భాగమేమీ కాదని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు అన్ని శాఖలూ కలిసే ఉండేవని, ఆయన వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవల నిమిత్తం వైద్య శాఖను వేరుచేశారని చెబుతున్నారు. తాము వైద్య ఉద్యోగులపై పెత్తనం చలాయించేదేమీ లేదని, వారి పనితీరు మెరుగుపరిచేందుకు పర్యవేక్షకులుగా మాత్రమే వ్యవహరిస్తున్నామని పేర్కొంటున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ఇతర వ్యాధులు ప్రబలి అత్యవసర పరిస్థితులు ఏర్పడడానికి క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, కలెక్టర్ వారిపై పర్యవేక్షకులుగా రెవెన్యూ అధికారులను నియమించారని చెబుతున్నారు. అయితే దీనిని వైద్య ఉద్యోగులు వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సావిత్రమ్మకు వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేకుంటే విధులు బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ ప్రధాన డిమాండ్లివే... ఇతర శాఖల పెత్తనంతో కూడిన ప్రత్యేకాధికారి నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి. పర్యవేక్షణకు వైద్య శాఖ అధికారులను మాత్రమే నియమించాలి. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి. వైద్య సిబ్బందిని బహిరంగంగా విమర్శించే విధానాన్ని విడనాడాలి. సిబ్బంది గౌరవం పెంచేలా చర్యలు చేపట్టాలి. అనవసరపు మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లకు స్వస్తి పలకాలి. జాబ్‌చార్ట్ విధానాన్ని మాత్రమే కొనసాగించాలి. ఆధార్ సీడింగ్ నిమిత్తం వైద్య సిబ్బందిని బ్యాంకుల చుట్టూ తిప్పే విధానాన్ని విడనాడాలి. ఏజెన్సీలో అడిషనల్ డీఎంహెచ్‌ఓకే అధికారాలు కల్పించాలి.