Pet animal
-
హైదరాబాద్ : హైటెక్స్‌లో ముగిసిన పెటెక్స్ ఎక్స్పో (ఫొటోలు)
-
పిల్లల్లాగే కనిపెట్‌కోవాలి
పెట్‌ను పెంచుకునే విషయంలో భారతీయ సమాజం జపాన్ దిశగా అడుగులు వేస్తోంది. పిల్లలు పెద్దయి ఉద్యోగాలు, వ్యాపారాలతో దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఆ వెలితిని భర్తీ చేయడానికి పెట్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ కూడా తమ బిడ్డకు తోబుట్టువులు లేని లోటు తీర్చడానికి పెట్ మీద ఆధారపడుతున్నారు. అయితే పెట్ పేరెంట్స్ ఎటికెట్స్ పాటించకపోవడం సమాజానికి ఇబ్బందిగా మారుతోంది.ఇందుకోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను చెప్పింది కూడా. అయినా పట్టించుకోవడంలో మనవాళ్లు విఫలమవుతూనే ఉన్నారు. ఫలితం... పాదచారులు ఫుట్‌పాత్‌లు, రోడ్డు అంచున ఉన్న పెట్ మల విసర్జకాలను తప్పించుకుంటూ నడవాలి. వాహనదారులు పెట్ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూకుతుందేమోననే ఆందోళనతో వాహనం నడపాలి. పెట్ని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్న కారణంగా ఎదురవుతున్న సమస్యల జాబితా పెద్దదే.ఎప్పటికీ చంటిబిడ్డే! పెట్ని పెంచుకోవడం అంటే చంటిపిల్లలను పెంచినట్లే. పిల్లలైతే పెద్దయ్యేకొద్దీ వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. పెట్ విషయంలో అలా కుదరదు. దాని జీవితకాలమంతా చంటిబిడ్డను సాకినట్లే చూసుకోవాలి. మన దగ్గర ఇతర జంతువులకంటే ఎక్కువగా కుక్కలనే పెంచుకుంటారు. పెట్ని పెంపకానికి ఇచ్చేటప్పుడే ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే నియమావళి చెబుతాం. వ్యాక్సినేషన్, శుభ్రంగా ఉంచడం వరకే పాటిస్తుంటారు. విసర్జకాలు, మనుషుల మీదకు ఎగబాకడం వంటి విషయాలను తగినంతగా పట్టించుకోవడం లేదు.ఎక్కడ రాజీపడతారో సరిగ్గా వాటిలోనే ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతుంటాయని చెప్పారు ఢిల్లీలోని యానిమల్ యాక్టివిస్ట్ కావేరి రాణా. పెట్ పేరెంటింగ్ విషయంలో పాటించాల్సిన ఎటికెట్స్ నేర్పించడానికి క్లాసులు నిర్వహిస్తున్న సృష్టి శర్మ మాట్లాడుదూ... శిక్షణ పెట్‌కి మాత్రమే అనుకుంటారు. కానీ పెట్ పేరెంట్‌కి కూడా అవసరమే. పెట్ని వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు తప్పనిసరిగా బెల్ట్ వేసి తీసుకెళ్లాలి. అయితే బెల్డ్‌ను వదులుగా పట్టుకుంటారు.దాంతో ఆ పెట్ కొత్త మనిషి లేదా మరొక కుక్క కనిపించగానే మీదకు ఉరుకుతుంది. అలాగే ఒక్కసారిగా రోడ్డు మీదకు ఉరకడంతో వెనుక నుంచి వచ్చే వాహనాల కింద పడే ప్రమాదం ఉంటుంది. వీటితోపాటు తరచూ ఎదురయ్యే వివాదాలన్నీ పెట్ విసర్జన విషయంలోనే. పెట్ని వాకింగ్‌కి కాలనీల్లో రోడ్డు మీదకు లేదా పార్కులకు తీసుకెళ్తారు. విసర్జన కూడా రోడ్డు మీద లేదా పార్కులోనే చేయిస్తారు. వాకింగ్‌కి వచ్చిన ఇతరులకు కలిగే అసౌకర్యాన్ని ఏ మాత్రం పట్టించుకోరు. పెట్ని నియంత్రించరాదు! యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నియమాల ప్రకారం పెట్ని నియంత్రించే ప్రయత్నం చేయరాదు. అవరడం వంటి దాని సహజసిద్ధమైన చర్యలను గౌరవించాలి. అలాగని రాత్రిళ్లు అరుస్తూ ఉంటే ఇరుగుపొరుగు వారికి అసౌకర్యం. కాబట్టి పెట్ కూడా రాత్రి నిద్రపోయేటట్లు రెగ్యులర్ స్లీప్టైమ్ని అలవాటు చేయాలి. బయటకు తీసుకెళ్లినప్పుడు ఎవరి దగ్గరైనా ఆహారపదార్థాలు కనిపిస్తే వాళ్ల మీదకు దూకి లాక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటకు తీసుకెళ్లడానికి ముందే వాటి ఆకలి తీర్చాలి. విసర్జన విషయంలో... ఒక పేపర్ లేదా పాలిథిన్ షీట్ మీద విసర్జన చేయించి ఆ షీట్‌తో సహా తీసి డస్ట్‌బిన్‌లో వేయాలి.పెట్ పేరెంట్స్ తమ పెట్లను గారంగా చూసుకుంటారు. కాబట్టి వాటికి పాంపరింగ్ అలవాటైపోతుంది. ఇంట్లో వాళ్లతోపాటు ఇంటికి వచ్చిన అతిథులు కూడా గారం చేయాలని కోరుకుంటాయి. అతిథుల మీదకు వెళ్లిపోయి ఒడిలో కూర్చుంటాయి. వచ్చిన వాళ్లకు పెట్లను తాకడం ఇష్టంలేకపోతే వారికి ఎదురయ్యేది నరకమే. అలాగే పెట్ పేరెంట్స్ పెట్ ఒళ్లంతా నిమిరి చేతులను కడుక్కోకుండా అలాగే అతిథులకు తినుబండారాలను వడ్డించడం కూడా దాదాపు అలాంటిదే. పెట్ పేరెంట్కు శిక్షణ తరగతుల్లో అన్ని విషయాలనూ వివరిస్తారు. కానీ మన భారతీయ సమాజం కొంతవరకే ఒంటపట్టించుకుంటోంది. జపాన్, యూఎస్ వంటి దేశాల్లోనూ పెట్ లవర్స్ ఎక్కువే. అక్కడ నియమావళిని కూడా అంతే కచ్చితంగా పాటిస్తారు. ∙ -
రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్
సాక్షి, సిటీబ్యూరో: పెంపుడు జంతువులు పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. పెట్స్‌తో రక్షణతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుండటంతో ఇదో హాబీగా మారింది. చాలా మంది ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు కుక్కలు, పిల్లలు, కుందేళ్లు.. ఇలా రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. విదేశాల నుంచి కూడా పెట్స్‌ను కొనుగోలు చేస్తుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో తమ వెంట పెట్స్‌ను రోడ్ల మీద, పార్క్‌లకు తీసుకెళ్తుంటారు. దీంతో ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలా మంది డెవలపర్లు నివాస సముదాయాల్లోనే పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా పెట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెట్స్ పార్క్ ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది.వందకుపైగా వసతులుహైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ జేఎన్టీయూ సమీపంలో ఇక్సోరా పేరుతో ప్రీమియం హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 8.31 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు టవర్లుంటాయి. జీ+37 అంతస్తుల్లో మొత్తం 1,504 యూనిట్లు ఉంటాయి. 1,305 చ.అ. నుంచి 3,130 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలు ఉంటాయి. వెహికిల్ ఫ్రీ పోడియం పార్కింగ్, పెట్ పార్క్, యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ స్టేషన్, యోగా డెక్.. ఇలా వందకు పైగా వసతులుంటాయి.50 వేల చ.అ. క్లబ్‌హౌస్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో 80 శాతం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించాలనే లక్ష్యంగా శరవేగంగా నిర్మాణ పనులను చేపడుతున్నామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఇప్పటికే టవర్ 1, 2లలో బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యిందని, గ్రౌండ్ ఫ్లోర్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. -
పప్పీకోసం...బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్, పెళ్లి క్యాన్సిల్
ఒక్క బుజ్జి కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకోవడం ఒకపుడు ఫ్యాషన్ .. కానీ ఇపుడు అదొక ఎమోషన్‌గా మారిపోయింది. పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒకరిగా ప్రేమించడం, పుట్టినరోజులు జరపడం, చనిపోతే ఆత్మీయులు చనిపోయినంతగా బాధపడటం, అంత్యక్రియలు జరిపించడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ కుక్క పిల్లకోసంఏడేళ్ల బంధాన్ని వదులుకున్న వైనాన్ని విన్నారా? అవును, పెళ్లి తర్వాత తన కుక్కను తనతో తీసుకురావాలనే కోరికను అత్తగారు నిరాకరించడంతో బాయ్ ఫ్రెండ్‌కు బై బై చెప్పేసింది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ప్రియాంక అనే ఇంటర్నెట్ యూజర్ తన కథను ఇలా వివరించింది. ఏడేళ్ల తరువాత మా బంధం ముగిసిపోయింది. అయితే ఇది నా వల్లనో, నా బాయ్ ఫ్రెడ్ వల్లనో కాదు. కేవలం అతని తల్లి వల్ల. మధ్యలో తల్లులు ఎందుకు రావాలి..ఎందుకు? ఏడేళ్లంటే మాటలా?’’ అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.అయితే, విషయం ఏమిటంటే ప్రియాంక, ఒక అబ్బాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. ఇరు కుటుంబాలుమాట్లాడుకున్నాయి. కానీ పెళ్లి తర్వాత తన వెంట కుక్కను కూడా తీసుకొస్తానని ప్రియాంక చెప్పింది. అందుకు ప్రియుడి తల్లి వ్యతిరేకించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు వద్దన్నాడు అతగాడు. అయితే తన ఇంట్లో తల్లి అనారోగ్యం కారణంగా కుక్కను చూసుకోలేకపోతోంది. బాధ్యతలను తానే ఎక్కువగా చూసుకుంటున్నాను. పైగా అదిలేకుండా జీవించ లేను అని భావించింది ప్రియాంక. అయితే అత్తగారింట్లో ఇప్పటికే ఒక కుక్క ఉందని, రెండు కుక్కలను పెంచుకోవడం ఇష్టం లేక తన కుక్కనుఅత్తగారు వారించిందని తెలిపింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కు కటీఫ్ చెప్పేసానని తెలిపింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెంపుడు కుక్క ఉన్న ఇంట్లో ఆడపిల్లలకు నిజంగా ఇది చాలా కష్టం. అయినా సర్దుబాట్లు, త్యాగాలు తప్పవు అని ఒకరు నిట్టూర్చగా, అది అతని ప్రాధాన్యత, ఇది మీ ప్రాధాన్యత అని ఇంకో వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇది చిన్నపిల్ల ట్వీట్లా ఉంది ఇంకొకరు కమెంట్ చేశారు. అమ్మాయిల డిమాండ్లు అసాధారణంగా ఉంటాయి. అయినా, ఇది చాలా సున్నితమైన అంశం. ఆమె ఇప్పటికే తల్లిని, కుక్కను విడిచిపెట్టి అతని ఇంటికి వెళుతోంది. కానీ అతను మాత్రం తల్లిదండ్రులు, కుక్కతో కలిసి హ్యాపీగా అతని ఇంట్లోనే ఉంటాడు. ఆ అవకాశం అమ్మాయికి లేదు కదా? మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కుక్కలు, పిల్లులకు జాబ్స్.. ఉద్యోగులవుతున్న పెట్స్!
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు మనుషుల జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటి పోషణ ఆశామాషీ కాదు. చాలా ఖర్చవుతుంది. కానీ మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి చైనాలోని పెట్స్. వీటికి జాబ్స్ ఇస్తున్నాయి అక్కడి కొన్ని కేఫ్‌లు.చాలా మంది చైనీయులు తమ పెట్స్‌ను వెంటబెట్టుకుని రెస్టారెంట్లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. ఇందుకోసమంటూ చైనాలో ప్రత్యేకంగా పెట్ కేఫ్‌లు ఉన్నాయి. తమ యజమానులతో పాటు పెట్స్ కూడా చిల్ అయ్యేందుకు, వినోదం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెట్ డాగ్స్, క్యాట్స్‌ను నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు.తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. దీని ద్వారా అవి తోటి జంతువులతో కలవడంతోపాటు తిండిని సంపాదించుకోవడానికి వీలు కలుగుతోంది. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది.పెంపుడు జంతువుల "ఉద్యోగుల" కోసం రిక్రూట్మెంట్ ప్రకటనలు, సీవీలు జియావోహోంగ్‌షూ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్ కేఫ్‌కి పంపుతోంది. దీని వల్ల తనకు ఏసీ ఖర్చులు ఆదా అవుతున్నట్లు సీఎన్ఎన్కి చెప్పారు. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్ దొరకడం కష్టం. జిన్ జిన్ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్ కోసం వెతుకుతున్నారు. జియావోహోంగ్షూలో సీవీ పెట్టారు. -
పెంపుడు శునకం చేతిని కొరికేసింది!
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ ముంజేతిని ఆమె పెంపుడు కుక్క కొరికేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సగం తెగిన చేతిని వైద్యులు తిరిగి అతికించారు. తీరప్రాంత టౌన్స్విల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో అత్యవసర ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెంటనే ఓ నివాసానికి చేరుకున్నారు. ఓ ఇంటి బయట మహిళ రక్తం కారుతున్న చేతితో విలవిల్లాడుతుండగా, లోపల ఓ భారీ శునకం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కోపంతో తిరుగుతోంది. దీంతో, వెంటనే పోలీసులు వైద్య సిబ్బందికి కబురు పంపారు. వారొచ్చి బాధితురాలి చేతికి కట్టుకట్టారు. లోపలున్న శునకం నియంత్రణలోకి రాకపోవడంతో నిపుణుల సూచన మేరకు కాల్చి చంపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కుక్క గతంలో తనపైనా కూడా దాడి చేసిందని పొరుగింటి వ్యక్తి చెప్పాడని స్థానిక మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు ఇంతటి ప్రమాదకర స్థాయిలో దాడి చేయడం తన 37 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని సీనియర్ సార్జెంట్ స్కాట్ వారిక్ వ్యాఖ్యానించారు. -
Pets Spa: మేము నాటీ... మాకూ కావాలి బ్యూటీ! (ఫొటోలు)
-
పెట్.. బ్యూటీ సెట్!
సాక్షి, సిటీబ్యూరో: మనం బాగుంటే చాలదు.. మనవి అన్న ప్రతిదీ బాగుండాలి. మనం ఎక్కి తిరిగే కారు నుంచి మన వెనుకే తిరిగే శునకం, పెంపుడు జంతువు దాకా..అన్నీ బాగుండాలి. గ్లామర్ మేనియా నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్దలూ, పిల్లలూ దాటి చివరకు పెట్స్ వరకూ వచ్చేసింది. మై పెట్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ సగర్వంగా చెప్పుకోవాలనే ఆరాటం పెరుగుతుండడంతో పెట్స్‌కు అందాలను అద్దే పార్లర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీని కోసం నగరంలో మొబైల్ పార్లర్లు, గ్రూమింగ్ సేవలను అందించే పార్లర్స్, బ్యూటీ సెలూన్స్ ఇలా ఒక్కటేమిటి.. మనుషులకు ఎన్ని రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయో.. అవన్నీ పెంపుడు జంతువులకూ అందుతున్నాయి..స్నానం నుంచి.. హెయిర్ డై వరకూ..ఈ పెట్స్ పార్లర్ల సేవల జాబితాలో ఔషధ స్నానం, జుట్టు కత్తిరించడం, నెయిల్ క్లిప్పింగ్, చెవి శుభ్రపరచడం, హెయిర్ క్లీనింగ్, డై.. వంటివి ఉన్నాయి. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తున్నామని పార్లర్ల నిర్వాహకులు అంటున్నారు. పెంపుడు జంతువులకు, మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు ఒక గంట పడుతుందనీ పొడవాటి బొచ్చు కలిగిన శునకాలు, లేదా హస్కీలు వంటి వాటికి 90 నిమిషాల వరకూ పడుతుందని గ్రూమర్లు చెబుతున్నారు. తమ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారు మూడు నెలల పాటు శిక్షణ పొందుతారని జస్ట్ గ్రూమ్ నిర్వాహకులు అంటున్నారు.శునకాలు చూపే ఆప్యాయత ఎలా ఉంటుందో వాటి యజమానులకు మాత్రమే అర్థం అవుతుంది. అవి అలవాటైన మనుషులతో అల్లుకుపోతుంటాయి. కాబట్టి పెట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటికి మాత్రమే కాదు వాటి యజమా నులకు కూడా అత్యవసరం. రోజు వారీ స్నానం చేయించడం, నులిపురుగుల నిర్మూలన, జుట్టు కత్తిరించడం, పళ్లను పాలిష్ చేయడం, గోళ్లను కత్తిరించడం ఇలాంటివెన్నో చేయడం అవసరం. అయితే పెట్‌ను ఇంటికి తెచ్చుకున్నంత సులభం కాదు వాటికి ఈ సేవలన్నీ చేయడం.. ఇందుకు సమయంతో పాటు అనుభవం, నైపుణ్యం కూడా కావాలి. సరిగ్గా చేయలేకపోతే, అలర్జీలు ఇన్ఫెక్షన్లతో ఇంటిల్లిపాదికీ సమస్యలు తప్పవు.గ్రూమింగ్ దారి.. ఆర్గానిక్ మరి..నగరంలో ఇలాంటి పెట్ యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సేవలను అందించే వ్యక్తులు, సంస్థలు వచ్చాయి. వీటి మధ్య పోటీ తత్వం కూడా పెరిగింది. పెట్స్‌కు మసాజ్ చేయడం, బబుల్ బాత్ తదితర సదుపాయాలు మనుషుల స్పా మాదిరిగానే రొటీన్ భౌ¿ౌలకు కూడా విస్తరించాయి. వీటికి తూడో మరిన్ని వెరైటీలు కూడా జతయ్యాయి.అదిరే డ్రెస్సింగ్ స్టైల్.. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనబెట్టుకుపోవడం నామోషీ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అది పిల్లి అయినా కుక్కపిల్లయినా.. సరే దర్జాగా తమ పెట్ని కూడా వేడుకల్లో భాగం చేస్తున్నారు. పైగా అదే తమ స్టేటస్ సింబల్‌గానే భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్ లేదా ఫొటోషూట్‌కు తీసుకెళ్లాల్సి ఉంటే, తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్ చేయడం వంటివి కూడా పెట్ స్టైలిస్ట్స్ చేస్తున్నారు. అలాగే పిల్లులను పెంచుకునేవారికి వీరు సేవలు అందిస్తున్నారు.వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే..శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం అన్ని వేళలా సాధ్యం కాక చర్మవ్యాధులు వంటివి రావచ్చు. గ్రూమింగ్ లేకపోయినా ఆరోగ్య సమస్యలే. అందుకే నా పెట్‌కి నెలకోసారి స్పాలో స్నానం, మూడు నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. నెలవారీగా రూ.3వేలు ఖర్చు అవుతుంది. అయితే వ్యాధులు వస్తే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్తరలివచ్చి.. తళుకులద్దగ..గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని నగరంలో కొన్ని సంస్థలు తమ ఆవరణలో అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెట్స్‌ని గ్రూమింగ్ పార్లర్స్‌కు తీసుకెళ్లలేక పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్‌కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు వందకు పైగా మొబైల్ వ్యాన్లు ఈ పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నాయి. తమకు ఏడు వ్యాన్ల దాకా ఉన్నాయని, నగరవ్యాప్తంగా పెట్స్‌కు మొబైల్ స్పా సేవల్ని అందిస్తున్నాయని పెట్ గల్లీ సిబ్బంది సాక్షికి వివరించారు. జూబ్లీహిల్స్‌లోని పెట్ స్పాలో ప్రొఫెషనల్ గ్రూమర్ అయిన డి.సౌమ్య మాట్లాడుతూ, ‘ఇంతకుముందు, పెంపుడు జంతువును అలంకరించేందుకు ఇళ్లను సందర్శించేవాళ్లం. అయితే ఇళ్ల దగ్గరకు వెళ్లడం, అక్కడ సరైన ప్రైవసీ లేకపోవడం సహా అనేక రకాల ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోగ్రూమింగ్ వ్యాన్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారింది’ అని చెప్పారు.నగరానికి చెందిన ప్రొఫెషనల్ పెట్ కేర్ సంస్థ పెట్ఫోక్కు చెందిన నిపుణులైన గ్రూమర్ల బృందం ఇప్పుడు పెంపుడు జంతువులకు ఇంటి దగ్గరే వారి వస్త్రధారణ సేవలను సైతం అందజేస్తుంది, అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన వ్యాన్లను ఈ సంస్థ ఉపయోగిస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా, వెబ్ యాప్ మొబైల్ యాప్‌గా కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.మెకానికల్ ఇంజనీర్ బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన చైత్ర సాయి దాసరి ప్రారంభించిన డోర్‌స్టెప్ సర్వీస్ జస్ట్ గ్రూమ్. ‘పెంపుడు జంతువులకు రిలాక్సేషన్ ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చేసే గ్రూమింగ్ సరీ్వస్ అవసరం. వీటికి వస్త్రధారణ కేవలం సౌందర్య సాధనం కాదు. ఇది పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యానికి దారి కూడా. సరైన విధంగా లేని స్నానం చర్మ వ్యాధులు కలిగించి అవి వస్త్రధారణకు భయపడేలా చేస్తుంది’ అంటున్నారు చైత్ర. తమ జస్ట్ గ్రూమ్ ప్రస్తుతం జంటనగరాల వ్యాప్తంగా సంచరిస్తున్న తమ వ్యాన్స్ ద్వారా ప్రతిరోజూ కనీసం 50 పెట్స్‌కు సేవలు అందిస్తున్నారు. సొంత బిడ్డల్లాగే.. పెట్స్ కూడా..పెట్స్‌ను పెంచుకుంటున్న నగరవాసులు వాటిని సొంత పిల్లల్లాగే భావిస్తున్నారు. వాటి ఆరోగ్య సంరక్షణతో పాటు వాటికి అవసరమైన అన్ని రకాల అలంకరణలూ చేస్తున్నారు. తమతో పాటు వాటిని టూర్లు, షికార్లు, ఈవెంట్స్‌కు తీసుకువెళుతున్నారు. వీటన్నింటి వల్లే పెట్ గ్రూమింగ్ అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. పెట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఫ్‌ను నిత్యం సందర్శిస్తుంటారంటే.. పెట్స్ పట్ల యజమానుల ప్రేమను అర్థం చేసుకోవచ్చు. – రుచిర, పెట్ కేఫ్ నిర్వాహకులుఇవి చదవండి: Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..! -
రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు చేరే మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రధానంగా చాలా ఇళ్లల్లో కుక్కలు పెంచుతుంటారు. పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాడే క్యాస్టుమ్స్, వైద్యం.. ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతోంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.ఆరు వేలకోట్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మార్కెట్‌కు అవకాశమున్న కొన్ని విభాగాలుపెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి.పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి.కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు.స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు.యజమానులు, ఇంటికి ఇతరులతో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా ఆరు లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.రెండు వేలకోట్లుకు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 14% వృద్ధి చెందుతోంది. 2026 నాటికి దాదాపు రూ.ఆరు వేలకోట్లకు చేరుకుంటుందని అంచనా. -
హైదరాబాద్‌లో జీసీసీను ప్రారంభించిన యూఎస్ కంపెనీ
జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో సేవలందిస్తున్న జోయిటిస్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తోంది. ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. దాంతో స్థానికంగా యువతకు ఉపాధి లభిస్తోంది. జంతువుల ఆరోగ్య సంరక్షణ విభాగంలో తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కంపెనీలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాల కోసం స్థానిక యువతను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అన్నారు.జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ జోయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్‌కు అనువైన ప్రదేశమని భావిస్తున్నాం. భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు హైదరాబాద్ కీలకంగా మారనుంది. కాబట్టి కంపెనీ కార్యకలాపాలు ఇక్కడ విస్తరించాలని నిర్ణయించాం. సాంకేతిక ఆవిష్కరణలతో జంతు ఆరోగ్య సంరక్షణ అందించడం కంపెనీ ముఖ్య ఉద్దేశం. జంతువులకు డయాగ్నోసిస్, వైద్యం వంటి ప్రాథమిక సేవలందిస్తున్నాం. ఈ సౌకర్యాన్ని పెంపుడు జంతువుల యజమానులు, రైతులు, జంతు సంరక్షకులు వినియోగించుకోవాలి. అంతర్జాతీయంగా ఈ వ్యాపారం ఏటా 4-6 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో ఈ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. జంతు ఆరోగ్య సంరక్షణలో కొత్త టెక్నాలజీల ఆవిష్కరణల రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ) కోసం పెట్టుబడిని పెంచుతున్నాం. 2023లో ఇది 613 మిలియన్లకు(రూ.5,100 కోట్లు) చేరుకుంది’ అని చెప్పారు. సమీప భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ సాయంతో పరిశోధనలు చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని జోయిటిస్ ఇండియా కెపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా జంతువుల ఆరోగ్య సంరక్షణ మార్కెట్ విలువ రూ.7,824.5 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతంమేర వృద్ధి చెందింది. 2029 వరకు ఈ మార్కెట్ విలువ 1.89 బిలియన్ డాలర్ల(రూ.15,871 కోట్లు)కు చేరనుందని అంచనా. -
సోనియా గాంధీకి ‘నూరీ’ ఇష్టం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాందీకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? కుమారుడు రాహుల్ గాం«దీనా? లేక కుమార్తె ప్రియాంక గాందీనా? వీరిద్దరూ కాదు. బుజ్జి కుక్కపిల్ల ‘నూరీ’ అంటే సోనియాకు చాలా అభిమానం. ఈ విషయం రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించారు కాబట్టి మనం నమ్మక తప్పదు. జాక్ రస్సెల్ బ్రిటీష్ జాతికి చెందిన నూరీని బ్యాక్ప్యాకప్లో వీపుపై సోనియా కట్టుకున్న సరదా ఫోటోను రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. మామ్స్ ఫేవరేట్ అనే వ్యాఖ్య జోడించారు. తన తల్లికి కన్నబిడ్డల కంటే నూరీనే ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. ఇంట్లో నూరీని చాలా ముద్దు చేస్తుంటారని తెలిపారు. రాహుల్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. 24 గంటల వ్యవధిలో 7.81 లక్షల లైక్‌లు, 5,400 కామెంట్లు వచ్చాయి. నిజానికి కుక్కపిల్ల నూరీని రాహుల్ గతేడాది స్వయంగా సోనియాకు బహూకరించారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) అప్పటి నుంచి అది ఆమెకు ప్రీతిపాత్రమైపోయింది. సోనియా కుటుంబంలో ఇప్పుడు అందరికీ అదొక ముఖ్యమైన, ప్రియమైన సభ్యురాలు. ఉత్తర గోవాలోని మపూసా పట్టణంలో 2023 ఆగస్టులో నూరీని రాహుల్ గాంధీ తొలిసారిగా చూశారు. దానిపై ముచ్చటపడ్డారు. కొనుగోలు చేసి, తల్లికి బహూకరించి ఆశ్చర్యపరిచారు. సోనియా కుటుంబ సభ్యులకు జంతవులంటే చాలా ఆపేక్ష. వారి ఇంట్లో చాలాఏళ్లుగా పలు శునకాలు ఉన్నాయి. ‘పిడి’ అనే శునకం రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి చాలామంది అభిమానులున్నారు. -
Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!
అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కలు మృతి చెందితే వాటి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలా అని యజమానులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెంపుడు శునకాలు, ఇతర పెంపుడు జంతువులను ఖననం చేయడం, దహన సంస్కారాలు చేయడానికో స్థలం లేక నగరజంతు ప్రేమికులు నరకయాతన అనుభవిస్తున్నారు.అపార్ట్మెంట్, విల్లా కల్చర్ వచ్చాక పెంపుడు శునకాలను ఖననం చేసేందుకు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో జీహెచ్ఎంసీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఎవరైనా తమ ఇంట్లో పెంపుడు కుక్క మృతి చెందితే దానికి గౌరవప్రదంగా అంతిమయాత్ర నిర్వహించడం, అంతకుమించి మర్యాదపూర్వకమైన దహన సంస్కారాలు చేయడం అందుబాటులోకి వచ్చిది. ఆ వివరాలు తెలుసుకుందాం.. – బంజారాహిల్స్నగరంలో జంతు ప్రేమికులు చాలా మందే ఉన్నారు.. వారు అల్లారు ముద్దుగా పెంచుకున్న జంతువులు మృతి చెందితే తీసుకెళ్లి ఎక్కడో పడేయకుండా సంప్రదాయబద్ధంగా శునకాలు, ఇతర జంతువులకు కూడా దహన సంస్కారాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పీపుల్ ఫర్ ఎనిమల్స్(పీఎఫ్ఏ) సంయుక్తంగా డోర్ టూ టూర్ క్రిమేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. పెంపుడు జంతువుల యజమానులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి. ఇంటికే వచ్చి మృతి చెందిన శునకాన్నో, ఇతర పెంపుడు జంతువునో ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందుకోసం పీఎఫ్ఏ ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి పెట్ మృతదేహాన్ని ఫతుల్లాగూడలోని క్రిమేషన్‌కు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.2,500 దూరాన్ని బట్టి ఫీజుగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫతుల్లాగూడలో మాత్రమే అందుబాటులో ఉన్న పెట్ క్రిమేషన్ త్వరలోనే గాజుల రామారం, గోపన్‌పల్లిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.డిసెంబర్ 2022 నుంచే..ఫతుల్లాగూడలో ఈ సౌకర్యం 2022 డిసెంబర్ నుంచే అందుబాటులోకి వచ్చిది. చాలా మంది తమ ఇంట్లో కుక్కలు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ బాధపడుతుండటాన్ని గమనించిన పీఎఫ్ఏ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వలంటీర్లను కూడా నియమించింది.డయల్ చేయాల్సిన నంబర్లు.. జంతు ప్రేమికులు తమ ఇళ్లలో పెంపుడు శునకం మృతి చెందితే 73374 50643, 95055 37388 నంబర్‌కు ఫోన్ చేస్తే ప్రత్యేకంగా అలంకరించిన అంతిమయాత్ర వాహనంలో వలంటీర్లు క్రిమేషన్‌కు తీసుకెళ్తారు. దహన సంస్కారాల తర్వాత ఆ బూడిదను ప్రత్యేకంగా ఓ కుండీలో ఉంచి సంబంధిత యజమానులకు అందజేస్తారు. ఆ బూడిదను ఇళ్లలో ఉన్న మొక్కల వద్దకానీ, తమ స్వగ్రామాల్లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో ఉన్న మొక్కలు, చెట్ల వద్ద అయినా పూడ్చిపెడితే సరిపోతుందని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ త్వరలోనే ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో కూడా పెట్ క్రిమటోరియంలను నిర్మించే ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. ఒక్క ఫోన్ చేస్తే.. చాలు.. ఎక్కడైనా పెంపుడు జంతువు మృతి చెందిందని యజమానులు ఫోన్ చేయగానే ఆ వలంటీర్లు అక్కడ వాలిపోతారు. క్రిమటోరియంకు ఆ శునకాన్ని తీసుకొచ్చి పూలదండలు వేసి సంప్రదాయబద్ధంగా దహనం చేస్తాం. అనంతరం భస్మాన్ని కుండల్లో భద్రపరిచి యజమానులకు అందిస్తున్నాం. గ్యాస్‌తో నడుస్తున్న ఈ క్రిమటోరియం వల్ల ఎలాంటి కాలుష్యం వెలువడదు. ఎవరికీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఈ క్రిమటోరియం నిర్మించడం జరిగింది.– వాసంతి వాడి, ఫౌండర్ ప్రెసిడెంట్ పీఎఫ్ఏగ్యాస్తో నడిచే క్రిమటోరియం...ప్రస్తుతం ఫతుల్లాగూడలో అనంతయాత్ర పేరుతో పెట్ క్రిమటోరియంను నిర్వహిస్తున్నాం. త్వరలో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రతి నెలా 25 వరకూ శునకాలకు మర్యాదపూర్వకమైన, సంప్రదాయబద్ధ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. మా వద్ద ఇందుకోసం అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాం. 14 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వలంటీర్లు కూడా అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్‌తో ఈ క్రిమటోరియం నిర్వహిస్తున్నాం. ఇకో ఫ్రెండ్లీ క్రిమటోరియంను నడిపిస్తున్నాం.– దత్తాత్రేయ జోషి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పీఎఫ్ఏరూ.80 లక్షలతో మహదేవ్‌పురం పెట్ క్రిమటోరియం..కూకట్పల్లి సమీపంలోని మహదేవ్‌పురం సిక్ బస్తీ దగ్గర రూ.80 లక్షల వ్యయంతో పెట్ క్రిమటోరియం నిర్మించారు. ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఏ ఎన్జీవోకు ఇవ్వాలన్నదానిపై టెండర్ పిలుస్తారు. ఇది అందుబాటులోకి వస్తే చాలా మంది జంతు ప్రేమికులకు తమ ఇంట్లో చనిపోయే పెంపుడు కుక్కల దహన సంస్కారాలు గౌరవ ప్రదమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది.– డాక్టర్ ఎ.లింగస్వామి, వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ -
మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్ టిప్
ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ సంరక్షణ ఇవన్నీ యజమాని బాధ్యత. పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం, మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.Tip for giving medication to dogs, dip the syringe in something they like 📹 igotthissitpic.twitter.com/6yCsPxmIMR— Science girl (@gunsnrosesgirl3) June 10, 2024ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్ వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్ చెక్-అప్లు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి. అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు ఒక పెద్ద టాస్క్అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు. మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్ నెట్లో ఆసక్తికరంగా మారింది. చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్ చేసినట్టే.. పెట్స్‌కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో మీరూ చూసేయండి. -
కోట్లల్లో పెరిగిపోతున్న పెట్ డాగ్స్ ఇండస్ట్రీ..
పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ భారత్‌లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్ పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్ కోసం ఫుడ్, ట్రీట్మెంట్ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక పిల్లుల్లో 2% వాటికి మాత్రమే బ్రాండెడ్ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్ సెలూన్లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్ డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్లు, డాగ్ సిట్టర్లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్లు, నోబిల్ ట్రీట్మెంట్ వ్యాన్లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు ఉన్నాయి. TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్‌లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. -
వచ్చే రెండేళ్లలో పెంపుడు శునకాల మార్కెట్ ఎంతంటే..
ఇంటికి వెళ్లగానే బుజ్జి అడుగులతో ప్రేమగా మీదకు దూకే చిన్న కుక్కపిల్లని చూడగానే అప్పటివరకూ పడిన శ్రమ అంతా మర్చిపోతాం. అందుకే వాటికి అచ్చం మనుషుల్లానే చూసుకుంటాం. ఎంత టెన్షన్లో ఉన్నా వాటిని చూడగానే ఆంతా ఆవిరైపోతుంది. అయితే పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాటికి వాడే క్యాస్టుమ్స్, వైద్యం..ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతుంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.6వేల కోట్లు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి. పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి. కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు. స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు. యజమానులు, ఇంటికి వచ్చేవారితో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదీ చదవండి: 25 ఏళ్లలో తొలిసారి.. చైనాలో ఏం జరుగుతుందంటే దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా 6లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.2వేలకోట్లు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 13.9% వృద్ధి చెందుతోంది. 2025 నాటికి దాదాపు రూ.6వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పెట్‌డాగ్స్ సంఖ్య ఈ కింది విధంగా ఉంది. Top 10 countries with the most pet dogs#PetDogs #DogLovers #CanineCompanions pic.twitter.com/YNicdDGUx7 — Global Ranking (@Top1Rating) October 13, 2023 -
లిఫ్ట్‌లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్‌లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్‌లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
పంజరం నుంచి ఎగిరిపోయిన ఆస్ట్రేలియా జాతి గాలా కాక్టో
హైదరాబాద్: తాను ఎంతో ఇష్టంగా విదేశాల నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్న అరుదైన చిలుక కనిపించకపోవడంతో యజమాని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక రోజు వ్యవధిలోనే ఆ చిలుకను గుర్తించి యజమానికి అప్పగించారు. ఎస్ఐ ఎంఎం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ రోడ్ నెం.44(ఏ)లో నరేంద్రచారి మైరు బిస్ట్రో కాఫీ షాపును నడిపిస్తున్నాడు. ఆయనకు పక్షులంటే మహా ప్రాణం. ఆస్ట్రేలియా జాతికి చెందిన గాలా కాక్టో అనే చిలుకను అక్కడి నుంచే తెప్పించుకొని అపురూపంగా పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల ఈ చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. దీంతో తన చిలుక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దాని ఫొటోను కూడా అందించాడు. నాలుగు నెలల వయసున్న ఈ చిలుక ఖరీదు రూ.1.30 లక్షలుగా యజమాని తెలిపాడు. ఎక్సోటిక్ బర్డ్‌గా గుర్తింపు పొందిన ఈ చిలుకను తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని, దీనికి లైసెన్స్ కూడా ఉందని రెండు కాళ్లకు ఆ దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రెండు రింగులు కూడా ఉంటాయని వెల్లడించారు. ఎస్ఐ ఈ చిలుక ఫొటోలను జూబ్లీహిల్స్‌లోని పెట్షాప్స్కు పంపించారు. ఎవరైనా ఈ చిలుకను అమ్మితే వారి వివరాలు తెలపాల్సిందిగా సూచించారు. ఓ వ్యక్తి ఈ చిలుకను ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ మూడు రోజుల క్రితం ఎర్రగడ్డలో రూ.30 వేలకు ఓ పక్షి ప్రేమికుడికి విక్రయించాడు. అదే వ్యక్తి ఆ తెల్లవారి రూ.50 వేలకు సయ్యద్ ముజాహిద్‌కు అక్కడే విక్రయించాడు. ఈ చిలుకను కొనుగోలు చేసిన ముజాహిద్ తన వద్ద ఖరీదైన, అరుదైన గాలా కాక్టో ఆస్ట్రేలియన్ జాతి చిలుక ఉందని రూ.70 వేలకు విక్రయిస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ పెట్‌షాప్ నిర్వాహకుడు ఈ స్టేటస్ చూసి జూబ్లీహిల్స్ ఎస్ఐకి సమాచారం ఇచ్చాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి స్టేషన్‌కు రప్పించడమే కాకుండా తన దగ్గర బంధీగా ఉన్న చిలుకను యజమాని నరేంద్రాచారికి అప్పగించారు. దాదాపు ఇక దొరకదేమో అనుకున్న తన పెంపుడు చిలుక కనిపించేసరికి నరేంద్రాచారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కష్టపడి చిలుకను పట్టుకొని అప్పగించినందుకు పోలీసులకు కతజ్ఞతలు తెలిపారు. -
తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!
మిషిగన్: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు. అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్ హార్న్‌కు చెందిన థియా చేజ్ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆల్ టెర్రయిన్ వెహికిల్(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. -
ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న రామ్‌చరణ్ - రైమ్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు పెట్ డాగ్ రైమ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. . రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ రైమ్ మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు. రైమ్ లేకుంటే అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు ఈ స్టార్ దంపతులు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్ ఉండాల్సిందే. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్ ఉండాల్సిందే. రైమ్ పేరు మీద ఏకంగా ఒక ఇన్‌స్టా అకౌంటే క్రియేట్ చేశారు. దాదాపు 50 వేల ఫాలోయర్స్ రైమ్కు ఉండటం విశేషం. ఇక నేషనల్ పెట్ డే సందర్భంగా రైమ్ మీద నెటిజన్స్ స్పెషల్ ఫోకస్‌పెట్టారు. రామ్ చరణ్, రైమ్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇతర నగరాలకు వెళ్లిన రామ్ చరణ్..తిరిగి వచ్చే క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రైమ్ ఎదురెళ్లి రామ్ వెల్కమ్ చెప్పి తన ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. రామ్ - రైమ్ ఇద్దరి మధ్య బాండింగ్ అభిమానులకు, ఫాలోవర్స్‌కు స్ఫెషల్‌గా అనిపించింది. -
కొత్త సీఈవో అంటూ మస్క్ ట్వీట్: ‘ఇక ఇదే ఆఖరు’ చెత్త ఫోటోలపై యూజర్లు ఫైర్
న్యూఢిల్లీ: బిలియనీర్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి 'న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్' అని పేర్కొన్నారు. అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్.. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్‌ను అవమానించేలా వరుస ట్విట్లలో కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్టయిలిష్‌గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్‌లో క్రేజీ లుక్స్‌తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్‌టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కమెంట్ చేశాడు కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్‌పై ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. ఇక ఇదే ఆఖరు.. అధికారికంగా ట్విటర్ నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఒకరు, ఈ పోస్ట్ ఇబ్బందికరమైన, స్త్రీద్వేషపూరిత చిత్రమని మరొకరు పేర్కొన్నారు ."మీరిలా చేస్తారని నమ్మలేక పోతున్నాను", మరొకరు, "మీ మీమ్స్ చాలా పేలవంగా ఉన్నాయని మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్లాక్మస్క్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. pic.twitter.com/iZUukCVrl5 — Elon Musk (@elonmusk) February 14, 2023 -
సందడిగా పెట్ గ్రూమింగ్ వ్యాన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
మూగనేస్తాలు.. మౌనభావాలు..
మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. పక్క పక్కనే ఇళ్లు ఉంటున్నా.. అంటీముట్టనట్లుగా ఉండటం పరిపాటిగా మారింది. మనసు విప్పి మాట్లాడుకోవటం మాని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సావాసం చేయడం అధికమైంది. పల్లెటూళ్లలో కాస్త కలివిడితనం ఉంటున్నా.. పట్టణాల్లోని కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవనం సాగుతోంది. ఈ కోవలో ఏదో కోల్పోయిన భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మూగజీవాలతో స్నేహం కాస్త ఊరటనిస్తోంది. మాటలు రాకపోయినా మనసుకు దగ్గరయ్యే స్వభావం ప్రశాంతత చేకూరుస్తోంది. – పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు/కర్నూలు డెస్క్ చెట్టుపై నిద్రపోయిన పక్షులన్నీ తెల్లారింది లెవండోయ్ అన్నట్లు ఒక్కసారిగా పైకి లేచి ఆహార వేటకు పయనమవడం.. గంప కింద కోడి కొక్కొరొక్కోమని మేల్కొలపడం.. పిడికెడంత కూడా లేని పిచుకలు కీచుకీచుమంటూ ఇంటి ముందు వాలి గింజల కోసం వెతుకులాడటం.. పెంపుడు కుక్కలు యజమాని వెంట పొలం బాట పట్టడం.. పశువులు పొలం పనులకు సిద్ధమవడం.. ఇదీ పల్లె జీవనం. మనిషి జీవితంలో ఈ మూగప్రాణాలు ఓ భాగం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ వీటితో అనుబంధం క్రమంగా తగ్గిపోతోంది. యాంత్రిక జీవనంలో మునిగితేలుతూ మానసిక ఆనందాన్ని కోల్పోతున్న వేళ ఇప్పుడిప్పుడే మూగ ప్రాణుల మీద మమకారం పెరుగుతోంది. డబ్బు పోయినా పర్వాలేదు.. మనసు విప్పి మాట్లాడితే మనసుకు సాంత్వన లభిస్తుందనే అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న ఖలీల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి చిన్నప్పటి నుంచి మూగజీవాలంటే ప్రాణం. మొదట కుక్కలు, పిల్లులతో సావాసం చేసినా, ఐదేళ్లుగా పక్షులను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. సాధారణంగా ఒకటో, రెండో పక్షులను ఓ చిన్న కేజ్‌లో బంధించి అమితమైన ప్రేమను చూపడం సహజం. ఇందుకోసం వెచ్చించే డబ్బు కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే ఇతను తన ఇంటి ఆవరణనే పెద్ద బోనుగా మలచడం విశేషం. పక్షుల స్వేచ్ఛా విహంగానికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ బోనుకు చేసిన వ్యయం అక్షరాలా రూ.3లక్షల పైమాటే. ఇక ఈ ఐదేళ్లలో అతను పెంచుతున్న పక్షుల ఖరీదు రూ.7లక్షల పైనే కావడం చూస్తే ఆ మూగ ప్రాణులు అతని జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తోంది. ఇంతే కాదు.. ప్రతినెలా వీటికి చేస్తున్న ఖర్చు రూ.5వేల వరకు ఉంటోంది. కింద పడితే తినవు.. డబ్బు విలువ పెరుగుతున్న కొద్దీ ఆహారం దొరకడం కూడా కష్టతరమవుతోంది. నిరుపేదలు ఇప్పటికీ దుర్భర జీవనం గడపటం చూస్తున్నాం. కొందరికి డబ్బు ఎక్కువై ఆహార పదార్థాలను వీధులపాలు చేస్తే.. ఇప్పటికీ ఆ విస్తర్లకేసి చూసే జనం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్ని పక్షుల విషయానికొస్తే.. కింద పడిన గింజలను ముట్టుకోవంటే ఆశ్చర్యమేస్తుంది. యజమాని ఎంతో ఇష్టంగా వాటి నోటికి అందించే దేనినైనా తినే ఈ పక్షులు, నోరు జారితే వాటికేసి కూడా చూడకపోవడం వింతేమరి. కుటుంబ సభ్యుల్లానే.. పక్షుల పెంపకం కుటుంబంలో భాగమవుతోంది. వీటి పెంపకం కాస్త కష్టమే అయినా ఇష్టాన్నిపెంచుకుంటే కుటుంబ సభ్యుల తరహాలోనే దగ్గరవుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొద్దిసేపు పక్షులతో గడిపితే మానసిక ఆనందం లభిస్తుందని పక్షుల ప్రేమికులు చెబుతున్నారు. ఇక ఉదయాన్నే పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలు సైతం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వీటిపై అమితమైన ప్రేమను చూపుతూ స్నేహితుల్లా భావిస్తుండటం విశేషం. కదలికలు పసిగట్టి.. బాధ తెలుసుకొని పక్షుల పెంపకం కత్తి మీద సాములాంటిదే. వాటితో ఎంత అభిమానం పెంచుకుంటే అంత దగ్గరవుతాయి. కొన్నాం.. తెచ్చుకున్నాం.. అని కాకుండా, ప్రతి రోజూ వాటితో కొంత సమయం గడిపినప్పుడే ఏం తింటున్నాయి, ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలు తెలుస్తాయి. ముందు రోజు వేసిన ఆహారం తినకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నట్లుగా గుర్తిస్తారు. లేదా కదలికలు రోజులాగా ఉండకపోయినా ఏదో బాధలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ మేరకు వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం వీటికి వ్యాక్సినేషన్ చేయిస్తే ఆరోగ్యంగా ఉంటాయని యజమానులు చెబుతున్నారు. పెరుగుతున్న పక్షుల విక్రయ వ్యాపారం మారుతున్న ప్రజల అభిరుచి వ్యాపార పరంగానూ అభివృద్ధి చెందుతోంది. అక్వేరియంలతో పాటు వివిధ రకాల పక్షులు, కుందేళ్ల విక్రయ దుకాణాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దుకాణాల్లో పక్షులను ఉంచేందుకు రంగురంగుల పంజరాలు ఉంటున్నాయి. వీటికి అవసరమైన ఆహారాన్ని కూడా యజమానులు దుకాణాల్లోనే విక్రయిస్తున్నారు. పక్షుల పెంపకానికి అవసరమైన సామగ్రిని చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. తాబేళ్లలో వివిధ రకాలు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లు, గోల్డ్ రంగు తాబేలు, గ్రీన్ తాబేళ్లు తదితరాలు. వీటిలో గ్రీన్ తాబేలు అమ్మడానికి, పెంచడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో ఈ తాబేళ్లు కనిపిస్తున్నాయి. వీటి ధర రూ. 500 నుంచి రూ.2 వేల వరకు ఉంటోంది. దీపావళి అంటే దడ పక్షులకు దీపావళి వస్తే దడ. టపాసుల శబ్దాలకు బెంబేలెత్తుతాయి. కొన్ని పెంపుడు పక్షులు ఆ శబ్దాలకు హార్ట్ స్ట్రోక్‌కు గురవుతాయి. దీపావళి సమయంలో వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తప్పవని యజమానులు చెబుతున్నారు. వాటితో గడిపితే సమయమే తెలియదు మనిషికి కష్టం వస్తే మాటల్లో చెప్పుకోగలం. పక్షులు తమ బాధను చెప్పుకోలేవు. మనమే అర్థం చేసుకోవాలి. ఉదయం లేవగానే వాటి వద్దకు వెళ్లడం, వాటి బాగోగులను పరిశీలించడం.. స్నేహంగా మెలగడం నా దినచర్యలో భాగమైంది. కనీసం ఓ గంట వాటితో ఉంటే ఏదో తెలియని ఆనందం నాలో కలుగుతుంది. కొత్త వ్యక్తులు వీటి దగ్గరకు వస్తే పెద్ద శబ్దాలు చేస్తూ అటూఇటూ ఎగురుతుంటాయి. నేను కనిపించగానే ఎంతో ప్రేమతో నా మీద వాలిపోతాయి. మనుషుల్లో మానవత్వం లోపిస్తున్న వేళ ఇలాంటి మూగప్రాణులు ఎంతో ప్రేమను కురిపిస్తాయి. ఎంత డబ్బిస్తే ఈ ఆనందాన్ని కొనగలం. – ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, కృష్ణానగర్, కర్నూలు పావురాల పెంపకం ఎంతో ఇష్టం చిన్నతనం నుంచి పావురలంటే అమితమైన ఇష్టం. మొదట్లో నా వద్ద 10 పావురాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎనిమిది రకాలు, వందకు పైగా పావురాలు ఉన్నాయి. ఇంటికి సమీపంలో ఓ షెడ్ ఏర్పాటు చేసుకొని పెంచుతున్నా. రేసింగ్ హ్యూమర్ పావురం ఖరీదు జత రూ.5వేల వరకు ఉంటోంది. 100, 1000 కిలోమీటర్ల పోటీల్లోనూ నా పావురాలు పాల్గొంటాయి. బెట్టింగ్ కాకుండా పావురాల్లోని సత్తా చాటేందుకు పోటీలకు వెళ్తుంటాం. – షేక్ ఇబ్రహీం, కింగ్‌మార్కెట్, కర్నూలు ఇంట్లో మనిషిగానే.. మా ఇంట్లో ఐదుగురం ఉంటాం. రెండేళ్ల క్రితం రూ.10వేలతో రెండు పిల్లులను కొనుగోలు చేశాం. వీటిని ముద్దుగా మిన్నూ అని పిలుచుకుంటాం. ఇంట్లో మనిíÙలాగా మారిపోయాయి. బయటకు వెళ్లి నా కొద్దిసేపటికే ఇంటికి చేరుకుంటాయి. వీటి ఖర్చు నెలకు సుమారు రూ.4వేల వరకు ఉంటుంది. వీటి ద్వారా మానసిక ఆనందం లభిస్తోంది. – ఇర్ఫాన్, కొత్తపేట, కర్నూలు ఆదరణ బాగుంది నగరంలో పెంపుడు జంతువులు, పక్షులకు ఆదరణ బాగుంది. ఉన్నతశ్రేణి కుటుంబాల్లో వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. ఇంట్లో బిడ్డల్లా వీటిని ఆదరిస్తుంటారు. పెంపుడు శునకాలతో పాటు పిచ్చుకలు, పలురకాల పక్షులు, కుందేళ్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎక్కువగా ఇళ్లల్లో అక్వేరియం వుండేందుకు ఇష్టపడుతున్నారు. వివిధరకాల చేపపిల్లలు అందుబాటులో వున్నాయి. బళ్లారి, మైసూర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. అభిరుచికి తగ్గట్టు ఖరీదైన పక్షులు, చేపలను పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపారం సంతృప్తి్తకరంగా వుంది. – మహబూబ్, దుకాణ యజమాని, కర్నూలు. -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్
మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్ స్టోర్స్ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్ క్లాస్ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేడు నంబర్ వన్ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’ దేశవ్యాప్తంగా 75 రిటైల్ స్టోర్స్‌తో 30 పెట్ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్ పరిచయం. ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’కు ఫౌండర్. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్. ‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని, కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి. మొదటి స్టోర్ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్.ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్ డాగ్‌లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి. కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి. సుదీర్ఘ విరామం తర్వాత... ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్ చేయడంతో రాశి తన స్టోర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్ ఓన్లీ స్టోర్’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్ ఫర్ టెయిల్స్’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్‌కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు. -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్‌లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్‌లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
స్మార్ట్ పెట్డ్రైయర్..కుక్క పిల్లలు దర్జాగా కూర్చోవచ్చు!
పిల్లులను, కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా. అయితే, వాటిని పెంచుకోవడం అంత తేలికైన పని కాదు. వేళకు వాటికి అన్ని సేవలూ చెయ్యాలి. ముఖ్యంగా వాటికి స్నానం చేయించడం పెద్ద ప్రహసనమే! స్నానం చేయించాక, వాటిని తువ్వాలుతో తుడిచేస్తే తేలికగా ఆరిపోవు. ఒంటినిండా రోమాలతో ఉండే పెంపుడు జంతువులను స్నానం తర్వాత పొడిగా తయారు చేయడానికి కొందరు సాధారణ హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. హెయిర్ డ్రైయర్ల నుంచి వెలువడే శబ్దానికి పెంపుడు జంతువులు బెదిరిపోతాయి. ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు ఎలాంటి సమస్య లేనివిధంగా ఉపయోగపడే స్మార్ట్ పెట్డ్రైయర్ అందుబాటులోకి వచ్చింది. ఘనాకారంలో డబ్బా మాదిరిగా ఉండే ఈ డ్రైయర్‌లో పిల్లులు, కుక్కపిల్లలు సుఖంగా కూర్చునేందుకు తగిన చోటు ఉంటుంది. ఇందులో అన్ని వైపుల నుంచి వెలువడే వెచ్చని గాలికి అవి ఇట్టే పొడారిపోతాయి. ‘డ్రైబో ప్లస్’ పేరిట దొరుకుతున్న ఈ స్మార్ట్ పెట్డ్రైయర్ ధర సైజును బట్టి 599–749 డాలర్లు (సుమారు రూ.50 వేల నుంచి 62 వేలు) ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. -
ఖరీదైనా పెంచుకుంటున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుక్క, పిల్లి, పక్షి.. పెంపుడు జంతువు ఏదైనా వీటి మీద మనుషులకు ఉన్న ప్రేమ పెట్ కేర్ రంగ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. భారత్‌లో పెంపుడు జంతువుల సంరక్షణ (పెట్ కేర్) విపణి రూ.8,000 కోట్లుంది. ఇందులో సగం వాటా పెట్ ఫుడ్ కైవసం చేసుకుంది. మిగిలిన వాటా భద్రత, పోషణ, వ్యాయామం, వైద్య సంరక్షణ వంటి సేవలు దక్కించుకున్నాయి. కోవిడ్–19 మహమ్మారి పుణ్యమా అని ఒత్తిడి, నిరాశ నుంచి బయటపడేందుకు పెంపుడు జంతువులను పెంచుకునే ట్రెండ్ అధికం అయింది. ఈ నేపథ్యంలో 2025 నాటికి పరిశ్రమ రూ.10,000 కోట్లను దాటుతుందని అంచనా. దేశవ్యాప్తంగా 3 కోట్ల పైచిలుకు పెంపుడు జంతువులు ఉన్నట్టు సమాచారం. వీటి సంఖ్య ఏటా 11% పెరుగుతోంది. పోటీలో దిగ్గజాలు.. పెట్ ఫుడ్ విభాగం ఏటా 20 శాతం వృద్ధి చెందుతోందని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెబుతోంది. పెట్ కేర్ రంగంలో మార్స్ పెట్‌కేర్, హిమాలయ వెల్నెస్ కంపెనీలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ప్యూరినా పెట్‌కేర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా నెస్లే ఈ రంగంలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. క్యానిస్ లుపస్ సర్వీసెస్ ఇండియాలో పెట్టుబడి చేస్తున్నట్టు ఇమామీ ప్రకటించింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెట్ కేర్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని మార్స్ పెట్‌కేర్ ఎండీ సలీల్ మూర్తి తెలిపారు. పెడిగ్రీ, విస్కాస్ వంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న మార్స్ పెట్‌కేర్ హైదరాబాద్ ప్లాంటు విస్తరణకు రూ.500 కోట్ల పెట్టుబడి చేస్తోంది. కాస్మోస్ ఫిల్మ్స్ జిగ్లీ బ్రాండ్‌తో ఈ రంగంలో అడుగుపెట్టింది. లక్షలు వెచ్చిస్తున్నారు.. పెంపుడు జంతువుల కొనుగోళ్ల విషయంలో భారత్‌లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. పెట్స్‌లో కుక్కల వాటా అత్యధికంగా 75 శాతం ఉంది. పిల్లులు 15 శాతం, పక్షులు 10 శాతం వాటా కైవసం చేసుకున్నాయని సమాచారం. షిడ్జూ కుక్క పిల్ల, ఆస్ట్రేలియన్ కాకటియెల్ పక్షులకు డిమాండ్ ఎక్కువ. రంగు రంగుల్లో లభించే పక్షుల అమ్మకాలే అధికం. బ్లూ–గోల్డ్ మకావ్ చిలుకలు రూ.2 లక్షల నుంచి, స్కార్లెట్ మకావ్ రూ.18 లక్షల వరకు లభిస్తాయి. ఒక మీటర్ దాకా పొడవు ఉండే హయసింత్ మకావ్ ఖరీదు రూ.40 లక్షల వరకు ఉంది. సవన్నా పిల్లుల జతకు బెంగళూరులో ఓ కస్టమర్ రూ.50 లక్షలు, మరో కస్టమర్ కొరియన్ మాస్టిఫ్ కుక్కకు రూ.1 కోటి వెచ్చించారని అమ్మూస్ పెట్స్, కెన్నెల్స్ ఫౌండర్ మహమ్మద్ మొయినుద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘విదేశాల నుంచి పెట్స్ దిగుమతిపై నిషేధం ఉంది. దేశీయంగానే వీటిని పెంచుతున్నారు. కోవిడ్ సమయంలో డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడి వీటి ధరలు రెండింతలయ్యాయి. రంగు, ఆకారం, ఆరోగ్య స్థితినిబట్టి ధర నిర్ణయం అవుతోంది’ అని తెలిపారు. సెలబ్రిటీల్లో క్రికెటర్ యూసుఫ్ పఠాన్, సినీ నటుడు రామ్‌చరణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెట్స్ ప్రేమికుల జాబితా పెద్దదే. -
పెట్ ఈజ్ బ్యూటీఫుల్
సాక్షి, అమరావతి: పెంపుడు జంతువుల సౌందర్యం, ఆరోగ్య సంరక్షణలో పెట్ స్పాలు కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కాస్మోపాలిటిన్ నగరాలకే పరిమితమైన పెట్ గ్రూమింగ్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. విజయవాడ, గుం టూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు.. ఇంటివద్దకే గ్రూమింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సైజును బట్టి ఫీజు గతంలో ఇష్టంగా పెంచుకునే జంతువులకు ఆరో గ్యం బాగోకపోతే వెటర్నరీ ఆస్పత్రులకు పరుగెత్తే యజమానులు.. ఇప్పుడు అలాంటి సమస్యలు రా కుండా ముందస్తుగా పెట్ గ్రూమింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో పెట్ సైజును బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి మాత్రమే అయితే రూ.500 నుంచి రూ.1,900 వరకు, నెలవారీ ప్యా కేజీ రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు రేట్లు నిర్ణయించారు. కేవలం బొచ్చు కత్తిరించేందుకే రూ.600 నుంచి రూ.1,900 తీసుకుంటున్నారు. రూ.4 వేల నుంచి రూ.30 వేల ఖర్చు దేశంలో సగటున యజమానులు ఒక్కో పెంపుడు జంతువుపై (జాతిని బట్టి) నెలకు రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. వీటిలో షాంపూలు, కండిషనర్లు, అలంకరణ ఉత్పత్తులపై 50 శాతం ఖర్చు చేస్తుండగా మిగిలినది ఆహారం, దువ్వెనలు, బ్రష్‌లు, ట్రిమ్మింగ్ పరికరాల కోసం వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న జంతు ప్రేమికులు పెరుగుతున్న చిన్న కుటుంబాలు, రెట్టింపు ఆదా యం, జీవనశైలి మార్పులతో ప్రతి ఒక్కరు జంతువుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ప్రథమస్థానంలో శునకాలు ఉండగా తర్వాతి స్థా నంలో పిల్లులున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలకు మాత్రమే పరిమితమైన పిల్లుల పెంపకం ఇక్కడ చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. ఓ సర్వే ప్రకారం దేశంలో దాదాపు మూడుకోట్ల పెంపుడు కుక్కలున్నాయి. ఏటా ఆరులక్షల కుక్కలను దత్తత తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లో ప్రతి 10 మందిలో ఆరుగురు పెంపుడు జంతువుల యజమానులుగా ఉం టున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతా ల్లోనే 30 వేల పెంపుడు కుక్కలుండటం గమనార్హం. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి పెట్ గ్రూమింగ్ సేవలకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. మాకు రాష్ట్రవ్యాప్తంగా 12 వరకు పెట్ కేర్ స్టోర్స్ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, న గరాల్లో పెట్ గ్రూమింగ్ తెలిసిన వారికి మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో గ్రూమింగ్ కోర్సు చేసేందుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. – మృణాళిని, పెట్ కేర్ సెంటర్ యజమాని -
‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పోతుంది. ఇక పుష్ప చిత్రంతో రాత్రికి రాత్రే పాన్ స్టార్డమ్ తెచ్చుకున్న ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో ఆమెకు నార్త్ నుంచి సౌత్‌గా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవల తన సినిమా షూటింగ్లో భాగంగా నిర్మాతలను రష్మిక ఇబ్బంది పెట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం! షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి రష్మిక పయణించాల్సి ఉండగా తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా ప్లైట్ టికెట్స్ బుక్ చేయాలని ఆమె డిమాండ్ చేసిందని పలు వెబ్సైట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కాస్తా రష్మిక కంటపడ్డాయి. దీంతో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ట్విట్ర్లో షేర్ చేసి సదరు వార్తలను కొట్టిపారేసింది. ఈ మేరకు రష్మిక ట్వీట్ చేస్తూ.. ‘హే.. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారలో అర్థం కాదు. ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో కలిసి పయణించాలని మీకు ఉన్న. తనకు మాత్రం నాతో ట్రావెల్ చేయడం అసలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్‌లోనే హ్యాపీ ఉంటుంది’ అంటూ పడిపడి నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం ఆ తర్వాత మరో ట్వీట్లో ‘క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా’ అంటూ కామెంట్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక రష్మిక ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇది మాత్రమే కాదు మేడం.. ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని అన్నాడు. అతడికి కామెంట్స్‌పై రష్మిక ‘ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నాకు తెలియజేయండి ప్లీజ్’ అని చెప్పింది. కాగా ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో రణ్‌బీర్ సరసన ఎనిమల్ మూవీతో పాటు వంశీపైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వరిసు(వారసుడు) చిత్రాలతో బిజీ ఉంది. -
‘ఉక్రెయిన్ నుంచి రాలేను.. నా ప్రాణం కంటే చిరుత పులుల ప్రాణాలే ముఖ్యం’
Indian Doctor Refuses To Leave Ukraine: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి కారణంగా వేలాదిమంది ఉక్రెయిన్ వాసుల, విదేశీయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలసల బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా సాయంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను, విద్యార్థులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తోంది. ఇప్పటికే చాలా మంది పౌరులను తరలించింది కూడా. ఈ క్రమంలో కొంతమంది బంకర్ల ఉన్నాముంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విదేశాంగ కార్యాలయం రష్యాతో సంప్రదింపుల జరిపి వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో చిక్కుకున్నాడు. ఆయన మెడిసిన్ చదవడానికి 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ తర్వాత డాన్‌బాస్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నారు. అయితే అతని వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయి. అయితే వాటిని వదిలి తాను రాలేనని అంటున్నాడు. తన ప్రాణం కోసం పెంపుడు జంతువులను వదులుకోలేను అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను తన పులులతో కలిసి బంకర్లలో తలదాచుకుంటున్నాడు. వాటి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నాడు. అంతేకాదు తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాని డాక్టర్ పాటిల్ చెప్పారు. ఇలాగే గత వారం, భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతివ్వాలని అభ్యర్థించాడు. దీంతో అతను కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆపరేషన్ గంగా సాయంతో తన పెంపుడు కుక్కతో సహా భారత్‌కి సురక్షితంగా తిరిగి వచ్చాడు. (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో) -
పెంపుడు జంతువులను తీసుకోచ్చేందుకు కేంద్రం అనుమతి
-
నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్ విడిచి రాను!: భారతీయ విద్యార్థి
Please Help Indian Student Stranded With Pet Dog: యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి తన పెంపుడు కుక్క లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించాడు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్‌లో చదువుతున్న రిషబ్ కౌశిక్ విమానంలో తనతోపాటు కుక్కపిల్ల కూడా వచ్చేలా అన్ని అర్హత పత్రాలను సంపాదించేందుకు ప్రయత్నించానని చెప్పాడు. మరిన్ని పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే వాళ్లు తనను కొట్టారని చెబుతున్నాడు. పైగా విమాన టికెట్టు అడుగుతున్నారని అన్నాడు. అయినా ఉక్రెయిన్ గగనతలం మూసివేసినపుడు తాను విమాన టిక్కెట్ ఎలా పొందగలను అని ప్రశ్నిస్తున్నాడు. కౌశిక్ ఢిల్లీలోని భారత ప్రభుత్వ యానిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీస్ (ఏక్యూసీఎస్)ని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయానని చెప్పాడు. ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ఒకరికి కాల్ చేస్తే వారు తనని దుర్భాషలాడారని చెబుతున్నాడు. గత ఫిబ్రవరిలో ఖార్కివ్‌లో తనకు 'మాలిబు' అనే రెస్క్యూ కుక్కపిల్ల లభించిందని చెప్పాడు. కౌశిక్ రాజధాని కైవ్‌లోని ఒక బంకర్లో దాక్కున్నానని బాంబుల మోత, తుపాకుల మోతతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నానని అన్నాడు. "మీకు వీలైతే, దయచేసి మాకు సహాయం చేయండి. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా మాకు సహాయం చేయడం లేదు. నాకు ఎవరి నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు " అని అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
పెంపుడు కుక్కకు బర్త్‌డే పార్టీ... లాకప్‌లో యజమానులు
అహ్మదాబాద్: ముచ్చట పడి పెంచుకున్న కుక్కకు ఘనంగా పుట్టినరోజు చేయాలనుకున్నారు. బంధుమిత్రులను పిలిచి కేక్ కట్ చేసి హంగామా చేశారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ పటేల్, ఉర్విష్ పటేల్‌లు సోదరులు. క్రిష్ణానగర్ ప్రాంత వాసులు. శుక్రవారం రాత్రి తమ ఫ్లాట్‌లో అబ్బీ (కుక్క పేరు... ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందినది)కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. జానపద గాయకుడితో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో అతిథులు హాజరుకావడంతో కోవిడ్–19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన వీరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి చిరాగ్, ఉర్విష్లపై కేసు కట్టి అరెస్టు చేశారు. దగ్గరుండి పార్టీ ఏర్పాట్లు చూసిన వీరి మిత్రుడు దివ్వేశ్ మెహారియాను జైల్లో వేశారు. -
హ్యాట్సాఫ్!. కుక్కని భలే రక్షించాడు.. వైరల్ వీడియో
ఒక్కోసారి సంభవించే అనుహ్యమైన ప్రమాదాలు లేదా జంతువులు దాడులు చాలా భయానకంగా ఉంటాయి. పైగా ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు. అచ్చం అలాంటి ఘటనే ఒక కస్టమర్ కుమార్తెకి ఎదురైంది. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని స్టెఫానీ లాంట్జ్ సబర్బన్ లాస్ వెగాస్‌లో అమెజాన్ డెలివరీ డ్రైవర్ లిడే ప్యాకేజీలను డెలివరీ చేస్తుంటాడు. ఇంతలో ఒక కస్టమర్ కుమార్తె 19 ఏళ్ల లారెన్ రే బయటకు వచ్చింది. అనుకోకుండా అక్కడ ఒక వీధి కుక్క ఆమె వద్దకు వచ్చింది. అయితే ఆమె కూడా ఆ కుక్కని చక్కగా పలకరించింది. అంతా బాగానే ఉంటుంది. ఇంతలో ఆమె పెంపుడు కుక్క బయటకు వచ్చింది. అంతే ఆ వీధి కుక్క ఒక్కసారిగా చాలా క్రూరంగా ఆ కుక్క పై దాడి చేసింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోదు. అయితే ఏదోరకంగా దాన్ని భయపెట్టడానికి ప్రయత్నించినా కూడా అది ఆగదు. పైగా ఆమె పై కూడా దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న అమెజాన్ డ్రైవర్ వెంటనే స్పందించి ఆ కుక్కను నివారించటమే కాకుండ ఆమె పెంపుడు కుక్క వద్దకు రాకుండా అడ్డుగా నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఆమె తన పెంపుడు కుక్కను తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ కుక్క కూడా కాసేపటికి నిష్క్రమించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు
‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్కాలనీలో ఎం.విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్‌కుమార్ కేబుల్ ఆపరేటర్. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు. ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్‌కుమార్ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్వయంగా వెళ్లి.. ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్‌కుమార్ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. వైద్యసేవలు ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్‌కుమార్. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్ షాక్‌కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు. కరోనా సమయంలో.. కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్ సెంటర్ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్‌కుమార్ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. మొదలైందిలా.. విజయ్‌కుమార్ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్‌కుమార్ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు. ఎంతో ఆనందాన్నిస్తోంది తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్‌కు ఫోన్ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను. – విజయ్‌కుమార్ -
కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021 ఫైనలిస్ట్‌లు
లండన్: ఏడాది కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021కి దాదాపు 40 ఫోటోలు ఫైనల్ రేసులో నిలిచాయి. ఇవన్నీ ఒకదానికొకటి చాలా అత్యంత వినోధభరితంగానూ, ఆశ్చర్యంగానూ ఉన్నాయి. వీటిలో ఫోటోగ్రాఫర్ నైపుణ్యతతోపాటు వాటిలో ఏదో ఆసక్తికర సన్నివేశం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సుమారు 2 వేల ఫోటోల నుంచి దాదాపు 40 చిత్రాలు ఫైనల్‌కి ఎంపికవ్వడం విశేషం. (చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!) ఈ కామెడీ పెట్ ఫోటో అవార్డులను పాల్ జాయిన్సన్-హిక్స్, టామ్ సుల్లమ్లు రూపొందించారు అంతేకాదు మనుషులతో జంతువులు ఏవిధంగా అనుబంధం పెంచుకుంటాయో అనే దాని గురించి వివరించడమే కాక, జంతు సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవార్డ్సును రూపోందించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ పోటీని యానిమల్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో నిర్వహించడమే కాక జంతు సంరక్ష మద్దతుదారులకు సూమారు 10 వేల పౌండ్లను విరాళంగా ఇస్తోంది ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఫన్నీ పెట్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) -
నేడు 6 లక్షల రేబీస్ టీకాలు
సాక్షి, అమరావతి: సంక్రమిత వ్యాధుల దినోత్సవం (జూనోసిస్ డే) కోసం పశుసంవర్ధక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారు. 200కు పైగా వ్యాధులు పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నాయని గుర్తించారు. వాటిలో ప్రధానంగా కుక్కల నుంచి రేబీస్, చిలుకల నుంచి సిట్టకోసిస్, పాడి పశువుల నుంచి క్షయ, అంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ, పందుల నుంచి మెదడు వాపు, స్వైన్ ఫ్లూ, ఎలుకలు, అడవి జంతువుల ద్వారా లెప్టోస్పైరోసిస్ వంటివి వ్యాపిస్తున్నాయి. సంక్రమిత వ్యాధుల్లో రేబీస్ ప్రాణాంతకమైనందున జూనోసిస్ డే నాడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలు, పాలీక్లినిక్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కనీసం 6 లక్షల కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం.. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలి. çసంక్రమిత వ్యాధులను ఏ విధంగా ఎదుర్కోవాలో పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్
సాధారణంగానే కుక్కలను విశ్వాసానికి మారుపేరు అని వింటుంటాం. ఎమోషన్స్ పరంగా చూసుకుంటే కుక్కులు మనుషులతో కలిసిపోయిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కల్లో ఈ విశ్వాసం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మనలో బాధ, సంతోషం, కోపం ఇలా ఏది కనిపించినా దానిని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మెలుగుతుంటాయి. తాజాగా ఒక యువతి తన పెంపుడు కుక్క ముందు క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. యువతి క్లాసికల్ స్టెప్పులు అదిరిపోవడంతో తన పెంపుడు కుక్క కూడా తన ముందు కాళ్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహపరిచింది. యువతి డ్యాన్స్ చేసినంత సేపు కుక్క అలాగే నిల్చొని ఉత్సాహపరచడం విశేషం. ఆమె తన డ్యాన్స్ పూర్తి చేసిన అనంతరం తన కుక్క దగ్గరకు వెళ్లి దానిని గట్టిగా హత్తుకొని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనిని మొత్తం వీడియోగా తీసి ఆమె తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఇంకేముంది క్షణాల్లో వీడియో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించగా.. లెక్కలేనన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయి. చదవండి: డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే cannibalism: నాగుపామును మింగేసిన మరో నాగుపాము -
పిల్లులు, కుక్కలతో ఆనందంగా...
కరోనా కరోనా... భూగోళం మీద ఉన్నవారంతా భాషాభేదాలు, కులమతాలకు అతీతంగా ఈ పదాన్నే జపిస్తున్నారు. కరోనా కోరల నుంచి ఎప్పటికి బయటపడతామో ఎవ్వరికీ తెలియదు. బంధువులు, స్నేహితులు, ఆప్తులు.. అందరూ అయినవారే, కావలసినవారే... కాని అవసరానికి ఎవ్వరినీ సహాయం అడగలేం, స్వచ్ఛందంగా వచ్చి చేయలేరు. క్షేమసమాచారాలు తెలుసుకోవటానికి వీడియో కాల్స్‌కి మాత్రమే పరిమితం అవుతున్నారు. రక్తసంబంధం కూడా ఈ విషకాటుకి బలైపోతోంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో అందరివీ చిన్న కుటుంబాలే... అమ్మనాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు. ఎవరి పనిలో వారు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మునిగిపోతున్నారు. ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ... మానసికంగా కుంగిపోతున్నారు. ఎంతసేపు ఏవి చూసినా, మనసులో మాటలు పంచుకోవటానికి మనిషి తోడు లేకపోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మూగజీవుల్ని పెంచుకోవటం ఎక్కువైంది అంటున్నారు అమెరికన్లు. అమెరికాలో కుక్కల్ని, పిల్లుల్ని దత్తతు చేసుకుంటున్నారు. వాటితో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలక్షేపం చేస్తున్నారు. 2020తో పోలిస్తే ఈ సంవత్సరం పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారి సంఖ్య 40 శాతం పెరిగింది. ఐసొలేషన్‌లో ఉంటున్నవారికి ఇవి ఎంతో మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ‘‘మార్చి మొదటి వారంలో న్యూయార్క్ నగరం చుట్టుపక్కల నుంచి 700 కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి’’ అంటున్నారు గ్రాంగెర్. బైడవీ అనే లాభాపేక్ష లేని సంస్థకు గ్రాంగెర్ అధ్యక్షులు. ఆమె రకరకాల ప్రాణులకు మంచి తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పుడు గ్రాంగెర్ పూర్తిగా పనిలో బిజీ అయిపోయారు. కుక్కలకు పిల్లులకు శిక్షణ ఇస్తున్నారు. ‘‘ఎప్పుడైనా మనసుకి బాధ అనిపిస్తే, వెంటనే ఒకసారి బయటకు వచ్చి, వీధులలో తిరిగే కుక్కపిల్లల చిలిపి చేష్టలు, పిల్లుల విన్యాసాలు చూడండి. అవి ఎలా ఆడుకుంటాయో గమనించండి. ఎలా నిద్రిస్తుంటాయో పరిశీలించండి. మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. మీ బాధను ఇట్టే మరిచిపోతారు’’ అంటున్నారు గ్రాంగెర్. కొన్ని కుటుంబాలలో కోవిడ్‌తో బాధపడుతూ, మూగప్రాణులను చూసేవారు లేక, వాటి అవసరాలు తీర్చలేక బాధపడుతూ, తలుపులు తీసి వారి పెంపుడు జంతువులను బయటకు పంపేస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే జంతువులను దత్తతు తీసుకుంటున్న వారితో పోలిస్తే, పెంపుడు ప్రాణులను వదిలిపెట్టేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. -
బ్రేవ్‌గర్ల్ వర్సెస్ బియర్ : ఎలుగుబంటికే ఎదురెళ్లి
పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పెట్స్‌ని పిల్లలు ప్రాణంగా చూసుకుంటారు. వాటి ఆలనా పాలనా అంతా తామే చూస్తారు. ఇంట్లో వాళ్లయినా సరే వాటిని ఏమన్నా అంటే చూస్తూ ఊరుకోరు. మరోవైపు వైల్డ్ అనిమల్స్ని జూలో చూడటానికి ఓకే కానీ ఇంటికి వస్తే హడలిపోతాం. అవెక్కడ దాడి చేస్తాయో అని వాటికి దూరంగా వెళ్తాం, పరిస్థితులు అనుకూలిస్తే దాక్కుంటాం. కానీ దీనికి రివర్స్‌లో జరిగింది ఓ చోట. అడవి ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చి పెంపుడు జంతువుల మీద దాడికి సిద్ధమైతే ఓ పాప ధైర్యంగా ఆ ఎలుగుతో పోరాడింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎంత ధైర్యమో ఇండియాలోనే ఈ ఘటన జరిగినప్పటికీ ఎక్కడ జరిగిందనే వివరాలపై స్పష్టత లేదు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో షేర్ చేశారు. పెంపుడు జంతువులను కాపాడేందుకు ఆ చిన్నారి చేసిన సాహాసం చూసి, ఆ పాపను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. చదవండి : హంసనావ -
యూట్యూబర్ గౌరవ్ శర్మ అమానుష ప్రవర్తన
-
పైశాచిక చర్య: కుక్కపై యూట్యూబర్ అమానుషం
న్యూఢిల్లీ: శునకంపై ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. హైడ్రోజన్ బెలూన్లు కుక్క మెడకు కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా దానికి కట్టిన కుక్క కూడా గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అతడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికుడు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని మాలవ్యనగర్కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్. తన యూట్యూబ్ చానల్లో వ్యూస్ కోసం పై విధంగా చేసి వీడియో రూపొందించాడు. తన కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. పార్క్ వద్ద అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగురవేస్తున్నారు. ఇంట్లో.. బయట.. చాలాసార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాల్లోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురుతుండంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ బిత్తిరి చర్యను చూసిన కొందరు మాలవ్య నగర్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ జాన్‌తో పాటు అతడి తల్లిపై కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూవర్స్‌కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
పిల్లి అనుకుంటే పులి ప్రత్యక్షం..
ఎంతో ముచ్చట పడి పిల్లిని పెంచుకుందామనుకున్న ఫ్రెంచ్ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. తాము తెచ్చుకున్నది పిల్లిని కాదు పులి పిల్లను అని తెలిసి షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. నార్మాండీకి చెందిన లా హవ్రే అనే దంపతులు సవన్నా జాతి పిల్లి కోసం ఆన్లైన్ ప్రకటన చూసి దాన్ని పెంచుకుందామనుకున్నారు. దాదాపు 6000 యూరోలకు కొనుకుని ఎంతో ఇష్టంగా పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. వారం గడిచే లోపే తమతో పాటు ఇంట్లో ఉంటున్నది పిల్లి కాదు మూడు నెలల పులి పిల్ల అని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పులిని కొనుగోలు చేయడంతో పాటు అక్రమంగా రవాణా చేసినట్లు ఈ జంటపై అభియోగాలు వెలువడ్డాయి. దీంతో వీరితో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జరిగిన సుధీర్ఘ విచారణ అనంతరం దంపతులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేశారు. ప్రస్తుతం పులిని ఫ్రెంచ్ బయో డైవర్సిటీ కార్యాలయ అధికారులకు అప్పగించారు. పులి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. (వైరల్: రికార్డు సృష్టించిన కొండచిలువ) -
కుక్కపిల్ల ప్రాణం ఖరీదు 250!
సాక్షి, హయత్‌నగర్: నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేస్తూ పెంపుడు కుక్కపిల్లను చంపేసి దాని యజమానిపై, వారి కుటుంబ సభ్యులపైనా దాడిచేశారు. ‘చచ్చింది కుక్కేకదా...మనిషి కాదుకదా’ అంటూ పెంపుడు జంతువులపైన తనకున్న చులకన భావన, ద్వేషాన్ని ఓ వ్యక్తి వెల్లగక్కితే.. ఆ కుక్కపిల్ల ప్రాణం ఖరీదు రూ.250కి పోలీసులు పరిమితం చేసిన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి తెలిపిన వివరాలు ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు కుటుంబం లాక్డౌన్ సమయంలో ఓ ల్యాబ్‌జాతి కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. శనివారం సాయంత్రం మలవిసర్జనకు ఆ కుక్కపిల్లను బెల్టుతో పట్టుకుని ఇంటి ముందుకు రోడ్డు పక్కకు తీసుకురాగా ఆ మార్గంలో మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంగా పి.వెంకటేశం కారు (టీఎస్08 ఈఎస్ 7000) నడుపుతూ కుక్కపిల్లను గుద్దేశాడు. కుక్కను పట్టుకున్న యువతికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం చేసి కారు ఆపకుండా వెళుతుంటే కాలనీకి చెందినవారు, కుక్క యజమాని అడ్డుకున్నారు. కారు ఆపారనే కోపంతో ఊగిపోతూ ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’ అంటూ గొడవకు దిగాడు. కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లమన్నందుకు కుక్కపిల్ల యజమానిపై దాడి చేశారు. (వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..!) సంఘటనా స్థలంలో ఉన్న అదే కారులో కుక్క యజమాని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కారును గుంజుకు పోతావా అంటూ కుక్కపిల్ల యజమాని ఇంటిపై సుమారు 50మందిని నిందితుడు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, యజమాని కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినకట్లు తిడుతూ ఇంటిపైకి దాడి చేశారు. యజమాని కొడుకును, అతని కుటుంబ సభ్యులను చంపుతామంటూ మొబైల్ వ్యాన్ పోలీసుల సమక్షంలోనే వీరంగం చేశారు. దాడిచేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని, పెంపుడు జంతువులపై ద్వేషంతో కుక్కపిల్లను చంపిన వ్యక్తిని యానిమల్ యాక్ట్ ప్రకారం శిక్షంచాలని కుక్కపిల్ల యజమాని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొడవ చేస్తూ ఇంటిపై దొమ్మీ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన పోలీసులు చట్ట పరిధిలోకి వచ్చే ఏ అంశాలను పట్టించుకోకుండా, సంఘటన జరిగిన సమయంలో కేసును పంచనామ చేయకుండానే ఐపీసీ సెక్షన్ 336 నమోదు చేసి నిందితులను కారుతో సహా పోలీసులు వదిలి వేశారు. (వైరల్: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు) పోలీసులు నమోదు చేసిన సెక్షన్ ప్రకారం నిందితులకు మూడు నెలల జైలు లేదా 250 శిక్ష మాత్రమే. అంటే ఓ కుక్కపిల్లకు పోలీసులు రూ.250 ఖరీదు కట్టారు. అల్లారు ముద్దుగా కుక్కపిల్లను పెంచుకుంటున్న ఆ కుటుంబం నిద్రాహారం లేకుండా ఏడుస్తున్నా చలించలేదు. నిందితుల నుంచి పొంచివున్న ప్రాణభయంతో ఆ కుటుం సభ్యులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మూగజీవిపై ద్వేషంతో కుక్కపిల్లను చంపిన వ్యక్తిపై యానిమల్ యాక్టు నమోదుచేయాలని, దాడిచేసిన వారిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
కిమ్ అరాచకం: వారి పాలిట శాపం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కన్ను పెంపుడు జంతువులపై పడింది. దేశ అవసరాల కోసం ప్రజలు పెంచుకుంటున్న కుక్కపిల్లలను ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ దేశంలో కరోనా కష్ట కాలంలో ఆహార సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. దీంతో రెస్టారెంట్లకు మాంసం సరఫరా తగ్గిపోయింది. అసలే అక్కడ కుక్క మాంసం ఎంతో రుచికరంగా ఉంటుందని ఎగబడి మరీ తింటారు. దీంతో ఈ సమస్యకు కిమ్ విచిత్ర పరిష్కారం కనిపెట్టారు. ప్రజలు పెంచుకుంటున్న శునకాలను వధించి రెస్టారెంట్లలో మాంసం లోటును పూడ్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ప్రజలు తమ దగ్గరున్న కుక్కలను ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసే కుక్కలను కొన్నింటిని జూలలో, మరికొన్నింటిని మాంసం కోసం నేరుగా రెస్టారెంట్లకు సరఫరా చేస్తారు. (‘అత్యాచారం, గర్భస్రావం ఇక్కడ నిత్యకృత్యం’) ఈ పనులన్నీ దగ్గరుండి చూసుకునేందుకు కొందరు అధికారులను కూడా నియమించారు. శునకాలను పెంచుకుంటున్న కుటుంబాలను గుర్తించడం వీరి ముఖ్యమైన పని. ఆ తర్వాత యజమానులకు నచ్చినా నచ్చకపోయినా ఈ అధికారులు వారి నుంచి పెంపుడు శునకాలను బలవంతంగా లాక్కుపోతారు. ముందు జాగ్రత్తగా గత నెలలోనే శునకాలను పెంచుకోవడంపై కిమ్ విధించిన నిషేధం.. ఇప్పుడు చేస్తోన్న క్రూరమైన పనిని మరింత సులువు చేస్తోంది. ఈ వార్త విన్న జంతు ప్రేమికులు లబోదిబోమంటున్నారు. ఇన్నాళ్లు ప్రేమగా పెంచుకున్న వాటిని చంపేస్తారని తలుచుకుంటేనే మనసొప్పడం లేదంటూ ఘొల్లుమంటున్నారు. (నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) -
తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అనేక మంది పెంపుడు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారని, ఇది అమానవీయమైన చర్య అని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఎవరైనా తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా? అంటూ ప్రశ్నించారు. తమను పెంచుకునే కుటుంబంపై ఆయా శునకాలు అన్ని విధాలా ఆధారపడి ఉంటాయని, వాటి విషయంలో అమానవీయంగా వ్యవహరించకూడదని సూచించారు. అలా చేయడం శునకాల పట్ల క్రూయల్‌గా వ్యవహరించడమేనని, ఇది చట్ట ప్రకారం నేరమని సీపీ తన ట్వీట్లో స్పష్టం చేశారు. Abandoning a pet dog on the street to fend for itself is a most inhuman act. Can you do that to your own child ? Such animal get dependent emotionally and physically on the family. For God's sake never abandon them. It also amounts to cruelty to animal and is punishable under law — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) July 19, 2020 -
ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లే..
ఢిల్లీ : కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల ఎవరూ ఎక్కడికి కదల్లేని పరిస్థితిగా మారింది. దాదాపు రెండు నెలల నుంచి ఎటువంటి సాధారణ ప్రయాణాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. కొందరు తమ ఇంట్లో వాళ్లను మిస్ అవుతున్నామనే భావన వ్యక్తం చేసేవారు. అయితే వీరిలో కొందరు మాత్రం కుటుంబసభ్యులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో వారి పెంపుడు జంతువులకు అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ వల్ల కొందరు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉన్నారు. తమ ఆప్తులుగా భావించే పెట్స్ వద్దకు ఎలాగైనా చేరుకోవాలన్న తపనతో ఉన్నారు.(ఇటలీపై కరోనా పంజా.. మెడికల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు) కేవలం ఇలాంటి వాళ్ల కోసం ఓ ప్రైవేట్ జెట్ సంస్థ.. ప్రత్యేకంగా ఒక విమానాన్ని నడుపుతున్నది. అక్రిషన్ ఏవియేషన్ అనే ప్రైవేటు విమాన సంస్థ ఈ విమానాన్ని నడుపుతున్నది. ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. ఒక్కొక్కొ సీటులో ఒక్కొక్క పెంపుడు జంతువుకు కేటాయించారు. ఆ విమానం కిరాయి ఖరీదు మొత్తం 9 లక్షల 60 వేలు కాగా, ఒక్కో సీటు ధర రూ. లక్షా 60వేలుగా ఉంది. ఇప్పటికే విమానంలోని నాలుగు సీట్లు బుక్ అవ్వగా... ఇంకా రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. జూన్ నెలలోనే ఈ ప్లేన్‌ను నడపనున్నారు. కాగా సీట్లు బుక్ చేసుకున్న వాటిలో రెండు షిహూ తుజస్, ఓ గోల్డెన్ రిట్రీవర్ శునకాలు ఉన్నాయి. మరో లేడీ ఫిజంట్ పక్షి కోసం కూడా ఒక సీటు బుక్కైంది. త్వరలోనే మిగతా రెండు సీట్లను కూడా బుక్ చేయాలని సంస్థ భావించింది. ఢిల్లీ నుంచి ముంబై వరకు కేవలం పెంపుడు జంతువుల కోసమే ఈ విమానాన్ని నడుపుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్ తెలిపారు.ఆమె మాట్లాడుతూ..' కొంతమంది వారి పెంపుడు జంతువులను తమతో పాటు విమానంలో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారు. మిగతావారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండేవారు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో అన్ని రకాల పెంపుడు జంతువులు(పక్షులు, పెట్ డాగ్స్) వంటివి వారి యజమానుల వద్దకు క్షేమంగా పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అక్రిషన్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా.' అంటూ పేర్కొన్నారు.(ఏపీలో మరో 50 పాజిటివ్ కేసులు) -
పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్
హాకాంగ్ : కరోనా మహమ్మారి మనుషులపైనే కాదు జంతువులపైన కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. హాకాంగ్‌లో ఇప్పటికే రెండు పెంపుడు కుక్కలకు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. తాజాగా ఓ పెంపుడు పిల్లికి కూడా ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు గుర్తించారు. యజమాని వల్ల పిల్లికి కూడా కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మార్చి 31న హాంకాంగ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అండ్ కన్జర్వేషన్ డిపార్టమెంట్ ఓ నోటీసులు విడుదల చేసింది. (చదవండి : కరోనా బారిన పడి 13 ఏళ్ల బాలుడి మృతి) అయితే దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందనే ఆధారాలు ఇంతవరకు లభించలేదని, యజమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు డెరెక్ట్‌గా కరోనా వైరస్ సోకలేదని, యాజమాని లేదా ఇతర మనుషుల ద్వారా అవి వైరస్ బారిన పడ్డాయని స్పష్టం చేశారు. వీటి వల్ల ఎటువంటి ముప్పు లేదన్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకదని, 14 రోజులు వాటిని క్వారంటైన్లో ఉంచితే సరిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. తప్పుడు వార్తలను నమ్మి పెంపుడు జంతువుల ప్రియులు ఆందోళన చెందొద్దని కోరింది. (చదవండి : అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!) కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు, మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, స్పెయిన్‌లో ఈ వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి ఇప్పటికే 40 వేల మందికి పైగా మృతి చెందారు. బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. -
అభిమానుల నుంచి రక్షణ కోసం..
బంజారాహిల్స్: కొందరు అభిమానుల నుంచి తనకు రక్షణ కోసం కొత్తగా రెండు కుక్కలను తెచ్చుకున్నానంటూ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. ఆ కుక్కలతో ఉన్న ఫొటోలను సోమవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరి అభిమానుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందో వారి పేర్లను కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనం రేపుతున్నది. ఆర్జీవీ కొందరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేయడం సర్వత్రా ఆసక్తి కరంగా మారింది. The Rottweiler and the Newfoundland are for my protection against Pkf and Cbnf and Lbf where f means ... pic.twitter.com/fapeNxBJOU — Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2020 -
పెట్స్‌కి ఓనర్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్
సిటీలో పెట్స్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే మనలాగే పెట్స్‌కు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ పెరుగుతుండటం చెప్పుకోదగిన విశేషం. దీంతో అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెట్స్ చేసే సందడిని సోషల్ మీడియా పేజ్‌లో అప్డేట్ చేసి ఇతరులతో పంచుకోవడం.. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్ పెట్టడంతో రెండు వైపుల వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో రోజురోజుకీ పేజ్‌లకు క్రేజ్ పెరుగుతోంది. సాక్షి, కాలేజ్ కరస్పాండెంట్: ఎక్కువ మంది నగరానికి చెందిన టీనేజర్లు పెట్స్ కోసం ప్రత్యేక అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రెండ్ చూసి పెట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఒక పేజ్ స్టార్ట్ చేశారు. ఆ పేజ్ మీద అందరి పెట్స్‌ని పోస్ట్ చేసి అత్యధిక లైక్స్ వచ్చిన పెట్ని విజేతగా నిర్ణయించే తరహా పోటీలు, విజేతలకు పెడిగ్రీన్ వంటి డాగ్‌ఫుడ్ నుంచి పెట్స్‌కి అవసరమైన మరెన్నో బహుమతులు ఇస్తామనే ప్రకటనలూ పెరిగాయి. సెలబ్రిటీలే స్ఫూర్తి.. చాలామంది సెలబ్రిటీలీ పెట్ వర్కింగ్‌కి ఊపునిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్ డయానా చోప్రాకి ఇన్‌స్ట్రాగామ్‌లో 1.49లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ సమంత అక్కినేనికి కూడా ఒక పెట్ అకౌంట్ ఉంది. ముంబైకి చెందిన మాన్సి తల్వార్ బీగిల్స్, మేనార్డ్, క్లో... పెట్స్ పేజ్‌కు 24వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నగరానికి చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సునయన తన పెట్ టొమ్మీ కోసం ఏర్పాటు చేసిన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌కు 3,865 ఫాలోవర్స్ ఉన్నారు. టంగ్ ఔట్ ట్యూజ్ డేస్, హెడ్ టిట్ థర్స్‌డేస్, స్నగ్ విత్ పగ్... వంటి పేర్లతో సిటీలోని పెట్స్ ఫొటోలు, వీడియోలు కనువిందు చేస్తున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా షూట్స్ కూడా పెట్టుకుంటున్న పెట్ ఓనర్స్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. బడ్ని నేను బాగా ట్రైన్ చేశా. చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ రకరకాల కారణాల వల్ల వాళ్లు వాటిని పెంచలేకపోతుంటారు. అలాంటివారికి బడ్ లేదా సింబాతో నా అనుభవాలు షేర్ చేసుకోవడం నాకు నచ్చుతుంది. పెట్స్ మనల్ని నవ్వుల్లో ముంచుతాయి. హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు జీవితం సంక్లిష్టమైంది కాదని నేర్పుతాయి. వీటివల్ల ప్రతి పరిస్థితిని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. తాజాగా మా కొత్త పప్ సింబాకు చాలా లైక్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాకు ఒక డాగ్, ఒక పిల్లి ఉన్నాయి. ఓ నెల తర్వాత రెండు పిల్లులు, ఒక డాగ్. సో.. ఈ అకౌంట్ ఒక్కరిది కాదు.. నాతో జీవించే మూగప్రాణులన్నింటిదీ. – ఆయుషి నా పెట్‌కి గుర్తింపు కావాలని.. ఇట్స్ మీ టామీ.. అనే నా పెట్ పేజ్‌కి భలే క్యూట్ కామెంట్స్ వస్తుంటాయి. నా పెట్‌కి ఒక గుర్తింపు రావాలని, దానితో నా జ్ఞాపకాలన్నీ మిగిలిన వారితో షేర్ చేసుకోవాలని ఇది స్టార్ట్ చేశా. టామీ నా మీదకు జంప్ చేయడం, నాతో ఫైట్ చేయడం.. నేను కొన్ని నిమిషాలు కనపడకపోతే వెతుక్కోవడం.. వంటి చేష్టలన్నీ నేను రికార్డ్ చేస్తుంటాను. నా ఫ్రెండ్స్ బంధువులు అందరికీ పెట్స్‌తో నా ఫీట్స్ చూడటం చాలా ఇష్టం. – ప్రణవి, కాలేజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసే పెట్ నాది.. నా పెట్ జ్యూస్ ఇంటికి వచ్చే ఫ్రెండ్స్‌కి జ్యూస్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. దాంతో దాని ఫొటోస్ పంపమని దాని గురించిన రోజువారీ విశేషాలు చెప్పమంటున్నారు. అందుకే ఈ ఆలోచన వచ్చి అకౌంట్ స్టార్ట్ చేశా. దీని ద్వారా దాని గురించి తెలుసుకోవడంతో పాటు మాట్లాడుకోవడానికి కూడా వారికి కుదురుతోంది. అంతేకాకుండా అది ఎదుగుతున్న తీరు, దాని చేష్టల్లో మార్పు చేర్పులు.. వీటన్నింటికీ ఒక కేటలాగ్ నాకు తయారవుతోంది కూడా. మంచం మీద నన్ను చుట్టుకుని పడుకుని ఉండే పోస్ట్ నా ఫేవరెట్. – విశ్వజోషి -
మా ‘కొకొ’.. పోయిందెటో!
కుషాయిగూడ: ప్రేమతో పెంచుకుంటున్న పెంపుడు శునకం అదృశ్యమైందని, దాని ఆచూకీ కనుగొనాలని బుధవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు... ఏఎస్‌రావునగర్‌లోని త్యాగరాయనగర్ కాలనీకి చెందిన కల్యాణ్ వ్యాపారం చేస్తుంటారు. మూడేళ్లుగా ‘కొకొ’ అనే పెంపుడు శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ నెల 24న ఇంటి గేటు తెరిచి మళ్లీ వేయకపోవడంతో పెంపుడు కుక్క కొకొ బయటకు వెళ్లింది. దీంతో ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి కొకొను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇంట్లో దిగాలుగా కొకొ పప్పీలు కాగా.. సీసీ పుటేజీ స్పష్టంగా లేదని యజమాని తెలిపారు. శునకానికి నెల రోజుల వయసు ఉన్న రెండు పప్పీలు ఉన్నాయి. వీటికి ఫీడింగ్ లేకుండాపోయింది. రెండు రోజులుగా కొకొ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కొకొ ఆచూకీ తెలిస్తే 99667 77888, 80083 33777లలో సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందజేస్తామని యజమాని కల్యాణ్ తెలిపారు. -
'టామీ'కి అంతిమ యాత్ర
కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణానికి చెందిన ఆవుల భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉండే శునకం (టామీ) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. దానిపై ప్రేమతో ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు. -
కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే..
వుహాన్: కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రస్తుతం ఈ వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో తొలుత బయటపడ్డ ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్నది. ప్రస్తుతం ఇతర దేశాల్లోనూ కరోనా వైరస్ కేసులు బయట పడుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా పలుచోట్ల అనేక మంది మృతి చెందడంతో అన్ని దేశాలూ అప్రమత్తమై ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే.. చైనాలో కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని నమ్మిన కొందరు వారు ప్రేమతో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా వదిలించుకుంటున్నారు. వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లొచ్చిన జంతువులను క్యారంటైన్లో ఉంచాలని మాత్రమే వైద్యులు సూచించారు. అయితే ఇది స్థానిక మీడియాలో మరో విధంగా ప్రచారం కావడంతో.. పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని చైనీస్ భావించారు. (వుహాన్ నుంచి భారత్‌కు..) ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా తమతో ప్రేమతో పెంచుకుంటున్న కుక్కలను, పిల్లులను అపార్ట్మెంట్ల మీద నుంచి క్రిందకు తోసేస్తున్నారు. మనిషి ప్రాణాల మీద తీపితో వాటి ప్రాణాలను తీస్తున్నాడు. ఇలా మరణించిన పెంపుడు జీవాల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలని మూగజీవాల ప్రాణాలు తీయవద్దని ప్రజలకు సూచించింది. ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులతో ఈ వ్యాధి సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రజలు ఆందోళన చెందొద్దని కోరుతోంది. (నిర్మానుష్య వీధిలో శవం.. భయం వేస్తోంది) -
వైరల్ వీడియో: హెల్మెట్‌తో శునకం విహారం
-
వైరల్: ఈ కుక్కను చూసి నేర్చుకోండి
‘హెల్మెట్ ధరించండి- ప్రాణాలను కాపాడుకోండి’ అని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరూ మొత్తుకున్నా ఎవ్వరూ దాన్ని నిబద్ధతగా పాటించిన పాపాన పోలేదు. బుజ్జగిస్తే వినేలా లేరనుకున్న కేంద్రం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ మొత్తంలో చలాన్లు విధిస్తోంది. దీంతో చలాన్లు కట్టలేక జేబులు ఖాళీ అవుతున్నాయని కొంతమంది చచ్చినట్టు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. కానీ ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు చాలామందే ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి తనతోపాటు పెంపుడు కుక్క రక్షణ బాధ్యత తనమీద వేసుకున్నాడు. అదెలాగంటే.. బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తన పెంపుడు జంతువైన కుక్కను వెంట తీసుకెళ్లాడు. అయితే దాన్ని వెనకాల కూర్చోపెట్టుకుని, దానికో హెల్మెట్ ధరించి మరీ తీసుకెళ్లాడు. దీంతో రోడ్డు వెంబడి జనమంతా ఆ కుక్కను చూసి ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ఈ అరుదైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘కుక్క అంటే ఎంత ప్రేమో’ అని కొందరు నెటిజన్లు బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ‘కుక్కను ముందు కూర్చోపెట్టుకోండి, వెనకాల కూర్చోబెడితే.. ఆ శునకం పడిపోతే ఏంటి పరిస్థితి?’ అంటూ మరికొందరు కుక్కపై ప్రేమ, దాని యజమానిపై కోపం ఏకకాలంలో ప్రదర్శించారు. ‘హెల్మెట్ ధరించనివాళ్లు కనీసం ఈ కుక్కను చూసైనా నేర్చుకోండయ్యా’ అంటూ ఓ నెటిజన్ ఒకింత ఘాటుగా, కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. గతంలో ఢిల్లీలోనూ ఓ శునకం హెల్మెట్ ధరించి బైక్‌పై ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం యోగికి కలిసొచ్చిన పెంపుడు కుక్క
లక్నో: కొన్ని పెంపుడు జంతువులు వాటి ఆలవాట్ల వల్లనో.. అవి చేసే పనులతోనో వార్తల్లో నిలుస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ పెంపుడు కుక్క మాత్రం ఏమి చేయకుండానే సెలబ్రిటీ అయిపోయింది. ఈ బ్లాక్ లాబ్రాడర్ కుక్క పేరు ‘కాలూ’. సీఎం యోగి అదిత్యనాథ్ ‘కాలూ’తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. యోగికి ఈ కుక్కను గోరఖ్‌పూర్ ఆలయ భక్తులు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి కలుపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టి పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం ‘కాలూ’ గోరఖ్‌పూర్ ఆలయంలో ఉంది. అయితే సీఎం యోగి ఈ ఆలయానికి వచ్చినపుడల్లా దానిని కలుస్తూ ఉంటాడని, సమయం దొరికినప్పుడల్లా ప్రత్యేకంచి దాని కోసమే గొరఖ్‌పూర్ వెళ్తుంటాడని ఆలయ ఇన్చార్జీ తివారి మీడియాకు తెలిపారు. అయితే కలుకు కూడా యోగి అంటే చాలా ఇష్టమని, ఆయనను చూడగానే ఆనందంతో యోగిపైకి ఎగురుతూ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం సీఎం యోగి అదిత్యనాథ్ గోరఖ్‌పూర్ వెళ్లి ‘కాలూ’ను కలిసి దానికి పన్నీరు తీనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం దీనిపై తివారి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ బ్లాక్ లాబ్రాడర్‌ను 2016 డిసెంబర్లో గోరఖ్‌పూర్ ఆలయానికి తీసుకువచ్చాం. అదే సమయంలో సీఎం యోగి పెంపుడు కుక్క రాజాబాబు చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. దీంతో ఆలయ భక్తులు యోగికి ఈ కుక్కను బహుమతిగా ఇచ్చారు. అది వచ్చిన మూడు నెలకు 2017 మార్చిలో యోగి అదిత్యానాథ్ సీఎం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆలయ భక్తులు ‘కాలూ’ను సీఎం యోగికి లక్కీ అని అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ కుక్క శాఖాహారి అని, గుడిలోని పాలు, రోటి మాత్రమే తింటుందని చెప్పారు. అలాగే ఇది అనారోగ్య బారిన పడకుండ ప్రత్యేకంగా వసతులు కూడా ఏర్పాటు చేశామని తివారి తెలిపారు. -
పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు..
చిలకలగూడ: పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరి ధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన శిరీష తన కుమార్తెతో కలిసి ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన అనిత పెంపుడు కుక్క చిన్నారి వెంటబడి కుడి చెవి వెనుక కరిచింది. దీంతో చిన్నారికి తీవ్ర రక్తగాయమైంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం బాధితురాలి తల్లి శిరీష పోలీసులను ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం అదే పెంపుడు కుక్క తన కుమారుడిని కూడా కరిచిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ 336 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సిజ్జూకు ఆపరేషన్
గచ్చిబౌలి: ఓ పెంపుడు కుక్క గర్భ సంచికి కణితి ఏర్పడటంతో నాలుగు నెలలుగా ఆ మూగ జీవి నరకం చూసింది. దానికి ఆపరేషన్ చేయించి బతికించుకున్నాడు దాని యజమాని. వివరాల్లోకి వెళితే.. పుణేకు చెందిన ఆర్మీ అధికారి అమిత్ రాయ్ ‘సిజ్జు’ పేరుగల ఓ కుక్కను పెంచుతున్నారు. ఇటీవల ఆయన బదిలీపై బోయిన్‌పల్లికి వచ్చారు. సిజ్జు కడుపు ఉబ్బిపోయి ఆహారం తీసులేక ఇబ్బంది పడుతోంది. ఇలా నాలుగు నెలలుగా బాధపడుతోంది. దాంతో యజమాని అమిత్‌రాయ్‌నగరంలోని అనేక యానిమల్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా రోగం నయం కాలేదు. మూడు రోజుల క్రితం గచ్చిబౌలిలోని మిస్టర్ వెట్ యానిమల్ ఆస్పత్రికి వెళ్లారు. తన సిజ్జూను బికించమని డాక్టర్‌ను అమిత్ వేడుకున్నారు. దాంతో శునకానికి ఎక్స్‌రే తీసిన డాక్టర్ ఎన్. రమేష్.. శునకం గర్భసంచిలో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. ఆపరేషన్ చేస్తేనే కుక్క బతుకుతుందని చెప్పడంతో అందుకు అమిత్ సమ్మతించారు. యజమాని సూచన మేరకు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి ఆరు కిలోల బరువున్న శునకం కడుపులో నుంచి రెండున్నర కిలోల కణితిని తొలగించారు. ఆపరేషన్ విజవంతం కావడంతో కుక్కను యజమానికి అప్పగించారు. తన పెంపుడు శునకం ప్రాణాలు దక్కినందుకు అమిత్ రాయ్ ఎంతో సంతోషిస్తున్నారు. -
పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం ఉందని..
తిరువనంతపురం: కొన్ని సంఘటనలు చూస్తే.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. అలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందనే నెపంతో దాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లాడో వ్యక్తి. వివరాలు.. నగరంలోని ఓ రద్దీ మార్కెట్ బయట సుమారు మూడేళ్ల వయసున్న పొమరేనియన్ జాతి కుక్క తచ్చాడటం జంతు ప్రేమికుల దృష్టికి వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న ఆ కుక్కను షామిన్ అనే జంతు ప్రేమికురాలు రక్షించి అక్కున చేర్చుకుంది. ఆ సమయంలో కుక్క మెడలో ఆమెకు ఓ ఉత్తరం కనిపించింది. అది చదివిన షామిన్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మలయాళంలో రాసిన ఆ ఉత్తరంలో కుక్కను వదిలేయడానికి గల కారణాలు రాశాడు దాని యజమాని. ఇంతకు లేఖలో ఏం ఉన్నదంటే.. ‘ఇది చాలా మంచి జాతికి చెందిన కుక్క. అందరితో చక్కగా ప్రవర్తిస్తుంది. ఎక్కువ తిండి అవసరం లేదు. దీనికి ఎలాంటి జబ్బులు లేవు. ఐదురోజులకు ఒకసారి స్నానం చేయిస్తే సరిపోతుంది. ఈ మూడేళ్లలో ఇది ఒక్కరిని కూడా కరవలేదు. పాలు, బిస్కెట్లు, గుడ్లు ఆహారంగా ఇవ్వాలి. అప్పుడప్పుడు మొరగడం తప్పించి వేరే సమస్యలేం లేవు. ఇక ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయడానికి ఓ కారణం ఉంది. ఇది పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అందుకే దీన్ని వదిలేస్తున్నాను’ అని ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ విషయం గురించి షామిన్ మాట్లాడుతూ.. ‘జబ్బు చేస్తేనో.. గాయాలు అయితేనో పెంపుడు జంతువులను వదిలేయడం చూశాం కానీ.. ఇలాంటి సాకుతో వదిలేయడం మాత్రం ఇదే మొదటిసారి. అక్రమ సంబంధం పెట్టుకుందని వదిలేయాడానికి అదేమైన మనిషా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షామిన్. ఇక నుంచి ఈ కుక్కను తానే పెంచుకుంటానని చెప్పారు. -
పోయిందే.. ఇట్స్‌గాన్..
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు. ‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులతో పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాలపాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు. వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుసని, కానీ దాని వల్ల ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు. -
పెంపుడు జంతువులతో జర జాగ్రత్త..!
సాక్షి, ఖమ్మం: పిచ్చికుక్క కాటుకు రేబిస్ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును ప్రపంచ వ్యాప్తంగా ‘జూనోసిస్ డే’ను జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్’ వ్యాధులు అంటారు. ఈ వ్యా«ధులు ప్రమాదకరమైనవి. మరణాలు కూడా సంభవిస్తాయి. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్) నివారణకు రేబిస్ టీకాలను కుక్క కాటుకు గురైన జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రాబిస్ వ్యాధి సోకకుండా యాంటీరాబిస్ టీకాను ఇస్తారు. జోనోటిక్ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు సంక్రమిస్తాయి. మానవుడు పాలు, మాంసం, కోసం పెంపుడు జంతువులను, కోళ్లను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. పెంపుడు జంతువులు, కోళ్ల పెంపకం వలన కూడా మానవుడు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రేబిస్ వ్యాధి వలన మరణిస్తున్నారు. 3 మిలియన్ల మంది పిచ్చికుక్కల కాటున పడి రేబిస్ వ్యాధి టీకాలు చేయించుకుంటున్నారు. 1995లో ప్రపంచంలో రేబిస్ వ్యాధి కారణంగా దాదాపు 70 వేల మంది మరణించారు. వీరిలో 35 వేల మంది భారతీయలు ఉన్నారు. పొలం పనులు చేసే రైతులు, తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవాళ్లు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జోనోటిక్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జోనోటిక్ వ్యాధుల రకాలు, వాటి నివారణపై ఖమ్మం పశువ్యాధి నిర్దారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్ అరుణ వివరించారు. జోనోటిక్ వ్యాధి 7 రకాలు ► బ్యాక్టీరియా: ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ లెప్టోస్పైరోసిస్, క్షయ ► వైరస్: రేబిస్, బర్డ్‌ఫ్లూ, మెదడు వాపు, సార్స్, మేడ్‌కౌడిసీజ్ ► ప్రొటోజోవా: టాక్సోప్లాస్మోడియా, లీష్మెనీయాసిస్ ► రెకెట్చియా: టిక్, టైఫస్, క్యూఫీవర్ ► హెల్నింథ్స్: ఎకైనోకోకోసిస్, టీనియాసిస్ ► ఎక్టోపారసైట్స్: స్కేజిస్ పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్): పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే అతి భయంకరమైన వ్యాధి రేబిస్. పిచ్చికుక్కల లాలాజలంలో వ్యాధికారకం ‘రేబిస్’ వైరస్ ఉంటుంది. మనుషుల శరీరంపై ఉన్న పుండును నాకినా లాలాజలం ద్వారా వ్యాధి సోకుతుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల లోపుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ♦ మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ♦ ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేడు. ♦ దాహం వేస్తున్నా నీళ్లు తాగలేరు. నివారణ: కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. బర్డ్‌ప్లూ వ్యాధి బర్డ్‌ఫ్లూ లేదా ఇన్‌ప్లూయాంజా వ్యాధి కోళ్లను, ఇతర పక్షులను ఆశిస్తుంది. ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. ఈ వైరస్‌లో 144 ఉపరకాలున్నాయి. ఇది కోళ్లు, పక్షుల నుంచి మానవాళికి సంభవిస్తుంది. 1997లో ఖండాతర వ్యాధిగా రూపొంది చాలా దేశాల్లో కోట్లాది కోళ్లు మరణించాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. మెదడు వాపు ఇది వైరస్ వలన కలిగే వ్యాధి. వ్యాధి కారక వైరస్ క్రిములు పందుల నుంచి దోమకాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఇళ్ల దగ్గర పందుల సంచారం లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వ్యాధిని అరికట్టుకోవాలి. ఆంత్రాక్స్ దోమ వ్యాధి ఈ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. జంతువులు, మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఇది చాలా ప్రమాదకరమైనది. వ్యాధి సోకిన పశువుల పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జ్వరం, న్యూమోనియా వస్తుంది. బ్రూసెల్లోసిస్ ఈ వ్యాధి పశువుల్లో బ్రూసెల్లా అబార్టస్ బూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి అన్ని జాతుల పశువులకు, మనుషులకు సోకుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వచ్చి ఈసుకుపోతాయి. మగ పశువుల్లో తాత్కాలికంగా లేదా శాశ్వితంగా వ్యందత్వం ఏర్పడుతుంది. జోనోటిక్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒∙జోనోటిక్ వ్యాధులన్నీ పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ⇒ వీధి కుక్కలకు యాంటీరేబిస్ టీకాలు వేయించి లైసెన్సులు ఇవ్వాలి. ⇒ పెంపుడు జంతువులతో, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వాళ్లు జోనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. -
కుక్కను కాపాడాడు.. ఫేమస్ అయిపోయాడు!
ముంబై: ముంబై నగరం గత కొన్నిరోజులుగా వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ముంబైని వరదలు ముంచెత్తడంతో ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే ఈ వరదల్లో చిక్కుకున్న ఓ కుక్కకు మాత్రం భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి. వరదలో కొట్టుకుపోతున్న ఈ కుక్కను కానిస్టేబుల్ రక్షించడంతో అది చావు నుంచి తప్పించుకుంది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ కుక్కను ప్రకాష్ పవార్ అనే పోలీస్ కానిస్టేబుల్ రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆ కుక్కను రక్షిస్తుండగా తీసిన వీడియోను ముంబై పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘మనిషికి కుక్క ఓ మంచి ఫ్రెండ్.. అయితే అలాంటి ఓ కుక్కకు కానిస్టేబుల్ ప్రకాశ్ పవర్ రూపంలోమంచి స్నేహితుడు దొరికాడు’ అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు ఆ కానిస్టేబుల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. Man’s best friend, found its best friend in PC Prakash Pawar too. #FriendsIndeed pic.twitter.com/hCsrDwlfZ5 — Mumbai Police (@MumbaiPolice) July 3, 2019 -
పెంచుకుంటామని తీసుకున్నారు..
బంజారాహిల్స్: తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను దత్తత తీసుకున్న వ్యక్తులు నిర్లక్ష్యంతో దాన్ని పోగొట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి పట్టణానికి చెందిన జె.సి.తరుణ్‌తేజ శ్రీకృష్ణానగర్‌లో అద్దెకుంటూ ఆఫీసర్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. తనకు రెండు పెంపుడు కుక్కలు ఉండగా అందులో ‘మోజీ’ అనే దానిని గత నెల19న బోరబండకు చెందిన హరి, ఆకాష్ అనే వ్యక్తులకు ఇచ్చాడు. పెంపుడు కుక్కపై మమకారాన్ని చంపుకోలేక నాలుగు రోజుల తర్వాత దానిని చూసి వద్దామని హరి, ఆకాష్‌లకు ఫోన్ చేయగా, కుక్క తన స్నేహితుడి వద్ద ఉందని తీసుకొచ్చిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పారు. గత నెల 24న మరోసారి ఫోన్‌చేసి ‘మోజీ’ని చూడాలని ఉందని కోరగా, దానికి ఆరోగ్యం బాగా లేనందున ఆపరేషన్ చేయించామని ఇప్పుడు చూడటానికి కుదరదని చెప్పారు. గత నెల 31న మరోసారి ఫోన్ చేసిన తరుణ్‌తేజ తన కుక్కను చూపించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. రెండు రోజుల క్రితం బోరబండలోని వారి ఇంటికి వెళ్లి చూడగా కుక్క కనిపించకపోవడంతో వారిని ప్రశ్నించాడు. దీంతో వారు అందరినీ కరుస్తుండటంతో కావూరిహిల్స్ ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం బాధితుడు తరుణ్‌తేజ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదృశ్యమైన కుక్క కోసం గాలింపు చేపట్టారు. -
శునకం కోసం..
టీ.నగర్ ,చెన్నై: కనిపించకుండా పోయిన శునకం ఆచూ కీ తెలపాలంటూ యజమాని ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించాడు. కోయంబత్తూరు వడవల్లికి చెందిన దీపక్ (45) వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఆరు నెలలుగా శునకాన్ని పెంచుకుంటూ వచ్చాడు. శునకం గత జనవరి 24 నుంచి కనిపించకుండా పోయింది. అనేక చోట్ల గాలించినా ఫలితం లేదు. దీపక్ ప్రస్తుతం దీని ఆచూకీ కోసం నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక టెంపోలో శునకం ఫొటోతో కూడిన ఫ్లెక్సీ నగరమంతటా సంచరిస్తోంది. శునకం ఆచూకీ తెలిపిన వారికి నగదు అందజేయనున్నట్లు దీపక్ తెలిపాడు. -
పెంపుడుకుక్కపై అవ్యాజమైన ప్రేమ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాటరాకుంటే ఏమి.. మనిషి కంటే విశ్వాసమున్నదానినని చాటుకుంది. మనుషుల్లో మనిషిలా కలిసిపోయి హృదయంలో స్థానం సంపాదించుకుంది. కుటుంబంలో ఒక సభ్యునిలా ప్రేమ పంచుకున్న పెంపుడు కుక్క మరణించగా బాధతో విలవిలలాడిపోయిన ఆ కుటుంబం ఎంతో గొప్పగా అంత్యక్రియలు నిర్వహించి తమ ఔదార్యాన్ని చాటుకున్న సంఘటన పుదుచ్చేరిలో జరిగింది. పుదుచ్చేరి కోరిమేడుకు చెందిన దేవరాజ్ టెంపోడ్రైవర్, ఇతని భార్య సుజాత. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుమార్తె లేదనే లోటును తీర్చుకునేందుకు 12 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆడకుక్కను తెచ్చుకుని జాకీ అనే పేరుపెట్టి ప్రేమగా పెంచుకుంటున్నారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జాకీకి చికిత్సలు చేయించినా కోలుకోలేక సోమవారం ప్రాణాలు విడిచింది.పనిపై రెండురోజులుగా తిరుపతిలో ఉంటున్న దేవరాజ్‌కు భార్య సమాచారం ఇవ్వగా తాను వచ్చేవరకు జాకీని ఐస్‌బాక్స్‌లో ఉంచమని భార్యాబిడ్డలకు చెప్పి హుటాహుటిన మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్నాడు. జాకీ మరణాన్ని తట్టుకోలేక కుటుంబమంతా కన్నీరుమున్నీరైంది. మనిషి మరణం తరువాత చేయాల్సిన సంప్రదాయాలన్నీ జాకీకి చేసిన దేవరాజ్ తన సొంత స్థలంలో జాకీని ఖననం చేశారు. -
మూగజీవిపై ఇంటి యజమాని ప్రతాపం
సాక్షి, విశాఖపట్నం ,గాజువాక: అత్తపై కోపాన్ని దుత్తపై చూపించాడన్న సామెతను నిజం చేశాడో ప్రబుద్ధుడు. తన ఇంట్లో అద్దెకున్న వారిని ఏమీ చేయలేక వారు పెంచుకొంటున్న కుక్కపై తన ప్రతాపం చూపించాడు. అద్దెకున్న వారు ఇంట్లోలేని సమయంలో ఒక పెద్ద కర్ర తీసుకొని వారి కుక్కను చావబాదాడు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు సంబంధిత వ్యక్తిపై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరా కలీం అనే మహిళ తమ కుటుంబంతో కలిసి స్థానిక చినగంట్యాడ ఈ – సేవా కేంద్రం సమీపంలోని బి.రవిబాబు ఇంట్లో అద్దెకు నివాసముంటున్నారు. యజమాని అనుమతితో ఒక కుక్కపిల్ల (చార్లెస్ రూబీ)ను కూడా తీసుకొచ్చి పెంచుకొంటున్నారు. ఏడాది కాలంగా ఇంటి యజమానికి, ఆమెకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. అగ్రిమెంట్ అమల్లో ఉండగానే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఫ్లోరా నిరాకరించారు. తనకున్న ఇబ్బందులను వివరించి కొద్దికాలంపాటు ఇల్లు ఖాళీ చేయలేనని తెలిపారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నడుస్తుండగానే ఈ నెల 23న సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తమ చర్చి ఫాదర్ మెమోరియల్ ప్రేయర్‌కు కుటుంబంతో సహా ఆమె వెళ్లిపోయారు. ఆ సమయంలో కుక్కను బాల్కనీలో కట్టారు. రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చిన వారికి కుక్క శబ్ధం చేయకపోవడంతో ఏదో అనుమానం శంకించింది. తీరా బాల్కనీలో చూస్తే కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. దాన్ని కదిపి చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కడం, ఒక్కసారిగా రక్తంతో కూడిన వాంతి చేసుకోవడంతో ఆందోళన చెందారు. అనంతరం తేరుకొని కుక్కకు వైద్యం చేయించారు. ఈ విషయంపై జంతు సంరక్షణ సొసైటీ ప్రతినిధులతో కలిసి గాజువాక పోలీసులకు 25వ తేదీ న ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు పోలీసుల పరిశీలనలో ఉంది. -
రేపిస్ట్‌ను కరిచిన పెంపుడు కుక్క..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 14 సంవత్సరాల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడుతుండగా పెంపుడు కుక్క నిందితుడిని కరిచి బాధితురాలిని కాపాడింది. పాత నేరస్తులైన ఇద్దరు నిందితులు బాలిక పెంపుడు కుక్క రెచ్చిపోవడంతో ఘటనా స్థలం నుంచి పరుగులు పెట్టారు. సాగర్ జిల్లాలో ఈనెల 18 తెల్లవారజామున ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు రాత్రి మైనర్ బాలికను తన ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి రేషు అహిర్వార్, పునీత్ అనే పాత నేరస్తులు బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని, ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న బాధితురాలి కుటుంబ పెంపుడు కుక్క ఓ నిందితుడిని కరవడంతో వారు అక్కడి నుంచి జారుకున్నారని పోలీసులు చెప్పారు. పెనుగులాటలో బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరుకుందని, ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై పోస్కో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలో బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడైందని పోలీసులు చెప్పారు. -
భైరవ కుటీరం
కుక్కలు కనిపించగానే చాలా మంది భయపడతారు. కొందరు కసురుకుంటారు. వీలుంటే ఓ రాయి విసురుతారు. కానీ ఈ కుటుంబం ఇందుకు భిన్నం. 53 శునకాలను తమతోపాటు ఇంట్లో ఉంచుకుంటున్నారు. వాటికి ప్రేమాభిమానం పంచుతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఊరికి చివర నివాసమేర్పరుచుకున్నారు. వాటి సేవలోనే రోజంతా గడుపుతున్నారు. ఆ ఇంటికి వెళ్తే భౌ భౌ అంటూ అరుపులు వినిపిస్తాయి. ఇదేంటి ..చాలా ఇళ్లలో పెంపుడు కుక్క అరుస్తుంది కదా అనుకుంటున్నారా..ఒకటైతే ఓకే..ఏకంగా 53శునకాలు.. ఆశ్చర్యంగా ఉంది కదూ..ఔను నిజమే..ఇన్ని భైరవులున్న ఆ ఇల్లు చిన్నదే..కానీ ఆ ఇంటి యజమాని మనసు మాత్రం చాలా పెద్దది. ఓ చిన్న గదిలో కుటుంబ సభ్యులుంటూ మిగిలిన చోటంతా కుక్కలకే ఇచ్చేశారు. రోజూ వాటిని ప్రేమతో సాకుతున్నారు. ఒక కుక్కను పెంచడమే కష్టమనుకునే రోజుల్లో తనసంపాదనంతా వాటికే వెచ్చిస్తున్నారు. అవి కూడా తమ కుటుంబ సభ్యులే అనిచిరునవ్వుతో సమాధానమిస్తారీ మధ్యతరగతి ప్రకృతి వైద్యుడు..ఆయన వాటినిభైరవులుగా సంబోధిస్తారు. ఆయన నిస్వార్ధ సేవ గురించి తెలుసుకుందామా.. చిత్తూరు, నాగలాపురం: అది నాగలాపురం మండలం.. రాజులకండ్రిగ గ్రామానికి దూరంగా కొండలు..పచ్చని పొలాల మధ్య ఓ ఇల్లు.. జన సంచారం పెద్దగా కనిపించదు. ఆ ఇంట్లోకి తొంగి చూస్తే ఓ ముగ్గురు వ్యక్తులు శునకాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. వారే ఏసుపాదం బాబు, ఆయన భార్య రిబ్కా, కుమార్తె ప్రియ. వీరు ముగ్గురూ జీవకారుణ్యమున్నవారే. ఆయనేమీ పెద్ద స్థోమతుపరుడు కాదు. ఇల్లుకూడా సొంతం కాదు. ఆయన సోదరిచ్చినదే. ఆత్మాభిమానం మెండు. చిన్న పాటి సేవలకే ఎంతో ప్రచారం కోరుకునే రోజుల్లో ఆయన ఏనాడూ తన సేవల గురించి ఎవరికీ చెప్పరు. ఎవరి సాయమూ తీసుకోరు కూడా. తన చిరు సంపాదనతో కుటుంబాన్ని ..భైరవులను పోషిస్తున్నారు. ఇక్కడున్న భైరవుల్లో అధిక భాగం ఎవరో గాలికొదిలేసినవే. వాటిని కన్నబిడ్డల్లా కాపాడుతున్నారు. స్వార్థ చింతన లేని ప్రేమను పంచుతున్నారు. జీవకారుణ్యం పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ కుటుంబమే. రోజంతా వీటి సేవే.. రోజూ ఈ 53 శునకాలకు స్నానపానాదులు చేయించడం, ఆహారాన్ని అందించడంలో భార్య, కుమార్తె పాలుపంచుకుంటున్నారు. వారి దినచర్య పూర్తిగా వీటితో గడిచిపోతోంది. ఏరోజూ వీటిని విడిచి ఉండలేదు..ఉండలేం కూడా అంటుంది ఆయన కుమార్తె ప్రియ. కేవలం వాటికి భోజనం పెట్టడమే కాదు అంటు వ్యాధులు రాకుండా ముందస్తు వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఇటీవలే ఒక శునకానికి చెవి వ్యాధి సోకితే చెన్నై తీసుకెళ్లి నయం చేయించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వారు ఎలా వాటిని సాకుతున్నారో తెలుసుకోడానికి. మూలికా వైద్యనిపుణలు.. ఏసుపాదం బాబుకు మూలికా వైద్యంపై మంచి పట్టు ఉంది. ఈ వైద్యాన్ని కూడా ఆయన వాణిజ్య దృక్పథం లేకుండానే అందిస్తున్నారు. జీవనశైలి మార్చుకోవడం ద్వారానే రోగాలను నయం చేసుకోవచ్చునని చెబుతారీయన. తనదగ్గర కొచ్చే రోగులకు ఈ మార్గం ద్వారానే స్వçస్థత చేకూర్చుతున్నారు. రెండు కిడ్నీలకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసరు ఇప్పుడు మామూలు మనిషయ్యారు. పూర్తిగా రోగం నయమైంది. ఫెయిత్ పవర్ పేరున పెయిన్ రిలీవర్ ఎక్స్టర్నల్ తైలం, గర్భధారణలో స్పెర్మ్ కౌంటింగ్ పెరగడానికైన వాల్యూం పౌడర్, చర్మవ్యాధులు నివారించ గలిగే (38 మూలికలతో తయారు చేసిన) పౌడర్, కరివేపాకు, నువ్వులు, సాంబార్, పప్పుల పొడులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఖాదీ భాండార్‌లో విక్రయిస్తారు. రోజు ఎనిమిదివందల రూపాయల వరకు శునకాల పోషణకు వెచ్చించడం వారి ఉదారత్వానికి నిదర్శనం. చెన్నై టు రాజుల కండ్రిగ ఇంతకీ ఏసుపాదం బాబుకు ఈ జంతుప్రేమ ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. మేం చాలా క్రితం చెన్నైనగరంలో ఉండేవాళ్లం. మొదట్లో ఒకటే భైరవుడు (శునకం) ఉండేవాడు. అది పిల్లలను పెట్టడంతో సంఖ్య నాలుగైంది. వాటి శబ్దాలకు చాలామంది అటుగా వచ్చేవారు కాదు. దీంతో ఇంటి యజమాని ఒప్పుకోలేదు. ఇల్లు ఖాళీ చేయాల్సిందేనన్నారు. ఏం చేస్తాం..ప్రేమాభిమానంతో పెంచుకున్న భైరవులను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగం మానుకున్నాను. వాటిని తీసుకుని ఊతుకోట తాలూకా బాలిరెడ్డి కండ్రిగకు మకాం మార్చాను. రాన్రానూ భైరవుల సంఖ్య పెరిగింది. అక్కడ ఉండడం కూడా ఇబ్బంది అయ్యింది. ఏదో ఒకటో చేయాలి. మనుషుల మధ్య ఉండాలంటే ఇవి దగ్గర ఉండకూడదు. కానీ మనసొప్పుకోలేదు. అందుకే మనుషులకు దూరంగా వచ్చేయాలనుకున్నాను. నాగలాపురం మండలం రాజులకండ్రిగకు కొంచెం దూరంలో భైరవులకు సౌకర్యార్థంగా ఉండేలా చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇరుకుగానే ఉంది. కానీ ఇల్లు చిన్నదని పిల్లలను వదిలేయలేం కదా..అందుకే కష్టమో నష్టమో వాటితో కలిసే ఈ ఇంటిలో జీవిస్తున్నామని ఏసుపాదంబాబు వివరించారు. ఇప్పుడు వారిల్లే భైరవాశ్రమంగా మారిపోయింది. వైద్యులు చేతులెత్తేసిన వారికి వైద్యం మొండిరోగాలని చేతులెత్తేసిన పరిస్థితుల్లోనూ ఏసుపాదం స్పందించి వైద్యం చేస్తున్నారు. ఆయుర్వేద, సిద్ధ్ద విధానాల్లో ప్రకృతి చికిత్స మార్గాలతో నయం చేస్తున్నారని ఇక్కడికొచ్చే రోగులు చెబుతున్నారు. ఇప్పుడున్న జీవన విధానాలే సర్వరోగాలకు కారణమని..వాటిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరముందని సూచిస్తారీయన. పెద్ద పెద్ద రోగాలకూ ఇందులోనే మందు ఉందంటారు. . క్యాన్సర్ రోగులనూ ఆరోగ్యవంతులుగా మార్చవచ్చంటారీయన.∙తాత, ముత్తాతల నుంచి వంశపారపర్యంగా వస్తున్న మూలికా వైద్యాన్ని ఉచితంగా అందించడం విధిగా పెట్టుకున్నారు. ఈ వైద్యుని ఇంట్లో అన్నీ మట్టి పాత్రలనే వాడటం విశేషం. అల్యూమినియం పాత్రలు, కుక్కర్లు, నాన్‌స్టిక్ తవ్వాల వాడకం శ్రేయస్కరం కాదంటారు. ధ్యానం, యోగా చేస్తూ అందరితో చేయిస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరు.. భైరవాశ్రమంలో శునకాలు పూర్తిగా శాఖాహారులు. వీటికి ఆ రకమైన తర్ఫీదునిచ్చారు. ఇక్కడ వీధి కుక్కలే కాదు వివిధ జాతులకు చెందినవి కూడా ఉన్నాయి. ప్రకృతిసిద్ధంగా లభించే గడ్డి రకాలు, గడ్డిపూలు, ఆకుకూరలు, దుంపలు, క్యారెట్టు, బీటు, నూల్‌కోల్, చౌచౌ, ఉల్లిగడ్డలు, టమాట, అటుకులు, బొరుగులు, బిస్కట్లను ఆహారంగా తీసుకుంటూ ఈ శునకాలన్నీ ఆరోగ్యకరంగా ఉన్నాయి. అంతేకాదు క్రమ శిక్షణను పాటిస్తాయి. ఆహారం తీసుకున్న సమయంలో పోట్లాడుకోవు. తన వంతు వచ్చే వరకు ఎదురుచూస్తాయి. -
పప్పీకి పెద్ద కష్టం!
హిమాయత్‌నగర్: ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఇంటి నేస్తానికి పెద్దకష్టం వచ్చింది. మనుషులను పీక్కుతింటున్న కేన్సర్ ఇప్పుడు పెంపుడు శునకాల ప్రాణాలను హరిస్తోంది. కలివిడిగా తిరిగే ఆ ప్రాణులకు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే మృత్యువాత పడుతున్నాయి. గడచిన ఆరునెలల్లో నగర వ్యాప్తంగా సుమారు 150 నుంచి 200 పెంపుడు శునకాలు ఈ వ్యాధితో చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. కుక్కల్లో వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమిస్తున్నట్టు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. నెలకు 20–30 కేసులు నమోదు ఇటీవల కాలంలో నారాయణగూడలోని సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు అనారోగ్యంతో ఉన్న పెంపుడు శునకాలను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారు. వీటిలో నెలకు ఐదారు కేన్సర్ కేసులు నమోదవుతున్నట్టు అక్కడి వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ఇతర హాస్పిటల్స్‌తో కలిపి మొత్తం 20–30 కేన్సర్ కేసులు నమోదవుతున్నట్టు గుర్తించారు. నారాయణగూడ హాస్పిటల్లో కీమోథెరపీలో స్పెషలైజేషన్ చేసిన వైద్యులు లేనందున ఇక్కడ నుంచి రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు వెటర్నరీ హాస్పిటల్‌కు రిఫర్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. తమ వద్ద కీమో సేవలు లేవంటూ అక్కడికి వస్తున్న కేసులను నారాయణగూడకు రిఫర్ చేస్తున్నారు. దీంతో ఎక్కడా సరైన వైద్యం అందక.. కేన్సర్ నయంకాక పదిరోజుల్లోనే శునకాలు చనిపోతున్నాయి. ఆరు విభాగాల్లో కేన్సర్ గుర్తింపు నారాయణగూడ హాస్పిటల్‌కు వచ్చే పెంపుడు శునకాలకు టెస్ట్‌లు చేసి వాటిలో ‘టీవీజీ, లంగ్ క్యాన్సర్, స్కిన్ ట్యూమర్, ఓరల్ క్వాలిటీ, లైపోమా, మెమ్మరీ’ వంటి వాటిని ‘ఫైన్ నీడిల్ యాస్పిరేషన్’ సైకాలజీ (ఎఫ్ఎన్ఏ) టెస్ట్ ద్వారా గుర్తిస్తున్నారు. ఈ టెస్ట్ రాష్ట్రం మొత్తం మీద ఈ ఆస్పత్రిలోనే చేరని, ఇవన్నీ కేన్సర్ రోగాలేనని డాక్టర్ బోధ స్వాతిరెడ్డి తెలిపారు. ఈ టెస్ట్‌ల్లో శునకానికి ‘బినైన్’ అని తేలితే కేన్సర్ వచ్చిన ప్రాంతాన్ని సర్జరీ ద్వారా తీసేస్తున్నారు. అదే ‘మ్యాలిగ్నేట్’ అని తేలితే మాత్రం కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చికిత్స లేకపోవడంతో జబ్బు నయంకాక శునకాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కేన్సర్‌కు ఇవీ కారణాలు.. ♦ పెంపుడు శునకాల్లో తరచుగా వస్తున్న పలు రకాల కేన్సర్లను వైద్యులు గుర్తించారు. అవేంటంటే.. ఆడ కుక్కల అండాశయాలు ‘ఈస్ట్రోజన్’ అనే హార్మొన్‌ను ఉత్పత్తి చేస్తాయి. పిల్లలు పుట్టకుండా ఆపేయడం వల్ల ఈ హార్మోన్ గతి తప్పుతుంది. దీనివల్ల శునకానికి బ్రెస్ట్ కేన్సర్ వ్యాపిస్తుంది. పిల్లలు వద్దనుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తే ఈ ముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు. ♦ ‘వెనిరీయల్ గ్రాన్యులోమా’ లోపం ఉన్న ఆడ, మగ శునకాలను క్రాసింగ్ చేయించడం వల్ల కేన్సర్ వ్యాప్తి చెందుతుంది. ఆడ శునకాన్ని మగ శునకంతో క్రాసింగ్ చేయించాల్సి వస్తే ముందుగా వైద్యుడి సూచనలు తీసుకోవాలంటున్నారు. ♦ శునకం తినే ఆహారంలో కలిసే ప్లాస్టిక్, రోజుల తరబడి నిల్వ ఉన్న నీరు తాగిన కారణంగా పలు రకాల క్యాన్సర్లు వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. దీంతో పాటు మనం ఇంట్లో పెట్టే ఫుడ్‌లో కొన్ని కెమికల్స్ కలవడం వల్ల కూడా ఈ మహమ్మారి వస్తున్నట్టు నిర్థారించారు. ♦ కేన్సర్ ఉన్న శునకంతో మేటింగ్(క్రాసింగ్) చేయిస్తే దానికున్న జబ్బు మరో కుక్కకు వ్యాపిస్తుందంటున్నారు. శునకం జీన్స్‌లో వస్తున్న అనుకోని మార్పుల వల్ల కూడా మనం కనిపెట్టలేని విధంగా వ్యాధి చంపేస్తుందంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 31 వరకు నారాయణగూడ వెటర్నరీ ఆస్పత్రిలో 35 కేన్సర్ కేసులు నమోదైనట్టు ఇక్కడి వైద్యులు తెలిపారు. ఇందులో 50 శునకాలు మృత్యువాత పడుతున్నాయన్నారు. చాలా వరకు రికవరీ.. నారాయణగూడ హాస్పిటల్‌కు నెలలో ఐదారు కేన్సర్ కేసులు వస్తున్నాయి. ‘బినైన్’ కేసులను సర్జరీల ద్వారా నయం చేస్తున్నాం. మ్యాలిగ్నేట్ వచ్చి న వాటిని రాజేంద్రనగర్‌కు రిఫర్ చేస్తున్నాం. మా వద్దకు వస్తున్నవాటిలో పెంపుడు శునకాలే కేన్సర్‌కు గురవుతున్నాయి. – డాక్టర్ బోధ స్వాతిరెడ్డి, ల్యాబ్ ఇన్చార్జి చచ్చిపోతున్నాయి.. నగర వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్‌లో నెలకు 30 కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో సుమారు 200 శునకాలు ఈ వ్యాధితో మృతి చెందాయి. – డాక్టర్ బి.భగవాన్‌రెడ్డి, రిటైర్డ్సూపరిటెండెంట్, జిల్లా అధికారి -
నేను – నా గర్ల్‌ఫ్రెండ్!
ప్రియాంక చోప్రా ఈమధ్య రోజూ వార్తల్లో ఉంటున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి కూడా ఆమె స్టార్ స్టేటస్ పెరిగిపోవడంతో ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ వార్తల్లోనూ ఉంటున్నారామె. అయితే ఈ వార్తలన్నీ ఆమె ప్రేమకథ చుట్టూనే తిరుగుతున్నాయి. కొద్దికాలంగా ప్రియాంక పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ప్రేమకథ తాజాగా ఎంగేజ్మెంట్ వరకూ వెళ్లిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వినిపిస్తోంది. సినిమాల గురించి, బ్రాండింగ్ గురించి మాట్లాడటానికి ఇష్టపడే ప్రియాంక, బాయ్‌ఫ్రెండ్ గురించి, ఎంగేజ్మెంట్ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో డిస్కషన్ అంతా ప్రియాంక చెప్పని విషయంపైనే జరుగుతోంది. ఇలా రోజూ వార్తల్లోనే ఉంటున్న ఆమె ఇవేవీ పట్టించుకోకుండా, ఎంచక్కా న్యూయార్క్ నగర వీధుల్లో తను ఇష్టంగా పెంచుకుంటున్న పెట్ డాగ్‌ను పట్టుకొని తిరుగుతున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయని ఆమె, ఈ పెట్‌ను మాత్రం ‘గర్ల్‌ఫ్రెండ్’ అని పరిచయం చేస్తున్నారు! -
బురారీ మిస్టరీ : పెట్ డాగ్ డెడ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో, మరో గుండె బద్దలయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారి.. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్ డాగ్ ‘టామీ’ హార్ట్ అటాక్‌తో మరణించింది. నోయిడా జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ పెట్ డాగ్ మరణించినట్టు హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. బురారీ కుటుంబం హత్యకు గురైనప్పుడు, ఈ పెట్ డాగ్ తీవ్ర జ్వరంతో టెర్రస్‌పై వణుకుతూ కనిపించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెట్ డాగ్ సైగల నుంచి కూడా మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ‘ఈ డాగ్‌కు అంతకముందు నుంచే పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వారికి తెలిసి ఉండకపోవచ్చు. బురారీ ట్రాజెడీ అనంతరం ఈ డాగ్‌ను కొత్త వాతావరణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు వారి ప్రేమ, ఆప్యాయల మధ్య జీవించిన ఈ పెట్ డాగ్, కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో దీని ఆరోగ్యం మరింత క్షీణించింది’ అని జంతు సంరక్షణ అధికారి చెప్పారు. కాగ, ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు ఉరివేసుకోగా.. భాటియా ఇంటి పెద్ద నారాయణ్ దేవీ గొంతు తెగి రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు, వారి ఇంట్లో కొన్ని రాత పూర్వక నోట్లను కూడా గుర్తించారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
శాకాహార పిల్లి.. యాజమానిపై విమర్శలు
కాన్బెర్రా : మనషుల్లో శాకాహారులు ఉండటం చాలా సహజం. అలా ఏళ్ల తరబడి మాంసం ముట్టకుండా కూరగాయలు తింటూ బతికేస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను పాటించే నియమాలను పెంపుడు జంతువు కూడా పాటించేలా చేశాడు. దీంతో కొంత మంది జంతుప్రేమికులు అతనిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కు చెందిన హ్యారీ బొల్మన్(53) పూర్తి శాకాహారి. గత 38 ఏళ్లుగా ముక్కముట్టకుండా కాలం గడుపుతున్నాడు. అయితే ఓ ఏడాది క్రితం ఓ పిల్లిని పెంచుకుందామని ఇంటికి తెచ్చుకున్నాడు. దానికి ఉమా అని పేరుపెట్టి దాన్ని కూడా పూర్తి శాకాహారిగా మార్చాడు. ఈ విషయం అందరికి తెలిసిపోవటంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో హ్యారీ స్పందిస్తూ.. తాను చాలా ఏళ్లుగా శాకాహారిగా ఉన్నానని, గతంతో పెంచుకున్న కుక్కలను సైతం శాకాహారులుగానే పెంచానని తెలిపాడు. ప్రస్తుతం పెంచుకుంటున్న పిల్లి కూడా శాకాహారంతో చాలా ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నాడు. అయితే సరైన మోతాదులో జంతు సంబంధమైన ప్రోటీన్లు పిల్లికి లభించకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పశు వైద్యాధికారులు తెలిపారు. -
అమ్మమ్మ అయిన యంగ్ హీరోయిన్
‘జూలి 2’తో బాలీవుడ్లో సెటిల్ అవుదామనుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బాలీవుడ్ ఈ భామను పట్టించుకోక పోయినా దక్షిణాది పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను ఆదరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక మలయాళ చిత్రం ‘ఓరు కుట్టనందన్ బ్లాగ్’, తమిళ చిత్రం ‘నీయ 2’ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న లక్ష్మీరాయ్ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. 33 ఏళ్ల ఈ హీరోయిన్ అమ్మమ్మ అయ్యిందంట. లక్ష్మీరాయ్‌కి ఇంకా వివాహమే కాలేదు. మరి అలాంటిది అమ్మమ్మ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే ఈ ‘కాంచన’ భామ రెండు కుక్కలను పెంచుకుంటుంది. వాటినే తన సొంత పిల్లల్లా భావిస్తోంది. ఈ మధ్యే ఆ రెండు కుక్కలు మరో రెండు కుక్క పిల్లలకు జన్మనిచ్చాయి. ఇదే విషయాన్ని లక్ష్మీరాయ్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చాలామంది నా ఈడు అమ్మాయిలు ఇపాటికే అమ్మలయ్యారు. కానీ నేను మాత్రం ఏకంగా అమ్మమ్మనే అయ్యాను. నా బిడ్డలు ‘మియు’, ‘లియు’.. ‘టిఫాని’, ‘పకో’ అనే మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు నా ప్రపంచం మరింత పెద్దదయ్యింది’ అనే సందేశాన్ని ట్విటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం లక్ష్మీరాయ్ తన పిల్లల(కుక్కపిల్లల) కోసం క్లౌడ్‌నైన్ ఆస్పత్రిలో ఉన్నారు. తెలుగులో ‘ఖైది నం 150’ సినిమాలో ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రత్యేక గీతంలో మెరిసిన సంగతి తెలిసిందే. -
బురారీ ఆత్మహత్యల కేసు; కీలకంగా మారిన పెట్ డాగ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో ఆ కుటుంబపు పెట్ డాగ్ కీలకంగా మారింది. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం ఆ పెట్ డాగ్ సైగలతో మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానిని జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్ డాగ్ గురించి తెలుసుకు సంజయ్ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. అది ఆనారోగ్యానికి గురైందని గ్రహించి వైద్యం అందించనట్లు సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుంత కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, ప్రస్తుతం కోలుకుంటుందన్నారు. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంటారని సంజయ్ అభిప్రాయపడ్డారు. డాగ్ ఆరోగ్యంపై పోలీసులు ఎప్పటికప్పుడూ ఆరాతీస్తున్నారని, అది కోలుకోగానే డాగ్‌స్క్వాడ్ ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని దాని నుంచి రాబట్టే అవకాశం ఉందన్నారు. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బురారీలోని సంత్ నగర్లో గత ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్(50), లలిత్ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. -
మా ‘మోతీ’ ఎక్కడ?
బంజారాహిల్స్: ఇంటి ముందు తిరుగుతున్న తమ పెంపెడు శునకం ‘మోతి’ని.. జీహెచ్ఎంసీ డాగ్ స్క్వాడ్ ఏనిమిల్ బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ కోసం తీసుకెళ్లి వదిలి పెట్టలేదని, ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ యజమానులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణ కాలనీకి చెందిన శ్రీనివాస్ నాయుడు, సరితానాయుడు దంపతులు బ్లాక్‌బెర్రి (ముద్దు పేరు మోతి) మిక్స్డ్ బ్రీడ్ రకం కుక్కను పెంచుకుంటున్నారు. ఫిబ్రవరి 5న యజమాని ఇంటి ముందు పెంపుడు కుక్క మోతీ తిరగసాగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన డాగ్‌స్క్వాడ్.. మిగతా వీధి కుక్కలతో పాటు దీన్నీ పట్టుకెళ్లారు. ఇది గమనించిన యజమాని శ్రీనివాస్ నాయుడు డాగ్‌స్క్వాడ్ వాహనం వెంబడి పరిగెత్తగా రెండు వారాల్లో సమీప ప్రాంతంలో వదిలేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అయితే తాము ఏనిమిల్ బర్త్ కం ట్రోల్ స్టెరిలైజేషన్ చేసి ఆ కుక్కను నిమ్స్ ప్రాం తంలో వదిలేశామని సమాధానమిచ్చారు.ఆ ప్రాంతమంతా శ్రీనివాస్ దంపతులు నెలరోజుల పాటు గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజిలెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. టార్గెట్ కోసమే చేస్తున్నారా..! తమ టార్గెట్ చేరుకోవడానికి డాగ్ స్క్వాడ్ వెహికిల్ సిబ్బంది పెంపుడు కుక్కలు వాటి యజమానుల ఇంటి ముందు తిరుగుతున్న సమయంలో తీసుకెళ్తున్నారని చాలా మంది విజిలెన్స్ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే తాము కుక్కలను చంపడం లేదని, స్టెరిలైజేషన్ కోసమే తీసుకెళ్తున్నామని, తర్వాత అదే ప్రాంతంలో వదిలేస్తున్నమని సెంట్రల్ జోన్ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జె.వి.విల్సన్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్క సెంట్రల్ జోన్ పరిధిలోనే 1.50 లక్షల కుక్కలు ఉన్నట్లు ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో గుర్తించారు. -
శునకాన్ని చంపారని కన్న కొడుకులపై ఫిర్యాదు!
రాయ్‌పూర్ : అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాన్ని తన కొడుకులు అత్యంత కిరాతకంగా నరికి చంపారని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని సురజ్‌పూర్ జిల్లా బాట్గాన్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. రాయ్‌పూర్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోడీ గ్రామానికి చెందిన శివమంగళ్(62) ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. పని కోసం బయటకు వెళ్లిన సమయంలో తన ఇద్దరు కొడుకులు పెట్‌డాగ్‌ను గొడ్డలితో నరికి చంపారని గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శునకం కళేబరంతో సైకిల్ తొక్కుకుంటూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అతని కొడుకు శివనాథ్ మాట్లాడుతూ.. తమ తల్లిపై దాడి చేసిందని, తీవ్రంగా గాయపరుస్తుందేమో అనే భయంతో ఆ శునకాన్ని చంపినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ వ్యాఖ్యలను శివమంగళ్ ఖండించాడు. తన శునకం ఎవరికి హాని చేయదని, అందరితో ప్రేమగా ఉంటుందని పేర్కొన్నాడు. బెయిల్‌పై నిందితులు విడుదలయ్యారు. -
షాకింగ్ : యజమానిని చంపేసిన పెంపుడు కుక్కలు
గూచ్‌లాండ్ : విశ్వాసానికి మారు పేరుగా చెప్పుకునే పెంపుడు కుక్కలే ఆ యజమానురాలి పాలిట క్రూరమృగాలయ్యాయి. అత్యంత దారుణంగా ఆమె పీకను కొరికేసి ప్రాణాలు తోడేశాయి. ఎన్నెన్నో కేసులు చేధించిన పోలీసులు సైతం బిత్తరపోయేలా చేసిన ఈ గటన అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని గూచ్లాండ్లో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. కుక్కలతో మార్నింగ్ వాక్కు వెళ్లి.. : బెతాని లిన్ స్టీఫెన్స్ అనే 22 ఏళ్ల యువతి.. గురువారం(డిసెంబర్ 14) ఉదయం పెంపుడు కుక్కలు రెండింటిని వాకింగ్‌కు తీసుకెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు తలా ఓ దిక్కుకు వెళ్లి గాలించారు. తర్వాతి రోజు (శుక్రవారం) ఉదయం.. ఇంటికీ కిలోమీటర్ దూరంలో కుక్కలను గుర్తించాడు బెతాని తండ్రి. ‘ కుక్కలు నిల్చున్న చోట ఏదో జంతువు పడిపోయి ఉన్నట్లు అనిపించింది. తీరా దగ్గరికి వెళ్లాక ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయా’ అని ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. పలు కోణాల్లో దర్యాప్తు : పిట్ బుల్ జాతికి చెందిన ఆ రెండు కుక్కలే బెతాని పీక కొరికి, ముఖాన్ని రక్కేసి చంపేశాయని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కుక్కల దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో మృతురాలి చేతులకు కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. నమ్మశక్యంకాని ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో పరిశీలన చేశారు. బెతానిని ఎవరైనా హత్యచేసి ఉంటారనిగానీ, లేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని, వైద్యులు నిర్ధారించినట్లు కుక్కలే ఆమెను కొరికి చంపేశాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని, ఇకపై చూడకూడదని అనుకుంటున్నట్లు దర్యాప్తు బృందంలోపి అధికారి ఒకరు అన్నారు. ఆ కుక్కలను చంపేయండి : తమ గారాలపట్టి బెతాని ప్రాణాలు పోవడానికి కారణమైన పెంపుడు కుక్కలను తక్షణమే అంతం చేయాలని ఆమె కుటుంబీకులు అధికారులను కోరారు. అయితే, బెతాని స్నేహితులు మాత్రం దర్యాప్తు ముగింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు కుక్కలూ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ బెతానికి అలవాటేనని, ఏనాడూ ఆమెకు హానిచెయ్యని జంతువులు.. ఇప్పుడు చంపేశాయంటే నమ్మశక్యంగా లేదని, కేసులో తేలాల్సిన విషయం ఇంకేదో ఉందని అంటున్నారు. బెతాని స్నేహితుల వాదనను దర్యాప్తు అధికారులు తోసిపుచ్చారు. -
త్రిష ఒడిలో జూనియర్!
ఆల్మోస్ట్ 15 డేస్ ఉంది. క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అవ్వడానికి. కానీ తమిళ పొన్ను (అమ్మాయి) త్రిష ఇంట్లో ఇప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అవ్వడం ఏంటీ? ఆల్రెడీ గిఫ్ట్స్ కూడా వచ్చేస్తుంటేనూ! ఈ సెలబ్రేషన్స్‌ను త్రిషతో పాటు జోయా, జోరో అండ్ కడు జూనియర్ అనే ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు. వారికి, త్రిషకు సంబంధం ఏంటీ అని తెగ థింక్ చేయకండి. ఓసారి ఇన్సెట్లో ఉన్న ఫొటో చూశారా? చూడగానే ఆ ముగ్గురూ ఎవరో అర్థమైంది కదూ! త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ పేర్లే జోయా, జోరో అండ్ కడు జూనియర్. త్రిష ఒడిలో కూర్చున్నది కడు జూనియరే. ‘‘క్రిస్మస్ సెలబ్రేషన్స్ సార్టయ్యాయి. మై లవ్స్ జోయా, జోరో, కడు జూనియర్’’ అంటూ త్రిష ట్విట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. -
కనికరం లేని మాజీ సైనికుడు.. వీడియో వైరల్
సాక్షి, బర్నాలా: ఓ మాజీ సైనికుడు తుపాకితో తన పెంపుడు కుక్కను కట్టేసి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బాద్బార్ గ్రామంలో చోటుచేసుకుంది. అజిత్ సింగ్ మాజీ సైనికుడు. బాద్బార్ తన సొంత గ్రామం. అజిత్ సింగ్ తన మిత్రుడు సత్వీర్ సింగ్‌తో కలిసి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్కను కాల్చి దారుణంగా హతమార్చాడు. ఆ సైనికుడి కుమారుడు ఆ సన్నివేశాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై స్పందించిన జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్ డీజీపీలకు లేఖ రాశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బైల్‌పై బయటకు వచ్చిన మాజీ సైనికుడు అజిత్ సింగ్ మాట్లాడుతూ.. నా పెంపుడు కుక్కకు ర్యాబీస్ వ్యాధి సోకింది.. ఈ కుక్క తన రెండు గేదెలను, చాలా మంది ప్రజలను కరిచింది అందుకే చంపానని ఆయన పోలీసులకు తెలిపారు. చాలా ప్రేమతో ఆ కుక్కను నేను పెంచుకున్నాను. అలాంటిది నేనే ఎందుకు చంపుకుంటానని మాజీ సైనికుడు చెప్పారు. కుక్క అవయావాలను టెస్టు నిమిత్తం డాక్టర్ ల్యాబ్‌కు పంపారు. -
కనికరం లేని మాజీ సైనికుడు..
-
కుక్కల కోసం లగ్జరీ పార్కు
దుబాయి: కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ లగ్జరీ పార్కును ఏర్పాటు చేయాలని దుబాయి ప్రభుత్వం నిర్ణయించింది. రస్ అల్‌ఖైమా నగర శివార్లలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది పని చేస్తుంది. ఈ పార్కులో పెంపుడు కుక్కలకు అవసరమైన అన్ని సదుపాయాలతో వాటి యజమానులకు కూడా సౌకర్యాలు ఉంటాయి. నగరంలోని అల్‌జజీరా అల్ హమ్రా ప్రాంతంలో ‘పాసమ్ పార్కు’ గా పిలుచుకునే దీనిని ఏర్పాటు చేయనున్నారు. రాక్ ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏడువేల చదరపు మీటర్ల ఏరియాలో నెలకొల్పే ఈ పార్కులో పెంపుడు కుక్కలతో వాటి యజమానులకు అన్ని సౌకర్యాలు సమకూర్చనున్నామని సెంటర్ మేనేజర్ చెంజెరాయి సిగౌక్ తెలిపారు. ఈ పార్కులో పెంపుడు శునకాలు స్వేచ్ఛగా పరుగెత్తటానికి, నడిచేందుకు దారి, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. శునకాల యజమానులు సేదతీరేందుకు కేఫ్ ఉంటుంది. కుక్కలకు బర్త్‌డే పార్టీలు జరిపేందుకు, పెట్ షోలు, పెట్ ట్రెయినింగ్ వంటి వాటికి తగిన వసతులున్నాయి. డాగ్ డే కేర్ సెంటర్‌తో పాటు కుక్కల కోసం హోటల్ కూడా ఉంటుంది. అన్ని రకాలైన, అన్ని సైజుల కుక్కలకు తగు వసతులుంటాయి. పది కిలోలు అంతకంటే తక్కువ బరువుండే కుక్కలకు, అంతకంటే పెద్ద కుక్కలకు వేర్వేరు సౌకర్యాలుంటాయని నిర్వాహకులు తెలిపారు. -
ఇక పెంపుడు జంతువులపై పన్ను!
సాక్షి, ఛండీగఢ్ : పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియాలు కథనం ప్రచురించాయి. రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను వాటికి కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల్లో మైక్రో చిప్‌లను అమరుస్తామని ప్రభుత్వం ప్రకటించటం విశేషం. కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. పంచాయితీలను మినహాయించి అన్ని మున్సిపాలిటీలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 200 నుంచి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ పన్ను కట్టకపోతే మున్సిపల్ అథారిటీలు వాటిని స్వాధీనం చేసుకునే వెసులుబాలు కల్పించారు. అయితే దీనికి న్యాయ పరమైన చిక్కులు ఎదరయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా.. అసలు ఈ చట్టం అమలులోకి వచ్చిందా? అన్నది తేలాల్సి ఉంది. నోటిఫికేషన్లో స్పష్టత లేనందునే ఈ సమస్య ఉత్పన్నమైందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క జంతు ప్రేమికులు ఈ నిబంధనలపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సరదాగా ఇంట్లో పెంచుకునే జంతువులపై పన్నులు విధించటమేంటని కొందరు నిలదీస్తుంటే.. డెయిరీ ఫామ్‌లు నిర్వహించే వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో గోవా, కేరళలోనూ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేయగా.. నిరసనలు వ్యక్తం కావటంతో వెనకడుగు వేశాయి. -
పెంపుడు జంతువుల కోసం కేన్సర్ క్లినిక్
తిరువనంతపురం: పెంపుడు జంతువుల్లో కేన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆంకాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. దీంతో మూగజీవుల్లో కేన్సర్ లక్షణాలను ముందుగానే కనిపెట్టి చికిత్స చేపట్టేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. పలోడెలోని ఛీఫ్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీజ్(సీడీఐఓ) ఏడాది కాలంగా పరిశోధనలు చేపట్టి పెంపుడు జంతువులతో పాటు పశువుల్లోనూ కేన్సర్ కేసులు బాగా పెరిగినట్లు గుర్తించింది. కాగా, కొత్తగా ఏర్పాటు చేసే కేన్సర్ క్లినిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పశువుల ఆస్పత్రుల నుంచి వచ్చే నమూనాలను పరీక్షించి కేన్సర్ ఆనవాళ్లను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అవసరమైన మేరకు చికిత్స కూడా అందిస్తుంది. మనుషుల్లో మాదిరిగానే పశువుల్లో కూడా కేన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని సీడీఐవో పాథాలజీ విభాగం వైద్యుడు నందకుమార్ తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన నమూనాలను బట్టి ప్రాణాంతక సైనస్, బ్రెస్ట్ కేన్సర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. తమ యూనిట్లో ఆయా జంతువులకు వచ్చిన ట్యూమర్లను పరీక్షించి అవి ఏరకమైనవో వెల్లడిస్తామని.. ప్రమాదకరమైనవైన పక్షంలో కిమోథెరపీ వంటి చికిత్సలకు సంబంధించి సూచనలిస్తామని చెప్పారు. తాజాగా ఏర్పాటు చేసే ఈ కేంద్రంలో ఆధునిక వ్యాధి నిర్థారణ వసతులు, అన్ని రకాల వ్యాధులను కనిపెట్టే పరికరాలుంటాయని అన్నారు. -
పిల్లి తెచ్చిన లొల్లి.. ఒకరి మృతి
ముంబై: పెంపుడు పిల్లి తెచ్చిన లొల్లి ఓ మహిళ ప్రాణాలు బలితీసింది. ఈ విచారక ఘటన ముంబైలోని పింప్రిలో చోటుచేసుకంది. స్థానికంగా నివాసముంటున్న ప్రభా-రంగ్ పిసే కుటుంబం గత కొద్ది రోజులుగా పిల్లిని పెంచుకుంటుంది. ఈ పిల్లి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పక్కింటి నందకిషోర్ సాల్వే ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో వారు భోజనం చేస్తుండగా పిల్లి ప్లేట్ లో మూతి పెట్టింది. ఆగ్రహానికి గురైన నందకిషోర్ పిల్లిన బయటకు విసిరి పాడేశాడు. ఈ విషయాన్ని నిలదీసేందుకు వెళ్లిన ప్రభాపై నందకిషోర్ కుటుంబ సభ్యులు కర్రలు, ఇనుప రాడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. ఈ సంఘటనకు కారణమైన నలుగురిని స్థానికి హింజ్ వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విద్యార్థిని చితకబాదిన పీఈటీ
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గంలోని మోడల్ స్కూలులో ఏడో తరగతి చదివే తమ కుమారుడు మహమ్మద్ ఆదిల్ అనే విద్యార్థిని పీఈటీ దివాకర్ చితకబాదినట్లు తండ్రి హెచ్.కె.బాషా ఆరోపించారు. మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత ప్రార్థన చేసేందుకు వెళ్తుండగా, ఐడీ కార్డు ఎందుకు వేసుకొని రాలేదంటూ చేతులు, కాళ్లపై విపరీతంగా కొట్టినట్లు ఆయన వివరించారు. తమ బిడ్డతో పాటు మరో ఇద్దరు విద్యార్థులనూ అతను కొట్టినట్లు చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం(రోజా) ఉన్న తమ కుమారుడ్ని కొట్టడంతో బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మోడల్ స్కూలు ప్రిన్సిపల్ ప్రకాశ్నాయుడుకు ఫోన్లో వివరిస్తే సరైన సమాధానం చప్పకపోగా.. ‘కొట్టేదే.. ఏం చేసుకుంటావో చేసుకోపో...’ అంటూ దురుసుగా మాట్లాడినట్లు ఆయన వాపోయారు. గతంలోనూ ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను కొట్టాడని తెలిపారు. ఇప్పుడు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాషా తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. ఘటనపై విచారిస్తామని చెప్పారు. -
కుక్క నా పాస్ పోర్ట్ తినేసింది.. ఇప్పుడెలా!
మాడ్రిడ్: పెంపుడు కుక్క తన పాస్ పోర్టు తినేసిందంటూ అంతర్జాతీయ ఆటగాడు లబోదిబో మంటున్నాడు. గేమ్ నిమిత్తం బ్రిటన్ వెళ్లాల్సి ఉన్న క్రమంలో ఇలా జరడడంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్పెయిన్ కు చెందిన మాథ్యూ షెపర్డ్ రగ్బీ ప్లేయర్. అతడి ఇంట్లో రెండు పెంపుడు కుక్కలున్నాయి. ఏడేళ్ల వయసున్న హనీ అనే ఆడకుక్క, ఏడు నెలల వయసున్న బ్రూట్స్ అనే మగకుక్క (కాకర్ స్పానియెల్ రకపు పెట్స్) ను పెంచుకుంటున్నారు. బ్రిటన్ కు వెళ్లడానికి తాను సిద్ధమయ్యానని, అయితే పాస్ పోర్ట్ వ్యాలిడిటీ లాంటి వివరాలు చెక్ చేసి తన రూములో ఉంచానని ప్లేయర్ మాథ్యూ షెపర్డ్ చెప్పాడు. 'పనిమీద బయటకు వెళ్లిన నేను ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో ఏవో చిన్న చిన్న కాగితం ముక్కలు కనిపించాయి. ఆ సమయంలో నా బెడ్రూమ్ లో బ్రూట్ కనిపించింది. దాని నోట్లోనూ పేపర్లు ఉండటం గమనించి చెక్ చేశాను. ఇంకేముంది.. నా పాస్ పోర్టును బ్రూట్ నామరూపాలు లేకుండా చేసి, తినేసింది. పాస్ పోర్టు ఆఫీసుకు వెంటనే పరుగులు తీశాను. వారికి జరిగిన విషయం చెప్పాను. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కనుక సాధ్యమైనంత త్వరంగా కొత్త పాస్ పోర్టు తయారు చేసి ఇస్తామన్నారు. నా పెట్ బ్రూట్స్ తప్పేంలేదు. ఎన్ని వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలి అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఇన్ని తెలిసినా బ్రూట్స్ కు అందుబాటులో నా పాస్ పోర్టు పెట్టడం నాదే తప్పు. ఇకనుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తానని' బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రగ్బీ ప్లేయర్ మాథ్యూ షెపర్డ్ వివరించాడు. -
ఫైవ్‌స్టార్ పెట్ క్లినిక్!
మనుషులకేనా ఫైవ్‌స్టార్ క్లినిక్స్? పెట్‌కు అక్కర్లేదా? కావాలి అంటున్నారు ఢిల్లీ వాసులు. వారి కోసం ‘రీనాల్ వెట్’ అనే అతి అధునాతనమైన క్లినిక్ ప్రారంభమైంది. ఇక్కడ శునకాలకు బిపి చెక్ చేయడం, రక్తం శుభ్రం చేయడం, కిడ్నీ వైద్యం, అంతే కాదు డయాలసిస్ కూడా చేస్తున్నారు. అల్లోపతిక్ విధానాల ద్వారా మాత్రమే కాకుండా ‘ఆక్యుపంక్చర్’ విధానంతో కూడా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. ‘గవర్నమెంట్ పశువైద్యశాలలో అన్నీ ఉచితంగా చేస్తారు నిజమే కాని వాటి స్థాయి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. కానీ ఈ హాస్పిటల్లో నమ్మకమైన మంచి వైద్యం దొరుకుతోంది’ అని పెట్ లవర్స్ అంటున్నారు. పెట్‌డాగ్ అనారోగ్యాన్ని బట్టి ఒక్కో విడతకు ఐదు వేల రూపాయల ఖర్చు అయ్యే వైద్యం కూడా ఇక్కడ చేయించుకుంటున్నారు. పెద్ద పెద్ద హోదాల్లో పేషంట్ల కోసం విదేశీ డాక్టర్లు రావడం మనకు తెలుసు. ఈ క్లినిక్‌లో కూడా మనం కోరితే విదేశీ పశువైద్యులు వచ్చి వైద్యం చేస్తారు. ప్రస్తుతం రీనాల్ వెట్లో ఒక బ్రెజీలియన్ డాక్టర్ కూడా పని చేస్తున్నారు. మనుషులు క్రమంగా మనుషుల తోడును కోల్పోతున్న ఈ ఆధునిక జీవితంలో పెట్డాగ్సే మనిషికి తోడుగా మారుతున్నాయి. వాటి బాగోగుల కోసం మనుషులు ఎంత ఖర్చుకైనా వెనుకాడరనడానికి ఉదాహరణే ఈ ఫైవ్‌స్టార్ పెట్ క్లినిక్. -
మా కుక్కనే పొయ్యద్దంటావా... డిష్యూం!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో చిన్న విషయమై చెలిరేగిన వివాదం కాల్పుల వరకు వెళ్లి.. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలోని అన్నపూర్ణాదేవి గుడికి వెళ్లాడు. అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క.. అటువైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోసింది. దాంతో పూరన్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా ఎలా చేస్తారంటూ మున్నాను అడిగారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో కోపం వచ్చిన మున్నా, అతడి కొడుకు కలిసి కాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులలో పూరన్ లాల్, అతడి కొడుకులు విజయ్ కుమార్, ముకేష్ కుమార్‌లతో పాటు రాంకిశోర్ శర్మ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. వాళ్లందరినీ వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. -
నాలుక్కాళ్ల యాంటీ డిప్రెసెంట్!
డాగ్టర్ పెట్‌డాగ్స్ ఇంటికే కాదు... వొంటికి కూడా కాపలానే. శారీరక, మానసిక అనారోగ్యాలు దరి చేరకుండా యజమానులను కాపాడుతుంటాయి. పెట్స్‌ను పెంచుకోవడం వల్ల డిప్రెషన్ దూరం అవుతుందని, బీపీ అదుపులో ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. అంతేకాదు... ఇంటిలో కుక్క ఉంటే యాంటీ డిప్రెసెంట్లు వాడవలసిన అవసరమే ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే పెట్ డాగ్... నాలుగు కాళ్ల యాంటీ డిప్రెసెంట్ అన్నమాట. ఇప్పుడు మానసిక వ్యాధుల చికిత్సలో అంటే నర్సింగ్ హోమ్స్‌లో దీర్ఘకాలిక చికిత్స తీసుకునే వాళ్లకోసం విజిటింగ్ డాగ్టర్స్ వస్తున్నాయి. మానసిక సమస్యలతో బాధపడే పిల్లలను రోజూ కాసేపు నిర్ణీత సమయంలో పెట్‌డాగ్స్‌తో ఆడుకోనిచ్చే ఒక థెరపీ సెషన్‌నే ప్రారంభించేశారు మానసిక వైద్యులు. ఈ సంసార జంఝాటం మాకొద్దు.. మేమిప్పుడప్పుడే పెళ్లి చేసుకోం అనీ, అసలు పెళ్లే వద్దు అనీ భీష్మించుకునే ముదురు ‘బ్రహ్మచారి’ణులకు పెట్‌డాగ్స్‌ను ప్రెజెంట్ చేస్తే చాలు.. బుద్ధిగా దారిలోకొచ్చేస్తారట. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు పెట్‌డాగ్ తోడుంటే చాలు.. వాళ్లు మరికొంతకాలం హాయిగా బతికేస్తారట. సామాజిక కార్యకర్తలలా పెట్‌డాగ్స్ కూడా సామాజిక శ్రేయోభిలాషులలా కృషి చేస్తాయి. -
నేడేవీ తల్లి! మేలైన మన జాతి కుక్కలు...
న్యూఢిల్లీ: జర్మన్ షెపర్డ్, లాబ్రడర్, సెయింట్ బెర్నాడ్...ఈ పేర్లు వింటేనే కొంత మంది పెంపుడు కుక్కల ప్రేమికులు పులకించిపోతుంటారు. వీటికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. బొచ్చుతో బొద్దుగా కనిపించడమే కాకుండా యజమానులతోని బుద్ధిగా ఉంటాయని, ఎప్పుడూ వారి చుట్టే తిరుగుతాయన్నది వారి అభిమానానికి కారణం. ఈ మూడు జాతుల మధ్య ఉన్న కామన్ గుణమే ఎక్కువ మందికి నచ్చుతుందని చెప్పవచ్చు. అదే ఎక్కువ బొచ్చు కలిగి ఉండడం. అదే చిప్పిపరాయ్, జొనాంగి, కొంబాయి...పేర్లు చెబితే ప్రపంచంలోని పెంపుడు కుక్కల ప్రేమికులే కాదు, భారతీయ ప్రేమికులు కూడా అవేమిటో గుర్తుపట్టక గుడ్లు మిటకరించడం ఖాయం. ఇవన్ని అంతరించిపోతున్న భారతీయ కుక్కల జాతులు. విదేశీ కుక్కల మోజులో నిరాధరణకు గురవడంతో ఎన్నో భారత జాతి కుక్కలు అంతరించిపోగా, ఇప్పటికీ ఓ పాతిక జాతులు మిగిలి ఉన్నాయని ఎస్ థియోడర్ భాస్కరన్ తెలియజేస్తున్నారు. జంతు ప్రేమికుడు, వన్యప్రాణి సంరక్షణ వాదైన భాస్కరన్ భారత్‌లోని కుక్కల జాతిపై 40 ఏళ్లపాటు పరిశోధనలు జరిపి ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ డాగ్స్’ పేరిట పుస్తకం రాశారు. దోపిడీ దొంగల బారి నుంచి ప్రజలను కాపాడిన, అడవి జంతువుల నుంచి పశువులు, గొర్రెలను రక్షించిన చరిత్ర మన కుక్క జాతులది. చిరుత పులులతోటి, నక్కలతోటి వీరోచితంగా పోరాడి పశువులు, గొర్రెలను పరిరక్షించిన ఘన చరిత్ర కూడా ‘హౌండ్స్’ కుక్కల జాతీ మనదే. ఊరి పొలిమేరలో శత్రు కదలికలను కనుగొనడంలో, కంటిమీద కునుకేయకుండా నిఘా వేయడంలో మన జాతి కుక్కలు మేలైనవి. గొడ్డులా పనిచేయడం కూడా మన కుక్కలకు తెలుసు. అందుకే మనల్ని ఆంగ్లేయులు ‘వర్క్ లైక్ ఏ డాగ్’ అని అనేవారట. హిమాలయ, సిక్కిం రాష్ట్రాల్లో కనిపించే లాసాఅప్సో జాతి కుక్కలను ఒకప్పుడు రాజుల కోటల్లో కాపలా కోసం ఉపయోగించేవారట. వేటలో ఆరితేరిన ‘హౌండ్స్’ జాతి కుక్కలు ఇక వేటలో ఆరితేరినవి ‘హౌండ్స్’ జాతి కుక్కలు. వీటిలో బంజారా హౌండ్స్, వగారి హౌండ్, రాంపూర్ హౌండ్ ముదోల్ హౌండ్ అనే పలు రకాల జాతులున్నాయి. ఇవి వేటలో ఆరితేరినవే కాకుండా పశువులను, మనుషులను అటవి క్రూర మగాల నుంచి రక్షించడంలో ప్రాణాలను పణంగా పెట్టేవి. ఈ జాతి కుక్కల పేరుతోనే ‘గ్రే హౌండ్స్’ దళాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందే. ఎప్పుడు బంజారాలతో ఉంటూ వారి ఆస్తులకు, పశువులకు రక్షణ కల్పించడం వల్ల హౌండ్స్ జాతిలో ఒకదానికి ‘బంజారా హౌండ్స్’ అని పేరు వచ్చింది. బంజారా వాళ్లు స్వయంగా పశువుల పోషకులు కాకపోయినా ఒక రైతు పశువులను సంతకు తీసుకొల్లేవారు. సంతలో కొన్న పశువులను క్షేమంగా రైతుల ఇళ్లకు తీసుకొచ్చేవారు. ఇదే పనిమీద వారు ఊరు, వాడ అనకుండా అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు తిరిగేవారు. వారి వెంట తోలుకెళ్లే పశులతోపాటు వారికి కాపలాగా ఈ జాతి కుక్కలు వ్యహరించేవి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కనిపించే జొనాంగి జాతి కుక్కలు కూడా ప్రజలకు రక్షణ కల్పించేవి. మధురై ప్రాంతానికి చెందిన కొంబై జాతి, విజయనగరం సామ్రాజ్యానికి చెందిన పండికోన జాతి కుక్కలు ఇప్పటికీ ఏపీలోని నెల్లూరు జిల్లాలో కనిపించడం విశేషం. అంతరించిపోతున్న జాతి కుక్కలు కాలంతోపాటు పాలకులు మారడం, పరిస్థితులు మారడం, ప్రజలు మారడం వారి సంస్కతి మారడం లాంటి కారణాల వల్ల దేశీయ కుక్కల జాతులు అంతరించి పోతున్నాయి. బ్రిటీష్ కాలంలో పాలకులు ఆ దేశం నుంచి వారి జాతి కుక్కలను తెచ్చుకోవడం, భారత రాజులు కూడా అలాంటి జాతుల పట్ల మోజు చూపించడం, విదేశీ కుక్కలతో దేశీయ కుక్కలు సంకరం మొదలవడం తదితర కారణాల వల్ల స్వజాతి కుక్కలు అంతరించిపోతున్నాయని భాస్కరన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశీ కుక్కల జాతిని రక్షించుకునేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కెన్నల్ క్లబ్ ఆఫ్ ఇండియా’ ఈవిషయంలో కొద్దిగా చొరవ తీసుకుంటోది. ఆ సంస్థకు ప్రభుత్వ చర్యలు తోడవితే ప్రస్తుతం విదేశీ జాతి కుక్కల మీద చూపిస్తున్న మన ప్రజల ప్రేమ మన జాతి కుక్కల మీదకు మళ్లుతుందేమో! -
పెంపుడు కుక్కతో సచివాలయానికి సీఎస్!
ఫొటోలు తీసిన మీడియాపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: రెండో శనివారం సచివాలయానికి సెలవు.. ఉన్నతాధికారులు హాలీడే మూడ్‌లో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మాత్రం ఉదయం 11.40 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మరో కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ కారులో నుంచి ‘మరొకరు’ కూడా దిగారు. వీరంతా ఏదో ముఖ్యమైన పనిపై వచ్చారేమో అని అందరూ అనుకున్నారు. వారంతా కలసి పైకి వెళ్తున్న సమయంలో కెమెరాలతో ఆ చిత్రాలను బంధిస్తున్న మీడియాపై సీఎస్ మండిపడ్డారు. అయితే ఆయన తన ఇంటి పని మనుషులతోపాటు పెంపుడు కుక్కను సచివాలయానికి తీసుకువచ్చారు. ఆ ఫొటోలు తీసేందుకు మీడియా ప్రయత్నిం చడంతోనే ఎస్పీ సింగ్ కోపంతో ఊగిపోయారు. -
విశ్వాసమంటే ఇదేనేమో!
నర్సంపేట: విశ్వాసం చూపడంలో శునకానికి ఉన్న ప్రత్యేకత మరే జంతువుకు లేదు. అన్నం పెట్టిన యజమాని కోసం ఏ పనైనా చేయగలదు. ఇందుకు నిదర్శనమే వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సంఘటన.. తనను పెంచుకున్న యజమాని కూతురికి గాయమైతే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడున్న సిబ్బందికి విషయం చెప్పడానికి ప్రయత్నించింది. నర్సంపేటలోని పోశమ్మ వీధికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కుక్కను పెంచుకుంటున్నాడు. గురువారం ప్రసాద్ కుమార్తె అక్షిత (రేణుక) ఇంటి ముందు సైకిల్‌పై నుంచి పడిపోవడంతో పెదవికి తీవ్ర గాయమైంది. దీంతో అక్కడే ఉన్న శునకం పరుగు పరుగున సమీపంలో ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోకి వెళ్లి అటు ఇటు తిరగడం.. సిబ్బందికి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేసింది. ఇదంతా గమనించిన ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు శునకం ప్రయత్నం అర్థంకాక చూస్తుండి పోయారు. అప్పుడే శునకం యజమాని ప్రసాద్ కూతురును తీసుకుని ఆస్పత్రికి వచ్చేసరికి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నారు. చిన్నారికి గాయమైన విషయాన్ని చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన శనకాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో శునకం కంటతడి పెట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. -
యజమానిని రక్షించేందుకు..
షికాగో: విపత్కర సమయాల్లోనూ యజమాని పట్ల శునకాలు విశ్వాసాన్ని చాటుకుంటాయి! మిషిగాన్‌లోని పెటోస్కెయ్లో నివసించే బాబ్ అనే వ్యక్తి కొత్త ఏడాది రోజు కట్టెలు తెచ్చుకునేందుకు వ్యవసాయ క్షేత్రం నుంచి పెంపుడు కుక్క కెల్సీతో బయలుదేరాడు. కొద్దిదూరం నడిచాక కాలు జారి మంచులో పడి కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బాబ్ను గమనించిన కెల్సీ మొరగటం మొదలుపెట్టింది. అయితే సమీపంలో ఎవరూ లేరు. దీంతో కెల్సీ.. బాబ్ శరీరంపైకి ఎక్కి చలి నుంచి రక్షణగా ఉండి తెల్లవారే వరకు అతను స్పృహ కోల్పోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరుసటి రోజు బాబ్ స్పృహ కోల్పోయినా.. కెల్సీ మాత్రం యాజమానిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాబ్ను బయటికి తీసి రక్షించాడు. -
పీఈటీలకు శుభవార్త!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ)కు శుభవార్త. జిల్లాకు 98 పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (పీడీ)గా అప్‌గ్రేడేషన్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు జాబితా చేరింది. 2009లో జిల్లాకు 30 పీడీ పోస్టులు మంజూరయ్యాయి. మళ్లీ ఇప్పుడు 98 పోస్టులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం సుమారు 300 మంది పీఈటీలు పని చేస్తున్నారు. వీరిలో 200 మంది కాదా బీపీడ్ చేశారు. అంటే వీరందరూ పదోన్నతులకు అర్హులు. మంజూరు చేసిన 98 పోస్టుల్లో 2001 డీఎస్సీ నుంచి ఎంపికైన వారికి అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 2006 డీఎస్సీ వారికి ఒకరిద్దరికి పదోన్నతులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అధికంగా కనేకల్లు మండలంలో నాలుగు పోస్టులు, లేపాక్షి. డి.హీరేహాల్, విడపనకల్లు, గోరంట్ల, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, మండలాల్లో మూడు పోస్టులు మంజూరయ్యాయి. అలాగే పలు మండలాలకు రెండు, ఒక్కో పోస్టు మంజూరైంది. -
డిసెంబర్ 15లోగా అసెంబ్లీ భవన నిర్మాణం
- గడువును నిర్దేశించామన్న స్పీకర్ కోడెల - శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే సాక్షి, అమరావతి: వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తిచేసేందుకు డిసెంబర్ 15ను గడువుగా నిర్దేశించినట్లు శాసనసభాపతి డా.కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈమేరకు నిర్మాణ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం శాసనమండలి చైర్మన్ డా.చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీశ్‌రెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి యనమల రామకృష్ణుడు, శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ, డీజీపీ నండూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తదితరులతో కలసి నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవన నిర్మాణాలను పరిశీలించారు. శాసనసభ శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా హక్కుల సంఘానికి సిఫారసు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని నివారించేందుకు నూతన సమావేశమందిరంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిసెంబర్ ఆఖరు లేదా జనవరి మొదట్లో అసెంబ్లీ! ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా జీఎస్టీకి సంబంధించిన బిల్లులను ఆమోదించనుంది. అవసరమైతే ఒకటి, రెండు రోజులు అదనంగా సమావేశాలు నిర్వహించి శాసనసభ శీతాకాల సమావేశాలను మమ అనిపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గం
అనంతపురం ఎడ్యుకేషన్ : నవ్యాంధ్ర పీఈటీ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఉపాధ్యాయ భవనంలో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎం. రమేష్‌రెడ్డి, అధ్యక్షుడిగా బి.ప్రసాద్, ప్రధానకార్యదర్శిగా కె. రాజశేఖర్, ఆర్థికకార్యదర్శిగా ఎం. ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా రిజ్వానా, గోవిందప్ప, సంయుక్తకార్యదర్శులుగా ఆర్. లస్కర్‌నాయక్, కళా సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి. మల్లోబన్న, కృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు. ముఖ సలహాదారులుగా ఎం. శేషాద్రి, బి. చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం. రవీంద్ర, హరుణ్‌బాషాతో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
ఆ కుక్క కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు!
తమ పెంపుడు కుక్క అదృశ్యమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త కొప్పల లలిత్ ఆదిత్య బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. లాబ్రిడార్ జాతికి చెందిన ఈ కుక్కకు టింబర్ అనే పేరు పెట్టుకొని కుటుంబసభ్యులతో సమానంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని, ఈ నెల 14 సాయంత్రం నుంచి కనిపించడంలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. టింబర్ అదృశ్యమైనప్పటి నుంచీ తన ఇద్దరు పిల్లలూ కన్నీరుమున్నీరవుతూ అన్నం కూడా ముట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుక్క ఆచూకీ తెలిసిన వారు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని తన నివాసంలో లేదా.. 9849000715 నెంబర్లో కాని సంప్రదించాలని కోరారు. రూ. 50 వేల విలువ చేసే ఈ డాగ్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... దాని ఆచూకీ కనుగొనేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. -
క్రూరుడైనా కుక్కలంటే ప్రేమ
* నయీమ్ పెంపుడు కుక్కల * ఆహారానికి ప్రత్యేక మెనూ సాక్షి, హైదరాబాద్: క్రూరమైన చరిత్ర.. కరుడుగట్టిన నేరగాడు నయీమ్‌కు తన పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. అల్కాపురి టౌన్షిప్లో ఉన్న ఇంట్లో నయీమ్ రెండు శునకాలను పెంచాడు. సరిహద్దులో పహారా కోసం భద్రతా బలగాలు వినియోగించే డాల్మటైన్ జాతికి చెందిన ఈ శునకాలను నగరంలోని ఓ కెన్నల్ నుంచి భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేశాడు. వాసన, చిన్నపాటి కదలికలు గుర్తించడంలో దిట్టలైన ఈ శునకాలకు ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇప్పించాడని తెలిసింది. వీటికి శాండో, కోమి అని పేర్లు పెట్టుకున్నాడు. కుక్కల ఆరోగ్యాన్నిపర్యవేక్షించేందుకు నయీమ్ ప్రత్యేకంగా ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేశాడు. ఆ శునకాలకు ఆహార, ఆరోగ్య నియమాల్లో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. వైద్యుడి సూచనల మేరకు రోజువారీ ఆహారం, టానిక్స్ సంబంధించి ఓ పట్టిక తయారు చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా బోన్లు పెట్టి, ‘శాండో, కోమిల ఆహార, సమయ సూచిక’ పేరుతో ఓ బోర్డు ఏర్పాటు చేయించాడు. -
కుక్కను కాపాడబోయి..
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం - పాలమూరు జిల్లాలో ఘటన కోస్గి: అడవి పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. కంచెకు తగిలి షాక్‌కు గురైన పెంపుడు కుక్కను కాపాడబోయి యజమాని, అతన్ని కాపాడబోయి కుమారుడు, కుమారుడిని కాపాడబోయి తల్లి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం తోగాపూర్ అనుబంధ గ్రామం పందిరి హన్మండ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుడుం వెంకట య్య (60)కు పది ఎకరాల భూమి ఉంది. చేను వద్దనే ఇంటిని నిర్మించుకున్నారు. వెంకటయ్య, అమృతమ్మ దంపతులతో పాటు కుమారుడు కిష్టప్ప (38), కోడలు యాదమ్మ నివాసం ఉంటున్నారు. జొన్నపంటను అడవి పందులు నాశనం చేస్తుండడంతో వాటి బారి నుంచి పంటను కాపాడుకునేందుకు చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశా రు. వెంకటయ్య రోజూ రాత్రి కంచె వేసి ఉద యం తీసేవాడు. కానీ శుక్రవారం ఉదయం మరిచిపోయాడు. విద్యుత్ కంచెకు తగిలి పెం పుడు కుక్క విలవిల్లాడుతుండగా దాన్ని కాపాడబోయి విఫలయత్నం చేశాడు. అనంతరం తాడుతో కట్టి బయటికి లాగుతుండగా షాక్‌కు గురై వెంకటయ్య (60) మరణించాడు. గమనించిన కుమారుడు కిష్టప్ప పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కాపాడబోయి అతనూ షాక్‌కు గురై కొట్టుమిట్టాడుతుండగా, ఆతృతతో వచ్చి న అమృతమ్మ (58) కూడా విద్యుత్ ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న యాద మ్మ వెంటనే కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చే చూసేసరికి ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఒకరిని కాపాడబోయి మరొకరు ఇలా విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోస్గి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంశంలో ఒక్కడే కుమారుడు వెంకటయ్య కుటుంబంలో మగపిల్లవాడు ఒక్క డే ఉన్నారు. వెంకటయ్య వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. వెంకటయ్యకు కూడా కిష్టప్ప ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, కిష్టప్పకు కూడా ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అవ్వ, తాతలతో పాటు తండ్రి మృతి చెందడంతో నిరాశ్రయులైన ఆ చిన్నారుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. రెండో కూతురు శిరీషా ఈ ఘటనను చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. -
కుక్క మాంసం తినకండయ్యా..
కుక్క మాంసాన్ని ఇష్టంగా తినే చైనాలో పుట్టి.. పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని ప్రపంచ యాత్ర చేయడం.. ఆ యాత్రద్వారా కుక్క మాంసభక్షణ వద్దని పిలుపునివ్వడం 29 ఏళ్ల జియావో యూ ను వరల్డ్ ఫేమస్ చేశాయి. అతని స్ఫూర్తికి ప్రపంచ జంతు ప్రేమికులు సలాం చేస్తున్నారు. ప్రొఫెషనల్ పెట్ ఫొటోగ్రాఫరైన జియావో .. చైనా జియాంగ్షు ఫ్రావిన్స్ లోని షుజో సిటీకి చెందిన వ్యక్తి. ఓ రోజు దారిన వెళుతుండగా చెత్త కుండీ పక్కన స్పానిష్ వాటర్ డాగ్ ఒకటి కనిపించిందతనికి. బహుషా అది డాగ్ స్మగ్లర్ల చేతిలో నుంచి తప్పించుకొని వచ్చిందేమో అనుకుని చేరదీసి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రాత్రి అతని ఆలోచనలన్నీ కుక్కలు, కుక్క మాంసం, కుక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగాయి. తెల్లారేసరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన పెంపుడు కుక్క హ్యారీ(అదే.. మన స్పానిష్ కుక్క)తో కలిసి సైకిల్ పై ప్రపంచ పర్యటనకు బయలుదేరాడు. వీలైనంత దూరం సైకిల్ తొక్కడం, కుదరకుంటే, విమానమో, ఓడో ఎక్కిదిగుతూ.. ఏడాదిలో దాదాపు 23 దేశాలు చుట్టొచ్చాడు. 'చైనీయులు కుక్కల్ని చంపి తింటారని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ చైనీయులు కూడా కుక్కలను ప్రేమిస్తారని రుజువుచేసేందుకే పెట్ డాగ్ తో ప్రపంచయాత్ర చేశా' అంటున్నాడు జియావొ యూ. ఇటీవలే తన యాత్రకు సంబంధించిన ఫొటోలు, వివరాలను పుస్తక రూపంలో విడుదలచేశాడు. చైనీయులు.. మీ సోదరుడి మాట వినైనా కుక్క మాంసం మానండయ్యా..! -
పెంపుడు కుక్కల దాడిలో యజమాని హతం
వేలూరు: పెంపుడు కుక్కల పాశవికదాడిలో యజమాని ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తోన్న కృపాకరం అనే వ్యక్తి.. రాట్ వీలర్ జాతికి చెందిన ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. వేలూరుకు సమీపంలోని తన మామిడి తోటలో కుక్కను కాపాలగా ఉంచి, రోజూ వస్తూ పోతూఉండేవాడు. దాదాపు 50 కేజీల బరువు, అరమీటరు ఎత్తుండే ఆ కుక్కను క్రాసింగ్ చేసే నిమిత్తం.. ఇటీవల అదే జాతికి చెందిన ఓ మగకుక్కను తీసుకొచ్చాడు. రెండు కుక్కలకు తానే స్వయంగా ఆహారం పెట్టేవాడు. మంగళవారం డ్యూటి నుంచి ఆలస్యంగా వచ్చిన కృపాకరం రాత్రి 10 గంటల సమయంలో మామిడితోటకు వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టే ప్రయత్నం చేశాడు. ఏరకమైన చిరాకులో ఉన్నాయోగానీ.. రెండు రాట్ వీలర్ కుక్కలు ఒక్కసారే యజమాని మీద దాడిచేశాయి. ముఖం, ఎద, పొట్ట భాగాన్ని ఖండఖండాలుగా పీకిపారేశాయి. కృపాకరం హాహాకారాలు చేయడంతో తోట పరిసర ప్రాంతాల్లోని రైతులు పరుగుపరుగున వచ్చి.. కుక్కలను అదిలించి, రక్తపు మడుగులో పడిఉన్న అతనిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడం కృపాకరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మాయదారి కుక్కలు ఎంతపని చేశాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న బానవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర పళ్లు, బలమైన దవడలు కలిగిన రాట్ వీలర్ (జర్మన్) జాతి కుక్కల పెంపకంలో అసమాన శ్రద్ధ అవసరమని, ఆదేశాలు పాటించడం నేర్పకపోతే అవి యజమానిపైనే దాడికి దిగుతాయని వేలూరు వణ్యప్రాణి సంరక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ చెబుతున్నారు. -
కుక్క దూరమైందని మహిళ ఆత్మహత్యాయత్నం
టీనగర్ (చెన్నై): ప్రాణంగా పెంచుకున్న కుక్కను భర్త అడవిలో విడిచిపెట్టడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన తమిళనాడులో సంచలనం కలిగించింది. నామక్కల్ జిల్లా పరమత్తివేలూరు సుల్తాన్‌పేటకు చెందిన పెరుమాళ్ కూరగాయల వ్యాపారి. ఇతని భార్య శాంతి (35). ఇంట్లో కుక్కను పెంచుతోంది. దీన్ని భర్త వ్యతిరేకించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కుక్క, పిల్లలను కనింది. దీంతో విసిగిపోయిన పెరుమాళ్ ఒక గోనె సంచిలో పిల్లలతోపాటు తల్లి కుక్కను అడవిలో వదిలిపెట్టాడు. బయటికి వెళ్లిన శాంతి ఇంటికి రాగానే కుక్క లేకపోవడంతో భర్తను ప్రశ్నించింది. వాటిని అడవిలో వదిలినట్టు భర్త చెప్పడంతో ఆమె భర్తతో గొడవపడింది. భర్త బయటికి వెళ్లగానే శాంతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు మంటలార్పి పరమత్తివేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
ఈ స్నేహం సూపరో సూపర్..
తైపీ: ఈ మధ్య మనుషులకే సంబంధాలు ఇమడం లేదుగానీ.. పుట్టుకతోనే బద్ధశత్రువులైన కుక్క పిల్లి, పిల్లి ఎలుక, ఎలుక పామువంటికి మాత్రం స్నేహం ఇట్టే కుదిరిపోతోంది. అది ఎంత గాఢంగా అంటే తమ ముందున్న ఎలాంటి సమస్యనైనా అధిగమించి శత్రువనుకున్నవారిని మిత్రువుగా మార్చుకునేంత. ఈ అంశానికి తైపీలోని ఓ పెంపుడు జంతువుల ఇల్లు సజీవ సాక్ష్యంగా నిలిచింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దాదాపు 14లక్షలమందికి పైగా ఈ వీడియోను చూశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.. తైవాన్ లోని తైపీ నగరంలోగల జోలిన్ పెట్ హౌజ్‌లో ఓ బుజ్జి కుక్క పిల్ల(జై)ను, మరో బుజ్జి పిల్లి(వీరు)ని వేర్వేరు గ్లాస్ నిర్మాణాల్లో పెట్టారు. అవి పైకి ఎక్కి పారిపోలేనంత పకడ్బందీగా ఏర్పాటుచేశారు. పక్కపక్కనే ఉన్న జైకి, వీరుకి స్నేహం కుదిరింది. కానీ, అస్సలు కలుసుకోలేవు. ఎందుకంటే మధ్యలో గ్లాస్ అడ్డు. అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్లే అవి కాస్త మెలకువ వచ్చినప్పుడు మాత్రం ఒకదానిని ఒకటి చూసుకుంటూ మురిసిపోతుండేవి. ఒక రోజు బుజ్జి జై చిన్న కునుకు తీస్తుండగా తెలివైన వీరు మ్యావ్ అని అరుస్తూ గ్లాస్ గోడపైకి ఎక్కేసింది. వాస్తవానికి అక్కడి నుంచి అది పారిపోవచ్చు.. అయితే అప్పటికే నిద్రపోతున్న తన స్నేహితుడు జై నిద్ర లేచాడు. వెంటనే తన స్నేహితుడిని ఆహ్వానిస్తూ తన ముందు కాళ్లు అందించాడు. ఒక్కసారిగా మిత్రుడి స్పర్ష తగలడంతో మరింత కష్టపడి జైతో కలిసిపోయింది వీరు. ఇన్ని రోజులు పక్కపక్కనే ఉన్నా.. దూరమైన తన స్నేహితుడు తన పక్కకే వచ్చేసరికి బుజ్జి కుక్కపిల్ల సంతోషంతో తోకను ఊపుతూ ప్రేమగా తన మిత్రుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అదెలాగో ఆ వీడియోను మీరే చూడండి. -
అక్కడ కుక్క, పిల్లులకూ శ్మశానాలు
బీజింగ్: మనం పెంచుకుంటున్న కుక్క, పిల్లి, చిలుక మరణిస్తే ఏం చేస్తాం? వాటిని తీసుకెళ్లి మున్సిపాలిటీ వ్యాన్‌లో పడేస్తాం లేదా ఇంటి వెనకాల పెరట్లో గుంత తీసి పాతేస్తాం. కానీ చైనాలో అలా చేయడం నేరం. అందుకనే అక్కడ పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశానాలే వెలిశాయి. వెలుస్తున్నాయి కూడా. అలాంటి వాటిలో ఒకటి బీజింగ్ శివారులో వెలసిన ‘బైఫూ పెట్ హెవెన్’. అది 6.7 హెక్టార్లు విస్తరించి ఉంది. పెట్ హెవెన్‌లో వేలాది చెట్లను పెంచారు. చెట్టు వద్దనే పెంపుడు జంతువులను ఖననం చేయాల్సి ఉంటుంది. ఒక్కో చెట్టుకు 20వేల రూపాయల నుంచి 44 వేల రూపాయలను వసూలు చేస్తారు. తాము 2005లో ఈపెట్ సర్వీసును ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల చెట్లు అమ్ముడు పోయాయని, ప్రజలు దాదాపు 20వేల పెంపుడు జంతువులను ఖననం చేశారని బైఫూ పెట్ హెవెన్ వ్యవస్థాపకుడు చెన్ షావోచున్ తెలిపారు. చైనాలో ఏటా 42.5 లక్షల పెంపుడు కుక్కలను, 20 లక్షల పిల్లులను ఖననం చేస్తున్నారని ‘డాగ్స్ ఫాన్స్’ మేగజైన్ వెల్లడించింది. ఈ ఖననాల సంఖ్య ఏడాదికి 30 శాతం పెరుగుతోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కోటి పెంపుడు కుక్కలను, పిల్లులు, పక్షులు, ఇతర జంతువులను కలుపుకుంటే దాదాపు పది కోట్ల జంతువులను ఖననం చేసి ఉంటారని 2014లో జరిపిన ఓ సర్వే తెలిపింది. ‘అదర్ సైడ్’ అనే మరో పెట్ క్రిమేషన్ కంపెనీ ఇటీవల చైనా నగరాల్లో విస్తరిస్తూ వస్తోంది. తాము పెంపుడు జంతువు బరువునుబట్టి చార్జీ తీసుకుంటామని, స్థానిక కరెన్సీ ప్రకారం వంద యాన్ల నుంచి వెయ్యి యాన్ల వరకు వసూలు చేస్తామని క్రిమేటర్ వాంగ్ జిలాంగ్ తెలిపారు. తాను ఇప్పటి వరకు కుక్కలు, పిల్లులే కాకుండా చిలుకలు, కుందేళ్లు, తాబేళ్లను కూడా ఖననం చేశానని ఆయన అన్నారు. తమ జంతువుల శ్మశానానికి వచ్చే వారిలో పేదలు, ధనవంతులు అనే తేడా ఉండదని, ఎవరైనా బరువునుబట్టి చెల్లింపులు సమర్పించుకోవాల్సిందేనని ఆయన అన్నారు. పెంపుడు జంతువులను పెరట్లో పాతిపెట్టినా, చెత్త కుప్పల్లో పడేసినా అంటురోగాలు వ్యాపిస్తాయనే ఉద్దేశంతో వాటిని నిషేధిస్తూ చైనా చట్టాలు తీసుకొచ్చింది. 2014లో ఈ చట్టాలను మరింత కఠినతరం చేసింది. అప్పటి నుంచి చైనా ప్రజల్లో చైతన్యం పెరిగింది. జంతువులను చిన్నపాటి జబ్బు చేసినా ఆస్పత్రికి తీసుకెళ్లే అలవాటు కూడా బాగా పెరిగింది. దేశంలో బ్యాచ్‌లర్ కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్లుగానే పెంపుడు జంతువుల సంఖ్య కూడా పెరుగుతోందని పెకింగ్ యూనివర్శిటీ సోషియాలోజి ప్రొఫెసర్ జీ జ్యూలాన్ తెలిపారు. పెంపుడు జంతువుల పెరుగుతున్న అవసరాలను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిధులతో మరిన్ని ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. cremation, dogs, cats, Beijing, pet heven, కుక్క, పిల్లులకు శ్మశానాలు, బీజింగ్, బైఫూ పెట్ హెవెన్ -
కుక్కలకూ కు.ని.
♦ స్పెషల్ డ్రైవ్‌గా సంతాన నిరోధక ఆపరేషన్లు ♦ ఆరు నెలల్లో 70 శాతం లక్ష్యం ♦ పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వీధి కుక్కలకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా సంతాన నిరోధక ఆపరేషన్లతో వీధి కుక్కల పునరుత్పత్తి కట్టడి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో ఆరు లక్షలకు పైగా వీధి కుక్కలు ఉండగా, స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆరు నెల ల్లో వాటిలో 70 శాతం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించా రు. ఇందులో జీహెచ్ఎంసీ వెటర్నరి విభాగంతో పాటు రాష్ట్ర పశు సంవర్థక శాఖ సేవలను కూడా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో ఎనిమల్ కేర్ సెంటర్లను ఐదు నుంచి తొమ్మిదికి పెంచాలని నిర్ణయించారు. మంగళవారం జీహెచ్ఎంసీలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పశుసంవర్థక శాక డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సీనియర్ అధికారి డాక్టర్ సంపత్‌కుమార్, జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. జంటకు నాలుగువేల ఉత్పత్తి ఒక కుక్కల జంట ఏడేళ్లలో 4 వేల కుక్కలు ఉత్పత్తి సేస్తుంది. కుక్క జీవిత కాలం 8 నుంచి 11 సంవత్సరాలు కాగా, ప్రతి ఎనిమిది నెలలకు ఒకసారి నాలుగు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తోంది. నగరంలో ఉన్న సుమారు ఐదున్నర లక్షల వీధి కుక్కల్లో పునరుత్పత్తి రేటు అధికంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ప్రైవేటులో ఆపరేషన్లు ప్రైవేటు సంస్థల ద్వారా కూడా కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 11 మంది ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లు, 24 మంది ప్రైవేటు డాక్టర్లు 102 డాగ్ క్యాచర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేటు డాక్టర్లతో పాటు వెటర్నరీ ఆసుపత్రుల్లో కూడా వీధి కుక్కలకు ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ నగరంలోని వంద శాతం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయనున్నటు కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా ఏటా లక్ష కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. రెబిస్ రహిత నగరంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెబిస్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీతో కలిసి పనిచేసేందుకు సిద్దమేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకుగాను కనీసం 20 మంది డాక్టర్లను ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేబిస్ కేసులు తగ్గుముఖం జీహెచ్ఎంసీ పరిధిలో గత రెండేళ్లలో రేబిస్ వ్యాధితో ఒక్కరు కూడా మరణించలేదని నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. గత రెండేళ్లలో 61,749 మంది కుక్క కాటుకు గురైనట్లు వారు పేర్కొన్నారు. ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పని సరి ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పనిసరి చేశారు. జీహెచ్ఎంసీలో రూ. 50 చొప్పున చెల్లించి ప్రత్యేక నంబర్ లెసైన్స్ పొందాల్సి ఉంటుందని, లెసైన్స్‌లేని కుక్కలను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. -
విధేయతకు ఇంతకన్నా నిదర్శనం లేదేమో!
కుక్కలు గురించి మనం అప్పుడప్పుడు చులకనగా మాట్లాడుతాం కానీ.. అవి మనుషులపై అవ్యాజమైన ప్రేమను చూపుతాయి. అంతులేని స్నేహాన్ని పంచుతాయి. మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మసులుకుంటాయి. మరెవరికీ సాటిలేని విధేయతను చూపుతాయి. ఈ విషయాన్ని మరోసారి ఈ బుజ్జీ కుక్క నిరూపించింది. తన యాజమాని తనను వదిలిపెట్టిన ప్రదేశంలోనే కోసం ఏడు నెలలపాటు వేచిచూసి.. ఎట్టకేలకు అతన్ని కలుసుకోగలిగింది. ఈ ఘటన దక్షిణ థాయ్‌లాండ్‌లో గతవారం జరిగింది. ఖువాన్ థాంగ్ గ్రామంలో రోడ్డుపక్కన 'బిగ్ బ్లూ' అనే మాంగ్రెల్ జాతి కుక్క దాదాపు ఏడు నెలలుగా వేచి చూస్తు గడిపింది. 'బిగ్ బ్లూ' యాజమాని ఓ పండ్ల వ్యాపారి. అతడు కారులో పండ్లు సరఫరా చేస్తుంటాడు. ఓసారి ఒకటికి వెళ్లాల్సి వచ్చి అతను ఖువాన్ థాంగ్ గ్రామ సమీపంలో వాహనాన్ని నిలిపాడు. దీంతో కుక్క కూడా కారు నుంచి దూకింది. కుక్క దిగిన విషయాన్ని గుర్తించకుండానే అతను కారును నడిపించుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 'బిగ్ బ్లూ' అక్కడే రోడ్డుపక్కన తన యాజమాని కోసం వేచి చూస్తూ ఉండిపోయింది. అది తోక ఊపుకొంటూ అక్కడే తచ్చాడేది కానీ.. అక్కడి నుంచి కదిలేది కాదు. కొంతకాలంలోనే 'బిగ్ బ్లూ' స్థానికంగా పాపులర్ అయిపోయింది. స్థానికులు ఎప్పుడూ ఏదో ఆహారం తెచ్చి దానికి పెట్టేవారు. మరోవైపు యజమాని కూడా తన కుక్క కోసం ఏడు నెలలుగా వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతను పండ్ల వాహనంతో గతవారం ఖువాన్ థాంగ్ గ్రామానికి వచ్చాడు. అక్కడ రోడ్డు పక్కన తచ్చాడుతున్న 'బిగ్ బ్లూ' యాజమానిని చూడగానే తోక ఊపుకుంటూ అతని చుట్టూ ఆనందంతో గంతులు వేసింది. బుజ్జీ కుక్క ఏడు నెలల నిరీక్షణకు తెరపడటం స్థానికులకు ఆనందం కలిగించింది. -
పెట్.. అంత్యక్రియలకు ఆరువేల మైళ్ళ ప్రయాణం
అది.. ప్రేమకు ప్రతిరూపమైన సన్నివేశం. హృదయాన్ని కదిలించే... మనసును కరిగించే సంఘటన. విశ్వాసాన్ని చాటిన పెంపుడు కుక్కకు యజమాని పంచిన అభిమానం. ప్రియమైన నేస్తానికి కన్నీటి వీడ్కోలు పలికిన మానవీయ కోణం... కేవలం కుక్కను ఖననం చేయడానికి స్మశానంకోసం ఆరువేల మైళ్ళు ప్రయాణించిన కథనం... గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందిన ఆ పెంపుడు జంతువు మరణం.. యజమాని కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. హాంకాంగ్‌లో నివసించే ఎలైన్ కాయో.. ప్రియమైన పెంపుడు కుక్క... డేవిడ్ మరణించింది. ఎంతో ప్రేమతో ఇంట్లోని మనిషిలా పెంచుకున్నఆ శునకాన్ని ఖననం చేసేందుకు యజమానికి స్థలం దొరకలేదు. దీంతో దాన్ని పూడ్చేందుకు ఆరువేల మైళ్ళు విమానంలో నార్త్ వేల్స్ హోలీవెల్ వరకూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. కుక్కకు అంతిమ సంస్కారాలు చేయడంలో భాగంగా శవపేటికను ఊరేగిస్తున్నపుడు స్థానిక జనం నివ్వెరపోయి చూశారు. ''ఐ విల్ ఆల్వేస్ లవ్ యు'' అంటూ యజమాని బాధతో చేసిన ప్రార్థనలు అందర్నీ కన్నీరు పెట్టించింది. అయితే పెంపుడు జంతువును ఎంతో ప్రేమతో పదమూడేళ్ళ పాటు పెంచిన యజమాని కాయో... పాపం ఆ విశ్వాసపాత్రురాలి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయింది. హాంకాంగ్ లో నివసించే ఎలైన్ కాయో స్థానికంగా తన కుక్క డేవిడ్ కు అంత్యక్రియలు జరిపేందుకు స్థలం లేకపోవడంతో వెబ్ లో నమోదు చేసింది. నార్త్ వేల్స్.. హోలీ వెల్ లో డేవిడ్ చివరి మజిలీకి స్థలం ఉన్నట్లుగా తెలియడంతో విమానంలో అక్కడి 'పెట్ సెమెటరీ'కి తరలించాల్సి వచ్చింది. అంతటి దూరాభారం ప్రయాణించాల్సి రావడంతో డేవిడ్ అంత్యక్రియలకు కాయో వెళ్ళలేకపోయింది. జంతువులను సమాధి చేసేందుకు స్థలం లేకపోవడంతో.. పదమూడేళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కను స్వదేశంలో ఖననం చేయలేకపోవడం నన్ను ఎంతో బాధించిందని, దాని అంత్యక్రియల కోసం ఇంటర్నెట్ ను ఆశ్రయించాల్సి రావడం భరించలేకపోయానని కాయో తీవ్రంగా చింతిస్తోంది. రంగు రంగుల బొమ్మలు పేర్చిన శవ పేటికలో ఉంచి... ఫొటోలు తీస్తూ, ప్రార్థనలు చేస్తూ నగర వీధుల్లో ఊరేగిస్తూ.. ఓ గంభీరమైన వాతావరణంలో సంగీతాన్ని పాడుతుండగా... చాపెల్ లో డేవిడ్ శరీరం బ్రిన్ ఫోర్డ్ స్మశానానికి చేర్చారు. తీవ్ర శోకంలో ఉన్న నేను... నా ఇద్దరు పిల్లలు డేవిడ్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంతో మా తరపున ప్రాతినిధ్యం వహించే ఓ మధ్యవర్తిని పంపించామని కాయో బాధతో చెప్తోంది. డేవిడ్ సమాధిపై బంగారు అక్షరాలతో... ''అత్యంత సాహసోపేతమైన, డియరెస్ట్ డేవిడ్ కు శాల్యూట్ అని.. మా జీవితాల్లో అత్యుత్తమ, నమ్మదగిన స్నేహితుడికి నివాళులు'' అంటూ రాయడం.. పెంపుడు జంతువుపై యజమానికి ఉన్న ప్రేమాభిమానాలను చాటుతోంది. -
కుక్కను కాపాడబోయి పరలోకాలకు...
కొరుక్కుపేట: ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్కను కాపాడబోయిన భార్యాభర్తలు తమ ప్రాణాలను పోగొట్టుకున్న దయనీయమైన ఘటన తమిళనాడులోని తిరుపూరులో ఆదివారం జరిగింది. ఊత్తుకుళి వెళియంపాలయంకు చెందిన కృష్ణన్(50) క్వారీ కార్మికుడు. అతని భార్య రుక్మిణి(45) సమీపంలోని ఓ కంపెనీలో టైలర్‌గా పని చేస్తోంది. వీరి పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు నీటి ప్రవాహం వద్దకు తీసుకెళ్లారు. స్నానం చేయిస్తుండగా చేయిజారడంతో కుక్క నీటిలో మునిగిపోయింది. దీంతో కంగారుపడిన కృష్ణన్ కుక్కను రక్షించేందుకు నీటిలో దిగాడు. అయితే అదుపుతప్పి అతను మునిగిపోతుండగా దూరం నుంచి గమనించిన రుక్మిణి భర్తను కాపాడబోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ ఊపిరాడక ప్రాణాలు విడిచారు. కుక్కతో వెళ్లిన అమ్మానాన్నలు ఎంతకూ తిరిగిరాకపోవడంతో వారి కుమారుడు దినేష్ నీటి మడుగు వద్దకు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. కుక్క మాత్రం నీటిలో ఈదుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చాడు. ఈ విషాద ఘటన అక్కడ అందరినీ కలిచివేసింది. -
చిలకలా ఉండేందుకు చెవులు కోసుకున్నాడు...
లండన్: బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరానికి చెందిన టెడ్ రిచర్డ్స్ అనే 56 ఏళ్ల ప్రబుద్ధిడికి రామ చిలకలంటే ప్రాణమే కాదు, వల్లమాలిన పిచ్చి. ఆ పిచ్చికాస్త ఈ మధ్య మరీ ప్రకోపించింది. దాంతో తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న రామ చిలకల్లాగా తన ముఖం కూడా ఉండాలని భావించాడు. అంతే...తన రెండు చెవులను సర్జరీతో తీసేయించుకున్నాడు. రామ చిలక రంగులను తలపించేలా ముఖానికి దాదాపు 150 రంగు రంగుల టాట్టులను వేయించుకున్నాడు. అంతటితో సంతృప్తి పడలేదు. జుట్టును కత్తిరించుకొని తల ముందుభాగాన ముచ్చటగా మూడు చిన్నపాటి కొమ్ములను తగిలించుకున్నాడు. ముక్కు కొసన ఓ రింగ్, బుగ్గలపై మెరిసే మెటల్ వస్తువులను తగిలించుకునేందుకు ఏకంగా 150 రంధ్రాలు చేయించుకున్నాడు. నాలుక కొసను రెండుగా చీల్చుకున్నాడు. చిలుకను పోలిన ముక్కును సాధించేందుకు ముక్కు సర్జరీ కోసం ముస్తాబవుతున్నాడు. తనకిష్టమైన ఎల్లి, టీకా, తిమ్నేహ్, జేక్, బూబీ అంటూ ముద్దుగా పిలుచుకునే రామ చిలకలతో ఆడుకుంటూ మురసిపోతున్నాడు. ‘ఇప్పుడు నిజంగా నేను గొప్పగా కనిపిస్తున్నాను. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. నా సంతోషానికి అవధులు లేవు. అద్దంలో చూసుకోకుండా ఒక్క క్షణం ఉండలేక పోతున్నానంటే ఒట్టు. ముద్దొచ్చే నా చిలకల్లా సాధ్యమైనంత వరకు ఉండాలన్నదే నా తాపత్రయం’ అని తన వింత చేష్ట గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఓ చెప్పుల కంపెనీలో పనిచేసి రిటైరయిన రిచర్డ్స్కు బాడీ పెయింటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. దానికి ఇప్పుడు వెర్రి వేషాలు తోడయ్యాయి. తన ఎడమ భుజం మీద శాంతి చిహ్నం చెక్కించేందుకు 750 సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద వేడిచేసిన ఇనుప కడ్డీలను ఉపయోగించాడు. ఇప్పుడు తాను బయటకు ఎక్కడికెళ్లినా తనవైపు పిన్నా, పెద్దలందరూ వింతగా చూస్తున్నారని, అది తనకెంతో థ్రిల్లింగా ఉందని రిచర్డ్స్ తెలిపాడు. తాను ముదటి నుంచి ఇతరులకన్నా భిన్నంగా ఉండాలని, తనలా ఎవరూ ఉండకూడదని భావించే వాడినని ఇప్పుడు తనకా కోరిక తీరిందని చెప్పాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ చిన్న ఇబ్బంది మాత్రం తప్పడం లేదని వాపోయాడు. చెవులులేక పోవడం వల్ల కళ్లజోడు పెట్టుకోవడం కష్టమవుతోందని అన్నాడు. -
యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టింది
టూటికోరన్ : ఓ పెంపుడు జంతువు మరణించినా అది తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంది. యజమాని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెట్టి ఓ పెంపుడు శునకం చనిపోయినా... అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ ఘటన తమిళనాడులోని టూటికోరన్లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టూటికోరిన్లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లోకి గురువారం రాత్రి ఓ తాచుపాము ప్రవేశించింది. ఈ విషయాన్ని పసిగట్టిన పమేరియన్ జాతికి చెందిన ఆమె పెంపుడు శునకం మొరగడం ప్రారంభించింది. నిద్రిస్తున్న యజమానిని పాము కాటేయాలనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పమేరియన్ విజృంభించింది. పాము కాటేసినా పెంపుడు జంతువు ఏమాత్రం వెనకంజ వేయకుండా దాని తల వద్ద కొరికి చంపేసింది. ఈ అలికిడికి నిద్ర లేచిన యజమాని తన పెంపుడు శునకాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అది చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆ శునకం అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. విశ్వాసానికి మారుపేరు శునకాలు అన్న మాటను ఈ పమేరియన్ మరోసారి రుజువుచేసింది. -
మీ కుక్కతో సెల్ఫీ ఇక ఈజీ!
లాస్ఏంజెలిస్: మీ పెంపుడు కుక్కతో సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా? వాటిని అధిగమించేందుకు కాలిఫోర్నియాకు చెందిన జోసన్ హెర్నాండేజ్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. స్మార్ట్‌ఫోన్‌కు టెన్నిస్బాల్ను అతికించడం ద్వారా కుక్కలతో సెల్ఫీలు తీసుకోవడం సులువవుతుందని వెల్లడించాడు. పెంపుడు కుక్కతో తన భార్య సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసిన హెర్నాండేజ్ ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని ఏడాదిపాటు శ్రమించి ఈ టెక్నిక్‌ను కనిపెట్టాడు. ఈ విధానంలో సెల్ఫీ తీసుకునేటప్పుడు కుక్క ఏకాగ్రత అంతా టెన్నిస్ బాల్ (పోచ్ సెల్ఫీబాల్)పైనే ఉంటుంది. కాబట్టి అది కదలకుండా కెమెరా వంకే చూస్తుంది. అంతే కాదు, ఈ పోచ్ సెల్ఫీ బాల్ నుంచి శబ్దాలు కూడా వస్తాయి. అవి కుక్క ఏకాగ్రతను రెట్టింపు చేస్తాయి. దీంతో నిస్సందేహంగా ఫొటోలు తీసుకోవచ్చని అంటున్నాడు. ఈ పోచ్ బాల్‌ను అన్ని స్మార్ట్ఫోన్ల్లకు సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నాడు. ‘కిక్‌స్టార్టర్’ అనే కంపెనీ దీనికి అవసరమైన ప్రత్యేకనిధిని సమకూర్చుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టింది. దీని లక్ష్యం 7వేల డాలర్లు కాగా, 14వేల డాలర్లకుపైగా విరాళాలు వసూలు కావడం గమనార్హం. -
కుక్కపై పులి పంజా విసిరింది..
థానే: ఓ పెంపుడు కుక్క... చిరుతపులి, దాని పసికూన చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా! ఇది జరిగింది ఏ అడవిలోనో.. పార్కులోనో కాదు.. జనావాసాల మధ్య ఉన్న ఓ ఇంట్లో జరిగిన సంఘటన ఇది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన రెండు రోజుల కిందట జరిగింది. తప్పిపోయిన పెంపుడు కుక్క.. కోకో గురించి ఇంటి యజమాని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కు నుంచి ఓ చిరుత ...తన పసికూనలో సహా తప్పించుకుని సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఏకంగా 8 అడుగుల ఎత్తున్న గోడను సైతం అవలీలగా దూకిన చిరుత...తన పిల్లతో సహా ఇంట్లోకి వచ్చింది. ఇంటికి కాపలాగా ఉన్న కోకోపై దాడి చేసి ఇంటి వెనుక భాగం వైపుకు ఈడ్చుకెళ్లి చంపేశాయి. సీసీటీవీలో చిరుత అక్కడ తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కోకో బరువు 42 కేజీలని, అయినా చిరుత తన కుక్కని దారుణంగా చంపేసిందని యజమాని ఆర్తి గుప్తా తెలిపారు. పార్కుకు ఎటువంటి రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని ఆమె ఆరోపించారు. చిరుతపులి తమ ప్రాంతంలో సంచరిస్తుదన్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
అరెస్టు చేస్తారా? లేదా?
బ్రిటన్‌లో ఎమర్జెన్సీ సర్వీసుకు 999 నంబరును ఉపయోగిస్తారు. వెస్ట్యార్క్షైర్ పోలీసులకు ఈ నంబరుపై ఒకతను ఫోన్ చేశాడు. సర్... మీరు అర్జంటుగా నా గర్ల్ ఫ్రెండ్‌ను, ఆమె పెంపుడు పిల్లిని అరెస్టు చేయాలని కోరాడు. ఎందుకు అరెస్టు చేయాలంటున్నారని కంట్రోల్ రూములో ఫోన్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తి అడగ్గా... ‘దొంగపిల్లి, నా బకాన్ (పందిమాంసం ముక్కలు) తినేసింది’ అని ఫిర్యాదు చేశాడా మహానుభావుడు. వింటున్న వ్యక్తి నోరెళ్లబెట్టాడు. కాసేపటికి తేరుకొని కుదరదన్నాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఊరుకుంటేనా! లేదు... చర్యలు తీసుకోవాల్సిందే అంటూ బెట్టుచేశాడు. పిల్లి మాంసం ముక్కలు తినడం చట్ట ఉల్లంఘన కాదని అతనికి సర్దిచెప్పేసరికి కంట్రోల్ రూము సిబ్బందికి తలప్రాణం తోకలోకి వచ్చిందట. ఇలాంటి తిక్కతిక్క కాల్స్ చేసి తమ విలువైన సమయాన్ని వృథా చేయవద్దని కోరుతూ యార్క్‌షైర్ పోలీసులు ఈ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్పును విడుదల చేశారు. -
పిల్లి పోయింది.. కుక్క భర్తగా వస్తోంది!
హాలండ్: తన భర్త చనిపోవడంతో మరొకరిని వివాహమాడేందుకు సిద్ధమైంది డామినిక్యూ లెస్పిరెల్ అనే 41 ఏళ్ల మహిళ. ఇందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా.. ఈ విషయం విన్నారంటే హవ్వ అనుకోవాల్సిందే. ఎందుకంటే చనిపోయిన ఆ మొదటి భర్త ఓ పిల్లి! ఇప్పుడు ఆమె మరో పెళ్లి చేసుకోబోతుంది ఓ కుక్కని!! డామినిక్యూ లెస్పిరెల్ ఎనిమిదేళ్ల కిందట మొదటిసారి డొరాక్ అనే తన పెంపుడు పిల్లిని వివాహమాడింది. ఇన్నాళ్లు అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారి దాంపత్యం ఉన్నట్లుండి విషాదంగా మారింది. 19 ఏళ్ల డొరాక్ ఇటీవలే కిడ్నీ ఫెయిలవడంతో చనిపోయింది. దీంతో డోరాక్ ఉన్న సంబంధాన్ని ఆమె ఓసారి నెమరు వేసుకొంది. డొరాక్ తనకు మూడేళ్ల ప్రాయం నుంచి తెలుసని.. అయితే పదహారేళ్లపాటు తనతో సంతోషంగా గడపడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఇప్పుడు డొరాక్ లేకపోవడం తన మనసును కలిచివేసిందని.. అయితే, మరోసారి అనందమయ జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ట్రావిస్ అనే తన పెంపుడు కుక్కను త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు డామినిక్యూ చెప్పింది. ట్రావిస్ తనకు సరైన జోడీ అని చెప్పిన ఆమె,, ఇప్పటికే తమ మధ్య మంచి అవగాహన ఉందని తెలిపింది. గ్రీస్‌లో ఉన్నప్పుడు తాను ట్రావిస్‌ను రక్షించి తీసుకొచ్చానని, తాను స్నానం చేస్తుంటే తన షూ, దుస్తులు ఎత్తుకెళ్లి అల్లరి చేస్తుందని, తనతో కలిసి స్నానం చేస్తుందని ఇలాంటి చేష్టలతో తన మనసు దోచుకుందని అందుకే పెళ్లాడాలని నిర్ణయించుకున్నట్లు డామినిక్యూ వివరించింది. -
ఇంట్లో కుక్క ఉందా?
పెట్టిల్లు వర్షాకాలం వాతావరణ మార్పుల వల్ల మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల బారిన పడతాం. మరి మన పెంపుడు కుక్కల మాటేమిటి?! వాటికి ఈ కాలం ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ ఉదయం, సాయంత్రాలు బయట తిప్పినా కొద్దిగానైనా తడవక తప్పదు. అలాగే వదిలేస్తే ఈ కాలం బ్యాక్టీరియా వృద్ధి చెంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ⇒ అలాగని రోజూ స్నానం చేయించడం కుదరదు. అందుకని వాకింగ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత బ్లో డ్రయ్యర్‌తో పూర్తిగా ఆరబెట్టండి. స్నానం చేయించిన ప్రతీసారి త్వరగా ఆరడానికి ఇదే చిట్కాను పాటించండి. అలాగే, స్నానానికి షాంపూ వాడితే మేలు. ⇒ బుజ్జి బుజ్జి కుక్కపిల్లల పాదాల దగ్గర చర్మం సున్నితంగా ఉంటుంది. ఇవి బయట తిరిగి, మురికి అలాగే ఉండిపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ కాలం వర్షంలో తడవకుండా ఉండేందుకు డాగ్స్‌కు కూడా షూస్ మార్కెట్లో ఉన్నాయి. వాటిని ట్రై చేయవచ్చు. ⇒ కుక్కల పడుకునే చోటు, వాటి బెడ్ శుభ్రంగా, తడి లేకుండా ఉండాలి. లేదంటే త్వరగా చెడువాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే వాటికి పెట్టే ఆహారం, తినే పాత్రపై మూతలు పెట్టి ఉంచడం మేలు. క్రిములు వృద్ధి చెందడానికి అవకాశం లేని, పొడిగా ఉండే బెడ్‌ను ఈ కాలం ఏర్పాటు చేయాలి. ⇒ వర్షాకాలం చాలా వరకు కుక్కలకు చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అవి గుబిలి కారణంగానూ కావచ్చు. అందుకని చెవుల బయట, లోపల కూడా పొడిగా ఉండాలి. ⇒ ఈ కాలం ఆరుబయట విహారం కుక్కలకు అంత మంచిది కాదు. ఇంటి లోపలే అవి ఆడుకునేందుకు వీలుగా స్థలాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఉదా: కార్ గ్యారేజ్, అపార్ట్మెంట్ కింది స్థలం, మెట్ల కింద.. గాలి, వెలుతురు బాగా ఉండే చోటు ఇలా... -
చనిపోయిన ‘పెట్’ మొక్కై మొలిస్తే..
కోల్‌కతా: మన ఇంట్లో పుట్టకపోయినా మన మధ్యనే మన కుటుంబంలో భాగంగా మనతో కలసిమెలసి పెరిగిన పెంపుడు కుక్క పిల్లో, పిల్లి పిల్లో మరణిస్తే.... కొంత బాధగా అనిపించినా చివరికి పెంట కుప్పపై పడేస్తాం. లేదంటే మున్సిపల్ సిబ్బందికి అప్పగిస్తాం. అంతేగానీ, అది కూడా మనలాంటి జీవేకదా! అని భావించి, ఆ మృత జీవిని శ్మశాన వాటికకు తీసుకెళ్లి లాంఛనాల ప్రకారం ఖననం చేసి సమాధికట్టే వారు చాలా అరుదు. ప్రపంచంలోని పలు దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా పెంపుడు జంతువుల ఖననం కోసం ప్రత్యేక జంతు స్మశానాలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లో ఎప్పటి నుంచో ఇలాంటి స్మశానాలు ఉండగా, ఢిల్లీ నగరంలో ఇటీవలనే వీటికోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ప్రజలు తమ పెంపుడు జంతువులు మరణించినప్పుడు వాటిని తీసుకొచ్చి వీటిల్లో ఖననం చేసి, సమాధులు నిర్మిస్తున్నారు. వాటిపై తమ స్థోమతకు తగ్గట్టుగా పేర్లు చెక్కిన శిలాఫలకాలను అమరుస్తున్నారు. ఏడాదికోసారి వచ్చి పూలు తీసుకొచ్చి నివాళులు కూడా అర్పిస్తున్నారు. ఇలా చేస్తున్నవారి సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో కోల్‌కతాలో ఓ జీవకారుణ్య స్వచ్ఛంద సంస్థ ఇక్కడ పెంపుడు జంతువుల ఖననానికి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. నగరంలోని బెహలా ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ‘కరుణ కుంజ్’ పేరిట జంతు శ్మశానం ఉంది. చనిపోయిన పెంపుడు జంతువులను తెచ్చి నిర్వాహకులకు అప్పగిస్తే వారు గౌరవప్రదంగా వాటిని ఖననం చేస్తారు. ఆ జంతువుల మృతదేహం కుళ్లిపోయి మట్టిలో కలిసిపోయాక, సహజసిద్ధమైన ఎరువుగా మారిపోయిన ఆ మట్టిని పెంపుడు జంతువుల యజమానులకు అప్పగిస్తారు. వారు ఆ మట్టిని తీసుకెళ్లి శ్మశానం నిర్వాహకులు చూపిన చోట పోసి, అక్కడ వారికిష్టమైన మొక్కలను నాటాలి. వాటికి పెంపుడు జంతువుల పేర్లను నామకరణం చేయవచ్చు. మొక్కలను పోషించే బాధ్యతను శ్మశానమే తీసుకున్నప్పటికీ పెంపుడు జంతువుల యజమానులు వచ్చి తమ ‘పెట్’ పేరిట వెలిసిన మొక్కలను ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు. అంతేకాకుండా వారు తమతమ సంప్రదాయం ప్రకారం ఆ మొక్కలకు పూజలు కూడా చేయవచ్చు. చనిపోయిన జంతువు మరో జీవిగా పునర్జన్మ ఎత్తిందన్న భావన ప్రజల్లో కల్పించడంతోపాటు స్మశాన నిర్వాహకులు ఇలా పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌తో భారత్‌లో ఒక్క కోల్‌కతాలోనే జంతు శ్మశానాన్ని నిర్వహిస్తుండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి దృక్పథంతో స్మశానాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా, జపాన్, జర్మనీ దేశాల్లో ‘బీ ఏ ట్రీ’ నినాదంతో ఈ రకం శ్మశానాలను ప్రోత్సహిస్తున్నారు. -
పిల్లి ఆమెను కరిచింది.. ఆమె అతడిని కరిచింది!
బెర్లిన్: గడుసైన ఓ పెంపుడు పిల్లి ఓ మహిళను కరిచింది. కోపగించుకున్న ఆమె దానికి రెండు దెబ్బలేసి దారిలో పెట్టాలని ప్రయత్నించింది. కానీ ఆ పిల్లి యజమాని అయిన ఆమె బోయ్‌ఫ్రెండ్ అడ్డుకున్నాడు. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన ఆమె ఏకంగా బోయ్‌ఫ్రెండ్ మీద పడి మళ్లీ మళ్లీ కసితీరా కరిచేసింది. వెంటపడి మరీ అతడిని చితక్కొట్టింది! విచిత్రమైన ఈ సంఘటన శనివారం జర్మనీలోని హెగెన్ నగరంలో చోటు చేసుకుంది. బాధితుడు(39) ఫోన్ చేయడానికి ప్రయత్నించినా సదరు మహిళ(26) అతడిని విడిచిపెట్టలేదని, చివరకు అతడు పారిపోయి తమకు సమాచారమిచ్చాడని పోలీసులు తెలిపారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించామని, ఆమెపై గృహహింస చట్టం కింద కేసు పెట్టడంతో పాటు పది రోజులు గృహ నిర్బంధంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. -
నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి
చిత్తూరు(చౌడేపల్లి): అడవి జంతువులను హతమార్చేందుకు పెట్టిన నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి చెందాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెదకొండమూరు పరిధిలోని అటవీప్రాంతంలో అడవి జంతువుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ గొర్రెల కాపరికి చెందిన పెంపుడు కుక్క చనిపోయింది. అలాగే నాగిరెడ్డిపల్లిలో కొన్ని రోజుల కిందట ఓ ఆవు మృతి చెందింది. -
మానవత్వం బతికే ఉంది..
రోడ్డు ప్రమాదంలో పెంపుడు కుక్క మృతి ఆస్పత్రి పాలైన యజమాని బంజారాహిల్స్: మానవ సంబంధాలు మటు మాయమైపోతున్న రోజుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలియజెప్పే ఘటన జరిగింది. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కుక్క... తన కళ్లెదుటే విలవిల్లాడుతూ ప్రాణం విడవడం తట్టుకోలేక ఓ యువకుడు స్పృహ తప్పిపడిపోయి ఆస్పత్రిపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రహ్మత్‌నగర్‌కు చెందిన రఘువీర్ సింగ్ సోమవారం ఉదయం ఎప్పటిలాగే తన పెంపుడు కుక్కను తీసుకుని ఇంటినుంచి వాకింగ్‌కు బయలుదేరాడు. అదే సమయంలో యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో నివసించే ఏఆర్ కానిస్టేబుల్ రవీందర్ బైక్‌పై వెళ్తూ కుక్కను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం వదిలిన దృశ్యం చూసిన ర ఘువీర్‌సింగ్ తట్టుకోలేక కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, సివిల్ డ్రస్‌లో ఉన్న రవీందర్ కానిస్టేబుల్ అని తెలియక స్థానికులు అతడిపై చేయి చేసుకున్నారు. అనంతరం అతడిపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శునకంపై విశ్వాసం!
శునకం మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. ఇలాంటి జంతువుపై కొందరు మనుషుల్లో ఎంతో విశ్వాసం ఉంటుంది. అపారమైన ప్రేమ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు హాలీవుడ్ సుప్రసిద్ధనటుడు సిల్వెస్టర్ స్టాలోన్. తన కెరీర్ ఆరంభంలో తన పెంపుడు కుక్క గురించి పడ్డ తపన చాలా గొప్పది. ఆ మూగజీవి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఫుడ్డుకు లాటరీ కొడుతున్న దశలో సిల్వెస్టర్ స్టాలోన్‌కు ఒక పెంపుడు కుక్క ఉండేది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకసారి చేతిలో ఉన్న డబ్బుఅయిపోయింది. ఇదే సమయంలో ఒక వ్యక్తి స్టాలోన్ పెంపుడుకుక్కను కొంటానని ముందుకు వచ్చాడు! అవసరం స్టాలోన్‌తో ఆ శునకాన్ని అమ్మించింది. రోజులు గడిచాయి.. అవకాశాలు కలిసి వచ్చాయి. స్టాలోన్‌కు మంచి సినిమా అవకాశం వచ్చింది. హీరో తనే, దర్శకుడు తనే! అడ్వాన్స్‌గా వేల డాలర్లు చేతిలో వచ్చి పడ్డాయి. ఆ డబ్బు చేతిలోకి రాగానే ఈ హీరో చేసిన మొదటి పని... తన శునకాన్ని కొనుకొన్న వ్యక్తిని కలవడం. తన పెట్‌ను తనకు తిరిగి ఇవ్వమని, ఎంత డబ్బయినా ఇస్తానని బతిమిలాడాడు. అవతలి వ్యక్తి స్టాలోన్‌కు తన పెట్ డాగ్ మీద ఉన్న ప్రేమను క్యాష్ చేసుకొన్నాడు. 50 డాలర్లకు కొన్న శునకాన్ని స్టాలోన్కే తిరిగి 15వేల డాలర్లకు అమ్మాడు. తన తొలి సంపాదనగా వచ్చిన మొత్తం డబ్బును అతడికిచ్చి తన శునకాన్ని తెచ్చుకున్నాడు. తర్వాతి కాలంలో తన సినిమాల్లో కూడా ఆ శునకాన్ని నటింపజేశాడు ఈ దర్శకహీరో! -
కోట్ల ఆస్తి మొత్తం.. ఆ కోతిదే!
పిల్లలు లేని దంపతులు ఓ కోతిని కొడుకుగా భావించారు.. నిత్యం సవర్యలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా తమ ఆస్తి మొత్తాన్ని దాని పేరు మీద రాసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో సబిష్ట (45) న్యాయవాదిగా పనిచేస్తుండగా ఆమె భర్త శ్రీవాత్సవ (48) చిన్నవ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి ఒక ఇల్లు, 200 చదరపు గజాల్లో నివాస స్థలంతోపాటు లక్షల్లో ఆస్తి ఉంది. కానీ వారికి పిల్లలు లేరు. తల్లిని కోల్పోయిన చిన్న కోతిపిల్ల ఒకటి 2004లో తమకు తారసపడటంతో దానిని తెచ్చుకుని పదేళ్లకు పైగా దాన్ని పెంచుకుంటున్నారు. దానికి "చున్మున్' అని నామకరణం చేసి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చున్మున్ తాము చనిపోతే బతకలేదని, తమ తర్వాత కూడా అది ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలని భావించి.. తమ ఆస్తి మొత్తాన్ని దాని పేరిట రాస్తున్నట్లు తెలిపారు. పైగా అది తమ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే బాగా కలిసి వచ్చిందని చెబుతూ.. అందరిలాగే చైనీస్ ఫుడ్స్ తినడమే కాకుండా కూల్ డ్రింక్స్, టీ, కాఫీలాంటి వాటిని కూడా అది ఫుల్లుగా లాగించేస్తుందని వాళ్లు ముద్దుగా చెబుతున్నారు. మొత్తానికి చున్మున్ మాత్రం త్వరలోనే కోటీశ్వరురాలు కాబోతోందన్న మాట!! -
పెంపుడు శునకానికి కన్నీటివీడ్కోలు
వరంగల్: ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం హఠాత్తుగా దూరమవడంతో దాని యజమాని చలించిపోయాడు. దూరమైన పెంపు జంతువుకు శాస్త్ర ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి తన మమకారాన్ని చాటుకున్నారు. వరంగల్ పట్టణంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన గన్నోజు సురేందర్ స్థానికంగా టింబర్ డిపో నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర వయసున్న జర్మన్ షెఫర్డ్ జాతి శునకాన్ని సురేందర్ తన ఇంట్లో పెంచుకుంటున్నారు. అస్వస్థతతో ఆ శునకం ఆదివారం సాయత్రం ఆకస్మికంగా మృతి చెందింది. దీంతో ఆవేదన చెందిన సురేందర్ కుటుంబ సభ్యులు, స్థానికుల తోడ్పాటుతో శునక కళేబరాన్ని ఓ పాడెపై ఉంచి, పూల దండ వేసి దాన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పక్కన ఖాళీ స్థలంలో ఖననం చేశారు. (కరీమాబాద్) -
అయ్యో పాపం పప్పీ!
ఫ్లోరిడా: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ కుక్క పిల్లను అన్యాయంగా చంపేస్తారా ఎవరైనా! ఫ్లోరిడాకు చెందిన సింథియా వీ ఆండర్సన్ అనే 56 ఏళ్ల ఆంటీ రెండు వారాల వయస్సు మాత్రమే కలిగిన డాబర్మాన్ జాతికి చెందిన కుక్క పిల్లను తీసుకొని రెండు రోజుల క్రితం నెబ్రాస్క విమానాశ్రయానికి వెళ్లింది. ఆండర్సన్ కుక్క పిల్లను తన క్యారీ బ్యాగ్‌లో పెట్టుకొని విమానం ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క పిల్లది మరీ చిన్న వయస్సు అవడంతో ఆ పిల్లతో విమానంలో ప్రయాణించేందుకు విమానం సిబ్బంది ససేమిరా అనుమతించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆండర్సన్ వాష్‌రూమ్‌కు వెళ్లి కుక్కపిల్లను టాయ్‌లెట్ కమోడ్‌లో పడేసి గబగబా వెళ్లి విమానం ఎక్కేసి చెక్కేసింది. ఆమె వెనకాలే వాష్‌రూమ్‌లోకి వెళ్లిన మరో మహిళ ఈ ఘోరాన్ని గమనించి విమానాశ్రయం సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. -
కుక్కకు రూ. 6 కోట్ల సంపద!
కోటీశ్వరుల జాబితాలో ఓ కుక్క కూడా చేరింది. అమెరికాలో ఓ పెంపుడు కుక్కకు దాదాపు 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ఆస్తి దక్కింది. డబ్బుతో పాటు పెద్ద భవంతి, బంగారు నగలు కూడా కానుకగా ఇచ్చారు. కుక్క యజమానురాలు ఈ మేరకు వీలునామా రాయించారు. న్యూయార్క్‌కు చెందిన రోజ్ ఆన్ బొలస్నీ అనే 60 ఏళ్ల మహిళ పెంపుడు కుక్క 'బెల్ల మియా'కు ఈ సంపదను కానుకగా ఇచ్చారు. గతేడాది ఏప్రిల్‌లో కొనుగోలు చేసిన ఇంటిని కుక్కకు బహుమతిగా అందజేశారు. ఇప్పటిలాగే తన అనంతరం కూడా కుక్కు విలాసవంతమైన జీవితం గడిపేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోజ్ తెలిపారు. ఇందుకు ఆమె ఇద్దరు కుమారులు కూడా అభ్యంతరం పెట్టకపోవడం విశేషం. అంతేగాక తల్లి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు. తన కుమారులకు బెల్లా కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని, బాగా సంపాదిస్తున్నారని, వారికి తన డబ్బు అవసరం లేదని రోజ్ చెప్పారు. ఇక కుక్క ఫ్యాషన్ షోలో కూడా అదరగొడుతోంది. 2013, 2014 బెల్లా వరుసగా న్యూయార్క్ పెట్ ఫ్యాషన్ షోలో విజేతగా నిలిచింది. వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది బెల్లానే కావడం విశేషం. బెల్లా తన జాతి కుక్కల్లో స్టార్లా వెలిగిపోతోంది. మంచి డ్రెస్సులు కూడా ఉన్నాయి. -
శునకో రక్షతి రక్షితః
చదివింత... - సత్యవర్షి ‘కనకపు సింహాసనమున కాదు హృదయపు సింహాసనము నీకు వేసెద’ నంటూ తన పెట్‌డాగ్‌ను ముద్దులతో ముంచెత్తుతోందట జోసీకాన్లాన్. ఇంగ్లాండ్‌లోని స్టాక్టాన్-ఆన్-టీస్ టౌన్లో నివసించే జోసీ కాన్లన్ (46) దగ్గర టెడ్ అనే రెండేళ్ల వయసున్న పెట్‌డాగ్ ఉంది. అది కొన్ని రోజులుగా తన యజమాని ఛాతీని ఊరికే వాసన చూడడం, కదపడం, ఏడవడం చేస్తుంటే... ఏదో సందేహం వచ్చిన జోసీ వైద్య పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తేలింది. ఈ గ్రేడ్ 3 ట్యూమర్ చాలా తీవ్రమైందనీ, శరవేగంగా వ్యాపించే గుణం కలదనీ కూడా డాక్టర్లు చెప్పారట. అయితే సరైన సమయంలో డిటెక్ట్ చేయడంతో 18వారాల కీమో థెరపీ, 4 వారాల రేడియోథెరపీ చికిత్స చేసి తొలగించగలిగారు. దీంతో నా పెట్‌డాగ్ టెడ్ చేసిన మేలు ఏజన్మలోనూ మర్చిపోలేనంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది జోసీ. గతంలో యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న టెడ్‌ను రక్షించి ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్న జోసీ... అందుకు ప్రతిఫలంగా తనకు ప్రాణదానం చేసిందంటూ టెడ్‌ను వేనోళ్ల పొగడుతోంది. అంతేకాదు.. ‘‘పెట్‌డాగ్స్ మన శరీరంలోని ఏదైనా ప్రదేశంలో ఎక్కువగా దృష్టి పెడితే వాటిని తోసేసి ఊరుకోకుండా కొంచెం పట్టించుకోండి’’అంటూ పెట్ ఓనర్స్కు సలహా కూడా ఇస్తోంది. -
శునకం... ఓ ఫుల్ మీల్స్
చాలామంది తాము జంతు ప్రేమికులమని చాటుకోవడానికి గొప్ప గొప్ప జాతి శునకాలను పెంచుకోవడం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా చలామణీలో ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ, పలువురిని నేను దగ్గరి నుంచి పరిశీలించినప్పుడు వాటి పట్ల ఆయా యజమానులకు ఉన్న ‘ప్రేమ’ కళ్లకు కట్టింది. తాము తిని వదిలేసిన, మిగిలిపోయిన ఆహారాన్ని తమ పెంపుడు శునకాలకు పెట్టడం చూశాను. శునక ప్రేమికులకు నేను చెప్పేది ఒక్కటే.. ‘వాటిని పోషించే స్థోమత లేకుంటే, వాటికి సరైన తాజా ఆహారాన్ని పెట్టలేకుంటే వాటిని పెంచుకోకండి. పెంచుకునేటట్టయితే వాటికి సంబంధించిన ఆహార నియమాలను పాటించండి’. నేను ఒకసారి చందానగర్ గంగారంలోని సరస్వతి కర్రీ పాయింట్లో మధ్యాహ్నం భోజనం చేసి.. నేను తిన్న విస్తరిని బయట వేశాను. అంతలో ఒక శునకం అక్కడకు వచ్చి ఆ విస్తరిలో ఆత్రుతగా తలదూర్చింది. వెంటనే ఒక భోజనం పార్శిల్ కొని దాని ఎదుట ఉంచాను. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. శునకం విశ్వాసపాత్రమైన జంతువు. దానిని తక్కువగా చూడొద్దు. - ఏరువ ఆరోగ్యరెడ్డి ఆగపేట గ్రామం, నర్మెట్ట, వరంగల్ జిల్లా -
డాగ్స్ డే అవుట్
ఎప్పుడూ ఇంటికే పరిమితమయ్యే పెంపుడు కుక్కలు బయటికి రాగానే జూలు విదిల్చాయి. ‘గెట్ రెడీ’ అనగానే... రన్నింగ్ రేస్ అందుకున్నాయి. ఆపై హుందాగా నడిచి అబ్బురపరచాయి. బంజారాహిల్స్ ముఫకంజా కళాశాలలో ఏపీ కెన్నెల్ క్లబ్ ఆదివారం నిర్వహించిన ‘హైదరాబాద్ డాగ్ షో 2014’ పెట్ లవర్స్ మనసు దోచుకుంది. ఇందులోని ‘ఆల్ బ్రీడ్స్ చాంపియన్‌షిప్ డాగ్ షో’... వివిధ జాతుల శునకాల కేరింతలతో అదరహో అనిపించింది. -
అదిరేటి డ్రస్సు మేమేస్తే...
పెంపుడు జంతువులను అదరగొట్టే డ్రెస్సులతో ఫ్యాషన్‌గా తయారుచేయడం అమెరికా, బ్రిటన్లలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. వాటిని ఫ్యాన్సీ డ్రెస్సులతో అందంగా ముస్తాబు చేయడానికి యజమానులు పోటీపడుతున్నారు. శుక్రవారం లండన్‌లో జరిగిన పెంపుడు జంతువుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పలు శునకాలు, మార్జాలాలు ఇలా వినూత్నమైన డ్రెస్సుల్లో అందర్నీ అలరించాయి. -
ఓ పార్కు కావాలి!
పెట్‌డాగ్స్ కూ ఓ పార్కు ఉంటే ఎంత బాగుంటుంది! బెంగళూరులో ఇలాంటి సౌకర్యం ఉందట. పెంపుడు కుక్కలన్నింటినీ తెచ్చి వాటి యజమానులు అక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. ఎంచక్కా నెలకోసారి అవి ఇదిగో ఇలా ఆడేసి పాడేసి ఎంజాయ్ చేసేసి వెళ్లిపోతాయి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ‘భౌభౌ’ మంటూ బోరుమనకుండా.. ఇలాంటివి వాటిని రీఫ్రెష్ చేస్తాయనేది పెట్ లవర్స్ మాట. ఆదివారం నెక్లెస్ రోడ్డులో తమ పెంపుడు శునకాలతో సహా వచ్చిన వాటి యజమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
అవకాశాలకు, ఆదాయానికి వారధి.. యానిమల్ ట్రైనర్!
ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు. ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి. వారికి రక్షణ కల్పిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా మారింది. ఇక పోలీసు, రక్షణ శాఖలో జాగిలాలు అందిస్తున్న సేవలు తెలిసినవే. జంతువులను మచ్చిక చేసుకోవడం అనాదిగా ఉన్నదే. జంతువులను పెంచుకోవాలంటే మొదట వాటికి తగిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందినవే.. యజమానులు చెప్పినట్లు నడుచుకుంటాయి. క్రమశిక్షణతో మెలుగుతాయి. ఇలాంటి వాటికే మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. జంతువులకు శిక్షణ ఇచ్చే నిపుణులే.. యానిమల్ ట్రైనర్లు. ఆధునిక కాలంలో పెట్స్ సంస్కృతి విస్తరిస్తుండడంతో ట్రైనర్లకు అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. విదేశాల్లో ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న ఈ కెరీర్.. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. యానిమల్ ట్రైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధికి ఢోకా ఉండదని ఘంటాపథంగా చెప్పొచ్చు. సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో.. జంతు శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, రక్షణ శాఖలో, వెటర్నరీ క్లినిక్స్, పెట్ షాప్స్, జంతు ప్రదర్శనశాలలు, యానిమల్ షెల్టర్స్, వైల్డ్‌లైఫ్ పార్కులు, రిజర్వ్‌లు, పరిశోధనా కేంద్రాలు, సర్కస్‌ల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. విదేశాల్లో అయితే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు, ప్రింట్ యాడ్స్‌లోనూ యానిమల్ ట్రైనర్ల సహాయం తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు అందజేస్తున్నారు. జంతువులతో సంబంధం ఉన్న ప్రతిరంగంలోనూ వీరికి అవకాశాలుంటాయి. సొంతంగా జంతువులకు శిక్షణ ఇచ్చి, వాటిని విక్రయించుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: యానిమల్ ట్రైనర్లకు ప్రాథమికంగా జంతువుల పట్ల అభిమానం, వాటిని ప్రేమించే గుణం ఉండాలి. సమయానుసారంగా జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకొని తదనుగుణంగా వ్యవహరించే నేర్పు అవసరం. సమస్యలను పరిష్కరించే నైపణ్యం కావాలి. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. స్వయం నియంత్రణ అవసరం. కోపతాపాలకు, ఆవేశానికి దూరంగా ఉండాలి. వివిధ జంతువుల ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. అర్హతలు: మనదేశంలో యానిమల్ ట్రైనర్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు, నియమ నిబంధనలు లేవు. అయితే, కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండడం మంచిది. అమెరికా, యునెటైడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో యానిమల్ సైన్స్, యానిమల్ బిహేవియర్, బయాలజీ, జువాలజీ, మెరైన్ బయాలజీ, సైకాలజీ కోర్సులను చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు: యానిమల్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో అనుభవం, పనితీరును బట్టి ఆదా యం ఉంటుంది. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే ట్రైనర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఇంకా అధిక వేతనాలు అందుతాయి. శిక్షణ, సేవలు అందిస్తున్న సంస్థలు: కమాండో కెన్నెల్స్-హైదరాబాద్ వెబ్సైట్: http://www.commandokennels.com/ యూనివర్సిటీ ఆఫ్ లింకన్. వెబ్సైట్: www.lincoln.ac.uk ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.anglia.ac.uk/ruskin/en/landing.html యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. వెబ్సైట్: www.chester.ac.uk ద సెంటర్ ఆఫ్ అప్లయిడ్ పెట్ ఎథాలజీ వెబ్సైట్: www.coape.org జంతు ప్రేమికులకు సరైన కెరీర్! ‘‘జంతువుల పట్ల ప్రేమ, వాటి ప్రవర్తనపై అవగాహన ఉన్నవారు యానిమల్ ట్రైనర్‌గా కెరీర్‌ను ఎంచుకోవచ్చు. తమ ఆజ్ఞలకు అనుగుణంగా జంతువులు పనిచేసేలా శిక్షణ ఇవ్వడమే వారి విధి. ప్రధానంగా శునకాల శిక్షణకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇంటికి కాపలాగా ఉండడంలో, శాంతిభద్రతల రక్షణలో పోలీసులకు సాయపడడంలోనూ జాగిలాలది కీలక పాత్ర. అంతేకాకుండా చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. అవి కూడా యజమానులు చెప్పే చిన్నచిన్న పనులను చేస్తుంటాయి. వీటిలో కొన్ని స్వతహాగా ఆ లక్షణాలు అలవర్చుకున్నప్పటికీ మరికొన్ని శిక్షణ ద్వారా చెప్పినట్లుగా నడుచుకుంటాయి. ఈ కెరీర్‌కు సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు లేనప్పటికీ పలు సంస్థలు యానిమల్ ట్రైనర్‌గా శిక్షణను అందిస్తున్నాయి. ఇందులో నైపుణ్యం పొందినవారు పార్ట్ టైం లేదా ఫుల్‌టైమ్‌గా పనిచేస్తూ ఆకర్షణీయమైన ఆదాయం ఆర్జిస్తున్నారు’’ - ప్రకాశ్ భట్, మేనేజింగ్ డెరైక్టర్, కమాండో కెన్నెల్స్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ ఎస్బీఐ అసోసియేట్స్ బ్యాంకుల పీవో పరీక్షలో జనరల్ అవేర్నెస్ విభాగానికి ఎలా ప్రిపేర్ కావాలి? - కె.సాయికృష్ణ, ఉప్పల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నవంబర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ రంగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి 15 ప్రశ్నలు, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్‌లో వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, ప్రభుత్వ పథకాలు, జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు, దేశాల మధ్య జరిగిన ఒప్పం దాలు, అంతర్జాతీయ సదస్సులు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఇటీవల జరిగిన క్రీడా టోర్నమెంట్లు- రికార్డులు, ఆర్థిక వ్యవహారాలు, ప్రణాళికలు, భారత అంతరిక్ష పరిశోధనలు, దేశ రక్షణ వ్యవస్థ, ఇటీవల ప్రయోగించిన క్షిపణులు, ప్రవేశపెట్టిన యుద్ధ నౌకలు, కమిటీలు - చైర్మన్లు, అణ్వస్త్ర రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, 16వ లోక్‌సభ ఎన్నికలు మొదలైన అంశాలను బాగా చదవాలి. కేంద్ర మంత్రి మండలి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నూతన గవర్నర్లు, ప్రపంచకప్ ఫుట్‌బాల్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో భారత్ జీడీపీ వృద్ధిరేటు, రైల్వే బడ్జెట్, ఎకనమిక్ సర్వే, కేంద్ర బడ్జెట్ నుంచి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ తాజా పరపతి విధానం, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, భారతీయ స్టేట్ బ్యాంక్.. వాటి అనుబంధ బ్యాంకులు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, కొత్త బ్యాంకులు, ప్రధానమంత్రి జనధన యోజన, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఆర్బీఐ కమిటీలు - వాటి సిఫారసులు, పాలసీ రేట్లు, బ్యాంకింగ్ పదజాలం, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, డిపాజిట్లు - వాటి రకాలు, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్ వంటి అంశాలను క్షుణ్నం గా చదవాలి. స్టాక్ జీకేకు సంబంధించి ముఖ్యమైన దినాలు, దేశాలు- రాజధానులు- కరెన్సీలు- పార్లమెంట్లు, క్రీడల ట్రోఫీలు, క్రీడా పదాలు వంటివి కూడా చదివితే మంచిది. జనరల్ అవేర్‌నెస్‌లో మంచి స్కోరు సాధించాలంటే రోజూ ఏదైనా దినపత్రిక చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం తప్పనిసరి. www.sakshieducation.com లో ఉన్న కరెంట్ అఫైర్స్‌ను చదివితే విజయం మీదే. ఇన్పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ జాబ్స్ అలర్ట్స.. సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్).. దుర్గాపూర్ ప్లాంట్‌లో వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. మెడికల్ సర్వీస్ ప్రొవైడర్(ట్రైనీ) అర్హతలు: ఫార్మసీ/రేడియాలజీలో డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్/డైటిటిక్స్/క్లినికల్ న్యూట్రిషన్)తోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. పై పోస్టులకు నోటిఫికేషన్లో నిర్దేశించిన వయోపరిమితి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: http://sailcareers.com/careers -
బూబూ.. బ్యూటిఫుల్.. గినియా పిగ్
ఇదో గినియా పిగ్.. పేరు బూబూ(2).. చూడండి.. ఎంత ముద్దుగా ఉందో.. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఇది హల్చల్ చేస్తోంది. సరికొత్త సెలబ్రిటీ పెంపుడు జంతువుగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దీని ఫొటోలకు లైక్‌లు కొడుతున్నారు. నెదర్లాండ్‌కు చెందిన బూబూను ఇలా తయారుచేసి.. దాని యజమాని మెగాన్ ఫొటోలు తీసింది. ఇటీవల వాటిని ఇంటర్నెట్లో పెడితే.. మంచి స్పందన వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే బూబూకు 17 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు.. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన గినియా పిగ్గా పేరొందింది. మంచి మోడల్‌గా రాణించే అవకాశాలు దీనికి మెండుగా ఉన్నాయట. -
తమన్నా కస్టడీలో కుక్క!
ప్రముఖుల హోదాలో ఉన్న వారు సాధారణంగా ప్రైవసీని కోరుకుంటారు. ప్రజా జీవితంలోకి రావాలని ఉన్నా.. అందులో ఉండే అసౌకర్యానికి భయపడి వెనుకంజ వేస్తారు. అయితే వారందరికి అతీతంగా తనకెందుకులే అనే విషయాన్ని పక్కన పెట్టి సినీ నటి తమన్నా పెంపుడు జంతువుల పట్ల ప్రేమను ప్రదర్శించారు. ముంబై సబర్బన్ లో ఎప్పుడూ బిజీగా ఉండే దక్షిణ ఖార్ లో తమన్నాకు తప్పి పోయిన ఓ పెంపుడు కుక్క కనిపించింది. అయితే ఎందుకులే అని కోకర్ స్పానియల్ జాతికి చెందిన కుక్క వదిలేయకుండా తన ఇంటికి తీసుకువచ్చింది. అంతేకాకుండా దాని యజమాని వద్దకు చేర్చాలని ప్రయత్నాలు చేశారు. అయితే యజమాని ఆచూకీ తెలియకపోవడంతో సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఎవరిదో పెంపుడు కుక్క తప్పిపోయింది... దాని యజమాని గుర్తించినట్లయితే సంప్రదించాలని ఓ ఫోన్ నెంబర్ తోపాటు ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. 6 months old female cocker spaniel found in khar west. Please help find owners!no +91 7738-169914 pic.twitter.com/3Xjmm8bikJ — Tamannaah Bhatia (@tamannaahspeaks) September 1, 2014 -
జిఫ్.. జబర్దస్త్..
ఇలా నడిచే కుక్కను మీరెక్కడైనా చూశారా? చాలా మంది తమ పెంపుడు శునకం విసిరేసిన బాల్‌ను తెచ్చిస్తేనే.. సూపర్ అంటూ మురిసిపోతారు. అలాంటిది.. జిఫ్(4) అనే ఈ కుక్క చేసేవి చెబితే.. సూపర్లాంటి పదాలెన్ని వాడినా దీని టాలెంట్‌కు సరిపోవు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉండే జిఫ్ తన వెనుక కాళ్లపై 32 అడుగుల దూరాన్ని కేవలం 6.56 సెకన్లలో.. 16 అడుగుల దూరాన్ని తన ముందు కాళ్లపై 7.76 సెకన్లలో పరిగెత్తేయగలదు. అందుకే.. రెండు కాళ్లపై అత్యంత వేగంగా పరుగెత్తే శునకంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సెప్టెంబర్‌లో విడుదలయ్యే గిన్నిస్ బుక్-2015 ఎడిషన్‌లో మొదటి రికార్డు కూడా దీనిదేనట. ఇదొక్కటేనా.. జిఫ్ షేక్‌హ్యాండ్ ఇస్తుంది. డాన్సులేస్తుంది. స్కేట్‌బోర్డుపై రైడింగ్ చేస్తుంది. అభిమానులు అడిగితే.. ఆటోగ్రాఫ్(కాలి ముద్ర వేస్తుంది) కూడా ఇస్తుంది. -
కోతి కోసం 6 లక్షలు చెల్లించిన పాప్ స్టార్!
లాస్ ఎంజెలెస్: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఎప్పుడు ఏదో వివాదంలోనో, మరో రకమైన వార్తల్లో గమనిస్తునే ఉంటాం. తాజాగా తన పెంపుడు కోతి మ్యాలీకి 10 వేల డాలర్లు (ఆరు లక్షల రూపాయలు) చెల్లించి వార్తల్లో నిలిచాడు. గత సంవత్సరం జర్మనీ పర్యటనలో అనుమతి పత్రాలు సమర్పించకుండా, వ్యాక్సిన్ వేయకుండా తీసుకువచ్చారనే కారణంతో అధికారులు పెంపుడు కోతిని అదుపులోకి తీసుకున్నారు. బీబర్ పత్రాలను సమర్పించే అవకాశం లేకని కారణంగా.. చేసేదేమి లేక కోతిని జర్మనీలో వదిలివేయాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. అప్పట్లో బీబర్ ను ఈ అంశం వివాదంలోకి నెట్టింది. తాజాగా బీబర్ 10 వేల డాలర్లు చెల్లించి పెంపుడు కోతిని తీసుకెళ్లారని జర్మన్ ఫెడరల్ నేచర్ కన్సర్వేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. బీబర్ చెల్లించిన బీబర్ మొత్తంలో 17 నెలలపాటు ఖర్చు చేసిన మొత్తం కూడా ఉందని వివారాల్ని ఆ సంస్థ తెలిపింది. -
ఆకలైతే చెప్పేస్తుంది..
లండన్: మీ పెంపుడు కుక్కపిల్లకు ఆకలిగా ఉంది.. లేదా ఏదో సమస్యతో బాధపడుతోంది.. పనిలో బిజీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదు.. మరెలా? జస్ట్ ‘ది పెట్పేస్ స్మార్ట్ కాలర్’ను మీ పెంపుడు కుక్క మెడకు పెట్టేస్తే చాలు.. దానికి ఆకలైనా, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా.. మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చేస్తుంది. బ్రిటన్‌లోని బర్లింగ్టన్కు చెందిన పెట్పేస్ సంస్థ తయారు చేసిన ఈ స్మార్ట్ కాలర్... ఎప్పటికప్పుడు పెంపుడు జంతువుల శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియను పరిశీలిస్తుంది. వీటితోపాటు అవి ఏదైనా నొప్పితో బాధపడుతుంటే గుర్తించి.. యజమాని ఫోన్‌కు మెసేజ్ పంపుతుంది. ఈమెయిల్కూడా చేస్తుంది. పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండలేనివారికి ఈ స్మార్ట్ కాలర్ ఎంతగానో తోడ్పడుతుందని పెట్పేస్ సంస్థ పశు శాస్త్రవేత్త అసఫ్ డాగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టనున్న దీని ధరెంతో తెలుసా.. దాదాపు రూ. 10 వేలు మాత్రమే. -
మియ్యాం.. మియ్యాం.. మేడ్ ఇన్ ఫారెన్
నేడు పిల్లుల దినోత్సవం పెట్ కార్నర్ : పిల్లి కొందరికి అపశకునం. మార్జాల ప్రేమికులకు మాత్రం అది ముద్దుల పెంపుడు జంతువు. పిల్లుల పెంపకం ఇప్పుడొక భారీ వ్యాపారం. ఆన్లైన్లో పిల్లుల వ్యాపారం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా సాగుతోంది. పర్షియన్, హిమాలయన్ వంటి విదేశీ మార్జాలాలకు రూ.5 వేల నుంచి రూ. 30 వేల వరకు ధర పలుకుతోంది. నగరంలో కుక్కలను పెంచుకునేవారు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే పిల్లులను పెంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫక్తు సంప్రదాయవాదులు సైతం పిల్లుల పెంపకానికి ముందుకొస్తున్నారంటే, ‘పెట్’బడిదారుల ట్రెండ్‌లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. ఫారిన్ క్యాట్స్‌పై మక్కువ చూపుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పిల్లుల పోషణ కూడా ఇప్పుడు లాభసాటి వ్యాపారంగా మారింది. వేల రూపాయలు వెచ్చించి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. వాటి పోషణకూ నెలకు వేలల్లోనే ఖర్చుపెడుతున్నారు. పిల్లుల పెంపకం కొందరికి హాబీ అయితే, హోదా చిహ్నాలను కలిగి ఉండటమే గర్వకారణమనుకునే వారికి ఇది లేటెస్ట్ ఫ్యాషన్. డబ్బుకు వెనుకాడకుండా వివిధ జాతుల విదేశీ పిల్లికూనలను తెచ్చుకుంటున్నారు. వాటి సంరక్షణ కోసం కూడా ధారాళంగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో పిల్లికి నెలకు కనీసం మూడువేల రూపాయలకు పైగా కూడా ఖర్చుపెట్టే వారు ఉన్నారు. వర్ణ వివక్ష... పిల్లుల పెంపకంలో కాసింత వర్ణవివక్ష లేకపోలేదు. వీటిని పెంచుకోవాలనుకునే వారు ఎక్కువగా తెలుపు రంగు పిల్లులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం బ్రౌన్ కలర్ పిల్లులది. నగరంలో ఎక్కువగా పర్షియన్, హిమాలయన్ జాతుల మార్జాలాలను పెంచుకుంటున్నారు. ఈ జాతుల పిల్లికూనలను నెలకు కనీసం పది వరకు విక్రయిస్తుంటామని బంజారాహిల్స్‌లోని ‘ఫర్ అండ్ ఫెదర్స్’ పెట్స్ షాపు మేనేజర్ ఎండీ నవీన్ చెబుతున్నారు. పర్షియన్ బ్రీడ్ పిల్లులు చూడచక్కగా ఉంటాయి. మనుషులకు తేలికగా మచ్చికవుతాయి. ఒకసారి మచ్చికయ్యాక యజమానుల పట్ల వాటి శైలిలో ప్రేమాభిమానాలు చూపుతాయి. అందుకే ఎక్కువ మంది వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మార్జాల మమకారం... మ్యావ్.. మ్యావ్మనే పిల్లి అరుపు వింటేనే సహించలేరు కొందరు. అలాంటిది, నిత్యం పిల్లుల కూతతోనే తాము మేలుకుంటామని సోమాజిగూడకు చెందిన మహబూబ్ బాషా, జుబేరా దంపతులు చెబుతున్నారు. రెండేళ్లుగా వీరు పర్షియన్ జాతి షార్ట్‌లెగ్ పిల్లులను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం వారింట్లో ఐదు పిల్లులు ఉన్నాయి. పిల్లులతో ఆడుకోవడానికి అసలు టైమే సరిపోవడం లేదని, వాటితో విడదీయలేని బంధం ఏర్పడిందని చెబుతున్నారు ఈ దంపతులు. పిల్లుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న వీరు తమ పిల్లులు పెట్టే పిల్లికూనలను ఆన్లైన్లో విక్రయిస్తుంటారు. అయితే, పెట్ లవర్స్‌కు మాత్రమే తాము పిల్లులను విక్రయిస్తామని, అది కూడా నమ్మకం కుదిరితేనేనని వీరు చెబుతున్నారు. - మహి -
పాప ప్రాణం తీసిన కోడి
మునుగోడు: పెంపుడు కోడి దాడి చేయడంతో ఎనిమిది నెలల పసిపాప మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం లక్ష్మిదేవిగూడంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొంపల్లి సైదులు, గీతలకు ఎనిమిది నెలల క్రితం మొదటి సంతానంగా పాప జన్మించింది. పాప పేరు జాహ్నవి. వారిది వ్యవసాయ కుటుంబం కావడంతో పెరట్లో కోళ్లను పెంచుతున్నారు. గురువారం ఉదయం తల్లి పాపను ఇంటి వరండాలో పడుకోబెట్టి పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో కోడి పాప వద్దకు వచ్చి తలపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం జాహ్నవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందింది. -
ఆ పిల్లను కొనేశాను
మూగజీవాలంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా శునక రాజులంటే హీరోయిన్లు చాలా ప్రేమ కురిపిస్తుంటారు. చాలామంది హీరోయిన్లలో వివిధ జాతులకు చెందిన పెట్ డాగ్స్ చూస్తుంటాం. నటి త్రిషకు శునకాలంటే ఎనలేని ప్రేమ. ఎక్కడ ఊరకుక్క కనిపించినా ఆమె దాని సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తుంటారు. అంతేకాదు శునక సంరక్షణ సంస్థకు ఆమె తన వంతు సాయం చేస్తుంటారు. అలా చాలామంది నటీమణులు శునక ప్రేమ ఒలకబోస్తూ వాటిని ముద్దాడుతూ తమ ఖాళీ సమయాన్ని గడిపేస్తుంటారు. అలాగే నటి తమన్నకు చిన్నతం నుంచే శునకాలంటే చాలా ఇష్టం అట. ఒక్క కుక్కపిల్లనైనా పెంచుకోవాలని ఆశపడేవారట. అయితే తమన్న తల్లికి నచ్చని ఏకైక విషయం కుక్కలపై ప్రేమ చూపడమేనట. దీంతో తమన్న ఇటీవల వరకు తన ఆశను తనలోనే అణగదొక్కుకుంటూ వచ్చారు. అయితే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నా ఆమెలో శునక ప్రేమ సమసి పోలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో మిల్కీ బ్యూటీ ఒక తెలుగు చిత్రంలో శునకాలతో నటించే అవకాశం వచ్చింది. ఇది శునకమయంగా తెరకెక్కుతున్న చిత్రం అట. అలాగే నటి తమన్న పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. చిత్రంలో శునకంతో ఆడిపాడిన తమన్నకు తన మనసులోతుల్లో దాగి వున్న శునక ప్రేమ ఒక్కసారిగా బయటకు పొంగి వచ్చిందట. దీంతో వెంటనే మంచి కుక్కపిల్లను కొనేసిందట. అమ్మ ఆగ్రహాన్ని కూడా భరించి ఇంటికి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఏ మాత్రం సమయం దొరికినా ఆ కుక్కపిల్లకు ముద్దుపెట్టేస్తూ దాంతో ఆడుకుంటున్నారట. అంతేకాదు ఇంత కాలానికి తన కోరిక నెరవేరిందని మురిసిపోతున్నారట తమన్న. -
కుక్కకు టాటూ నివాళి
పాప్‌స్టార్ మిలీ సైరస్ తన పెంపుడు కుక్కకు నివాళిగా టాటూ పొడిపించుకుంది. మిలీ అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క ఫ్లాయిడ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించింది. దాని మరణంతో మానసికంగా కుంగిపోయిన మిలీ, కుక్క జ్ఞాపకాన్ని శాశ్వతం చేసుకునేందుకు తన ఎడమ పక్కటెముకల వద్ద దాని బొమ్మను పచ్చబొట్టు వేయించుకుంది. -
పెట్స్‌కూ లైఫ్‌స్టైల్ ఉంది
‘మనుషులకే కాదు పెంపుడు జంతువుల (పెట్స్)కూ ఓ జీవనశైలి ఉంది. అది గుర్తించి, వాటి భాషను, భావాలను అర్థం చేసుకుంటేనే మనం నిజమైన పెట్ లవర్స్ అనిపించుకుంటాం’ అంటున్నారు శర్వాణి చౌదరి. దేశంలోనే తొలి పెట్స్ లైఫ్‌స్టైల్ మేగజైన్ ‘హైదరాబాద్ పాస్’ను ఆమె రూపొందించి ఇటీవలే విడుదల చేశారు. తొలి పుస్తకంలోనే హీరో సిద్ధార్థకు తన పెట్‌తో అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించి ప్రశంసలు పొందిన శర్వాణి... తన తర్వాతి ఎడిషన్ కోసం నటి శ్రీయను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెతో ముచ్చటించింది. ‘ఒక శునకం రోడ్డు మీద మొరుగుతుంటే విసుక్కునే వారేగానీ.. దాని అరుపుల వెనుక ఉన్న వేదన అర్థం చేసుకునేవారెందరు’ అని ప్రశ్నించే శర్వాణి... జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో దాదాపు 40కి పైగా వీధికుక్కలకు కొంతకాలంగా ఆహారం, వైద్య సేవలు వంటివి అందేలా చూస్తున్నారు. ‘ఆ క్రమంలోనే నాకు అర్థమైంది. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని’ అన్నారామె. మెదక్‌లో అనాథ వృద్ధులకు ఆశ్రయం అందించే ఎన్జీఓ హోమ్ కూడా ఆమె నిర్వహిస్తున్నారు. సెలబ్రిటీలే ఎందుకంటే... ‘ప్రముఖులు ఏ విషయమైనా చెబితే అది బాగా ప్రచారంలోకి వస్తుందనేది తెల్సిందే. అదే ఉద్దేశంతో టాలీవుడ్ టాప్‌స్టార్స్‌కు తమ పెట్స్‌తో ఉన్న అనుబంధాన్ని మేగజైన్ కవర్‌స్టోరీగా అందిస్తున్నా’ అన్నారు శర్వాణి. కేవలం ఫ్యాషన్ కోసమో మరోలానో పెట్స్‌ను పెంచుకునేవారిని కాకుండా వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానంగా చూసేవారికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సృష్టిలో ఉన్న 84 రకాల జీవులకు కూడా మనిషిలాగే ప్రత్యేకమైన జీవనశైలి ఉందనే ఆమె... అవి తమకు నచ్చేలా మనుగడ సాగించడం కోసం ఏ ఎన్జీఓ సరిగా కృషి చేయుడంలేదంటారు. తమ మేగజైన్లో పెట్స్ ఆరోగ్యసమస్యల పరిష్కారాలు మొదలుకుని వాటి కోసం పనిచేసే సంస్థలు, విభిన్న రకాల పెంపుడు జంతువులు, వాటి జీవనశైలి విశేషాలుంటాయని చెప్పారామె. - ఎస్.సత్యబాబు -
ఎలుగుబంటితో తలపడిన పెంపుడు కుక్క
టోక్యో: ఎలుగుబంటి దాడి నుంచి ఆరేళ్ల బాలుడిని కాపాడిన ఓ పెంపుడు కుక్క ఉత్తర జపాన్ లో పతాక శీర్షికలకు ఎక్కింది. పోలీసులు, మీడియా దాన్ని హీరోగా కీర్తించాయి. షిబా ఇను అనే ఆరేళ్ల బాలుడు తన 80 ఏళ్ల ముత్తాతతో కలిసి శనివారం సాయంత్రం ఒడేట్ లో నది ఒడ్డుకు వాకింగ్ కు వెళ్లాడు. ఇదే సమయంలో మూడగులు ఎత్తున్న అడవి ఎలుగుబంటి ఒక్కసారిగా షిబాపై దాడి చేసింది. షిబా ముత్తాత భయంతో కారు దగ్గరకు పరుగులు తీశాడు. అయితే అక్కడే వున్న ఆయన పెంపుడు కుక్క గట్టిగా మొరుగుతూ, ఎలుగుబంటి వెంటపడింది. దీంతో ఎలుగుబంటి తోక ముడించింది. ఈ ఘటనలో షిబాకు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స అనంతరం అతడికి ఇంటికి పంపించినట్టు పోలీసులు తెలిపారు. సాహసం చేసిన కుక్క పేరు మెగో(క్యూట్) అని వెల్లడయింది. ఎప్పుడూ మౌనంగా, భయంగా ఉండే మెగో ఎలుగుబంటిని తరిమికొట్టడం పట్ల షిబా ముత్తాత అమితాశ్చర్యం వ్యక్తం చేశాడు. -
పంచామృతం: వీళ్ల పెంపకం ప్రత్యేకం...!
పెంపుడు జంతువులు అంటే... కుక్క, పిల్లి అనేది అందరి మాట. అయితే పెంచుకొనే ఓపిక, ఆసక్తి ఉండాలి కానీ.. అందులో కూడా ప్రత్యేకతను చూపించవచ్చని నిరూపిస్తున్నారు అనేక మంది సెలబ్రిటీలు. అలాంటి అరుదైన ఆసక్తితో అరుదైన పెట్లను పెంచుతున్న కొంతమంది... క్రిస్టెన్ స్టివర్ట్ ‘టై్వలైట్’ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకొన్న నటి క్రిస్టెన్ స్టివర్ట్. ఆ సినిమాలో ఒక అతీంద్రియ శక్తిని ప్రేమించిన ఈ యువతి నిజ జీవితంలో కూడా అందరి కన్నా భిన్నమైన పెట్‌ను పెంచుకొంటోంది. ‘జాక్’ అనే ఒక తోడేలును పెంచుకొంటోంది ఆమె. జనావాసాల మధ్య తోడేలును పెంచుకోవడం గురించి ఆమె ప్రత్యేక అనుమతిని కూడా తీసుకొంది. మైక్ టైసన్... పక్కన ఒక పులి పిల్లను కూర్చోబెట్టుకొని తన ఫెరారీ ని ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ అలా సుదూర ప్రాంతాలకు వెళ్లడం మైక్‌టైసన్‌కు బాగా ఇష్టం. అయితే ఆర్థికంగా బాగా దెబ్బతిన్న టైసన్ ఫెరారీలను అమ్ముకొన్నాడు. కానీ పులి పిల్లలను మాత్రం అలాగే ఉంచుకొన్నాడట. కుక్క పిల్లను పట్టుకున్నట్టుగా దానిని పట్టుకుని షికారు వెళుతుంటాడు ఈ అలనాటి బాక్సింగ్ ఛాంపియన్. జస్టిన్ బీబర్... ఈ కెనడియన్ పాప్‌స్టార్ ‘మాలి’ అనే కోతిని పెంచుకుంటున్నాడు. అది ఎప్పుడూ తన వెంటే ఉండాలనేది బీబర్ కోరిక. అయితే ప్రతిసారి అనుమతులు తీసుకొనేంత సమయం ఉండకపోవచ్చు. అందుకే ఎక్కడికైనా మాలిని వెంట తీసుకెళ్లాలి అని బలంగా అనుకున్నప్పుడు ప్రైవేట్జెట్ను ఏర్పాటు చేసుకుంటాడట బీబర్. బ్రెట్ లీ... వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ.. ఈ ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టార్ ఒక పందిని పెంచుతున్నాడు. ఆ వరాహం అంటే లీకి ప్రాణం. విదేశీ టూర్లకు వెళ్లేప్పుడు దాన్ని మిస్సవుతుంటానని బ్రెట్‌లీ చాలా ఫీలవుతూ ఉంటాడు. అయితే విమానాల్లో పెంపుడు పందిని వెంట తీసుకు వెళ్లాలంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే లీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు దాన్ని అస్సలు మిస్సవ్వడట. -
క్యాలీ.. కో-పైలట్
లండన్: చిత్రంలో చూశారా.... పెంపుడు కుక్కకు గుర్తింపు కార్డు చూస్తుంటే చిత్రంగా ఉంది కదూ.... ఇదంతా ఆకతాయి చేష్ట అనుకుంటే పొరపాటే.... ఈ శునకానికి నిజంగా క్రూ కార్డు (విమాన సిబ్బందికి ఇచ్చే కార్డు) ఉంది. క్యాలీ అనే ఈ మూడేళ్ల కుక్క (పూచ్) తన యజమాని గ్రాహం మౌంట్ఫోర్డ్తో కలసి చిన్నప్పటి నుంచి ఇంగ్లండ్ అంతటా చక్కర్లు కొట్టింది. తన యజమానికి ఉన్న తేలికపాటి విమానంలో కో-పైలట్ హోదాలో 250 గంటల పాటు ఆకాశయానం చేసింది. ఇలా దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. దీంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ పైలట్స్ అసోసియేషన్ (ఏఓపీఏ) వాళ్లు దీనికి క్రూ కార్డు జారీ చేశారు. ప్రపంచంలో ఈ కార్డు పొందిన మొదటి కుక్క క్యాలీనే. ఈ కార్డు ఉండడం వల్ల క్యాలీ ఇకపై ఇంగ్లండ్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులకు విమానసిబ్బంది హోదాలో దర్జాగా వెళ్లొచ్చు. తన కో-పైలట్ కుక్క అని తెలిసి చాలామంది ఆశ్చర్యంతో చిరునవ్వు చిందిస్తుంటారని క్యాలీ యజమాని మౌంట్‌ఫోర్డ్ చెప్పాడు. -
బ్రిటిష్ శునకం అరుదైన రికార్డు
ఇంగ్లండ్‌లోని ఓ లాబ్రడార్ శునకం అరుదైన రికార్డు సాధించింది. 250 గంటలకు పైగా విమానంలో పయనించి, క్రూ కార్డు పొందిన మొట్టమొదటి శునకంగా పేరొందింది. కాలీ అనే ఈ శునకం తన యజమాని గ్రాహమ్ మౌంట్ఫోర్డ్తో కలిసి బ్రిటన్ మొత్తం తిరిగేసింది. దానికి 12 వారాల వయసు ఉన్నప్పటి నుంచి మౌంట్‌ఫోర్డ్ దాన్ని తీసుకుని విమాన ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటికది దాదాపు 80,467 కిలోమీటర్లు ప్రయాణించింది. చిన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లు మొదలుపెట్టి అంతర్జాతీయ విమానాశ్రయాల వరకు అన్నింటిలోనూ ఇది దిగింది. ఇప్పుడు కాలీకి క్రూకార్డు రావడంతో, కేవలం విమాన సిబ్బంది మాత్రమే తిరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో కూడా తిరిగేందుకు దానికి అనుమతి లభించినట్లయింది. బ్రిటన్‌లో ఈ హోదా పొందిన ఏకైక శునకం కాలీ మాత్రమే. విమానాల యజమానులు, పైలట్ల సంఘం దానికి ఈ గుర్తింపు ఇచ్చింది. మౌంట్ఫోర్డ్కు సొంతంగా ఉన్న ఆరు సీట్ల సెస్నా విమానంలోని కో పైలట్ కుర్చీలో కూడా దీన్ని కూర్చోబెట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. -
పెంపుడు కుక్కను పెళ్లాడిన మహిళ
లండన్: అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇటీవల కాలంలో్ యువత ఓ అడుగు ముందుకేసి అమ్మాయిలు అమ్మాయిలతో.. అబ్బాయిలు అబ్బాయిలతో వివాహం చేసుకుంటున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ అందరికీ భిన్నమైన దారి ఎంచుకుంది. ఆమెకు మనుషులు ఎవరూ నచ్చక ఏకంగా పెంపుడు కుక్కను పెళ్లి(!) చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే! లండన్‌కు చెందిన 47 ఏళ్ల అమండా రోడ్జర్స్.. భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె ఓ కుక్కను అపురూపంగా పెంచుకుంటోంది. ముద్దుగా షెబా అనే పేరు పెట్టింది. అంతవరకు బాగానే ఉంది. జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలన్నీ అమండాకు పెంపుడు కుక్కులో కనిపించాయి. ఇంకేముందు ఆలస్యంగా చేయకుండా కుక్కను పెళ్లి చేసేసుకుంది. 200 మందిని ఆహ్వానించి ఈ వేడుక చేసుకుంది. 2012 ఆగస్టులో ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం. 'గత కొన్నేళ్లుగా షెబా నా జీవితంలో భాగమైపోయింది. నన్నెప్పుడు సంతోషంగా, సౌకర్యంగా ఉంచుతుంది. జీవిత భాగస్వామి నుంచి నాకేమి కావాలో.. ఇంతకుమించి మరేమీ అవసరం లేదు' అని అమండా సంతోషం వ్యక్తం చేసింది. అన్నట్టు ఆమె 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొన్ని నెలల్లోనే పెళ్లి తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్తతో పోలిస్తే కుక్కతోనే ఎక్కువ రోజులు సంసారం చేసింది. ఇప్పటికీ సాగిస్తోంది. ఎవరి ఆనందం వారిదండి! -
కుక్కపిల్లనుపోగొట్టారని ఫిర్యాదు...
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను ఊరికి వెళ్తూ పెట్క్లినిక్లో అప్పగిస్తే పోగొట్టారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలు... శ్రీనగర్‌కాలనీలో నివసించే ప్రభు త్వ ఉద్యోగి తులసి ఈనెల 13న ఊరికి వెళ్తూ తన 14 నెలల పగ్ జాతి కుక్కపిల్లను జాగ్రత్తగా చూడాలని చెప్పి శ్రీనగర్‌కాలనీలోని జీకే పెట్ క్లినిక్‌కు అప్పగించారు. రోజుకు రూ.250 చొ ప్పున రుసుం కూడా చెల్లించారు. ఈనెల 17న క్లినిక్ సిబ్బంది ఆ కుక్కపిల్లలను వాకింగ్ కోసం రోడ్డుపైకి తీసుకెళ్లగా...స్కూల్ బస్సు రావడం తో బెదిరి పోయి మెడకున్న గొలుసును తప్పిం చుకొని పారిపోయింది. క్లినిక్ సిబ్బంది గాలిం చినా దాని ఆచూకీ దొరకలేదు. ఊరు నుంచి తిరిగొచ్చిన తులసి తన కుక్కపిల్ల అదృశ్యమైన వి షయం తెలుసుకొని పెట్ క్లినిక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కుక్కపిల్లను పోగొట్టిన పెట్ క్లినిక్ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. -
నేనూ నా పప్పీ!
పెట్ లవ్- అనుష్క శర్మ మా పమేరియన్ పప్పీ అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. పాటల్లో చెబుదామంటే నేను కవిని కాదు. అయినా సరే...నా ఇష్టాన్ని మీతో పంచుకుంటాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే మాట చాలా సార్లు సినిమాల్లో విన్నాను. ఈ మాట నా అనుభవంలోకి పప్పీ వల్లే వచ్చింది. ముప్పై రోజుల ముద్దుల పప్పీని చూసీ చూడగానే ప్రేమలో పడిపోయాను. కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని పప్పీతో ఆడుకున్న రోజులున్నాయి. మా పప్పీ నిద్రపోనిదే నేను నిద్రపోను. మా పప్పీకీ నేనే తల్లి అనుకొని మురిసిపోతాను. ఈమధ్య ఫిల్మ్ షెడ్యూల్స్‌లో బిజీగా ఉండడం వల్ల పప్పీని మిస్ అవుతున్నాను. షూటింగ్ కోసం వేరే ప్రాంతాలలో ఉన్నప్పుడు పొద్దున లేవగానే పప్పీ గుర్తుకు వచ్చి వెలితిగా అనిపిస్తుంది. ‘నేను పప్పీ గురించి ఆలోచించినట్లు, బాధ పడినట్లు అది కూడా నా గురించి ఆలోచిస్తుందా?’ షూటింగ్ విరామంలో తోటి నటులతో మాట్లాడుతున్నప్పుడు పప్పీ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘‘ఎప్పుడూ పప్పీ గురించి చెప్పి బుర్ర తింటుంది’’ అని వాళ్లు మనసులో అనుకుంటారేమో తెలియదుగానీ నాకైతే పప్పీ గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. -
పెంచిన ప్రేమ..
కంకిపాడు: మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. అలాంటిది పెంపుకుక్క చనిపోయిందని ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన దేవినేని అనిల్‌కుమార్ కుటుంబసభ్యులు కిక్ పేరుతో పిలుచుకునే కుక్క (నాలుగేళ్లు)ను ఎంతో ప్రేమతో పెంచారు. అది అనారోగ్యంతో నాలుగు రోజుల కిందట మృతిచెందింది. దాన్ని ఖననం చేసిన ఆ కుటుంబసభ్యులు సోమవారం ఐదోరోజు కర్మకాండలు నిర్వహించారు. అన్నదానం చేశారు. ‘భగవంతుని సన్నిధిలో..’ అంటూ కిక్ నేస్తమైన మరో శునకం స్నూఫీ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నట్లు బ్యానర్లు ఏర్పాటుచేశారు. -
అరణ్యం: ప్రమాదం వస్తే కంగారూ ఏం చేస్తుంది?
కంగారూలు నాలుగు కాళ్లమీదా నడవగలవు, రెండు కాళ్లమీదా నడవగలవు. వెనక్కి మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేవు. వాటి కాళ్ల నిర్మాణం అందుకు సహకరించదు! మగ కంగారూని బక్ లేదా బూమర్ అంటారు. ఆడ కంగారూని డో లేదా ఫ్లయర్ అంటారు. కంగారూ పిల్లని జోయ్ అంటారు! కంగారూల చెవుల నిర్మాణం విచ్రితంగా ఉంటుంది. అవి ఎటునుంచి శబ్దం వస్తే అటువైపు తిరుగుతూ ఉంటాయి! ఇవి నీళ్లు తాగకుండా రెండు నుంచి నాలుగు నెలల వరకూ ఉండగలవు! కంగారూలు ఉప్పగా ఉండే ఆకులను ఇష్టంగా తింటాయి. యూకలిప్టస్, అకాసియా చెట్ల ఆకుల్ని అస్సలు ముట్టకోవు. అయితే కంగారూలు ఉండే ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఉండేవి ఈ రెండు రకాల చెట్లే! ఎందుకో తెలీదు కానీ... ఇవి వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకుంటాయి. అందుకే మధ్యాహ్నం పూట తినవు. సాయంత్రం చల్లబడిన తర్వాత తింటాయి. అంతేకాదు... ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి! నాలుగు నుంచి ఇరవై కంగారూలు కలిపి గుంపుగా ఉంటాయి. ఈ గుంపును ట్రూప్ లేదా కోర్ట్ అంటారు. అన్నిటిలోకీ పెద్దదైన మగ కంగారూ గుంపునకు లీడర్‌గా ఉంటుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది తన కాలును నేలకేసి టపటపా కొడుతుంది. వెంటనే అన్నీ అలర్ట్ అయిపోతాయి! ఇది మహా తుంటరి! ‘ప్రపంచాన్ని మర్చిపోవాలంటే... పక్కన ఓ పెంపుడు జంతువు ఉండాలి’ అంటారు కంగనా రనౌత్. బాలీవుడ్లో ఫేమస్ హీరోయిన్ అయిన కంగనా... ‘ఏక్ నిరంజన్’ చిత్రంతో తెలుగువారికి కూడా దగ్గరయ్యారు. సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉండే ఈమె... కాస్త తీరిక దొరికిందంటే చేసే పనేంటో తెలుసా? తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం. కంగనా ఇంటికి వెళితే... తెలుపు, బ్రౌన్ కలర్స్ కలగలిపి ఉండే బుజ్జి కుక్కపిల్ల అటూ ఇటూ పరిగెడుతూ కనిపిస్తుంది. ఇది ఒకచోట కుదురుగా కూర్చోదు, నిలబడదు. కాళ్లకడ్డుపడుతూ పరుగులు తీస్తుంది. సోఫాలు, కుర్చీలు ఎక్కి నానా హంగామా చేస్తుంది. దాని అల్లరి చూడటం తనకెంతో ఇష్టం అని మురిసిపోతూ చెబుతుంటారు. కంగనా. దానితో ఎంతసేపు ఆడుకున్నా విసుగే రాదని అంటారు. అది కూడా కంగనా దగ్గర భలే గారాలు పోతుంటుంది. ఒకసారి ఏమయ్యిందంటే... కంగనా షూటింగుకి వెళ్లడానికి రెడీ అయ్యారు. చెప్పులు వేసుకుందామని స్టాండ్ దగ్గరకు వెళ్లారు. అంతే, అక్కడ తన చెప్పులు చూసి షాకయ్యారామె. కొన్ని వేలు పోసి కొన్ని ఖరీదైన చెప్పులు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. వాటిని చూడగానే ఆమెకు అర్థమైపోయింది.. అది ఎవరి పనో! కానీ ఏం చేయగలదు? ‘‘నాకు తెలుసు ఇది దాని పనే అని. ఆ చెప్పుల విలువెంతో నాకు తెలుసు గానీ దానికేం తెలుసు’’ అంటూ నవ్వుకున్నారు కంగనా. అంత తుంటరిది ఆ బుజ్జి కుక్క!