rajasekhar
-
కీచకులకు చంద్రబాబు సర్కార్ అండదండలు: కాకుమాను
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలికపై లైంగికదాడి జరిగితే, కారకుడైన నిందితుడికి అధికారపార్టీ అండగా నిలవడం దారుణమన్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా వారికి రక్షణ కల్పించాలన్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన 12 ఏళ్ల మైనర్ బాలికపై గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన ఆర్.రమేష్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడి చేశాడు. పోలీస్ విచారణలో ఆ బాలికపై నిందితుడు రమేష్ అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వెంటనే అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితో నిందితుడు పరారయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది.ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని భావిస్తున్న తరుణంలో ఏకంగా కేసును రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తమ పార్టీకి చెందిన కార్యకర్తను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ఏకంగా బాలిక తండ్రిని బెదిరించి, బలవంతంగా లక్ష రూపాయలకు రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. దీనిలో భాగంగా రూ.20 వేలు కూడా అడ్వాన్స్‌గా చెల్లించారు. తన నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అంటే తన పార్టీకి చెందిన వారు ఏది చేసినా అది సమంజసమేనని సమర్థిస్తున్నారా?గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆడబిడ్డలపై దాడులు చేసే వారికి అదే వారి ఆఖరి రోజు అంటూ గొప్పగా ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పార్టీ వారే కీచకులుగా మారి మహిళలు, బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో జరిగిన ఇటువంటి దారుణాలపై నోరు మెదపడం లేదు.దిశయాప్‌ను నిర్వీర్యం చేశారురాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వ్యవసనాల బారిన పడిన ఆకతాయిలు బాలికలపైనా, మహిళలపైనా దాడులకు తెగబడుతున్నారు. గతంలో మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశయాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎంతో గొప్పగా శక్తీయాప్ను తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంది. అయినా కూడా రాష్ట్రంలో ప్రతిచోటా మహిళలపై ఈరకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని నివారించే చిత్తశుద్ది కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు -
పళ్ళు చూపించి ఫోటోలు దిగడం కాదు ...అభివృద్ధి అంటే..
-
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్‌ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
కేజ్రీవాల్ ని చూసి నేర్చుకో.. బాబుకు టీడీపీ నేత ఝలక్
-
హామీలు ఎగ్గొడతానని చంద్రబాబు క్లారిటీగా ఉన్నాడు..
-
అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసిన రూ.1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యత కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు, ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా, సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో.. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పని చేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా.. పవన్‌కళ్యాణ్ తేలు కుట్టినా దొంగలా సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు.ఆత్మవిమర్శ చేసుకోవాలి:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కూటమి పార్టీలు ఏ మేరకు నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాని వాగ్ధానాలు చేర్చడం, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా మోసం చేయడం చంద్రబాబుకి పరిపాటిగా మారింది. ప్రజలను మోసం చేసి చంద్రబాబు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు మోసాలపై బీజేపీకి క్లారిటీ ఉంది కాబట్టే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో దాన్ని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడలేదు.ప్రజలతో మూడు ముక్కలాట:పాలనపై చంద్రబాబు పట్టుకోల్పోయారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ప్రజల ఆశలతో మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మినహా 8 నెలల్లో జరిగింది శూన్యం. గత వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పలు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో జగన్ చేసిన పాలనకు దేశమే బ్రహ్మరథం పట్టింది. అయినా కరోనా సాకు చూపించి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూడకపోవడం ఆయన గొప్పతనం. నేడు పరిస్దితులన్నీ బాగానే ఉన్నా, అనుభవశాలినని చెప్పుకునే చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయలేక పిల్లి మొగ్గలేస్తున్నాడు.ఆయన ఏనాడూ సాకులు చెప్పలేదు:జగన్ మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అమలు చేస్తే చంద్రబాబు మాత్రం ప్రజల్ని వంచించడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి టీడీపీ ప్రభుత్వం ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయింది. అయినా చంద్రబాబులా జగన్ సాకులు వెతుక్కోకుండా నవరత్నాలను అమలు చేసి చూపించారు. ఈ 8 నెలల్లో దాదాపు 1.19 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారు. పైగా గత ప్రభుత్వ అప్పులంటూ సాకులు వెతుకుతూ వైఎస్ జగన్ పాలనపై బురదజల్లాలని చూస్తున్నారు. ఈ ఎనిమిది కాలంలో చంద్రబాబు చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులున్నా వైఎస్ జగన్ ఎలాగైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో.. చంద్రబాబు కూడా కారణాలు వెతకడం మానేసి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అమలు చేయలేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. అవసరమున్నా లేకపోయినా ప్రతి సందర్భంలో ఐయామ్ ప్రజెంట్ అంటూ తలదూర్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా దాక్కోవడం సరైన పద్ధతి కాదు. సూపర్ సిక్స్ హామీలపై గ్యారంటీ ఇస్తూ సంతకం చేసిన ఆ పెద్ద మనిషి తక్షణం స్పందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మీద కాకుండా మేనిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో పని చేయాలని కాకుమాను రాజశేఖర్ కోరారు. -
కిడ్నీ రాకెట్ కేసులో సర్జన్ రాజశేఖర్ రిమాండ్
చైతన్యపురి: అలకానంద కిడ్నీ రాకెట్ కేసు(kidney racket case)లో మరొకరిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించిన ట్లు ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలు చేసిన తమిళనాడుకు చెందిన పెరుమాళ్ల రాజశేఖర్(Surgeon Rajasekhar) (59)ను చెన్నై వెళ్లిన పోలీస్ బృందం అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కిడ్నీ రాకెట్ కేసులో 13వ నిందితుడుగా ఉన్న రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మిలటరీ కాలనీకి చెందిన వ్యక్తి.తమిళనాడులోని సవిత మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నా రు. అలకానంద ఆస్పత్రి అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శస్త్ర చికిత్సలు చేసిన ప్రధాన సర్జన్. ఆయన సుమారు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఇదే ముఠా ఆధ్వర్యంలో జనని, అరుణ ఆస్పత్రుల్లో కూడా మరో 30కి పైగా కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిసింది. -
వంగలపూడి అనిత చేసిన నిర్వాకం.. సంచలన విషయాలు..
-
మూగబోయిన దళితుల గొంతుక
పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు. దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ! ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్‌మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్‌లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్‌కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.ఆయన కూడా ఒక రిపోర్టర్‌గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్‌కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు. అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్ను ప్రారంభించానని నాకు చెప్పారు.ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు. వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్ఎస్ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్‌కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
దేవుడిని రాజకీయాలకు వాడి చేయరాని తప్పు చేశాడు.. సిద్ధాంతం, నీతి లేని అవకాశవాది పవన్
-
మేము బ్లూ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?
-
KSR Live Show: అచ్యుతాపురం ఘటనపై పవన్ కామెంట్స్.. చింతా రాజశేఖర్ కౌంటర్..
-
KSR Live Show: చంద్రబాబు, పవన్ నిద్రపోతున్నారా ?
-
తల్లికి వందనం ఎగనామం.. మీడియాపై దాడులు..
-
ఫ్యాన్స్‌కు టెన్షన్.. పొరపాటున కల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం క్రేజీ రికార్డ్ సృష్టించింది. టికెట్స్ అమ్మకాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిగమించింది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో ఇండియాలోనూ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే టికెట్స్ అమ్ముడుపోయాయి.అయితే హైదరాబాద్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీకి బదులు.. రాజశేఖర్ నటించిన కల్కి మూవీ టికెట్స్ బుక్ అయినట్లు చూపించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. టికెట్స్ బుక్ చేసుకోవాలన్న తొందరలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని గమనించలేదు. టికెట్ లావాదేవి పూర్తయ్యాక చూస్తే కల్కి పోస్టర్ కనిపించడంతో అవాక్కయ్యారు. కాగా.. 2019లో ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కాంబోలో కల్కి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అలా టికెట్స్ బుక్ అయిన వారికి బుక్‌మై షో వివరణ ఇచ్చింది. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కల్కి టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. కల్కి 2898 ఏడీ టికెట్గానే భావించండి. సాంకేతిక లోపం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కల్కి 2898 ఏడీ ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.స్పందించిన రాజశేఖర్అయితే తన సినిమా కల్కి టికెట్స్ బుక్ కావడంపై హీరో రాజశేఖర్ స్పందించారు. ఈ విషయంలో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. Naaku assalu sammandham ledhu 😅🤣Jokes apart...Wishing dear #Prabhas @nagashwin7, Maa #AshwiniDutt garu @VyjayanthiFilms, The stellar cast and crew all the very very best!May you create history and take the film industry a step ahead #kalki2898ad https://t.co/P00OyIZFVE— Dr.Rajasekhar (@ActorRajasekhar) June 23, 2024 -
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
-
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బట్టబయలు
-
చంద్రబాబు చీప్ పాలిటిక్స్ పై చింతా రాజశేఖర్ విశ్లేషణ
-
స్నేహానికి హద్దు లేదురా!
‘‘ఏ దర్శకుడికైనా ఫస్ట్ మూవీ బర్త్ లాంటింది. నా తొలి చిత్రం ‘డాన్ శ్రీను’ ని ఇప్పటికీ మర్చిపోలేను. మనమేంటో ఇండస్ట్రీకి తెలియజేసేదే తొలి సినిమా. ‘హద్దు లేదురా’ చిత్రం ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ తొలిసారి దర్శకత్వం వహించినట్లు అనిపించడం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా, వర్ష, హ్రితిక హీరోయిన్లుగా, ఎస్తేర్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. రావి మోహన్‌రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి గోపీచంద్ మలినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మా యూనిట్‌ని ప్రోత్సహించాలి’’ అన్నారు వీరేష్ గాజుల బళ్లారి. నటీనటులు ఆశిష్ గాంధీ, తనికెళ్ల భరణి, రాధా మనోహర్ దాస్, ఎస్తేర్ మాట్లాడారు. -
గీతాంజలినే టార్గెట్ చేసి మరీ...?
-
చంద్రబాబుకు పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్: చింతా రాజశేఖర్
-
అదే కనుక జరిగితే జనసైనికులు పవన్ కళ్యాణ్ ని ఈడ్చి తన్నుతారు..
-
షర్మిల చదువుతున్నది ఎవరి స్క్రిప్ట్..టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతుంది ?
-
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్
టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్ టాక్. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో ఒక్క డైలాగ్‌తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. (చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు. -
పవన్ కళ్యాణ్ గంగిరెద్దు రెండు ఒక్కటే
-
ఓట్లు కావాలి కానీ..పార్టీ బలపడకూడదు..అందుకేనా..?
-
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
"పవర్" లేని పవర్ స్టార్...
-
గ్రామీణ రహదారులకూ మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే (హై ఇంపాక్ట్) మరో 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1,035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉండగా.. వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ షురూ! ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టినట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ బాలు నాయక్ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుందని.. నవంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గుర్తించిన హై ఇంపాక్ట్ కేటగిరీ రోడ్లకు ప్రభుత్వం ఆ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు కూడ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. -
ఎవరు ఈ రుక్మిణి కోట ?..పవన్ కళ్యాణ్ కి రుక్మిణి కోటకు ఉన్న సంబంధం అదే..
-
ఏఎన్‌యూలో కొత్త కోర్సులు ప్రారంభం
ఏఎన్‌యూ: విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులను వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సులలో ఫ్యాకల్టీ నియామకం, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డిగ్రీ ఫలితాలు విడుదల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో 61శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏసీఈ ఆర్.ప్రకాష్‌రావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్‌బోర్డ్‌పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
రాయలసీమ నేపథ్యంలో సినిమా..అక్టోబరు 6న విడుదల
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీ ప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్: రాజశేఖర్ సుద్మూన్, సంగీతం: జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: నరేష్ మాదినేని, లైన్ ప్రోడ్యూసర్: చందు కొత్తగుండ్ల. -
టీడీపీ భవిష్యత్తుపై చింతా రాజశేఖర్ విశ్లేషణ
-
చంద్రబాబు ఐటీ కేసు ఇష్యూపై చింతా రాజశేఖర్..!
-
బ్రో సినిమా పై చింతా రాజశేఖర్ కామెంట్స్
-
సీఐ సార్ చొరవ.. కేంద్రం మెచ్చిన చంద్రగిరి ఠాణా
నాడు: చుట్టూ ముళ్లపొదలు.. ఏ మూల చూసినా పాముల పుట్టలు.. దశాబ్దాలుగా గుట్టలుగా పడి శిథిలావస్థకు చేరుకున్న వాహనాలు.. అస్తవ్యస్త పార్కింగ్.. కళావిహీనంగా చెట్లు.. సరైన బోర్డు కూడా లేని పోలీస్ స్టేషన్...రంగులు వెలిసి పాత భవనాలను తలపించే దుర్గంధంతో సిబ్బంది ఇబ్బందిగా పనిచేసేవారు. అస్తవ్యస్తంగా ఉండేది తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్. నేడు : ఒక అధికారి బదిలీపై అక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం 20 రోజుల్లోనే స్టేషన్ రూపురేఖలు మార్చారు. భవనాలకు అందమైన రంగులు వేయించా డు. ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తీయించాడు. చెట్లను ట్రిమ్మింగ్ చేయించారు. వాహనాలను స్టేషన్ వెనుక పార్కింగ్ చే యించారు. స్టేషన్‌కు వచ్చేవారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చిన్నసైజు పార్క్‌ను తీర్చిదిద్దారు. స్టేషన్లో రికార్డు రూమును డిటలైజ్ చేసి అందమైన ర్యాక్‌లతో వాటిని ముస్తాబు చేశారు. సిబ్బందికి విశ్రాంతి గదినీ ఏర్పాటు చేశారు. తిరుపతి రూరల్: చంద్రగిరి పీఎస్‌లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ స్టేషన్ రూపురేఖలను మార్చేశారు. ఇది చూసి చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆయన్ను అభినందించారు. రాష్ట్ర డీజీపీ ద్వారా సమాచారం అందుకున్న ఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(బీపీఆర్డీ) బృందం ఇటీవల చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించింది. స్టేషన్ ప్రాంగణం, వివిధ సమస్యలపై వచ్చే అర్జీదారులకు అందిస్తున్న సేవలు, రికార్డుల మెయింటెనెన్స్ వంటి అంశాలను పరిశీలించింది. ఇతర స్టేషన్లతో పోల్చితే ఇక్కడ ఏర్పాట్లు, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ భేషుగ్గా ఉన్నాయని బీపీఆర్డీ బృందం పర్యవేక్షణాధికారి బాలచంద్రన్ చంద్రగిరి సీఐ రాజశేఖర్‌ను అభినందించారు. త్వరలో బీపీఆర్డీ జాతీయస్థాయిలో పోలీస్ స్టేషన్లకు ర్యాంకులు కేటాయించనున్నారు. అయితే అద్భుతంగా తీర్చిదిద్దిన చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు అత్యత్తుమ ర్యాంకు వచ్చే అవకాశం ఉందని తిరుపతి జిల్లా పోలీస్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనసు పెడితే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన సీఐ రాజశేఖర్‌ను పలువురు పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు. -
నిఖిల్‌ని చూసి గర్వపడుతున్నా
‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్‌ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి. గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్‌గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. -
పాస్వర్డ్ గుట్టు వీడలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (టీఎస్పీఎస్సీ) చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టులు మొదలై 90 రోజులు కావస్తుండటంతో నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ వేశారు. ఇందులో 37 మందిపై అభియోగాలు మోపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మిగిలిన వారిపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ చేతికి చిక్కిందెలా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న కంప్యూటర్ నుంచి మాస్టర్ ప్రశ్నపత్రాలను కమిషన్ మాజీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అట్ల రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవడం ద్వారా చేజిక్కించుకున్నట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ కంప్యూటర్లోకి చొరబడటానికి వాడిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ వారి చేతికి ఎలా చిక్కిందనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను తన పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. వాటిని ప్రవీణ్ నోట్ చేసుకొని రాజశేఖర్‌కు తెలిపాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆపై కంప్యూటర్ను నిందితులు హ్యాక్ చేశారనే ఆరోపణలు వచ్చినా దానికీ ఆధారాలు లభించలేదు. 50 మంది నిందితుల్లో చిక్కిన 49 మంది... బేగంబజార్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ అయింది. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీ పి.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని నిందితులుగా తేల్చి 49 మందిని అరెస్టు చేశామని సిట్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. 50 మందిలో 16 మంది పేపర్ల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లే. అక్రమంగా ఏఈఈ ప్రశ్నపత్రం పొంది పరీక్ష రాసిన వాళ్లు ఏడుగురు, ఏఈ ప్రశ్నపత్రం పొంది రాసిన వాళ్లు 13 మంది, డీఏఓ పేపర్ పొంది పరీక్ష రాసిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. అరెస్టు అయిన నిందితుల్లో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లతోపాటు షమీమ్, రమేష్ కుమార్‌లు కమిషన్ ఉద్యోగులు. వారిలో రాజశేఖర్ మినహా మిగిలిన ముగ్గురూ గ్రూప్–1 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేసిన సురేష్ సైతం గ్రూప్–1 పేపర్ పొంది పరీక్ష రాశాడు. ఇరిగేషన్ శాఖ మాజీ ఏఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి ప్రశ్నపత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు తేలింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్స్, ల్యాప్టాప్స్, హార్డ్డిసు్కలతోపాటు ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు లీకేజీ కేసులో అరెస్టు అయిన మాజీ ఏఈ పూల రమేష్ ఆరు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
జీవిత.. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నాతోనే ఉంటానంది: రాజశేఖర్
జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత.. వీరిద్దరినీ వేర్వేరుగా చూడలేం. అంతలా ముడిపడిపోయిన ఈ జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్లో ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీరి ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాలోలాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్టులున్నాయి. అసలు పరిచయమే ఒక వింత అనుభవంతో జరిగింది. రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జీవితతో ఓ సినిమా చేయాల్సింది. అయితే హీరోయిన్ బాలేదు, మార్చేయండి అని చెప్పాడట. కట్ చేస్తే నిర్మాతలు రాజశేఖర్ స్థానంలో మరో హీరోను పెట్టి సినిమా చేశారు. అలా విచిత్ర సంఘటనతో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారడంతో 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరి కూతుర్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ సినీరంగంలో ప్రవేశించి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ లవ్‌స్టోరీని వెల్లడించారు. ఒకసారి రాజశేఖర్ నా వద్దకు వచ్చి మీరు నాపై ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్ బాగా నచ్చిందని చెప్పింది జీవిత. అయితే రాజశేఖర్‌ను ఒప్పించేందుకు, ఆయనను పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టపడిందట. ఈ విషయం తెలిసిన రాఘవేంద్రరావు.. రాజశేఖర్ విలన్లా ఉన్నాడు, నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చాడని తెలిపాడు రాజశేఖర్. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అయినా సరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నలతో ఓకే చెప్పించింది అని తెలిపాడు. ఈ క్రమంలో జీవిత ఓ సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనలైంది. 'రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఫీలయ్యాను. ఆయనకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని చెప్తూ ఎమోషనలైంది. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది, ఆ ప్రేమే నచ్చిందన్నాడు రాజశేఖర్. -
‘టీఎస్పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ బి.శంకరలక్ష్మి కీలక సాక్షిగా మారారు. తొలుత అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యాల అదనపు కస్టడీతోపాటు తాజాగా అరెస్టు చేసిన షమీమ్, సురేశ్,రమేశ్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఐదు పరీక్షలకు సంబంధించిన 11 ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ అయిన శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే తస్కరించారు. ఈ వ్యవహరంలో ఆమె నిర్లక్ష్యం ఉందని అధికారులు ఇప్పటికే తేల్చడంతో చర్యలు కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆమెను ఈ కేసులో రెండో సాక్షిగా పరిగణిస్తున్నట్లు కోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసిన రిమాండ్ కేస్ డైరీలో ఈ విషయాలు పొందుపరిచింది. ఈ కేసులో వివరాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు అభియోగపత్రాలు దాఖలు చేయడానికి నిందితుల కస్టడీ అవసరమని పేర్కొంది. రాజశేఖర్ బంధువుకు నోటీసులు! న్యూజిలాండ్‌లో నివసిస్తూ గతేడాది గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన కమిషన్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు ప్రశాంత్‌ను ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అతనికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. అత డు విచారణకు రాకుంటే లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేయనున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కేసులో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మందిలో శుక్రవారం నాటికి 40 మంది విచారణ పూర్తయింది. ఏఈ పరీక్ష ప్రశ్న పత్రం విషయంలోనే క్రయవిక్రయాలు జరిగాయని, గ్రూప్– 1లో ఇలాంటివి జరిగినట్లు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. బండి సంజయ్ గైర్హాజరు... పరీక్ష పత్రాల లీకేజీ కేసుల్లో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందుకుతగ్గ ఆధారాలను శుక్రవారం తమ కార్యాలయానికి వచ్చి సమర్పించాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి సంజయ్ హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన గురువారం సిట్ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే. -
TSPSC Paper Leak: రాజశేఖర్ ఆర్థిక పరిస్థితిపై సిట్ ఆరా
జగిత్యాల క్రైం: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ఏ–2గా ఉన్న రాజశేఖర్ ఆర్థిక మూలాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. వాస్తవానికి ఈ కుటుంబం గతంలో ఆర్థికంగా అంత ఉన్నదేమీకాదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ తండ్రి ఉపాధి కోసం దుబాయ్, సౌదీ, మస్కట్, లిబియా లాంటి దేశాలకు వలస వెళ్లారు. అంతోఇంతో సంపాదించి ఆ సొమ్ముతో తన కుమారుడు, కుమార్తెను చదివించారు. తల్లి అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంది. చదువు పూర్తయ్యాక రాజశేఖర్ టీఎస్పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అయితే ‘ఉద్యోగంలో చేరిన కొద్దికాలంలోనే తాటిపల్లిలో ఆధునిక హంగులతో రూ.25 లక్షలు – రూ.30 లక్షల విలువైన భవనం నిర్మించాడు. తన ఇద్దరు స్నేహితులకు ఉద్యోగాలు ఇప్పించాడు. సోదరికి కరీంనగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారు న్యూజిలాండ్‌లో స్థిరపడగా..తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. వారికి గ్రామ శివారులో సుమారు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది..’అని గ్రామస్తులు చెబుతున్నారు. వీటన్నిటిపైనా సిట్ దృష్టి సారించినట్లు తెలిసింది. బంధువుల సాయంతో కాంట్రాక్టు ఉద్యోగం.. కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేసిన రాజశేఖర్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండి కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులో శిక్షణ పొందాడు. తర్వాత అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ మూడేళ్ల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. తిరిగి స్వదేశానికి వచ్చి లంబాడిపల్లికి చెందిన సుచరితను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఐదేళ్ల బాబు ఉన్నాడు. కాగా రాజశేఖర్‌కు కరీంనగర్‌లోని అతని సమీప బంధువులు 2017లో టీఎస్పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. తమ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని, నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నాడని తల్లిదండ్రులు గ్రామస్తులకు చెబుతూ వచ్చినట్లు సమాచారం. సన్నిహితులు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాజశేఖర్ తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్నేహితులకు 2018లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిసింది. ఒకరు విద్యాశాఖలో, మరొకరు వేరే శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం. కాగా రాజశేఖర్ మరికొందరికి కూడా ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పించాడని తెలుస్తోంది. -
ఆ విషయం ఇప్పటిదాకా అమ్మానాన్నలకు తెలియదు : శివానీ రాజశేఖర్
శివాని రాజశేఖర్.. సినీ జంట డాక్టర్ రాజశేఖర్, జీవితల తనయ. ఆ ఐడెంటిటీ కొంచెం ప్లస్ అయినా నటిగా నిలదొక్కుకోవడానికి మాత్రం అభినయాన్నే నమ్ముకుంది. చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అని చూసుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం ముఖ్యమని భావించింది. అనుసరిస్తోంది. స్టార్‌గా వెబ్ తెరను ఏలుతోంది. తండ్రి లాగే ఎమ్‌బీబీస్ పూర్తిచేసి యాక్టర్ అయిన డాక్టర్ శివాని.. చెల్లి శివాత్మిక కంటే కొంచెం లేట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రపంచం గురించి పూర్తి అవగాహన ఉండటంతో మొదట నిర్మాతగా మారి తెలుగులో ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘ కల్కి’ సినిమాలు నిర్మించింది. మోడల్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ ఫైనలిస్ట్‌గా నిలిచింది. తర్వాత ‘అద్భుతం’సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘టూ స్టేట్స్’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తన సినిమాలు అన్నీ ఓటీటీలోనే విడుదలయినప్పటికీ వెండితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్‌తో వినోదాన్ని పంచుతోంది. చిన్నప్పుడు బొంగరాలు కొట్టేసేదాన్ని. ఇంటికి తెచ్చి ఎవరికీ తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనందపడిపోయేదాన్ని. ఈ విషయం ఇప్పటిదాకా అమ్మనాన్నలకు తెలియదు. – శివాని రాజశేఖర్ -
నా కూతుళ్లు ఆ రంగంలోకి వెళ్తామంటే చాలా టెన్షన్ పడ్డాం : జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
నామినేషన్స్ నాకు నథింగ్: వాసంతి ఫైర్
సందు దొరికితే చాలు నామినేషన్ కోసం పాయింట్లు వెతుక్కుంటారు హౌస్మేట్స్. మామూలుగానే రేవంత్ మీద తెగ ఓట్లు గుద్దుతారు. అలాంటిది అతడు కెప్టెన్ అయినప్పుడు బిగ్‌బాస్ రూల్స్ పాటించకుండా రెండుసార్లు నిద్రపోయాడు. ఇంకే, దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్మేట్స్ ఇప్పుడు నామినేషన్స్‌లో ఒకటే ఓట్లు గుద్దుతున్నారు. మరోవైపు బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో రోహిత్, వాసంతి.. ఇద్దరిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ కావాలన్నారు. దీనికి వాసంతి ఒప్పుకోకపోగా రోహిత్ ఇంటిసభ్యులందరి కోసం సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని హౌస్మేట్స్ నామినేషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌కు భయపడుతున్నావ్ అంటూ వాసంతిని నామినేట్ చేయగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. నాకు నామినేషన్స్ నథింగ్, కానీ నా హెయిర్ నాకు లైఫ్ అని మండిపడింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ సూర్య, గీతూ మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు. చదవండి: ఏడు జన్మలుగా నీవే నా తల్లి అని సాయిబాబా అన్నారు: నటి యాంకర్‌కు సుదీప దిమ్మతిరిగిపోయే ఆన్సర్లు -
ఆ ఇద్దరికీ దక్కని సర్ప్రైజ్.. హౌస్‌మేట్స్‌కు గాయాలు
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం రేవంత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. హౌస్‌లో తను బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటానన్న రేవంత్ ఆ మాట నిలబెట్టుకునేట్లు కనిపించడం లేదు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తున్న సమయంలో ఇంటి నియమాలు ఎవరు పాటించకపోయినా బ్యాటరీ తగ్గుతుందని బిగ్‌బాస్ నొక్కి మరీ చెప్పాడు. అందరూ బిగ్‌బాస్ నియమాలు సరిగ్గా పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రేవంతే ఆదమరిచి నిద్రపోయి రెండుసార్లు బ్యాటరీ తగ్గేందుకు కారణమయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టాస్క్ చివర్లో రాజ్ మొత్తం బ్యాటరీని వాడుకోవడంతో మెరీనా-రోహిత్‌లకు తమ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ అందకుండా పోయినట్లు తెలుస్తోంది.. కాగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హౌస్‌మేట్స్‌కు గాయాలైనట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా బంతిని దక్కించుకునే క్రమంలో ఇంటిసభ్యులు గాయపడినట్లున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆది, వాసంతి, సూర్య, అర్జున్, రోహిత్, రేవంత్, సత్య, రాజ్ కెప్టెన్సీకోసం పోటీపడనున్నారట. మరి వీరిలో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: త్యాగానికి సిద్ధమైన రోహిత్, వాసంతి బతికిపోయిందిగా! సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచి..: నటి -
విద్యపై విషపు రాతలా?
సాక్షి, అమరావతి: ‘వెనుక‘బడి’నా గొప్పలే’ అంటూ ఈనాడు దినపత్రిక సోమవారం వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్ ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే.. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టుపై ఈనాడుకు అవగాహనలేదు.. జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 విధానాన్ని కేవలం కరిక్యులమ్ వరకు మాత్రమే అమలుచేయాలని చెప్పిందని.. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయాలని ఎక్కడా చెప్పలేదని, ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తలొగ్గి టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు విలీనం చేస్తున్నారంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే.. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టు మీద ఈనాడుకు అవగాహనలేదు. దానిపేరు సాల్ట్ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్). గత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లోని ప్రగతిని గమనించి ఆ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారమిచ్చి మరింత ముందుకుపోయేలా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లను అందిస్తోంది. గతంలో మాదిరిగా తాను ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేవలం సాధించే ఫలితాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త విధానాన్ని ప్రపంచబ్యాంకు చేపట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 139 మంజూరు చేయగా అందులో ఏపీ ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధిస్తున్న పురోగతిని గమనించి ప్రపంచబ్యాంకు ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందులో ఎలాంటి షరతుల్లేవు. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా రాలేదు. అయితే, ఈనాడులో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిచేసి విలీనం చేయిస్తోందని తప్పుడు వార్త రాసింది. ఎన్ఈపీలో విద్యార్థులకు అన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తెచ్చేలా వనరులన్నిటినీ వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా 5+3+3+4 విధానాన్ని అనుసరించాలని ఎన్ఈపీ 7.5 పేరాలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై అవగాహన లేకుండా ఈనాడు ప్రజలను తప్పుదోవపట్టించింది. చేరికల అంకెల్లోనూ అడ్డగోలు రాతలే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయని తప్పుడు అంకెలతో కథనం రాశారు. అసలు చేరికల లెక్కలకు సంబంధించి కేంద్రం ప్రామాణికంగా నిర్దేశించిన యూడైస్ ప్లస్ గణాంకాల ఇంకా ఖరారు కాలేదు. ఇష్టమొచ్చిన సంఖ్యలు రాశారు. ఈనెల 14, 15 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ దక్షిణాది రాష్ట్రాలతో వర్కుషాపును నిర్వహించాక ఈ గణాంకాలు ఖరారవుతాయి. ఈ ఏడాది లెక్కలు ఇంకా ఖరారుకానందున ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగానికి గత ఏడాది గణాంకాలను అందించాం. యూడైస్ ప్లస్ ఏడాదికి ఒక్కసారే అప్డేట్ అవుతుంది. కానీ, రాష్ట్రంలో చైల్డ్ ఇన్ఫో పేరుతో రోజువారీ అప్డేషన్తో గణాంకాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడినుంచో కొన్ని అంకెలను తీసుకుని ఈనాడు ప్రభుత్వంపై విషం చిమ్మింది. ఏ విద్యార్థీ బడిబయట ఉండరాదన్న ఉద్దేశంతో అమ్మఒడి సహ అనేక కార్యక్రమాలను ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. చరిత్రలో ఎవరూ పెట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టిపెట్టింది. ప్రతి పిల్లాడినీ బడిలో చేర్చేలా కసరత్తు చేశాం. రాష్ట్రం ఏర్పాటయ్యాక గణాంకాలు పరిశీలిస్తే.. 2014–15లో 72,32,771 చేరికలు కాగా 2015–16కు 69,07,004కు తగ్గింది. 2016–17లో 68,48,197, 2017–18లో 69,75,526, 2018–19లో 70,43,071లుగా చేరికలు ఉన్నాయి. ఇక 2019–20లో ఆ సంఖ్య 72,43,269లకు 2020–21లో 73,12,852కు పెరిగింది. 2021–22లో 72,45,640కు చేరింది. ఇక 2022–23లో సెప్టెంబర్ 30 వరకు 71,59,441లుగా చేరికలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 86,199 తగ్గింది. ఈ తగ్గడం ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మైగ్రేషన్‌వల్ల 16,857, సీజనల్ మైగ్రేషన్‌వల్ల 38,951, మరణాలవల్ల 1,289 మంది చేరికలు తగ్గాయి. ఇక జనాభా తగ్గుదలవల్ల దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరికలు తగ్గాయి. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 29,102 మంది తగ్గారు. సీజనల్ మైగ్రేషన్ అయిన వారిని తిరిగి స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 12వేల మంది చేరారు. చేరికలు ఐదు లక్షలకు పైగా పెరిగాయి ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు చూస్తే.. వాటిపై శ్రద్ధ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి మధ్యనున్న తేడా తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో 2014–15లో 41,83,441 మంది పిల్లలుండగా 2015–16లో 39,24,078కు, 2016–17లో 37,57,000లకు, 2017–18లో 37,29,000లకు, 2018–19లో 37,20,988లకు చేరింది. అదే 2019–20లో 38,18,348లకు పెరగ్గా 2020–21లో 43,42,874లకు చేరింది. అంటే ఏకంగా 5 లక్షల మేర చేరికలు అదనంగా పెరిగాయి. 21–22లో 44,29,569లు కాగా 2022–23లో అది 40,31,239లుగా ఉంది. కరోనావల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి చేరికలు పెరిగాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఈ చేరికల్లో ఏపీ 14 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. అసర్ నివేదిక కూడా ఇదే చెబుతోంది. జనాబా తగ్గుదలవల్ల కూడా చేరికలు తగ్గుతున్నట్లు ఎన్సీఈఆర్టీ నివేదిక చెబుతోంది. 2025 నాటికి 14 శాతం మేర తగ్గుతుందని నివేదించింది. ఇక 2019–20లో ప్రభుత్వ స్కూళ్లలో 38,18,348 మంది పిల్లలుండగా ప్రైవేటులో 32,28,681 మంది ఉన్నారు. అదే ప్రస్తుత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 40,31,239 మంది పిల్లలున్నారు. అంటే రెండు లక్షల మంది అదనంగా పెరిగారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 2019–20తో పోలిస్తే 2,12,407 చేరికలు తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గాయని ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. కరోనా పరిస్థితులు తగ్గి ఆర్థిక స్థితి కొంత పెరిగి తిరిగి ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని అనుకున్నా అందరూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లడంలేదని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు పథకాలు, ఇతర కార్యక్రమాలవల్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఐఏఎస్ అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారంటే రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టమవుతోంది. ఇక బెండపూడి స్కూలులో ప్రసాద్ అనే టీచర్ చేసిన ప్రయత్నంవల్ల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్రంలోని ఇతర స్కూళ్లలోనూ అమలుచేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇంత మంచిగా కార్యక్రమాలు జరుగుతూ విద్యారంగం అభివృద్ధి సాధిస్తుంటే వెనుకబడిపోయిందని ఈనాడు తప్పుడు రాతలు రాయడం సరికాదు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక ఈనాడుకు నేరపూరిత ఉద్దేశాలున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమనా ఈనాడు ఉద్దేశ్యం? ఆంగ్ల మాధ్యమంలో ఒక్క వాక్యాన్నీ చదవలేకపోతున్నారని రాశారు. కానీ, అది అవాస్తవం. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో తెలుగు మీడియంలో 1,08,543 మంది హాజరైతే 43.97 పాసయ్యారు. ఇంగ్లీషు మీడియంలో 4,22,743 మంది రాస్తే 77.55 శాతం పాసయ్యారు. ఈ పరీక్షలను ఎలాంటి వాతావరణంలో నిర్వహించామో అందరికీ తెలుసు. మాస్‌కాపీయింగ్ చేసిన వారిని, దానికి సహకరించిన టీచర్లను కూడా సస్పెండ్ చేశాం. ఇంత పకడ్బందీ నిర్వహణలోనూ ఇంగ్లీషు మీడియం పిల్లలు పాస్ అత్యధికంగా ఉంది. ఏదీ రాయడం, చదవడం రాకుండానే ఇంతమంది పాసవుతారా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మిస్లీడ్ చేయడం వెనుక ఈనాడు ఉద్దేశమేమిటి? ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అయ్యాయంటూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమని పిల్లలకు చెబుతున్నారా? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. -
వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పేరే సాల్ట్
-
మాన్స్టర్గా వస్తున్న రాజశేఖర్ (ఫొటోలు)
-
సంస్కరణలతో పటిష్ట పునాది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా విద్యార్థులే కేంద్రంగా విద్యా విధానాలను అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని సంస్కరణలను ఈ మూడేళ్లలోనే తీసుకొచ్చామన్నారు. మౌలిక వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాది వేసేందుకే తరగతుల విలీనాన్ని చేపట్టామన్నారు. పాఠశాలల మ్యాపింగ్ మాత్రమే జరుగుతోందని, ఏ ఒక్క స్కూల్ మూతపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని పలుసార్లు స్పష్టం చేసినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక దురుద్దేశంతో తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసేలా అసత్య కథనాలు ప్రచురిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న లోపాలకు సరైన చికిత్స చేస్తుంటే దుష్ప్రచారం సరికాదని హితవు పలికారు. సదుపాయాలు కల్పించాకే.. 2021–22లో 2,943 ప్రాథమిక పాఠశాలల తరగతులను 250 మీటర్ల దూరం లోపు ఉన్న 2,800 ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. 2022–23లో 620 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలను కిలోమీటరు దూరంలోపు ఉన్న 4,954 ప్రీ హైస్కూళ్లు మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. 5,870 పాఠశాలల్లో తరగతులను విలీనం చేస్తే కేవలం 820 స్కూళ్లకు సంబంధించి సమస్యలున్నట్లు శాసన సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై అధ్యయనానికి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించి నివేదిక అందిస్తుందన్నారు. విలీన ప్రక్రియ సాధ్యంకాని పక్షంలో ఆ పాఠశాలలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్య ఉంటే పరిష్కరించిన తర్వాతే తరగతుల విలీనానికి ముందుకెళ్తామన్నారు. 8,232 మంది ఎస్జీటీలకు పదోన్నతి.. కొత్త విద్యావిధానం అమలుతో ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టూ రద్దు కాదని స్పష్టం చేశారు. పైగా 8,232 మంది ఎస్జీటీలకు మేలు చేసేలా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామన్నారు. అదనంగా పెద్ద సంఖ్యలో హెచ్ఎం పోస్టులకు షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక హెచ్ఎం, పీఈటీతో పాటు కచ్చితంగా 9మంది సబ్జెక్టు టీచర్లు ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వారానికి 36 పీరియడ్లు మించకుండా, వారిపై తరగతుల విలీన ప్రక్రియ భారం పడకుండా చూస్తామన్నారు. నాడు –నేడు ద్వారా ఇప్పటికే 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 32 వేల అదనపు తరగతులను నిర్మించనున్నట్టు చెప్పారు. మాకు విద్యార్థులే ముఖ్యం చరిత్రలో తొలిసారిగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. కోవిడ్‌తో రెండేళ్లు పాఠశాలలు సరిగా తెరుచుకోకపోవడంతో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పడిపోయిందన్నారు. ఇదే విషయాన్ని అసర్, న్యాస్ రిపోర్టులు సైతం చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాలలను గ్రూపింగ్ చేసి 2025 నాటికి సమస్యను అధిగమించాలని సూచిస్తోందన్నారు. గుజరాత్‌తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో పయనించేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో సైతం ఈ తరహా విద్యా విధానం అమలవుతోందన్నారు. -
ఇంట్రెస్టింగ్గా రాజ'శేఖర్' ట్రైలర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్' .ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స ఆకటుకుంటున్నాయి. మే20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. మర్డర్ మిస్టరీని తన స్టైల్లో విచారణ జరపడం వంటివి ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్గా నటించింది. Very happy to launch the #ShekarTrailer My best wishes to@ActorRajasekhar garu on this new look film. Seems like an interesting #ShekarOnMay20 in Theaters. Kudos & luck to #JeevithaRajashekar garu, @Rshivani_1, @ShivathmikaR & team #Shekarhttps://t.co/m0Z304OyAT pic.twitter.com/1LrfXq94GX — Adivi Sesh (@AdiviSesh) May 5, 2022 -
చనిపోతా.. రేపో, ఎల్లుండో చితికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ ఎమోషనల్
గత మూడున్నర దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించాడు కానీ.. ఒకప్పుడు రాజశేఖర్ సినిమా అంటే.. మినిమమ్ గ్యారెంటీ ఉండేది. అంతేకాదు 90ల్లో స్టార్ హీరోగా వెలుగొందాడు. అప్పట్లో రాజశేఖర్ ఖాతాలో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ యాంగ్రీ స్టార్ ‘శేఖర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్నా రాజశేఖర్.. తన జీవితంలో అనుభవించిన అత్యంత గడ్డు కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. గతేడాది కరోనా బారిన రాజశేఖర్.. నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కరోనా సోకినప్పుడు నాకు చాలా సీరియస్ అయింది. ఇక నేను చనిపోతాననుకున్నా. రేపో ఎల్లుండో నా చితికి మంట పెడతారనే ఆలోచనలు వచ్చాయి. జీవిత, పిల్లలకు ధైర్యంగా ఉండాలని చెప్పా. ప్రేక్షకుల ప్రార్థనల వల్లే బతికాను. ఇంటికి వచ్చిన తర్వాత నా కాళ్లు, చేతులు పనిచేయలేదు. ఇక నేను నటించలేనేమో అనే భయం కలిగింది. నాపై నాకే నమ్మకం లేకపోవడంతో..‘శేఖర్’చిత్రాన్ని వేరేవాళ్లతో చేయమని చెప్పా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే అవన్నీ గుర్తొస్తాయి’ అంటూ జీవిత,రాజశేఖర్ దంపతులుఎమోషనల్ అయ్యారు. ఇక సినిమాల్లోకి ఎలా వచ్చారో చెబుతూ... ‘నాకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలని కోరిక ఉండేది. కానీ నాకు నత్తి ఉంది. ఒకవేళ నాకు సినిమా చాన్స్ వచ్చినా.. నత్తి ఉందని తీసేస్తారేమోననే భయం ఉండేది. అసలు నాకు నటన వచ్చో..రాదో తెలుసుకోవడానికి యాక్టింగ్ స్కూల్లో చేరా. అప్పడు నమ్మకం కలిగి.. నటించడం మొదలుపెట్టా’అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. -
తొలి ప్రేమే పుట్టిందంటున్న రాజశేఖర్!
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ‘శేఖర్’ చిత్రంలోని ‘ప్రేమ గంటే మోగిందంట’ పాటను విడుదల చేశారు. ‘‘బొట్టు పెట్టి.. కాటుక ఎట్టి వచ్చిందమ్మా సిన్నది... బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది..’’ అంటూ మొదలైన ఈ పాట ‘డండ డండ డండ లవ్గంట మోగిందంట... తొలి ప్రేమే పుట్టిందంట’ అంటూ సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ పాడారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరకర్త. ‘‘ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జీవితా రాజశేఖర్. -
ఆ సమయంలో శివానీ బాగా ఏడ్చేసింది.. ఎప్పుడూ మర్చిపోను : రాజ శేఖర్
‘నాకు కరోనా సోకినప్పుడు భయపడలేదు. కానీ నా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’మూవీ టీమ్ నుంచే శివానికి కోవిడ్ సోకింది. ఆమె నుంచి నాకు వచ్చింది. ఆ సమయంలో శివాని చాలా బాధపడింది. నా వల్లే డానీకి కరోనా సోకిందని ఏడ్చేసింది. ఆ జీవితాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను’అన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ వండర్ ఫుల్ టెక్నీషియన్. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్‌లా తిరిగాం. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్‌గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్‌ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్‌లకు వచ్చేవారు. రాజశేఖర్ అవుట్ డోర్‌కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు. శివానీ కూడా కష్టపడి చేసింది. గుహన్ గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్‌గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు. -
కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) విద్య వరకు సమగ్ర విద్యా విధానం అమలు కావలసిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో భాగంగా ఒకే ప్రాంగణం లేదా 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లో గల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలన్నారు. తద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విషయ నిపుణుల చేత బోధన నిర్వహించాలని సూచించారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం గణాంక ఆధార వ్యవస్థ అవసరమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ గణాంకాల మీద లోతైన అవగాహన పెంచుకోవాలని డీఈవోలకు, ఏపీసీలకు సూచించారు. యూడైస్ ప్లస్ (ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ)లో వివరాలు నమోదు చేయడంలో అలసత్వం చూపొద్దని విద్యాధికారులకు రాజశేఖర్ స్పష్టం చేశారు. దాని ప్రభావం జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రగతి సూచీలపై పడుతుందని తెలిపారు. యూడైస్ ప్లస్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉంటే ఉచిత విద్యతోపాటు ఇతర బాధ్యతలపై ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి, జగనన్న గోరుముద్ద పథకం డైరెక్టర్ దివాన్ మైదీన్, ఆర్‌ఎంఎస్‌ఏ డైరెక్టర్ పి.పార్వతి, పౌర గ్రంథాలయాల సంచాలకులు డా.ప్రసన్నకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్!
కరోనా కారణంగా ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను తెరకెక్కించి డైరెక్ట్ స్ట్రీమింగ్ ఇస్తుంటే మరికొన్ని సంస్థలు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సినిమాలను ఫ్యాన్సీ రేటుకు కొనేసుకుంటున్నాయి. దీంతో థియేటర్ లో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ స్ట్రీమింగ్ కు భారీ ధరలను కూడా ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అందుకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి. చదవండి: పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్, మామూలుగా లేదుగా.. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. ఓటీటీలు మాత్రం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసి కొన్ని సినిమాలను ఎలాగైనా డైరెక్ట్ ఓటీటీ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా బజ్ క్రియేట్ చేసిన యాంగ్రీమెన్ రాజశేఖర్ ‘శేఖర్’ సినిమాపై ఇప్పుడు ఓటీటీల చూపు పడింది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఓటీటీలు శేఖర్ సినిమాకు 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ రెట్లను ఆఫర్ చేస్తున్నాయట. ఈ సినిమా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి 20 కోట్లకు పైగానే పలుకుతుండటం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. పెద్దగా మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోల సినిమాకి ఓటీటీలు ఈ రేంజ్లో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. చదవండి: రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే దీనికి కారణం ఇప్పటికే విడుదలైన శేఖర్ గ్లింప్స్ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమా జానర్ కూడా మరో కారణం కాగా.. ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్‌కు రీమేక్ కావడంతో ఓటీటీలు ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకునేందుకు భారీ స్థాయి ఆఫర్లు ఇస్తున్నారట. శేఖర్ రీమేక్ మూవీ అయినప్పటికీ మెయిన్ సోల్ మిస్ కాకుండా కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేయడంతో పాటు తెలుగు ఆడియన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ రీమేక్‌కి జీవిత రాజశేఖర్ డైరెక్టర్ కాగా స్క్రీన్‌ప్లే కూడా ఆమెనే చూసుకుంటుంది. మరి ఓటీటీకి ఇచ్చేస్తారా లేక థియేటర్లలో వదులుతారో చూడాలి. -
మా కుమార్తెలు మేం గర్వపడేలా చేశారు: రాజశేఖర్, జీవిత
‘‘శివానీ హీరోయిన్గా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. నేనే నిర్మాతగా శివానీతో ఓ సినిమా చేయాలనుకున్నాను. వీలుపడలేదు. కానీ ఇప్పుడు ‘అద్భుతం’ లాంటి మంచి సినిమాతో శివానీ హీరోయిన్గా పరిచయం అయింది. శివానీ నటనను మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక మేం గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. తేజా సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘అద్భుతం’. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ను కొనలేం. కష్టపడి సాధించుకోవాలి. ‘అద్భుతం’లాంటి సినిమాతో శివానీకి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘నేను హీరోయిన్గా అంగీకరించిన సినిమాలు ఏదో కారణం చేత ఆగిపోతూనే ఉన్నాయి. ‘అద్భుతం’ సినిమాతో నా కల నిజమైంది. నా తొలి సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు శివానీ. ఈ కార్యక్రమంలో శివాత్మిక, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, లక్ష్మీభూపాల్, సృజన్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం
Hero Rajasekhar Father Is No More: టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్నై డీఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ రెండో సంతానమే హీరో రాజశేఖర్. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. Varadarajan Gopal (93) Garu (father of actor @ActorRajasekhar) is no more. Condolences to the family members. RIP @ShivathmikaR @Rshivani_1 pic.twitter.com/uep5nRrpp7 — BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021 -
గోపీచంద్ మూవీ కోసం హీరో రాజశేఖర్‌కి భారీ రెమ్యునరేషన్!
తనదైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయనకు పెద్దగా మార్కెట్ లేదు కానీ 20 ఏళ్ల క్రితం ఆయన వరుస విజయాలతో చాలా రికార్డులు సృష్టించాడు. ఒకప్పుడు తెలుగులో భారీ పారితోషికం అందుకున్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఉన్నాడు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. చిరంజీవి లాంటి హీరోలతో కూడా రాజశేఖర్ పోటీ పడిన సందర్భాలున్నాయి. అయితే ఆ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ యాంగ్రీ హీరో కాస్త డీలా పడ్డాడు. ఆ తర్వాత ‘గరుడ వేగ’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అనంతరం ‘కల్కి’తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ హీరో.. ఇటీవలే ‘శేఖర్’ అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రాజ శేఖర్ భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. రాజశేఖర్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. రాజశేఖర్ కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెబుతూ కొన్ని కండీషన్స్ పెట్టాడట. ఈ మూవీకి రూ. 4 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని, అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండేలా చూడాలని షరతులు విధించాడట. దీనికి నిర్మాతలు కూడా అంగీకారం తెలిపారట. -
‘సహకార’ వ్యూహం ఫలించేనా?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు, నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పర్చింది. భారత్‌లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక పాలనా, న్యాయశాసన, విధానపరమైన చట్రాన్ని ఈ కొత్త శాఖ అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక రోజు తర్వాత ఈ నూతన మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. విడివిడిగానే అయినప్పటికీ కలిసే వచ్చిన ఈ రెండు ప్రకటనలపై పరిశీలకులు అంచనాలు మొదలెట్టేశారు. వాస్తవానికి కో-ఆపరేటివ్‌లు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. దేశం లోని ప్రతి రాష్ట్రం కో-ఆపరేటివ్‌లకు రిజిస్ట్రార్‌ని నియమిస్తుంది. ఈ రంగాన్ని మొత్తంగా ఆ రిజిస్ట్రారే పర్యవేక్షిస్తుంటారు. పైగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇంత పటిష్ట నిర్మాణం ఉంటూండగా, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఎందుకు సృష్టించినట్లు? పైగా ఈ శాఖను అమిత్ షా చేతిలో పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. అయితే ఏం జరుగుతోందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇతర రంగాలకు మల్లే సహకార సంస్థలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. అవి సామాన్యంగా పతాక శీర్షికలకు ఎక్కవు. కానీ గ్రామీణ భారత్‌ని, క్రమబద్ధీకరణ లేని ఆర్థిక వ్యవస్థను బలపర్చే ఆర్థికపరమైన చట్రంలో ఇవి భాగం. ఉత్పత్తి (చక్కెర), పరపతి (పట్టణ, గ్రామీణ కో-ఆపరేటివ్‌లు, సహకార బ్యాంకులు), మార్కెటింగ్ (పాల కో-ఆపరేటివ్‌లు) వంటి వాటిలో వీటి ఉనికిని మనం చూడవచ్చు. పాత వైపరీత్యం దిద్దుబాటే లక్ష్యమా? చాలాకాలంగా కొనసాగుతున్న ఒక నియమ విరుద్ధమైన వైపరీత్యాన్ని చక్కదిద్దడానికే కేంద్రం ఈ పనికి పూనుకుందని భావిస్తున్నారు. కో–ఆపరేటివ్‌లు నిజానికి రాష్ట్ర పరిధిలోనివే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై ఒక కన్నేసి ఉంచుతూ వస్తోంది. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలో సహకార సంస్థల పర్యవేక్షణ విభాగం ఉంటోంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నప్పటికీ, కో–ఆపరేటివ్‌ల అవసరాల పట్ల ఈ శాఖ పెద్దగా స్పందించదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. కాలానుగుణంగా కోఆపరేటివ్లు మారుతూవచ్చాయి. కొత్తగా సహకార రంగంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉండటం లేదు. ఇప్పుడవి గృహనిర్మాణం, కార్మిక రంగాలలో ప్రవేశిస్తున్నాయి. ఈ కారణాలవల్ల సహకార సంస్థలను కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావడం ఏమంత అర్థవంతమైన చర్య కాదు అని ఆ అధికారి చెప్పారు. అయితే మోదీ నిర్ణయం ప్రకారం అమిత్ షా ఈ కొత్త శాఖకు బాధ్యతలు తీసుకున్నారు. కో-ఆపరేటివ్‌లు అభివృద్ధికి ఉపకరణాలుగా ఉపయోగపడేవి కాబట్టి రాజకీయ లక్ష్యాలు తెరమీదికి వస్తుండేవి. సహకార సంస్థలు... రాజకీయాల ప్రాబల్యం నరేంద్రమోదీని అధికారంలోకి తీసుకొచ్చిన గుజరాత్ నమూనాకు సంబంధించిన కీలకమైన అంశాల్లో కో-ఆపరేటివ్‌లపై బీజేపీ నియంత్రణ ఒకటనే విషయం ఎవరికీ పెద్దగా తెలీదు. 1990లలో బీజేపీ... గుజరాత్లో రుణపరపతి సహకార సంస్థలపై నియంత్రణను ఏర్పర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అమూల్ జిల్లా పాల యూనియన్లపై పట్టు సాధించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్, స్థానిక అధికార వ్యవస్థలను బలహీనపర్చి వాటిని తొలగించడమే దీని ఉద్దేశం. దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకునే వారెవరైనా సరే... ప్రజలను, సంస్థలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. గుజరాత్లో పాల సహకార వ్యవస్థ చాలా పెద్దది. గుజరాత్‌లోని 17 వేల గ్రామాల్లో 16,500 గ్రామాలు డెయిరీల పరిధిలో ఉంటున్నాయి. అందుకే 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యాక సహకార సంస్థలను కైవసం చేసుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. కో-ఆపరేటివ్‌ల యాజమాన్యాలపై కేసులు పెట్టి వారు బీజేపీలో చేరకతప్పని పరిస్థితి కల్పించారు. 2017 నాటికి కో-ఆపరేటివ్‌లను పూర్తిగా కైవసం చేసుకోవడం పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రతిపక్షాల చేతుల్లో ఒక్క కోఆపరేటివ్ సంస్థ కూడా లేకుండా పోయింది. మొత్తం మీద చూస్తే రాజకీయ లాభం కోసం కో-ఆపరేటివ్‌లను ఉపయోగించుకోవడం గుజరాత్లో స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయనేతలు అతిగా ఖర్చుపెట్టడం, పలు కాంట్రాక్టుల ద్వారా దాన్ని తిరిగి సంపాదించుకోవడం మొదలుకావడంతో డెయిరీ ఆర్థికవ్యవస్థలు క్షీణించిపోయాయి. సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖపై మరో రెండు కొత్త ఊహలు కూడా చోటుచేసుకుంటున్నాయి. యూపీలో గ్రామీణ అసంతృప్తిని చల్లార్చడం ఎలా? ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రైతులను శాంతపర్చడానికి కేంద్రం చేస్తున్న తీవ్రప్రయత్నాల్లో భాగమే సహకార శాఖకు కొత్త మంత్రిని తీసుకురావడం అని ఒక ఊహ. పశ్చిమ యూపీలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెద్దనోట్ల రద్దు వంటి భారీ పథకాన్ని ప్రకటించడానికి బీజేపీ ఏదోలా జోక్యం చేసుకోవడం తప్పేటట్టు లేదు. ప్రైవేట్ కంపెనీలే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనేస్తాయనే భయాందోళనలనుంచి రైతులను బయటపడేయడానికి పెద్ద ఎత్తున సహకార సంస్థలను రంగంలోకి దింపాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. యూపీ ఎన్నికలకు ముందుగా భారీ పథకం ప్రకటించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుండా చేయవచ్చని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరొక ఊహాకల్పన ఏమిటంటే గుజరాత్లో మోదీ, షా ట్రాక్ రికార్డుపై ఎక్కువగా ఆధారపడుతూ దేశం మొత్తాన్ని గుజరాత్‌గా మలచాలని లక్ష్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు భావిస్తున్నారు. మూడో ఊహ ఏమిటంటే, శరద్ పవార్ ఎన్సీపీ వంటి పార్టీలు మహారాష్ట్ర షుగర్ కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధించడం ద్వారానే రాష్ట్ర రాజ కీయాల్లో తమ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. ఈ కో-ఆపరేటివ్‌లపై బీజేపీ పట్టు సాధించగలిగితే మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయని మునుపటి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడొకరు చెబుతున్నారు. అయితే ఇది మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాబోదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కోఆపరేటివ్ సంస్థలు బలంగా ఉంటున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, గ్రామీణులపై బీజేపీ, ఎన్డీఏ పట్టు సడలిపోయిన సమయంలో కో-ఆపరేటివ్‌లు వారికి ఒక దారి చూపుతున్నట్లుంది. ఇప్పటికే రైతుల ఆందోళనలు వ్యవసాయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ పలుకుబడిని బలహీనపర్చాయి. తిరిగి మండీల బాట పట్టడానికి బదులుగా కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధిస్తే ఆ వ్యవస్థ మొత్తాన్నే కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు మాత్రమే కాకుండా ఇతర ఎన్నికలకు కూడా కో-ఆపరేటివ్‌లు ఎక్కువ నిధులను అందించే అవకాశం మెండుగా ఉంది అని గుజరాత్ పరిశీలకులు ఒకరు చెప్పారు. కో-ఆపరేటివ్ సొసైటీల కేంద్ర రిజిస్ట్రార్‌ను మంత్రిత్వ శాఖ గుప్పిట్లో పెట్టుకుంటే రాష్ట్రాల కో-ఆపరేటివ్ సొసైటీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు. అయితే కేంద్రం కో-ఆపరేటివ్ సంస్థలను ఎలా అదుపుచేస్తుంది అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే మరి. వచ్చే ఆరు నెలల్లోనే సహకార సంస్థలపై సంచలన చట్టం రూపకల్పనను మనం చూడవచ్చు. దేశం సాధించిన అద్భుత విజ యాల్లో సహకార సంస్థలు కూడా ఒకటి. కానీ రాజకీయ హైజాకింగ్ వల్ల ఇవికూడా స్వయంపాలనను కోల్పోయి తలకిందులవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో రాజకీయ నాయకులు మాత్రమే లాభపడి, దేశ ప్రజలు నష్టపోయే రోజులు రాబోతున్నాయన్నదే అందరి ఆందోళన. దీంతో కో-ఆపరేటివ్‌లను అంతర్జాతీయంగా పోటీపడేలా రూపుదిద్దడం అనే సవాలు కూడా ప్రశ్నార్థకం కానుంది. ఎమ్. రాజశేఖర్ వ్యాసకర్త స్వతంత్ర పాత్రికేయుడు (‘ది వైర్’ సౌజన్యంతో..) -
సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత బలి
సాక్షి, యశవంతపుర: కరోనా వైరస్ కన్నడ చిత్ర రంగాన్ని కుదిపేస్తోంది. ఇటీవల నిర్మాత రాము మృతి చెందగా శుక్రవారం మరో నిర్మాత రాజశేఖర్ వైరస్‌కు బలయ్యారు. నీనాసం సతీష్ నటిస్తున్న 'పెట్రోమ్యాక్స్' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్న రాజశేఖర్ సినిమా విడుదలకు ముందే కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు నటులు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత -
‘ఫస్ట్ టైమ్’ అంటున్న అఖిల్.. నో టెన్షన్ అన్న అనిల్
ప్రతి ఉగాదికి నూతన చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగ్ అప్డేట్స్తో తెలుగు పరిశ్రమ కళకళలాడుతుంటుంది. ఈ ఏడాది ఉగాది కూడా సంతోషాన్ని తీసుకువచ్చింది. కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, నిర్మాణంలో ఉన్న చిత్రాల విశేషాలు, భవిష్యత్తులోపట్టాలెక్కే చిత్రాల కబుర్లతో పండగ జోష్ కనిపించింది. పండగ పూట.. కొత్త పాట హైదరాబాద్‌లో కొత్త పాట మొదలుపెట్టారు మహేశ్‌బాబు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న ‘సర్కారువారిపాట’ సినిమా సెకండ్ షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది. నో టెన్షన్.. ఓన్లీ ఫన్ ‘ఎఫ్ 3’ సినిమా సెట్లో మళ్ళీ ఫన్ మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం మొదలైంది. ‘‘ఎఫ్ 3’ సెట్స్‌లో ఫన్ మళ్లీ మొదలైంది. ఈ ఏడాది అంతా సంతోషం, హంగామాలతో నిండిపోవాలి. ఆందోళనలకు, బాధలకు చోటు ఉండకూడదు’’ అని పేర్కొన్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేయాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం హైదారాబాద్‌లో ఆరంభమైంది. శరత్ మండవ ఈ చిత్రానికి తొలి సన్నివేశానికి నిర్మాత రవిశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రవితేజ క్లాప్ ఇచ్చారు, ఈ చిత్రనిర్మాత సుధాకర్ చెరుకూరి స్క్రిప్ట్‌ను శరత్‌కు అందించారు. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ‘బిగ్‌బాస్’ ఫేమ్ అఖిల్ సార్ధక్ హీరోగా ఐ.హేమంత్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైమ్’. అనిక విక్రమన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఆరంభమైంది. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్.ఎల్.ఎ రఘునందన్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యానారయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ అడ్వంచర్ మూవీని ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. నూతన నటీనటులతో నిర్మాతలు ఐ. సతీష్‌కుమార్, కల్యాణ్ సుంకరలు ఓ సినిమాను ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ క్లాప్ ఇచ్చారు. రాజ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించి అదే నెలలో చిత్రీకరణ పూర్తి చేస్తామని, చిత్రబృందం తెలిపింది. ఆర్జీవీ దెయ్యం హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రామ్‌గోపాల్‌వర్మ (ఆర్జీవీ) సినిమాలంటే ఆడియన్స్‌లో ఓ స్పెషల్ ఎటెన్షన్ ఉంటుంది. ఆర్జీవీ డైరెక్షన్ లో వస్తున్న హారర్ సినిమాల సిరీస్‌లో రూపొందిన మరో చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. రాజశేఖర్, స్వాతీ దీక్షిత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. జీవితా రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాతలు. ‘‘రాజశేఖర్, నేను ఎవరికి వాళ్లం బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఇందులో రాజశేఖర్ కూతురిగా దీక్ష నటించారు’’ అని విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ అన్నారు. -
డాక్టర్ అంబేడ్కర్... జాతినిర్మాణ రూపశిల్పి
స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతిని అంగీకరించేలా చేశారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా నిలబడి, భారతీయ సామాజిక అణచివేత చట్రాన్ని సవాలు చేసిన మహనీయ మూర్తులలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒకరు. స్వాతంత్య్రానంతరం తొలి చరిత్రకారులు అంబేడ్కర్‌ను విస్మరించినప్పటికీ, నేడు మనం నివసిస్తున్న భారత దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేడ్కర్ ముద్రను, ఆయన పాత్రను గుర్తించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం అంటే దేశ స్వాతంత్య్రమేనని అర్థం చేసుకున్న అంబేడ్కర్ స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం అనే సమస్యపై చర్చ జరగడానికి ప్రయత్నించారు. ఒకసారి బ్రిటిష్ వారు దేశంనుంచి వెళ్లిపోయాక, ప్రజలు దోపిడీ, పీడన లేకుండా స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తారా అన్నదే ఆయన ప్రశ్న. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత రాజకీయ, సామాజిక రంగంపై అంబేడ్కర్ జోక్యం చేసుకున్న తీరు బలమైన ముద్ర వేయడమే కాకుండా, రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజ కీయ సమానత్వం పట్ల విస్తృతమైన ఆమోదానికి వీలు కల్పిం చింది. పైగా పీడకస్వభావంతో ఉంటున్న సామాజిక చట్రం, దాని ఆచారాల కింద నలిగిపోయిన వారిని ఉద్ధరించే రీతిలో రాజ్యాం గాన్ని రూపొం దించడానికి అంబేడ్కర్ బాటలేశారు. స్వాతంత్య్రం తీసుకురావడంతో గాంధీ పాత్ర ముగిసిపోగా, జాతి మొత్తంలో సామాజిక, రాజకీయ సమానత్వా న్ని తీసుకురావడం కోసం అంబేడ్కర్ పాత్ర ప్రారంభమైంది. రాజకీయరంగంలో అంబేడ్కర్ తొలి జోక్యం ఒక మనిషికి ఒక ఓటుతో మొదలైంది. బ్రిటిష్ కాలంలో సార్వత్రిక వయోజన ఓటు ఉండేది కాదు. పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే ఓటు వేసేవారు. అంబేడ్కర్ సార్వత్రిక ఓటు హక్కుకై పోరాడారు. మహిళల ఓటుహక్కు ఉద్యమం దీర్ఘకాలం పోరాడిన తర్వాత బ్రిటన్ మహిళలు 1928లో ఓటు హక్కు పొందగలిగారు. అమెరికాలో సైతం మహిళలు 1920లో మాత్రమే ఓటు హక్కు పొందగలిగారు. 1930లో ఆ తర్వాత కూడా రౌండ్ టేబుల్ సదస్సులో ఈ డిమాండును లేవనెత్తడానికి అంబేడ్కర్ తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికనూ ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఒక అత్యవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేడ్కర్ సృష్టించగలిగారు. నిరక్షరాస్యత అంశం ప్రాతిపదికన ఓటింగ్ హక్కులు కల్పించడంపై రాజ్యాంగ సభలో అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత నెహ్రూ సాయంతో అంబేడ్కర్ రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ముందుకు తీసుకొచ్చారు. ఏ కమ్యూనిటీ అయినా, వ్యక్తుల బృందాలు అయినా స్వయం నిర్ణయాధికార హక్కును కలిగి ఉండాలనే అంశాన్ని అంబేడ్కర్ నొక్కి చెప్పేవారు. ఏ కమ్యూనిటీకైనా ఏది మంచిది అనే విషయాన్ని ఇతరులు ఆదేశించకూడదని అంబేడ్కర్ భావించేవారు. పైగా తమకు ఏది మంచిది అని ప్రజలే నిర్ణయించుకునే హక్కు ఉండాలని చెప్పేవారు. రాజ కీయ అంగాల ప్రాతినిధ్య హక్కు భావనను రౌండ్ టేబుల్ సదస్సులో పోరాడి సాధించడం ద్వారా శాసనసభల్లో దళితులకు ప్రాతినిధ్యం కల్పించడంలో అంబేడ్కర్ ఘనవిజయం సాధించారు. ఆయన ప్రతిపాదించి అమలులోకి తీసుకొచ్చిన ఈ భావన తర్వాత పార్లమెంటులో గిరిజన ప్రాతినిధ్య హక్కుల పరికల్పనకు కూడా వీలు కల్పించింది. పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలకు కూడా ప్రాతినిధ్య హక్కులు లభించాయి. అణచివేత స్వభావంకల భారత సామాజిక చట్రం, అసమానమైన మత వ్యవస్థ, ఆచారాలపై నిరంతర చర్చ మొదలెట్టి, సవాలు చేయగలడం ద్వారా అంబేడ్కర్ సామాజిక రంగంలో గణనీయ పాత్ర పోషించారు. 1930-32 కాలంలో లండన్‌లో రౌండ్ టేబుల్ సదస్సులలో దళితుల ప్రతినిధిగా ఎలుగెత్తిన అంబేడ్కర్ దళితులకు రాజకీయ ప్రాతి నిధ్యం సాధించడంతో తన పేరు మార్మోగిపోయింది. 1932 సెప్టెంబర్‌లో పూనా ఒడంబడికపై సంతకం చేయడం ద్వారా గాంధీ ప్రాణాలను కాపాడటంలో అంబేడ్కర్ నిర్వహించిన పాత్రతో విశిష్టమైంది. 1932 ఒడంబడిక తర్వాతే గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశంపై ఉద్యమం ప్రారంభించారు. కానీ 1935 అక్టోబర్ 13న హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అనే సుప్రసిద్ధ ప్రకటన ద్వారా అంబేడ్కర్ పాతుకుపోయిన భారతీయ మత చట్రాన్ని సవాలు చేశారు. ఈ విస్పోటనా ప్రకటన ద్వారా అన్ని మతాలు, మతనేతలను తమలోకి తాము తొంగి చూసుకునేలా చేశారు. సమాజంలో వ్యక్తి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయంపై మతాలు ఏం చెబుతున్నప్పటికీ వాటి ఆచారాలను, మత వ్యవస్థలను మళ్లీ మదింపు చేసుకోవాలని అంబేడ్కర్ వారిని కోరారు. 1935లో ఆయన చేసిన ఈ చారిత్రక ప్రకటనతో ప్రతి ఒక్కరూ స్త్రీపురుషుల సమానత్వం, న్యాయమైన సమాజం పట్ల తమ మతవిశ్వాసాలను, ఆచారాలను లోతుగా పునఃపరిశీలించుకోవలసి వచ్చింది. చివరకు గాంధీజీ సైతం ఈ చర్చలో పాల్గొన్నారు. ఇక 1936లో అంబేడ్కర్ చేయలేకపోయిన సుప్రసిద్ధ ప్రసంగం ‘కులనిర్మూలన’తో మరొక సవాల్ విసిరారు. ఈ ప్రసంగంలో మతం, మానవ సమానత్వం పాత్రను అంబేడ్కర్ లోతైన విశ్లేషణ చేశారు. 1940లలో తీసుకొచ్చిన ఆలయ ప్రవేశ చట్టాలను అంబేడ్కర్ గుర్తించలేదు. కేవలం ఆలయాల్లోకి ప్రవేశం కల్పించడం ద్వారా మాత్రమే రహదారులు, నీరు, విద్య వంటి అంశాలపై దళితులకు, పౌరులకు పౌర హక్కులు, సామాజిక హక్కులు కల్పించలేరని అంబేడ్కర్ తప్పుపట్టారు. దళితులకు ఆంక్షలు లేకుండా నీరు కల్పించడానికి 1927లో అంబేడ్కర్ మొదలెట్టిన మహద్ సత్యాగ్రహం కానీ, 1932లో నాసిక్‌లోని కాలారాం ఆలయ ప్రవేశం కోసం తాను చేసిన ప్రయత్నం కానీ.. భారతీయ సామాజిక చట్రం దళితులకు ఈ హక్కులను తిరస్కరిస్తోందనడానికి నిదర్శనాలుగా మిగి లిపోయాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతి లేచి నిలబడి చర్చించి, అంగీకరించేలా చేశారు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ఈ హక్కులన్నింటినీ పొందుపర్చడానికి దారి తీసింది. డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు వ్యాసకర్త ఐఏఎస్ అధికారి, హరియాణా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి -
రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’.. ఫస్ట్‌లుక్
‘‘భయంకరమైన కోవిడ్–19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా నేను ప్రేమించేవాళ్లు, నా అభిమానుల ప్రార్థనలే నా ఈ పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించేలా చేశాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లయిన మీకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజశేఖర్. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ చిత్రాన్ని ప్రకటించి, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. లలిత్ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ‘‘రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి రచయిత: లక్ష్మీ భూపాల్, కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: దత్తాత్రేయ. -
రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) -
రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను కూతురు శివాత్మిక ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం బాగుందని, కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సిటీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను శివాత్మిక షేర్ చేశారు. చదవండి: నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం Daddy is recovering! Grateful for the team of doctors at @CitiNeuro lead by Dr.Krishna Prabhakar Garu. Thanks to dear Dr.Madhu garu for always being there for us! Tq all so much for your prayers and wishes! Keep us in your thoughts, We'll come out stronger💜 pic.twitter.com/3kgzRVIh7C — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 31, 2020 'రాజశేఖర్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్‌ను ఆయనకు అందిస్తున్నాం' అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే జీవితా, ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి బయటపడినప్పటికీ రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: హనీమూన్ వాయిదా వేసుకున్న కాజల్.. -
ఐసీయూలో హీరో రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చేరిన హీరో రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు గురువారం ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ‘ పిల్లలు.. శివాత్మిక, శివానీ ఇద్దరికీ బాగానే ఉంది. నేను, జీవిత చికిత్స తీసుకుంటున్నాం’ అని ట్విట్టర్ ద్వారా నాలుగు రోజుల క్రితం ఆయన తెలిపిన సంగతి విదితమే. కాగా, రాజశేఖర్ ఆరోగ్యం విషమించిందన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. ‘నాన్నగారు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా కూడా ఆయన కుటుంబం తెలిపింది. -
‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్‌పై..
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్, జయలక్ష్మి, మహ్మద్ అలీ, ఎంవీ బెనర్జీ, రాజారవీంద్ర, ఉత్తేజ్‌లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్... తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. -
‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ
-
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం
-
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘మా’ఉపాధ్యక్షుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతేకాకుండా అతడితో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. గురువారం ‘మా’ పలు నాటకీయ, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘మా’లో మారోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆయన నుంచి మైకు లాక్కొన్నాడు. దీంతో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు రాజశేఖర్ మాట్లాడిన తీరు, అంశాలపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పనిగట్టుకుని గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి విమర్శించారు. అంతేకాకుండా ‘మా’నియమనిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు, కృష్ణంరాజు చిరంజీవికి సపోర్ట్ నిలుస్తూ రాజశేఖర్ చేసిన పనిని తప్పుపట్టారు. అంతేకాకుండా జీవితరాజశేఖర్ సైతం తన భర్తది చిన్నపిల్లల మనస్తత్వంగా పేర్కొనడం విశేషం. చదవండి: ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం -
‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ (మా)లో మరోసారి విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి, రాజశేఖర్ వాగ్వాదం జరగడం, చిరు కామెంట్స్‌కు రాజశేఖర్ అడ్డుపడ్డటం, రాజశేఖర్ తీరును చిరంజీవి, మోహన్‌బాబు ఖండించడంతో వివాదం రేగింది. రాజశేఖర్ అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితారాజశేఖర్ స్పందించారు. మాలోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్ వర్గంతో తమకున్న విభేదాలను తామలో తాము పరిష్కరించుకుంటామని ఆమె తెలిపారు. మాలో భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రతిచోట గొడవలు రావడం సహజమేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్‌కు చాలా టైమ్ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు. చిరంజీవి, మోహన్‌బాబులాంటి వారినుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మాను బలోపేతం చేయడం, గౌరవప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నరేశ్‌తో తనకు కానీ, రాజశేఖర్‌కుకానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని చెప్పారు. మరోవైపు సినీ పెద్దలు కూడా ‘మా’లోని విభేదాలను రూపుమాపి.. నరేశ్, జీవితారాజశేఖర్ వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంతో రచ్చరేపినా.. చివరకు పరిస్థితి చల్లబడింది. చదవండి: ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం -
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు. ఈ కేసులోనే రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినట్లుగా సమాచారం. 2017 అక్టోబర్‌లోనూ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారును రాజశేఖర్ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి 2017 లోనే ముగిసింది. అయినా, ఆయన దాన్ని రెన్యువల్ చేసుకోలేదు. దీనికితోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వరుసగా ప్రమాదాలకు కారణమవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వారందరికీ కృతజ్ఞతలు: రాజశేఖర్
-
వారందరికీ కృతజ్ఞతలు: రాజశేఖర్
ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం వేకువజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రమాదంపై అనేక వార్తలు వస్తున్న తరుణంలో రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఒళ్లు నొప్పులున్నాయి తప్పా పెద్ద గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వారితో పాటు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపిన రాజశేఖర్.. ఎవరూ ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. ‘ఈ ప్రమాదం జరిగినప్పట్నుంచి అనేక మంది మెసేజ్‌లు, ఫోన్లు చేసి నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. వీరందరి పలకరింపులు, నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తేంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చనిపోయిన వారి కుటంబసభ్యులను కలవడం కానీ, ప్రమాదాలకు గురై గాయపడ్డ వారిని పలకరించడం వంటివి చేయాలి. లేకపోతే వారి కుటుంబసభ్యులు బాధపడతారు. మనకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరా అని నిరుత్సాహపడతారు. అలాగే ఆరోగ్యం బాగోలేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి దయచేసి పరామర్శించండి. ధైర్యం నింపండి. డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఏదైనా జరిగినప్పుడు కనీసం ట్వీట్ చేయండి’అంటూ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇక రాజశేఖర్ పూర్తి సందేశం కింది వీడియోలో.. -
ప్రమాదంపై స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: తన భర్త పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ప్రముఖ నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రేమాభిమానాలతో కారు ప్రమాద ఘటన నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. రాజశేఖర్ కారు ప్రమాదంపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నమైన వార్తలు రావడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘కారు ప్రమాదంపై రకరకాల వార్తలు వస్తుండటంతో వాస్తవాలు వెల్లడించేందుకు మీ ముందుకు వచ్చాను. రాజశేఖర్ గారు మంగళవారం అర్ధరాత్రి ఘాటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా కారు టైరు పేలిపోవడంతో నియంత్రణ తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కవైపు పడిపోయింది. ఎదురుగా వస్తున్న కారులో ఉన్నవారు ఆగి రాజశేఖర్ గారిని గుర్తించారు. వారి సహాయంతో కారులోంచి బయటకు వచ్చారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ల ఫోన్ నుంచి పోలీసులకు, మాకు ఫోన్ చేశారు. నేను వీళ్ల కారులోనే వస్తున్నాను మీరు ఎదురురండి అని మాతో చెప్పారు. మేము బయలుదేరి సగం దూరం వెళ్లి ఆయనను మా కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాం. పోలీసులకు విషయాన్ని వివరించాను. రాజశేఖర్ గారు క్షేమంగానే ఉన్నారు కదా అని ఒకటికి రెండుసార్లు అడిగారు. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి దెబ్బలు తగల్లేదని చెప్పారు. ఈ ఉదయం కూడా శంషాబాద్ సీఐ వెంకటేశ్ గారితో మాట్లాడాను. ప్రమాదం జరిగిన తీరుపై ఒకసారి స్టేషన్‌కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. రాజశేఖర్ కోలుకున్నాక స్టేషన్‌కు రమ్మన్నారు. ఇది కచ్చితంగా పెద్ద ప్రమాదం. రాజశేఖర్ గారిని అభిమానించే అందరి ప్రేమాభిమానాలతో ఆయన క్షేమంగా బయటపడ్డార’ని జీవిత వివరించారు. (ప్రాథమిక వార్త: హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం) -
నాకు ఎటువంటి గాయాలు కాలేదు
-
అసలేం జరిగిందంటే?: రాజశేఖర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారుతో తననొక్కడినే ఉన్నానని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేద’ ని అన్నారు. (చదవండి: హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం) అతివేగమే కారణం: పోలీసులు రాజశేఖర్ కారు ప్రమాదంపై శంషాబాద్ పోలీసులు స్పందించారు. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ టోల్ గేట్ వద్ద అదుపు తప్పి కారు బోల్తా కొట్టిందని శంషాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ తెలిపారు. కారు(టీఎస్ 07 ఎఫ్‌జడ్ 1234)లో హీరో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని చెప్పారు.అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. రాజశేఖర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కారును తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
హీరో రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం
-
హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ మరోసారి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్టు సమాచారం. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం పీవీఎన్ఆర్ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్ బయటపడ్డారు. తన కారుతో మరొకరి వాహనాన్ని ఆయన ఢీకొట్టారు. అయితే బాధితుడు రామిరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు నమోదు చేయలేదు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ నిర్మిస్తున్న సినిమాలో ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. ప్రమాదంలో ధ్వంసమైన రాజశేఖర్ కారు -
మాకు పది లక్షల విరాళం
సీనియర్ నటుడు వీకే నరేష్ అధ్యక్షతన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచిపోయింది. ఎన్నికల సందర్భంగా ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనం తీసి ఖర్చు చేయడం సమంజసం కాదని భావించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసోసియేషన్‌కు పది లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ‘‘ఇంతవరకూ ‘మా’ అసోసియేషన్ అదనపు నిధుల కోసం సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోంది. ఈసారి కూడా అదే తరహాలో నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాజశేఖర్. -
ఎమోషన్.. ఎంటర్టైన్మెంట్
‘పీఎస్వీ గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో జోష్ ట్రాక్‌లో ఉన్న రాజశేఖర్ నటించనున్న తాజా చిత్రం వచ్చే నెల ఆరంభం కానుంది. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ చేసిన టీమ్‌కి తమిళ దర్శకుడు, మాటల రచయిత జాన్ మహేంద్రన్ నేతృత్వం వహించారు. చిత్రదర్శక, నిర్మాతలు, జాన్‌మహేంద్రన్, సినిమా తెలుగు డైలాగ్ రైటర్, గేయ రచయిత విశ్వ వేమూరి కథ, స్క్రీన్‌ప్లేను సోమవారం రాజశేఖర్, జీవితలకు అందజేశారు. ‘‘కథ చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగా కుదిరింది. ఉత్కంఠభరితంగా సాగడంతో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘హైదరాబాద్, చెన్నైలో సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని జి. ధనుంజయన్ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం, సంపత్ నటించే ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.పి. శివప్రసాద్. -
సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లందరూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కర్టన్ రైజర్ ప్రెస్‌మీట్ జరిగింది. కళాబంధు టి. సుబ్బిరామి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ... కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరంలో సినీ ఆర్టిస్ట్‌లందరూ కలిసి చాలా కాలం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత ప్రొడక్షన్ మేనేజర్లు కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్‌కు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అన్నారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమ్మిరాజు మాట్లాడుతూ ‘మేం చేస్తున్న ప్రయత్నానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. సపోర్ట్ చేస్తోన్న జెమినీ కిరణ్‌గారికి థ్యాంక్స్. సుబ్బిరామి రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేరు పేరున ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన వారందరికి థాంక్స్ తెలుపుతున్నాను. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్‌కు ఇలాగే అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. వీరితో పాటు మా అధ్యక్షుడు వికె నరేష్, ఉపాధ్యక్షుడు డా. రాజశేఖర్, నటులు అల్లరి నరేష్, సందీప్ కిషన్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, వెన్నెల కిశోర్, సంపూర్ణేష్ బాబు, శివ బాలాజీ, రాజీవ్ కనకాల, హేమ, ఉత్తేజ్, నిర్మాతలు సీ కల్యాణ్, ఎమ్ఎల్ కుమార్ చౌదరి, దామోదర్ ప్రసాద్, దర్శకులు బాబీ, బొమ్మరిల్లు భాస్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ నిర్వాహకులకు తమ మద్ధుతు తెలిపారు. -
జూనియర్ డాక్టర్ల మహాధర్నా
-
అలాంటి పాత్రలైతే విలన్‌గా చేస్తా : రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా రాజశేఖర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్... అన్ని బాగున్నాయని అంటున్నారు. మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్‌గా ఉంటుంది. ఇందులో అండర్ ప్లే చేసినట్టున్నారు? క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు. ‘సార్... ఇప్పుడే రెండోసారి సినిమా చూసాం మళ్లీ వెళుతున్నాం, సార్... ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకి వెళ్తున్నాం’ అని ఫోనులు చేస్తుంటే... నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది. సినిమాలో మీ స్టైలింగ్ మీద చాలా కాన్సంట్రేట్ చేసినట్టున్నారు? పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్తే చాలు... నేను డైటింగ్ చేయడం, వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫిట్నెస్ మీద దృష్టి పెడతా. ఇన్‌షర్ట్ చేసుకుంటే పొట్ట కనిపించకూడదు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కావడంతో కాస్త ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం? నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు? సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసి మీ పిల్లలు ఏమన్నారు? వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి... ‘మీ నాన్నగారు యంగ్ హీరోలకు ధీటుగా ఫైట్స్ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లవ్ ట్రాక్‌ను కూడా చాలా బాగా డీల్ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ ఉండవు. అదా శర్మతో నా పెయిర్ సూపర్ ఉందని మా అమ్మాయిలు చెప్పారు. రాహుల్ రామకృష్ణ కోణంలో కథను చెప్పారు. ఎందుకలా? స్క్రీన్‌ప్లేలో అదొక స్టైల్. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్ ఫీలవుతున్నారు. మీరు, బాలకృష్ణగారు కలిసి సినిమా చేస్తారనే వార్త వినిపిస్తోంది! చాలా వినిపిస్తున్నాయి. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. విలన్‌గా చేయడానికి సిద్ధమేనా? నేను రెడీ. (నవ్వుతూ) నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు... ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. అరవింద సమేత వీరరాఘవ, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా. ‘దొరసాని’తో శివాత్మిక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తండ్రి, కుమార్తె కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా? ఉంది. అయితే... ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, దొరసాని కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది. నిన్న విడుదలైన దొరసాని ట్రైలర్ చూసి సావిత్రిగారితో కొందరు పోలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా? ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు గారు గరుడవేగ 2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. -
‘ఆ డైలాగ్ ఐడియా నాదే’
'అ!' చిత్రంతో అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాన్ని అందించారు. 'అ!' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి'. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్గా, మాస్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... సినిమాకు ఎలాంటి స్పందన వస్తోంది? దర్శకుడిగా నా తొలి సినిమా 'అ!' ఏ సెంటర్ సినిమా అయితే... 'కల్కి' బి, సి సెంటర్ సినిమా. సరికొత్త కమర్షియల్ పంథాలో తీసిన సినిమా. ఏ ప్రేక్షకులైతే మా టార్గెట్ అనుకుని సినిమా తీశామో వాళ్ళందరికీ సినిమా నచ్చింది. అయామ్ సో హ్యాపీ. రాజశేఖర్ గారి తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్? ఆయన షూటింగ్ కి సకాలంలో రాకపోవడం వల్ల దర్శకులు ఇబ్బంది పడతారని విమర్శ ఒకటి ఉంది! అటువంటిది ఏమీలేదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... షూటింగ్ చకచకా పూర్తి చేయవచ్చు. హీరో రాకముందు కొన్ని సన్నివేశాలు కూడా తీయవచ్చు. ఆయన టైం కి రారు అనడం కంటే... సన్నివేశాలను మరింత బాగా తీయడానికి నాకు టైం ఇచ్చారు. రాజశేఖర్ గారు డైరెక్టర్స్ ఫ్రెండ్లీ హీరో. (చదవండి: ‘కల్కి’ మూవీ రివ్యూ) 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ పెట్టాలని ఐడియా ఎవరిది? నాదే. ఒక్కసారి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీయాలని డిసైడ్ అయిన తర్వాత... ఈ ఐడియా వచ్చింది. మన మీద మనమే సెటైర్ వేసుకుంటే బాగుంటుంది అని... రాజశేఖర్ గారి గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసే టాపిక్ ఏంటని చూశాం. 'ఏం సెప్తిరి ఏం సెప్తిరి' డైలాగ్ ట్రోలింగ్ టాపిక్స్ లో ఒకటి. దీన్ని సినిమా లో పెడదామని రాజశేఖర్ గారికి చెప్పగానే ఒప్పుకున్నారు. నేను కొత్త దర్శకుడు అయినా ఏం అడిగితే అది చేశారు. తన కథను కాపీ చేశారని ఒక రచయిత మీడియా ముందుకు వచ్చినట్టున్నారు? అవును. అయితే... అతను ఆరోపించిన తర్వాత మా కథను రచయితల సంఘానికి చూపించాం. రెండిటి మధ్య ఎలాంటి సారూప్యతలు లేవని తేల్చారు. దాంతో వారు సినిమాలు కూడా చూడలేదు. సినిమా స్క్రీన్ ప్లేకి సుమారు పదిమంది వరకు వర్క్ చేసినట్టున్నారు తెరపై చాలా పేర్లు పడ్డాయి. వాళ్లందరూ మా స్క్రిప్ట్ విల్ టీమ్ మెంబెర్స్. కథ రాసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా ఉంటే బాగుంటుందని చాలా వెర్షన్స్ రాస్తాం. అదంతా పూర్తయిన తర్వాత మా సిస్టర్ ఏది బాగుందో చెబుతుంది. దాన్ని ఫైనల్ చేస్తాం. స్క్రిప్ట్ విల్ టీమ్ లో నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, సినిమాలపై ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కథలపై వర్క్ చేస్తున్నాం. తొలుత ఈ కథను మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదట. స్క్రిప్ట్ వరకు ఇచ్చి, వేరే డైరెక్టర్ తో చేయాలని అనుకున్నారట. అవును. ఆరు నెలల్లో స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఈ కథలో డైరెక్ట్ చేయాలని ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆరు నెలలలో లో రాజశేఖర్, జీవిత, వాళ్ల ఫ్యామిలీ తో ట్రావెలింగ్ బాగుంది. వాళ్లు సెన్సిబుల్ పీపుల్. (నవ్వుతూ) వీళ్లను భరించొచ్చు అనిపించిన తర్వాత నేనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. జీవిత గారు సినిమా విషయంలో ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు? నా అనుభవం రెండు సినిమాలు మాత్రమే. రాజశేఖర్ గారు, జీవిత గారు ముప్పై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సినిమాలు చేశారు. వాళ్ళు ఏదైనా చెబితే వింటాను. నేను చెప్పిందే తీయాలనుకునే రకం కాదు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ లో కూడా ఎవరైనా నా సలహా ఇస్తే, నేను కన్విన్స్ అయితే తీసుకుంటాను. వాళ్లకు క్రెడిట్ ఇస్తా. సినిమాలో క్లైమాక్స్ కి మంచి పేరు వచ్చింది. మీరు క్లైమాక్స్ ముందు రాసుకుని తర్వాత కథ రాస్తారట? అవునండి. క్లైమాక్స్ యే కథ అని నేను నమ్ముతా. ఒక్కసారి క్లైమాక్స్ ఎలా చేస్తే బాగుంటుందనేది రాసుకున్న తర్వాత... స్క్రీన్ ప్లే రాస్తాను. క్లైమాక్స్ వరకు రెండు గంటలు ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చునేలా కథను రూపొందిస్తా. 'అ!', 'కల్కి'... రెండు చిత్రాల్లో అసలు కథేంటో క్లైమాక్స్ వరకు తెలియదు. ట్విస్టులతో సినిమాలు తీశారు. దర్శకుడిగా మీపై ఇటువంటి చిత్రాలు తీస్తారనే ముద్ర పడుతుందేమో? నా తదుపరి సినిమాగా మంచి ప్రేమ కథను తీస్తానేమో. ఒకే తరహా చిత్రాలు తీయడం నాకు నచ్చదు. డిఫరెంట్ జోనర్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఉంది. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. అతను మీ ఫ్రెండ్. అందువల్లే మీకు బాగా చేశాడా? ఒక్కటి మాత్రం నిజం... తను నా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకు తీసుకున్నా. బీటెక్ లో నేను తీసిన కొన్ని వీడియోలను తన సంగీతంతో బాగా చూపించాడు. తనకు మంచి బ్రేక్ రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా సినిమాలో అందరి కంటే తనకు ఎక్కువ పేరు రావడం సంతోషంగా ఉంది. నెక్స్ట్ సినిమా ఏంటి? ఏమో... రెండు మూడు కథలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలోనూ ఉన్నాం. మీ తొలి సినిమా నిర్మాత నానితో టచ్ లో ఉన్నారా? ఉన్నానండి. ఇటీవలే ఆయనను కలిశా. ఒక కథ గురించి చర్చించుకున్నాం. సినిమా చేయాలంటే జాతకాలు అన్ని కలవాలి. -
‘కల్కి’ మూవీ రివ్యూ
-
‘కల్కి’ మూవీ రివ్యూ
టైటిల్ : కల్కి జానర్ : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కల్కి. రాజశేఖర్‌ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మరి ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని కల్కి నిలబెట్టిందా..? ఈ థ్రిల్లర్‌తో రాజశేఖర్ మరో సక్సెస్ అందుకున్నాడా..? కథ : కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు. అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను దారుణంగా హత్య చేస్తారు. హత్యకు కారణం నర్సప్ప అని కొందరు, కాదు పెరుమాండ్లు చంపాడని మరి కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్)ని ప్రత్యేకంగా అపాయింట్ చేస్తారు. కొల్లాపూర్ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : గరుడ వేగ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్, కల్కి పాత్రలో జీవించాడు. అక్కడక్కడా లుక్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. అదా శర్మ పోషించిన హీరోయిన్ పాత్రకు కథలో ఏ మాత్రం ప్రాదాన్యం లేదు. కేవలం ఓ పాట కోసమే ఆమెను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి నటిగా పేరున్న నందితా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్ మోడ్‌లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్ టైమింగ్‌తో మెప్పించాడు. విలన్‌గా అశుతోష్ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్, సిద్దు జొన్నలగడ్డ, చరణ్‌దీప్, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇది పూర్తిగా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమా. రెండో ప్రయత్నంగా పీరియాడికల్ థ్రిల్లర్‌ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు. అయితే చెప్పాల్సిన కథ రెండున్నర గంటలకు సరిపడా లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ కమర్షియల్ ఫార్మాట్ కోసం కావాలనే ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్ నేపథ్యం సంగీతంతో వావ్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్‌ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. 80ల నాటి లుక్ తీసుకురావటంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. సీ కల్యాణ్‌తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం క్లైమాక్స్ ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : హీరోయిన్ పాత్ర స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సాంగ్స్ - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’
యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి. శివాని, శివాత్మిక, వైట్ లాంబ్ టాకీస్ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా ట్రైలర్లో హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే లాంటి డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై హైప్ మరింత పెంచాయి. రాజశేఖర్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. గరుడవేగ తర్వాత కల్కితో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణాలు కీలక పాత్రల్లో నటించారు. -
కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ట్రైలర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోమవారమే ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు. ట్రైలర్లోనే సినిమా లైన్ ఎంటో చెప్పేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నరసప్ప తమ్ముడు శేఖర్ బాబు హత్య కేసు చుట్టూ తిరుగుతుంది కల్కి కథ. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా రాజశేఖర్, జర్నలిస్ట్‌గా రాహుల్ రామకృష్ణలు కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, నాజర్, స్కార్లెట్ మెలిష్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా, శత్రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కల్కి’.. మాకు ఈ ఎదురుచూపులేంటి?
‘గరుడవేగ’ విజయవంతం అయ్యే సరికి యాంగ్రీస్టార్ రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్‌కు ఈ చిత్రం ఘన విజయాన్ని ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో మళ్లీ అదే ఎనర్జితో సినిమాలను చేస్తున్నారు. యంగ్ టాలెంటెండ్ ప్రశాంత్ వర్మతో తీస్తున్న ‘కల్కి’ చిత్రం ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ విడుదల చేయడంలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయాల్సిన ట్రైలర్‌ను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సాంకేతికలోపం తలెత్తడంతో ఇప్పటికీ విడుదల చేయలేకపోయింది చిత్రబృందం. దీంతో ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ఇంకెంతసేపు ఎదురుచూడాల్సి వస్తుందో మరి. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నందితా శ్వేత, పూజిత పొన్నాడ, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారు. -
జూన్ 28న రాజశేఖర్ ‘కల్కి’ విడుదల!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన ‘హార్న్ ఓకే’ పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. మధుర మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేస్తున్నాడు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘డిఫరెంట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా కల్కి. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి తమకు ట్రైలర్ ఎంత నచ్చిందో చెప్పారు. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది. రాజశేఖర్ గారి ఇమేజ్‌కి తగ్గ విధంగా, కొత్త తరహా సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి’ అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... థియేటర్లలో ప్రేక్షకులకు కల్కి అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు’ అని అన్నారు. -
పవన్ కళ్యాణ్‌పై జాలేసింది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రక విజయం సాధించారని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని హీరో రాజశేఖర్ అన్నారు. తన భార్య జీవితతో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ మా పాత్ర ఉండటం ఆనందంగా ఉంది. జగన్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడే విజయ సంకేతాలు అందాయి. జగన్ గెలుస్తాడని ముందే తెలుసు. జగన్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ‘మా’ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు మాకు ఎలాంటి విబేధాలు లేవు. ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్‌పై జాలి వేసింది, ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేద’ని రాజశేఖర్ అన్నారు. రోజా గెలవడం అదృష్టం: జీవిత వైఎస్ జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని జీవిత చెప్పారు. అంకితభావంతో కష్టపడిన జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, వచ్చే పదేళ్లు ఆయనదేనని వ్యాఖ్యానించారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నాగబాబుపై, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు తమకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. ‘ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోజా గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైఎస్సార్సీపీ అదృష్టం. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా’ని జీవిత అన్నారు. -
రూమరమరాలు
ఇంగ్లిష్‌లో ‘రూమర్ మిల్’ అనే మాట ఉంది. అంటే.. పిడి మరలాగే రూమర్లకూ ఒక మర ఉంటుందని!ఆ పిండితో ఏ రొట్టే చెయ్యలేం. కానీ ఆకలి తీరుతుంది!రూమరో రామచంద్రా..అన్నంతగా ఉన్న..ఆకలి తీరుతుంది. కానీ.. రూమర్లు లైట్‌గా ఉండాలి. లైట్‌గా ఉంటే..మరమరాల్లా ఎంజాయ్ చెయ్యొచ్చు.మోతాదు మించితేనే ముంచినంత పని చేస్తాయి! ప్రాణి పుట్టుకకు ఎక్స్‌వై క్రోమోజోములు అవసరం. ప్రాణం లేని రూమర్ పుట్టుకకు ‘డెవిల్స్ వర్క్‌షాప్’ ఒకటి చాలు! పనిలేని బుర్ర! అది పుట్టిస్తుంది అందమైన రూమర్లు. బాధించే రూమర్లు. కంపెనీలను లాస్ చేయించే రూమర్లు. కెరీర్‌ను దెబ్బదీసే రూమర్లు. మంచి రూమర్లు ఎక్కువ కాలం బతకవు. బతికినా వెంటనే చనిపోతాయి. చెడ్డ రూమర్లే.. ‘పాపి చిరాయువు’లా బతికేస్తుంటాయి! రూమర్లంటే ఎవరైనా భయపడి చచ్చేది అందుకే. సెలబ్రిటీలకైతే రూమర్లంటే మహా వణుకు. నోరు మెదపరు. వాళ్ల నోట్లో వేలుపెట్టి కోపం తెప్పించి, వేలు కొరికించుకుని రూమర్లు క్రియేట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అసలు నోరు, వేలు, కోపం, కొరకడం.. ఇవేవీ లేకుండానే పుట్టే రూమర్లూ ఉంటాయి! నానీ ‘జెర్సీ’ బాగుందని జూ‘‘ ఎన్టీఆర్ ఎక్కడో ఒక ట్వీటో, చిన్న మాటో వేశాడు. అక్కడో రూమర్ పుట్టేసింది. ‘కథానాయకుడు’ బాగుందని అనలేదు. ‘మహానాయకుడు’ బాగుందని అనలేదు. ‘జెర్సీ’ బాగుందని అన్నాడు. తాతగారి మీద తీసిన ఆ రెండు బయోపిక్కుల్లో తనకు పాత్రే లేకుండా చేసినందుకు జూ‘‘ ఎన్టీఆర్ అలా రివెంజ్ తీర్చుకున్నాడని రూమర్. అర్థం లేని రూమర్లపై ఎవరైనా ఎందుకు మాట్లాడతారు. ఎన్టీఆర్ కూడా మాట్లాడలేదు. లోకంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా రూమర్లకు అనువుగా ఉండేది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. హాలీవుడ్లో రోజుకు లక్ష రూమర్లు పుట్టుకొస్తుంటాయి. బాలీవుడ్లో వెయ్యి రూమర్లు ఉసురు పోసుకుంటాయి. మన తెలుగువుడ్ ఇంకా అంత ‘డెవలప్’ కాలేదు. నయం అనుకోవాలి అంతగా డెవలప్ కాకపోవడం. షూటింగ్ స్పాట్ వరకైతే ఓకే. మరీ ఇళ్లలోకి వెళ్లిపోకూడదు కదా. కానీ పబ్లిక్ పర్సన్స్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దేన్ ప్రైవేట్ పర్సన్స్ పబ్లిక్ లైఫ్. మానవ నైజం. ‘సైరా’ సెట్లో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంటికెళ్లాక పెరట్లో మొక్కలకు ట్యూబ్ పట్టుకుని నీళ్లు పడుతున్నప్పుడు చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ‘‘సరే రావయ్యా.. మొక్కలకు నీళ్లు పడుతున్నప్పుడు ఒక ఫొటో తీసుకో’’ అని చిరంజీవి అంటారేమో. అయితే ఇండస్ట్రీలో అంత ఈజీగా ఏదీ ఉండదు. ఈజీగా లేని పరిస్థితుల్లో ఈజీగా పుట్టేవే రూమర్లే. దసరాకి కాదా సైరా ‘సైరా నరసింహారెడ్డి’ ఈ దసరాకు విడుదల కానట్లేనా! అనే రూమర్ ఇప్పుడు రౌండ్లు కొడుతోంది. మెగాస్టార్ అభిమానుల డీలా పడిపోయారు. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత పదేళ్లకు ‘ఖైదీ నెం.150’గా సాక్షాత్కరించారు చిరు. మళ్లీ రెండేళ్ల గ్యాప్! సైరా కోసం అవురావురుమని చూస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుందని చూస్తుంటే రూమర్ రిలీజ్ అయింది.. దసరాకు విడుదల కావడం లేదని!! దర్శకుడు సురేందర్‌రెడ్డి. నిర్మాత రామ్ చరణ్. భారీగా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ అవుతోందనీ, క్లయిమాక్స్‌కి వచ్చేశామని కూడా చెప్పారు. ఇప్పుడేమిటి దసరాకు కాదంటున్నారు? సెట్లో అగ్నిప్రమాదం జరిగింది కదా, అందుకే లేట్ అవుతోందని ఒక రూమర్. లేట్ చేయించడానికే అగ్నిప్రమాదం సృష్టించారని ఇంకో రూమర్. రామ్ చరణ్‌కి ప్రకటన ఇవ్వక తప్పలేదు. ‘‘అవును.. సైరా దసరాకు విడుదల కావడం లేదు’’ అన్నాడు. ఆ వెంటనే.. ‘‘అక్టోబర్ 2కి విడుదల చేస్తున్నాం’’ అన్నాడు. చిరు అభిమానులు ఆనందంతో షాక్‌లోకి వెళ్లిపోయారు. అక్టోబర్ 2.. ఈ ఏడాది దసరాకంటే ముందొచ్చేస్తోంది మరి! దసరా అక్టోబర్ 8న. ఆశించినదానికి ఆరు రోజులే ముందే అయినా ఫ్యాన్స్‌కి అదో పెద్ద పండుగ. అయితే రామ్ చరణ్ నిజంగానే అలా అన్నారా లేక అన్నారని ఒక రూమరా?! ఏమైనా ఉల్లాసం కలిగించే సంగతే. గుడ్ రూమర్. ఏమి సేస్తిరి.. ఏమి సేస్తిరి?! చిరు ఇంట్లోనే సగానికి పైగా సినిమా ఇండస్ట్రీ ఉంది. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, పొలిటికల్ లీడర్స్ అంతా కలిపి పదిమందికి పైగా ఉన్నారు. అంత పెద్ద ఇల్లు కాబట్టి వాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సహజీవనం చేస్తుంటుంది. పవన్ కల్యాణ్ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాడని ఆ మధ్య ఒక రూమర్ వచ్చింది. ఇప్పుడు అల్లు అరవింద్‌కి, ఆయన కొడుకు అల్లు అర్జున్‌కి సినిమాలు తీసే విషయంలో మాటామాట వచ్చింది మరో రూమర్! రాజకీయంగా కూడా చిరంజీవి మీద, పవన్ కల్యాణ్ మీద అనేక రూమర్లు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు అవుట్ డేటెడ్. అప్డేట్ ఏంటంటే.. పవన్ కల్యాణ్‌కు హీరో రాజశేఖర్ కౌంటర్ ఇచ్చాడని! ఇవ్వడం అంటే డైరెక్ట్‌గా కాదు. ఇన్‌డైరెక్ట్‌గా. ‘కల్కి’లో రాజశేఖర్ హీరో. గత గురువారం విడుదలైన ‘కల్కి’ టీజర్లో రాజశేఖర్ ‘ఏం సెప్తిరి, ఏం సెప్తిరి.. ఎప్పుడూ ఇలాగే సెప్తారా?’ అంటూ ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌ని ఇమిటేట్ చేస్తాడు. గబ్బర్‌సింగ్‌లోని రౌడీల అంత్యాక్షరి సీన్లో.. రౌడీలను కమెడియన్లా పాడిస్తూ పవన్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక కమెడియన్ లేచి, హీరో రాజశేఖర్ సూపర్ హిట్ సాంగ్ ‘రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా’ అనే సాంగ్‌ని ఎత్తుకుంటాడు. రాజశేఖర్‌ని ఇమిటేట్ చేస్తూ సేమ్ అలాగే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ప్రేక్షకులు నవ్వలేక చచ్చిన సీన్ అది. ఆ రౌడీ కమెడియన్.. సాంగ్‌ని పూర్తి చెయ్యగానే ‘ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి. ఎప్పుడూ ఇలాగే సేస్తురా.. ఈ మధ్యనే ఇలాగే సేస్తున్నారా?’ అంటాడు. అప్పట్లో రాజశేఖర్‌కి, చిరంజీవికి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది. అది దృష్టిలో పెట్టుకుని పవన్ కావాలనే ఆ డైలాగులతో రాజశేఖర్‌కి కౌంటర్ ఇచ్చారని ఒక రూమర్ వచ్చింది. ఆ సీన్‌ని దృష్టిలో పెట్టుకుని ‘కల్కి’లో ఇప్పుడు రాజశేఖర్ పవన్‌కి కౌంటర్ ఇచ్చాడని రూమర్. ఈ రూమర్‌కి బొత్తిగా బేస్ లేకుండా ఏమీ లేదు. కల్కి టీజర్ ఎండింగ్లో.. సేమ్ అదే కమెడియన్ని... పోలీస్ గెటప్‌లో ఉన్న రాజశేఖర్ (గబ్బర్‌సింగ్‌లోని రౌడీ అంత్యాక్షరిలో పవన్దీ పోలీస్ గెటప్పే) కాలితో తంతాడు.. ‘ఏంట్రా ఆ ఊపుడు’ అంటూ.. నన్నే ఇమిటేట్ చేస్తావా అన్నట్లు. దీంతో రూమర్ క్రియేట్ అయి చక్కర్లు కొడుతోంది.. గబ్బర్‌సింగ్‌తో రాజశేఖర్‌ని పవన్ దెబ్బకొడితే, కల్కితో పవన్‌ని రాజశేఖర్ దెబ్బకు దెబ్బ కొట్టాడని. కనిపించవేం ప్రభాస్ ‘సైరా’లా, అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంకో సినిమా ప్రభాస్ నటిస్తున్న ‘సాహో. 2017 జూన్‌లో షూటింగ్ మొదలైంది. ఇప్పటికింకా షూటింగ్ నడుస్తూనే ఉంది. సినిమా మాట తర్వాత సంగతి విడిగానైనా ప్రభాస్‌ని చూద్దామంటే ఆయనెక్కడా కనిపించడం లేదు. ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో అని బెంగ పెట్టేసుకున్నారు ఫాన్స్. సాహో డైరక్టర్ సుజీత్‌ని తిట్టుకుంటున్నారు కూడా. అంత లావున ఏం తీస్తున్నాడో అని. అప్పుడప్పుడు ప్రభాస్‌ని కూడా! డార్లింగ్ అనీ, మిస్టర్ పర్ఫెక్ట్ అనీ హాయిగా ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించక ఎందుకీ భారీ ప్రాజెక్టులు అని వారి ఆవేదన. ప్రభాస్ కెరీర్ గురించి కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాహుబలి, సాహో.. ఇలా ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తీసుకుంటూ పోతుంటే ప్రభాస్ బాడీ ఏమౌతుంది? ఆ తర్వాత కెరీర్ ఏమవుతుంది? కెరీర్‌ని పనిగట్టుకునేం నిర్మించుకోనవసరం లేదు. ప్రభాస్‌కి క్రేజ్ ఉంది. నిర్మాతలు వచ్చేస్తారు. పాత్రల కోసం బాడీని ఫ్లక్చువేట్ చేసుకుంటూ పోతుంటే.. ఫిట్నెస్ దెబ్బతిన్నాక ఏ నిర్మాత దగ్గరికొస్తాడు? ఇవన్నీ రూమర్లు కాదు. చింతాక్రాంతులైన అభిమానుల సందేహాలు. మరి రూమర్ ఏమిటి? సాహూలో ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట! చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆ లెవల్లో అంటే.. ప్రేక్షకుల అంచనాలు అంతకుమించిన లెవల్లోనే ఉంటాయి. అయితే దర్శకుడు సుజి తెరకెక్కించిన కొన్ని కీలకమైన సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేనంత వీక్‌గా ఉన్నాయని, వాటిని మళ్లీ రీషూట్ చేయాలని దర్శకుడిని అడిగితే అతడి ఇగో హర్ట్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. రీషూట్ కోసం ప్రభాస్ అడగడం నిజమైతే ఉండొచ్చు కానీ, దర్శకుడి ఇగో హర్ట్ అవడం మనవాళ్లు కల్పించిన రూమర్ అయి ఉండడానికి ఎక్కువ చాన్సెస్ ఉన్నాయి. సుజీత్ నిన్నమొన్నటి కుర్రాడు. ఇరవై మూడేళ్ల వయసులో ‘రన్ రాజా రన్’ తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హిట్ కొట్టాడు. తర్వాత మూడేళ్లకు సాహో మొదలు పెట్టాడు. రెండు సినిమాలకే మనిషి ఎదగవచ్చేమో కానీ, మనిషిలోని ఇగో సాధారణంగా ఎదగదు. ముందనుకున్న డేట్ ప్రకారం ఆగస్టు 15న సాహో విడుదల కావాలి. అయితే రీషూట్ల కారణంగా ఆ తేదీకి విడుదల కాకపోవచ్చని ఒక రూమర్. నిప్పు లేకుండా పొగ రాదని అంటారు. కానీ నిప్పు లేకుండానే పొగ తెప్పించేస్తుంది రూమర్. ఎంటర్టైన్మెంట్ ఇండస్త్రీలో రూమర్లు సాధారణమే. అయితే అవి వ్యక్తిగతాల్లోకి వెళ్లి మనసుల్ని పాడు చేసేంతగా ఉండకూడదు. ఇమేజ్‌ని దెబ్బతీయకూడదు. భవిష్యత్తును నాశనం చేయకూడదు. సినిమా రిలీజ్ అయ్యేలోపు రూమర్ ఒక టీజర్లా ఉండాలి తప్ప, ఎవర్నీ టీజ్ చేసేలా ఉండకూడదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు... ఈ మధ్య డైరెక్టర్ తేజ మీద కూడా కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ మధ్యే అనేం ఉంది. తేజ నిక్కచ్చిగా మాట్లాడతాడు. దానిని అర్థం చేసుకోలేనివాళ్లు రూమర్స్ క్రియేట్ చేస్తారు. కావాలని చెయ్యరు. వాళ్లన్నవి, అనుకున్నవి రూమర్స్ అయిపోతాయి. చెప్పినట్లు చెయ్యకపోతే తేజ హీరోయిన్లపై చెయ్యి చేసుకుంటాడని ఎప్పటి నుంచో ఉన్న రూమర్. ఈ మధ్య ఒక న్యూస్ చానెల్‌కు తేజ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. ఇలాంటి రూమర్లను నవ్వుతూ కొట్టిపడేశారు. ఆ ఇంటర్వ్యూలోనే తేజ.. ‘నేనెప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ వచ్చేస్తుంది.. వెంటపడి మరీ’ అన్నాడు. ఇక రూమర్లు మొదలయ్యాయి. ఆయన అన్న సందర్భం వేరు. తేజ ‘సీత’ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. మే 24న విడుదల అవుతోంది. ఆ సినిమా కథ చెప్పడం కోసం కాజల్‌తో కూర్చుంటే.. ఆ పాత్రకు తను బాగా కనెక్టయి.. ఎప్పుడు డిస్కషన్స్‌కి కూర్చుందాం అన్నా వెంట పడి వచ్చేస్తుంది అనే అర్థంలో తేజ ఆ మాట అన్నారు. ముందు వెనకల్ని వదిలేసి ‘ఎప్పుడు పిలిస్తే అప్పుడు’ అనే ముక్కను పట్టుకోవడంతో అది రూమర్ అయింది. మహిళలకు తేజ రెస్పెక్ట్ ఇస్తారు. అతడి సినిమాల్లోని మహిళల పాత్రలూ ఇండివిడ్యువాలిటీతో ఉంటాయి. సీతనే తీసుకుందాం. అందులో కాజల్ డామినేటెడ్ రోల్లో డిఫరెంట్‌గా కనిపించబోతోంది. సీత అంటే మనకో సంప్రదాయ భావన ఉంటుంది కదా. దానికి భిన్నంగా ఉంటుంది కాజల్. అలాగని సంప్రదాయ విరుద్ధంగా ఏమీ ఉండదు. టీవీ ఇంటర్వ్యూలో కాజల్ గురించి తేజ మరో మాట కూడా చెప్పారు. ఇండస్ట్రీలో.. ఎవరు సక్సెస్‌లో ఉంటే వారి వెనుక పడి వస్తారు. కాజల్ అలాక్కాదు. తనకు సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌తో నిమిత్తం లేదు. కథ నచ్చితే వెంటపడి చేస్తుంది అని అన్నారు. తేజ స్ట్రయిట్ ఫార్వార్డ్. అనవసరంగా ఒకర్ని పొగడరు. తిట్టాల్సి వస్తే తిట్టకుండా వదలరు. ఈ ముక్కుసూటి ధోరణి కారణంగా రూమర్స్‌కి ఆయనో నాణ్యమైన ముడిసరుకు అవుతున్నారు ఎప్పటికప్పుడు. -
ఫుల్ జోష్‌లో రాజశేఖర్..!
‘గరుడవేగ’ ఇచ్చిన విజయంతో యాంగ్రీ మెన్ రాజశేఖర్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేశారు. ఈ సినిమా మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తాను ఎంచుకునే కథలపై దృష్టి పెట్టారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి చేస్తున్న రాజశేఖర్.. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్‌తో అంచనాలను పెంచేశారు. తాజాగా మరో చిన్న వీడియోను కమర్షియల్ ట్రైలర్ పేరిట విడుదల చేశారు. ఈ కమర్షియల్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో రాజశేఖర్ ఫుల్ జోష్‌లో నటించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్‌లో వచ్చే.. గీతాప్రభోదం.. అటుపై ఆయన మ్యానరిజంలో చెప్పే డైలాగ్.. చివర్లో ఆయన స్టైల్ డ్యాన్స్‌పై ఫైర్ అవ్వడం.. ఈ ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. మొత్తానికి మరో హిట్ గ్యారెంటీ అన్న ధీమాలో చిత్రబృందం ఉండగా.. సినీ అభిమానుల్లో సైతం ఈ సినిమా పట్ల ఉత్కంఠనెలకొంది. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
‘కల్కి’కి భారీ ఆఫర్స్!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ 40 శాతం ఎక్కువగా ఆఫర్ చేసిన ప్రముఖ నిర్మాత సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మూడు బడా చానల్స్ పోటి పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లాభాలు తెచ్చి పెట్టిన కల్కి, రిలీజ్ తరువాత ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. -
‘కల్కి’ టీజర్ వచ్చేసింది!
‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి. గరుడవేగ సినిమా సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. అందులో భాగం ఈ రోజు టీజర్‌ను రిలీజ్ చేశారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రేపే ‘కల్కి’ టీజర్
‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ సక్సెస్‌ను అందుకున్న యాంగ్రీమెన్ రాజశేఖర్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహించారు. అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మోషన్ పోస్టర్స్‌తోనే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. Now amidst all the chaos.. Kalki teaser will be out tomorrow. Hope you guys will love it. April 10th at 10hr 10min 10sec. #KalkiTeaser @PrasanthVarma @eyrahul @adah_sharma @Nanditasweta @ProducerCKalyan pic.twitter.com/FXhqrcRObk — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 9, 2019 -
‘మా’ అధ్యక్ష బరిలో నరేష్
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల (మార్చి)10న జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 2019-21 ఎన్నికల్లో అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ పోటీ చేయనున్నారు. శనివారం ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నటుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ లో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఎన్నికలు వెళ్తున్నామని చెప్పారు. లక్షల రూపాయలు డొనేట్ చేసే తమ కుటుంబం నుంచి ఒక్కసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది అడగడంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో టర్మ్ అధ్యక్షుడుగా చేద్దామని శివాజీ రాజా అన్నారన్నారు. అందుకే ఈ సారి తాను పోటీకి దిగానని తెలిపారు.కోశాధికారిగా కోటా శంకర్ రావును పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ‘మా’ సరిగా పని చేయడం లేదు : రాజశేఖర్ ‘మా’ అసోసియేషన్ సరిగా పనిచేయడంలేదని ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆరోపించారు. నరేష్ నిజాయితీ మెచ్చే ఈ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నామని చెప్పారు. ప్రేమగా పని చేయడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ‘మా’ లో ఆడవాళ్లకు కీలక పదవులు లేవని జీవిత రాజశేఖర్ విమర్శించారు. ఈసారి స్వతంత్రంగా పోటీ చేద్దామనుకున్నానని, కానీ నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీగా పోటీ చేయమని కోరడంతో అంగీకరించామన్నారు. పనిచేసే వాళ్లకే సభ్యులు ఓట్లు వెయ్యాలని కోరారు. -
అనుబంధాల వాలెంటైన్
ప్రేమంటే.. కేవలం ప్రేమికుల మధ్య ఉండేదేనా? తండ్రీ కూతుళ్ల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాల మాటేమిటి? రకరకాల అనుబంధాల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలకు తెలుగు సినిమాలు పట్టం కట్టాయి. వాటిలోని నటీ నటులు ఆ అనుబంధాల మధ్యనున్న భావోద్వేగాలకు అద్దం పట్టారు. ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి కొన్ని సినిమాల ముచ్చట్లు వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా... అన్నా చెల్లెళ్ల అనురాగం తెలుగు సినిమాల్లో ఎక్కువగా సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఉంటుంది. భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో తమ నటనతో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన నటీనటులు ఎందరో. టాలీవుడ్లో అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల జాబితాలో ‘రక్త సంబంధం’ తొలి స్థానంలో ఉంటుంది. ఆ సినిమా తర్వాత అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ కథలతో ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నాయి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’, చిరంజీవి ‘హిట్లర్’, బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’, ఆర్.నారాయణ మూర్తి ‘ఒరేయ్ రిక్షా’, రాజశేఖర్ ‘గోరింటాకు’, జగపతిబాబు ‘శివరామరాజు’, మహేశ్‌బాబు ‘అర్జున్’, పవన్ కల్యాణ్ ‘అన్నవరం’, జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’... ఇలా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ చిత్రాల్లో నటించి, మెప్పించారు. అలాగే సురేశ్, యమున జంటగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ‘పుట్టింటి పట్టుచీర’ సినిమా మంచి హిట్ అయ్యి, భారీ కలెక్షను రాబట్టింది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాల్లో ‘పుట్టింటికిరా.. చెల్లి’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అర్జున్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అన్నగా అర్జున్, చెల్లిగా మధుమిత తమ నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. అంతలా ప్రేక్షకాదరణ పొందిన ‘పుట్టింటికిరా.. చెల్లి’ కథ ఏమిటో ఓ లుక్కేద్దాం.. ఊహ తెలియక ముందే తండ్రిని, ఊహ వచ్చిన తర్వాత తల్లిని కోల్పోతారు శివన్న (అర్జున్), లక్ష్మి (మధుమిత). అన్నీ తానై బాగా కష్టపడి చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు శివన్న. చెల్లి అంటే శివన్నకు పంచ ప్రాణాలు. అన్న అంటే లక్ష్మికి కూడా అంతే ప్రేమ మరి. ఇద్దరికీ వయసులో మూడేళ్లు తేడా ఉన్నా ఇద్దరి పుట్టినరోజులూ ఒకే రోజు ఉంటాయి. తన క్లాస్మేట్ అజయ్‌తో (శ్రీనాథ్) ప్రేమలో పడుతుంది లక్ష్మి. అక్క (అపూర్వ) కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అజయ్‌ని కోరుతుంది తల్లి. ఇది నచ్చని అజయ్ ఇంటి నుంచి వచ్చేస్తాడు. చెల్లి ప్రేమకు అడ్డు చెప్పకుండా అజయ్‌కి, లక్ష్మికి ఘనంగా పెళ్లి చేస్తాడు శివన్న. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లాక లక్ష్మికి కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలు భర్త నుంచి కాదు, అత్తా ఆడపడుచుల నుంచి. లక్ష్మిపై ఏదో ఒక నింద మోపి అజయ్ చేత లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేయించి నీ కూతుర్ని ఇచ్చి అజయ్‌కి కట్టబెట్టి, ఈ ఇంటికి యజమానురాల్ని చేస్తానని అల్లుడు (సూర్య), కూతురికి (అపూర్వ) మాట ఇస్తుంది తల్లి. డ్రైవర్‌కి, లక్ష్మికి మధ్య వివాహేతర సంబంధం ఉందనే నింద వేసి అజయ్ నమ్మేలా చేస్తారు తల్లి, అక్క, బావలు. అంతేకాదు.. లక్ష్మిని చిత్ర హింసలు పెడుతుంటారు. ఈ నరకం నుంచి మన ఇంటికి వెళ్లిపోదాం రమ్మని లక్ష్మిని కోరతాడు శివన్న. నేను వచ్చేస్తే నాపై పడ్డ నింద చెరిగిపోదు.. నేను నిర్దోషిని అని తేలిన తర్వాతే వస్తానని అన్నతో అంటుంది లక్ష్మి. చెల్లెలు తల్లి కాబోతుందని ఇంటికి తీసుకెళదామని వచ్చిన అన్నను ఆ నింద ఇంకా చెరిగి పోలేదు కదా అని అంటుంది. ఈలోపు అక్క కూతురితో(జ్యోతి) అజయ్‌ని పెళ్లికి ఒప్పిస్తారు తల్లి, అక్క, బావలు కలిసి. పొద్దున్నే అజయ్, జ్యోతి పెళ్లి అనగా ఆ రోజు రాత్రి లక్ష్మికి పురిటి నొప్పులు వస్తాయి. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోని స్టోర్ రూంలో ఉంచుతారు. ఏ డ్రైవర్‌తో అయితే లక్ష్మికి వివాహేతర సంబంధం అంటకట్టారో అదే డ్రైవర్ని పట్టుకుని వచ్చిన శివన్న నిజం ఏంటో అజయ్‌కి చెప్పిస్తాడు. ‘ఇదంతా నాటకమని, నువ్వు నిర్దోషి అని నిరూపించాను.. నీపై పడిన నింద చెరిపేసాను’ రామ్మా ఇంటికి వెళదాం అంటాడు శివన్న. ‘అన్నయ్యా.. నాకు నిద్ర వస్తోంది.. అమ్మ దగ్గరకి వెళ్లిపోతా’ అంటూ అన్న ఒడిలో కన్నుమూస్తుంది లక్ష్మి. ‘ఇంత చేసిన మీరు భూమిపై బతక్కూడదు.. బతకనివ్వను’ అంటూ అజయ్, తల్లి, అక్క, బావ, జ్యోతి, డ్రైవర్లపై కిరోసిన్ పోసి శివన్న తగలబెట్టబోతుండగా పాప అరుపు వినిపిస్తుంది. ‘అన్నా.. చెల్లి ఊపిరి వదులుతూ ఈ పసిబిడ్డకు ప్రాణం పోసింది. అమ్మ పోతూ పోతూ చెల్లిని నీ చేతుల్లో పెట్టింది. చెల్లెమ్మ కనుమూస్తూ ఈ పసిబిడ్డని నీ చేతికి ఇచ్చింది. దేవుడనేవాడుంటే వీళ్లని శిక్షిస్తాడు.. లేకుంటే దేవుడే లేడనుకుందామన్నా.. వీళ్లను చంపి నువ్వు జైలుకెళితే ఈ బిడ్డ అనాథ అవుతుంది. నిన్నే నమ్ముకున్న మేమంతా దిక్కులేని వాళ్లం అయిపోతాం.. పసిబిడ్డ ముఖం చూసైనా ఆవేశ పడొద్దన్నా’’ అని స్నేహితుడు (శివాజీరాజా) చెబుతాడు శివన్నకి. ‘నీ మీద పడ్డ నింద చెరిపి నిన్ను మహారాణిలా పుట్టింటికి తీసుకెళదామనుకున్నా.. కానీ, ఇంత దురదృష్టం ఏ అన్నయ్యకూ రాకూడదు’ అంటూ లక్ష్మి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళతాడు శివన్న. అన్నా చెల్లెళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తాయి. సాటిలేనిది తల్లిప్రేమ ప్రేమ... ఈ మాట వినగానే అందరిలోను ఒకే ఫీలింగ్. ఇదేదో టీనేజ్‌లో ఉన్న ఇద్దరు ఆడ, మగా వ్యవహారం గురించి అనుకుంటారు. కానీ ఇది చాలా చిన్న విషయంలా కనిపించే పెద్ద విషయం. ఓ నిమిషం ఆలోచిద్దాం ప్రేమ గురించి...అది ఎన్ని రకాల బంధాలతో ముడిపడి ఉంటుందో గమనిద్దాం. ప్రేమ...ప్రతిమనిషిలో పుట్టిన క్షణం నుంచి తన తుదిశ్వాస వదిలేదాకా తనకు తానుగా కూడబెట్టుకున్న సంపాదన. దాన్ని పూరి గుడిసెలో ఉన్నవాడికి ఇంత, ఆకాశ హార్మ్యాలు కట్టిన వాడికి ఇంత అనే కొలమానం లేని ఒకే ఒక వస్తువు ప్రేమ. డబ్బు పెట్టి కొందామన్నా ఎక్కడా దొరకదు, కొనటానికి డబ్బు లేదని సరిపెట్టుకుందామన్నా ఉండకుండా ఉండదు. మనం దాన్ని గౌరవించాలే కాని ఎంతకాలమనా మనతోనే ఉంటుంది, ఎంత దూరమైనా మనతో పాటే ప్రయాణిస్తుంది. దానికి గవర్నమెంట్ రిజర్వేషన్లు ఇవ్వనవసరం లేదు. పాస్ మార్కులు అస్సలు అక్కరలేదు. నీకు ప్రేమ ఉందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఎవ్వరూ సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే, అది ఎవరికి వారు వారి వారి మానసిక స్థాయితో ముడిపడి ఉండే సమాధానం కాబట్టి. అందుకే ప్రేమకు పాస్ మార్కులు ఉండవు. ప్రేమ మాత్రమే ఉంటుంది. ఎన్ని ప్రేమలు ఉన్నా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. వెండితెర మీద అమ్మ ప్రేమను అద్భుతంగా కళ్లకు కట్టిన చిత్రం ‘మాతృదేవోభవ’. నిర్మాత కె.యస్ రామారావు.. ‘కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమాలు తీశాను నేను’ అని ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గర్వానికి కారణం ‘మాతృదేవోభవ’ లాంటి కథను ఆయన తీయటమే. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ చిత్రానికి కె. అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ సినిమాలోని పాటలకు ప్రాణం పోసిన వేటూరికి జాతీయ అవార్డు లభించింది. ‘మాతృదేవోభవ’ సినిమా కథ గురించి నాలుగు మాటలు... నాజర్ ఒక లారీడ్రైవర్ , మనిషి చాలా మంచివాడు. ఎంత మంచితనం ఉంటేనేం..? మద్యానికి బానిస.. అతని భార్య మాధవి. పిల్లలకు సంగీత పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ జంటకు నలుగురు పిల్లలు. సినిమాలోని ఫస్ట్‌హాఫ్ అందరి జీవితాల్లోనూ ఎక్కడో ఓ మూల జరుగుతూనే ఉంటుందిలే అనుకోవచ్చు. ఇంటిపెద్ద నాజర్ చనిపోయిన తర్వాత తన నలుగురు పిల్లలతో ఆ ఒంటరి ఇల్లాలు పడే వేదనే మిగిలిన కథ. ఆ కథలో ప్రతి సీన్లోనూ దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంటుంది. తెలుగు సినిమాల్లో శుభం కార్డు పడే సరికి అన్ని సమస్యలూ సర్దుకుపోయి హ్యాపీ ఎండింగ్ ఉంటేనే సినిమా హిట్. ఈ ఫార్ములాతో సంబంధం లేకుండా కథను నమ్మి, కథ వెంటే ప్రయాణం చేసిన తెలుగు సినిమా ‘మాతృదేవోభవ’ కమర్షియల్‌గా పెద్ద విజయమే సాధించింది. భర్త చనిపోయాక బిడ్డలను ఏదోవిధంగా కష్టపడి పెంచుదామనే సరికి తాను క్యాన్సర్ బారిన పడుతుంది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ సినిమా చూసిన ప్రతిఒక్కరికీ ఆ నలుగురు బిడ్డలూ గుర్తుండిపోతారు. తన చావు దగ్గరపడే కొద్దీ ఆ పిల్లల జీవితాలను తీర్చిదిద్దే క్రమంలో ఒక్కో బిడ్డని ఒక్కోచోట దత్తత ఇస్తూ ఆ తల్లి పడే మానసిక వేదన గురించి ఎంత చెప్పిన తక్కువే. మంచిగా ఉన్న ముగ్గురు బిడ్డల్ని మూడు కుటుంబాలకి దత్తత ఇచ్చిన తర్వాత తన వద్ద మిగిలిన నాలుగో అవిటి బిడ్డను తనతో పాటు ఉంచుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ‘రాలిపోయో పువ్వా నీకు రాగాలెందుకే...’ అనే పాట చూస్తే కళ్లలో నీళ్లు తిరగనివారు ఉండరు. ప్రేమకు సాధ్యం కానిదేది? ఈ ప్రేమ.. ఎవరిని ఎప్పుడు తన వలలో బంధిస్తుందో తెలియదు. ఆ ఖైదు కూడా కులాసాగానే తోస్తుందంటుంటారు. అలాగే ప్రేమ, బాధ అవిభక్త కవలలంటారు. అవును బాధ లేనిదే ప్రేమ లేదులే. ప్రేమ ఎవ్వరి మీదైనా కలగొచ్చు. క్షణాల్లో కలిగే ప్రేమ యుగాలైనా మాయదు, మానదు. ప్రేమ, ప్రేమికులు తెలుగు సినిమాకు నిత్య నూతనంసరుకు. ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా. ఈ వస్తువుతో ప్రతీ వారం ఏదో ఓ సినిమా వస్తూనే ఉంది. వస్తూనే ఉంటుంది. ‘లైలా మజ్ను, మరోచరిత్ర, గీతాంజలి’వంటి ఎన్నో గొప్పæ ప్రేమకథా చిత్రాలు మనకున్నాయి. ఆ లిస్ట్‌లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా? కూడా ఓ మంచి ప్రేమ కథ. లండన్‌లో ప్లే బాయ్‌గా పెరిగిన సంతోష్ (సిద్ధార్థ్) చుట్టాల పెళ్లి కోసం ఇండియా వస్తాడు. అక్కడ సిరిని (త్రిష) చూసి ప్రేమలో పడతాడు సంతోష్. ఆకర్షణ కాదు ప్రేమే అని తెలుసుకుని తన కోసం ఎంత వరకైనా వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. లండన్ తిరుగు ప్రయాణం మానేసి ప్రేమ ప్రయాణం మొదలెడతాడు. సిరి కోసం సిరినే పండిస్తానని వాళ్ల అన్నతో సవాలు చేస్తాడు. ప్రేమ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని సిరి వాళ్ల అన్నయ్య కంటే ఎక్కువ పండించడమే కాకుండా, వాళ్ల అన్నయ్య గుండెల్లో తన పట్ల సధాభిప్రాయాన్నీ పండిస్తాడు. ఆలుమగల అనుబంధం భార్యభర్తల అనుబంధం మీద వచ్చిన చిత్రాల్లో ‘సూర్యవంశం’ సినిమా ఒకటి. ఆ సినిమాలో తండ్రి వెంకటేశ్ కొడుకు వెంకటేశ్‌ను అప్రయోజకుడని భావించి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడు. భార్య మీనాతో కలసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఇద్దరూ కలసి తమ జీవితాలను ఎలా చక్కదిద్దుకున్నారన్నది సినిమా కథాంశం. ఈ సినిమాలో భార్యాభర్తల అనుబంధం అనగానే ఈ సినిమాలో ఓ సన్నివేశం గుర్తురాకమానదు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న కాపురం కావడంతో కేవలం నాలుగువేల రూపాయలే ఉంటాయి వెంకటేశ్, మీనా వాళ్ళ దగ్గర. అందులో సగం ఇంట్లో దాచమని ఇచ్చి మార్కెట్‌కు వెళ్తాడు వెంకటేశ్. దార్లో కొత్త చీరలు ఆఫర్లో కనిపిస్తాయి. ఇంట్లో కొంత డబ్బుంది కదా అని భార్య కోసం కొత్త చీర ఖరీదు చేస్తాడు. ఇంటì కొచ్చి దాచిన డబ్బులడిగితే భార్య గుంజీలు తీయడం మొదలెడుతుంది. ఎందుకని అడిగితే ఆ డబ్బులతో తన కోసం ఫ్యాంటు, షర్టు కొన్నానంటుంది. ఆ వార్త విని భర్త కూడా గుంజీలు తీస్తాడు. ఎందుకని అడిగితే డబ్బులతో చీరలు కొన్నాను అంటాడు. అలా ఉంటాయి భార్య భర్తల అనుబంధాలు. ఉన్నదెంతైనా సరే.. ఉన్నదాంట్లో సగం సగం. కూతురంటే తండ్రికి మమకారం కూతురిలో తల్లిని చూసుకోవడమే ఏ తండ్రైనా చేసేది. కూతురి ప్రేమ ముందు ఏదీ పనికి రాదనే తరహా తండ్రులు ఉంటారు. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి తండ్రులను చూశాం. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల ఆధారంగా వచ్చిన చాలా మంచి చిత్రాల్లో ‘ఆకాశమంతా’ ఒకటి. ప్రకాశ్ రాజ్, త్రిష తండ్రీ కూతురిగా నటించారు. తమిళంలో ‘అభియుమ్ నానుమ్’గా వస్తే ‘ఆకాశమంతా’గా అనువాదించారు. కూతురితో తనకున్న అనుబంధాన్ని పార్క్‌లో కలిసిన ఓ మిత్రుడి (జగపతిబాబు)తో ప్రకాశ్ రాజ్ పంచుకోవడమే ఈ సినిమా కథ. రఘురామన్ (ప్రకాశ్ రాజ్) కు కుమార్తె అభి (త్రిష) అంటే ‘ఆకాశమంత’ ప్రేమ. పిల్లలకు ఎగరడం నేర్పడంలో కన్నవాళ్లు ఆనందం వెతుక్కుంటారు. కానీ రెక్కలొచ్చాక వాళ్లు ఎగిరిపోతుంటే బాధపడుతుంటారు. అలా తన కూతురు తనకు ఎక్కడ దూరమౌతుందో అనే తండ్రి ఆవేదనను ప్రకాశ్‌రాజు అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సినిమాలో. అభికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆనందిస్తుంటాడు రఘు. అభి మొదటిసారి నడవడం, సైకిల్ నేర్చుకోవడం, ఒంటరిగా స్కూల్‌కి వెళ్లడం... ఏదీ మిస్ అవ్వకూడదనుకుంటాడు. అభిని జాగ్రత్తగా పెంచాలన్నది రఘు ఆలోచన. ఆ ఆలోచనతోనే కొంచెం అతి ప్రేమను చూపిస్తుంటాడు. సైకిల్ నేర్చుకోవడం వచ్చిన అభి స్కూల్‌కు వెళ్తుంటే ఎక్కడ పడిపోతుందో అని వెనకాలే బైక్ వేసుకెళ్ళేంత అతి ప్రేమ అతనిది. కాలేజ్ చదువు కోసం ఢిల్లీ వెళ్తుందని తెలుసుకొని, కూతురిని ఒంటరిగా పంపించడానికి ఇష్టపడడు. కానీ ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత అభి ఓ వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకుని తట్టుకోలేడు. స్కూల్‌కి ఫస్ట్ డే వెళ్తేనే కన్నీళ్లు పెట్టుకున్న రఘురామ్, అభి పెళ్లి చూసి తట్టుకోగలడా? అని అనుకుంటారంతా. కానీ రఘురామ్ ప్రశాంతంగానే ఉండి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాడు. అభి నా దగ్గర ఉండదంటే నాకు దూరమైనట్టు కాదు కదా? అని జగపతిబాబుకు చెప్పడంతో కథ ముగుస్తుంది. – సినిమా డెస్క్ -
35ఏళ్లు వెనక్కి!
‘పి.ఎస్.వి. గరుడవేగ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నారు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మిస్తున్నారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ‘కల్కి’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఓపెన్ టాప్ జీప్‌లో స్టైల్‌గా కూర్చుని ఉన్న రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటోంది. 1983 నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందట. మరి.. 35 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. అశుతోష్ రానా, నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నేను క్షేమంగా ఉన్నా : హీరో రాజశేఖర్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో పది రోజుల కిందట రాజశేఖర్ గాయపడ్డారు. అయితే చాలా మంది నటీనటులు కాంబినేషన్లో షూటింగ్ ఉండటంతో రెస్ట్ తీసుకోకుండానే ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. కొద్ది రోజుల గ్యాప్ తరువాత ప్రస్తుతం మరో మేజర్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కులుమానాలీ వెళ్లారు. అయితే అక్కడ మరోసారి రాజశేఖర్ ప్రమాధానికి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హీరో రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.‘చిన్న అడ్డంకి కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమైంది అంతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. కులుమనాలీలో జరగబోయే షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాను. నా క్షేమాన్ని కోరుతూ ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశారు. The rumours are little too spiced, here’s what actually happened. Dear media, please don’t attach my old accident pictures to the recent news.😊 pic.twitter.com/NUImzNcvhB — Dr.Rajasekhar (@ActorRajasekhar) 22 November 2018 -
రిస్కీ స్టంట్స్ చేస్తున్న సీనియర్ హీరో
చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో ప్రయోగం చేస్తున్నారు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారట. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
అదా సంగతి
‘గరుడవేగ’ వంటి హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా నటించనున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అదా శర్మ నటించనున్నారు. 2016లో విడుదలైన ‘క్షణం’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు అదా. తాజాగా రాజశేఖర్‌తో నటించే చాన్స్ అందుకున్నారామె. నిజానికి హీరోయిన్ల లిస్టులో పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా అదా శర్మను ఖరారు చేశారు. ఈ పాత్రకు ఆమె అయితే కరెక్టుగా సరిపోతారని చిత్రవర్గాలు భావించి, అదాను సంప్రదించగా వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మించనున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో 1983 నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నందితా శ్వేత ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్ ప్రత్యేక పాటతో అలరించనున్నారు. నవంబర్ 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
‘కల్కి’కి జోడిగా అదా, స్కార్లెట్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు గ్యాప్ తీసుకున్నాడు. అ! సినిమాతో దర్శకుడు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు రాజశేఖర్. కల్కి పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో రాజశేఖర్‌కు జోడిగా ఇద్దరు అందాల భామలు కనిపించనున్నారట. తెలుగు హార్ట్ ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ తో పాటు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న స్కార్లెట్ విల్సన్ లు హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ సినిమాతో రాజశేఖర్ తన ఫాంను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. -
ఒక అమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు
సూర్య, మనీష్ హీరోలుగా, స్నేహ హీరోయిన్గా ఎల్.వి. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్షిప్ వెర్సస్ లవ్’. లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో నయన్ షా ఫిలిమ్స్ పతాకంపై గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఎల్.వి.రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధించారు? అనే నేపథ్యంలో రూపొందిన మా చిత్రం యువతరం ప్రేక్షకులతో పాటు అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమ కథా చిత్రమిది’’ అన్నారు గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్. -
మిసెస్ మామ్
-
‘అ!’ అనిపించేలా ‘కల్కి’
నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం దట్ ఈజ్ మహాలక్ష్మీ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైటిల్ లోగోను రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం రిలీజ్ చేశారు. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
ప్రీ లుక్‌తో మెగాస్టార్‌కి బర్త్‌డే విషెస్
యాంగ్రీ హీరో రాజశేఖర్.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రీ లుక్ ఆసక్తికరంగా రూపొందించారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో సినిమా తెరకెక్కనుంది. రాజశేఖర్ సినిమా ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ పోస్టర్‌తో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే ఏడాది ఇండియా క్రికెట్లో వరల్డ్‌కప్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌ను కూడా ఈ పోస్టర్లో చూపించారు. అ! లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ సినిమా చేస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ 26న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. Wishing u all a very Happy Bakrid. Here I’m releasing the pre-look of my next with the ‘awe’some @prasanthvarma. Launching the title logo on August 26th with all the other details. Chiranjeevi Garu,Many Many Happy Returns Of The Day!😊#HBDMegastarChiranjeevi From My Team & Me. pic.twitter.com/xLUTrEpuEn — Dr.Rajasekhar (@ActorRajasekhar) 22 August 2018 -
రాజశేఖర్ ‘అ’సమ్!
సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చాలా రోజులుగా రాజశేఖర్ చేయబోయే సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తాను చేయబోయే సినిమాపై ఈ యాంగ్రీ హీరో ఓ హింట్ ఇచ్చారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను చెప్పగలిగింది ఒక్కటే. ఆ సినిమా ఆసమ్ (AWEsome) గా ఉండబోతోంది’. అంటూ తన ట్విటర్ పేజ్‌లో కామెంట్ చేశారు. దీంతో రాజశేఖర్ తదుపరి చిత్రం అ! (Awe) చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వర్మ ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్ తెరకెక్కుతున్న క్వీన్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజశేఖర్ సినిమా పనులు ప్రారంభించనున్నారు. Well.. all I can say about my next project is that, it’s going to be AWEsome! — Dr.Rajasekhar (@ActorRajasekhar) 28 June 2018 -
గరుడవేగ దర్శకుడితో తమిళ హీరో
రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ గరుడవేగ. చాలా కాలం తరువాత రాజశేఖర్ కు సక్సెస్ అంధించిన ఈ సినిమాతో దర్శకుడు ప్రవీన్ సత్తారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. గరుడవేగ సక్సెస్తరువాత చాలా మంది హీరో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వచ్చారు. అయితే ప్రవీణ్ సత్తారు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రామ్ హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావించాడు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళ స్టార్ మీరో ధనుష్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ప్రవీణ్ సత్తారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఈ సినిమా ధనుష్ తో అయితే మార్కెట్ పరంగా ఎలాంటి రిస్క్ ఉండదని భావిస్తున్నాడట. ఇప్పటికే ధనుష్‌కు కథ కూడా వినిపించాడని.. సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది. -
విలన్‌గా మారనున్న యాంగ్రీ హీరో
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు యాంగ్రీ హీరో. కేవలం హీరోగానే కాకుండా కీలకమైన పాత్రల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు. గతంలో ధృవ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటించాల్సి ఉన్న అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించేందుకు రాజశేఖర్ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవల ప్రారంభించారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారట. తనకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన ప్రవీణ్ కోరటంతో రాజశేఖర్ ప్రతినాయక పాత్రకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలలో చిత్రీకరించనున్నారు. -
ఐశ్వర్య డైరెక్షన్లో రాజశేఖర్!
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమయిన యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్ కెరీర్ మళ్లీ ‘గరుడవేగ’తో ఊపందుకుంది. దీంతో ఆయన మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను అంగీకరించిన సినిమాలు అన్నీ కొత్త కథలే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా కెరీర్‌ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు ఐశ్వర్య ధనుష్. ఇటీవలే రాజశేఖర్‌ను కలిసి సినిమా కథను వినిపించారని, ద్విభాష చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రవీణ్ సత్తారుతో, ‘అ!’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్వర్మతో కూడా రాజశేఖర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. వీటన్నింటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. -
అ! దర్శకుడితో రాజశేఖర్
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న యాంగ్రీ హీరో త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారట. కొత్త సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అ! సినిమాతో పరిచయం అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ యువ దర్శకుడు రాజశేఖర్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు కల్కి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జూన్ లేదా జూలై మాసాల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ మహిళా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమా, మరో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ వరుస సినిమాలతో రాజశేఖర్ తిరిగి ఘన వైభవాన్ని అందుకుంటాడేమో చూడాలి. -
గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ నటించిన ‘పీయస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగింది? గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్ పేర్కొన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం. -
నాన్నే నిజమైన హీరో !
సినీరంగంలో మా నాన్నే నా హీరో అని అంటోంది రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని. వైద్యవిద్య చదువుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా పరిచయం కానుంది. ఇప్పటికే 2స్టేట్స్ హిందీ చిత్ర తెలుగు రీమేక్‌లో నటించడానికి ఎంపికైన శివాని త్వరలో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా శివాని ఏమంటుందో చూద్దాం. ‘నా తండ్రి రాజశేఖరే నాకు నటనలో స్ఫూర్తి. ఆయన డాక్టరు వృత్తిని వదిలి పెట్టకుండానే నటనను కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద వైద్యం చేయించుకునేవారు ఆయన్ని మ్యాజిక్మ్యాన్ అంటుంటారు. నాకు నచ్చిన రంగాలు రెండు. ఒకటి వైద్యం, రెండు నటన. నేను మంచి డాక్టరుగా, నటిగా అవుతాననే నమ్మకం ఉంది. కుటుంబం, స్నేహితుల ముందు నటిస్తున్నానని భావించు. అప్పుడే కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నటించగలవు అని నాన్న చెప్పారు. ఆయన మాటల్ని పాఠిస్తున్నాను. నేను కూచిపూడి, కథకళి డాన్స్ నేర్చుకుంటున్నాను. కిక్‌బాక్సింగ్ విద్యలోనూ శిక్షణ పొందుతున్నాను. చిత్రాల్లో గాయనిగానూ పేరు తెచ్చువాలన్న ఆశ ఉంది. అందుకే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నాన్నే నా సినీ ప్రపంచ హీరో. నేను మా అమ్మలా ఉన్నానంటే సంతోషమే. ఈ తరం హీరోయిన్లలో నటి సమంత నచ్చిన నాయకి’. అని తన అభిరుచులు, అభిప్రాయాలు తెలిపారు. -
రాజమౌళి మల్టీ స్టారర్లో మరో ‘ఆర్’
దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి లాంటి విజువల్ వండర్ తరువాత ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటనను వినూత్నం చేశారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పేర్లలోని ‘ఆర్ ఆర్ ఆర్’ అనే లోగోను రివీల్ చేశారు. తాజాగా ఈసినిమాలో మరో ఆర్ వచ్చిన చేరిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ హీరో రాజశేఖర్ నటించనున్నారట. గతంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమాలోనే రాజశేఖర్ విలన్ గా నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఇటీవల గరుడవేగ సినిమాతో హీరోగా సూపర్ హిట్ సాధించిన రాజశేఖర్, రాజమౌళి దర్శకత్వంలో విలన్‌గా నటించేందుకు అంగీకరించారట. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
నటన మాత్రం అస్సలు నేర్చుకోలేదు
సాక్షి, సినిమా : సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ టూ కంట్రీస్ రీమేక్‌లో అడివి శేష్ సరసన ఆమె నటించబోతోంది. అయితే నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆమె సిద్ధమైపోతుండటం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు తమ తమ వారసులను నటనతోపాటు మిగతా వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, శివానీ మాత్రం కేవలం డాన్సుల్లో మాత్రమే శిక్షణ తీసుకుందంట. బెల్లీ డాన్సులు, కథక్‌లో ఆమె ప్రావీణ్యం సంపాదించేసుకుంది. మరి నటనలో ఎందుకు శిక్షణ తీసుకోలేదని ఆమె ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? తన పేరెంట్స్ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే నటనలో రాణించి స్టార్లు అయ్యారని.. చిన్నప్పటి నుంచి వారినే చూస్తూ పెరిగా కాబట్టి తనకు ఆ అవసరం లేదు అని ఆమె చెబుతోంది. మరి జీవితా-రాజశేఖర్ లాగే ఆమె కూడా సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకుంటుందేమో! చూద్దాం. -
'అందరూ నన్ను వెక్కిరించేవారు'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం(డిసెంబర్ 3) సందర్భంగా శనివారం నక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం అవగాహన సదస్సు, వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హీరో రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' నేను వికలాంగుడినే.. నాకు నత్తి ఉండేది.. మా నాన్న పేరు సరిగ్గా పలకడం వచ్చేది కాదు. అందరూ హేళన చేసేవారు. అయినా పట్టుదలతో డాక్టర్ అయ్యాను.. ఆ తర్వాత మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాను. మనం అంతా సమానం అనే భావన ఉండాలి. దివ్యాంగులు నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ముందుకు వెళ్లాలి. నా జీవితాంతం వికలాంగుల కోసం సహాయ పడుతా' అని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ చిన్నారి పేరు రాజశేఖర్..
రాయచోటి రూరల్: దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్ దంపతులు తమ ఏడాది చంటి పిల్లాడిని తీసుకొని జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరగా, నాన్న పేరు పెడదామని అన్నారు. ఆ చిన్నారికి రాజశేఖర్ అని జగన్ నామకరణం చేశారు. దీంతో ఆ దంపతులు, కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు. -
ఆ సినిమా అద్భుతం : మహేష్ బాబు
సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడ వేగ. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది. చాలా కాలం తరువాత ఓ సూపర్ హిట్ తో అలరించిన హీరో రాజశేఖర్‌కి సినీ ప్రముకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా గరుడ వేగ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. ‘గొప్ప స్క్రిప్ట్, మంచి నటన, పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే. పీవీయస్ గరుడ వేగ అద్బుతం. హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు లకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. రాజశేఖర్ ఎన్ఐఏ ఏజెంట్ గా నటించిన గరుడ వేగ సినిమా తొలి వారంలోనే 15 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సత్తా చాటింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ సరసన పూజ కుమార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అదిత్ అరుణ్, శ్రద్ధా దాస్, కిశోర్, చరణ్‌దీప్, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Great script... Good performances... Slick screenplay... #PSVGarudaVega is stunning... Amazing work by the entire team. Take a bow @ActorRajasekhar & director @PraveenSattaru ! — Mahesh Babu (@urstrulyMahesh) 11 November 2017 -
త్వరలో జీవితతో సినిమా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): త్వరలో ఓ కుటుంబ కథా చిత్రం చేస్తామని, అందులో నా సహనటిగా జీవిత నటిస్తారని హీరో డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇటీవల విడుదలైన గరుడవేగ చిత్రం విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రను చేపట్టింది. ఏలూరులో చిత్రం ప్రదర్శితమవుతున్న అంబికా డీలక్స్ థియేటర్‌ను శుక్రవారం మధ్యాహ్నం సందర్శించిన బృందం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చిత్ర హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మిక, సహనటుడు చరణ్‌రాజ్ ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ చాలా ఏళ్ల తరువాత తాను నటించిన గరుడవేగ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత, దర్శకురాలు జీవిత మాట్లాడుతూ ప్రేక్షకులను కలవడం సంతోషంగా ఉందన్నారు. యూఎస్‌లో 120 థియేటర్లలో ఇక్కడి కంటే ముందే చిత్రం విడుదలైందని, అక్కడ హిట్ టాక్‌ను సొంతం చేసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు, సురేష్ మూవీస్ మేనేజర్ నాగార్జున, టీడీపీ నాయకులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చిత్ర బృందంతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. -
రాజశేఖర్ నా కూతుర్ని కాపాడారు : సునీల్
గరుడ వేగ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మూవీ టీం ప్రస్తుతం సక్సెస్‌ను ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తమ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు. తాజాగా క్రిస్టమస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్లో హీరో సునీల్‌తో పాటు గరుడ వేగ టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ ఆసక్తిరమైన విషయాన్ని వెల్లడించారు. గరుడ వేగ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన సునీల్. గతంలో తన కూతురికి ఆరోగ్యం బాగోలేని సమయంలో రాజశేఖర్ వైద్యం చేసి కాపాడారన్నారు. అందుకే సినీ హీరోగానే కాక వ్యక్తిగతంగానూ ఆయనంటే నాకు ఎంతో అభిమానమన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ కుమార్, శ్రద్దాదాస్, కిశోర్, చరణ్ దీప్, రవివర్మలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చాలాకాలం తరువాత రాజశేఖర్‌కు దక్కిన విజయం కావటంతో యూనిట్ సభ్యులు ఈ సక్సెస్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. -
జీవిత ఇచ్చిన గిఫ్ట్ గరుడవేగ – రాజశేఖర్
‘‘గరుడవేగ’ సినిమా కథని ప్రవీణ్‌గారు ఏ ముహూర్తంలో రాశారో కానీ, నా కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘అంకుశం’ కంటే ఈ చిత్రం పెద్ద సక్సెస్. అందుకు ప్రవీణ్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ ఇటీవల విడుదలై హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘జీవిత వల్లనే ‘గరుడవేగ’ పూర్తయింది. తను ఈ సినిమాను నాకు గిఫ్ట్‌లా ఇచ్చారని చెప్పొచ్చు. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ విడుదలైన తొలి ఆట నుంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అదే రోజు సాయంత్రానికి సక్సెస్ రేంజ్ మాకు అర్థమైపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉందని కొందరు, సరికొత్త రాజశేఖర్‌ని చూశామని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమదిగా భావించారు. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అమెరికాలోనూ వసూళ్లు ఇక్కడిలాగా బాగున్నాయి’’ అన్నారు. ‘‘మానవత్వం చాలా తక్కువమందిలో ఉంటుంది. అటువంటి వారిలో ప్రవీణ్ ఒక్కరు. తనకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. బాలకృష్ణగారు, రానా, తాప్సీ, కాజల్, మంచు లక్ష్మి ప్రమోషన్‌కి సహకరించారు. చిరంజీవిగారు, మహేశ్‌గారు, రాజమౌళిగారితో పాటు ఇండస్ట్రీ అంతా సినిమా హిట్ అయినందుకు అభినందించారు. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు జీవిత. -
జక్కన్న ట్వీట్‌తో మరింత హ్యాపీ
సీనియర్ హీరో రాజశేఖర్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్‌ను గరుడ వేగ సినిమాతో అందుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గరుడ వేగ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో యాంగ్రీ హీరో సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు చిత్రయూనిట్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో రాజశేఖర్‌తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు సరదాగా డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. రాజశేఖర్ ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్, అదిత్ అరుణ్, శ్రద్ధాదాస్, కిశోర్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ రావటంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్లకు ఎలాంటి డోకా లేదు. అయితే గరుడ వేగ టాక్‌పై స్పందించిన రాజమౌళి ఆదివారం సినిమా చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలిపారు. అంటే ఆదివారం రాజమౌళి గరుడ వేగ సినిమాపై తన మార్క్ రివ్యూ ఇస్తే సోమవారం కలక్షన్లు ఊపందుకునే అవకాశం ఉంది. Congratulations team PSV Garuda Vega.. Film carrying quite a positive buzz.. Booked our tickets for Sunday.. — rajamouli ss (@ssrajamouli) 3 November 2017 -
'పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్'
టైటిల్ : పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, పూజా కుమార్, కిశోర్, అదిత్ అరుణ్, నాజర్, పోసాని కృష్ణమురళీ సంగీతం : శ్రీచరణ్ పాకల, భీమ్స్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు నిర్మాత : ఎమ్. కోటేశ్వర రాజు, మురళీ శ్రీనివాస్ చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పీయస్వీ గరుడ వేగ 126.18ఎమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గరుడ వేగను తెరకెక్కించారు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రాజశేఖర్ సక్సెస్ సాధించారా..?(సాక్షి రివ్యూస్) తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రాన్ని డీల్ చేసి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏమేరకు ఆకట్టుకున్నారు. కథ : చంద్రశేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అసిస్టెంట్ కమిషనర్. తన ఉద్యోగం సంగతి భార్యతో కూడా చెప్పుకోలేని శేఖర్, తన మిషన్స్ కారణంగా తరుచు భార్య స్వాతి(పూజా కుమార్)తో గొడవ పడుతుంటాడు. ఇక ఉద్యోగం వద్దు అనుకొని రాజీనామ చేసే సమయంలో ఓ కేసు శేఖర్ దగ్గరకు వస్తుంది. నిరంజన్ (అదిత్ అరుణ్) తన దగ్గర ఉన్న ఓ ఇన్ఫర్మేషన్ను ప్రతిపక్షనాయకుడు ప్రతాప్ రెడ్డి(పోసాని కృష్ణమురళీ)కి బేరం పెడతాడు. పది కోట్లకు ఆ ఇన్ఫర్మెషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్న నిరంజన్ చివరి నిమిషంలో శేఖర్‌కి దొరికిపోతాడు. కానీ ఎన్ఐఏ కస్టడీలో ఉండగానే నిరంజన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ శత్రువు చేతికి వెళ్లిపోతుంది.(సాక్షి రివ్యూస్) అసలు నిరంజన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి..? ఆ సమాచారంతో ప్రతాప్ రెడ్డి పనేంటి..? అనుకున్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ప్రతాప్‌రెడ్డికి చేరిందా..? ఈ మిషన్ తో క్రిమినల్ జార్జ్ కు సంబంధం ఏంటి..? నటీనటులు : తనకు బాగా అలవాటైన పోలీస్రోల్లో రాజశేఖర్ మరోసారి అద్భుతంగా నటించి మెప్పించారు. గతంలో పోలీస్రోల్స్తో ఆకట్టుకున్న రాజశేఖర్ సరైన పాత్ర దొరికితే మరోసారి సత్తా చాటగలనని నిరూపించుకున్నారు. హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. రాజశేఖర్ టీం మెంబర్స్ గా చరణ్ దీప్, రవివర్మలు తమ పాత్రకు న్యాయం చేశారు. పోసాని కృష్ణమురళీ రాజకీయనాయకుడి పాత్రలో మరోసారి అలరించగా, అలీ, 30 ఇయర్స్ పృధ్వీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కీలక పాత్రలో నటించిన అదిత్ అరుణ్ ఈ సినిమాతో మంచి మార్కులు సాధించాడు. గత చిత్రాల్లో లవర్ బాయ్ లుక్స్‌లో కనిపించిన అదిత్ ఈ సినిమాతో డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.(సాక్షి రివ్యూస్) విలన్ పాత్రలో నటించిన కిశోర్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రల్లో శ్రద్దాదాస్, షియాజీ షిండే, శత్రులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రాజశేఖర్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించే బాధ్యతను తీసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు అనుకున్న విజయం సాధించారు. యాక్షన్ థ్రిల్లర్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ కథను రెడీ చేసుకున్న దర్శకుడు అదే స్థాయి టేకింగ్ తో అలరించాడు. పూర్తిగా టెక్నాలజీ, మైండ్ గేమ్ కు సంబందించిన అంశాలతో కథను నడిచిన ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్ సాధించారు. అయితే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కథ స్లో అయినట్టుగా అనిపించినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, అన్నింటినీ కవర్ చేసేస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ సంగీతం. భీమ్స్ కంపోజ్‌చేసిన రెండు పాటలు బాగున్నాయి.(సాక్షి రివ్యూస్) శ్రీచరణ పాకల అందించిన నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫి సినిమా మూడ్ ను క్యారీ చేసేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, నైట్ ఎఫెక్ట్ లో తీసిన సీన్స్ సూపర్బ్‌గా వచ్చాయి. సన్నిలియోన్ స్పెషల్‌సాంగ్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాజశేఖర్ నటన కథా కథనం నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే మసాలా ఎలిమెంట్స్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అమ్మానాన్నలకు ప్రామిస్ చేశా!
‘నేను ఫస్ట్ టైమ్ నా సినిమా చూస్తే... అందులో నేను చేసిన తప్పులే కనిపిస్తాయి. మూడు, నాలుగుసార్లు చూస్తే సినిమా అర్థమవుతుంది. కానీ, ఈ సిన్మా ఫస్ట్ కాపీ చూశా. బాగుంది. ‘డై హార్డ్, బార్న్ ఐడెంటిటీ, లీథల్ వెపన్’ వంటి ఇంగ్లీష్ సిన్మాల తరహాలో ఉంటుంది’’ అన్నారు రాజశేఖర్. ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ చెప్పిన సంగతులు... దేశం కోసం ఓ ఎన్ఐఏ ఆఫీసర్ ఏం చేశాడనేది చిత్రకథ. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశానని ప్రవీణ్ చెప్పినప్పుడు పెద్ద అవార్డు వచ్చినట్టు ఫీలయ్యా. బౌండ్ స్క్రిప్ట్‌తో, పర్ఫెక్ట్ప్లానింగ్తో 90 రోజుల్లో సినిమా తీశాడు. యాక్షన్ ఫిల్మ్ అయినా... వృత్తిపర, వ్యక్తిగత జీవితాల మధ్య ఎన్ఐఏ ఆఫీసర్ పడే సంఘర్షణను మంచి వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు.నా గత సినిమాలకు భిన్నంగా తక్కువ మాటలు, ఎక్కువ యాక్షన్‌తో... కమర్షియల్ హంగులతో సినిమా ఉంటుంది. నేనయితే కథ మొత్తం చెప్పేసేవాణ్ణి (నవ్వుతూ). మా దర్శకుడుఇంతకు మించి చెప్పొద్దన్నారు. థియేటర్లో చూస్తే మీకు మంచి ఫీల్ కలుగుతుంది.ఎన్ఐఏ ఆఫీసర్ కదా! మంచి ఫిట్నెస్తో కనిపించాలని ముందు వర్కౌట్స్ గట్రా చేశా. షూటింగుకి సరిగ్గా నెల రోజుల ముందు ప్రతిరోజూ ఛాతీలో నొప్పి వచ్చేది. హాస్పిటల్‌కి వెళితే.. ‘హార్ట్ఎటాక్’ అన్నారు. స్టెంట్ వేశారు. మినిమమ్ సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు. దాంతో అనుకున్న టైమ్ కంటే పది రోజులు లేటుగా షూటింగ్ స్టార్ట్ చేశా. ఇంకా రెస్ట్ తీసుకుంటే మిగతాఆర్టిస్టుల డేట్స్ డిస్ట్రబ్ అవుతాయి. అది నాకిష్టం లేదు. దేవుడి దయవల్ల షూటింగ్ హ్యాపీగా జరిగింది. ‘రాజశేఖర్... నీకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది’ అని షూటింగులో నాజర్‌గారు అన్నారు. టీజర్, ట్రైలర్స్ చూసిన చాలామంది అభిప్రాయమిదే. కానీ, ఈ సినిమా ప్రారంభానికి ముందు నామార్కెట్ బాగోలేదు. సొంతంగా సినిమాలు నిర్మించి బోలెడు డబ్బులు పోగొట్టుకున్నా. అప్పుడు మా అమ్మ బాధపడ్డారు. నేను ఏమవుతానోనని ఆందోళన పడితే... ఇకపై సినిమాలునిర్మించనని అమ్మానాన్నలకు ప్రామిస్ చేశా. ప్రవీణ్ ఆరేడు కోట్లు బడ్జెట్ అవుతుందన్నారు. అప్పుడు నాన్నగారి స్నేహితుడు కోటేశ్వర్రాజుగారు గుర్తొచ్చారు. ఆయన నాతో సినిమాచేయాలనుకుంటున్నారని ఎప్పట్నుంచో నాన్న చెబుతుంటే... నా డిప్రెషన్ పోగొట్టడానికి చెబుతున్నారనుకున్నా. కానీ, కథ విని 25 కోట్లు ఖర్చు చేశారు.చిరంజీవిగారిని ప్రీమియర్ షోకి ఆహ్వానించడానికి వెళితే.. ‘మా ఆఫీసులో మీ ట్రైలర్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. పెద్ద హిట్టవుతుంది’ అన్నారు. ప్రచార చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ అదే మాట చెబుతున్నారు. ‘గరుడవేగ’ హిట్టయితే... సక్సెస్ క్రెడిట్ అంతా నాన్న, ప్రవీణ్, కోటేశ్వర్‌రాజు, జీవితలకు చెందుతుంది. షూటింగులో ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురైనా.. జీవిత చక్కగా హ్యాండిల్ చేసింది. ఓ రకంగా జీవిత నాకిస్తున్న బహుమతి ఇది. రామ్‌చరణ్ ‘ధృవ’లో అరవింద్‌స్వామి చేసినటువంటి విలన్ రోల్స్ వస్తే నటిస్తా. అంతే కానీ... జస్ట్.. విలన్ ఫర్ విలన్ రోల్స్ వస్తే చేయను. -
సన్నీ సందడి చేయనుంది..!
యంగ్రీ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడవేగ. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న రాజశేఖర్ తో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ యాంగ్రీ హీరో. అంతేకాదు రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను నవంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ శేఖర్ సరసన పూజాకుమార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యంగ్ హీరో అదిత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రచార కార్యక్రమాల్లో కూడా వేగం పెంచారు. ఇప్పటికే పలు టీవీ షోలలో ప్రైవేట్ కార్యక్రమాల్లో సందడి చేస్తున్న చిత్రయూనిట్, శుక్రవారం భారీ ఆడియో రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సన్నిలియోన్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుందన్న టాక్ కొద్ది రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని సన్నీలియోన్ కూడా కన్ఫమ్ చేసేసింది. తాను 27న హైదరాబాద్ వస్తున్నానంటూ వీడియో మేసేజ్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన సన్నీ.. ఎవ్వరూ మిస్ అవ్వొద్దూ అందరూ వచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
►భార్యను చంపిన భర్త ►నిందితుడు హోంగార్డు ►వీరికి నలుగురు సంతానం కడప అర్బన్ /సిద్దవటం : హోంగార్డు తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలి బంధువులు, సిద్దవటం ఎస్ఐ బి.అరుణ్‌రెడ్డి తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం భాకరాపేటలో నివసిస్తున్న దర్బార్, రెడ్డెమ్మ కుమారుడు రాజశేఖర్ హోంగార్డు(డ్రైవర్)గా జీవనం సాగిస్తున్నాడు. సుండుపల్లి మండలం బండకాడ ఈడిగపల్లెకు చెందిన రామకృష్ణ, వెంకటశేషమ్మ మొదటి కుమార్తె ఆదిలక్ష్మి (26)ని రాజశేఖర్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి, తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం కలిగారు. ముగ్గురు కుమార్తెలు శ్రీచరిత (7), సుదేష్ణ (5), నిషిత(3), కుమారుడు సిద్దార్థ (6 నెలలు) ఉన్నారు. వీరింట్లో రాజశేఖర్ నానమ్మ లక్ష్మీనరసమ్మ ఉంటూ పిల్లలను చూసుకునేది. ఆయన తల్లిదండ్రులు దర్బార్, రెడ్డెమ్మ కుటుంబ జీవనాధారం కోసం కువైట్‌లో ఉన్నారు. మద్యానికి బానిసై రాజశేఖర్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ తాగి ఇంటికి వచ్చే వాడు. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఆరు నెలల క్రితం భార్యను, నానమ్మ లక్ష్మీనరసమ్మను చితకబాదాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. భార్య, నానమ్మ పోలీస్ అధికారులకు విన్నవించడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య,భర్తల మధ్య గొడవ జరిగింది. తన జల్సాలకు ఆమె అడ్డుగా వస్తోందని భావించాడు. అతను బలంగా కొట్టాడు. చివరకు గోడకు నెట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. ఎక్కువ రక్తస్రావం కావడంతో చనిపోయింది. తర్వాత రక్తం అంతా శుభ్రం చేసి తన టీషర్టును, లోయర్‌ను తొడిగాడు. బంధువులకు మాత్రం తన భార్య చనిపోయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. చివరకు తన భార్య శరీరంపై ఉన్న బంగారు చైన్, కమ్మలు, ఉంగరాన్ని సైతం తీసుకున్నాడని నానమ్మ ఆరోపించారు. రిమ్స్‌లో మృతదేహానికి సిద్దవటం ఎస్ఐ అరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి పోస్టుమార్టం నిర్వహింపజేశారు. మృతురాలి తల్లి వెంకట శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నా కుమార్తెను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. పిల్లల ముఖం కూడా చూడకుండా ఇలా ప్రవర్తించాడు. ఆ బిడ్డలను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు. వారి పరిస్థితి ఏమిటి? బంగారు ఆభరణాలను కూడా తీసేసుకున్నాడు. – మృతురాలి తల్లి వెంకట శేషమ్మ -
రక్షకతడుల్లో నిర్లక్ష్యం వద్దు
– రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు – వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: నిర్లక్ష్యానికి తావులేకుండా రక్షకతడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయశాఖ, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ రక్షకతడిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకదృష్టి సారించినందున ఒక్క ఎకరా కూడా వేరుశనగ పంటను ఎండనివ్వకుండా కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ, ఎంఐ కంపెనీలు సమన్వయం చేసుకుని పనిచేస్తే ఫలితం ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు ఉంటాయని, అందుకోసం రూ.50 కోట్ల బడ్జెట్‌తో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల పద్ధతితో పాటు రైతుల సాయంతో రెయిన్గన్ల ద్వారా నీటి తడులు ఇచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. అందుకోసం కైజాల, వాట్సప్ తదితర యాప్‌లు వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి 5 మండలాల్లో వేరుశనగ పంట బెట్ట పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోందన్నారు. మున్ముందు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికపుడు పక్కా వివరాలు నమోదు చేసుకుని పని చేయాలని ఆదేశించారు. కాల్‌సెంటర్, కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ టి.రమామణి, జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, కమిషనరేట్ జేడీఏ హరిబాబుచౌదరి, ఆత్మ పీడీ పి.నాగన్న, డీడీఏలు చంద్రనాయక్, శ్రీనివాసరావు, ఏడీఏ (పీపీ) విద్యావతి, డివిజన్ ఏడీఏలు, టెక్నికల్ ఏవోలు, డ్రిప్ కంపెనీ డీసీఓలు పాల్గొన్నారు. -
ఒకే సినిమాతో స్టార్ వారసుల ఎంట్రీ..?
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటుడు రాజశేఖర్. ఇటీవల సక్సెస్ లేక కష్టాల్లో పడ్డ ఈ యాంగ్రీ హీరో తన వారసురాలిగా కూతురు శివానీని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఫోటో షూట్ లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివాని, సరైన లాంచింగ్ కోసం ఎదురుచూస్తుంది. తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతోంది. తాజాగా శివాని తొలి చిత్ర హీరోకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించటంతో పాటు జాతీయ అవార్డును సైతం అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
ఇప్పుడు 25 కోట్లు... తర్వాత 2 కోట్లైనా ఓకే!
‘‘కథను బట్టే బడ్జెట్ ఉంటుంది. ఈ సిన్మాను పాతిక కోట్లతో తీశామని... నా తర్వాతి సినిమాను అంత కంటే ఎక్కువ బడ్జెట్‌తో తీయాలనుకోను. కథకు రెండు కోట్లు చాలనుకుంటే... రెండు కోట్లలోనే తీస్తా’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ సినిమా గురించి ప్రవీణ్ చెప్పిన విశేషాలు... ⇒ జీవితాగారు ఓ రోజు ఫోన్ చేసి రాజశేఖర్‌గారికి ఏదైనా కథ ఉంటే చెప్పమన్నారు. హాలీవుడ్ హిట్ ‘డై హార్డ్’ టైప్ కథ చెప్పా. నేను తీసిన గత రెండు సినిమాలు ‘చందమామ కథలు, గుంటూరు టాకీస్’ కంటే డిఫరెంట్ జానర్ సిన్మా. భారీ స్కేల్ ఉన్న సిన్మా, భారీ బడ్జెట్ కావాలి. బహుశా... వేరే నిర్మాతలైతే అంతకు ముందు ఏం తీశావమ్మా? అనడిగేవారేమో! ఎం. కోటేశ్వరరాజుగారు, హీరోగారు కథను, నన్ను నమ్మారు. ⇒ రాజశేఖర్‌గారి ‘మగాడు’ సినిమాకు, అందులో ఆయన యాక్టింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్. ఇందులో ఆయనది అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రే. ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఎన్ఐఏ) ఆఫీసర్‌గా చేశారు. షూటింగ్ ఫినిష్ చేశాం. తాను తప్ప వేరేవాళ్లు చేయలేరన్నంతగా రాజశేఖర్‌గారు నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సిన్మా ఇది. స్టోరీ, యాక్షన్ సీక్వెన్లు చాలా కొత్తగా ఉంటాయి. ⇒ ఈ సినిమాకు ముందు రాజశేఖర్‌గారి మార్కెట్ ఎంతని ఆలోచించలేదు. ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే... కొత్తవాళ్లతో రెండు కోట్లలో తీసిన సినిమా 20 కోట్లు వసూలు చేసింది. పదేళ్లుగా ఇల్లు–టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకులను ‘బాహుబలి’ థియేటర్లకు రప్పించింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆకాశమే హద్దుగా వసూళ్లు వస్తున్నాయి. హీరో స్లంపులో ఉన్నాడనేది మేటర్ కాదు. అదే... ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. బాగోకపోతే రెండో రోజు కలెక్షన్స్ ఉండవు. ⇒ సన్నీ లియోన్‌తో ఐటమ్ సాంగ్ చేయించాలనేది నిర్మాత ఐడియా. భీమ్స్ మంచి బీటున్న సాంగ్ చేశారు. ఆడియన్స్‌ను సన్నీ సాంగ్ బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. బట్, రిలీజైన తర్వాత సిన్మాలో కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకముంది. పూజాకుమార్, శ్రద్ధా దాస్, కిశోర్.. అద్భుతంగా నటించారు. తెలుగులో యాక్షన్ బేస్డ్ ఎంటర్టైనర్స్కు ‘పీఎస్వీ గరుడవేగ’ కొత్త టెంప్లేట్ అవుతుందనుకుంటున్నా. -
ధృవలో విలన్‌గా నేను చేయాల్సింది: సీనియర్ హీరో
కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సక్సెస్‌లు అంధించటంలో ఫెయిల్ అవుతున్న యాంగ్రీ హీరో రాజశేఖర్, త్వరలో గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టేశారు. అందులో భాగంగా తరువాత మీడియా ఇంటర్య్వూలతో సందడి చేస్తున్నాడు రాజశేఖర్. ఇటీవల ఓ ఇంటర్య్వూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రామ్ చరణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా ధృవ. ఈ సినిమాలో విలన్ పాత్రకు ముందుగా రాజశేఖర్‌నే తీసుకోవాలని భావించారట. అంతా ఓకే అనుకున్న సమయంలో నిర్మాత అరవింద్ స్వామితోనే ఆ పాత్ర చేయిచేందుకు నిర్ణయించామని తెలిపాడట. తమిళంలో అరవింద్ స్వామి కనిపించిన సోలో సీన్స్‌ను రీ షూట్ చేసే అవసరం ఉండదన్న కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నారని నిర్మాత తెలిపారన్నాడు రాజశేఖర్. అంతేకాదు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న బాలకృష్ణ 102 సినిమా కోసం విలన్‌గా రాజశేఖర్‌ను సంప్రదించారట. అయితే అది రొటీన్ విలన్ పాత్రే కావటంతో సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. తేజతో తాను చేయాల్సిన సినిమా ఆగిపోవటంపై కూడా రాజశేఖర్ స్పందించాడు. కేవలం క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్లే ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశామని, మంచి కథ వస్తే విలన్‌గా నటించడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. -
పీయస్వీ గరుడవేగ మేకింగ్ వీడియో
హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం' సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గుంటూరు టాకీస్ చిత్రంలో హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి స్థాయికి రావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్ అలరించనుంది. శ్రద్ధాదాస్ రియల్ లైఫ్ లోనూ జర్నలిజం స్టూడెంట్ కావడంతో మనాలి పాత్రలో ఒదిగిపోయింది. తాజా శ్రద్ధ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. -
‘రాజశేఖర్ మూవీకి అనుకోని ఆటంకం’
హైదరాబాద్: యాంగ్రి యంగ్‌మెన్ రాజశేఖర్ నూతన చిత్రం 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం'కు అనుకోని ఆటంకం ఎదురైంది. షూటింగ్ అనుమతి విషయంలో జరిగిన తప్పిదానికి పోలీసులు సినిమా ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జీవిత రాజశేఖర్ నిర్మిస్తున్న గరుడవేగ చిత్ర షూటింగ్ నారాయణగూడ ఫ్లైఓవర్ ప్రాంతంలో నడుస్తోంది. ఉదయం 7 గంటల వరకు షూటింగ్ కోసం అనుమతి తీసుకున్న యూనిట్ 9 గంటల వరకు షూటింగ్ కొనసాగించారు. నిర్ణీత సమయం దాటినా షూటింగ్ ముగించకపోవడంతో ప్రొడక్షన్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘గరుడవేగ’లో రాజశేఖర్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన పూజా కుమార్ నటిస్తోంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్, జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్ కనిపించనున్నారు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
ముందు కోలీవుడ్‌కే వస్తా!
ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది నట దంపతులు రాజశేఖర్, జీవితల వారసురాలు శివాని. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పోలికలను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాడుకుంటుండడమే మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. దానికి నేను అడిక్ట్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో. బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం. ఇక విజయ్‌సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. వైద్య విద్య మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు అని శివాని చెప్పుకొచ్చింది. -
ముందు కోలీవుడ్‌కే వస్తా!
ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది రాజశేఖర్- జీవితల వారసురాలు శివానీ. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పలుకులను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాటలు పాడటం మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. దానికి నేను అడిక్షన్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం.ఆయన చాలా మ్యాన్లీమెన్. ఇక విజయ్ సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. ఎంబీబీఎస్ మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు.’ అంటూ శివాని చెప్పిన సంగతులు ఇవీ. -
లెక్క చేయకుండా...
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ. 25 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. శివాని శివాత్మిక ఫిలింస్ సమర్పణలో ఎం. కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల 40 రోజులు యురాషియన్ దేశాల్లో జరిగింది. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘మేం షూటింగ్ చేసిన లొకేషన్లకు 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా హోటల్స్ కూడా లేవు. టీమ్ అంతా క్యాంపుల్లో బస చేసి వర్క్ చేశారు’’ అన్నారు. ‘‘స్క్రిప్ట్ డిమాండ్ మేరకు సెన్సిటివ్ ఏరియాల్లో షూటింగ్ చేశాం. వాతావరణాన్ని లెక్క చేయకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేశారు. మా స్టంట్ టీమ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 40 రోజుల్లో 33 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల. -
బాబోయ్... ఫుల్ పేజీ డైలాగ్
ఏం చేయాల్రా బాబు... అసలే తెలుగు సరిగా రాదు!! దీనికి తోడు ఫుల్ పేజీ తెలుగు డైలాగు చేతిలో పెట్టి, త్వరగా టేక్‌కి రెడీ అవ్వమని చెబుతున్నారంటూ నోరెళ్లబెట్టారు శ్రద్ధా దాస్. ఈ మేడమ్‌గారు బెంగాలీ. ఆల్మోస్ట్ పదేళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తుండడంతో తెలుగు కొంచెం కొంచెం నేర్చుకున్నారు. కానీ, ఫుల్ పేజీ డైలాగులు చెప్పేసేంత తెలుగు రాదు. పైగా, అందులో కొన్ని నోరు తిరగని డైలాగులు ఉన్నాయట. దాంతో కొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేసి, టేక్ ఫినిష్ చేశారట! రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మిస్తున్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎమ్’. ఇందులో శ్రద్ధాదాస్ జర్నలిస్ట్ కమ్ న్యూస్ రీడర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆమెపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ నోట్ చేసుకోవలసిన పాయింట్ ఏంటంటే... రియల్ లైఫ్‌లో కూడా శ్రద్ధాదాస్ జర్నలిస్టే. హీరోయిన్ కాకముందు జర్నలిజమ్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారు. -
హీరోయిన్గా మరో వారసురాలు..
సినీరంగానికి మరో నట వారసురాలు సిద్ధం అవుతోంది. హీరో రాజశేఖర్, జీవిత దంపతుల వారసురాలు శివానిని నాయకిగా తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత ఇద్దరు కూతుళ్లలో శివాని పెద్దది. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్గా చేయమని అడిగినా ఇప్పడే కాదు చదువు పూర్తి చేయాలంటూ వాయిదా వేస్తూ వచ్చారు ఆమె తల్లిదండ్రులు. తాజాగా రాజశేఖర్, జీవిత తమ వారసురాలిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇటీవల శివానిని వివిధ గెటప్‌లలో ఫొటో సెషన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రాజశేఖరే స్వయంగా ఆమె కోసం కథలు వింటున్నారట. మొత్తం మీద శివాని సినీ తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోందన్నమాట. అయితే ఈ అమ్మడు తొలి చిత్రం తెలుగు అవుతుందా? తమిళం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అదే విధంగా నట వారసురాళ్లు తెరంగేట్రం సులభమే. ఆ తరువాత నిలదొక్కుకోవడం అన్నది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. మరి శివాని అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
మరో సినీ వారసురాలు రెడీ!
చెన్నై: సినీ రంగానికి మరో నట వారసురాలు పరిచయం కానుంది. కోలీవుడ్‌లో నటుడిగా పరిచయం అయినా టాలీవుడ్లో రాణిస్తున్నారు సీనియర్ నటుడు రాజశేఖర్. నటి జీవిత, రాజశేఖర్ దంపతుల వారసురాలిగా శివానిని తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా శివాని పెద్దమ్మాయి. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినా 'ఇప్పడే కాదు.. అమ్మాయి చదువు పూర్తి కానీయండి' అంటూ బదులిచ్చేవారు ఈ దంపతులు. అయితే తాజాగా రాజశేఖర్, జీవితలు తమ వారసురాలిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల శివానితో ఫొటో సెషన్ చేపించారని.. అంతేకాదు ఆమె తండ్రి, సీనియర్ హీరో రాజశేఖర్ స్వయంగా కథలు వింటున్నారట. అంతా కుదిరితే త్వరలోనే మరో సినీ వారసురాలిని తెరపై చూడవచ్చనని అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. కాగా, శివాని ఫస్ట్ మూవీ తెలుగులోనా? లేక తమిళంలోనా? అన్న దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని శివాని మరో మెట్టు ఎక్కిస్తుందా.. లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
తెరంగేట్రానికి సిద్ధం..!
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ హీరో రాజశేఖర్, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం దక్కటం లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని.. త్వరలో గరడువేగ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తాను హీరోగా ఉండగానే తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నాడు రాజశేఖర్. ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు శివానిని ఇంట్రడ్య్సూ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రంపై వార్తలు వినిపిస్తున్నాయి. జీవితా రాజశేఖర్‌లు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని కన్ఫామ్ చేసినా.. అది ఎప్పుడన్నది చెప్పలేదు. అయితే ఇటీవల శివానితో చేయించిన ఓ ఫోటో షూట్ ఆమె మూవీ ఎంట్రీపై చర్చకు కారణమైంది. గ్లామరస్ లుక్‌లో హీరోయిన్‌కు కావాల్సిన అన్ని ఫిచర్స్‌తో అదరగొడుతుంది శివాని. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలను చూసి టాలీవుడ్ ప్రియాంక చోప్రా అంటున్నారు సినీ జనాలు. లుక్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్న శివానీ నటిగానూ ఆకట్టుకుంటే స్టార్ స్టేటస్ అందుకోవటం పెద్ద కష్టమేమీకాదు. -
అంత ఖర్చుపెడుతున్నారా?
కథ మీద నమ్మకమో లేదా డైరెక్టర్ టాలెంట్ మీద నమ్మకమో లేదా హీరో రాజశేఖర్ పోలీస్‌గా నటిస్తే హిట్టనే నమ్మకమో... ‘íపీఎస్వీ గరుడ వేగ 125.18’కి 25 కోట్లు ఖర్చుపెడుతున్నారట. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వర్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘కథకు తగ్గట్టుగా ఖర్చు పెడితేనే సినిమా బాగా వస్తుంది. అందుకే 25 కోట్లతో సినిమా తీస్తున్నాం. 60 శాతం షూటింగ్ పూర్తి అయింది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరించాం. సన్నీ లియోన్ ఐటెమ్ సాంగ్ బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల. సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శివాని శివాత్మిక ఫిలింస్. -
కోలివుడ్ కాలింగ్
యాంగ్రీ మేన్ రాజశేఖర్ దాదాపు 32 ఏళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కెరీర్ ప్రారంభంలో 1984లో ‘పుదుమై పెన్’, 1985లో ‘పుదియ తీర్పు’ వంటి తమిళ చిత్రాల్లో నటించారాయన. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పిఎస్వి గరుడ వేగ 125.18’ చిత్రంలో తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాక ముందే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ చిత్రంలో నటించడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వెంకట్ ప్రభు ఇప్పటికే రాజశేఖర్‌కు కథ వినిపించగా, ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని భోగట్టా. -
చిన్నది చిందేస్తే... కిక్కే కిక్కు!
సీసాలో ఉంది కల్లు... తాగకుండానే తూలుతోంది (జనాల) ఒళ్లు... తుళ్లిపడిన తుంటరోళ్ల చిందులు... కల్లు కాంపౌండ్ ఏరియాలో కొత్త కళ కనిపిస్తోంది. మేటర్ ఏంటి చెప్మా? అని చుట్టూరా కన్నేశాడు ఓ పోలీసోడు! చందమామ లాంటి చిన్నది చిందులేస్తోంది. ఎవరీ పోరీ? అని కళ్లు పెద్దవి చేసుకుని లుక్కేశాడు. ఆ చిన్నది ఎవరో కాదు... సన్నీ లియోన్. చందమామలా తెల్లటి చీర కట్టుకుని సన్నీ చిందేస్తుంటే... చేతిలో కల్లు సీసా ఖాళీ చేయకుండానే జనాలకు కిక్ ఎక్కేస్తోందక్కడ.పోలీసోడికి కావాల్సిందీ అదే. జనాల చూపు సన్నీపై ఉంటే... కామ్‌గా పని చేసుకోవచ్చనేది పోలీసోడి ప్లాన్. అదేంటో జనాలు తెలుసుకోవాలంటే ఇంకో నెల వెయిట్ చేయక తప్పదు. రాజశేఖర్ పోలీసాఫీసర్‌గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో కోటేశ్వరరాజు నిర్మిస్తున్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’. ఇందులో సన్నీ లియోన్ చేస్తున్న స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. ఇంకో వారం రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. బ్యాలెన్స్ షూటింగ్, డబ్బింగ్, అన్నీ కంప్లీట్ చేసి ఈ సమ్మర్లోనే సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్. శ్రీచరణ్ సంగీతం అందిస్తున్నారు. -
జూలైలో ఒకే!
► ఎస్ఈసీ స్పష్టీకరణ ► ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం ► కోర్టులో పిటిషన్ సాక్షి, చెన్నై : జూలై నెలాఖరులోపు ఎన్నికల్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టామని, శరవేగంగా సాగుతున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి రాజశేఖర్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సాగుతున్న జాప్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యవహారం కోర్టులో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగా నికి ముచ్చెమటలు తప్పడం లేదు. మే 14లోపు ఎన్నికల్ని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడం కష్టతరంగా మారడంతో కోర్టు ధిక్కారానికి గురి కావాల్సిన పరిస్థితి ఎస్ఈసీకి ఏర్పడింది. ఎన్నికల అధికారి పదవీ కాలం ముగిసినా, ఆ స్థానం భర్తీలో జాప్యం, ఎన్నికల పనుల్లో జాప్యం వెరసి ఎస్ఈసీపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని డీఎంకే తరçఫున గత వారం పిటిషన్ సైతం దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ ఈనెల 18వ తేదీ రానుంది. ఎక్కడ కోర్టు ధిక్కారానికిగురి కావాల్సి వస్తుందోనన్న ఆందోళనతో ఆగమేఘాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ కమిషనర్‌గా మాలిక్ ఫిరోజ్ ఖాన్‌ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల నిర్వహణకు తగ్గ పనుల్ని వేగవంతం చేయించారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు మే 14లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని తేల్చారు. ఈ విషయాన్ని కోర్టుకు వివరిస్తూ మరింత సమయాన్ని కోరేందుకు నిర్ణయించి కొత్త పిటిషన్ దాఖలు చేశారు. అందులో జులై నెలాఖరులోపు ఎన్నికలను పూర్తి చేయడానికి సిద్ధం అని స్పష్టం చేయడం విశేషం. ఎస్ఈసీ కార్యదర్శి రాజశేఖర్ తరఫున ఈ పిటిషన్ ఉదయం మద్రాసు హైకోర్టులో దాఖలు అయింది. అందులో ఎన్నికల నిర్వహణకు తగ్గ పనులకు శ్రీకారం ఎప్పడోచుట్టామని, పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. అయితే, మే14 లోపు అన్నది కష్టతరంగా ఉందని, అందుకే మరో రెండున్నర నెలల గడువు కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. జులై నెలాఖరులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు రానుంది. అయితే, కోర్టు గడువు పొడిగించేనా అన్నది వేచిచూడాల్సిందే. ఇందుకు కారణంగా, ఇప్పటికే ఎన్నికల యంత్రాంగానికి పలు మార్లు సమయాన్ని కోర్టు పొడిగించినా, వాయిదాల పర్వంతో ఎస్ఈసీ ముందుకు సాగడం గమనార్హం. కాగా, నేరచరిత్ర కల్గిన వారు ఎన్నికల్లో నిలబడకుండా నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగింది. వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారులకు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది. కాగా, అదే రోజు డీఎంకే దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసు విచారణకు రానుంది.