నాగిరెడ్డిపేట,న్యూస్‌లైన్ : నాగిరెడ్డిపేట మండలక ేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కొన్ని రోజులుగా రూ 500, రూ 1000 నకిలీనోట్లు జోరుగా చలామణి అవుతున్నాయి. రైతులు, అమాయకులను టార్గెట్ చేసుకొని దుండగులు దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. ఇటీవల రైతులు పండించిన ధాన్యం చేతికి రావడంతో వారు వ్యాపారులకు విక్రయించారు. కాగా ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులలో కోన్ని నకిలీనోట్లు రైతుల చేతికి వస్తున్నాయి. కాగా నకిలీనోట్లను గుర్తించని రైతులు సాధారణంగా వివిధ వస్తువుల కొనుగోలు కిరాణా దుకాణాలకు, ఇతర షాపులకు వెళ్తున్నారు.
దుకాణాల్లోని వ్యాపారులు రైతులు, అమాయకులు తెచ్చిన నోట్లను పూర్తిస్థాయిలో పరిక్షించాకే వాటిని తీసుకుంటున్నారు. నోట్లపై ఏమాత్రం అనుమానం కలిగినా వాటిని దుకాణదారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తెలియక నకిలీనోట్లు వచ్చినవారు నోరెల్ల బెడుతున్నారు. పోలీసులకు తెలిస్తే ఏం జరుగుతుందోనని కొందరు బయపడి గుట్టుచప్పుడు కాకుండా వాటిని కాల్చివేయడం లేదా చింపేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాగా ఇటీవల పక్కనే ఉన్న లింగంపేట మండలంలో పెద్దమొత్తంలో నకిలీనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. దీంతో మండలంలోనూ నకిలీనోట్లు కొంతకాలంగా జోరుగా చలామణి అవుతున్నాయి. నోటులోని ఆకుపచ్చ, తెలుపురంగులో ఉండే త్రెడ్‌పై ఉండే ఆర్‌బీఐ అనే అక్షరాలలోని తేడాను బట్టి నకిలీ, ఒరిజినల్ నోట్లను గుర్తిస్తున్నారు. ఏదిఏమైనా అమాయకులను, రైతులను టార్గెట్ చేసుకొని నకిలీనోట్లను చలామణి చేస్తున్నవారి ఆట కట్టించాలని వారు పోలీసులను కొరుతున్నారు.
జోరుగా నకిలీ నోట్ల చలామణి
Published Sun, Dec 1 2013 4:38 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement