బొత్స ఆరోగ్యంపై కేర్ వైద్యుల బులెటిన్ విడుదల
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోగ్యంపై కేర్ ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తలనొప్పి, హై బీపీ సమస్యలతో ఆయన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండె, నరాల వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు కేర్ ఆసుపత్రిలో బొత్సను పరామర్శించారు. బొత్స ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పారు.