ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తున్న తిలక్
శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉండి, అరెస్టు వారెం ట్లు కూడా జారీ అయిన శాసనసభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడిని తక్షణం అరెస్టు చేయాలని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ కలెక్టర్ జె.నివాస్‌ను, ఎస్పీ అమ్మిరెడ్డిని సోమవారం స్పందనలో కలిసి వినతిపత్రాలు సమర్పిం చారు. నేర చరిత్ర కలిగిన అచ్చెన్నాయుడిపై ఎన్నో కేసులు, అరెస్టు వారెంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను ఎదిరించి, బెదిరించి కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో దళిత కులానికి చెందిన కొమర కళ్యాణి అనే మహిళా ఉద్యోగి ని బూటుకాలుతో తన్నినా చర్యలు తీసుకోలేదని తెలిపారు.
ఓబులాపురం మైనింగ్ వద్ద 144వ సెక్షన్ అమలులో ఉండగా తన అనుచరులతో దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి వెళ్లి ఆస్తులను ధ్వంసం చేశారని, అడ్డు వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని, దీనిపై కూడా కేసు ఉందన్నారు. ఇదే కేసులో 21వ నిందితుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కోర్టుకు హాజ రుకాకపోవడంతో రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసిందన్నారు. ఈ నెల 11న ఉండవల్లిలో విక్రాంత్ పాటిల్ అనే పోలీసు ఉన్నతాధికారిపై ‘యూజ్‌లెస్ ఫెలో’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 353, 506 (2), 188ల కింద కేసు నమోదైందన్నారు. ఇన్ని అరాచకాలకు పాల్పడిన అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి ప్రజాసామ్యాన్ని కాపాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment