'ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మత్తులో సర్కార్'
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శుక్రవారం నారాయణ హైదరాబాద్లో మాట్లాడుతూ... ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మత్తులో ఈ సర్కార్ జోగుతుందని ఎద్దేవా చేశారు.
45 మంది ప్రాణాలు సజీవ దహనమైన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన వోల్వో బస్సు ప్రమాదం జరిగి 45 మంది అసువులు బాసారు.
బస్సు ప్రమాదంపై అప్పట్లో గొప్పగా స్పందించిన ప్రభుత్వం. లక్ష రూపాయలు నష్టపరిహారం ప్రకటించి....అనంతరం బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. దాంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. అయినా ప్రభుత్వం తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేయటం గమనార్హం.