హక్కుల కోసమే తెలంగాణ పోరాటం
Published Thu, Oct 3 2013 4:19 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్:సీమాంధ్ర అవకాశవాదులు దోపీడీ, అధిపత్యపు ముసుగు వేసి సమైక్యవాదాన్ని రెచ్చగొడుతున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హక్కుల కోసం చేసే పోరాటాన్ని ఎ ట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు వదులుకోరని, సీమాంధ్రలో చేస్తున్న కృత్రిమ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేదని ఆయ న స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రదాత, పద్మవిభూషణ్ కవి కాళోజీ నారాయణరావు శతజయంతి సదస్సును బుధవారం జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో నిర్వహిం చారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలకుల చేతిలో జరిగిన తెలంగాణ దోపిడీని మహాకవి కాళోజీ నిలదీశారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన జరిగితే నీళ్లు, ఉద్యోగా లు రావని సీఎం దుష్ర్పచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను వదిలితే తమకు బతుకులేదంటున్న పా లకులు ఇంతవరకు ఈ ప్రాంతంలో తాము దోచుకున్నది వాస్తవమేనన్న విషయాన్ని స్వయంగా ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. శ్రీకృష్ణకమిటీ లెక్కల ప్రకారమే హైదరాబాద్‌కు వల సొచ్చిన వారిలో 50శాతం మంది తాపీమేస్త్రీలు, కూలీపనివారు ఉన్నారని, 25శాతం మంది వ్యాపారులు, 15శాతం చదువుకోవడానికి వచ్చిన వారు ఉన్నారని వివరించారు.
కాళోజీ ఆశయసాధనకు కృషి
కోదండరామ్ కాళోజీతో తనకున్న అనుబంధం, తెలంగాణ పట్ల పాలకులు చూపుతున్న వివక్షను గురించి ఆయన పడిన మనోవేదన గురించి సోదాహరణంగా వివరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడిన తొలిఆధునిక కవియని కీర్తించారు. సాంప్రదాయ సమాజంలో పుట్టిన కాళోజీలో ఆధునిక భావాలు, ఆలోచనలు ఎలా వచ్చేయోనని ఎంతోమంది సామాజిక వే త్తలు తర్కించుకునే వారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పా టు ఖాయమని, ప్రత్యేక రాష్ట్రంలో కాళోజీ ఆశయసాధనకు కృ షి చేస్తామన్నారు. రెండున్నర కులాలు, రెండున్నర జిల్లాల నే తల ఆధిపత్యాన్ని ఆయన తన కవితలు, ప్రసంగాల ద్వారా ప్ర శ్నించే వారని గుర్తుచేశారు.
సంక్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు: శ్రీనివాస్‌గౌడ్‌రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినందుకు సంబరాలు జరుపుకోవా లో లేక 60 రోజులుగా ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగనందుకు సమరం చేయాలో తెలియని సంక్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. న్యాయం, ధర్మం కోసం పరితపించిన కాళోజీ ఆశయాలను నెరవేరుస్తామని ప్రతినబూనారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు జలజం సత్యనారాయణ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు జూలురు గౌరీశంకర్ ‘ధ్వని’ ప్ర త్యేక సంచికను ఆవిష్కరించారు. సదస్సులో టీపీఆర్‌టీయూ, టీఆర్‌టీయూ రాష్ట్ర నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నరాములు, వివిధ సంఘాల నాయకులు వీరబ్రహ్మచారి, సంజీవ్ ముది రాజ్, కాళప్ప, శతజయంతి జిల్లా కన్వీనర్ కోట్ల వెంకటేశ్వర్‌రె డ్డి, కోకన్వీనర్ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్, బోల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement