అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో ఓ నివాసం దాడి చేసి ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 87 వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కదిరి పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు.