కేసుల పరిష్కారంలో నాలుగో స్థానం | district fourth place in the cases solving | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారంలో నాలుగో స్థానం

Published Sun, Feb 16 2014 2:34 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

district fourth place in the cases solving

ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ :  న్యాయపరమైన  కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో ఉందని హైకోర్టు న్యాయమూర్తి జి.చంద్రయ్య అన్నారు. శనివారం పట్టణంలో నూతనంగా మంజూరైన మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, అదనపు జూనియర్ సివిల్ కోర్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవ్యవస్థ సక్రమంగా పని చేసినప్పుడే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంలో జాప్యమవుతోం దనే అపవాదు  ప్రజల్లో ఉందని, న్యాయవాదులు, పోలీ సులు, కక్షిదారులు చేదోడువాదోడుగా ఉంటేనే కేసులు సత్వరం పరిష్కారమవుతాయని చెప్పారు.

విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్య మనిషికి, జంతువులకు వ్యత్యాసాన్ని తెలుపుతుందని, విచక్షణ, ఆలోచనా శక్తి, మానసిక వికాసాన్ని పెంచుతుందని, ఐక్యత, ప్రేమ, గౌరవం కలుగజేస్తుందని తెలిపారు. హైకోర్టు పోర్టు పోలియో న్యాయమూర్తి నవీన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో  న్యాయసేవలు అందించేందుకు  కొత్త కోర్టులు ఏర్పాటయ్యాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడారు. కాగా, ప్రారంభోత్సవానికి హాజ రైన చంద్రయ్యకు అచ్చులాపూర్‌కు చెందిన వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కొత్త కోర్టులో సర్వమత ప్రార్థనలు చేశారు. స్థానిక ఏపీటీడబ్ల్యూ గిరిజన బాలికల పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 బెల్లంపల్లిలో..
 బెల్లంపల్లి : పట్టణంలోని సింగరేణి బి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టును జిల్లా పోర్టుపోలియో న్యాయమూర్తి పి.నవీన్‌రావు శనివారం ప్రారంభించారు. అనంతరం బెల్లంపల్లి జూనియర్ సివి ల్ జడ్జి జితేందర్ కోర్టు కార్యకలాపాలు నిర్వహించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జి.చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు నవీన్‌రావు, చం ద్రయ్యలను బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించా రు. మెమొంటోలు అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా మూడో మొదటి అదనపు న్యాయమూర్తి కుంచాల సునీత, సీనియర్ సివిల్ జిడ్జి సుదర్శన్, ప్రిన్సిపల్ జూని యర్‌సివిల్ జడ్జి కె.బాలచందర్, జిల్లాలోని జూనియర్ సివిల్ జడ్జిలు ఎ.జయరాజ్, గోవిందలక్ష్మి, ఎండీ.యూసుఫ్, కన్నయ్య లాల్, పంచాక్షరి, ఉదయకుమార్, జయరాంరెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏఎంసీ చైర్మన్ మునీర్ అహ్మద్, సర్పంచ్ కోవ లక్ష్మి, టీడీపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.లక్ష్మణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నికోడె రవీం దర్, సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది ఆర్.రాజేశ్‌నేత, విజయవాడ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ బి.వెంకటేశ్‌నేత, మాజీ ఎమ్మెల్యేలు ఎ.శ్రీదేవి, పి.సుభద్ర, బెల్లంపల్లి ఏరి యా సింగరేణి జీఎం జె.నాగయ్య, మంచిర్యాల ఆర్డీవో చక్రధర్‌రావు, అడిషనల్ ఎస్పీ భాస్కర్‌భూషణ్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు టి.గోపికిషన్‌సింగ్, అధ్యక్షుడు ఎల్.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.సురేశ్, మంచిర్యాల, ఆసిఫాబాద్ బార్ అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement