పాతగుంటూరు(గుంటూరు): విద్యుత్ షాక్‌కు గురై యువకుడు దుర్మరణం చెందగా, మరొకరు గాయాలపాల య్యారు. గుంటూరులోని లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభ కార్యక్రమంలో ఈ విషాదం నెలకొంది. శనివారం సాయం త్రం 6.30 గంటలకు షోరూమ్ ప్రారంభ సమయం కావడంతో నిర్వాహకుల ఒత్తిడి మేరకు ఫ్లెక్సీల ఏర్పాటులో జరిగిన తొందరపాటు కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
షోరూం ఆవరణలోని 12 అడుగుల ఐరన్ ఫ్లెక్సీని ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించే క్రమంలో ఆ ఫ్లెక్సీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో మంటలు చెలరేగి షోరూంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పిడుగురాళ్లకు చెందిన చిలుకల విజయ్(18) దుర్మరణం చెందాడు. అదే షోరూంలో అసిస్టెంట్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న షేక్ జాన్‌సైదా(22)కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షాపింగ్మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి
Published Sun, Feb 26 2017 2:45 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement