న్యూజెండ్ల: గుంటూరు జిల్లాలో సోమవారం కరెంటు షాక్తో ఓ కూలీ మృతిచెందాడు. న్యూజెండ్ల మండలం పమిడిపాడులో రేషన్ షాపు వద్ద లారీలో నుంచి రేషన్ సరుకులను దించుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తగలడంతో కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.