విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Wed, Sep 11 2013 3:18 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
డీసీతండా(వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : విద్యుదాఘాతంతో ఓ గిరిజన రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని డీసీతండాలో సోమవారం జరిగింది. వర్ధన్నపేట ఎస్సై విశ్వేశ్వర్ కథనం ప్రకారం... డీసీతండాకు చెందిన ఆంగోతు నాని(54) వ్యవసాయంతోపాటు మేకలను పెంచు తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేకల మేత కోసం చెట్టుకొమ్మలు నరికి వేస్తుండగా చెట్టుకు ఆనుకుని ఉన్న త్రీఫేజ్ విద్యుత్ వైరు అతడి చేతికి తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన నాని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే బాధితుడిని ఆటోలో వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య భాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్
నాని మృతదేహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ముత్తిరెడ్డి కేశవరెడ్డి, కొండేటి మహేందర్, మార్త సారంగపాణి, కొండేటి సత్యం ఉన్నారు.
Advertisement
Advertisement