వెంకన్న వచ్చేశారు | Garden statues come from Tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న వచ్చేశారు

Published Mon, Jul 21 2014 2:41 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

వెంకన్న వచ్చేశారు - Sakshi

వెంకన్న వచ్చేశారు

  •     వైభవోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తి
  •      తిరుమల నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలు
  • విశాఖపట్నం : విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నాయి. ఇందులో సుమారు 13 అడుగుల వెంకన్న విగ్రహం ఉండడం విశేషం. ఇప్పటికే 35 మంది అర్చకులు చేరుకున్నారు. ఈ వేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. సౌండింగ్ సిస్టం, కెమెరాలు సిద్ధం చేస్తున్నారు.

    కూపన్ల పంపిణీ పూర్తి
     
    స్వామికి చేపట్టే సేవల్లో పాల్గొనదలచిన భక్తులకు అందించే కూపన్ల పంపిణీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో పూర్తయింది. మొత్తం 10,800 కూపన్లను భక్తులకు అందజేశారు. ఇదిలావుండగా టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు, టీటీడీ ఎస్‌ఈ రాములతో త్రీటౌన్ సీఐ అప్పలరాజు ఆదివారం ఇక్కడ చర్చించారు. ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. వేడుకలు జరిగినన్నాళ్లూ ఇద్దరు సీఐల పర్యవేక్షణలో ఆరుగురు ఎస్‌ఐలు, 45 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని సీఐ తెలిపారు.
     
    నేడు, రేపు చాగంటి ప్రవచనాలు

    వైభవోత్సవాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి స్వామివారి సేవలు ప్రారంభం కానున్నాయి.
     
    విశాఖపట్నం : విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నాయి. ఇందులో సుమారు 13 అడుగుల వెంకన్న విగ్రహం ఉండడం విశేషం. ఇప్పటికే 35 మంది అర్చకులు చేరుకున్నారు. ఈ వేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. సౌండింగ్ సిస్టం, కెమెరాలు సిద్ధం చేస్తున్నారు.

    కూపన్ల పంపిణీ పూర్తి
     
    స్వామికి చేపట్టే సేవల్లో పాల్గొనదలచిన భక్తులకు అందించే కూపన్ల పంపిణీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో పూర్తయింది. మొత్తం 10,800 కూపన్లను భక్తులకు అందజేశారు. ఇదిలావుండగా టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు, టీటీడీ ఎస్‌ఈ రాములతో త్రీటౌన్ సీఐ అప్పలరాజు ఆదివారం ఇక్కడ చర్చించారు. ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. వేడుకలు జరిగినన్నాళ్లూ ఇద్దరు సీఐల పర్యవేక్షణలో ఆరుగురు ఎస్‌ఐలు, 45 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని సీఐ తెలిపారు.
     
    నేడు, రేపు చాగంటి ప్రవచనాలు

    వైభవోత్సవాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి స్వామివారి సేవలు ప్రారంభం కానున్నాయి.
     
    బుల్లయ్య కళాశాలలో పార్కింగ్

    వైభవోత్సవాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను బుల్లయ్య కళాశాల గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలని నిర్వాహకులు సూచించారు. స్పెన్సర్స్ ఎదురుగా ఉన్న మొదటి గేటు వద్ద ఉచిత చెప్పుల స్టాండ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement